పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : చంద్రుని ఆమంత్రణంబు

  •  
  •  
  •  

6-193-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

స్వాయంభువ మనువేళల
నోయ్య! సురాసు రాండ జోరగ నర వ
ర్గాత సర్గము దెలిపితి
పాక యది విస్తరించి లుకం గదవే."

టీకా:

స్వాయంభువ = స్వాయంభువ యనెడి; మనువువేళలన్ = మన్వంతరములోని; ఓ = ఓ; అయ్య = తండ్రి; సుర = దేవతలు; అసుర = రాక్షసులు; అండజ = గ్రుడ్డునుండి పుట్టునవి; ఉరగ = పాములు {ఉరగము - ఉర (రొమ్ము)చే గము (గమనము గలవి), పాము}; నర = మానవుల; వర్గ = జాతుల; ఆయత = విస్తారమైన; సర్గమున్ = సృష్టిని; తెలిపితి = తెలియజేసితివి; పాయక = తప్పక; అది = దానిని; విస్తరించి = మరింకా వివరముగ; పలుకంగదవే = చెప్పుము.

భావము:

“అయ్యా! శుకమహర్షీ! స్వాయంభువ మన్వంతరంలో దేవతలు, రాక్షసులు, పక్షులు, పాములు, మానవులు మొదలైన ప్రాణుల సృష్టిక్రమం ఎలా జరిగిందో చెప్పావు. దానిని ఇంకా విస్తారంగా వివరించి చెప్పు”.

6-194-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

త్తర కొడు కిట్లడిగిన
నుత్తరమును నమ్మునీంద్రుఁ డుత్తమచేతో
వృత్తి ముదమంది పలికెను
త్తఱపా టుడిగి వినుఁడు తాపసవర్యుల్!

టీకా:

ఉత్తరకొడుకు = పరీక్షిత్తు {ఉత్తరకొడుకు - ఉత్తర యొక్క పుత్రుడు, పరీక్షిత్తు}; ఇట్లు = ఈ విధముగ; అడిగినన్ = అడుగగా; ఉత్తరమున = సమాధానముగ; ఆ = ఆ; ముని = మునులలో; ఇంద్రుడు = ఇంద్రుని వంటివాడు; ఉత్తమ = శ్రేష్ఠమైన; చేతస్ = మానసిక; వృత్తిన్ = నడవడికతో; ముదమంది = సంతోషించి; పలికెను = చెప్పెను; తత్తఱపాటు = తొట్రుపాటు; ఉడిగి = మానేసి; వినుడు = వినండి; తాపస = తాపసులలో; వర్యులు = ఉత్తములు.

భావము:

ఉత్తర యొక్క కుమారుడు పరీక్షిత్తు ఈ విధంగా అడుగగా ఆ శుకమహర్షి మనస్సులో సంతోషించినవాడై ఇలా అన్నాడు. మునులారా! సావధానులై వినండి” (అని సూతుడు శౌనకాది మునులకు చెప్పసాగాడు).

6-195-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"పూని ప్రచేతసుపుత్రులు పదుగురు-
ప్రాచీనబర్హిష ప్రాఖ్య గలుగు
వారు మహాంబోధి లన వెల్వడి వచ్చి-
గ వృక్ష వృతమైన రణిఁ జూచి
మేదినీజములపై మిక్కిలి కోపించి-
దిలోన దీపితన్యు లగుచు
క్త్రంబులను మహావాయు సంయుతమైన-
నలంబుఁ గల్పించి వనిజములఁ

6-195.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బెల్లువడఁ గాల్పఁ దొడఁగినఁ ల్లడిల్లి
వారి కోపంబు వారించువాఁడ పోలెఁ
లికెఁ జందురుఁ "డో మహాభాగులార!
దీనమగు వృక్షముల మీఁదఁ దెగుట దగునె?

టీకా:

