పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామనుడు యఙ్ఞవాటిక చేరుట

  •  
  •  
  •  

8-544-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని కుశ పవిత్రాక్షత సంయుతం బయిన దక్షిణహస్తంబు సాఁచి యిట్లనియె.

టీకా:

అని = అని పలికి; కుశ = దర్భలు; పవిత్ర = పవిత్రమైన; అక్షత = అక్షతలు; సంయుతంబు = కలిగినది; అయిన = ఐన; దక్షిణ = కుడి; హస్తంబున్ = చేతిని; సాచి = చాచి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇలా పలికి, పవిత్రమైన దర్భలూ అక్షతలూ పట్టుకున్న తన కుడిచెయ్యి సాచి వామనుడు ఇలాఅన్నాడు.