పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామనుడు యఙ్ఞవాటిక చేరుట

  •  
  •  
  •  

8-533-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"శంభుండో హరియో పయోజభవుఁడో చండాంశుఁడో వహ్నియో
దంభాకారత వచ్చెఁ గాక ధరణిన్ ధాత్రీసురుం డెవ్వడీ
శుంద్యోతనుఁ డీ మనోజ్ఞ తనుఁ" డంచున్ విస్మయభ్రాంతులై
సంభాషించిరి బ్రహ్మచారిఁ గని తత్సభ్యుల్ రహస్యంబుగన్.

టీకా:

శంభుండో = పరమశివుడో; హరియో = విష్ణుమూర్తియో; పయోజభవుడో = బ్రహ్మదేవుడో {పయోజభవుడు - పయోజ (పద్మమున) భవుడు (పుట్టినవాడు), బ్రహ్మ}; చండాంశుడో = సూర్యభగవానుడో {చండాంశుడు - చండ (తీవ్రమైన) అంశుడు (కిరణములు కలవాడు), సూర్యుడు}; వహ్నియో = అగ్నిదేవుడో; దంభ = కపట; ఆకారతన్ = వేషముతో; వచ్చెన్ = వచ్చెను; కాక = కాకపోయినచో; ధరణిన్ = భూమిపైన; ధాత్రీసురుండు = బ్రాహ్మణుడు {ధాత్రీసురుడు - ధాత్రీ (భూమిపైని) సురుడు (దేవత), విప్రుడు}; ఎవ్వడు = ఎవరు; ఈ = ఇంత; శుంభత్ = ప్రశస్తముగా; ద్యోతనుడు = ప్రకాశించువాడు; ఈ = ఇంత; మనోజ్ఞ = అందముగానున్న; తనుడు = దేహముగలవాడు; అంచున్ = అనుచు; విస్మయ = ఆశ్చర్యముతో; భ్రాంతులు = భ్రాంతిలోపడినవారు; ఐ = అయ్యి; సంభాషించిరి = మాట్లాడుకొనిరి; బ్రహ్మచారిన్ = వామనుని; కని = చూసి; తత్ = అక్కడి; సభ్యుల్ = సభలోనివారు; రహస్యంబుగన్ = రహస్యముగా.

భావము:

అలా వేంచేసిన వామనుని చూసి, సభలోనివారు “శివుడో, విష్ణువో, బ్రహ్మయో, సూర్యుడో, అగ్నియో ఇలా మారు వేషంతో వచ్చి ఉండవచ్చు. ప్రపంచంలో ఇంతటి కాంతి అందమూ ఉండే బ్రహ్మచారి ఎవరుంటారు.” అనుకుంటూ ఆశ్చర్యంతో చకితులై రహస్యంగా గుసగుసలాడారు.