పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : లక్ష్మీదేవి హరిని వరించుట

 •  
 •  
 •  

8-279-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అట్లు నిలిచి దశదిశలం బరివేష్టించి యున్న యక్ష రక్షస్సిద్ధ సాద్ధ్య దివిజ గరుడ గంధర్వ చారణ ప్రముఖ నిఖిల యూథంబులం గనుం గొని య ప్పురాణ ప్రౌఢకన్యకారత్నంబుఁ దన మనంబున నిట్లని వితర్కించె.

టీకా:

అట్లు = ఆ విధముగ; నిలిచి = ఉండి; దశదిశలన్ = దశదిక్కులవైపు; పరివేష్టించి = చుట్టుకొని; ఉన్న = ఉన్నట్టి; యక్ష = యక్షులు; రక్ష = రాక్షసులు; సిద్ధ = సిద్ధులు; సాధ్య = సాధ్యులు; దివిజ = దేవతలు; గరుడ = గరుడులు; గంధర్వ = గంధర్వులు; చారణ = చారణులు; ప్రముఖ = ముఖ్యుల; నిఖిల = సమస్తమైన; యూథంబులన్ = సమూహములను; కనుంగొని = చూసి; ఆ = ఆ; పురాణ = నిత్య; ప్రౌఢకన్యక = సౌభాగ్యవతులలో; రత్నంబున్ = శ్రేష్ఠురాలు; తన = తన యొక్క; మనంబునన్ = మనసునందు; ఇట్లు = ఈ విధముగ; అని = అని; వితర్కించెన్ = ఆలోచించెను.

భావము:

తన చుట్టూ అన్ని వైపులా పరివేష్టించి ఉన్న యక్షులు, రాక్షసులు, సిద్ధులు, సాధ్యులు, దేవతలు, గరుడులు, గంధర్వులు, చారణులు మొదలైన వారందరినీ పరికించి చూసి, వరునికై చూస్తున్న సౌభాగ్యవతి, నిండు జవరాలు, కన్యకారత్నం అయిన ఇందిర ఇలా ఆలోచించింది.

8-280-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"దువనై యుండ లవడ దొక చోట-
నొకచోట సవితితో నోర్వ రాదు
గ నొకచోట సంత వైభవంబుఁ గా-
దొకచోట వేఁడిమి నుండఁ బోల
దొకచోటఁ గరుణ లే దొక్కింత వెదకిన-
నొకచోట డగ్గఱి యుండఁ బెట్ట
నెఱయంగ నొకచోట నిలుకడ చాలదు-
ర్చింప నొకచోట డత గలదు

8-280.1-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కొన్నిచోట్ల కామగుణ గరిష్ఠంబులు
క్రోధ సంయుతములుఁ గొన్ని యెడలు
గొన్ని మోహలోభకుంఠితంబులుఁ గొన్ని
ప్రమద మత్సరాను భావకములు."

టీకా:

ఐదువన్ = ముత్తైదువను; ఐ = అయ్యి; ఉండన్ = ఉండుట; అలవడదు = వీలుండదు; ఒకచోట = ఒకచోట; ఒకచోట = ఒకచోట; సవితి = సపత్ని; తోన్ = తోటి; ఓర్వన్ = భరింప; రాదు = వీలుకాదు; తగన్ = తగ; ఒకచోట = ఒకచోట; సంతత = శాశ్వతమైన; వైభవంబున్ = వైభవములుగలది; కాదు = కాదు; ఒకచోట = ఒకచోట; వేడిమిన్ = వేడివలన; ఉండన్ = ఉండుటకు; పోలదు = సాధ్యముకాదు; ఒకచోట = ఒకచోట; కరుణ = దయ; లేదు = లేదు; ఒక్కింతన్ = కొంచముకూడ; వెదకినన్ = వెతికిచూసిన; ఒకచోట = ఒకచోట; డగ్గఱి = దగ్గరచేరి; ఉండన్ = ఉండి; బెట్టన్ = పోవుటకు; ఎఱయంగ = తెలిసికొన; ఒకచోట = ఒకచోట; నిలుకడ = స్థిరత్వము; చాలదు = సరిపోదు; చర్చింపన్ = తరచిచూసినచో; ఒకచోట = ఒకచోట; జడత = అధికమైనజడత్వము; కలదు = ఉన్నది.
కొన్ని = కొన్ని; చోట్లన్ = చోటులలో; కామగుణ = కామగుణ; గరిష్టంబులు = ప్రబలముగాగలవి; క్రోధ = కోపముతో; సంయుతములున్ = కూడినవి; కొన్ని = కొన్ని; ఎడలు = చోట్లు; కొన్ని = కొన్ని; మోహ = మోహము; లోభ = లోభములతో; అకుంఠితంబులున్ = అధికముగాగలవి; కొన్ని = కొన్ని; ప్రమద = అధికగర్వము; మత్సర = మాత్సర్యముల; అనుభావకములు = ప్రభావములుగలవి.

