పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : ప్రహ్లా దాగమనము

  •  
  •  
  •  

8-651-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు సమాగతుండైన తమ తాతం గనుఁగొని విరోచన నందనుండు వారుణపాశబద్ధుండుఁ గావునఁ దనకుం దగిన నమస్కారంబు జేయ రామింజేసి సంకులాశ్రువిలోల లోచనుండై సిగ్గుపడి నత శిరస్కుండై నమ్రభావంబున మ్రొక్కు చెల్లించె; నంతఁ బ్రహ్లాదుఁడు ముఖమండపంబున సునందాది పరిచర సమేతుండై కూర్చున్న వామనదేవునిం గని యానంద బాష్పజలంబులుఁ బులకాంకురంబులున్ నెఱయ దండప్రణామం బాచరించి యిట్లని విన్నవించె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; సమాగతుండు = వచ్చినట్టివాడు; ఐన = అయిన; తమ = వారి యొక్క; తాతన్ = తాతను; కనుగొని = చూసి; విరోచననందనుండు = బలిచక్రవర్తి; వారుణపాశ = వరుణపాశములతో; బద్ధుండు = కట్టబడినవాడు; కావునన్ = కనుక; తన = అతని; కున్ = కి; తగిన = తగినట్టి; నమస్కారంబు = నమస్కారములు; చేయరామిన్ = చేయలేకపోవుట; చేసి = వలన; సంకుల = పొర్లిపోవుతున్న; అశ్రు = కన్నీళ్లతో; విలోల = చలించిన; లోచనుండు = కన్నులు కలవాడు; ఐ = అయ్యి; సిగ్గుపడి = లజ్జితుడై; నత = వంచిన; శిరస్కుండు = తల కలవాడు; ఐ = అయ్యి; నమ్ర = నమ్రతగల; భావంబునన్ = విధముగా; మ్రొక్కుచెల్లించెన్ = నమస్కరించెను; అంతన్ = అంతట; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; ముఖమండపంబున = మొగసాల; సునంద = సునందుడు; ఆది = మున్నగు; పరిచర = పరిచరులతో; సమేతుండు = కలిసియున్నవాడు; ఐ = అయ్యి; కూర్చున్న = కూర్చొని యున్న; వామనదేవునిన్ = వామనావతారుని; కని = చూసి; ఆనంద = సంతోషపు; బాష్పజలంబులు = కన్నీళ్ళు; పులకాంకురంబులున్ = పులకింతలు; నెఱయన్ = వ్యాపించగా; దండప్రణామంబు = సాష్టాంగనమస్కారములు; ఆచరించి = చేసి; ఇట్లు = ఇలా; అని = అని; విన్నవించె = మనవిచేసెను.

భావము:

బలి చక్రవర్తి తన తాత రాక గమనించినా, వరుణపాశాలతో కట్టివేయబడి ఉన్నందు వలన, అతడు ప్రహ్లాదుడికి నమస్కారం చేయడానికి వీలుకాలేదు. బలిచక్రవర్తి కన్నులలో కన్నీళ్ళు పొంగాయి; అతడు సిగ్గుతో తలవంచుకున్నాడు; వినయంగా తలవంచి తాతకు మ్రొక్కు చెల్లించాడు. అప్పుడు, ప్రహ్లాదుడు మొగసాలలో సునందుడూ మొదలైన వారితో కూర్చుని యున్న వామనదేవుని చూసాడు; సంతోషంతో అతని కన్నులు చెమ్మగిల్లాయి; ఒడలు పులకరించింది; అతడు స్వామికి సాగిలబడి నమస్కరించి ఇలా మనవి చేసాడు.

8-652-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తనికి మున్ను నీ వింద్రపదం బిచ్చి-
నేఁడు త్రిప్పుటయును నెఱయమేలు
మోహనా హంకృతి మూలంబు గర్వాంధ-
మస వికారంబు దాని మాన్పి
రుణ రక్షించుటఁగాక బంధించుటే?-
త్త్వజ్ఞునకు మహేంద్రత్వమేల?
నీ పాదకమలంబు నియతిఁ గొల్చిన దాని-
బోలునే సురరాజ్య భోగపరత?

8-652.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర్వ మేపారఁ గన్నులు గానరావు;
చెవులు వినరావు; చిత్తంబు చిక్కుపడును;
ఱచు నీ సేవలన్నియు హిమ మాన్పి
మేలు చేసితి నీ మేటి మేర చూపి."

