పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : దితి కశ్యపుల సంభాషణ

 •  
 •  
 •  

8-460-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అదితి కశ్యపుల సంభాషణ

అంత

టీకా:

అంత = అంతట.

భావము:

దేవతలు తరలిపోవడం, బలి అమరావతిని ఆక్రమించుకోవడం జరిగిన పిమ్మట. . .

8-461-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

న తనూజుప్రోలు నుజులు గొనుటయు-
వేల్పు లెల్లను డాఁగ వెడలుటయును
భావించి సురమాత రితాపమునఁ బొంది-
గ ననాథాకృతి నరుచుండ
నా యమ్మ పెనిమిటి గు కశ్యపబ్రహ్మ-
ఱి యొకనాఁడు సమాధి మాని
న కుటుంబిని యున్న ధామమునకు నేగి-
నాతిచే విహితార్చములు పడసి

భావము:

8-461.1-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వంది వ్రాలి కుంది వాడిన యిల్లాలి
దనవారిజంబు డువుఁ జూచి
చేరఁ దిగిచి మగువ చిబుకంబు పుడుకుచు
"వారిజాక్షి! యేల గచె" దనుచు.

టీకా:

తన = తన యొక్క; తనుజుల = పుత్రుల; ప్రోలు = పట్టణము (అమరావతి); దనుజులు = రాక్షసులు; కొనుటయున్ = ఆక్రమించుట; వేల్పులు = దేవతలు; ఎల్లను = అందరును; డాగన్ = దాగుకొనుటకు; వెడలుటయును = వెళ్ళుట; భావించి = తలచుకొని; సురమాత = అదితి {సురమాత - సుర (దేవత) మాత, అదితి}; పరితాపమును = దుఃఖమును; పొంది = పొంది; వగవన్ = వగచుచుండగ; అనాథ = దిక్కులేనామె; ఆకృతిన్ = వలె; వనరుచుండన్ = దీనాలాపములాడుచుండ; ఆ = ఆ; అమ్మ = తల్లి; పెనిమిటి = భర్త; అగు = అయిన; కశ్యప = కశ్యపుడు యనెడి; బ్రహ్మ = ప్రజాపతి; మఱి = తరువాత; ఒక = ఒక; నాడు = రోజు; సమాధి = తపోసమాధి; మాని = వదలివేసి; తన = తన యొక్క; కుటుంబిని = భార్య; ఉన్న = ఉన్నట్టి; ధామమున్ = ఇంటి; కున్ = కి; ఏగి = వెళ్ళి; నాతి = భార్య; చేన్ = చేత; విహిత = తగిన విధముగ; అర్చనములు = పూజలు; పడసి = పొంది.
వంది = మెచ్చుకొని; వ్రాలి = వాలిపోయి; కుంది = కుంగిపోయి; వాడిన = వాడిపోయి యున్నట్టి; ఇల్లాలి = భార్య యొక్క {ఇల్లాలు - ఇంటి యందలి స్త్రీ, భార్య}; వదన = మోము యనెడి; వారిజంబు = పద్మము; వడువున్ = విధమును, రీతిని; చూచి = చూసి; చేరన్ = దగ్గరకు; తిగిచి = పిలిచి; మగువ = ఇంతి; చిబుకంబు = గడ్డము; పుడుకుచున్ = పుణుకుచు; వారిజాక్షి = సుందరి {వారిజాక్షి - వారిజము (పద్మము) వంటి అక్షి (కన్నులున్నామె), స్త్రీ}; ఏల = ఎందులకు; వగచెదు = దుఃఖించెదవు; అనుచున్ = అనుచు.

భావము:

దేవతలతల్లి యైన అదితి అమరావతిని రాక్షసులు ఆక్రమించుకోవడం, దానితో తలదాచుకోవడానికి తనకు పుట్టిన దేవతలు తరలిపోవడం తలచుకుంటూ దిక్కులేనిదాని వలె దుఃఖించింది. ఒకనాడు ఆమెభర్త కశ్యపప్రజాపతి తపస్సు చాలించి ఇంటికి వచ్చాడు. అదితిచేత పూజలు అందుకున్నాడు. బాధతో కుంది కుంగిన ఆమె ముఖ పద్మాన్ని చూచి ఆమెను చేరదీసి ఓదార్చాడు. “ఓ కమలాక్షీ! ఎందుకు బాధపడుతున్నావు” అని అంటూ ఇంకా . . .