భావము:

ఒకచోట పునిస్త్రీగా ఉండటానికి వీలుండదు. (మన్మథుడు విగతదేహుడు). ఒకచోట సవతి వల్ల ఓర్చుకోడం కష్టం. (శివుడు అర్థనారీశ్వరుడు). ఒక చోట వైభవం స్థిరంగా ఉండదు. (ఇంద్రుడికి రాక్షసులతో యుద్ధాలు ఓడటం). ఒకచోట తాపం భరించలేము. (సూర్యుడు). ఒకచోట ఎంత వెతికినా దయ కనిపించదు. (యముడు). ఒకచోట దగ్గరగా ఉండలేము. (అగ్ని), ఒకచోట నిలకడలేదు. (వాయుదేవుడు). ఒకచోట జడత్వం ఎక్కువ. (వరుణుడు). కొన్ని చోట్ల కామగుణం ప్రబలంగా ఉంటుంది. (గంధర్వులు). కొన్ని చోట్లు క్రోధపూరితములు. (రుద్రుడు). కొన్నిచోట్ల మోహము లోభము నిండిన మొరటుదనం ఉంటుంది. కొన్ని చోట్ల గర్వము, మచ్చరము కూడి ఉంటాయి. (రాక్షసులు). అని లక్ష్మీదేవి అక్కడ ఉన్న గొప్పవారిని తరచి చూసి భావిస్తున్నది.
ఈ పద్యంలో జాలువారుతున్న కవితాధార, దానికి తగ్గ తేనెకన్నా మధురమైన శైలి, శైలితో నిండుగా పాత్రపోషణ ఎంతో చక్కగా సహజ అలంకారంగా అమరాయి.

8-281-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అని సకల సత్పురుష జనన వర్తనంబులు మానసించి పరిహరించి.

టీకా:

అని = అని; సకల = సర్వ; సత్పురుష = మంచివారి; జననవర్తనంబులు = నడవడికలు; మానసించి = ఆలోచించి; పరిహరించి = విడనాడి.

భావము:

అలా అక్కడ ఉన్న గొప్పవారందరి నడవడికల గురించి భావించుకొని వారి సంగతి వదలివేసి. . . .

8-282-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"మర ముత్తైదువనై యుండ వచ్చును-
రుసకు సవతు లెవ్వరును లేరు
వెలయంగ నశ్రాంత విభవ మీతని యిల్లు-
శృంగార చందన శీతలుండు
లఁగఁ డెన్నఁడు శుద్ధకారుణ్యమయమూర్తి-
విమలుండు గదిసి సేవింప వచ్చు
నెఱి నాడి తిరుగఁడు నిలుకడఁ గలవాఁడు-
కల కార్యములందు డత లేదు;

8-282.1-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

సాధురక్షకుండు డ్వర్గ రహితుండు
నాథుఁ డయ్యె నేని డప నోపు
నితఁడె భర్త" యనుచు నింతి సరోజాక్షుఁ
బుష్ప దామకమునఁ బూజచేసె.