టీకా:

ఇతను = ఇతను; కిన్ = కి; మున్ను = ఇంతకుముందు; నీవు = నీవు; ఇంద్ర = ఇంద్రుని; పదంబు = పదవిని; ఇచ్చి = ఇచ్చి; నేడు = ఇవాళ; త్రిప్పుటయును = తొలగించుట; నెఱయ = చాలా; మేలు = మంచిది; మోహన = అజ్ఞానమునకు; అహంకృతి = అహంకారమునకు; మూలంబు = కారణమైనది; గర్వ = గర్వము యనెడి; అంధతమస = కారుచీకటి; వికారంబు = కలిగించెడిది; దానిన్ = అట్టిదానిని; మాన్పి = పోగొట్టి; కరుణన్ = దయతో; రక్షించుట = కాపాడుట; కాక = తప్పించి; బంధించుటే = శిక్షించుటా కాదు; తత్త్వజ్ఞున్ = బ్రహ్మజ్ఞానికి; మహేంద్రత్వము = ఇంద్రపదవి; ఏల = ఎందుకు; నీ = నీ యొక్క; పాద = పాదములు యనెడి; కమలంబున్ = పద్మములను; నియతిన్ = నిష్ఠగా; కొల్చినన్ = సేవించినచో; దానిన్ = దానికి; పోలునే = సాటివచ్చునా రాదు; సురరాజ్య = ఇంద్రత్వమును; భోగపరత = అనుభవించుట.
గర్వమున్ = గర్వము; ఏపారన్ = పెరుగుటవలన; కన్నులు = కళ్ళు; కానరావు = కనిపించవు; చెవులు = చెవులు; వినరావు = వినపించవు; చిత్తంబు = మనసు; చిక్కుపడును = సంకటపడును; మఱచున్ = మరచిపోవును; నీ = నిన్ను; సేవలు = సేవించుటలు; అన్నియున్ = అన్నిటిని; మహిమన్ = నీ మహిమతో; మాన్పి = పోగొట్టి; మేలు = మంచిపని; చేసితి = చేసితివి; నీ = నీ యొక్క; మేటి = అధిక్యము యొక్క; మేర = ఎల్ల; చూపి = చూపించి.

భావము:

“స్వామీ నీవు వీనికి మొదట ఇంద్రపదవి ఇచ్చావు. మరల దానిని ఈనాడు తొలగించడంతో చాలా మేలు అయింది. ఆ పదవి అజ్ఞానానికి అహంకారానికీ మూలకారణం అయి ఉన్నది; గర్వం అనే కారుచీకటిని కలిగించేది; అట్టి దానిని దయతో పోగొట్టుట రక్షించడమే; అంతేకాని ఈ బంధనం శిక్షించడం కాదు; పరమాత్ముని తెలుసుకున్నవానికి ఇంద్రపదవి ఎందుకూ కొరగానిది; అది నీపాద సేవకు సాటిరాదు; ఇంద్రపదవిలో గర్వం పెరిగి కన్నులు కనిపించవు; చెవులు వినిపించవు; మనస్సుకు మైకం కమ్ముతుంది; నిన్ను మరచిపోతాడు. అటువంటి పదవిని విడిపించి వీనికి గొప్ప ఉపకారమే చేసావు.”.

8-653-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని పలికి జగదీశ్వరుండును నిఖిలలోక సాక్షియు నగు నారాయణ దేవునకు నమస్కరించి, ప్రహ్లాదుండు పలుకుచున్న సమయంబున.

టీకా:

అని = అని; పలికి = పలికి; జగత్ = లోకములకు; అధీశ్వరుండును = ప్రభువు; నిఖిల = సమస్తమైన; లోక = లోకములకు; సాక్షియున్ = దర్శనుండు; అగు = అయిన; నారాయణ = విష్ణువు యనెడి; దేవున్ = దేవుని; కున్ = కి; నమస్కరించి = నమస్కారముచేసి; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; పలుకుచున్న = పలుకుతున్నట్టి; సమయంబునన్ = సమయమునందు;

భావము:

లోకనాథుడూ లోకదర్శకుడూ అయిన విష్ణుదేవునకు ప్రహ్లాదుడు నమస్కరించి అలా పలుకుతున్న సమయములో.

8-654-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మత్తద్విపయాన యై కుచ నిరుంచ్ఛోళ సంవ్యానయై
ధృ భాష్పాంబు వితాన యై కరయుగాధీ నాలికస్థానయై
తిభిక్షాం మమ దేహి కోమలమతే! ద్మాపతే!” యంచుఁ ద
త్సతి వింధ్యావళి చేరవచ్చెఁ ద్రిజగద్రక్షామనున్ వామనున్.

