పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : 7వైవశ్వతమనువు చరిత్ర

 •  
 •  
 •  

8-411-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"రవరాధీశ! యిప్పుడు డచుచున్న
వాఁడు సప్తమ మనువు వైస్వతుండు;
శ్రాద్ధదేవుం డనందగు నవరేణ్య!
దురు నందను లతనికిఁ బ్రకట బలులు.

టీకా:

నరవరాధీశ = రాజా; ఇప్పుడు = ఇప్పుడు; నడచుచున్న = పాలించుచున్న; వాడు = అతడు; సప్తమ = ఏడవ (7); మనువు = మనువు; వైవస్వతుండు = వైవశ్వతుడు; శ్రాద్ధదేవుండు = శ్రాద్ధదేవుడు; అనన్ = అనుటకు; తగున్ = తగినవాడు; జనవరేణ్య = రాజా; పదురు = పదిమంది (10); నందనులు = పుత్రులు; అతని = అతని; కిన్ = కి; ప్రకట = ప్రసిద్ధమైన; బలులు = బలముగలవారు.

భావము:

“ఓ రాజా! ఇప్పుడు వైవస్వతుడనే ఏడవమనువు పాలిస్తున్నాడు. అతనినే శ్రాద్ధదేవుడు అంటారు. అతనికి బలవంతులైన పదిమంది కొడుకులు ఉన్నారు.

8-412-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వారలిక్ష్వాకుండును, నభగుండును, ధృష్టుండును, శర్యాతియు, నరిష్యంతుండును, నాభాగుండును, దిష్టుండును, గరూశకుండును, బృషద్ధ్రుం డును, వసుమంతుండును ననువారు పదుగురు రాజులు; పురందరుండను వా డింద్రుం; డాదిత్య మరుదశ్వి వసు రుద్ర సంజ్ఞలుఁ గలవారు దేవతలు; గౌతమ కశ్య పాత్రి విశ్వామిత్ర జమదగ్ని భరద్వాజ వసిష్ఠు లనువారు సప్తర్షులయి యున్నవారు; అందుఁ గశ్యపున కదితి గర్భంబున విష్ణుండు వామనరూపుండై జనియించి యింద్రావరజుం డయ్యె; ఇప్పు డేడు మన్వంతరంబులు చెప్పంబడియె; రాఁగల మన్వంతరంబులును శ్రీహరి పరాక్రమంబునుం జెప్పెద దత్తావధానుండవై విను" మని శుకుం డిట్లనియె.

టీకా:

వారలు = వారు; ఇక్ష్వాకుండును = ఇక్ష్వాకుడు; నభగుండును = నభగుడు; ధృష్టుండును = ధృష్టుడు; శర్యాతియున్ = శర్యాతి; నరిష్యంతుండును = నరిష్యంతుడు; నాభాగుండును = నాభాగుడు; దిష్టుండును = దిష్టుడు; కరూశకుండును = కరూశకుండు; పృషద్ద్రుండును = పృషద్ధ్రుడును; వసుమంతుడునున్ = వసుమంతుడు; అను = అనెడి; వారు = వారు; పదుగురున్ = పదిమంది (10); రాజులు = రాజులు; పురందరుండు = పురందరుడు; అను = అనెడి; వాడు = వాడు; ఇంద్రుండు = ఇంద్రుడు; ఆదిత్య = ఆదిత్యుడు; మరుత్ = మరుత్తలు; అశ్వి = అశ్వినులు; వసు = వసువులు; రుద్ర = రుద్రులు; సంజ్ఞలున్ = అనెడి పేర్లు; కల = కలిగినవారు; వారు = వారు; దేవతలు = దేవతలు; గౌతమ = గౌతముడు; కశ్యప = కశ్యపుడు; అత్రి = అత్రి; విశ్వామిత్ర = విశ్వామిత్రుడు; జమదగ్ని = జమదగ్ని; భరద్వాజ = భరద్వాజుడు; వసిష్ఠులు = వశిష్ఠుడు; అను = అనెడి; వారు = వారు; సప్త = ఏడుగురు (7); ఋషులున్ = ఋషులు; అయి = ఐ; ఉన్నవారు = ఉన్నారు; అందున్ = వారిలో; కశ్యపున్ = కశ్యపున; కున్ = కు; అదితి = అదితి; గర్భంబునన్ = కడుపులో; విష్ణుండు = నారాయణుడు; వామన = వామన (పొట్టి); రూపుండు = ఆకృతిగలవాడు; ఐ = అయ్యి; జనియించి = పుట్టి; ఇంద్రావరజుండు = ఇంద్రునితమ్ముడు; అయ్యెన్ = అయ్యెను; ఇప్పుడు = ఇప్పటికి; ఏడు = ఏడు (7); మన్వంతరంబులు = మనవుపాలనాకాలకథలు; చెప్పంబడియెన్ = చెప్పబడినవి; రాగల = రాబోవు; మన్వంతరంబులును = మన్వంతరములకథలు; శ్రీహరి = విష్ణుని; పరాక్రమంబును = పరాక్రమమునుగురించి; చెప్పెదన్ = తెలిపెదను; దత్త = లగ్నముచేసిన; అవధానుండవు = ధారణగలవాడవు; ఐ = అయ్యి; వినుము = వినుము; అని = అని; శుకుండు = శుకుడు; ఇట్లు = ఇలా; అనియె = పలికెను.

భావము:

ఆ వైవశ్వతుని పదిమంది కొడుకులూ ఇక్ష్వాకుడు, నభగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నాభాగుడు, దిష్టుడు, కరూశకుడు, వృషద్ధృడు, వసుమంతుడు అనేవారు. ఈ పదిమందీ రాజులు అయ్యారు. పురందరుడు అనేవాడు ఇంద్రుడు అయ్యాడు. ఆదిత్యులూ, మరుత్తులూ, అశ్వినులూ, వసువులూ, రుద్రులు అనేవారు దేవతలు అయ్యారు. గౌతముడూ, కశ్యపుడూ, అత్రీ, విశ్వామిత్రుడు, జమదగ్నీ, భరద్వాజుడూ, వసిష్టుడూ అనేవారు సప్త ఋషులు అయ్యారు. అందులో కశ్యపుని భార్య అయిన అదితి గర్భంలో విష్ణువు వామన రూపంలో జన్మించి, ఇంద్రునికి తమ్ముడు అయ్యాడు. ఇంతవరకూ ఏడు మన్వంతరాల కధ చెప్పాను. ఇక రాబోయే మన్వంతరాల గురించి మహవిష్ణువు పరాక్రమాన్ని గురించి చెబుతాను. శ్రద్ధగా విను.” అని శుకుడు ఇలా అన్నాడు. .