పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామనుడు యఙ్ఞవాటిక చేరుట

  •  
  •  
  •  

8-545-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"స్వస్తి జగత్త్రయీ భువన శాసన కర్తకు హాసమాత్ర వి
ధ్వస్త నిలింపభర్తకు, నుదారపదవ్యవహర్తకున్, మునీం
ద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు, నిర్జరీగళ
న్యస్త సువర్ణసూత్ర పరిర్తకు, దానవలోక భర్తకున్."

టీకా:

స్వస్తి = శుభమగుగాక; జగత్రయీ = ముల్లోకములలోని; భువన = ప్రపంచములను; శాసన = పరిపాలించెడి; కర్త = అధికారి; కున్ = కి; హాసమాత్ర = అవలీలగా {హాసమాత్రము - నవ్వుఒక్కదానితో, అవలీలగా}; విధ్వస్త = నాశనమొందించబడిన; నిలింపభర్త = దేవేంద్రుడుకలవాని; కున్ = కి; ఉదార = ఉన్నతమైన; పద = పదవులలో; వ్యవహర్త = మెలగెడువాని; కున్ = కి; ముని = మునులలో; ఇంద్ర = శ్రేష్ఠులచే; స్తుత = కీర్తింపబడిన; మంగళ = శుభకరమైన; అధ్వర = యజ్ఞముల; విధాన = కార్యక్రమములలో; విహర్త = మెలగునాని; కున్ = కి; నిర్జర = దేవతల; గళ = మెడలో; న్యస్త = ఉన్నట్టి; సువర్ణ = బంగారు; సూత్ర = మంగళసూత్రముల; పరిహర్త = తొలగించెడివాని; కున్ = కి; దానవ = రాక్షసులు; లోక = అందరికి; భర్త = రాజు; కున్ = కి.

భావము:

“ముల్లోకాలనూ శాశించే అధికారం కలవాడా నీకు స్వస్తి! అవలీలగా దేవేంద్రుడంత వానిని వెలవెల పోయేలా చేసినవాడా! ఉన్నత పదవిలో మెలిగేవాడా! మునీంద్రుల పొగడ్తలందుకున్న శుభకరమైన యాగకార్యాలతో విహరించేవాడా! దేవతాస్త్రీల మెడలలోని బంగారు మంగళసూత్రాలను తొలగించేవాడా! సమస్త రాక్షసలోక సార్వభౌముడా! నీకు శుభ మగుగాక.”