పూని = సంకల్పించి; ప్రచేతపుత్రులు = ప్రచేతసుల కొడుకులు; పదుగురు = పదిమంది (10); ప్రాచీనబర్హిష = ప్రాచీనబర్హిషులు; ప్రాఖ్యన్ = అని పేరొందుట; కలుగు = కలిగిన; వారు = వారు; మహా = గొప్ప; అంబోధి = సముద్రము {అంబోధి - అప్పు (నీటి)కి నిధివంటిది, సముద్రము}; వలన = నుండి; వెల్వడి = బయటకు; వచ్చి = వచ్చి; తగన్ = పూర్తిగ; వృక్ష = చెట్లతో; ఆవృతమైన = నిండిన; ధరణిన్ = భూమిని; చూచి = చూసి; మేదినీజముల = చెట్ల {మేదినీజములు - మేదిని (భూమి) నుండి జములు (జనించునవి), వృక్షములు}; పై = మీద; మిక్కిలి = అధికముగ; కోపించి = కోపించి; మది = మనసు; లోనన్ = లోపల; దీపిత = రగులుతున్న; మన్యులు = కోపము గలవారు; అగుచు = అగుచు; వక్త్రంబులను = నోటినుండి; మహా = గొప్ప; వాయు = గాలితో; సంయుతము = కూడినది; ఐన = అయిన; అనలంబున్ = అగ్నిని; కల్పించి = పుట్టించి; అవనిజములన్ = చెట్లను {అవనిజములు - అవని (భూమి) నుండి జములు (పుట్టినవి), వృక్షములు}; పెల్లువడ = ఫెళఫెళమని శబ్దము చేయు చుండగ; కాల్పన్ = కాల్చివేయ; తొడగిన = మొదలిడిన; తల్లడిల్లి = చలించిపోయి.
వారి = వారి యొక్క; కోపంబు = కోపమును; వారించు = ఆపెడు; వాడ = వాడి; పోలెన్ = వలె; పలికెన్ = పలికెను; చంద్రుండు = చంద్రుడు; ఓ = ఓ; మహాభాగులారా = మహానుభావులూ; దీనము = దీనములు; అగు = అయిన; వృక్షముల = చెట్ల; మీద = పైన; తెగుట = ఇలా సాహసించుట; తగునె = సరియైనదా ఏమి.

భావము:

ప్రచేతసుని పుత్రులు “ప్రాచీనబర్హి” అని పేరెన్నిక గన్నవారు పదిమంది తపస్సు చాలించి సముద్రగర్భం నుండి బయటకు వచ్చి దట్టంగా సందు లేకుండా వృక్షాలతో నిండిన భూమిని చూశారు. సందు లేకుండా భూమినంతా ఆక్రమించిన చెట్లమీద వారికి కోపం వచ్చింది. వారు క్రోధావేశంతో తమ కోపాగ్ని జ్వాలలను మహావాయువుతో ప్రసరింపజేశారు. ఆ మంటలకు వృక్షసముదాయమంతా కాలి భస్మమై పోసాగింది. అది చూసి తల్లడిల్లిన చంద్రుడు వారి కోపాన్ని నివారించడానికి వారితో ఇలా అన్నాడు “ఓ మహానుభావులారా! దిక్కులేని ఈ వృక్షాలపై కోపం తగునా?

6-196-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మొల వర్ధిష్ణు లగు మిమ్ము య హృదయు
గు ప్రజాపతు లనుచు సర్వాత్ముఁ డనియె;
ట్టి మీరు ప్రజాసృష్టి కైన వార
లీ వనస్పతి తతుల దహింపఁ దగునె?

టీకా:

మొదల = ముందుగ; వర్ధిష్ణులు = వృద్ధి చెందెడు వారు; అగు = అయిన; మిమ్ము = మిమ్ములను; సదయ = దయ గల; హృదయులు = హృదయములు గల వారు; అగు = అయిన; ప్రజాపతులు = మూల పురుషులు {ప్రజాపతులు - ప్రజ (సంతానమును పొందెడి) పతులు (ప్రభువులు)}; అనుచు = అని; సర్వాత్ముడు = భగవంతుడు; అనియె = పలికెను; అట్టి = అటువంటి; మీరు = మీరు; ప్రజా = సంతానమును; సృష్టి = సృజియించుట; కైన = కోసమైన; వారలు = వారు; ఈ = ఈ; వనస్పతి = చెట్ల {వనస్పతులు - పూలు పువ్వకుండగ కాచెడు చెట్లు (వానస్పత్యములు - పూలుపూచి కాయలు కాచెడివి)}; తతులన్ = సమూహములను; దహింపన్ = కాల్చివేయుట; తగునె = తగునా ఏమి.

భావము:

వర్ధిల్లుతున్న మిమ్ము దయాహృదయలైన ప్రజాపతులుగా భగవంతుడు నిర్ణయించాడు. ప్రజాసృష్టి కోసం ఉన్న మీరు ఈ వృక్షాల సమూహాన్ని కాల్చివేయడం తగునా?

6-197-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దికాలంబున నా ప్రజాపతి పతి-
యైన లోకేశ్వరుం చ్యుతుండు
ద్మనేత్రుఁడు వనస్పతుల నోషధి ముఖ్య-
జాతంబు నిషము నూర్జంబుఁ గోరి
ల్పించె; నందు ముఖ్యంబైన యన్నంబు-
చరంబు లై నట్టి పద మెల్లఁ
బాదచారులకును బాల్వెట్టి యిరుగాళ్ళు-
చేతులు గలిగిన జీవతతికి

6-197.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పాణులొగి లేని యా చతుష్పాత్తు లెల్ల
న్నముగఁ బూని గావించె దియుఁగాక
నా మహాభాగుఁ డచ్యుతుఁ డాదరమున
మీకు ననఘాఖ్య విఖ్యాతి జోపఱిచె.

