పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : మరుద్గణంబుల జన్మంబు

 •  
 •  
 •  

6-508-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"మి కారణమున నింద్రునికిని మరు
చ్చయము లాప్తు లగుచు శాంతి నొంది?
రయఁ దత్సమాను గుచు వర్తించిరి?
దీని వినఁగవలయుఁ దెలుపవయ్య! "

టీకా:

ఏమి = ఏమి; కారణమునన్ = కారణముచేత; ఇంద్రున్ = ఇంద్రుని; కిని = కి; మరుత్ = మరుత్తులు; చయములు = గణములు; ఆప్తులు = ఇష్టులై ; అగుచున్ = అగుచు; శాంతిన్ = శాంతిని; ఒందిరి = పొందిరి; తత్ = అతనికి; సమానులు = సమానమైనవారు; అగుచున్ = అగుచు; వర్తించిరి = ప్రవర్తించిరి; దీని = దీనిని; వినగవలయున్ = వినవలెను; తెలుపు = చెప్పుము; అయ్య = తండ్రి.

భావము:

“ఏ కారణం వల్ల ఇంద్రునికి మరుద్గణాలు ఆప్తులై, శాంతిని పొంది, దేవత్వాన్ని సంపాదింప గలిగారు? ఈ వృత్తాంతాన్ని వినాలనుకుంటున్నాను. అయ్యా! నాకు వినిపించు”.

6-509-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అనిన శుకుం డిట్లనియె.

టీకా:

అనినన్ = అనగా; శుకుండు = శుకుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అని ప్రశ్నించగా శుక్రుడు ఇలా అన్నాడు.

6-510-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"రనాథ! విను తన నందను లందఱు-
మరేంద్రుచే హతు గుచు నుండఁ
గోపశోకంబులఁ గ్రుళ్ళుచుఁ దనలోన-
మండుచు దితి చాల ఱుఁగఁ దొడఁగె;
భ్రాత్రు హంతకుఁ డతి పాతకుం డీ యింద్రుఁ-
జంపక నా కేల సొంపు గలుగు?
వీని భస్మము చేయువానిఁగా నొక సుతుఁ-
డసెద నని చాల ర్తఁ గోరి

6-510.1-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ప్రియము చేయఁదొడఁగెఁ బెక్కు భావంబుల
భాణముల నధికపోణముల
క్తియుక్తిచేతఁ రిచర్యగతిచేత
నుతులచేత నతుల తులచేత.

టీకా:

నరనాథ = రాజా; విను = వినుము; తన = తన యొక్క; నందనులు = పుత్రులు; అందఱున్ = అందరు; అమరేంద్రున్ = దేవేంద్రుని; చేన్ = చేత; హతులు = మరణించినవారు; అగుచునుండ = అగుచుండగ; కోప = కోపము; శోకంబులన్ = శోకములతో; క్రుళ్ళుచున్ = దుఃఖించుచు; తన = తన మనసు; లోనన్ = అందు మండుచున్ = తపించుచు; దితి = దితి; చాలన్ = మిక్కిలి; మఱుగన్ = దుఃఖించుచుండెను; భ్రాత్రు = సోదరులను; హంతకుండు = సంహరించెడివాడు; అతి = మహా; పాతకుండు = పాపి; ఈ = ఈ; ఇంద్రున్ = ఇంద్రుని; చంపక = సంహరించక; నా = నా; కున్ = కు; ఏల = ఎందులకు; సొంపు = సుఖము; కలుగు = కలుగును; వీనిన్ = వీనిని; భస్మము = నాశనము; చేయు = చేసెడి; వానిగా = వాడిని; ఒక = ఒక; సుతున్ = పుత్రుని; పడసెదను = పొందెదను; అని = అని; చాలన్ = మిక్కిలి; భర్తన్ = భర్తను; కోరి = కోరి;
ప్రియము = ప్రీతి; చేయ = చేయ; తొడగెన్ = సాగెను; పెక్కు = అనేక; భావములన్ = విధములుగ; భాషణములన్ = మాటలతోను; అధిక = మిక్కిలిగా; పోషణములన్ = పోషించుటచేత; భక్తి = భక్తిచేత; యుక్తి = నేర్పుల; చేతన్ = చేత; పరిచర్య = సేవించెడి; గతి = విధముల; చేతన్ = వలన; నుతుల = స్తుతుల; చేతన్ = వలన; అతుల = సాటిలేని; రతుల = సంభోగసుఖముల; చేతన్ = వలన.

భావము:

“రాజా! విను. తన కుమారులైన దైత్యులందరూ ఇంద్రునిచేత సంహరింప బడటం చూచి దితి హృదయం కోపతాపాలతో క్రుళ్ళిపోయి, లోలోపల ఎన్నో విధాలుగా పరితపించింది. “ఈ ఇంద్రుడు సోదర ఘాతకుడైన మహాపాపి. ఇతనిని హతమారిస్తేనే కాని నా హృదయానికి శాంతి లేదు. ఈ పరమ దుర్మార్గుణ్ణి భస్మం చేయగల కొడుకును కనాలి” అని ఆమె నిశ్చయించుకొని, తన భర్త అయిన కశ్యప ప్రజాపతిని అనేక విధాల హావభావాలు ప్రదర్శిస్తూ, మృదుమధుర భావాలతో, భక్తి ప్రపత్తులతో కూడిన పరిచర్యలతో, పొగడ్తలతో, సరస సంభోగ క్రీడలతో రంజింపసాగింది.

6-511-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

లికి కటాక్షవీక్షణ వికారములన్ హృదయానురాగ సం
లిత విశేషవాఙ్మధుర ర్జనలన్ లలితాననేందు మం
పరిశోభితామృత విడంబిత సుస్మిత సుప్రసన్నతా
రుచిరప్రదానముల భామిని భర్తమనంబు లోఁగొనెన్.

టీకా:

కలికి = మనోహరమైన; కటాక్ష = కడగంటి; వీక్షణ = చూపులలోని; వికారములన్ = కదలికలచేత; హృదయ = హృదయ మందలి; అనురాగ = ప్రేమతో; సంకలిత = కూడిన; విశేష = విశిష్టమైన; వాక్ = పలుకులు; మధుర = తీయని; గర్జనలన్ = ధ్వనులతో; లలిత = మనోజ్ఞమైన; ఆనన = ముఖము యనెడి; ఇందు = చంద్ర; మండల = మండలముచే; పరి = మిక్కిలి; శోభిత = శోభించుచున్న; అమృత = అమృతమును; విడంబిత = అనుకరించునట్టి; సుస్మిత = చిరునవ్వుతో కూడిన; సుప్రసన్నతా = మంచి ప్రసన్నతతో; ఫల = ఫలములను; రుచిర = మనోహరముగా; ప్రదానములన్ = అందించుటతోను; భామిని = స్త్రీ; భర్తన్ = భర్త యొక్క; మనంబున్ = మనసును; కొనెన్ = వశము చేసికొనెను.

భావము:

ఆ యొక్క దితి తన కడకంటి చూపులతో, అనురాగం పొంగి పొరలే శృంగార చేష్టలతో, చందమామ వంటి అందమైన ముఖంలో చిందే అమృతం వంటి చిరునవ్వులతో, ప్రసన్నమైన ముచ్చట్లతో, అపురూపాలైన సేవలతో మగని మనస్సును లొంగదీసుకొన్నది.

6-512-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఖిల మెఱిఁగిన కశ్యపు నంతవాని
హివు తలకెక్కు రతుల సంతులచేత
వశుఁ గావించె వ్రేల్మిడి బ్జవదన
తుల భ్రమియింప నేరని తులు గలరె?

టీకా:

అఖిలము = సమస్తమును; ఎఱిగిన = తెలిసిన; కశ్యపున్ = కశ్యపుని; అంతవానిన్ = అంతవాడిని; హితవు = నచ్చచెప్పుటలు; తలకెక్కు = తలకెక్కెడి; రతుల = అనురాగపు; సంగతుల = చేరికల; చేతన్ = చేత; అవశున్ = వివశుని; కావించె = చేసెను; వ్రేల్మిడిన్ = త్రుటిలో {వ్రేల్మిడి - చిటికవేసినంత తొందరగా, త్రుటి}; అబ్జవదన = అందగత్తె {అబ్జవదన - అబ్జము (పద్మము)వంటి వదన (మోముగలామె), అందమైన స్త్రీ}; పతులన్ = భర్తలను; భ్రమియింపన్ = భ్రమించుట; నేరని = చేతగాని; సతులు = భార్యలు; కలరె = ఉన్నారా ఏమి.

భావము:

పద్మమువంటి అందమైన ముఖం కలిగిన దితి సర్వజ్ఞుడైన కశ్యప ప్రజాపతి అంతటివాణ్ణి తన లీలా విలాసాలతో మురిపించి మైమరపించింది. భర్తలను భ్రమింప జేయలేని భార్యలుంటారా?

6-513-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

లఁ పెఱుఁగక నిలిచెడు
భూతంబులఁ జూచి ధాత పురుషుల మనముల్
భీతి గొలుపంగ యువతి
వ్రాతంబు సృజించెఁ; బతులు వారల కరుదే?