టీకా:

అమరన్ = చక్కగా; ముత్తైదువన్ = సౌభాగ్యవతిగా; ఐ = ఉండి; ఉండవచ్చున్ = ఉండవీలగును; వరుస = బాంధవ్యవరుస; కున్ = కు; సవతులు = సపత్నులు; ఎవ్వరున్ = ఎవరుకూడా; లేరు = లేరు; వెలయంగన్ = ప్రసిద్ధముగ; అశ్రాంత = ఎడతెగని; విభవము = వైభవములుగలది; ఈతని = ఇతని యొక్క; ఇల్లు = నివాసము; శృంగార = సౌందర్యవంతమైన; చందన = మంచిగంధమువలె; శీతలుండు = చల్లనివాడు; కలగడు = కలతచెందడు; ఎన్నడున్ = ఎప్పుడును; శుద్ధ = నిర్మలమైన; కారుణ్య = దయ; మయ = కలిగిన; మూర్తి = స్వరూపుడు; విమలుండు = స్వచ్ఛమైనవాడు; కదిసి = చేరి; సేవింప = కొలచుటకు; వచ్చున్ = వీలగును; నెఱిన్ = నిండుగా; ఆడి = పలికినమాట; తిరుగడు = తప్పడు; నిలుకడ = స్థిరత్వము; కల = కలగిన; వాడు = వాడు; సకల = సమస్తమైన; కార్యములు = కార్యక్రమముల; అందున్ = ఎడల; జడత = అలసత్వము; లేదు = లేదు.
సాధు = సజ్జనులను; రక్షకుండు = రక్షించెడివాడు; షడ్వర్గ = కామాది; రహితుండు = లేనివాడు; నాథుడు = పతి; అయ్యెనేని = అయినచో; నడపన్ = చక్కగావర్తించ; ఓపున్ = వీలగును; ఇతడె = ఇతడుమాత్రమే; భర్త = (నా) పతి; అనుచున్ = అనుచు; ఇంతి = స్త్రీ; సరోజాక్షున్ = విష్ణుమూర్తిని; పుష్ప = పూల; దామకమునన్ = మాలతో; పూజ = సత్కరించుట; చేసెన్ = చేసెను.

భావము:

విష్ణుమూర్తిని నచ్చుకుంటూ ఇలా అనుకుంది. “విష్ణువు (శాశ్వతుడు కనుక) దగ్గర అయితే (నిత్య) సౌభాగ్యవతిగా ఉండవచ్చు, వంతుకు వచ్చే సవతులు లేరు, ఇతని ఇల్లు ఎడతెగని సంపదలకు నిలయం. ఇతడు అందగాడు, చందనం వలె చల్లని వాడు. ఎప్పుడూ కలత చెందడు. దయామయుడు, నిర్మలమైన వాడు. ఇతనిని చేరి సేవించవచ్చు. ఆడినమాట తప్పడు. స్థిరత్వం కలవాడు, ఏ పనిలోనూ ఆలస్యం లేని వాడు. సజ్జనులను కాపాడే వాడు, కామం, క్రోధం మొదలైన చెడ్డగుణాలు లేని వాడు”. “ఇతడు నాకు తగిన భర్త” అని నిశ్చయించుకుంది. పద్మాలవంటి కన్నులు గల విష్ణుమూర్తి మెడలో పూలమాల వేసి వరించింది.

8-283-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇందీవర దామమున ము
కుందునిఁ బూజించి తనకుఁ గూడి వసింపన్
మందిరముగఁ దద్వక్షము
నందంద సలజ్జదృష్టి నాలోకించెన్.

టీకా:

ఇందీవర = కలువల; దామమునన్ = దండతో; ముకుందుని = విష్ణుని; పూజించి = సత్కరించి; తన = తన; కున్ = కు; కూడి = చేరి; వసింపన్ = ఉండుటకు; మందిరముగన్ = నివాసముగా; తత్ = అతని; వక్షమున్ = వక్షస్థలమును; అందంద = మరీమరీ; సలజ్జన్ = సిగ్గుతోకూడిన; దృష్టిన్ = చూపులతో; ఆలోకించెను = చూసెను.

భావము:

లక్ష్మీదేవి కలువ పూలమాలతో మోక్షదాయకుడైన విష్ణువును వరించింది. తాను చేరి నివసించడానికి ఆయన వక్షస్థలాన్ని ఎన్నుకొని, సిగ్గుతో కూడిన చూపులతో మరీ మరీ చూసింది.

8-284-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మోహరుచుల వలన ముద్దియ దల యెత్తు
సిగ్గువలన బాల శిరము వంచు
నింతి వెఱపు వలన నెత్తదు వంపదు
నదు ముఖము ప్రాణయితుఁ జూచి.