టీకా:

ఆదికాలంబునన్ = పూర్వకాలమున; ఆ = ఆ; ప్రజాపతిపతి = మూలపురుషుడు {ప్రజాపతిపతి - ప్రజాపతులందరికిని పతి (ప్రభువు), విష్ణువు}; ఐన = అయిన; లోకేశ్వరుండు = నారాయణుడు; అచ్యుతుండు = నారాయణుడు; పద్మనేత్రుడు = నారాయణుడు; వనస్పతులన్ = వనస్పతులను; ఓషధి = ఓషధులు {ఓషధులు - ఫలించెడుతోడనే నశించెడు చెట్లు వరి వంటివి}; ముఖ్య = మొదలగు; జాతంబున్ = సమూహమును; ఇషమున్ = ఇష్టము; ఊర్జము = బలములను; కోరి = కోరి; కల్పించెన్ = సృష్టించెను; అందు = వానిలో; ముఖ్యంబు = ముఖ్యమైనట్టిది; ఐన = అయిన; అన్నంబు = ఆహారము; అచరంబులు = చరించలేనివి; ఐనట్టి = అయినట్టి; అపదము = పాదములు లేనివి, అచరములు; ఎల్లన్ = సర్వము; పాదచారుల్ = పాదములతో చరించెడివాని; కును = కి; పాల్వెట్టి = పంచిపెట్టి; ఇరుగాళ్ళు = రెండు (2) కాళ్ళు; చేతులు = చేతులు; కలిగిన = ఉన్నట్టి; జీవ = ప్రాణుల; తతి = జాతి; కి = కి;
పాణులు = చేతులు; ఒగి = అసలు; లేని = లేనట్టి; ఆ = ఆ; చతుష్పాత్తుల = నాలుగుకాళ్ళ జంతువులు; ఎల్లన్ = అన్నిటిని; అన్నముగన్ = ఆహారముగ; పూని = నిశ్చయించి; కావించె = చేసెను; అదియునున్ = అంతే; కాక = కాకుండగ; ఆ = ఆ; మహాభాగుడు = మహానుభావుడు; అచ్యుతుడు = నారాయణుడు {అచ్యుతుడు - చ్యుతము (పతనము) లేనివాడు, విష్ణువు}; ఆదరమున = మన్ననతో; మీకున్ = మీకు; అనఘ = పుణ్యులు అను; ఆఖ్య = పేరును; విఖ్యాతి = ప్రసిద్ధిని; జోకపఱిచె = జతపరిచెను.

భావము:

సృష్టి ప్రారంభంలో ప్రజాపతులకు అధిపతి, సర్వ లోకాధిపతి, అచ్యుతుడు, కమలనయనుడు అయిన శ్రీహరి వనస్పతులను, ఓషధులను సృష్టించాడు. జీవులకు ఆహారంగా ఇష్టమైన రుచులకోసం, శరీరానికి శక్తిని ఇవ్వడానికి ఈ వృక్షాలను ఏర్పాటు చేశాడు. చరించేవి, పాదచారులు అయిన జీవులకు అచరాలు, పాదరహితాలు అయినవానిని ఆహారంగా కల్పించాడు. రెండుకాళ్ళు గల ప్రాణులకు, నాలుగు కాళ్ళు కలిగిన జంతువులకు వృక్షాలను ఆహారంగా ఏర్పాటు చేశాడు. అంతేకాక ఆ మహానుభావుడు, అచ్యుతుడు అయిన విష్ణువు మీకు అనఘులు అన్న ప్రఖ్యాతిని కల్పించాడు.

6-198-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిముగ దేవాధీశ్వరుఁ
జుఁడు ప్రజాసర్గమునకు నఘుల మిమ్మున్
సృజియించె నిట్టివారికిఁ
గుదహనము చేయ నెట్లు గోరిక పొడమెన్?

టీకా:

నిజముగ = నిజముగ; దేవాధీశ్వరుడు = బ్రహ్మదేవుడు {దేవాధీశ్వరుడు - దేవ (దేవత లందరికి) అధీశ్వరుడు (అధిపతి), బ్రహ్మదేవుడు}; అజుడు = బ్రహ్మదేవుడు {అజుడు - జన్మము లేనివాడు, బ్రహ్మదేవుడు}; ప్రజ = ప్రజలను; సర్గమున్ = సృష్టి; కు = కి; అనఘుల = పుణ్యులను; మిమ్మున్ = మిమ్ములను; సృజియించెన్ = సృష్టించెను; ఇట్టి = ఇటువంటి; వారి = వారల; కిన్ = కి; కుజ = చెట్లను {కుజము - కు (భూమి) నుండి జము (జనించునది), వృక్షము}; దహనంబు = బూడిద; చేయ = చేయవలె నని; ఎట్లు = ఏవిధముగ; కోరిక = కోరిక; పొడమెన్ = కలిగెను.

