పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : బలి యుద్ధ యాత్ర

  •  
  •  
  •  

8-438-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన శుకుం డిట్లనియె.

టీకా:

అనినన్ = అనగా; శుకుండు = శుకుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

ఇలా బలి వృత్తాంతం అడిగిన మహారాజు పరీక్షిత్తుతో శుకముని ఇలా అన్నాడు.

8-439-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"పురుహూతుచే నొచ్చి పోయి భార్గవులచే-
లి యెట్టకేలకు బ్రతికి వారి
చిత్తంబురాఁ గొల్చి శిష్యుఁడై వర్తింప-
వారు నాతని భక్తి లన మెచ్చి
విశ్వజిద్యాగంబు విధితోడఁ జేయింప-
వ్యకాంచనపట్ట ద్ధ రథము
ర్కువాజులఁ బోలు రులుఁ గంఠీరవ-
ధ్వజము మహాదివ్యనువుఁ బూర్ణ

8-439.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తూణయుగళంబుఁ గవచంబుఁ దొలుత హోమ
పావకుం డిచ్చె; నమ్లాన ద్మమాలఁ
లుష హరుఁడగు తన తాత రుణ నొసఁగె;
సోమ సంకాశ శంఖంబు శుక్రుఁ డిచ్చె.

టీకా:

పురూహూతు = ఇంద్రుని; చేన్ = వలన; నొచ్చి = ఓడి; పోయి = పోయి; భార్గవుల్ = శుక్రాచార్యుల; చేన్ = వలన; బలి = బలి; ఎట్టకేల = చిట్టచివర; కున్ = కు; బ్రతికి = కాపాడబడి; వారి = ఆయనకు; చిత్తంబురాన్ = కనికరముకలుగునట్లు; కొల్చి = సేవించి; శిష్యుడు = శిష్యుడు; ఐ = అయ్యి; వర్తింపన్ = నడచుచుండగ; వారును = ఆయనకూడ; మెచ్చి = సంతోషించి; విశ్వజిద్యాగంబున్ = విశ్వజిద్యాగమును; విధి = పద్దతిప్రకారము; తోడన్ = తోటి; చేయింపన్ = చేయించగా; భవ్య = దివ్యమైన; కాంచన = బంగారు; పట్టన్ = బట్టలుతో; బద్ద = కట్టబడిన; రథమున్ = రథమును; అర్కు = సూర్యుని; వాజులన్ = గుఱ్ఱములను; పోలు = పోలెడి; హరులున్ = గుఱ్ఱములు; కంఠీరవ = సింహపు; ధ్వజమున్ = జండా; మహా = గొప్ప; దివ్య = దివ్యమైన; ధనువున్ = విల్లు; పూర్ణ = నిండు.
తూణ = అమ్ములపొదుల; యుగళంబున్ = జంటను; కవచంబున్ = కవచమును; తొలుత = ముందుగా; హోమ = హోమ; పావకుండు = అగ్ని; ఇచ్చెన్ = ఇచ్చెను; అమ్లాన = వాడిపోని; పద్మ = కలువపూల; మాలన్ = మాలను; కలుష = పాపములను; హరుడు = పోగొట్టెడివాడు; అగు = అయిన; తన = అతని; తాత = పితామహుడు; కరుణన్ = కృపతో; ఒసగెన్ = ఇచ్చెను; సోమ = చంద్రునితో; సంకాశ = పోలినట్టి; శంఖంబున్ = శంఖము; శుక్రుడు = శుక్రుడు; ఇచ్చెన్ = ఇచ్చెను.

భావము:

“ఇంద్రుని చేతిలో ఓడిపోయిన పిమ్మట బలిచక్రవర్తి శుక్రాచార్యుని దయవల్ల తేరుకున్నాడు. శుక్రునికి కనికరం కలిగేటట్లు శిష్యుడై సేవించాడు. బలి భక్తికి శుక్రుడు మెచ్చుకున్నాడు. బలిచేత నియమపూర్వకంగా విశ్వజిద్యాగాన్ని చేయించాడు. బలిచక్రవర్తికి హోమాగ్నినుండి బంగారువస్తాలు కప్పిన రథమూ, సూర్యుని గుఱ్ఱాలవంటి గుఱ్ఱాలూ, సింహం జెండా, గొప్పవిల్లు అంబులపొదుల జంటా, కవచమూ లభించాయి. పుణ్యాత్ముడైన అతని తాతగారు ప్రహ్లాదుడు వాడిపోని పద్మాలదండ ఇచ్చాడు. శుక్రుడు చంద్రుని వంటి తెల్లని శంఖాన్ని ఇచ్చాడు.

8-440-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇవ్విధంబున

టీకా:

ఈ = ఈ; విధంబునన్ = విధముగ.

భావము:

ఈవిధంగా...

8-441-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పాణియు, రథియుఁ, గృపాణియుఁ,
దూణియు, ధన్వియును, స్రగ్వి తురగియు, దేహ
త్రాణియు, ధిక్కృత విమత
ప్రాణియు, మణి కనక వలయ పాణియు నగుచున్.

టీకా:

పాణియున్ = బాణములుచేతగలవాడు; రథియున్ = రథమెక్కినవాడు; కృపాణియున్ = కత్తిధరించినవాడు; తూణియున్ = అమ్ములపొదిగలవాడు; ధన్వియును = విల్లుధరించినవాడు; స్రగ్వి = పూలదండగలవాడు; తురగియున్ = గుఱ్ఱముగలవాడు; దేహత్రాణియున్ = కవచధారి; ధికృత = తిరస్కరింపబడిన; విమత = శత్రువుల; ప్రాణియున్ = ప్రాణములుగలవాడు; మణి = రత్నాల; కనక = బంగారపు; వలయ = కంకణములుగల; పాణియున్ = చేతధరించినవాడు; అగుచున్ = అగుచు.