టీకా:

మోహ = మిక్కిలిప్రేమ; రుచుల = ఇచ్చల; వలన = వలన; ముద్దియ = అందగత్తె; తల = తలను; ఎత్తున్ = ఎత్తును; సిగ్గు = లజ్జ; వలన = వలన; బాల = పిల్ల; శిరము = తలను; వంచున్ = దించును; ఇంతి = స్త్రీ; వెఱపు = బెరకు; వలన = వలన; ఎత్తదు = పైకెత్తదు; వంపదు = కిందకిదింపదు; తనదు = తన యొక్క; ముఖమున్ = మోమును; ప్రాణ = ప్రాణముతో సమానమైన; దయితున్ = ప్రియుని; చూచి = చూసి.

భావము:

ఇందిర పెల్లుబికిన ప్రేమతో తల ఎత్తింది. కానీ మొలకలెత్తిన సిగ్గుతో తల వంచింది. తన ప్రాణవల్లభుడైన విష్ణుని చూడడం వలన కలిగిన తొట్రుపాటు వలన ఆమె మోము ఎత్తనూ ఎత్తదు, దించనూ దించదు.

8-285-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రి చూచిన సిరి చూడదు
సిరి చూచిన హరియుఁ జూఁడ సిగ్గును బొందున్
రియును సిరియునుఁ దమలో
రిఁజూపులఁజూడ మరుఁడు సందడి పెట్టెన్.

టీకా:

హరి = విష్ణుమూర్తి; చూచినన్ = చూసినచో; సిరి = లక్ష్మీదేవి; చూడదు = చూడదు; సిరి = శ్రీదేవి; చూచినన్ = చూసినచో; హరియున్ = విష్ణువు; చూడన్ = చూచుటకు; సిగ్గునున్ = లజ్జను; పొందును = చెందును; హరియును = విష్ణువు; సిరియునున్ = శ్రీదేవి; తమలోన్ = వారిలోవారు; సరిచూపులన్ = సమానచూపులతో; చూడన్ = చూచుచుండగ; మరుడు = మన్మథుడు; సందడి = తొందర; పెట్టెన్ = పెట్టెను.

భావము:

విష్ణుమూర్తి తన కేసి చూస్తే లక్ష్మి చూసేది కాదు. లక్ష్మీదేవి తనని చూస్తే విష్ణువు చూడటానికి సిగ్గు పడేవాడు. లక్ష్మీ విష్ణువు ఒకరినొకరు సరిసమానంగా చూసుకునేలా మన్మథుడు తొందరలు పెట్టాడు.

8-286-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ముల తండ్రియై తనరు శౌరి జగంబుల తల్లి నిందిరం
నురమందుఁ దాల్చె; నటఁ త్కరుణారసదృష్టిచేఁ బ్రజల్
గుడఁగఁ దొంటి భంగి నతిమంగళసాధ్వి పతిత్వసంపదన్
నెడిన లోకముల్ గని; రనేక శుభంబులఁ బొంది రత్తఱిన్.

టీకా:

జగముల = లోకములకు; తండ్రి = తండ్రి; ఐ = అయ్యి; తనరు = అతిశయించెడి; శౌరి = విష్ణువు; జగంబుల = లోకములకు; తల్లిన్ = అమ్మను; ఇందిరన్ = లక్ష్మీదేవిని; తగన్ = పూని; ఉరము = వక్షస్థలము; అందున్ = అందు; తాల్చెన్ = ధరించెను; అటన్ = అక్కడ; తత్ = ఆమె; కరుణా = దయా; రస = రసముగల; దృష్టి = చూపు; చేన్ = వలన; ప్రజల్ = లోకులు; మగుడగన్ = మరల; తొంటి = పూర్వము; భంగిన్ = వలెనె; అతి = మిక్కిలి; మంగళ = శుభకరమైన; సాధ్వి = పుణ్య స్త్రీ; పతిత్వ = పతివ్రత; సంపదన్ = సంపదయందు; నెగడిన = అతిశయించిన; లోకముల్ = లోకములు; కనిరి = చూసిరి; అనేక = అనేకమైన; శుభంబులన్ = శుభములను; పొందిరి = పొందిరి; ఆ = ఆ; తఱిన్ = సమయము నందు.