భావము:

నిజానికి దేవదేవుడైన బ్రహ్మ ప్రజాసృష్టి కోసం పుణ్యాత్ములైన మిమ్మల్ని సృష్టించాడు. ఇటువంటి మీకు వృక్షాలను దహించాలనే కోరిక ఎలా పుట్టింది?

6-199-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

త మహత్త్వ సత్త్వ గుణ త్పురుషస్మృతిఁ బొందరయ్య! మీ
పిరులునుం బితామహులుఁ బెద్దలు నెన్నఁడుఁ బొందనట్టి దు
ష్కృమతమైన కోపమునఁ గిల్బిషభావము మానరయ్య! సం
భృ కరుణావలోకమున భీత తరుప్రకరంబు జూచుచున్.

టీకా:

సతతము = ఎల్లప్పుడును; మహత్వ = గొప్ప; సత్త్వగుణ = సత్త్వగుణములను; సత్పురుష = సత్పురుషుల మనెడు; స్మృతి = స్పృహను; పొందరు = పొందండి; అయ్య = తండ్రులు; మీ = మీ యొక్క; పితరులునున్ = తల్లిదండ్రులు; పితామహులున్ = తాతలు; పెద్దలు = పెద్దలు; ఎన్నడును = ఎప్పుడు కూడ; పొందని = పొందనిది; అట్టి = అయినట్టి; దుష్కృతము = చెడ్డపని; ఐన = అయినట్టి; కోపమునన్ = కోపము నందలి; కిల్బిష = పాపపు; భావము = బుద్ధి; మానరు = మానండి; అయ్య = తండ్రులు; సంభృత = చక్కగా ధరింపబడినట్టి; కరుణ = దయ గల; అవలోకనమున = చూపులతో; భీత = భయపడుతున్న; తరు = చెట్ల; ప్రకరంబును = సమూహమును; చూచుచున్ = చూచుచు.

భావము:

ఎల్లప్పుడూ గొప్ప సత్త్వగుణాలను సంతరించుకొన్న సత్పురుషులు మీరు అన్న స్పృహను పొందండి. మీ తండ్రులు, తాతలు, పెద్దలు ఎన్నడూ అవలంబించని కోపతాపాలకు లోనై పాపం కట్టుకోకండి. భయంతో వణుకుతున్న ఈ వృక్షసమూహాన్ని దయతో చూడండి.

6-200-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్పక యర్భకావళికిఁ ల్లియుఁ దండ్రియు నేత్రపంక్తికిన్
ఱెప్పలు నాతికిం బతియు ఱేఁడు ప్రజావళి కెల్ల నర్ధి కిం
పొప్ప గృహస్థు మూఢులకు నుత్తము లెన్న సమస్తబాంధవుల్
ముప్పునఁ గావలేని కడుమూర్ఖులు గారు నిజాల చుట్టముల్.

టీకా:

తప్పక = తప్పకుండ; అర్భక = పిల్లల; ఆవళిన్ = సమూహమును; తల్లియున్ = తల్లి; తండ్రియున్ = దండ్రి; నేత్ర = కన్నుల; పంక్తి = వరుస; కిన్ = కి; ఱెప్పలు = కనురెప్పలు; నాతి = స్త్రీ; కిన్ = కి; పతియు = భర్త; ఱేడు = రాజు; ప్రజా = పౌరుల; ఆవళి = సమూహము; ఎల్లన్ = సమస్తమునకు; అర్థి = యాచించెడివాని; కిన్ = కి; ఇంపొప్ప = చక్కగా; గృహస్థు = గృహస్థుడు; మూఢుల్ = తెలివితక్కువవారల; కును = కి; ఉత్తములు = ఉత్తములు; ఎన్నన్ = ఎంచిచూసిన; సమస్త = సమస్తమైన; బాంధవుల్ = బంధువులు; ముప్పునన్ = ప్రమాద పరిస్థితులలో; కావలేని = కాపాడలేని; కడు = మిక్కిలి; మూర్ఖులు = మూర్ఖులు; కారు = కారు; నిజాల = నిజమైన; చుట్టముల్ = బంధువులు.

భావము:

పిల్లలకు తల్లిదండ్రులు, కళ్ళకు రెప్పలు, స్తీకి భర్త, ప్రజలకు రాజు, యాచకులకు గృహస్థుడు, మూఢులకు బుద్ధిమంతుడు సంరక్షకులు. వారే నిజమైన బంధువులు. ఆపద సమయంలో ఆదుకొనని మూర్ఖులు బంధువులు కారు.

6-201-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఖిల భూతముల దేహాంతస్థమగునాత్మ-
యీశుఁ డచ్యుతుఁడని యెఱుఁగవలయు;
నెఱిఁగి సర్వం బైన యిందిరారమణు లోఁ-
జూపులఁ దనివిగాఁ జూడవలయు;
జూచిన చిద్రూప శుద్ధాత్ము లగు మిమ్ము-
నెనసిన వేడ్కతోనిచ్చమెచ్చు;
మెచ్చిన సర్వాత్ము మీ రెఱింగినచోటఁ-
గోగుణంబులఁ బావలయు;

6-201.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బాపి దగ్ధశేష పాదపజాలంబు
దియ్య మెసఁగ బ్రతుకనియ్యవలయు;
నఘులార! మీర స్మదీయప్రార్థ
నంబు పరఁగఁ జేకొనంగవలయు.