టీకా:

ఏ = ఏ విధమైన; తలపు = ఆలోచనలు; ఎఱుగక = తెలియక; నిలిచెడు = ఉండెడు; భూతంబులన్ = జీవులను; చూచి = చూసి; ధాత = బ్రహ్మదేవుడు; పురుషుల = పురుషుల యొక్క; మనములన్ = మనసులలో; భీతిన్ = భయమును; కొలుపన్ = కలుగునట్లు; యువతి = స్త్రీల; వ్రాతంబున్ = సమూహమును; సృజించెన్ = సృష్టించెను; పతులు = భర్తలు; వారల = వారి; కిన్ = కి; అరుదే = అరుదా ఏమి.

భావము:

బ్రహ్మ నిశ్చల చిత్తులైన పురుషులను చూచి వారి మనస్సులను వెఱపు కలుగ జేయటానికి స్త్రీలను పుట్టించాడు. స్త్రీలకు మగవారిని లొంగదీసుకొనడం ఏమైనా కష్టమా?

6-514-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇట్లు నిజసతిచేత నుపలాలితుండై కశ్యపప్రజాపతి యా సతికిం బరమప్రీతుం డై యిట్లనియె "నో తన్వీ! నీకుఁ బ్రసన్నుండ నైతి; వరంబు గోరు మిచ్చెద; నాథుండు ప్రసన్నుండైన స్త్రీలకుం గోరిక సంభవించుట కేమి గొఱంత? సతికిం బతియె దైవంబు సర్వభూతంబుల మానసంబులకు వాసుదేవుండె భర్త; నామరూప కల్పితులైన సకల దేవతామూర్తులచేతను ఋషులచేతను భర్తృరూపధరుం డయిన భగవంతుండు సేవింపబడుచుండు; స్త్రీలచేతఁ బతిరూపంబున భజియింపంబడుఁ; గావునం బతివ్రత లైన సుందరులు శ్రేయస్కామలై యేక చిత్తంబున నాత్మేశ్వరుం డయిన యప్పరమేశ్వరుని భర్తృభావంబున సేవించుచుండుదురు; నేనును నీదు భావంబున వరదుండ నైతి; దుశ్శీల లయిన వనితలకుం బొందరాని వరంబు నీ కిచ్చెద; వేఁడు" మనిన నా కశ్యపునకు దితి యిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; నిజ = తన; సతి = భార్య; చేతన్ = వలన; ఉపలాలితుండు = బుజ్జగింపబడినవాడు; ఐ = అయ్యి; కశ్యప = కశ్యపుడు యనెడి; ప్రజాపతి = ప్రజాపతి; ఆ = ఆ; సతి = భార్య; కిన్ = కి; పరమ = అత్యధికముగ; ప్రీతుండు = సంతోషము చెందినవాడు; ఐ = అయి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; ఓ = ఓ; తన్వీ = అందమైన దేహము గలదానా; నీ = నీ; కున్ = కు; ప్రసన్నుడను = ప్రసన్నమైన వాడను; ఐతి = అయితిని; వరంబున్ = వరమును; కోరుము = కోరుకొనుము; ఇచ్చెద = ఇచ్చెదను; నాథుండు = భర్త; ప్రసన్నుండు = ప్రసన్నమైన వాడు; ఐన = అయిన; స్త్రీల్ = స్త్రీల; కున్ = కు; కోరిక = కోరికలు; సంభవించుట = కలుగుట; కున్ = కు; ఏమి = ఏమి; కొఱంత = కొరత లుండును; సతి = భార్య; కిన్ = కి; పతియె = భర్తే; దైవంబు = దైవము; సర్వ = అఖిలమైన; భూతంబులన్ = జీవుల; మానసంబుల్ = మనసుల; కున్ = కు; వాసుదేవుండె = శ్రీకృష్ణుడే {వాసుదేవుడు - వసుదేవుని కుమారుడు, కృష్ణుడు}; భర్తన్ = భర్త; నామ = పేర్లు; రూప = స్వరూపములచేత; కల్పితంబులు = ఏర్పడెడివి; ఐన = అయిన; సకల = సమస్తమైన; దేవతా = దేవతల; మూర్తుల = స్వరూపముల; చేతను = చేతను; ఋషుల = ఋషుల; చేతను = చేతను; భర్తృ = భర్త యొక్క; రూప = రూపము; ధరుండు = ధరించినవాడు; అయిన = ఐన; భగవంతుండు = భగవంతుడు; సేవింపబడుచుండున్ = కొలువబడుచుండును; స్త్రీల్ = స్త్రీల; చేతన్ = చేత; పతి = భర్త; రూపంబునన్ = స్వరూపముతో; భజియింపబడున్ = పూజింపబడును; కావునన్ = అందుచేత; పతివ్రతలు = పతివ్రతలు; ఐన = అయిన; సుందరులు = అందగత్తెలు; శ్రేయస్ = శ్రేయస్సును; కామలు = కోరెడివారు; ఐ = అయ్యి; ఏక = ఏకాగ్రమైన; చిత్తంబునన్ = మనసుతో; ఆత్మ = తమ; ఈశ్వరుండు = భర్త; అయిన = ఐన; ఆ = ఆ; పరమేశ్వరుని = భగవంతుని; భర్తృ = భర్త యనెడి; భావంబునన్ = భావముతో; సేవించుచుండుదురు = కొలిచెదరు; నేనునున్ = నేనుకూడ; నీదు = నీ యొక్క; భావంబునన్ = ఎడల; వరదుండన్ = వరముల నిచ్చెడి వాడను, హరిని; ఐతి = అయితిని; దుశ్శీలలు = చెడు వర్తన గలవారు; అయిన = ఐన; వనితలు = స్త్రీల; కున్ = కి; పొందరాని = పొందటకు శక్యము గాని; వరంబున్ = వరములు; నీ = నీ; కున్ = కు; ఇచ్చెదన్ = ఇచ్చెదను; వేడుము = కోరుకొనుము; అనిన = అనగా; ఆ = ఆ; కశ్యపున్ = కశ్యపుని; కున్ = కి; దితి = దితి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

ఈ విధంగా తన భార్య చేస్తున్న సేవలకు కశ్యప ప్రజాపతి ఎంతో సంతోషించి ఆమెతో ఇలా అన్నాడు “దేవీ! నేను నీ ప్రవర్తనతో తృప్తి పడ్డాను. నీకు కావలసిన వరం కోరుకో. భర్త సంతోషిస్తే భార్యలకు కొరత ఏముంటుంది? సతులకు భర్తయే దైవం. సమస్త జీవరాసులకు వాసుదేవుడే పతి. నామ రూపాలు కల్పించబడ్డ ఇతర దేవతామూర్తులు, పురుషులు భర్త రూపంలో ఉన్న భగవంతునే ఆరాధిస్తూ ఉంటారు. అందువల్ల పతివ్రతలైన సతీమణులు శ్రేయస్సును కోరుకున్నవారై ఏకాగ్రభావంతో పతిదేవుని సేవిస్తుంటారు. అటువంటి భావం నీలో కలిగినందుకు నేను నీకు వరమిస్తున్నాను. చెడు నడత గల స్త్రీలకు దుర్లభమైన వరాన్ని నేను నీకు అనుగ్రహిస్తాను. కోరుకో” అని చెప్పగా ఆ కశ్యపునితో దితి ఇలా అన్నాది.

6-515-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"రము గోర నాకు రదుండ వేనిని
నింద్రుఁ ద్రుంచునట్టి యిద్ధబలుని
మిత తేజుఁ దనయు మరత్వసంప్రాప్తు
నెందుఁ జెడనివాని నిమ్ము నాథ!"

టీకా:

వరమున్ = వరము; కోరన్ = కోరుకొనుటకు; నాకు = నాకు; వరదుండవు = నారాయణుడవు {వరదుడు - వరములను ఇచ్చువాడు, విష్ణువు}; ఏనినే = ఐతే; ఇంద్రున్ = ఇంద్రుని; త్రుంచునట్టి = సంహరించెడి; ఇద్ధ = ప్రసిద్ధ; బలునిన్ = బలము గలవానిని; అమిత = అపరిమితమైన; తేజున్ = తేజస్సు గలవానిని; అమరత్వ = మరణము లేకపోవుట, దైవత్వము; సంప్రాప్తున్ = పొందువానిని; ఎందున్ = ఏ విధముగను; చెడని = మరణించని, పాడైపోని; వానిన్ = వానిని; ఇమ్ము = ఇమ్ము; నాథ = భర్త.

భావము:

“నాథా! నేను కోరుకున్న వరాన్ని ప్రసాదించేవాడవే అయితే ఇంద్రుణ్ణి చంపగలిగే పరాక్రమవంతుడు, తేజోవిరాజితుడు, అమరత్వాన్ని పొందినవాడు, దేనివల్లను నాశనం లేనివాడును అయిన ఒక కొడుకును నాకు అనుగ్రహించు”.

6-516-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అనవుడు

టీకా:

అనవుడు = అనగా.

భావము:

అని చెప్పగా...

6-517-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ట్టిపడునట్టి వర మీ
ట్టఁడి నన్నెట్టు వేఁడెఁ? టకట! యనుచున్
మిట్టిపడి యతఁడు మదిలోఁ
బుట్టిన తల్లడముతోడఁ బొక్కుచు నుండెన్.

