పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : 14ఇంద్రసావర్ణిమనువు చరిత్ర

  •  
  •  
  •  

8-437-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"లి నంభోరుహ నేత్రుఁ డేమిటికినై పాదత్రయిన్ వేఁడె? ని
శ్చలుఁడున్ బూర్ణుఁడు లబ్ధకాముఁడు రమా సంపన్నుఁడై తాఁ బర
స్థలికిన్ దీనునిమాడ్కి నేల చనియెం? ప్పేమియున్ లేక ని
ష్కలుషున్ బంధన మేల చేసెను? వినం గౌతూహలం బయ్యెడిన్."

టీకా:

బలిని = బలిని; అంభోరుహనేత్రుడు = విష్ణువు; ఏమిటి = ఎందుల; కిన్ = కు; పాద = అడుగుల; త్రయిన = మూటిని; వేడెన్ = కోరెను; నిశ్చలుడున్ = నిర్వికారుడు; పూర్ణుడున్ = పూర్ణపురుషుడు; లబ్ధకాముడు = పరిపూర్ణ కాముడు; రమాసంపన్నుడున్ = లక్ష్మీదేవియనేడి సంపదగలవాడు; ఐ = అయిన; తాన్ = అతను; పర = ఇతరుల; స్థలి = చోటిన; కిన్ = కు; దీనుని = దరిద్రుని; మాడ్కిన్ = వలె; ఏలన్ = ఎందులకు; చనియెన్ = వెళ్ళెను; తప్పు = తప్పు; ఏమియున్ = ఏమాత్రము; లేక = లేకుండిన; నిష్కలుషున్ = పాపహీనుని; బంధనము = బంధించుట; ఏలన్ = ఎందుకని; చేసెను = చేసెను; వినన్ = వినుటకు; కౌతూహలము = కుతూహలము; అయ్యెడిన్ = కలుచున్నది.

భావము:

“బలి చక్రవర్తిని పద్మనేత్రుడైన విష్ణుమూర్తి దేనికోసం మూడడుగుల నేల యాచించాల్సి వచ్చింది? ఆయన పూర్ణపురుషుడు, పూర్ణకాముడు, నిర్వికారుడు, సంపత్కారి అయిన లక్ష్మీదేవి భర్తా కదా. అంతటి వాడు ఇలా దరిద్రుని వలె పరాయివాడు బలి వద్దకు ఎందుకు వెళ్ళాడు? ఏ తప్పూ చేయని బలిని ఎందుకు బంధించాడు? ఈ కథ వినాలని కుతూహలంగా ఉంది”