టీకా:

అఖిల = సమస్తమైన; భూతముల = జీవుల; దేహ = శరీరమునకు; అంతస్థము = లోనుండెడిది; అగు = అయినట్టి; ఆత్మ = ఆత్మ; ఈశుడు = నారాయణుడు; అచ్యుతుడు = నారాయణుడు; అని = అని; ఎఱుగవలయు = తెలిసికొనవలెను; ఎఱిగి = తెలిసి; సర్వంబు = సర్వము తానే; ఐన = అయినట్టి; ఇందిరారమణు = నారాయణుని; లోచూపుల = అంతర్దృష్టితో; తనివిగా = సంతృప్తిగా; చూడవలయు = చూడవలెను; చూచిన = అట్లు చూచున్నచో; చిద్రూప = చిద్రూపులు; శుద్ధాత్ములు = పరిశుద్ధాత్ములు; అగు = అయిన; మిమ్ము = మిమ్ములను; ఎలసిన = కలిగిన; వేడ్కన్ = ఆపేక్ష; తోన్ = తోటి; ఇచ్చన్ = ఇష్టపూర్తిగ; మెచ్చు = మెచ్చుకొనును; మెచ్చిన = (అలా) మెచ్చుకొన్నందున; సర్వాత్ము = నారాయణుని; మీరు = మీరు; ఎఱింగినచోట = తెలిసికొన్నచో; కోప = కోపము గల; గుణంబులన్ = గుణములను; పాపవలయు = విడువవలెను; పాప = విడిచిపెట్టి;
దగ్ధ = కాలగా; శేష = మిగిలిన; పాదప = చెట్ల; జాలంబు = సమూహములను; తియ్యము = ఇంపు; ఎసగ = మీరగా; బ్రతుకనియ్యవలయున్ = జీవించ నియ్య వలెను; అనఘులార = పుణ్యులారా; మీరలు = మీరు; అస్మదీయ = మా యొక్క; ప్రార్థనంబు = కోరిక; పరగన్ = ఒప్పుగా; చేకొనంగవలయు = అంగీకరింప వలయును

భావము:

సమస్త జీవరాసుల దేహాలలో సర్వేశ్వరుడు, అచ్యుతుడు అయిన శ్రీమన్నారాయణుడు ఆత్మ స్వరూపంతో ఉన్నాడని తెలుసుకొనండి. అలా తెలిసికొని సర్వాంతర్యామి అయిన ఆ విష్ణువును లోచూపులతో తనివి తీరా చూడండి. అలా చూస్తే జ్ఞానస్వరూపులు, పవిత్రులు అయిన మిమ్మల్ని భగవంతుడు సంతోషంగా మెచ్చుకుంటాడు. అలా మెచ్చుకొన్న పరాత్పరుడు అంతటా ఉన్నాడని తెలిసికొని మీరు మీ కోపాన్ని వదిలిపెట్టాలి. అలా కోపాన్ని వదిలి కాలగా మిగిలిన వృక్షాలను సంతోషంగా బ్రతకనివ్వండి. ఓ పుణ్యాత్ములారా! మీరు నా ప్రార్థనను అంగీకరించాలి.

6-202-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దె వృక్ష సముద్భవ యగు
దిరేక్షణ నాప్సరసిఁ గుమారిక నిత్తున్
లక పత్నిఁగఁ జేకొని
ము మందుఁడు పాదపముల మోసమువాయన్." "

టీకా:

ఇదె = ఇదిగో; వృక్ష = వృక్షము లందు; సముద్భవ = జనించినది; అగు = అయిన; మదిరేక్షణ = స్త్రీ; ఆప్సరసిన్ = అప్సరస పుత్రిక; కుమారికన్ = చిన్నపిల్లను; ఇత్తును = ఇచ్చెదను; వదలక = తప్పక; పత్నిగ = భార్యగా; చేకొని = చేపట్టి; ముదము = సంతోషమును; అందుడు = పొందండి; పాదపములన్ = చెట్లను; మోసము = ఆపద; వాయన్ = పోవునట్లు.

భావము:

ఈ వృక్షాల నడుమ జన్మించిన ఈ సుందరి అయిన అప్సరసను మీకు ఇస్తున్నాను. ఈమెను భార్యగా స్వీకరించి సంతోషించండి. ఈ వృక్షాలను ఆపదనుండి కాపాడండి”.

6-203-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యిట్లామంత్రణంబు జేసి, మారిష యను కన్యకను వారల కిచ్చి చంద్రుండు చనియె; అప్పుడు.

