పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామనుని సమాధానము

  •  
  •  
  •  

8-559-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"పవాఁడు మడియ నోపును
దెడేనియు నెదురుపడఁడె? దేహధరులకుం
దెగిన యెడఁ బగఱ మీఁదనుఁ
గఁ గొనఁ దగ ద నుచు నుడిగెఁ బ్రాభవశక్తిన్. "

టీకా:

పగవాడు = శత్రువు; మడియన్ = మరణించి; ఓపున్ = యుండిఉండవచ్చును; తెగడు = మరణించక ఉన్నవాడు; ఏనియున్ = అయినచో; ఎదురుపడడె = ఎదుర్కొనెడివాడేకదా; దేహధరుల్ = జీవుల; కున్ = కు; తెగిన = మరణించిన; ఎడన్ = తరువాత; పగఱ = శత్రువుల; మీదనున్ = పైన; పగగొన = పగబూనుట; తగదు = యుక్తముకాదు; అనుచునున్ = అనుచు; ఉడిగెన్ = విడిచెను; ప్రాభవశక్తిన్ = దండయాత్రను;

భావము:

“నా శత్రువు మరణించి ఉండవచ్చు. మరణించకుండా ఉండి ఉంటే నన్ను ఎదుర్కొనేవాడే కదా. మరణించిన పగవారిపై పగబూనడం తగదు.” అని హిరణ్యకశిపుడు అనుకొని విష్ణువుపై దండయాత్ర ఆపెను