పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : విష్ణువు ఆగమనము

  •  
  •  
  •  

8-103-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

డిగెద నని కడువడిఁ జను;
డిగినఁ దను మగుడ నుడుగఁ ని నడ యుడుగున్;
వెవెడ సిడిముడి తడఁబడ
డు గిడు; నడుగిడదు జడిమ డు గిడునెడలన్.

టీకా:

అడిగెదన్ = అడిగెదను; అని = అని; కడు = మిక్కిలి; వడిన్ = వేగముగ; చనున్ = వెళ్ళును; అడిగినన్ = అడిగినప్పటికిని; తను = అతను; మగుడ = మారుపలుకులు; నుడుగడు = పలుకడు; అని = అని; నడన్ = నడచుట; ఉడుగును = విరమించును; వెడవెడ = తొట్రుపడుతూ; సిడిముడిని = చీకాకుతో; తడబడన్ = తడబడుతూ; అడుగు = అడుగు; ఇడున్ = వేయును; అడుగున్ = అడుగు; ఇడదు = వేయదు; జడిమన్ = జడత్వముతో; అడుగున్ = అడుగులను; ఇడు = వేసెడి; ఎడలన్ = సమయములలో.

భావము:

పద్యం నడకలోనే తడబాటును రకరకాలుగా చూపిన బహు చక్కని ఆణిముత్యమిది.
అప్పుడు లక్ష్మీదేవి భర్తను అడుగుదామని వేగంగా అడుగులు వేసేది. అడిగితే మారు పలుకడేమో అని అడుగుల వేగం తగ్గించేది. చీకాకుతో తొట్రుపాటుతో అడుగులు వేసేది. మళ్ళీ ఆగేది. అడుగులు కదిలించలేక తడబాటుతో నడిచేది.
ఈ పద్యం చూస్తున్నామా? వింటున్నామా? చదువుతున్నామా? అనిపిస్తుంది.సందర్భానికి తగిన పలుకుల నడకలు. భావాన్ని స్ఫురింపజేసే పద ధ్వని. ఇంకా ఆపైన సందర్భశుద్ధికేమో బహు అరుదైన సర్వలఘు కందపద్యం ప్రయోగం. ఆహా ఏమి పద్యం!కాదు అమృత గుళిక.