టీకా:

అని = అని; ఇట్లు = ఈ విధముగ; ఆమంత్రణము = నచ్చజెప్పుట, ఉపదేశము; చేసి = చేసి; మారిష = మారిష {మారిష - మరులు (కామమును) కలిగించునది}; అను = అనెడి; కన్యకను = స్త్రీని; వారల = వారి; కిన్ = కి; ఇచ్చి = ఇచ్చి; చంద్రుండు = సోముడు; చనియె = వెళ్ళెను; అప్పుడ = అప్పుడు.

భావము:

అని ఈ విధంగా ప్రాచేతసులకు నచ్చచెప్పి మారిష అనే పేరు కలిగిన ఆ కన్యను వారికిచ్చి చంద్రుడు వెళ్ళిపోయాడు. అప్పుడు...

6-204-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వాలు పర్యాయంబున
నీరేజముఖిన్ వరించి నెఱి రమియింపన్
ధీరుఁడు ప్రాచేతసుఁడై
వాక దక్షుండు పుట్టె నజజ సముఁడై.

టీకా:

వారలు = వారు; పర్యాయంబున = ఒకరి తరువాత నొకరు; నీరేజముఖిని = స్త్రీని {నీరేజముఖి - నీరేజము (పద్మము) వంటి ముఖి (ముఖము గలామె),స్త్రీ}; వరించి = వరించి; నెఱిన్ = చక్కగ; రమియింపన్ = భోగించగా; ధీరుడు = మహాజ్ఞాని; ప్రాచేతసుడు = ప్రచెతసుల పుత్రుడు; ఐ = అయ్యి; వారక = అవశ్యము; దక్షుండు = దక్షుడు; పుట్టె = జనించెను; వనజజ = బ్రహ్మదేవునికి {వనజజుడు - వనజము (పద్మము)న జుడు (జనించినవాడు), బ్రహ్మ}; సముడు = సమానమైన వాడు; ఐ = అయ్యి.

భావము:

ఆ ప్రాచేతసులు వంతులవారిగా పద్మం వంటి ముఖం కలిగిన ఆ మారిషతో సుఖించగా, ఆమెకు ధీరుడు, బ్రహ్మతో సమానుడు అయిన దక్షుడు జన్మించాడు.

6-205-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వ్వని సంతానంబులు
నివ్వటిలెన్ వసుధ నెల్ల నెఱి నా దక్షుం
డెవ్వలన జగము లన్నిటఁ
బ్రవ్వ జలము నిలిపినట్లు ప్రజఁ బుట్టించెన్.

టీకా:

ఎవ్వని = ఎవని యొక్క; సంతానంబులు = సంతానములు; నివ్వటిలెన్ = వ్యాపించెను; వసుధన్ = భూమండలము; ఎల్లన్ = అంతటను; నెఱిన్ = అతిశయముతో; ఆ = ఆ; దక్షుండు = దక్షుడు; ఎవ్వలన = ఏ విధముగా; జగములన్ = భువనములను; అన్నిటన్ = అన్నింటిలోను; ప్రవ్వన్ = కుండయందు; జలము = నీరు; నిలిపినట్లు = నింపినట్లు; ప్రజన్ =ఎవ్వని = ఎవని యొక్క; సంతానంబులు = సంతానములు; నివ్వటిలెన్ = వ్యాపించెను; వసుధన్ = భూమండలము; ఎల్లన్ = అంతటను; నెఱిన్ = అతిశయముతో; ఆ = ఆ; దక్షుండు = దక్షుడు; ఎవ్వలన = ఏ విధముగా; జగములన్ = భువనములను; అన్నిటన్ = అన్నింటిలోను; ప్రవ్వన్ = కుండ యందు; జలము = నీరు; నిలిపినట్లు = నింపినట్లు; ప్రజన్ = సంతానములను; పుట్టించెను = పుట్టించెను.సంతానములను; పుట్టించెను = పుట్టించెను.

భావము:

కుండలో నీరు నింపినట్లు ఆ దక్షప్రజాపతి ఈ భూమినంతా తన సంతానంతో నింపివేశాడు.

6-206-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వాని వేడ్కతో దుహితృ త్సలదక్షుఁడు దక్షుఁడాత్మచేఁ
గోరి సృజించెఁ గొన్నిటి నకుంఠిత వీర్యముచేతఁ గొన్నిటిన్
బోన ఖేచరంబులను భూచరముఖ్య వనేచరంబులన్
నీచరవ్రజంబు రజనీచరజాల దివాచరంబులన్.