8-462-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఆ మహాత్ముం డిట్లనియె.

టీకా:

ఆ = ఆ; మహాత్ముండు = గొప్పవాడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

కశ్యపుడు తన ఇల్లాలు అదితితో ఇంకా ఇలా అన్నాడు.

8-463-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"తెవా! విప్రులు పూర్ణులే? చెలగునే దేవార్చనాచారముల్?
ఱితో వేలుతురే గృహస్థులు? సుతుల్ ర్మానుసంధానులే?
నెఱి నభ్యాగత కోటి కన్న మిడుదే? నీరంబునుం బోయుదే?
లే కర్థుల దాసులన్ సుజనులన్ న్నింపుదే? పైదలీ!

టీకా:

తెఱవా = సుందరీ {తెఱవ - తెఱ (స్వచ్ఛమైన) వ(ఆమె), స్త్రీ; తెఱవ – తెఱప + వా (యి) గలది, రహస్యము దాగని నోరు గలది, స్త్రీ}; విప్రులు = బ్రాహ్మణులు; పూర్ణులే = సంతృప్తులేనా; చెలగునే = చక్కగా నున్నవా; దేవ = దేవతలు; ఆర్చన = పూజలు; ఆచారముల్ = ఆచారములు; తఱి = సమయపాలన; తోన్ = తోటి; వేలుతురే = హోమములు చేస్తున్నారా; గృహస్థులు = ఇంటిలోనివారు; సుతుల్ = కొడుకులు; ధర్మ = ధర్మమును; అనుసంధానులే = పాటిస్తున్నారా; నెఱిన్ = పద్ధతి ప్రకారముగ; అభ్యాగత = అతిథులకు; కోటి = అందరకు; అన్నము = భోజనము; ఇడుదే = పెట్టుచున్నావా; నీరంబునున్ = మంచినీరు కూడ; పోయుదే = ఇస్తున్నావా; మఱ = మరపు; లేక = లేకుండగ; అర్థులన్ = యాచకులను; దాసులను = సేవకులను; సుజనులన్ = సజ్జనులను; మన్నింపుదే = సమ్మానించుచున్నావా; పైదలీ = చిన్నదానా.

భావము:

“చిన్నదానా! స్వచ్ఛమైనదానవు నీవు. ఎందుకు ఇలా విచారంగా ఉన్నావు. బ్రాహ్మణులను ఏ లోటూ లేకుండా ఆదరిస్తున్నావు కదా! దేవతలకు పూజలు సమయానుగుణంగా సాగుతున్నాయా? మన వారు అందరూ ఇక్కడ వేళకు సరిగా హోమకార్యాలు నెరవేరుస్తున్నారా? నీ కొడుకులు ధర్మాన్ని పాటిస్తున్నారా? అతిథులకు అన్న పానాలు ఇచ్చి ఆదరిస్తున్నావు కదా! మర్చిపోకుండా బిచ్చగాళ్లకు, సేవకులకూ, సజ్జనులకు సత్కారాలు చేస్తున్నావు కదా!

8-464-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

న్నమైనఁ దక్రమైనఁ దోయంబైన
శాకమైన దనకుఁ రుగు కొలఁది
తిథి జనుల కడ్డ మాడక యిడరేని
లేమ! వారు కలిగి లేనివారు.