భావము:

బలిచక్రవర్తి బాణాలూ, రథమూ, ఖడ్గమూ, అమ్ములపొదులూ, విల్లు, పూలదండ, గుఱ్ఱాలు, కవచమూ, రత్నఖచిత సువర్ణకంకణాలు సంపాదించాడు. అటుపిమ్మట పగవారిపై పగతీర్చుకొవాలి అని నిశ్చయించుకున్నాడు.

8-442-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లుదానంబుల విప్రులం దనిపి తద్భద్రోక్తులం బొంది పె
ద్దకున్ మ్రొక్కి విశిష్టదేవతల నంర్భక్తిఁ బూజించి ని
ర్మలుఁ బ్రహ్లాదునిఁ జీరి నమ్రశిరుఁడై రాజద్రథారూఢుఁడై
వెలిఁగెన్ దానవ భర్త శైల శిఖ రోద్వేల్ల ద్దవాగ్ని ప్రభన్.

టీకా:

పలు = అనేకమైన; దానంబులన్ = దానములతో; విప్రులన్ = బ్రాహ్మణులను; తనిపి = సంతృప్తిపరచి; తత్ = వారి; భద్రోక్తులన్ = ఆశీర్వచనములను; పొంది = పొంది; పెద్దల్ = పెద్దల; కున్ = కు; మ్రొక్కి = నమస్కరించి; విశిష్టదేవతలన్ = ఇలవేల్పులను; అంతర్ = ఏకాంత; భక్తిన్ = భక్తితో; పూజించి = పూజలుచేసి; నిర్మలున్ = నిర్మలచరిత్రుని; ప్రహ్లాదునిన్ = ప్రహ్లాదుని; చీరి = పిలిచి; నమ్ర = వంచిన; శిరుడు = తలగలవాడు; ఐ = అయ్యి; రాజత్ = మెరిసిపోతున్న; రథ = రథముపై; ఆరూఢుడు = ఎక్కినవాడు; ఐ = అయ్యి; వెలిగెన్ = ప్రకాశించెను; దానవభర్త = రాక్షసరాజు; శైల = కొండ; శిఖర = కొనపై; ఉద్వేలత్ = మండుచున్న; దవాగ్ని = కార్చిచ్చు; ప్రభన్ = ప్రకాశముతో.

భావము:

గొప్పదానాలతో బలిచక్రవర్తి బ్రాహ్మణులను సంతోషపెట్టి వారి దీవనలు అందుకున్నాడు. పెద్దలను పూజించాడు. నిండుభక్తితో ఇలవేల్పులను పూజించాడు. నిర్మలచరిత్రుడైన ప్రహ్లాదుడిని ఆహ్వానించి ప్రణమిల్లాడు. నిగనిగలాడే రథంపై కూర్చుని కొండశిఖరాన ప్రచండంగా మండే కార్చిచ్చు వలె ప్రకాశించసాగాడు.

8-443-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దండిత మృత్యు కృతాంతులు
ఖండిత సుర సిద్ధ సాధ్య గంధర్వాదుల్
పిండిత దిశు లమరాహిత
దండాధీశ్వరులు సములు న్నుం గొలువన్.

టీకా:

దండిత = దండింపబడిన; మృత్యు = మృత్యుదేవత; కృతాంతులున్ = యమధర్మరాజుగలవారు; ఖండిత = ఓడింపబడిన; సుర = దేవతలు; సిద్ధ = సిద్ధులు; సాధ్య = సాధ్యులు; గంధర్వ = గంధర్వులు; ఆదుల్ = మున్నగువారు; పిండిత = పీడింపబడిన; దిశులు = దిక్కులుగలవారు; అమరాహిత = రాక్షస; దండాధీశ్వరులున్ = సేనానాయకులు; సములున్ = సమబలులు; తన్నున్ = తనను; కొలువన్ = సేవించుచుండగా.

భావము:

బలిచక్రవర్తి తో సమానమైన బలముగల దైత్యసేనాపతులు ఆయన ముందు వినమ్రులై నిలిచి కొలువసాగారు. వారు మృత్యు దేవతనూ, యమధర్మరాజునూ దండింప గల ఉద్దండులు. దేవతలూ, సిద్ధులూ, సాధ్యులూ, గంధర్వులూ మొదలైనవారిని భంగపరిచిన వారు. దిక్కులను ముక్కలు చేయగలవారు.

8-444-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చూపుల గగనము మ్రింగుచు
నేపున దివి భువియు నాత లీతల చేయన్
రూపించుచు దనుజేంద్రుఁడు
ప్రాపించెను దివిజనగర థము నరేంద్రా!

టీకా:

చూపులన్ = చూపులతో; గగనమున్ = ఆకశమును; మ్రింగుచున్ = కబళించుచు; ఏపునన్ = అతిశయముతో; దివిన్ = నింగిని; భువియున్ = నేలను; ఆతలీతలన్ = తలకిందులు; చేయన్ = చేయవలెనని; రూపించుచున్ = యత్నించుచు; దనుజేంద్రుడు = బలిచక్రవర్తి; ప్రాపించెను = పట్టెను; దివిజనగర = అమరావతి; పథమున్ = దారిని; నరేంద్రా = రాజా.

భావము:

పరీక్షన్మహారాజా! బలిచక్రవర్తి అతిశయించిన బలంతో తన చూపులతో ఆకాశాన్ని కబళిస్తూ, నింగినీ నేలనూ తలకిందులు చేయాలని పొంగిపడుతూ దేవతల రాజధాని అమరావతి పట్టణం దారి పట్టాడు.