టీకా:

ఉట్టిపడునట్టి = ఉలిక్కిపడునట్టి, ఉన్నట్టుండి కలిగెడి నట్టి; వరమున్ = వరమును; ఈ = ఈ; కట్టడి = కఠినురాలు; నన్ను = నన్ను; ఎట్టు = ఎలా; వేడెన్ = కోరెను; కటకట = అయ్యో; అనుచున్ = అనుకొనుచు; మిట్టిపడి = తుళ్ళిపడి; అతడు = అతడు; మది = మనసు; లోన్ = అందు; పుట్టిన = పుట్టిన; తల్లడమున్ = క్షోభ; తోడన్ = తోటి; పొక్కుచునుండెన్ = దుఃఖింతుచుండెను.

భావము:

కశ్యపుడు త్రుళ్ళిపడి “అయ్యో! ఉన్నట్టుండి ఈ కఠినురాలు ఇటువంటి క్రూరమైన వరాన్ని నన్నెలా కోరిందో?” అని లోలోపల తల్లడిల్లాడు.

6-518-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ప్రకృతిని గర్మపాశముల ద్ధుఁడ నైతిఁ గదయ్య! నేఁడు నే
విటసతీ స్వరూపమున వేఁదుఱు గొల్పిన మాయ నింద్రియా
ధిమతి యైనవాఁడు దన తెంపునఁ జిత్తము వెచ్చపెట్టి పా
ములఁ గూలకున్నె? నను దైవము నవ్వదె లోలితాత్మునిన్?

టీకా:

ప్రకృతిన్ = స్వభావమువలన; కర్మ = కర్మముల యొక్క; పాశములన్ = బంధనములవలన; బద్దుడను = బంధింపబడిన వాడను; ఐతి = అయిపోతిని; కద = కదా; అయ్య = తండ్రి; నేడు = ఇప్పుడు; నేన్ = నేను; వికట = పెడబుద్ధి గల; సతి = భార్య; స్వరూపమున = స్వరూపమున; వేదుఱు = వెఱ్ఱితనము; కొల్పిన = పట్టించిన; మాయన్ = మాయవలన; ఇంద్రియ = ఇంద్రియములకు; అధికమతి = మిక్కిలి లొంగినవాడు; ఐనవాడు = అయినట్టివాడు; తన = తన యొక్క; తెంపునన్ = తెగువవలన; చిత్తము = మనసును; వెచ్చపెట్టి = వేడెక్కించి; పాతకములన్ = మిక్కిలి పాపము లందు; కూలకున్నె = కూలిపోదా ఏమి; నను = నన్ను; దైవము = దైవము; నవ్వదే = పరిహసించదా ఏమి; లోలిత = చంచలమైన; ఆత్మునిన్ = మనసు గలవానిని.

భావము:

నేను కర్మపాశానికి బద్ధుడనై, వికట స్వభావం కలిగిన ఈమె మాయకు లోనై వెఱ్ఱివాడ నయ్యాను. ఇంద్రియలోలుడైన మానవుడు మనస్సును మలినం చేసుకొని పాపకూపంలో పడిపోక తప్పదు. నా చంచలత్వాన్ని చూసి దైవం పరిహసిస్తుంది.

6-519-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఖండ శర్కరతోడఁ లహించు పలుకులుఁ-
ద్మవిలాస మేర్పఱచు మోముఁ,
దుహినాంశు కళలతోఁ దులఁదూఁగు చెయ్వుఱుఁ-
జెమటఁ గ్రొన్నెత్తురు చేయు మేను,
నిలువెల్లఁ గరఁగించు నేర్పుల యింపులుఁ-
బువ్వుల కరుదైన ప్రోది చేఁత,
మకంబు రెట్టించు రితీపు తలఁపులు-
నెనసిన మదిలోని యిచ్చగింత,

6-519.1-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

లిగి కఱవనున్న కాలాహిపోలికిఁ
జెలఁగుచున్న సతుల చిత్తవృత్తిఁ
దెలియవశమె? యెంత ధృతి గలవారికి
నా కాదు నిఖిలలోములకు.

టీకా:

ఖండశర్కర = కలకండ; తోడన్ = తోటి; కలహించు = పోటీపడగల; పలుకులున్ = మాటలు; పద్మ = పద్మమువంటి; విలాసము = శోభని; ఏర్పరచు = ప్రకటించెడు; మోమున్ = ముఖము; తుహినాంశు = చంద్రుని; కళల = కళల; తోన్ = తోటి; తులదూగు = సాటివచ్చు; చెయ్వుఱున్ = చేష్టలు; చెమటన్ = చెమటలను; క్రొన్నెత్తురు = ఉడుకునెత్తురు; చేయు = కలిగించు; మేను = శరీరము; నిలువెల్ల = నిలువెల్లను; కరగించు = కరిగించెడి; నేర్పుల = నేర్పులు గల; ఇంపులు = చక్కదనములు; పువ్వుల్ = పువ్వుల; కున్ = కంటె; అరుదు = అపూర్వము; ఐన = అయిన; ప్రోదిచేత = ఉపచారములు; తమకంబున్ = వ్యామోహమును; రెట్టించు = రెట్టిపు చేసెడి; తరితీపు = సంతుష్టి, ఆపేక్ష; తలపులు = భావములు; ఎనసిన = అతిశయించిన; మది = మనసు; లోని = అందలి; ఇచ్చగింత = ప్రీతి; కలిగి = ఉన్నట్టి;
కఱవనున్న = కరవబోతున్న; కాలాహి = కాలసర్పము; పోలికిన్ = వలె; చెలగుచున్న = చెలరేగుచున్న; సతుల = స్త్రీల; చిత్తవృత్తి = తలపులు; తెలియ = తెలిసికొనుట; వశమె = సాధ్యమై; ఎంత = ఎంత; ధృతి = ధైర్యము; కలవారి = కలిగినవారి; కిన్ = కైనను; నాక = నాకే; కాదు = కాదు; నిఖిల = సమస్తమైన; లోకముల = లోకముల; కున్ = కును.

భావము:

స్త్రీల విలాసాలు బహు చిత్రమైనవి. కలకండ పలుకుల వంటి తీయని పలుకులతో, కమలంవంటి ముఖశోభతో, చంద్రకళలవంటి చిత్రమైన చేష్టలతో, నెత్తురు ఉడుకెత్తించే నెమ్మేనులతో, నిలువెల్ల కరగించి మైమరపించే మురిపాలతో, పువ్వులవంటి సుతిమెత్తని వలపులతో, మైకాన్ని రెట్టింపుచేసే తీయని తలపులతో, అందరాని గుండెలోతులతో, ఎటువంటి ధీరులనైనా వీరు సాధించి తీరుతారు. నాకే కాదు, ఈ సమస్త లోకానికీ కాంతల చిత్తవృత్తి అంతుచిక్కనిదే. అది కాటువేయటానికి కాచుకుని ఉన్న కాలసర్పం వంటిది.6-520-ఆ.

6-520-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కోరి సతుల కెల్లఁ గూర్చువా రెవ్వరు?
తులనైన సుతుల హితులనైన
లిమిఁ జెలిమి నైనఁ రహస్తముననైన
హింసబఱతు రాత్మ హితము కొఱకు.

టీకా:

కోరి = పూని; సతుల్ = భార్యల; ఎల్లన్ = సర్వమును; కూర్చువారు = కావలసినవారు; ఎవ్వరు = ఎవరు; పతులన్ = భర్తలను; ఐనన్ = అయినను; సుతుల్ = పుత్రులను; హితులన్ = స్నేహితులను; ఐనన్ = అయినను; బలిమిన్ = బలముతోను; చెలిమిన్ = స్నేహముతోను; ఐనన్ = అయినను; పర = శత్రువు; హస్తమునన్ = చేతితోను; ఐనన్ = అయినను; హింసపఱతురు = బాధించెదరు; ఆత్మ = తమ; హితము = ఇష్టపూర్తి; కొఱకు = కోసము.

భావము:

అతివలకు ఆత్మీయులంటూ ఎవరూ ఉండరు. అవసరమైతే సతులు తమ పతులని అయినా, హితులను అయినా బలవంతంగా వేధించి బాధించి, తమ పనులు సాధించుకుంటారు. పరుల నుండి సాయం తీసుకుని అయినా సరే హింసపెట్టి మరీ తమ పని నెరవేర్చుకుంటారు.