టీకా:

అన్నము = భోజనము; ఐనన్ = అయినను; తక్రము = మజ్జిగ {తక్రము – పాతిక పాలు నీరు చేర్చిన మజ్జిగ, ఆంధ్ర వాచస్పతము}; ఐనన్ = అయినను; తోయంబు = మంచినీరు; ఐనన్ = అయినను; శాకము = కాయలు; ఐనన్ = అయినను; తన = తన; కున్ = కు; జరుగు = వీలగునంత; కొలది = వరకు; అతిథి = అతిథులైన; జనుల = వారి; కున్ = కి; అడ్డమాడక = లేదనకుండ; ఇడరు = పెట్టని; ఏని = చో; లేమ = సుందరి {లేమ - లేత యౌవనము గలామె, స్త్రీ}; వారు = అట్టివారు; కలిగి = సంపన్నులై యుండి కూడ; లేనివారు = బీదవారే.

భావము:

అన్నమైనా, మజ్జిగైనా, నీళ్ళైనా చివరకు కూరగాయలైనా తమకు ఉన్నంతలో అతిథులకు లేదనకుండా పెట్టాలి .అలా పెట్టకపోతే ఎంతటి ధనవంతులైనా వారు దరిద్రులే.

8-465-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మఱియు

టీకా:

మఱియున్ = ఇంకను.

భావము:

అంతేకాకుండా. . . .

8-466-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నెలఁత! విష్ణునకును నిఖిలదేవాత్మున
కాననంబు శిఖియు వనిసురులు;
వారు దనియఁ దనియు నజాతలోచనుం
తఁడుఁ దనియ జగము న్నిఁ దనియు.

టీకా:

నెలత = సుందరి {నెలత - చంద్రునివలె చల్లని యామె, స్త్రీ}; విష్ణున్ = నారాయణున; కును = కు; నిఖిలదేవాత్మున్ = నారాయణున {నిఖిలదేవాత్ముడు - నిఖిల (సమస్తమై) దేవ (దేవతలు) ఆత్ముడు (తానైనవాడు), విష్ణువు}; కున్ = కు; ఆననంబు = ముఖము; శిఖియున్ = అగ్ని; అవనిసురులు = బ్రాహ్మణులు {అవనిసురులు - అవని (భూమికి) సురులు (దేవతలు), బ్రాహ్మణులు}; వారు = వారు; తనియన్ = తృప్తిచెందగ; తనియున్ = సంతృప్తు డగును; వనజాతలోచనుండు = హరి {వనజాతలోచనుడు - వనజాతము (పద్మము) వంటి లోచనుడు (కన్నులు గలవాడు), విష్ణువు}; అతడు = అతను; తనియన్ = సంతృప్తుడైనచో; జగములు = లోకములు; అన్నియు = సమస్తమును; తనియున్ = తృప్తిచెందును.

భావము:

చంద్రుని వలె చల్లని మగువా! దేవతలు అందరకు ఆత్మ విష్ణుమూర్తి. ఆయన ముఖము అయిన అగ్నినీ, బ్రాహ్మణులనూ సంతోష పెడితే విష్ణువు సంతోషపడతాడు. విష్ణుమూర్తి తృప్తిచెందితే, సమస్తలోకాలూ తృప్తి చెందుతాయి.

8-467-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

బిడ్డలు వెఱతురె నీకఱ
గొడ్డంబులు జేయ కెల్ల కోడండ్రును మా
ఱొడ్డారింపక నడతురె
యెడ్డము గాకున్నదే మృగేక్షణ! యింటన్."

టీకా:

బిడ్డలు = పిల్లలు; వెఱతురె = భయభక్తులతో నున్నారా; నీ = నీ; కున్ = కు; అఱగొడ్డంబులు = తిరగబడుట; చేయక = చేయకుండగ; ఎల్ల = అందరు; కోడండ్రును = కోడళ్ళు; మాఱొడ్డారింపక = ప్రతిఘటించకుండగ; నడతురె = వర్తించుతున్నారా; ఎడ్డము = ఇబ్బంది; కాక = లేకుండగ; ఉన్నదె = ఉన్నాదా; మృగేక్షణ = సుందరీ {మృగేక్షణ - మృగ (లేడివంటి) ఈక్షణ (చూపులు గలామె), స్త్రీ}; ఇంటన్ = ఇంటిలో.

