పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామనుడు గర్భస్తు డగుట

  •  
  •  
  •  

8-501-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విశ్వగర్భుఁడు దన గర్భ వివరమందుఁ
బూటపూటకుఁ బూర్ణుఁడై పొటకరింప
వ్రేఁక జూలాలితనమున వేల్పుఁ బెద్ద
పొలఁతి కంతట నీళ్ళాడు ప్రొద్దులయ్యె.

టీకా:

విశ్వగర్భుడు = నారాయణుడు {విశ్వగర్భుడు - విశ్వము గర్భమున కలవాడు, విష్ణువు}; తన = తన యొక్క; గర్భవివరము = గర్భాశయము; అందున్ = లో; పూటపూట = రోజురోజు; కున్ = కి; పూర్ణుడు = నిండుతున్నవాడు; ఐ = అయ్యి; పొటకరింపన్ = వర్థిల్లుచుండగా; వ్రేకన్ = భారమైన; చూలాలితనమునన్ = నిండుచూలాలిగ; వేల్పుపెద్దపొలతి = అదితి; కిన్ = కి; అంతట = అప్పుడు; నీళ్ళాడు = ప్రసవించెడి, పురిటి; ప్రొద్దులు = సమయము, దినములు; అయ్యె = అయినది.

భావము:

అదితి గర్భంలో విశ్వగర్భుడైన భగవంతుడు పూర్ణుడు అవుతూ పూటపూటకూ పెరగసాగాడు. గర్భం బరువెక్కసాగింది. దేవతల కన్నతల్లి అదితి నీళ్ళాడే సమయం ఆసన్నమయింది.