6-521-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అని చింతించి; "దీనికి నేమని ప్రతివాక్యం బిచ్చువాఁడ? మద్వచనం బెందు నమోఘంబు; త్రిలోకపరిపాలనశీలుం డయిన భిదురపాణి వధార్హుండె? యేను దీనికి నైనది యొకటి గల్పించెద" నని దితిం జూచి, "యో! తనుమధ్య! నీకు నట్ల దేవబాంధవుండయిన యింద్రహంత యగు పుత్రుండు గలిగెడు; నొక్క సంవత్సరంబు వ్రతంబునం జరియింపుము; దాని ప్రకారంబెల్ల నేను జెప్పెద, విను; మెల్ల జీవులవలన హింసాభావంబు లేక, యతిధ్వనివాక్యంబు లుడిగి, కోపంబు మాని, యనృతంబులు పలుకక, నఖరోమచ్ఛేదనంబు చేయక, యస్థికపాలాదు లయిన యమంగళంబుల నంటక, నదీతటాకాదులన కాని ఘటోదక కూపోదకంబుల స్నానంబు చేయక, దుర్జన సంభాషణంబు వర్జించి, కట్టిన కోకను ముడిచిన పువ్వులను గ్రమ్మఱ ధరియింపక, భోజనంబుల యందు నుచ్ఛిష్టాన్నంబును జండికా నివేదితాన్నంబును కేశ శునక మార్జార కంక క్రిమి పిపీలికాది విదూషితాన్నంబును నామిషాన్నంబును వృషలాహితాన్నంబును నను నీ పంచవిధ నిషిద్ధాన్నంబులు వర్జించి, దోయిట నీళ్ళు ద్రావక, సంధ్యాకాలంబుల ముక్తకేశిగాక, మితభాషిణియై, యలంకారవిహీనగాక, వెలుపలం దిరుగక, పాదప్రక్షాళనంబు చేసికొని కాని శయనింపక, యార్ద్రపాదయై పవ్వళింపక, పశ్చిమ శిరస్కయయ్యును నగ్నయయ్యును సంధ్యాకాలంబులను నిద్రింపక, నిత్యంబును ధౌతవస్త్రంబులుగట్టి, శుచియై, సర్వమంగళ సంయుక్తయై, ప్రాతఃకాలంబున లక్ష్మీనారాయణల నారాధించి, యావాహనార్ఘ్యపాద్యోపస్పర్శన సుస్నాన వాసోపవీత భూషణ పుష్ప ధూప దీపోపహారాద్యుపచారంబుల నర్చించి, హవిశ్శేషంబు ద్వాదశాహుతుల వేల్చి దండప్రణామంబు లాచరించి, భగవన్మంత్రంబును దశవారంబు లనుసంధించి స్తోత్రంబు చేసి, గంధ పుష్పాక్షతంబుల ముత్తైదువలం బూజించి, పతిని సేవించి, పుత్రుం గుక్షిగతుంగా భావించి యివ్విధంబున మార్గశీర్ష శుద్ధ ప్రతిపదారంభంబుగా నొక్క సంవత్సరంబు సలిపి, యా ద్వాదశ మాసాంత్యదివసంబున విధ్యుక్తంబుగా నుద్యాపనంబు చేయవలయును; నీ వీ పుంసవనం బనియెడి వ్రతంబు ద్వాదశమాస పర్యంతం బేమఱక సల్పిన, నీవు గోరిన కుమారుండు గలిగెడు" ననిన దితి యా వ్రతంబుతోడనె గర్భంబు ధరియించి వ్రతంబు సలుపుచునుండ నింద్రుండు మాత్రభిప్రాయం బెఱింగి, యా యమ్మ నహరహంబును రహస్యంబున సేవించుచు; వ్రతంబునకుం దగిన పుష్ప ఫల సమిత్కుశ పత్రాంకురంబులు మొదలయిన వస్తు వితతిం ద్రికాలంబులం దెచ్చి యిచ్చుచుఁ, బుండరీకంబు హరిణికిం బొంచి యున్న భంగి నా యమ్మ వ్రత భంగంబునకై కాచి శుశ్రూష చేయుచు నా యమ్మ ధరియించిన తేజో విశేషంబునకు బెగ్గలించుచుఁ గృశించుచు నుండె; నంత నొక్కనాడు.
1) ^పుంసవన వ్రతము
2) ^పంచవిధ నిషిద్ధాన్నములు

టీకా:

అని = అని; చింతించి = విచారించి; దీని = ఈమె; కిన్ = కును; ఏమని = ఏమని; ప్రతివాక్యం బిచ్చువాడన్ = బదు లివ్వగలను; మత్ = నా యొక్క; వచనంబు = పలుకులు; ఎందున్ = ఏ విధముగను; అమోఘంబు = తిరుగులేనివి; త్రిలోక = ముల్లోకములను; పరిపాలన = పరిపాలించెడి; శీలుండు = నడవడిక గలవాడు; అయిన = ఐన; భిదురపాణి = ఇంద్రుడు {భిదురపాణి - భిదురము (వజ్రాయుధము) పాణి (చేపట్టినవాడు), ఇంద్రుడు}; వధ = సంహరించుటకు; అర్హుడె = తగినవాడా ఏమి; ఏను = నేను; దీని = దీని; కిన్ = కోసము; ఐనది = అవసరమైనది; ఒకటి = ఏదో ఒకటి; కల్పించెదను = చేసెదను; అని = అని; దితిన్ = దితిని; చూచి = చూసి; ఓ = ఓ; తనుమధ్య = అందగత్తె {తను మధ్య - సన్నని నడుము గలామె, స్త్రీ}; నీ = నీ; కున్ = కు; అట్ల = ఆ విధముగ; దేవ = దేవతలకు; బాంధవుడు = బంధువు; అయిన = అయినట్టివాడు; ఇంద్ర = ఇంద్రుని; హంత = అంతము చేయగలవాడు; అగు = అయిన; పుత్రుండు = కుమారుడు; కలిగెడున్ = కలుగును; ఒక్క = ఒక; సంవత్సరంబు = సంవత్సరము; వ్రతంబునన్ = నిష్ఠతో; చరియింపుము = నడువుము; దాని = దాని యొక్క; ప్రకారంబు = విధానము; ఎల్లన్ = అంతయు; నేను = నేను; చెప్పెదన్ = తెలియజెప్పెదను; వినుము = వినుము; ఎల్లన్ = సమస్తమైన; జీవుల = ప్రాణుల; వలన = ఎడల; హింసా = బాధించెడి; భావంబు = బుద్ధి; లేక = లేకుండగ; అతిధ్వని = గట్టిగా, పెద్ద ధ్వనితో; వాక్యంబులు = మాట్లాడుటలు; ఉడిగి = విడిచిపెట్టి; కోపంబు = కోపమును; మాని = మానివేసి; అనృతంబులు = అబద్ధములు; పలుకక = చెప్పక; నఖ = గోర్లు; రోమ = శిరోజముల; ఛేదనంబు = కత్తిరించుట; చేయక = చేయకుండ; అస్థి = అస్థికలు; కపాల = కపాలములు; ఆదులు = మొదలైనవి; అయిన = ఐన; అమంగళంబులన్ = అశుభకరములను; అంటక = ముట్టకుండ; నదీ = నదులు; తటాక = చెరువులు; ఆదులన = మొదలగువానిలో మాత్రమే; కాని = తప్ప; ఘట = కుండలలోని; ఉదక = నీరు; కూప = నూతులలోని; ఉదకంబులన్ = నీటిలోను; స్నానంబు = స్నానములు; చేయక = చేయకుండ; దుర్జన = చెడ్డవారితో; సంభాషణంబున్ = మాటలను; వర్జించి = విడిచిపెట్టి; కట్టిన = ఒకమారు కట్టుకొనిన; కోకను = బట్టను; ముడిచిన = ఒకసారి ధరించిన; పువ్వులను = పువ్వులను; క్రమ్మఱ = మరల; ధరియింపక = ధరించకుండ; భోజనంబుల = ఆహారము తినుట; అందు = అందు; ఉచ్చిష్ట = భుజింపగా మిగిలిన, ఎంగిలి; అన్నంబును = ఆహారములను; చండికా = కాళికాదేవికి; నివేదిత = నైవేద్యము పెట్టిన; అన్నంబును = ఆహారము; కేశ = వెంట్రుకలు; శునక = కుక్క; మార్జాల = పిల్లి; కంక = పక్షి; క్రిమి = పురుగు; పిపీలిక = చీమలు; ఆది = మొదలగు వానిచే; విదూషిత = అపరిశుభ్రమైన; అన్నంబును = అన్నమును; ఆమిషాన్నంబును = మాంసాహారమును; వృషల = శూద్రులు {వృషలుడు - శూద్రునికి బ్రాహ్మణస్త్రీ యందు పుట్టినవాడు}; ఆహిత = తెచ్చిన; అన్నంబును = అన్నమును; అను = అనెడి; ఈ = ఈ; పంచ = ఐదు; విధ = విధముల; నిషిద్ధ = నిషిద్ధమైన; అన్నంబులు = ఆహారములు; వర్జించి = విడిచిపెట్టి; దోయిట = దోసిళ్ళతో; నీళ్ళు = నీళ్ళు; త్రావక = తాగకుండగ; సంధ్యాకాలంబులన్ = సంధ్యాసమయములలో; ముక్త = విరబోసుకొన్న; కేశ = శిరోజములు గలామెగా; కాక = కాకుండగ; మిత = పరిమితముగ; భాషిణి = మాట్లాడెడి యామె; ఐ = అయ్యి; అలంకార = అలంకారములు; విహీన = లేని యామె; కాక = కాకుండగ; వెలుపలన్ = బయట; తిరుగక = చరించకుండగ; పాద = పాదములను; ప్రక్షాళనంబు = కడుకొనుట; చేసికొని = చేసుకొని; కాని = తప్ప; శయనింపక = పండుకొనక; ఆర్ద్ర = తడిగా ఉన్న; పాద = పాదములు గలామె; ఐ = అయ్యి; పవ్వళింపక = పండుకొనక; పశ్చిమ = పడమర దిక్కునకు; శిరస్క = తల కలామె; అయ్యున్ = అయ్యి; నగ్న = వివస్త్ర; అయ్యున్ = అయ్యి; సంధ్యాకాలంబులన్ = సంధ్యాసమయముల లోను; నిద్రింపక = నిద్రపోవకుండ; నిత్యంబును = ఎల్లప్పుడు; ధౌత = ఉతికిన; వస్త్రంబులన్ = బట్టలనే; కట్టి = కట్టుకొని; శుచి = శుభ్రముగా నున్నామె; ఐ = అయ్యి; సర్వ = అన్ని; మంగళ = తిలకాదుల {మంగళాభరణములు - నుదుట తిలకము, చేతులకు గాజులు, కాళ్ళకి పట్టీలు, కాలి వేళ్ళకి మట్టెలు, మెడలో మంగళసూత్రములు మొదలగు శుభకరమైన స్త్రీలు ధరించెడి ఆభరణములు}; సంయుక్తము = చక్కగా గలామె; ఐ = అయ్యి; ప్రాతఃకాలమున = తెల్లవారగట్ల; లక్ష్మీ = లక్ష్మీదేవి; నారాయణులన్ = నారాయణులను; ఆరాధించి = పూజించి; ఆవాహన = ఆవాహన చేయుట; అర్ఘ్య = అర్ఘ్యము సమర్పించుట; పాద్య = పాద్యము సమర్పించుట; ఉపస్పర్శన = ఆచమనము సమర్పించుట; సుస్నాన = సుస్నానము సమర్పించుట; వాసః = వస్త్రము సమర్పించుట; ఉపవీత = ఉపవీతము సమర్పించుట; భూషణ = అలంకారములు సమర్పించుట; పుష్ప = పువ్వులను సమర్పించుట; ధూప = ధూపము చూపుట; దీప = దీపము చూపుట; ఉపహార = నైవేద్యము పెట్టుట; ఆది = మొదలగు; ఉపచారంబులన్ = ఉపచారములతో; అర్చించి = పూజించి; హవిస్ = హవిస్సు; శేషంబున్ = మిగిలినదానిని; ద్వాదశాహుతులన్ = ద్వాదశాగ్నులలో (12); వేల్చి = వేల్చి; దండప్రణామంబులు = దండ నమస్కారములు; ఆచరించి = చేసి; భగవత్ = భగవంతుని; మంత్రంబును = మంత్రమును; దశ = పది; వారంబులు = సార్లు, పర్యాయములు; అనుసంధించి = నిష్ఠగాచేసి; స్తోత్రంబున్ = స్తోత్రములను; చేసి = చేసి; గంధ = మంచిగంధము; పుష్ప = పువ్వులు; అక్షతంబులన్ = అక్షింతలతో; ముత్తైదువులన్ = పునిస్త్రీలను; పూజించి = సేవించి; పతిని = భర్తను; సేవించి = కొలిచి; పుత్రున్ = కుమారుని; కుక్షి = కడుపు; గతున్ = లో ఉన్నవాని; కాన్ = అగునట్లు; భావించి = అనుకొని; ఈ = ఈ; విధంబునన్ = విధముగ; మార్గశీర్ష = మార్గశిరమాసము; ప్రతిపత్ = పాడ్యమి తిథినాటితో; ఆరంభంబు = ప్రారంభించినది; కాన్ = అగునట్లు; ఒక్క = ఒక; సంవత్సరంబు = సంవత్సరము; సలిపి = ఆచరించి; ఆ = ఆ యొక్క; ద్వాదశ = పన్నెండవ; మాస = నెల; అంత్య = ఆఖరి; దివసమున = దినమున; విధ్యుక్తంబుగా = పద్ధతిప్రకారము; ఉద్యాపనంబు = ఉద్యాపనము; చేయవలెయును = చేయవలెను; నీవు = నీవు; ఈ = ఈ; పుంసవనంబు = పుంసవనము {పుంసవనము - పుత్ర సంతానము గావలె నని చేసెడి యజ్ఞము (శుభకార్యము)}; అనియెడి = అనెడి; వ్రంతంబున్ = వ్రతమును {వ్రతము - నిష్ఠ ధరించి చేసెడిది}; ద్వాదశ = పన్నెండు; మాస = నెలల; పర్యతంబు = వరకు; ఏమఱక = మరచి కూడ పొరపాటు చేయక; సల్పిన = ఆచరించినచో; నీవు = నీవు; కోరిన = కోరినట్టి; కుమారుండు = పుత్రుడు; కలిగెడున్ = పుట్టును; అనినన్ = అనగా; దితి = దితి; ఆ = ఆ; వ్రతంబు = వ్రతము; తోడనె = మొదలిడగనె; గర్భంబున్ = గర్భమును; ధరియించి = తాల్చి; వ్రతంబు = వ్రతమును; సలుపుచునుండన్ = ఆచరించుచుండగా; ఇంద్రుండు = ఇంద్రుడు; మాతృ = తల్లి యొక్క; అభిప్రాయము = ఉద్దేశము; ఎఱింగి = తెలిసికొని; ఆ = ఆ; అమ్మనున్ = తల్లిని; అహరహంబును = ప్రతి దినమునను; రహస్యంబునన్ = రహస్యముగ; సేవించుచున్ = కొలుచుచు; వ్రతంబున్ = వ్రతమున; కున్ = కు; తగిన = తగినట్టి; పుష్ప = పువ్వులు; ఫల = పండ్లు; సమిత్ = సమిధలు; కుశ = దర్భలు; పత్ర = ఆకులు; అంకురంబులున్ = చిగురుటాకులు; మొదలయిన = మొదలగు; వస్తు = వస్తువుల; వితతిన్ = సమూహములను; త్రికాలంబున్ = ముప్పొద్దులను; తెచ్చి = తీసుకువచ్చి; ఇచ్చుచున్ = ఇచ్చుచు; పుండరీకంబున్ = పులి; హరిణి = ఆడు లేడి; కిన్ = కోసము; పొంచి = దాగి; ఉన్న = ఉన్న; భంగిన్ = విధముగ; ఆ = ఆ; అమ్మ = తల్లి; వ్రత = వ్రతము యొక్క; భంగంబున్ = భంగపాటు; కై = కోసము; కాచి = కాచుకొని; శుశ్రూష = సేవ; చేయుచున్ = చేయుచు; ఆ = ఆ; అమ్మ = తల్లి; ధరియించిన = ధరించిన; తేజస్ = తేజస్సు యొక్క; విశేషంబున్ = విశిష్టత; కున్ = కు; బెగ్గలించుచున్ = భయపడుతూ; కృశించుచునుండె = చిక్కిపోవుచుండె; అంతన్ = అంతట; ఒక్క = ఒక; నాడు = దినమున.

భావము:

అని తలపోసి కశ్యప ప్రజాపతి “ఈమెకు ఏమని సమాధానం చెప్పను? నా మాట పొల్లు పోరానిది. ముల్లోకాలకు అధినాథుడైన ఇంద్రుడు చంపదగినవాడా? ఇప్పుడు ఈమె కుటిలబుద్ధికి తగినట్లు ఒక ఉపాయం కల్పిస్తాను” అనుకొని దితిని చూచి “తలోదరీ! నీ కోరిక ప్రకారం ఇంద్రుని సంహరించగల కొడుకు జన్మించడానికి నీవు ఒక సంవత్సరం నియమంతో ఒక వ్రతాన్ని ఆచరించాలి. దాని విధివిధానాలు చెప్తాను విను. అన్ని జీవులపట్ల హింసాభావం విడిచి పెట్టాలి, పెద్దగా మాట్లాడరాదు, అసత్యం పలుకకుండ ఉండాలి, గోళ్ళను వెంట్రుకలను కత్తిరించుకోరాదు, ఎముకలు కపాలాలు మొదలైన అమంగళ వస్తువులను తాకరాదు, నదులలో సరస్సులలో తప్పించి కుండలోని బావిలోని నీళ్ళతో స్నానం చేయరాదు, దుష్టులతో ముచ్చటలాడరాదు, విడిచిన చీర కట్టుకొనకుండ, ముడిచిన పూలు పెట్టుకొనకుండ ఉండాలి. ఎంగిలి అన్నం, కాళికి నివేదించిన అన్నం, కోతులు కుక్కలు పిల్లులు పక్షులు చీమలు ముట్టిన అన్నం, మాంసంతో కూడిన అన్నం, శూద్రులు తెచ్చిన అన్నం అనే ఈ ఐదు నిషిద్ధాహారాలను తినరాదు. దోసిళ్ళతో నీళ్ళు త్రాగరాదు. సంధ్యాసమయాలలో జుట్టు విరబోసుకొని తిరుగరాదు. అతిగా మాట్లాడరాదు. అలంకారాలు లేకుండా ఉండరాదు. ఆరుబయట సంచరించరాదు. కాళ్ళు కడుగుకొనకుండా పడుకొనరాదు. సంధ్యావేళల్లో నిద్రించరాదు. ఎల్లప్పుడు ఉతికిన వస్త్రాలు కట్టుకొని, మంగళ ద్రవ్యాలు ధరించి శుచిగా ఉండాలి. ప్రాతఃకాలంలో తూర్పుముఖంగా కూర్చొని లక్ష్మీనారాయణులను ఆరాధించాలి. ఆవాహనం, అర్ఘ్యం, పాద్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, అలంకారం, పుష్పం, ధూపం, దీపం మొదలైన ఉపచారాలతో పూజించాలి. పన్నెండు ఆహుతులతో హోమకార్యం నెరవేర్చి నమస్కరించాలి. పదిసార్లు భగవంతుని మంత్రాన్ని జపించి స్తుతించాలి. గంధ పుష్పాక్షతలతో ముత్తైదువులను పూజించాలి. భర్తను భక్తితో సేవిస్తూ పుత్రుడు గర్భంలో ఉన్నట్లు భావించాలి. ఈ విధంగా మార్గశిర శుద్ధ పాడ్యమి మొదలుకొని ఒక సంవత్సరం ఈ వ్రతాన్ని ఆచరించి చిట్టచివరినాడు యథావిధిగా ఉద్యాపనం తీర్చుకోవాలి. పుంసవనం అనే ఈ వ్రతాన్ని ఈ విధంగా పన్నెండు నెలల పాటు పొరపాటు వాటిల్లకుండా ఆచరిస్తే నీవు కోరిన కుమారుడు నీకు జన్మిస్తాడు” అని కశ్యపుడు చెప్పగా దితి వ్రతాన్ని అవలంబించి గర్భవతి అయింది. ఇంద్రుడు పినతల్లి అభిప్రాయాన్ని తెలుసుకొని ఆమెను సేవిస్తూ, ప్రతిదినమూ వ్రతానికి కావలసిన పూలు, పండ్లు, సమిధలు, పత్రాలు, పల్లవాలు తెచ్చి ఇస్తూ లేడికోసం పొదలొ దాగి ఉన్న పులివలె ఆమె వ్రతభంగం కోసం కాచుకొని ఉన్నాడు. ఆమె గర్భంలోని తేజోవిశేషానికి దిగులు పడి కృశించసాగాడు. అంతలో ఒకరోజు...

6-522-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వామాక్షి యనుదిన వ్రతధార ణోన్నత-
రిచర్య విధులచే డలి యలసి
యొంటి సంధ్యావేళ నుచ్ఛిష్ట యై పద-
ప్రక్షాళ నాదులఁ బాసి మఱచి
నకర్మ మోహంబు విలి నిద్రింపంగ-
నింద్రుండు సయ్యన నెడరు గాంచి
యోగమాయా బలోద్యుక్తుఁడై యా యింతి-
యుదరంబుఁ జొరఁబడి యుగ్రుఁ డగుచుఁ

6-522.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

దివిరి దేదీప్యమానమై తేజరిల్లు
ర్భకుని వజ్రధారల డిచె నేడు
దునుకలుగ వాఁడు దునిసియుఁ దునుక దునుక
చెడక యొక్కక్క బాలుఁడై చెలఁగుచున్న.

టీకా:

వామాక్షి = స్త్రీ {వామాక్షి - చక్కటి కన్నులు గలామె, స్త్రీ}; అనుదిన = ప్రతిదినము; వ్రత = వ్రతము; ధారణ = ధరించుట; ఉన్నత = అధికమైన; పరిచర్య = సేవించెడి; విధుల్ = కార్యక్రమముల; చేన్ = వలన; బడలి = శ్రమపడి; అలసి = అలసిపోయి; ఒంటిన్ = ఒంటరిగా; సంధ్యవేళన్ = సంధ్యాసమయమున; ఉచ్చిష్ట = ఉచ్చిష్టమును భుజించినామె; ఐ = అయ్యి; పద = కాళ్లు; ప్రక్షాళనంబున్ = కడుకొనుట; పాసి = విడిచిపెట్టి; మఱచి = ప్రమాదవశాత్తు; తన = తన యొక్క; కర్మ = ప్రారబ్ధకర్మ వలన కలిగిన; మోహంబున్ = మోహము నందు; తవిలి = తగులుకొని, పడిపోయి; నిద్రింపంగన్ = నిద్రపోగా; ఇంద్రుడు = ఇంద్రుడు; సయ్యన్ = చటుక్కున; ఎడరు = అవకాశము; కాంచి = చూసి; యోగమాయ = యోగమాయ యొక్క; బల = బలముతో; ఉద్యుక్తుడు = సంకల్పించుకొన్నవాడు; ఐ = అయ్యి; ఆ = ఆ; ఇంతి = స్త్రీ; ఉదరంబున్ = కడుపులో; చొరబడి = ప్రవేశించి; ఉగ్రుడు = భయంకరుడు; అగుచున్ = అగుచు; తివిరి = కోరి;
దేదీప్యమానము = మిక్కిలి ప్రకాశించుచున్నది; ఐ = అయ్యి; తేజరిల్లున్ = విలసిల్లెడి; అర్భకుని = పిల్లవానిని; వజ్ర = వజ్రాయుధపు; ధారలన్ = పదునులతో; అడిచెన్ = నరికెను; ఏడు = ఏడు (7); తునుకలుగ = ముక్కలుగా; వాడున్ = వాడు; తునిసియున్ = ముక్క లయ్యి కూడ; తునుకదునుకన్ = ముక్క ముక్కకి; చెడక = మరణించ కుండా; ఒక్కొక్క = ఒక్కొక్క; బాలుడు = పిల్లవాడు; ఐ = అయ్యి; చెలగుచున్న = చెలరేగుచుండగ.

భావము:

ప్రతిదినమూ దీక్షతో నియమపూర్వకంగా వ్రతాన్ని చేస్తున్న దితి ఒకనాడు పని బడలికతో అలసి సంధ్యాసమయంలో ఉచ్ఛిష్టం భుజించి, కాళ్ళు కడుగుకొనకుండా మరచిపోయి, కర్మ వశాత్తు నిద్రపోయింది. సమయం కోసం ఎదురు చూస్తున్న ఇంద్రుడు సందు చూసుకొని యోగమాయతో ఆమె గర్భంలో జొరబడి అందులో దేదీప్యమానంగా వెలుగుతున్న బాలుణ్ణి కోపావేశంతో తన వజ్రాయుధంతో ఏడు ముక్కలు చేశాడు. ఆ శిశువు ముక్కలై కూడా ఒక్కొక్క ముక్క ఒక్కొక్క బాలుడై ప్రకాశిస్తుండగా....

6-523-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వా డేర్వు రగుచుఁ గుయ్యిడ
నోరి యఱవ కనుచుఁ ద్రుంచె నొక్కక్కని నా
శూరుం డేడ్గురఁ దునుకలు
గా యమున వారు చెడక ఖండితు లయ్యున్.

టీకా:

వాడున్ = వాడు; ఏడ్వురు = ఏడుగురు (7); అగుచున్ = అగుచు; కుయ్యిడన్ = ఏడ్చుచుండగా; ఓరి = ఓరి; అఱవక = అరవకండి; అనుచున్ = అని పలుకుచు; త్రుంచెన్ = నరికెను; ఒక్కక్కనిన్ = ఒక్కొక్కడిని; ఆ = ఆ; శూరుండు = వీరుడు; ఏడ్గురన్ = ఏడుగురు (7) చొప్పున; తునుకలుగా = ముక్కలుగా; రయమునన్ = శ్రీఘ్రమే; వారున్ = వారు; చెడక = మరణించకుండగ; ఖండితులు = నరకబడినవారు; అయ్యున్ = అయినప్పటికిని.

భావము:

ఆ ఏడుగురు బాలురు గొత్తెత్తి బిగ్గరగా అరవసాగారు. “ఓరీ అరవకండి” అంటూ ఇంద్రుడు ఒక్కొక్క బాలుణ్ణి మళ్ళీ ఏడేడు ముక్కలుగా ఖండించాడు. అయినా వాళ్ళు నాశనం కాలేదు.

6-524-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఖంము లన్నియు నందఱుఁ
జండాంశు సమప్రకాశ శాశ్వతు లగుచున్
మెండుకొని నిల్చి యని రా
ఖంలునకుఁ గరుణ పుట్టుతి మతిఁ దోపఁన్.

టీకా:

ఖండములు = ముక్కలు; అన్నియున్ = అన్ని; అందఱున్ = అంతమంది కూడ; చండాంశున్ = సూర్యునితో {చండాంశుడు - చండ (భయంకరమైన) అంశుడు (కిరణములు గలవాడు), సూర్యుడు}; సమ = సమానమైన; ప్రకాశ = ప్రకాశము గలవారు; శాశ్వతులు = శాశ్వతమైన స్వరూపము గలవారు; అగుచున్ = అగుచు; మెండుకొని = గుంపుగూడి; నిల్చి = ఉండి; అనిరి = పలికిరి; ఆఖండలున్ = ఇంద్రుని; కున్ = కి; కరుణ = దయ; పుట్టు = కలుగు; గతిన్ = విధముగ; మతిన్ = మనసున; తోపన్ = హత్తుకొనునట్లు.