భావము:

లేడికన్నులతో అందంగా ఉండే అదితీ! నీ విషయంలో నీ కొడుకులు వినయంగా ఉంటున్నారా? కోడళ్ళు నీకు ఎదురు చెప్పకుండా ఉంటున్నారా? ఇంట్లో ఇబ్బందులు ఏమి లేవు కదా!”.

8-468-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అని పలికినం బతికి సతి యి ట్లనియె.

టీకా:

లేడికన్నులతో అందంగా ఉండే అదితీ! నీ విషయంలో నీ కొడుకులు వినయంగా ఉంటున్నారా? కోడళ్ళు నీకు ఎదురు చెప్పకుండా ఉంటున్నారా? ఇంట్లో ఇబ్బందులు ఏమి లేవు కదా!”.

భావము:

ఇలా కుశలం అడిగిన భర్త కశ్యపప్రజాపతితో అదితి ఇలా అన్నది.

8-469-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"ప్రే యొకింత లేక దితి బిడ్డలు బిడ్డలబిడ్డలున్ మహా
భీ బలాఢ్యులై తనదుబిడ్డల నందఱఁ దోలి సాహసా
క్రామిత వైరులయ్యు నమరావతి నేలుచు నున్నవారు; నీ
కే ని విన్నవింతు? హృదయేశ్వర! మేలుఁ దలంచి చూడవే?

టీకా:

ప్రేమ = ప్రేమాభిమానములు; ఒకింత = ఏ మాత్రమూ, కొంచెము కూడ; లేక = లేకుండగ; దితి = దితి యొక్క; బిడ్డలు = పిల్లలు; బిడ్డలబిడ్డలు = మనుమలు; మహా = అధికమైన; భీమ = భీకరమైన; బలాఢ్యులు = శక్తిమంతులు; ఐ = అయ్యి; తనదు = నా; బిడ్డలన్ = పిల్లలను; అందఱన్ = అందరిని; తోలి = పారదోలి; సాహస = సాహసముతో; ఆక్రమిత = ఆక్రమించిన; వైరులు = శత్రువులు; అయ్యున్ = అయ్యి; అమరావతిన్ = దేవతల రాజధానిని; ఏలుచున్నావారు = పరిపాలించుచున్నారు; నీ = నీ; కున్ = కు; ఏమి = ఏమిటి; అని = అని; విన్నవింతున్ = చెప్పుకోగలను; హృదయేశ్వర = భర్తా; మేలు = ఏది మంచిదో; తలచి = ఆలోచించి; చూడవే = చూడుము.

భావము:

“ఓ నా హృదయానికి ప్రభువు అయిన పతీ! దితి బిడ్డలూ వారి బిడ్డలూ బలవంతులై నా బిడ్డలపై సవితి సోదరులు అన్న ప్రేమ ఏమాత్రం చూపకుండా, పగబూని ఓడించి, పారద్రోలారు. సాహసంతో అమరావతిని ఆక్రమించుకొని పాలిస్తున్నారు. ఈ విషాదవార్త నీకు ఏమని చెప్పమన్నావు. నా పిల్లలకు మేలు కలిగే మార్గం ఏదో ఆలోచించి చూడు.

8-470-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

క్కా చెల్లెండ్రయ్యును
క్కరు నాతోడి పోరుఁ; దానున్ దితియున్
క్కసులు సురల మొత్తఁగ
క్కట! వల దనదు చూచు నౌనౌ ననుచున్.

టీకా:

అక్కచెల్లెండ్రు = అక్కాచెల్లెళ్ళము; అయ్యున్ = అయినప్పటికిని; తక్కరు = వదలిపెట్టరు; నా = నా; తోడి = తోటి; పోరున్ = దెబ్బలాటలను; తానున్ = ఆమె; దితియున్ = దితికూడ; రక్కసులు = రాక్షుసులు; సురలన్ = దేవతలను; మొత్తగన్ = కొడుతుండగ; అక్కట = అయ్యో; వలదు = వద్దు; అనదు = అని చెప్పదు; చూచున్ = చూచుచుండును; ఔనౌను = భళీభళీ; అనుచున్ = అనుచు.

