పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామనుడు యఙ్ఞవాటిక చేరుట

  •  
  •  
  •  

8-538-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వెచుచు వంగుచు వ్రాలుచు
ఱిముఱిఁ గబురులకుఁ జనుచు రిహరి యనుచున్
ఱుఁగుచు నులుకుచు దిఱదిఱఁ
గుఱుమట్టపుఁ బడుచు వడుగుఁ గొంత నటించెన్.

టీకా:

వెఱచుచున్ = బెదురుతూ; వంగుచున్ = ఒరుగుచు; వ్రాలుచున్ = తగ్గుచు; అఱిముఱిన్ = సంభ్రమముతో; కబురులకు = సంభాషణములకు; చనుచున్ = దిగుచు; హరిహరి = అయ్యయ్యో; అనుచున్ = అనుచు; మఱుగుచు = చాటుమాటులకు వెళుచు; ఉలుకుచున్ = ఉలికిపడుచు; దిఱదిఱన్ = దిరదిరకు రూపాంతరం, తిరుగుటయందలి అనుకరణము; కుఱు = చిన్ని, కుది; మట్టపు = పొట్టి; పడుచు = బాల; వడుగు = బ్రహ్మచారి; కొంత = కొంచెముసేపు; నటించెన్ = నటించెను.

భావము:

ఆ పొట్టి బ్రహ్మచారి వెరపు చూపుతూ, ఒయ్యారంగా వంగుతూ, జనంలోకి దూరుతూ, “హరి హరి” అంటూ, చాటుకు వెడుతూ, ఉలికిపడుతూ కొంతసేపు చుట్టూతిరుగుతూ కొంతసేపు నటించాడు.