భావము:

నలభై తొమ్మిది ఖండాలు సూర్యునితో సమానమైన కాంతి కల బాలురుగా అయ్యారు. వారందరూ ఒక్కటిగా చేరి ఇంద్రుని మనస్సుకు జాలి పుట్టే విధంగా...

6-525-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అందఱు ముకుళిత కరకమలులై "నీకుం దోడుబుట్టువులము; మమ్ము హింసింపంబనిలేదు; నీకుం బారిషదులమై మరుద్గణములమై నిన్ను సేవించెదము; మమ్ము రక్షింపు" మనిన నారాయణ ప్రసాదంబునం జెడని మరుద్గణంబుల పలుకులం గృపాళుండై, యింద్రుండు వారల సహోదరులంగాఁ గైకొని మఱి హింసింపక మానె; అశ్వత్థామశరాగ్నివలన నారాయణ రక్షితుండ వయిన నీవునుం బోలెఁ గులిశధారల శకలంబు లయిన కుమారుం డన్నిరూపంబులై సంవత్సరంబునకు నొక్కింత కడమగా హరి బూజించినవారు గావున, నింద్రుతోడం గూఁడ బంచాశద్దేవత లయిన మరుద్గణంబులు దితి గర్భంబు వెలువడి; రంత దితి మేల్కాంచి యనలప్రకాశులై యింద్రు తోడం గూడి వెలుంగుచున్న కుమారులం జూచి, సంతోషింపక యింద్రుంజూచి నీకు "మృత్యురూపంబయిన పుత్రుం గోరి దుస్తరంబయిన వ్రతంబు సలిపితి; సంకల్పించిన పుత్రుం డొక్కరుం డీ సప్త సంఖ్య గల కుమారు లగుట కేమి కతంబు? నీ వెఱింగిన భంగిన తథ్యంబు పలుకు" మనిన నింద్రుం డిట్లనియె "తల్లీ భవద్వ్రతంబుఁ జింతించి సమయ విచ్చేదనంబున గర్భంబుఁ జొచ్చి పాప చిత్తుండనై వజ్రధారల గర్భంబు విదళనంబు చేసిన నా శకలంబులు చెడక మహాశ్చర్యంబుగా నివ్విధంబునం గుమారు లైరి; మహాపురుష పూజాసంసిద్ధి కార్యానుషంగి కాకుండునే? భగవదారాధనంబు గోరికలఁ బాపి యెవ్వరు గావింతురు; వారిహపరంబుల సర్వార్థకుశలు లగుదు; రమ్మహాపురుష వ్రతసముత్పన్న తేజంబు నడంప నెవ్వం డోపుఁ? గావున దుర్మదంబున బాలిశ స్వభావుండనై దోషంబు చేసిన నా దౌర్జన్య కర్మంబు సహింపఁ దల్లికన్న నెవ్వరు సమర్థులు? పాపాత్ముండ నగు నన్నుం గావుము; నేను వీరలతోడివాఁడ నని నిష్కపటంబుగాఁ బ్రార్థించిన నద్దేవి "యట్టకాక" యని శాంతచిత్త యయ్యె; నింద్రుండును వారలం గూడి త్రిదివంబునకుం బోయి సోమపాన హవిర్భాగంబులు వారలకుం బంచిపెట్టి సుఖంబుండె" నని చెప్పి పరీక్షిన్నరేంద్రునకు శుకయోగీంద్రుండు వెండియు నిట్లనియె.

టీకా:

అందఱున్ = అందరును; ముకుళిత = ముడిచిన; కర = చేతులు యనెడి; కమలులు = పద్మములు గలవారు; ఐ = అయ్యి; నీ = నీ; కున్ = కు; తోడుబుట్టువులము = సోదరులము; మమ్మున్ = మమ్ములను; హింసింపన్ = సంహరించవలసిన; పనిలేదు = అవసరములేదు; నీ = నీ; కున్ = కు; పారిషదులము = పరిచరులము; ఐ = అయ్యి; మరుత్ = మరుత్తుల; గణములము = సమూహముల వారము; ఐ = అయ్యి; నిన్ను = నిన్ను; సేవించెదము = కొలిచెదము; మమ్మున్ = మమ్ములను; రక్షింపుము = కాపాడుము; అనిన్ = అనగా; నారాయణ = హరి; ప్రసాదంబునన్ = అనుగ్రహమువలన; చెడని = మరణించని; మరుద్గణంబులన్ = మరుద్గణముల యొక్క; పలుకులన్ = మాటలను; కృపాళుండు = దయ గలవాడు; ఐ = అయ్యి; ఇంద్రుడు = ఇంద్రుడు; వారలన్ = వారిని; సహోదరులున్ = సోదరులుగా; కైకొని = చేపట్టి; మఱి = ఇంక; హింసింపక = చంపక; మానెన్ = మానివేసెను; అశ్వత్థామ = అశ్వత్థామ; శర = బాణముల; అగ్నిన్ = అగ్ని; వలన = వలన; నారాయణున్ = హరిచే; రక్షితుడవు = కాపాడబడిన వాడవు; అయిన = అయినట్టి; నీవునున్ = నీ; పోలెన్ = వలెనే; కులిశ = వజ్రాయుధపు; ధారలన్ = పదునులతో; శకలంబులు = ముక్కలు; అయిన = అయినట్టి; కుమారుండు = పుత్రుడు; అన్ని = అన్ని; రూపంబులు = స్వరూపములు గలవారు; ఐ = అయ్యి; సంవత్సరంబున్ = సంవత్సరము; కున్ = కు; ఒక్కింత = కొంచము; కడమగా = తక్కువగా, ముందుగా; హరిన్ = నారాయణుని; పూజించినన్ = పూజించిన; వారున్ = వారు; కావునన్ = అగుటచే; ఇంద్రు = ఇంద్రుని; తోడన్ = తోటి; కూడన్ = కలిసి; పంచాశత్ = ఏభైమంది (50); దేవతలు = దేవతలు; అయిన = కాగా; మరుద్గణంబులు = మరుద్గణములు; దితి = దితి యొక్క; గర్భంబున్ = కడుపునుండి; వెలువడిరి = బయటపడిరి; అంతన్ = అంతట; దితి = దితి; మేల్కాంచి = మేలుకొని; అనల = అగ్ని వలె; ప్రకాశులు = ప్రకాశించెడివారు; ఐ = అయ్యి; ఇంద్రు = ఇంద్రుని; తోడన్ = తోటి; కూడి = కలిసి; వెలుంగుచున్న = ప్రకాశించుతున్న; కుమారులన్ = పుత్రులను; చూచి = చూసి; సంతోషింపక = సంతోషించకుండగ; ఇంద్రున్ = ఇంద్రుని; చూచి = చూసి; నీ = నీ; కున్ = కు; మృత్యు = మరణము యొక్క; రూపంబు = రూపము; అయిన = కలిగిన; పుత్రున్ = కుమారుని; కోరి = కోరి; దుస్తరంబు = తరించరానిది; అయిన = అయినట్టి; వ్రతంబున్ = వ్రతమును; సలిపితిన్ = ఆచరించితిని; సంకల్పించిన = కోరిన; పుత్రుండు = కుమారుడు; ఒక్కరుండ = ఒకడు మాత్రమే; ఈ = ఈ; సప్తసంఖ్య = ఏడుగురేసి; కల = కలిగిన; కుమారుల్ = పుత్రులు; అగుట = పుట్టుట; కున్ = కు; ఏమి = ఏమిటి; కతంబు = కారణము; నీవున్ = నీవు; ఎఱింగిన = తెలిసికొన్న; భంగినన్ = విధముగా; తథ్యంబున = తప్పక; పలుకుము = చెప్పుము; అనినన్ = అనగా; ఇంద్రుండు = ఇంద్రుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; తల్లీ = అమ్మా; భవత్ = నీ యొక్క; వ్రతంబున్ = వ్రతమును; చింతించి = తలచుకొని; సమయ = ఆచార, వ్రత నియమ; విచ్ఛేదనంబునన్ = భంగము నందు; గర్భంబున్ = కడుపులో; చొచ్చి = ప్రవేశించి; పాప = పాపపు; చిత్తుండను = బుద్ధి గలవాడను; ఐ = అయ్యి; వజ్ర = వజ్రాయుధపు; ధారలన్ = అంచులతో; గర్భంబున్ = గర్భస్త పిండమును; విదళనంబు = నరకివేయుట; చేసినన్ = చేయగా; ఆ = ఆ; శకలంబులు = ముక్కలు; చెడక = మరణించకుండగ; మహా = మిక్కిలి; ఆశ్చర్యంబుగాన్ = అద్భుతముగా; ఈ = ఈ; విధంబునన్ = విధమైన; కుమారులు = పుత్రులు; ఐరి = పుట్టిరి; మహాపురుష = నారాయణుని; పూజా = పూజవలన కలిగెడి; సంసిద్ధి = చక్కటి ఫలితము; కార్య = కార్యమునకు; అనుషంగి = అనుకూలమైనది; కాకుండునే = కాకపోవునా ఏమి; భగవత్ = భగవంతుని; ఆరాధనంబున్ = పూజలను; కోరికలన్ = కోరికలను; పాపి = విడిచిపెట్టి; ఎవ్వరున్ = ఎవరైతే; కావింతురు = చేసెదరో; వారున్ = వారు; ఇహ = ఈలోకము; పరంబులన్ = పరలోకములందు; సర్వ = సమస్తమైన; అర్థ = ప్రయోజనములు; కుశలులు = క్షేమములు పొందినవారు; అగుదురు = అగుదురు; ఆ = ఆ; మహాపురుష = నారాయణుని; వ్రత = వ్రతమువలన; సముత్పన్న = చక్కగా కలిగిన; తేజంబున్ = తేజస్సును; అడంపన్ = అణచివేయుటకు; ఎవ్వండు = ఎవరు; ఓపున్ = సమర్థు డగును; కావునన్ = అందుచేత; దుర్మదంబునన్ = అధికమైన గర్వమువలన; బాలిశ = మూర్ఖపు; స్వభావుండను = స్వభావము గలవాడను; ఐ = అయ్యి; దోషంబున్ = తప్పు; చేసినన్ = చేసినట్టి; నా = నా యొక్క; దౌర్జన్య = దుర్మార్గపు; కర్మంబున్ = పనిని; సహింపన్ = ఓర్చుకొనుటకు; తల్లి = తల్లి; కన్నన్ = కంటెను; ఎవ్వరున్ = ఎవరు; సమర్థులు = శక్తి గలవారు; పాప = పాపపు; ఆత్ముండు = మనసు గలవాడు; అగు = అయిన; నన్నున్ = నన్ను; కావుము = కాపాడుము; నేను = నేను; వీరల = వీరి; తోటివాడన్ = సోదరుడను; అని = అని; నిష్కపటంబుగాన్ = మాయలేకుండగ; ప్రార్థించినన్ = వేడుకొనగా; ఆ = ఆ; దేవి = స్త్రీ; అట్ల = ఆ విధముగనే; కాక = అగుగాక; అని = అని; శాంత = శాంతించిన; చిత్త = మనసు గలామె; అయ్యెన్ = అయినది; ఇంద్రుండును = ఇంద్రుడుకూడ; వారలన్ = వారితో; కూడి = కలిసి; త్రిదివంబున్ = స్వర్గమున; కున్ = కు; పోయి = వెళ్ళి; సోమపాన = సోమపానము; హవిస్ = హవిస్సు నందలి; భాగంబులు = భాగములు; వారల = వారి; కున్ = కు; పంచిపెట్టి = పంచిపెడుతూ; సుఖంబున్ = సుఖముగా; ఉండెన్ = ఉండెను; అని = అని; చెప్పి = చెప్పి; పరీక్షిత్ = పరీక్షిత్తు యనెడి; నరేంద్రున్ = రాజున; కున్ = కు; శుక = శుకుడు యనెడి; యోగి = యోగులలో; ఇంద్రుండు = ఇంద్రుడు; వెండియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