టీకా:

తత్ = ఆ; మత్త = మదించిన; ద్విప = గజమువంటి; యాన = గమనము గలయామె; ఐ = అయ్యి; కుచ = వక్షస్థలమును; నిరుంధత్ = గట్టిగా; చోళ = పైటచెరగు; సంవ్యాన = చుట్టకొన్నామె; ఐ = అయ్యి; ధృత = కారిన; భాష్పాంబు = కన్నీటి; వితాన = సమూహములు కలామె; ఐ = అయ్యి; కర = చేతులు; యుగా = రెండును; అధీన = ఆయత్తము చేసిన; అలికస్థాన = నుదుటిప్రదేశము కలామె; ఐ = అయ్యి; పతి = భర్త అను; భిక్షాన్ = భిక్షను; మమ = నాకు; దేహి = పెట్టుము; కోమలమతే = మృదువైన మనసు కలవాడ; పద్మాపతే = లక్ష్మీపతీ; అంచున్ = అనుచు; తత్ = ఆ; సతి = ఇల్లాలు; వింధ్యావళి = వింధ్యావళి; చేరన్ = దగ్గరకు; వచ్చెన్ = వచ్చెను; త్రిజగత్ = ముల్లోకములను; రక్ష = కాపాడుట; ఆమనున్ = సమృద్ధిగా కలవానిని; వామనున్ = వామనుని.

భావము:

ఆసమయంలో బలిచక్రవర్తి భార్య వింధ్యావళి కన్నీరు కారుస్తూ మందగమనంతో అచ్చటికి వచ్చింది. ఆమె వక్షస్థలం నిండా గట్టిగా పైట చెరగు బిగించుకుని ఉంది. రెండుచేతులనూ నుదిటిపై జోడించి “దయామయా! లక్ష్మీపతీ! నాకు పతిభిక్షపెట్టు” అంటూ ముల్లోకాలకూ ప్రభువైన వామనమూర్తిని వేడుకున్నది.

8-655-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వచ్చి యచ్చేడియ తచ్చరణ సమీపంబునం బ్రణతయై నిలువంబడి యిట్లనియె.

టీకా:

వచ్చి = వచ్చి; ఆ = ఆ; చేడియ = వనిత; తత్ = అతని; చరణ = పాదముల; సమీపంబునన్ = వద్ద; ప్రణత = నమస్కరించినది; ఐ = అయ్యి; నిలువంబడి = నిలబడి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.`

భావము:

అలా చేర వచ్చిన ఆఇల్లాలు వింద్యావళి స్వామి పాదాలకు మ్రొక్కి ఇలా అన్నది.

8-656-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నీకుం గ్రీడార్థము లగు
లోకంబులఁ జూచి పరులు లోకులు కుమతుల్
లోకాధీశుల మందురు
లోములకు రాజవీవ లోకస్తుత్యా!

టీకా:

నీ = నీ; కున్ = కు; క్రీడార్థము = సంచరించు విహారస్థలాలు; అగు = అయిన; లోకంబులన్ = లోకములను; చూచి = చూసి; పరులు = ఇతరులు; లోకులు = ప్రజలు; కుమతుల్ = మూర్ఖులు; లోక = లోకములకు; అధీశులము = పాలకులము; అందురు = అనుకొనెదరు; లోకముల్ = సర్వలోకములకు; రాజవు = రాజువు; ఈవ = నీవుమాత్రమే; లోకస్తుత్యా = నారాయణ {లోకస్తుత్య - సర్వలోకముల స్తుతింపబడువాడు, విష్ణువు}.

భావము:

“ఓ లోకపూజ్యుడా! లోకాలు నీకు సంచరించే విహార స్థలాలు. నిజానికి లోకాలకు రాజువు నీవే. కాని తెలివిలేని మూర్ఖులు ఈ లోకాలకు తామే పాలకులని భావిస్తారు.

8-657-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కా నఁడు పొమ్ము లే దీ
రా నఁడు జగత్త్ర యైక రాజ్యము నిచ్చెన్
నా యితుఁ గట్టనేటికి?
శ్రీయితాచిత్తచోర! శ్రితమందారా!"

టీకా:

కాదు = కాదు; అనడు = అన్నవాడుకాదు; పొమ్ము = వెళ్ళిపో; లేదు = లేదు; ఈరాదు = ఇవ్వలేను; అనడు = అన్నవాడుకాదు; జగత్రయ = ముల్లోకములయొక్క; ఏక = మొత్తము; రాజ్యమున్ = రాజ్యాధికారమును; ఇచ్చెన్ = ఇచ్చివేసెను; నా = నా యొక్క; దయితున్ = భర్తను; కట్టన్ = బంధించుట; ఏటికి = ఎందుకు; శ్రీదయితాచిత్తచోర = నారాయణ {శ్రీదయితాచిత్తచోరుడు - లక్ష్మీదేవియొక్క చిత్తచోర (మనసు దొంగిలించిన వాడు), విష్ణువు}; శ్రితమందార = నారాయణ {శ్రితమందార - ఆశ్రయించినవారికి కల్పవృక్షము వంటి వాడు, విష్ణువు}.

భావము:

ఆశ్రిత జనుల పాలిటి కల్పవృక్షమా! “కాదు, లేదు, పో, ఇవ్వను” అన లేదు కదా. మొత్తం ముల్లోకాల రాజ్యాన్ని నీకు ఇచ్చేసాడు కదా! ఇంకెందుకు స్వామీ! లక్ష్మీపతీ! నా పతిని బంధిస్తున్నావు?