పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : శ్రీమన్నారాయణ కవచము

  •  
  •  
  •  

6-300-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రుడుని మూఁపుపై బదయుగంబు ఘటిల్లఁగ శంఖచక్ర చ
ర్మ రుచిర శార్ఙ్గ ఖడ్గ శర రాజితపాశ గదాది సాధనో
త్క నికరంబు లాత్మకరకంజములన్ ధరియించి భూతి సం
రిత మహాష్టబాహుఁడు కృపామతితో ననుఁ గాచుఁ గావుతన్.
^అష్ట భుజ విష్ణువు

టీకా:

గరుడుని = గరుత్మంతుని; మూపు = వీపు; పైన్ = మీద; పద = పాదముల; యుగంబున్ = రెంటిని; ఘటిల్లగ = ఉండగ; శంఖ = శంఖము; చక్ర = చక్రము; చర్మ = చర్మము; రుచిర = ప్రకాశవంతమైన; శార్ఙ్గ = విల్లు; ఖడ్గ = కత్తి; శర = బాణము; రాజిత = విలసిల్లెడి; పాశ = పాశము; గద = గద; ఆది = మొదలగు; సాధన = ఆయుధ; ఉత్కర = సంపత్తుల; నికరంబులు = సమూహములు; ఆత్మ = తన యొక్క; కర = చేతు లనెడి; కంజములన్ = పద్మము లందు; ధరియించి = ధరించి; భూతి = అష్టైశ్వర్యములు; సంభరిత = అలంకరింపబడిన; మహా = గొప్ప; అష్ట = ఎనిమిది (8); బాహుడు = భుజములు గలవాడు; కృపామతి = దయ గల మనసు; తోన్ = తోటి; నను = నన్ను; కాచుగావుత = కాపాడుగాక.

భావము:

గరుత్మంతుని భుజాలపై రెండు పాదల నుంచి కూర్చున్నవాడు, తన ఎనిమిది చేతుల్లో శంఖం, చక్రం, కవచం, ధనుస్సు, ఖడ్గం, బాణం, పాశం, గద అనే ఆయుధాలు ధరించినవాడు అయిన భగవంతుడు దయతో నన్ను కాపాడుగాక!