పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : హరి అసురుల శిక్షించుట

  •  
  •  
  •  

8-358-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

త్రువు నాక్షేపంబునఁ
దోత్రాహత గజము భంగిఁ ద్రుళ్ళుచు బలి నా
వృత్రారి వీచి వైచిన
గోత్రాకృతి నతఁడు నేలఁగూలె నరేంద్రా!


8-358/1-వ.
అప్పుడు.
- తంజనగరము తేవప్పెరుమాల్లయ్య వారి ప్రతి

టీకా:

శత్రువున్ = శత్రువు యొక్క; ఆక్షేపంబునన్ = దూషణములచే; తోత్రా = అంకుశముచే; హత = పొడవబడిన; గజము = ఏనుగు; భంగిన్ = వలె; త్రుళ్ళుచున్ = తుళ్ళిపడుతూ; బలిన్ = బలిని; ఆ = ఆ; వృత్రారి = ఇంద్రుడు, వజ్రాయుధము; వీచి = విసిరి; వైచినన్ = వేయగా; గోత్ర = కొండ; ఆకృతిన్ = వలె; అతడు = అతడు; నేలఁగూలెన్ = చచ్చి నేలకొరిగెను; నరేంద్రా = రాజా.

భావము:

ఓరాజా! అంకుశం దెబ్బ తిన్న ఏనుగులాగ ఇంద్రుడు త్రుళ్ళిపడ్డాడు; ఆగ్రహంతో వజ్రాయుధం విసిరి బలిని కొట్టాడు; దానితో బలిచక్రవర్తి పెద్ద పర్వతంలా మరణించి నేలపైకొరిగాడు.