పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : బృహస్పతి తిరస్కారము

 •  
 •  
 •  

6-259-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"రయంగ యోగీంద్ర! ద్భుతం బయ్యెడు-
సురలపై నేటికి సురగురుండు
గోపించె? నీతండు గురుభావమున దేవ-
ల కేమి యాపదఁ లఁగఁ జేసె?
నెఱిఁగింపు"మనవుడు "నింద్రుండు త్రిభువనై-
శ్వర్య మదంబున త్పథంబు
గానక వసు రుద్ర ణములు నాదిత్య-
రుదశ్వి దేవాది మండలములు

6-259.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

సిద్ధ చారణ గంధర్వ జిహ్మగాది
సురులు మునులును రంభాది సుందరాంగు
లాడఁ బాడంగ వినుతి చేయంగఁ గొలువఁ
మ్రొక్క భద్రాసనంబున నుక్కుమీఱి.

టీకా:

అరయంగన్ = తరచి చూసినచో; యోగి = యోగులలో; ఇంద్ర = ఇంద్రుని వంటివాడ; అద్భుతంబున్ = ఆశ్చర్యకరము; అయ్యెడున్ = అగుచున్నది; సురల = దేవతల; పై = మీదకి; ఏటి = ఎందుల; కి = కు; సురగురుండు = బృహస్పతి {సురగురుడు - సుర (దేవతల)కి గురుడు (గురువు), బృహస్పతి}; కోపించెన్ = కోపగించెను; ఈతండు = ఇతను; గురు = గురువు ననెడి; భావమున = భావముతో; దేవతల్ = దేవతల; కున్ = కి; ఏమి = ఏ విధమైన; ఆపదలన్ = ఆపదలను; తలగన్ = తోలగిపోవునట్లు; చేసెన్ = చేసెను; ఎఱిగింపుము = తెలుపుము; అనవుడు = అనగా; ఇంద్రుండు = ఇంద్రుడు; త్రిభువన = ముల్లోకములపైన; ఐశ్వర్య = అధికారపు; మదంబునన్ = గర్వమువలన; సత్ = మంచి; పథంబున్ = దారిని; కానక = చూడలేక; వసు = వసువుల; రుద్ర = రుద్రుల; గణములున్ = సమూహములును; ఆదిత్య = ఆదిత్యుల; మరుత్ = మరుత్తుల; అశ్విదేవా = అశ్వినీదేవతల; ఆది = మొదలగు; మండలములు = సమూహములును;
సిద్ధ = సిద్ధులు; చారణ = చారణులు; గంధర్వ = గంధర్వులు; జిహ్మగ = సర్పములు {జిహ్మగము - వంకరగా పోవునది, సర్పములు}; ఆది = మొదలగువారును; సురలు = దేవతలు; మునులును = మునులును; రంభ = రంభ; ఆది = మొదలగు; సుందరాంగులు = స్త్రీలు {సుందరాంగులు - సుందర (అందమైన) అంగులు (దేహము గలవారు), స్త్రీలు}; ఆడన్ = నాట్యములు చేయుచుండగా; పాడంగ = గీతములు పాడుచుండగా; వినుతి = స్తోత్రము; చేయంగ = చేయుచుండగా; కొలువన్ = సేవించుచుండగా; మ్రొక్క = మొక్కుతుండగా; భద్రాసనంబునన్ = సింహాసనమున {భద్రాసనము - రాజు కూర్చొనెడి పీఠము, సింహాసనము}; ఉక్కు = శౌర్యము; మీఱి = అతిశయించి.

భావము:

“యోగీంద్రా! ఆశ్చర్యం! దేవ గురువైన బృహస్పతికి దేవతల మీద కోపం ఎందుకు వచ్చింది? ఆ తరువాత గురుభావంతో వారికి వచ్చిన ఆపదను ఏ విధంగా తొలగించాడు? నాకు వివరంగా చెప్పు” అని అడిగిన పరీక్షిత్తులు శుకమహర్షి ఇలా చెప్పాడు. “ఒకసారి ఇంద్రుడు ముల్లోకాలకు నేనే ప్రభువు నన్న అహంకారంతో సన్మార్గాన్ని అతిక్రమించాడు. వసువులు, రుద్ర గణాలు, ఆదిత్యులు, మరుత్తులు, అశ్వినీదేవతలు, సిద్ధులు, చారణులు, గంధర్వులు, నాగులు, దేవతలు, మునులు మొదలైన వారితో సింహాసనంపై కొలువు తీరాడు. రంభ మొదలైన సుందరాంగులు ఆడి, పాడి, ప్రశంసిస్తూ ఉన్నారు.

