పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : సురలు బ్రహ్మ శరణు జొచ్చుట

 •  
 •  
 •  

8-146-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"కసిమఁసగి యసుర విసరము
సి లతికల సురల నెగవ సువులు వెడలం
సఁ జెడిరి; పడిరి; కెడసిరి
మ సమర విలసనముల సమెడలి నృపా!

టీకా:

కసిమసగి = విజృంభించి; అసుర = రాక్షసుల; విసరములు = సమూహములు; అసి = కత్తుల; లతికలన్ = వరుసలతో; సురలన్ = దేవతలను; ఎగవన్ = మించుతుండ; అసువులు = ప్రాణములు; వెడలన్ = పోవుచుండగ; పస = బలము; చెడిరి = తగ్గినవారై; పడిరి = పడిపోయిరి; కెడసిరి = మరణించిరి; అసమ = సమముకాని; సమర = యుద్ధములు; విలసనములన్ = క్రీడలతో; అసము = దర్పము; ఎడలి = వికలములై; నృపా = రాజా.

భావము:

“రాజా పరీక్షిత్తూ! రాక్షస మూకలు విజృంభించి ఆయుధాలు ధరించి దేవతలను మించి గట్టి యుద్ధాలు చేశారు. దేవతల బలం తగ్గి, సామర్థ్యాలలో తేడాలు గల ఆ యుద్ధాలలో అనేక ఇక్కట్ల పాలై, ప్రాణాలు అరచేతులలో పెట్టుకుని, శత్రువులను లొంగదీసుకునే ఉపాయం తెలియక తల్లడిల్లిపోయారు.

8-147-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

సుపతి వరుణాదులతో
సుముఖ్యులు గొంద ఱరిగి సురశైలముపై
సునుతుఁడగు నజుఁ గని యా
సు దుష్కృతిఁ జెప్పి రపుడు సొలయుచు నతులై.

టీకా:

సురపతి = ఇంద్రుడు {సురపతి - సుర (దేవతల) పతి (ప్రభువు), ఇంద్రుడు}; వరుణ = వరుణుడు {వరుణుడు - జనులచే వరములు కోరబడువాడు - పడమటి వేలుపు}; ఆదులు = మున్నుదువారి; తోన్ = తోటి; సుర = దేవతలలో; ముఖ్యులు = ముఖ్యమైనవారు; కొందఱున్ = కొంతమంది; అరిగి = వెళ్ళి; సురశైలమున్ = మేరుపర్వతము; పైన్ = మీది; సుర = దేవతలచే; నుతుడు = స్తుతింపబడువాడు; అగు = అయిన; అజున్ = బ్రహ్మ దేవుని {అజుడు - జన్మములేనివాడు, బ్రహ్మ}; కని = దర్శించి; ఆసుర = రాక్షసుల యొక్క; దుష్కృతిన్ = దుండగములను; చెప్పిరి = చెప్పిరి; అపుడు = అప్పుడు; సొలయుచున్ = సోలిపోతూ; నతులు = స్తుతించువారు; ఐ = అయ్యి.

భావము:

అలాంటి యుద్ధాల సందర్భంలో, వరుణుడు మున్నగు దేవతా ప్రముఖులతో కూడి, దేవేంద్రుడు మేరుపర్వతానికి వెళ్లాడు. అక్కడ దేవతలకు పెద్ద అయిన బ్రహ్మదేవుని దర్శించి నమస్కారం చేసాడు. దేవతలు అందరూ ఆయనకు రాక్షసుల దురాగతాలను ఇలా వివరించారు.

8-148-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

దుర్వాసు శాపవశమున
నిర్వీర్యత జగము లెల్ల నిశ్శ్రీకములై
ర్వతరిపుతోఁ గూడ న
ర్వము లయి యుండె హతసుర్వావళులై.


