పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామనుడు దాన మడుగుట

  •  
  •  
  •  

8-572-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"గొడుగో, జన్నిదమో, కమండలువొ, నాకున్ ముంజియో, దండమో,
డుఁ గే నెక్కడ భూము లెక్కడ? కరుల్, వామాక్షు, లశ్వంబు లె
క్క? నిత్యోచిత కర్మ మెక్కడ? మదాకాంక్షామితంబైన మూఁ
డుగుల్ మేరయ త్రోవ కిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్.

టీకా:

గొడుగొ = గొడుగుకాని; జన్నిదమో = జంధ్యముకాని; కమండులువొ = కమండలముకాని; నా = నా; కున్ = కు; ముంజియో = మొలత్రాడుకాని; దండమో = యోగదండముకాని; వడుగున్ = బ్రహ్మచారిని; ఏన్ = నేను; ఎక్కడ = ఎక్కడ; భూములు = భూభాగములు; ఎక్కడ = ఎక్కడ; కరుల్ = ఏనుగులు; వామాక్షులు = జవరాండ్రు; అశ్వంబులున్ = గుఱ్ఱములు; ఎక్కడ = ఎక్కడ; నిత్యోచితకర్మము = నిత్యకృత్యములు; ఎక్కడ = ఎక్కడ; మత్ = నాచేత; ఆకాంక్షితంబు = కోరబడినది; ఐన = అయిన; మూడు = మూడు (3); అడుగుల్ = అడుగుల; మేరయ = పాటిది; త్రోవక = కాదనక; ఇచ్చుట = దానముచేయుట; అది = అదే; బ్రహ్మాండంబు = బ్రహ్మాండము; నా = నా; పాలికిన్ = పాలిటికి, మట్టుకు.

భావము:

“అయ్యా! నేను బ్రహ్మచారిని. నాకు గొడుగు కాని, యజ్ఞోపవీతం కాని, కమండలం కాని, మొలతాడు కాని ఉపయోగిస్తాయి. అంతేకాని బ్రహ్మచారి నైన నా కెందుకు భూములు, ఏనుగులు, గుఱ్ఱాలు, స్త్రీలు. నా నిత్యకృత్యాలకి వాటితో పనిలేదు కదా. కాదని తోసేయకుండ నే కోరిన ఆ మూడు అడగుల చోటిస్తే అదే నాకు బ్రహ్మాండం.