పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : గజేంద్రుని దీనాలాపములు

 •  
 •  
 •  

8-87-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

లుగఁడే నాపాలిలిమి సందేహింపఁ-
లిమిలేములు లేకఁ లుగువాఁడు?
నా కడ్డపడ రాఁడె లి నసాధువులచేఁ-
డిన సాధుల కడ్డడెడువాఁడు?
చూడఁడే నా పాటుఁ జూపులఁ జూడకఁ-
జూచువారలఁ గృపఁ జూచువాఁడు?
లీలతో నా మొఱాలింపఁడే మొఱఁగుల-
మొఱ లెఱుంగుచుఁ దన్ను మొఱగువాఁడు?

8-87.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఖిల రూపముల్ దనరూప మైనవాఁడు
దిమధ్యాంతములు లేక డరువాఁడు
క్తజనముల దీనుల పాలివాఁడు
వినఁడె? చూడఁడె? తలఁపడె? వేగ రాఁడె?

టీకా:

కలుగడే = సహాయముగా రాడేమి; నా = నా; పాలిన్ = విషయములో; కలిమి = ఉండుటను; సందేహింపన్ = అనుమానించను; కలిమి = సంపద కలుగుట; లేములు = పేదరికములు; లేకన్ = చూడక; కలుగు = సహాయపడెడి; వాడు = వాడు; నాకున్ = నా యాపదకు; అడ్డపడన్ = సహాయపడుటకు; రాడె = రాడా యేమి; నలిన్ = అధికముగ; అసాధువుల్ = దుర్జనుల; చేన్ = చేతిలో; పడిన = చిక్కినట్టి; సాధుల్ = సజ్జనుల; కున్ = కు; అడ్డపడెడి = సహాయపడెడి; వాడు = వాడు; చూడడే = చూడడా యేమి; నా = నా యొక్క; పాటున్ = దురవస్థను; చూపులన్ = ఇతర చూపులు; చూడక = చూడకనే; చూచువారలన్ = తననే చూచువారిని; కృపన్ = దయతో; చూచువాడు = చూచెడివాడు; లీలన్ = లీల; తోన్ = తోటి; నా = నా యొక్క; మొఱన్ = ఆర్తనాదమును; ఆలింపడే = వినడా యేమి; మొఱగుల = దీనుల; మొఱలు = ఆర్తనాదములను; ఎఱుంగుచున్ = తెలియుచు; తన్ను = తననుతానే; మొఱగు = మరచు; వాడు = వాడు.
అఖిల = సర్వ; రూపముల్ = రూపములు; తన = తన యొక్క; రూపము = స్వరూపము; ఐన = అయిన; వాడు = వాడు; ఆది = మొదలు; మధ్య = మధ్య; అంతములున్ = తుదిలు; లేక = లేకుండగ; అడరు = అతిశయించెడి; వాడు = వాడు; భక్తజనములన్ = భక్తు లైనవారిని; దీనులన్ = దీనుల; పాలి = అండగా నుండెడి; వాడు = వాడు; వినడె = వినడా యేమి; చూడడె = చూడడా యేమి; తలపడె = రక్షింప తలచడా యేమి; వేగన్ = శ్రీఘ్రమే; రాడె = రాడా యేమి.

భావము:

ఎంత చక్కటి సీసపద్యం! ఎంతచక్కగా వర్ణించాడు!!
నా విషయంలో ఆ భగవంతుడిని అనుమానించ వలసిన పని లేదు. అతడు ఐశ్వర్యం, పేదరికం లాంటివి చూడకుండా అందరికి అండగా ఉంటాడు. కాబట్టి నాకు అండగా ఉంటాడు. దుర్జనుల చేతిలో చిక్కుకున్న సజ్జనులకు సాయపడతాడు. అందువల్ల నాకు సాయం చేస్తాడు. బయటి చూపులు వదిలిపెట్టి తననే చూసేవారిని దయతో చూస్తాడు. కనుక నా కష్టాన్ని చూస్తాడు. దీనుల మొరలు విని తన్ను తానే మరచి పోతాడు కదా. నా మొర తప్పక వింటాడు. అన్ని రూపాలూ ఆయన రూపాలే. మొదలు, నడుమ, తుద అన్నవి ఆయనకు లేవు. భక్తులకు దిక్కులేని వారికి ఆయనే ఆధారం. మరి అటువంటి ప్రభువు ఇంకా నా మొర వినడేం? నా బాధ చూడడేం? నన్ను దయ చూడడేం? తొందరగా రాడేం?