8-148/1-వ.
అప్పుడు.
- తంజనగరము తేవప్పెరుమాల్లయ్య వారి ప్రతి

టీకా:

దుర్వాసు = దుర్వాసుని {దుర్వాసుడు - ఒకముని}; శాప = శాపము; వశమున = వలన; నిర్వీర్యతన్ = నిర్వీర్యమువలన; జగములు = భువనములు; ఎల్లన్ = సర్వమును; నిశ్శ్రీకములు = శుభములులేనివి {నిశ్శ్రీకములు - శ్రీకములు (శుభములు) లేనివి}; ఐ = అయ్యి; పర్వతరిపు = ఇంద్రుని {పర్వతరిపుడు - పర్వతముల శత్రువు (వాటి రెక్కలు వజ్రాముతో ఖండించుట చేత), ఇంద్రుడు}; తోన్ = తో; కూడన్ = కలిసి; అపర్వములు = వేడుకలులేనివారు; అయి = అయ్యి; ఉండె = ఉండెను; హత = దెబ్బతిన్న; సుపర్వా = దేవతల; ఆవళుల్ = సమూహములు; ఐ = అయ్యి.

భావము:

“దుర్వాసుడి శాపం వలన లోకాలు అన్నీ పౌరుషమూ వైభవమూ కోల్పోయాయి. ఇంద్రుడితో సహా అన్ని లోకాల వారూ ఓడిపోయారు. పండుగలు అంతరించాయి.”
గమనిక – గ్రంథాంతరంలోని విషయం. పూర్వం ఒకమారు దుర్వాస మహర్షి స్వర్గలోకానికి వచ్చినప్పుడు, దేవతాస్తీలు ఆయనకు దివ్యమైన పూలమాల బహూకరించారు. దుర్వాసుడు దానిని, ఐరావతంపై సంచారం చేస్తున్న దేవేంద్రునికి బహూకరించాడు. ఇంద్రుడు దానిని ఐరావతం కుంభస్థలంమీద వేసాడు. ఐరావతం ఆ దివ్యమాలను తొండంతో నేలమీద వేసి, కాలితో తొక్కుకుంటూ వెళ్ళసాగింది. ఇది గమనించిన దుర్వాసమహర్షి, ఇంద్రుని అతని పాలనలో ఉన్న వారందరిని “నిర్వీర్యు లగు గాక” అని శపించాడు.

8-149-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నెలవు వెడలి వచ్చి నిస్తేజులై నట్టి
వేల్పుగములఁ జూచి వేల్పుఁ బెద్ద
రమపురుషుఁ దలఁచి ప్రణతుఁడై సంఫుల్ల
ద్మవదనుఁ డగుచుఁ లికెఁ దెలియ.

టీకా:

నెలవు = ఇల్లువాకిలి; వెడలి = వదలి; వచ్చి = వచ్చి; నిస్తేజులు = కాంతివిహీనులు; ఐనట్టి = అయినటువంటి; వేల్పు = దేవతల; గములన్ = సమూహములను; చూచి = చూసి; వేల్పు = దేవతల; పెద్ద = నాయకుడు; పరమపురుషున్ = హరిని; తలచి = స్మరించి; ప్రణతుడు = నమస్కరించినవాడు; ఐ = అయ్యి; సంఫుల్ల = పూర్తిగా వికసించిన; పద్మ = పద్మమువంటి; వదనుడు = ముఖముగలవాడు; అగుచున్ = అగుచు; పలికెన్ = చెప్పెను; తెలియ = తెలియునట్లు.

భావము:

తమ ఇల్లూ, వాకిలీ విడిచిపెట్టి కాంతి విహీనులు అయి తన వద్దకు వచ్చిన దేవతలను బ్రహ్మదేవుడు చూశాడు. పరమాత్మకు నమస్కరించి, ధ్యానం చేసాడు. తరువాత వికసించిన ముఖకమలంతో ఇలా అన్నాడు.

8-150-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"ఏనును మీరును గాలము
మావ తిర్యగ్లతా ద్రు స్వేదజముల్
మానుగ నెవ్వని కళలము
వానికి మ్రొక్కెదముగాక గవఁగ నేలా?

టీకా:

ఏనును = నేను; మీరును = మీరు; కాలము = కాలము; మానవ = నరులు; తిర్యక్ = జంతువులు; లతా = లతలు; ద్రుమ = చెట్లు; స్వేదజములు = సూక్షజీవులు {స్వేదజము - స్వేదమునుండి పుట్టునవి, పురుగులోనగునవి}; మానుగన్ = చక్కగ; ఎవ్వని = ఎవనియొక్క; కళలమున్ = అంశలమో; వాని = అతని; కిన్ = కి; మ్రొక్కెదముగాక = మొరపెట్టుకొనెదముగాక; వగవన్ = శోకించుట; ఏలా = ఎందుకు.

