అష్టమ స్కంధము : వామనుడు గర్భస్తు డగుట
- ఉపకరణాలు:
ఏలింతు దివము సురలనుఁ
బాలింతు మహేంద్రయువతి భాగ్యశ్రీలం
దూలింతు దానవుల ని
ర్మూలింతు రిపుప్రియాంగముల భూషణముల్. "
టీకా:
ఏలింతున్ = పరిపాలింపజేసెదను; దివమున్ = స్వర్గమును; సురలనున్ = దేవతలను; పాలింతున్ = కాపాడెదను; మహేంద్ర = ఇంద్రుని {మహేంద్రుడు - మహా (గొప్ప) ఇంద్రుడు, దేవేంద్రుడు}; యువతిన్ = భార్యయొక్క; భాగ్య = సౌభాగ్యము; శ్రీలన్ = సంపదలను; తూలింతున్ = చలింపజేసెదను; దానవులన్ = రాక్షసులను; నిర్మూలింతున్ = నాశముచేసెదను; రిపు = శత్రువుల; ప్రియ = భార్యల; అంగముల = దేహమునందలి; భూషణముల్ = అలంకారములు.
భావము:
దేవతలు స్వర్గాన్ని పాలించేటట్లు చేస్తాను. శచీదేవి సౌభాగ్యాలను కాపాడతాను. రాక్షసులను అధికారం నుంచి తొలగించి, వారి ఇల్లాళ్ళ అలంకరాలను పోగొడతాను.”