అష్టమ స్కంధము : వామనుడు యఙ్ఞవాటిక చేరుట
- ఉపకరణాలు:
కని దానవేంద్రుని హయమేధ వాటి దఱియం జొచ్చు నయ్యవసరంబున.
టీకా:
కని = చూసి; దానవేంద్రుని = బలిచక్రవర్తి; హయమేధవాటిన్ = అశ్వమేధయాగశాలను; దఱియంజొచ్చు = చేరవచ్చెడి; ఆ = ఆ; అవసరంబునన్ = సమయమునందు;
భావము:
ఆ వైభోగం అంతా చూస్తూ, వామనుడు బలిచక్రవర్తి యజ్ఞవాటికను సమీపించాడు.