భావము:

“నాకూ, మీకూ, కాలానికీ, మానవులకూ, పశువులకూ, పక్షులకూ, చెట్లకూ, తీగలకూ, చెమటతో పుట్టే అల్పజీవులకూ, మూలపురుషుడు భగవంతుడు. అతనిని మనము శరణు వేడుదాము. మీరు దుఃఖపడకండి.

8-151-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ధ్యుండు రక్షణీయుఁడు
సాధ్యుఁడు మాన్యుఁడని లేక ర్గత్రాణా
ధ్యాదు లొనర్చు నతం
డాధ్యంత విధానమునకు ర్హుఁడు మనకున్.

టీకా:

వధ్యుండు = వధింపదగినవాడు; రక్షణీయుడు = కాపాడదగినవాడు; సాధ్యుడు = దండింపదగినవాడు; మాన్యుడు = మన్నింపదగినవాడు; అని = అని; లేక = లేకుండగ; సర్గ = సృష్టించుట; త్రాణ = కాపాడుట; వధ్య = సంహరించుట; ఆదులు = మున్నగునవి; ఒనర్చు = చేసెడి; అతండు = అతడు; ఆధి = మనోవ్యధలను; అంత = హరింప; విధానమున్ = చేయుట; కున్ = కి; అర్హుడు = తగినవాడు; మన = మన; కున్ = కు.

భావము:

భగవంతుడికి చంపదగినవాడు, కాపాడదగినవాడు, కష్టపెట్టదగినవాడు, గౌరవించదగినవాడు అనే తారతమ్య భేదం లేదు. సృష్టిని రక్షించడానికి, నాశనం చేయడానికి అతడే కర్త. అటువంటి భగవంతుడే మన మనోవ్యథలు పోగొట్టేవాడు. మనకు ఎల్లప్పుడూ ఆధారమైన వాడు.

8-152-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

దునిఁ బరము జగద్గురు
రుణాపరతంత్రు మనము నుఁగొన దుఃఖ
జ్వములు చెడు" నని సురలకు
సిజజని చెప్పి, యజితు దనంబునకున్.

టీకా:

వరదుని = వరాలిచ్చెడివానిని; పరమున్ = పరమాత్ముని; జగద్గురున్ = లోకాలనుకాపాడువాడు {గురువు - 1ఉపాధ్యాయుడు 2బృహస్పతి 3కులముపెద్ద 4తండ్రి 5తండ్రితోడబుట్టినవాడు 6తాత 7అన్న 8మామ 9మేనమామ 10రాజు 11కాపాడువాడు}; కరుణాపరతంత్రున్ = కృపావశీకరుని; మనమున్ = మనమందరము; కనుగొనన్ = దర్శించినచో; దుఃఖ = శోకములు; జ్వరములున్ = బాధలు; చెడును = నశించును; అని = అని; సురల్ = దేవతల; కున్ = కు; సరసిజజని = బ్రహ్మదేవుడు {సరసిజజని - సరసిజ (పద్మము)నందు జని (పుట్టినవాడు), బ్రహ్మ}; చెప్పి = తెలియజెప్పి; అజితుసదనంబున్ = వైకుంఠమున {అజితుసదనము - అజితు (జయింపరాని వాడు, విష్ణువు) యొక్క సదనము (నివాసము), వైకుంఠము}; కున్ = కు.

భావము:

వరాలు ఇచ్చే వాడు, పరమాత్ముడూ, సకల లోకాలకు తండ్రి, దయామయుడు అయిన ఆ స్వామిని దర్శనం చేసుకుంటే, మన దుఃఖాలు, బాధలూ అన్నీ దూరం అవుతాయి.” అని చెప్పి, బ్రహ్మదేవుడు వేగంగా అజితుడైన ఆ భగవానుని స్థానానికి వెళ్ళాడు.