భావము:

దితీ నేనూ అక్కాచెల్లెళ్ళమే. అయినప్పటికీ ఆమె నాతో ఎప్పుడూ కలహిస్తూనే ఉంటుంది. దేవతలను ఆమె పిల్లలు రాక్షసులు బాధపెడుతున్నా ఆమె మెచ్చుకుంటుందే కాని వద్దని అనదు.

8-471-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఎండకన్నెఱుగని యింద్రుని యిల్లాలు-
లుపంచలను జాలిఁ డియె నేఁడు
త్రిభువన సామ్రాజ్య విభవంబుఁ గోల్పోయి-
దేవేంద్రుఁ డడవులఁ దిరిఁగె నేఁడు
లిమి గారాబు బిడ్డలు జయంతాదులు-
బరార్భకుల వెంటఁ నిరి నేఁడు
మరుల కాధారగు నమరావతి-
సురుల కాటపట్టయ్యె నేఁడు

8-471.1-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

లి జగముల నెల్ల లియుచు నున్నాఁడు
వాని గెలువరాదు వాసవునకు
యాగభాగమెల్ల తఁ డాహరించుచుఁ
డఁగి సురల కొక్క డియుఁ నీఁడు.

టీకా:

ఎండకన్నెఱుగని = అతిసుకుమారియైన {ఎండకన్నెఱుగని - ఎండ (సూర్యకిరణముల) కన్ను (చూపునుకూడ) ఎఱుగని (తెలియని), మిక్కిలి సుకుమారమైన}; ఇంద్రుని = ఇంద్రుని యొక్క; ఇల్లాలు = భార్య; పలు = అనేకుల; పంచలను = చూర్లుయందు; జాలిబడియె = దీనత్వమున పడెను; నేడు = ఇవాళ; త్రిభువన = ముల్లోకముల; సామ్రాజ్య = మహారాజ్యాధికార; విభవంబున్ = వైభవమును; కోల్పోయి = నష్టపోయి; దేవేంద్రుడు = ఇంద్రుడు; అడవులన్ = అడవులమ్మట; తిరిగెన్ = తిరుగుచున్నాడు; నేడు = ఇవాళ; కలిమి = సంపదలకు; గారాబు = గారాల; బిడ్డలు = పిల్లలు; జయంత = జయంతుడు; ఆదులు = మున్నగువారు; శబర = బోయల; అర్భకుల = పిల్లల; వెంటన్ = తోకూడ; చనిరి = వెళ్ళుచున్నారు; నేడున్ = ఇవాళ; అమరుల్ = దేవతల; కున్ = కు; ఆధారము = నెలవైనది; అగు = అయిన; అమరావతి = అమరావతీపట్టణము; అసురుల్ = రాక్షసుల; కున్ = కు; ఆటపట్టు = అలవాలము; అయ్యెన్ = అయినది; నేడు = ఇవాళ.
బలి = బలి; జగములన్ = లోకములను; ఎల్లన్ = అన్నిటియందు; బలియుచున్ = బలవంతుడు అగుచు; ఉన్నాడు = ఉన్నాడు; వానిన్ = అతనిని; గెలువరాదు = జయింపశక్యముకాదు; వాసవున్ = ఇంద్రున {వాసవుడు - వసువులు (రత్నములు) కలవాడు, ఇంద్రుడు}; కున్ = కు; యాగభాగము = హవిర్భాగములను; ఎల్లన్ = అంతటిని; అతడు = అతడే; ఆహరించుచున్ = దోచేసుకొనుచు; కడగి = పూని; సురల్ = దేవతల; కున్ = కు; ఒక్క = ఒక; కడియున్ = ముద్దకూడ; ఈడు = ఇవ్వడు.