టీకా:

వారని = ఆపలేని; వేడ్క = కుతూహలము; తో = తోటి; దుహితృ = పుత్రికల ఎడల; వత్సల = వాత్సల్యము గలవారిలో; దక్షుడు = సమర్థుడు; దక్షుడు = దక్షుడు; ఆత్మ = మనస్సు; చే = తోటి; కోరి = కోరి; సృజించె = పుట్టించెను; కొన్నిటిని = కొన్నింటిని; అకుంఠిత = కుంటుపడని; వీర్యము = శుక్రము; చేతన్ = చేత; కొన్నిటిని = కొన్నింటిని; బోరన = మిక్కిలిగ; ఖేచరంబులను = ఆకాశమున తిరుగెడి జీవులను; భూచర = భూమిపై తిరిగెడు వానిని; ముఖ్య = మొదలగు వానిని; వనేచరములన్ = అడవిలో తిరిగెడు వానిని; నీరచర = నీటిలో తిరిగెడు వాని; వ్రజంబు = సమూహమును; రజనీచర = రాత్రించరుల; జాల = సమూహమును; దివాచరంబులన్ = పగలు తిరిగెడు వానిని.

భావము:

కుమార్తెలంటే ఇష్టపడే దక్షుడు కొందరిని తన ఆత్మశక్తితో, మరికొందరిని తన వీర్యం ద్వారా సృష్టించాడు. ఈ విధంగా జనించిన జీవరాసులలో కొందరు ఖేచరులు, మరికొందరు భూచరులు. కొన్ని వనచరాలు, మరికొన్ని జలచరాలు. కొన్ని రాత్రి సంచరించేవి కాగా మరికొన్ని పగలు సంచరించేవి.

6-207-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సుర గరు డోరగ కి
న్న దానవ యక్ష పక్షి గ వృక్షములం
మిడి సృష్టి యొనర్చెను
దిముగ దక్షప్రజాపతి వితతకీర్తిన్.

టీకా:

నర = మానవులు; సుర = దేవతలు; గరుడ = గరుడులు; ఉరగ = పాములు; కిన్నర = కిన్నరలు; దానవ = రాక్షసులు; యక్ష = యక్షులు; పక్షి = పక్షులు; నగ = పర్వతములను, గిరులను; వృక్షములన్ = వృక్షములను; తరమిడి = వరుసపెట్టి; సృష్టి = పుట్టించుట; ఒనర్చెను = చేసెను; తిరముగ = స్థిరముగ; దక్ష = దక్షుడు యనెడి; ప్రజాపతి = ప్రజాపతి; వితత = విస్తారమైన; కీర్తిన్ = యశస్సుతో.

భావము:

దక్షప్రజాపతి మానవులను, దేవతలను, గరుడులను, పాములను, కిన్నరులను, రాక్షసులను, యక్షులను, పక్షులను, వృక్షాలను, పర్వతాలను వరుసగా సృష్టించి గొప్ప కీర్తిని సంపాదించాడు.

6-208-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హువిధముల బహుముఖముల
హురూపములైన ప్రజల హులోకములన్
హుళముగఁ జేసి మదిలో
హుమానము నొందఁ డయ్యె బ్రఖ్యాతముగన్.

టీకా:

బహు = అనేక; విధముల = రకముల; బహు = అనేకమైన; ముఖముల = ఉపాయములతో; బహు = అనేకమైన; రూపములు = స్వరూపములు గలిగినవి; ఐన = అయిన; ప్రజల = జీవులను; బహు = అనేకమైన; లోకములన్ = లోకములలో; బహుళముగన్ = అధికముగ; చేసి = సృష్టించి; మది = మనసు; లో = అందు; బహుమానము = తనివి; ఒందడయ్యెన్ = పొందకుండెను; ప్రఖ్యాతముగన్ = ప్రసిద్ధముగ.

భావము:

పెక్కు విధాలుగా, పెక్కు ముఖాలతో, పెక్కు రూపాలతో పెక్కులోకాలలో అనేక విధాలుగా సృష్టించి కూడా దక్షుడు సంతృప్తిని పొందలేదు.

6-209-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రజాసర్గ బృంహితం యిన జగము
క్షుఁ డీక్షించి మదిలోనఁ దాప మొంది
ఱియు జననంబు నొందించు తము రోసి
రమపురుషుని నాశ్రయింపంగఁ దలఁచె.

టీకా:

ఆ = ఆ; ప్రజాసర్గ = సంతానముచే; బృంహితంబు = నిండినది; అయిన = ఐన; జగము = భువనము; దక్షుడు = దక్షుడు; ఈక్షించి = చూసి; మది = మనసు; లోనన్ = అందు; తాపము = బాధ; ఒంది = పొంది; మఱియు = ఇంకను; జననంబునొందించు = సృష్టించు; మతము = అభిప్రాయము; రోసి = అసహ్యించుకొని; పరమపురుషుని = నారాయణుని; ఆశ్రయింపంగన్ = ఆశ్రయింపవలెనని; తలచె = భావించెను.

భావము:

నానావిధాలైన ప్రాణులతో నిండిన లోకాన్ని చూచి దక్షప్రజాపతి తన మనస్సులో సంతాపం చెంది ఇక సృష్టించడం ఇష్టపడక పరమపురుషుణ్ణి ఆశ్రయించాలనే నిశ్చయానికి వచ్చాడు.