భావము:

లోకాలకు తండ్రి అయిన విష్ణుమూర్తి, లోకాల తల్లి అయిన లక్ష్మీదేవిని తన వక్షస్థలమునందు చేర్చుకున్నాడు. అప్పుడు ఆమె కరుణారస పూరిత చూపుల వలన ప్రజలు ఎన్నో శుభాలను పొందారు. అటువంటి మహా మంగళకరమైన ఆ సాధ్వీమణి పూర్వం వలె భర్తతో చేరిన పుణ్య సంపద వలన లోకాలు పెంపొందాయి.

8-287-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అటమున్న యబ్ధిరాజు దనయందు నున్న యమూల్యంబైన కౌస్తుభంబు పేరిటి యనర్ఘ మణిరాజంబు నయ్యంబుజాక్షునకు సమర్పించిన దానిం దన వక్షస్థలంబున ధరియించె; నప్పు డయ్యాదిలక్ష్మియు శ్రీవత్స కౌస్తుభ వైజయంతీవనమాలికా తారహారాద్యలంకృతంబైన పుండరీకాక్షు వక్షంస్థలంబున వసియించె నయ్యవసరంబున.

టీకా:

అట = అంతకు; మున్న = ముందు; అబ్ధిరాజు = సముద్రుడు; తన = తన; అందున్ = లో; ఉన్న = ఉన్నట్టి; అమూల్యంబు = వెలలేనిది; ఐన = అయిన; కౌస్తుభంబున్ = కౌస్తుభము; పేరిటి = అనెడి పేరుగల; అనర్ఘ = అమూల్యమైన; మణి = రత్నములలో; రాజంబున్ = శ్రేష్ఠమైనదానిని; ఆ = ఆ; అంబుజాక్షున్ = విష్ణుని; కున్ = కి; సమర్పించినన్ = కానుకగా ఇవ్వగా; దానిన్ = దానిని; తన = తన; వక్షస్థలంబునన్ = గుండెలపైన; ధరియించెన్ = ధరించెను; అప్పుడు = అప్పుడు; ఆ = ఆ; ఆదిలక్ష్మియున్ = లక్ష్మీదేవి కూడ; శ్రీవత్స = శ్రీవత్స; కౌస్తుభ = కౌస్తుభ; వైజయంతీ = వైజయంతి యనెడి; వనమాలిక = మాల; తారాహార = ముత్యాలహారము; ఆది = మొదలైనవానిచే; అలంకృతంబు = అలంకరింపబడినది; ఐన = అయిన; పుండరీకాక్షు = విష్ణుని; వక్షస్థలంబునన్ = ఎదపైన; వసియించెన్ = ఉండెను; ఆ = ఆ; అవసరంబునన్ = సమయములో.

భావము:

ఇలా లక్ష్మీదేవి వరించి విష్ణువును చేరబోతున్న సమయంలో, కడలిరాజు అయిన సాగరుడు, అల్లుడైన విష్ణుమూర్తికి తనలో ఉన్నట్టి కౌస్తుభం అనే అమూల్యమైన రత్నాన్ని కానుకగా ఇచ్చాడు. దానిని తన వక్షస్థలం మీద విష్ణువు ధరించాడు. అప్పుడు ఆ ఆదిలక్ష్మి శ్రీవత్సము, కౌస్తుభము, వైజయంతిమాల, ముత్యాలహారము మొదలైన విభూషణాలతో భూషితమైన ఆ పద్మనయనుడైన శ్రీమహావిష్ణువు ఎదపై నివసించింది. అప్పుడు...

8-288-శా.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మ్రోసెన్ శంఖ మృదంగ వేణురవముల్ మున్నాడి; పెంజీఁకటుల్
వాసెన్; నర్తన గాన లీలల సురల్ భాసిల్లి; రార్యుల్ జగ
ద్వాసుల్ విష్ణుని బ్రహ్మ రుద్ర ముఖరుల్ ల్లింగమంత్రంబులం
బ్రాక్తిన్ వినుతించి రుల్లసిత పుష్పశ్రేణి వర్షించుచున్.

