పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామనుడు గర్భస్తు డగుట

  •  
  •  
  •  

8-492-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు కశ్యప చిరతర తపస్సంభృత వీర్యప్రతిష్ఠిత గర్భయై సురల తల్లి యుల్లంబున నుల్లసిల్లుచు నుండె; నంత.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; కశ్యప = కశ్యపుని యొక్క; చిరతర = చాలాఎక్కువకాలము {చిరము - చిరతరము - చిరతమము}; తపస్ = చేసినతపస్సుచే; సంభృత = చక్కగాధరించిన; వీర్య = రేతస్సు; ప్రతిష్ఠిత = ఉంచబడిన; గర్భ = గర్భాశయము కలామె; ఐ = అయ్యి; సురలతల్లి = అదితి {సురలతల్లి - దేవతల మాత, అదితి}; ఉల్లంబునన్ = మనసునందు; ఉల్లసించుచున్ = సంతోషించుచు; ఉండెను = ఉండెను; అంత = అప్పుడు.

భావము:

రాజా పరీక్షిత్తూ! ఈ విధంగా కశ్యపుడు చాలాకాలంగా మహతపో విశేషంతో సంపాదించిన వీర్యంవల్ల అదితి గర్భాన్ని ధరించింది. ఆమె మనసు చాలా ఉల్లాసాన్ని పొందింది.