భావము:

ఎండకన్నెరగని ఇంద్రుని ఇల్లాలు శచీదేవి ఈనాడు పలు కష్టాలకు గురై బాధపడుతూ ఉంది. ఇంద్రుడు ముల్లోకాల రాజ్యసంపదనూ పోగొట్టుకొని ఈనాడు అడవులలో ఇడుములు పడుతున్నాడు. కలవారిబిడ్డలై అల్లారు ముద్దుగా పెరిగిన జయంతాదులు ఈనాడు బోయపిల్లల వెంట తిరుగుతున్నారు. దేవతల నెలవైన అమరావతి ఈనాడు రాక్షసులకు అలవాలమైనది. అన్ని లోకాలలోనూ బలి బలవంతుడు అవుతున్నాడు. అతనిని ఇంద్రుడు నిలువరించలేక పోతున్నాడు. యజ్ఞాలలో హవిర్భాగాలన్నింటినీ బలి దోచుకుంటున్నాడు ఒక్క కబళంకూడా దేవతలకు చిక్కనివ్వడు.

8-472-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ప్రలకు నెల్లను సముఁడవు
ప్రలను గడుపారఁ గన్న బ్రహ్మవు నయ్యుం
బ్రలందు దుష్టమతులను
నిముగ శిక్షింప వలదె నీవు? మహాత్మా!

టీకా:

ప్రజల్ = సంతానమునకు; ఎల్లను = అందరిపట్లను; సముడవు = సమానంగ చూచువాడవు; ప్రజలను = సంతానమును; కడుపారన్ = కడుపునిండుగా; కన్న = పుట్టించినట్టి; బ్రహ్మవు = ప్రజాపతివి; అయ్యున్ = అగుటచేత; ప్రజల్ = పిల్లల; అందున్ = లో; దుష్ట = చెడు; మతులను = బుద్ధులు గలవారిని; నిజముగన్ = తప్పక; శిక్షింపవలదె = శిక్షించవలెనుకదా; నీవు = నీవు; మహాత్మా = గొప్పవాడా.

భావము:

మహాత్మా! కశ్యపా! బిడ్డలు అందరి ఎడలా నీవు సమానమైన వాడవు. ప్రేమతో బిడ్డలను కన్న ప్రజాపతివి కాబట్టి, నీవు దుర్మార్గులైన బిడ్డలను కనిపెట్టి దండించాలి కదా.

8-473-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

సులన్ సభ్యుల నార్తులన్ విరథులన్ శోకంబు వారించి ని
ర్జధానిన్ నిలుపంగ రాత్రిచరులన్ శాసింప సత్కార్య మే
వె వేరీతి ఘటిల్లు నట్టి క్రమమున్ వేగంబ చింతింపవే?
రుణాలోక సుధాఝరిం దనుపవే? ళ్యాణ సంధాయకా! "

టీకా:

సురలన్ = దేవతలను; సభ్యులన్ = మర్యాదస్తులను; ఆర్తులన్ = దుఃఖితులను; విరథులన్ = ఓడిపోయినవారిని; శోకంబున్ = దుఃఖమును; వారించి = పోగొట్టి; నిర్జరధాని = అమరావతి యందు {నిర్జరధాని - దేవతల రాజధాని, అమరావతి}; నిలుపంగ = నిలబెట్టుటకు; రాత్రిచరులన్ = రాక్షసులను; శాసింపన్ = శిక్షించుట; సత్కార్యము = మంచిపని; ఈ = ఈలాగు; వెరవు = ఏర్పాటు; ఏరీతిన్ = ఏవిధముగ; ఘటిల్లున్ = నెరవేరుతుందో; అట్టి = అటువంటి; క్రమమును = పద్ధతిని; వేగంబ = శ్రీఘ్రమే; చింతింపవే = ఆలోచించుము; కరుణ = దయకల; ఆలోక = చూపులు యనెడి; సుధా = అమృతపు; ఝరిన్ = ప్రవాహమునందు; తనుపవే = ముంచెత్తుము; కల్యాణ = శుభములను; సంధాయికా = కలిగించెడివాడ.

భావము:

మహానుభావా! సకల కల్యాణాలను సమకూర్చే వాడవు నీవు. ఉత్తములైన దేవతలు కష్టాలకు గురయ్యారు. భాగ్యాలు కోల్పోయారు. వారి దుఃఖాన్ని తొలగించు. వారిని అమరావతిలో నెలకొల్పడమూ, రాక్షసులను శిక్షించడమూ చేయవలసిన మంచిపని. తొందరగా ఆలోచించి ఈ కార్యం ఏ విధంగా నెరవేరుతుందో చూడు. మమ్మల్ని నీ కరుణారస ప్రవాహంలో ముంచెత్తు."