6-260-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నిండు పున్నమనాఁడు గండరించిన చంద్ర-
మండల శ్రీలతో మాఱుమలయ
ద్రవిద్యోతాతత్రంబు గ్రాలుచు-
మిన్నేటి తరఁగల మేలుకొలుపఁ
లిత దివ్యాంగనా రతల చాతుర్య-
చామీరికశ్రేణి జాడపఱుపఁ
జింతామణిస్ఫుట కాంత రత్నానేక-
టిత సింహాసనాగ్రంబు నందు

6-260.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నూరుపీఠంబుపై శచి యుండ నుండి
రుస దిక్పాలకాది దేతలు గొలువ
చాటి చెప్పంగరాని రాసముతోడ
నింద్రుఁ డొప్పారె వైభవసాంద్రుఁ డగుచు.

టీకా:

నిండు = పూర్తి; పున్నమ = పౌర్ణమి; నాడు = దినమున; గండరించిన = పుట్టిన; చంద్రమండలశ్రీ = వెన్నెల {చంద్రమండలశ్రీలు - చంద్రమండలము యొక్క శ్రీలు (కాంతులు), వెన్నెల}; తో = తో; మాఱు = రెండవ; మలయ = మలయపర్వతము వంటి; భద్ర = శుభకరమైన; విద్యుత్ = తళుక్కు మంటున్న; ఆతపత్రంబున్ = గొడుగు నందు; క్రాలుచు = సంచరించుచు; మిన్నేటి = ఆకశగంగా; తరగల = అలలు; మేలుకొలుపన్ = మేలుకొలుపుతుండగ; కలిత = ఉన్నట్టి; దివ్య = దేవతా; అంగన = స్త్రీల; కరతల = అరచేతుల; చాతుర్య = నేర్పుతో; చామీరిక = చామరముల; శ్రేణి = వరుసలు; జాడ = జాడలు; పఱుపన్ = ప్రకాశించుతుండగ; చింతామణి = చింతామణి {చింతామణి - కోరిన కోరికలను యిచ్చెడి దేవమణి}; స్ఫుటత్ = మెరసెడి; కాంత = కాంతి కలిగిన; రత్న = రత్నముల; అనేక = అనేకముచే; ఘటిత = కూర్చబడిన; సింహాసన = సింహాసనము {సింహాసనము - రాజు కూర్చొనెడి పీఠము}; అగ్రంబున్ = పైన; అందున్ = అందు; ఊరు = తొడలనెడి;
పీఠంబు = పీఠము; పై = మీద; శచి = శచీదేవి; ఉండన్ = ఉండగా; ఉండి = ఉండి; వరుస = క్రమముగా; దిక్పాలక = దిక్పాలకులు {దిక్పాలకులు - అష్టదిక్కులను పాలించెడి వేల్పులు}; ఆది = మొదలగు; దేవతలు = దేవతలు; కొలువన్ = సేవించుతుండగా; చాటిచెప్పంగరాని = చెప్పరాని; రాజసము = రాజత్వము; తోడన్ = తోటి; ఇంద్రుడు = ఇంద్రుడు; ఒప్పారె = చక్కగా నుండెను; వైభవ = వైభవముల; సాంద్రుడు = అధికముగ గలవాడు; అగుచు = అగుచు;

భావము:

నిండు పున్నమినాటి చంద్రబింబం లాగా విరాజిల్లుతున్న శ్వేతచ్ఛత్రం కన్నుల పండుగ చేస్తున్నది. ఆకాశగంగా తరంగాల వంటి వింజామరలతో దేవకాంతలు బంగారు కంకణాలు జారుతుండగా ఒయ్యారంగా వీస్తున్నారు. నవరత్న ఖచితమైన సింహాసనం మీద శచీదేవితో కూడి ఇంద్రుడు కూర్చున్నాడు. దేవతల పరివారం కైవారం చేస్తున్నది. దిక్పాలకులు సేవిస్తున్నారు. ఈ విధంగా సాటిలేని రాజసంతో ఇంద్రుడు మహా వైభవంతో నిండుకొలువు తీరి ఉన్నాడు.

6-261-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అయ్యవసరంబున

టీకా:

ఆ = ఆ; అవసరంబున = సమయమున.

భావము:

ఆ సమయంలో...

6-262-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

గురుతర ధర్మక్రియ నయ
గురుఁడున్ గురుమంత్ర విషయ గురుఁడు వచశ్శ్రీ
గురుఁడు సమస్తామరగణ
గురుఁడు గురుం డరుగుదెంచెఁ గొల్వునకు నృపా!

