పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాద చరిత్రము

  •  
  •  
  •  

7-166-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"చదివించిరి నను గురువులు
దివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నేఁ
దివినవి గలవు పెక్కులు
దువులలో మర్మ మెల్లఁ దివితిఁ దండ్రీ!

టీకా:

చదివించిరి = చదివించిరి; ననున్ = నన్ను; గురువులు = గురువులు; చదివితి = చదివితిని; ధర్మార్థముఖ్య = ధర్మార్థకామ; శాస్త్రంబులున్ = శాస్త్రములను; నేన్ = నేను; చదివినవి = చదివినట్టివి; కలవు = ఉన్నవి; పెక్కులు = అనేకమైనవి; చదువుల = చదువుల; లోన్ = అందలి; మర్మములు = రహస్యములు; ఎల్లన్ = అన్నిటిని; చదివితిన్ = చదివితిని; తండ్రీ = నాన్నగారూ.

భావము:

“నాన్నగారు! నన్ను గురువులు చక్కగా చదివించారు. ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం మున్నగు ముఖ్య శాస్త్రములు అన్నీ చదివి, అన్ని చదువులలోని సారమూ, రహస్యమూ సంపూర్ణంగా గ్రహించాను.