టీకా:

మ్రోసెన్ = మోగినవి; శంఖ = శంఖముల; మృదంగ = మృదంగముల; వేణు = పిల్లనగ్రోవుల; రవముల్ = శబ్దములు; మున్నాడి = ముందుగా; పెంజీకటుల్ = పెను చీకట్లు; వాసెన్ = తొలగిపోయినవి; నర్తన = నాట్యములు; గాన = సంగీత; లీలలన్ = క్రీడలను; సురల్ = దేవతలు; భాసిల్లిరి = విలసిల్లిరి; ఆర్యుల్ = పూజ్యులు; జగత్ = లోకములలోని; వాసుల్ = జనులు; విష్ణుని = హరిని; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; రుద్ర = శంకరుడు; ముఖరుల్ = మున్నగువారు; తత్ = అతని; లింగ = అవ్యక్తప్రకృతిని; మంత్రంబులన్ = మంత్రములతో; ప్రాసక్తిన్ = ప్రస్తావించుచు; వినుతించిరి = స్తోత్రముచేసిరి; ఉల్లసిత = ప్రకాశితములగు; పుష్ప = పూల; శ్రేణిన్ = ధారలను; వర్షించుచున్ = కురిపించుచు.

భావము:

లక్ష్మీదేవి నారాయణుని చేరిన కల్యాణ సమయంలో, ముందు శంఖ, మృదంగ ధ్వానాలు, మురళీరవాలు మ్రోగాయి. పెనుచీకట్లు తొలగిపోయాయి. ఆటపాటల వేడుకలతో దేవతలు విలసిల్లారు. సర్వలోక పూజ్యులు, బ్రహ్మాది దేవతలు విష్ణునామాంకితాలైన మంత్రాలతో స్తోత్రాలు చేశారు.

8-289-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

పాలవెల్లి కూఁతురు
దీపుల చూపులను దోఁగి తిలకింపఁ బ్రజల్
చేట్టిరి సంపదలనుఁ;
బ్రాపించెను మేలు; జగము బ్రతికె నరేంద్రా!

టీకా:

ఆ = ఆ; పాలవెల్లికూతురున్ = లక్ష్మీదేవి; తీపుల = మాధుర్యముల; చూపులన్ = చూపులందు; తోగి = తడిపి; తిలకింపన్ = చూడగా; ప్రజల్ = లోకులు; చేపట్టిరి = పొందిరి; సంపదలన్ = సంపదలను; ప్రాపించెను = సమకూరెను; మేలు = శుభములు; జగమున్ = భువనములు; బ్రతికెన్ = సుస్థితినిపొందినవి; నరేంద్రా = రాజా.

భావము:

పరీక్షిన్మహారాజా! ఆ సముద్ర రాజపుత్రి లక్ష్మీదేవి చల్లని చూపులతో తియ్యగా చూసింది. ప్రజలకు సంపదలు చేకూరాయి, శుభాలు సమకూరాయి. జగత్తు సుఖజీవనంతో జీవించింది.

8-290-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

పాలేటి రాచకన్నియ
మే లారెడు చూపులేక మిడు మిడు కంచున్
జాలిం బురపురఁ బొక్కుచుఁ
దూలిరి రక్కసులు కీడు దోఁచిన నధిపా!

టీకా:

పాలేటిరాచకన్నియ = లక్ష్మీదేవి; మేలారెడు = మేలుకలిగించెడి; చూపు = దృష్టి; లేక = లేకపోవుటచేత; మిడుమిడుకు = మిడుకుమిడుకు; అంచున్ = అనుచు; జాలిన్ = విచారముతో; పురపురన్ = పురపురమని; పొక్కుచున్ = దుఃఖించుచు; తూలిరి = చిన్నబోయిరి; రక్కసులున్ = రాక్షసులు; కీడు = అశుభములు; తోచినన్ = ఉదయించగా; అధిపా = రాజా.

భావము:

ఓ రాజా! పరీక్షిత్తూ! క్షీరసాగర రాకుమారి అయిన మహాలక్ష్మి శుభకరమైన చూపులు కరువై రాక్షసులు పరితపించారు. విచారంతో తహ తహ లాడుతూ, జాలితో బుడబుడ దుఃఖించారు. వారికి కీడు తోచి తూలిపోయారు.