టీకా:

గురుతర = అత్యధికమైన {గురు - గురుతరము - గురుతమము}; ధర్మ = ధర్మబద్ధ; క్రియ = కార్యము లందు; నయ = నీతిశాస్త్రపు; గురుడున్ = గురువు; గురు = గొప్ప; మంత్రవిషయ = మంత్రాంగము చెప్పుటలో; గురుడున్ = గట్టివాడు; వచస్ = వాక్కనెడి; శ్రీ = సంపదకు, లక్ష్మీదేవికి; గురుడు = గొప్పవాడు, తండ్రి (సముద్రము); సమస్త = అఖిల; అమర = దేవతా; గణ = సమూహములకు; గురుడు = గురువు యగు; గురుండు = బృహస్పతి; అరుగుదెంచెన్ = వచ్చెను; కొల్వున = కొలువు సభ; కున్ = కు; నృపా = రాజా;

భావము:

రాజా! గొప్ప ధర్మశాస్త్రవిదుడు, నీతివిద్యా విశారదుడు, మంత్రాలోచనపరుడు, సమస్త దేవతలకు గురువు అయిన బృహస్పతి ఆ సభలోకి ప్రవేశించాడు.

6-263-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మిత తపఃప్రభావుఁ గరుణాత్ముని గీష్పతిఁ జూచి రాజ్యదు
ర్ద మదరేఖ నింద్రుఁడు వృథా తనగద్దియ లేవకుండె నె
య్యమున నెదుర్కొనం జనక యాసన మీయక గౌరవోప చా
ములఁ బ్రసన్నుఁ జేయక తిరంబుగ దివ్యసభాంతరంబునన్.

టీకా:

అమిత = అత్యధికమైన; తపస్ = తపస్సు నందు; ప్రభావున్ = ప్రభావము గలవాడు; కరుణాత్ముని = దయగల మనసు గలవాడు; గీష్పతిన్ = బృహస్పతిని; చూచి = చూసి; రాజ్య = అధికారపు; దుర్దమ = దమింపరాని, అణచలేని; మదరేఖన్ = గర్వపు లక్షణములతో; ఇంద్రుడు = ఇంద్రుడు; వృథా = అనవసరముగా; తన = తన యొక్క; గద్దియ = పీఠమును; లేవకుండె = లేవక యుండెను; నెయ్యమునన్ = స్నేహముతో; ఎదుర్కొనన్ = ఎదురు; చనక = వెళ్ళక; ఆసనము = పీఠము; ఈయక = ఇయ్యకుండగ; గౌరవ = గౌరవించుటలు; ఉపచారములన్ = సేవలను; ప్రసన్నున్ = ప్రసన్నమైనవానిగా; చేయక = చేయకుండగ; తిరంబుగ = స్థిరముగా; దివ్య = దేవ; సభ = సభ; అంతరంబునన్ = లోపల.

భావము:

సభలోకి వచ్చిన మహాతపస్వి, దయామయుడు అయిన బృహస్పతిని చూచి దేవేంద్రుడు అధికార గర్వంతో తన సింహాసనం దిగలేదు. ఆదరంగా ఎదురు పోలేదు. కూర్చుండటానికి ఆసనం చూపలేదు. గౌరవ పురస్సరంగా స్వాగతం పలుకలేదు. ఆ దేవగురువుకు తగిన మర్యాద చేయలేదు. అలాగే కదలక కూర్చున్నాడు.

6-264-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ప్పుడు సురపతి గన్నులఁ
ప్పిన సురరాజ్య మదవికారంబునకుం
ప్పుడు జేయక గృహమున
ప్పుణ్యుఁడు దిరిగిపోయె తిఖిన్నుండై.

టీకా:

అప్పుడు = అప్పుడు; సురపతి = ఇంద్రుని {సురపతి - సుర (దేవతల) పతి (ప్రభువు), ఇంద్రుడు}; కన్నులన్ = కన్నులను; కప్పిన = కప్పినట్టి; సుర = దేవతల, స్వర్గ; రాజ్య = రాజ్యాధికారపు; మద = గర్వమువలన కలిగిన; వికారంబున్ = వికారము; కున్ = కు; చప్పుడు చేయక = స్పందించకుండగ; గృహమున్ = తన యింటి; కి = కి; ఆ = ఆ; పుణ్యుడు = పుణ్యవంతుడు; తిరిగి = వెనుతిరిగి; పోయెన్ = వెళ్ళెను; అతి = మిక్కిలి; ఖిన్నుడు = శోకించువాడు; ఐ = అయ్యి.

