పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : బలిని బంధించుట

  •  
  •  
  •  

8-639-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బాహులుఁ బదములుఁ గట్టిన
శ్రీరి కృపగాక యేమి జేయుదు నని సం
దేహింపక బలి నిలిచెను
హాహారవ మెసఁగె దశ దిగంతములందున్.

టీకా:

బాహులున్ = చేతులు; పదములున్ = కాళ్ళు; కట్టినన్ = కట్టివేసినను; శ్రీహరి = విష్ణునియొక్క; కృప = దయ; కాక = కాకుండగ; యేమి = ఏమి; చేయుదును = చేయగలను; అని = అని; సందేహింపక = సంకోచములేకుండ; బలి = బలి; నిలిచెను = మౌనమువహించెను; హాహారవములు = హాహాకారములు; ఎసగెన్ = చెలరేగెను; దశదిగంతముల్ = అన్నివైపుల; అందున్ = లోను.

భావము:

చేతులూ కాళ్ళూ కట్టబడిన బలి చక్రవర్తి, ఇది విష్ణువు దయ దీనికి ఏమీ చేయలేను అనుకుంటూ, సంకోచం ఏమీ లేకుండా మౌనం వహించాడు. అన్నివైపులా హాహాకారాలు చెలరేగాయి.