6-210-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు దక్షప్రజాపతి ప్రజాసర్గంబు చాలక చింతించి మంతనంబున లక్ష్మీకాంతుని సంతుష్టస్వాంతుంజేయువాఁడై.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; దక్ష = దక్షుడు యనెడి; ప్రజాపతి = ప్రజాపతి; ప్రజా = ప్రజలను; సర్గంబు = సృష్టించుటతో; చాలక = తృప్తిచెందక; చింతించి = ఆలోచించి; మంతనంబున = ఏకాంతమున; లక్ష్మీకాంతుని = నారాయణుని {లక్ష్మీకాంతుడు - లక్ష్మీదేవి యొక్క కాంతుడు (భర్త), విష్ణువు}; సంతుష్ట = సంతోషించిన; స్వాంతున్ = మనసు గలవానిని; చేయువాడు = చేసెడివాడు; ఐ = అయ్యి.

భావము:

ఈ విధంగా దక్షప్రజాపతి తాను చేసిన సృష్టికి సంతృప్తి పడక ఆలోచించి ఏకాంతంలో శ్రీమహావిష్ణువును సంతృప్తి పరచాలని సంకల్పించి...

6-211-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మోదం బై పరిదూషిత
ఖేదం బై శాబరీద్ధ కిలికించిత దృ
గ్భేదం బై బహుసౌఖ్యా
పాదం బై యొప్పు వింధ్యపాదంబునకున్.

టీకా:

మోదంబు = సంతోషకర మైనది; ఐ = అయ్యి; పరిదూషిత = మిక్కిలి తిరస్కరింప బడిన; ఖేదంబు = దుఃఖము గలది; ఐ = అయ్యి; శాబరి = శబరీస్త్రీల యొక్క; ఇద్ధ = ప్రసిద్ధమైన; కిలకించిత = కిలకిలారావముతో కూడిన; దృక్ = చూపుల; భేదంబు = విశేషములు గలది; ఐ = అయ్యి; బహు = అనేకమైన; సౌఖ్య = సౌఖ్యములను; అపాదంబు = కలిగించెడిది; ఐ = అయ్యి; ఒప్పు = చక్క నైన; వింధ్య = వింధ్యపర్వత; పాదంబున్ = పాదమున; కున్ = కు;

భావము:

ఆనందాన్ని ఇచ్చేది, మనస్తాపాన్ని పోగొట్టేది, శబరస్త్రీల కిలకిలారావాలు చేస్తూ విలాస వీక్షణాలను ప్రసరింపజేసేది, మిక్కిలి సుఖకరమైనది అయిన వింధ్యపర్వత పాద ప్రదేశానికి...

6-212-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అరిగి, యం దఘమర్షణం బను తీర్థంబు సర్వదురితహరం బయి యొప్పుదాని ననుసవనంబు సేవించి, యతి ఘోరం బయిన తపంబు చేయుచు హరిం బ్రసన్నుం జేసి, హంసగుహ్యం బను స్తవరాజంబున నిట్లని స్తుతియించె.

టీకా:

అరిగి = వెళ్ళి; అందు = దానిలో; అఘమర్షణంబు = అఘమర్షణము {అఘ మర్షణము - అఘము (పాపము)లను మర్షణము (క్షాళనము చేసెడిది)}; అను = అనెడి; తీర్థంబు = పుణ్యతీర్థము; సర్వ = అఖిలమైన; దురిత = పాపములను; హరంబు = హరించునది; అయి = అయ్యి; ఒప్పు = చక్కగ నుండెడి; దాని = దాని యొక్క; అనుసవనంబున్ = సవనము చేయు నప్పు డెల్ల, అన్ని నిష్ఠల యందు; సేవించి = కొలచి; అతి = మిక్కిలి; ఘోరంబు = భయంకరము; అయిన = అయిన; తపంబు = తపస్సు; చేయుచు = చేస్తూ; హరిన్ = నారాయణుని; ప్రసన్నున్ = ప్రసన్నమైన వానిగ; చేసి = చేసి; హంసగుహ్యంబు = హంసగుహ్యము యనెడి; స్తవ = స్తోత్రములలో; రాజంబునన్ = శ్రేష్ఠమైన దానితో; ఇట్లు = ఈ విధముగ; అని = అని; స్తుతియించె = స్తోత్రము చేసెను.

భావము:

(దక్షుడు వింధ్యపర్వత పాదప్రదేశానికి) వెళ్ళి అక్కడ సమస్త పాపాలను హరించే అఘమర్షణం అనే తీర్థంలో నిత్యం స్నానం చేస్తూ మిక్కిలి ఘోరమైన తపస్సు చేస్తూ శ్రీహరిని ప్రసన్నుని చేసికొని, అతనిని హంసగుహ్యం అనే స్తోత్రంతో ఇలా స్తుతించాడు.