భావము:

ఆ సమయంలో దేవేంద్రుని కన్నుల గప్పిన రాజ్యాధికార దురహంకారాన్ని గమనించి బృహస్పతి మిక్కిలి ఖిన్నుడై తిరిగి వెళ్ళిపోయాడు.

6-265-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఱుఁగమిఁ జేసినట్టి గురుహేళన మంత నెఱింగి యింద్రుఁ డ
చ్చరుపడి భీతినొంది యతిచింతితుఁడై తలపోసి పల్కె "న
ప్పమపవిత్రు లోకనుతవ్యచరిత్ర విశేషు పాదపం
రుహముఁ బూజ చేయక యర్మముఁ జేసితి నల్పబుద్ధి నై.

టీకా:

ఎఱుగమిన్ = తెలియక; చేసిన = చేసిన; అట్టి = అటువంటి; గురు = గురువు; హేళనము = అవమానము; అంతన్ = అంతయును; ఎఱింగి = తెలిసికొని; ఇంద్రుడు = ఇంద్రుడు; అచ్చరుపడి = ఆశ్చర్యపోయి; భీతిన్ = భయమును; ఒంది = పొంది; అతి = మిక్కిలి; చింతితుడు = బాధపడువాడు; ఐ = అయ్యి; తలపోసి = ఆలోచించుకొని; పల్కెన్ = పలికెను; ఆ = ఆ; పరమ = మిక్కిలి; పవిత్రున్ = పుణ్యుని; లోక = లోకములచే; నుత = స్తుతింపబడెడి; భవ్య = దివ్యమైన; చరిత్ర = వర్తన; విశేషు = విశేషముగా గలవాని; పాద = పాదములు యనెడి; పంకరుహమున్ = పద్మములను; పూజన్ = సేవించుట; చేయక = చేయకుండగ; అకర్మము = తప్పుపని; చేసితిన్ = చేసితిని; అల్పబుద్ధిని = తెలివితక్కువవాడిని; ఐ = అయ్యి.

భావము:

తెలియక చేసిన గురుధిక్కారాన్ని తెలుసుకొన్న ఇంద్రుడు తాను చేసిన దానికి ఆశ్చర్యపడి, భయపడి, పశ్చాత్తాపం చెంది ఇలా అనుకున్నాడు “అయ్యో! పరమ పవిత్రుడు, లోకంచేత కొనియాడబడే భవ్య చరిత్రుడు అయిన గురుదేవుని గౌరవించి ఆయన పాదపద్మాలను పూజింపక ఉపేక్షించాను. అల్పబుద్ధినై చేయరాని కార్యం చేశాను.

6-266-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

త్రిభువన విభవ మదంబున
లో మద్గురువునకుఁ బ్రన్నునకు లస
త్ప్రభువునకు నెగ్గు జేసితి
శుములు దొలఁగంగ నే నసురభావమునన్.

టీకా:

త్రిభువన = ముల్లోకము లందు గొప్ప; విభవ = వైభవముల; మదంబునన్ = గర్వముతో; సభ = సభ; లోన్ = అందు; మత్ = నా యొక్క; గురువున్ = గురువున; కున్ = కు; ప్రసన్నున = ప్రసన్నమైన స్వభావము గలవాని; కున్ = కి; లసత్ = ప్రకాశించుతున్న; ప్రభువున్ = ప్రభావము గలవాని; కున్ = కి; ఎగ్గు = అవమానము; చేసితి = చేసితిని శుభములు = శుభములు; తొలగంగన్ = తొలగిపోవునట్లు; నేన్ = నేను; అసురభావమునన్ = రాక్షసత్వముతో.

భావము:

ముల్లోకాల ఐశ్వర్యమదంతో కరుణామయుడు, జ్ఞాని అయిన నా గురువునకు రాక్షస భావంతో సర్వ శుభాలు తొలగిపోయే విధంగా కీడు చేశాను.

6-267-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

పారమేష్ఠ్య మయిన దవి నొందిన భూపు
లెట్టివారి కైన లేవవలదు;
విబుధు లిట్లు చెప్పు విధమెన్న వారలు
ర్మవేత్త లనుచుఁ లఁపబడరు.

