పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామనుడు గర్భస్తు డగుట

  •  
  •  
  •  

8-491-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న సమాధినుండి శ్యపుఁ డచ్యుతు
నంశ మాత్మనొలయ దితి యందుఁ
నదు వీర్య మధికరము సేర్చెను గాలి
శిఖిని దారువందుఁజేర్చినట్లు.

టీకా:

ఘన = గొప్ప; సమాధిన్ = యోగసమాధి; నుండి = నుండి; కశ్యపుడు = కశ్యపుడు; అచ్యుతున్ = హరి యొక్క; అంశన్ = అంశను; ఆత్మన్ = తనయందు; ఒలయన్ = ప్రవేశించగా; అదితి = అదితి; అందున్ = లో; తనదు = తన యొక్క; వీర్యమున్ = రేతస్సును; అధికతరమున్ = మిక్కిలి అధికమైనదిగా {అధికము - అధికతరము - అధికతమము}; చేర్చెన్ = చేర్చెను; గాలి = వాయువు; శిఖిని = అగ్నిని; దారువు = కొయ్య; అందున్ = లో; చేర్చిన = చేర్చిన; అట్లు = విధముగ.

భావము:

తపస్సులో ఉన్న కశ్యపునిలో విష్ణువు తేజస్సు ప్రవేశించింది. వాయువు కొయ్యలో అగ్నిని చేర్చిన విధంగా అదితి యందు కశ్యపుడు తన అసాధారణమైన వీర్యాన్ని చేర్చాడు.