8-474-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అనిన మనోవల్లభ పలుకు లాకర్ణించి ముహూర్తమాత్రంబు చింతించి విజ్ఞానదృష్టి నవలంబించి భావికాల కార్యంబు విచారించి కశ్యప బ్రహ్మ యిట్లనియె.

టీకా:

అనినన్ = అనగా; మనోవల్లభ = భార్య {మనోవల్లభ - మనసునకు వల్లభ (నాయిక), సతి}; పలుకుల్ = మాటలు; ఆకర్ణించి = విని; ముహూర్తమాత్రంబు = కొద్దిసేపు; చింతించి = ఆలోచించి; విజ్ఞానదృష్టిన్ = దివ్యదృష్టిని; అవలంభించి = సారించి; భావి = రాబోవు; కాల = కాలము; కార్యంబున్ = సంగతులు; విచారించి = ఆలోచించి; కశ్యప = కశ్యపుడు యనెడి; బ్రహ్మ = ప్రజాపతి; ఇట్లు = ఇలా; అనియెన్ = పలికెను.

భావము:

ఇలా అంటున్న తన ప్రియ భార్య మాటలు విని, కశ్యపప్రజాపతి కొంచెంసేపు ఆలోచించాడు. జ్ఞానదృష్టితో రాబోయే కాలంలో జరగబోయే సంగతులు తెలుసుకుని ఇలా అన్నాడు.

8-475-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"కుం డెవ్వడు? జాతుఁ డెవ్వఁడు? జనిస్థానంబు లెచ్చోటు? సం
నం బెయ్యది? మేను లేకొలఁదిఁ? సంసారంబు లేరూపముల్?
వినుమా యింతయు విష్ణుమాయ దలఁపన్వేఱేమియున్ లేదు; మో
నిబంధంబు నిదాన మింతటికి జాయా! విన్నఁబో నేటికిన్?

టీకా:

జనకుండు = తండ్రి; ఎవ్వడు = ఎవరు; జాతుడు = పుత్రుడు; ఎవ్వడు = ఎవరు; జని = జన్మ; స్థానంబులు = స్థలములు; ఎచ్చోటు = ఏవి; సంజననంబు = పుట్టుక; ఎయ్యది = ఎట్టిది; మేనులు = జీవములు; ఏకొలది = ఎన్ని ఉన్నవి; సంసారంబుల్ = సంసారములు; ఏ = ఎట్టి; రూపముల్ = స్వరూపముకలవి; వినుమా = వినుము; ఇంతయున్ = ఇదంతా; విష్ణు = విష్ణుమూర్తి యొక్క; మాయ = మాయ; తలపన్ = తరచిచూసినచో; వేఱు = ఇంక, ఇతరము; ఏమియున్ = ఏమీ; లేదు = లేదు; మోహ = మాయ యందు; నిబంధంబు = తగులుకొనుట; నిదానము = మూలకారణము; ఇంతటి = దీనంతటి; కిన్ = కి; జాయా = ఇల్లాలా; విన్నబోన్ = చిన్నపుచ్చుకొనుట; ఏటికిన్ = ఎందుకు.

భావము:

“ఇల్లాలా! తండ్రి ఎవడు? కొడుకు ఎవడు? పుట్టిన స్ధలాలు ఏవి? పుట్టుకకు కారణము ఏమిటి? శరీరాలు ఏపాటివి? ఈ సంసారాలు ఏమాత్రమైనవి? ఆలోచిస్తే ఇదంతా భగవంతుడైన ఆ విష్ణుమూర్తి మాయ తప్ప మరేమీ కాదు. అజ్ఞానంలో బంధింపబడి ఉండడమె. దీనికి మూలం. అందువల్ల జరిగిన దానికి చింతించి చిన్నబుచ్చుకోకు.