టీకా:

పారమేష్ఠ్యము = బ్రహ్మచే అనుగ్రహింపబడినది, బ్రహ్మాండము {పారమేష్ఠ్యము - పరమేష్ఠి (బ్రహ్మ) యొక్క స్థానము, బ్రహ్మాండము}; అయిన = అయినట్టి; పదవిన్ = అధికారమును; ఒందిన = పొందిన; భూపులు = రాజులు {భూపుడు - భూమికి పతి, రాజు}; ఎట్టి = ఎటువంటి; వారి = వారి; కిన్ = కి; ఐన = అయినను; లేవవలదు = లేవనక్కరలేదు; విబుధులు = జ్ఞానులు; ఇట్లు = ఈ విధముగ; చెప్పు = చెప్పెడి; విధము = విధానము; ఎన్నన్ = ఎంచి చూడగా; వారలు = వారు; ధర్మవేత్తలు = ధర్మము తెలిసిన వారు; అనుచున్ = అని; తలపబడరు = అనబడరు.

భావము:

“బ్రహ్మాండమైన పదవిని అధిష్ఠించిన మహారాజులు ఎటువంటి వారు వచ్చినా లేవనక్కరలే”దని చెప్పే పండితులను ధర్మవేత్తలు అనరు.

6-268-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కుపథవర్తు లగుచుఁ గుత్సిత దుర్వచో
నిపుణు లైనవారు నిడివి దెలిసి
తొలఁగలేక వా రధోగతిఁ బడుదురు
ప్పులేక రాతి తెప్ప భంగి.

టీకా:

కుపథ = చెడుమార్గమున; వర్తులు = తిరుగువారు; అగుచున్ = అగుచు; కుత్సిత = నిందాపూర్వక; దుర్ = చెడ్డ; వచస్ = మాటలాడుట యందు; నిపుణులు = నైపుణ్యము గలవారు; ఐనవారు = అయినట్టివారు; నిడివి = నీతిమార్గము; తెలిసి = తెలుసుకొని; తొలగలేక = తొలిగిపోకుండగ; వారు = వారు; అధోగతి బడుదురు = నశించెదరు; తప్పులేక = తప్పనిసరిగా; రాతి = రాయితో చేసిన; తెప్ప = పడవ; భంగి = వలె.

భావము:

చెడు మార్గంలో నడుస్తూ కుత్సిత బుద్ధితో దుర్భాషలాడడంలో నేర్పరులైన వారు నీతిమార్గాన్ని తెలుసుకోలేక రాతిపడవ లాగా అధోగతి పాలై మునిగిపోతారు.

6-269-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కావున లోకవందితుని కార్యవిచారుని యింటి కేగి త
త్పాన పాదపద్మములపై మకుటంబు ఘటిల్ల మ్రొక్కి త
త్సే యొనర్చి చిత్తము వశించి ప్రసన్ను నొనర్తు నంచు న
ద్దేవిభుండు పోయె నతితీవ్రగతిన్ గురుధామ సీమకున్.

టీకా:

కావున = అందుచేత; లోక = లోకముచేత; వందితుని = స్తుతింపబడువానిని; కార్యవిచారుని = కార్యసాధనలో ఆలోచన చెప్పు వానిని; ఇంటి = నివాసమున; కున్ = కు; ఏగి = వెళ్ళి; తత్ = అతని; పావన = పవిత్రమైన; పాద = పాదములు యనెడి; పద్మములు = పద్మములు; పై = మీద; మకుటంబు = కిరీటము; ఘటిల్లన్ = తగులునట్లు; మ్రొక్కి = నమస్కరించి; తత్ = అతనికి; సేవన్ = సేవలను; ఒనర్చి = చేసి; చిత్తము = మనసు; వశించి = వశపరచుకొని; ప్రసన్నున్ = ప్రసన్నమైన వానిని; ఒనర్తున్ = చేసెదను; అంచున్ = అనుచూ; ఆ = ఆ; దేవవిభుండు = ఇంద్రుడు {దేవ విభుడు - దేవతలకు విభుడు (ప్రభువు), ఇంద్రుడు}; పోయెన్ = వెళ్ళెను; అతి = మిక్కిలి; తీవ్ర = తీవ్రమైన; గతిన్ = వేగముతో; గురు = బృహస్పతి; ధామసీమ = నివాసస్థానమున; కున్ = కు.

భావము:

కాబట్టి లోకవందితుడు, కార్యాకార్య విచక్షణ కలవాడు అయిన గురుదేవుని ఇంటికి పోయి ఆ మహాత్ముని పవిత్ర పాదపద్మాలపై కిరీటం తాకే విధంగా నమస్కరించి చక్కగా అతని చిత్తాన్ని వశీకరించుకుని ప్రసన్నుని చేసుకుంటాను” అంటూ ఇంద్రుడు మిక్కిలి వేగంగా గురుదేవుని ఇంటికి పోయాడు.