వారందరూ చేతులు జోడించి “మేము నీకు తోడబుట్టినవాళ్ళము. మమ్మల్ని హింసించవద్దు. మేమంతా మరుద్గణాలమై, నీ పరివారంలోని వాళ్ళమై నిన్ను సేవిస్తాము. మమ్మల్ని రక్షించు” అని వేడుకున్నారు. నారాయణుని దయ వల్ల చెక్కు చెదరక యున మరుద్గణాల మాటలకు ఇంద్రుడు దయ పుట్టినవాడై వారిని సోదరులుగా స్వీకరించి హింసించడం మానుకున్నాడు. పరీక్షిన్నరేంద్రా! అశ్వత్థామ బాణాగ్నినుండి శ్రీకృష్ణుని వల్ల నీవు రక్షింపబడినట్లే వజ్రధారల వల్ల ముక్కలైన ఆ కుమారులు పూరుషోత్తముని పూజించినందువల్ల నలభై తొమ్మిది మంది మరుద్గణాలుగా మారి దేవత్వాన్ని పొంది ఇంద్రునితో పాటు సంవత్సర కాలానికి కొంచం ముందుగా మాతృగర్భంనుండి బయటికి వచ్చారు. దితి మేలుకొని అగ్నితేజస్సుతో విరాజిల్లుతూ ఇంద్రుని వెంట ఉన్న తన బిడ్డలను చూచి సంతోషించకుండా అతనితో “నిన్ను చంపే కొడుకు కావాలని కోరి కఠినమైన వ్రతాన్ని ఆచరించాను. నేను కోరుకున్న కుమారుడు ఒక్కడే అయితే ఈ నలభై తొమ్మిది రూపాలలో ఉండడానికి కారణమేమిటి? నీకు తెలిసింది ఉన్న దున్నట్టుగా చెప్పు” అన్నది. ఇంద్రుడు ఇలా అన్నాడు “అమ్మా! నా క్షేమం కోరుకొని నీకు వ్రతభంగం జరిగిన సమయంలో నీ గర్భంలో ప్రవేశించి పాపాత్ముడనై నా వజ్రధారలతో నీ గర్భంలోని శిశువును ఖండించాను. ఆ ముక్కలు నాశనం కాకుండా ఈవిధంగా కుమారులైనారు. మహాత్ముల పూజాప్రభావం కార్యసిద్ధిని కలిగించకుంటుందా? ఎవరు నిష్కామ బుద్ధితో భగవంతుణ్ణి ఆరాధిస్తారో వారు ఇహ పరాలలో సర్వార్థాలను పొందుతారు. పురుషోత్తముని వ్రతం వల్ల పుట్టిన ఈ తేజస్సును అణచడం ఎవరికి సాధ్యం? గర్వంతో పాపచిత్తుణ్ణై తప్పు చేసిన నా దుర్మార్గాన్ని మన్నించేవాళ్ళు తల్లికంటె ఎవరుంటారు? పాపాత్ముడినైన నన్ను కాపాడు. నేను కూడా వీరితో పాటు నీ బిడ్డనే” అని ప్రార్థించాడు. దితి “సరే! అలాగే కానీ” అని శాంతించింది. ఇంద్రుడు మరుద్గణాలతో కూడ స్వర్గానికి వెళ్ళి సోమపానాన్నీ, హవిర్భాగాలనూ వారికి పంచిపెట్టి సుఖంగా ఉన్నాడు” అని చెప్పి శుకమహర్షి పరీక్షిత్తుతో ఇంకా ఇలా అన్నాడు.

6-526-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"హరి వరదుఁ డయిన వ్రతమట;
రి యంశజు లగుచు నెగడు మరుల జన్మ
స్ఫుణం బఁట; పఠియించిన
యఁగ నురుదీర్ఘపాప రమగు టరుదే."

టీకా:

హరి = విష్ణుమూర్తి; వరదుడు = వరములనిచ్చువాడు; అయిన = ఐన; వ్రతము = వ్రతము; అట = అట; హరి = నారాయణుని; అంశజులు = అంశతో పుట్టినవారు; అగుచున్ = అగుచు; నెగడు = వర్ధిల్లెడి; అమరుల = దేవతల; జన్మ = పుట్టుక; స్ఫురణంబు = తోచెడిది; అట = అట; పఠియించినన్ = చదివిన; అరయగను = చూడగా; ఉరు = అధికమైన; దీర్ఘ = పెద్దవైన, జన్మజన్మల; పాప = పాపమును; హరము = నాశనము; అగుట = అగుట; అరుదే = ఆశచర్యమాఅరుదా ఏమి.

భావము:

“ఇది వరాలను ప్రసాదించే శ్రీహరి వ్రత కథ అట! అతని అంశతో పుట్టిన మరుద్గణాలకు అమరత్వం లభించిన వృత్తాంతమట! ఇటువంటి పుణ్యకథను చదివినవారి పాపాలు నాశనం కావటంలో ఆశ్చర్యమేమున్నది?”

6-527-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అని శుకయోగీంద్రుండు పరీక్షిన్నరేంద్రునకుఁ జెప్పె" నని విష్ణుకథాశ్రవణ కుతూహలాయమాన మానసులైన శౌనకాది మహామునులకు సూతుండు చెప్పె ననుటయు.

టీకా:

అని = అని; శుక = శుకుడు యనెడి; యోగి = యోగులలో; ఇంద్రుండు = ఇంద్రుడు; పరీక్షిత్ = పరీక్షిత్తు యనెడి; నరేంద్రున్ = నరేంద్రుని; కున్ = కి; చెప్పెన్ = చెప్పెను; అని = అని; విష్ణు = నారాయణుని; కథా = కథను; శ్రవణ = వినుట యందు; కుతూహలాయమాన = ఆసక్తి గల; మానసులు = మనసులు గలవారు; ఐన = అయిన; శౌనక = శౌనకుడు; ఆది = మొదలగు; మహా = గొప్ప; మునుల్ = మునుల; కున్ = కు; సూతుండు = సూతుడు; చెప్పెన్ = చెప్పెను; అని = అని; అనుటయు = అనుట.

భావము:

ఇలా శుకమహర్షి పరీక్షిత్తుతో చెప్పాడని విష్ణు కథలను వినాలని కుతూహల పడుతున్న శౌనకాది మహర్షులకు సూతమహర్షి చెప్పాడు.