పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామనుడు యఙ్ఞవాటిక చేరుట

  •  
  •  
  •  

8-547-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

టుని పాద శౌచవారి శిరంబునఁ
రమ భద్ర మనుచు లి వహించె
నే జలము గిరీశుఁ డిందుజూటుఁడు దేవ
దేవుఁ డుద్వహించె ధృతి శిరమున.

టీకా:

వటుని = బ్రహ్మచారి; పాద = పాదములు; శౌచ = కడిగిన; వారిన్ = నీటిని; శిరంబునన్ = తలపైన; పరమ = మిక్కిలి; భద్రము = శుభకరము; అనుచు = అనుచు; బలి = బలి; వహించెన్ = ధరించెను; ఏ = ఎట్టి; జలమున్ = నీటిని; గిరీశుండు = పరమశివుడు {గిరీశుడు - గిరి (కైలాసగిరిపైనున్న) ఈశుడు (ప్రభువు), శంకరుడు}; ఇందుజూటుండు = పరమశివుడు {ఇందుజూటుండు - ఇందు (చంద్రుని) జూటుండు (జటాజూటమున కలవాడు), శంకరుడు}; దేవదేవుడు = పరమశివుడు {దేవదేవుడు - మహాదేవుడు, శంకరుడు}; ఉద్వహించెన్ = చక్కగాధరించెను; ధృతిన్ = పూని; శిరమునన్ = తలపైన.

భావము:

జటాజూటంలో చంద్రుని ధరించిన మహాదేవుడైన శివుడు ఎల్లప్పుడూ ఏనీళ్ళను తలపై ధరిస్తాడో, అటువంటి వామనుని కాళ్లు కడిగిన నీళ్ళను బలిచక్రవర్తి మేలుకలిగించేవిగా తలచి తలపై చల్లుకున్నాడు.