పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామనుడు యఙ్ఞవాటిక చేరుట

  •  
  •  
  •  

8-539-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కొంఱతోఁజర్చించును
గొంఱతో జటలు చెప్పు గోష్ఠిం జేయుం
గొంఱతోఁ దర్కించును
గొంఱతో ముచ్చటాడుఁ; గొందఱ నవ్వున్.

టీకా:

కొందఱ = కొంతమంది; తోన్ = తోటి; చర్చించును = చర్చలుచేయును; జటలు = వేదపాఠములను {జట - వేదము చెప్పుటలో విశేషము - జట, ఘన}; చెప్పున్ = చదువును; గోష్ఠిన్ = సల్లాపములు; చేయున్ = ఆడును; కొందఱ = కొంతమంది; తోన్ = తోటి; తర్కించును = వాదించును; కొందఱ = కొంతమంది; తోన్ = తోటి; ముచ్చటలాడును = ముచ్చటించును; కొందఱన్ = కొందరితో; నవ్వున్ = నవ్వుతుండును.

భావము:

ఆ సభలో వామనుడు కొందరితో వాదోపవాదాలు చేసాడు. కొందరితో కలిసి వేదాన్ని చదివాడు. కొందరితో చక్కగా సల్లాపాలు సాగించాడు. కొందరితో వాదించాడు. కొందరితో చక్కగా మాట్లాడాడు.