పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామనుని సమాధానము

  •  
  •  
  •  

8-557-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దురై పోర జయింప రా దితనిఁ; గా కెందేనియుం బోవ భీ
ప్రదుఁడై ప్రాణులఁ దోలు మృత్యువు క్రియం బైవచ్చు నంచుం గ్రియా
విదుఁ డబ్జాక్షుఁడు సూక్ష్మరూపమున నావేశించె నిశ్శ్వాస రం
ధ్ర దిశన్ దైత్యు హృదంతరాళమునఁ బ్రత్యక్షక్రియాభీరుఁడై.

టీకా:

ఎదురై = ఎదిరించి; పోర = యుద్ధము చేయుటకు; జయింపన్ = జయించుటకు; రాదు = వీలుకాదు; ఇతనిన్ = ఇతనిని; కాక = అలాకాకుండగ; ఎందేనియున్ = ఎక్కడకైనను; పోవన్ = పోయినచో; భీప్రదుడు = భయము కలిగించెడివాడు; ఐ = అయ్యి; ప్రాణులన్ = జీవులను; తోలున్ = తరుమును; మృత్యువు = మరణము; క్రియన్ = వలె; పైవచ్చు = మీదికివచ్చును; అంచున్ = అనుచు; క్రియా = ఉపాయము; విదుడు = తెలిసినవాడు; అబ్జాక్షుడు = నారాయణుడు; సూక్ష్మ = చాలాచిన్న; రూపమునన్ = రూపముతో; ఆవేశించె = ప్రవేశించెను; నిశ్శ్వాసరంధ్ర = ముక్కు; దిశన్ = ద్వారా; దైత్యు = రాక్షసుని; హృత్ = హృదయము; అంతరాళమునన్ = లోనికి; ప్రత్యక్షక్రియా = ఎదుర్కొనుటకు; భీరుడు = బెదరినవాడు; ఐ = అయ్యి.

భావము:

ఈ హిరణ్యకశిపుడిని యుద్ధంలో ఎదిరించి జయించడానికి వీలుకాదు. అలాకాకుండా నేను ఎక్కడికైనా వెళ్ళిపోతే ఇక లోకంలోని ప్రాణులపైకి మృత్యువు మాదిరిగా దండెత్తి భయపెట్టి పారద్రోలుతాడు అనుకొని విష్ణువు ఉపాయాన్ని ఆలోచించాడు. సూక్ష్మరూపంతో ముక్కురంధ్రం గుండా హిరణ్యకశిపుని హృదయంలో ప్రవేశించాడు.