పంచమ స్కంధము - ఉత్తర : భగణ విషయము
- ఉపకరణాలు:
నంతలోన నినశశాంక మండలములఁ
గరుణఁ బ్రోవఁదలచి హరిసుదర్శ
నంబు వచ్చునను భయంబున నై దాఱు
గడియలకును రాహు నడిఁకి తొలఁగు.
టీకా:
జననాథ = రాజా {జననాథుడు - జనులకు నాథుడు (ప్రభువు), రాజు}; రాహువు = రాహువు; జన్మ = పుట్టుక; కర్మంబులు = వర్తనలు; వినిపింతు = చెప్పెదను; ముందఱ = ముందుగా; విస్తరించి = విస్తరించి; అయుత = పదివేల (10,000); యోజన = యోజనముల; విస్తృత = విస్తారముకలిగిన; అర్క = సూర్య; మండలమున్ = మండలమును; ద్విషట్సహస్ర = పన్నెండువేల(12,000); విశాల = విస్తారముకలిగిన; చంద్రమండలమున్ = చంద్రమండలమును; పర్వకాలంబులను = గ్రహణసమయములలో; త్రయోదశసహస్ర = పదమూడువేల (13,000); = విశాలము = విస్తారము కలిగినది; ఐ = అయ్యి; మీదన్ = పైన; రాహువున్ = రాహువు; కప్పును = కప్పవేయును; అది = దానిని; చూచి = చూసి; ఉపరాగము = గ్రహణము; అనుచునున్ = అని; పలుకుదురు = అనెదరు; ఎల్లవారును = అందరును; స్వ = తమ; ధర్మన్ = విద్యుక్త కర్మమములను; ఇచ్చులు = నేరవేర్చదలచినవారు; అగుచున్ = అగుచు; అంతలోనన్ = కొద్దిసమయములోనే; ఇన = సూర్య; శశాంక = చంద్ర; మండలములన్ = మండలములను; కరుణన్ = దయతో; ప్రోవన్ = కాపడవలెనని; తలచి = భావించి;
= హరి = నారాయణుని; సుదర్శనంబు = సుదర్శన చక్రము; వచ్చును = వచ్చును; అను = అనెడి; భయంబునన్ = భయమముతో; ఐదు = ఐదు (5); ఆఱు = ఆరు (6); గడియల = గడియల సమయమున; కున్ = కే; రాహువు = రాహువు; నడిఁకిన్ = బెదురుతో; తొలగున్ = తొలగిపోవును;
భావము:
రాజా! రాహువు యొక్క జన్మ కర్మాలను గూర్చి సవిస్తరంగా వినిపిస్తాను. ఈ రాహువు పదివేల యోజనాల విస్తృతి కలిగిన సూర్యమండలాన్ని, పన్నెండు వేల (12,000) యోజనాల విస్తృతి కలిగిన చంద్రమండలాన్ని కప్పేస్తాడు. రాహుమండలం పదమూడువేల యోజనాల వైశాల్యం కలిగింది. పూర్ణిమ పర్వదినంలో చంద్రుణ్ణి, అమావాస్య పర్వదినంలో సూర్యుణ్ణి రాహువు మాటు పరుస్తాడు. దీనినే గ్రహణం అంటారు. ఆ గ్రహణ కాలంలో జనులంతా తమ తమ జపతపో రూపాలైన ధర్మాలను చక్కగా ఆచరించుకొంటారు. అయితే దయామయుడైన శ్రీహరి సుదర్శన చక్రం సూర్య చంద్ర మండలాలను రక్షించడానికి వస్తుందేమో అన్న భయంతో ఐదారు ఘడియలలోనే రాహువు వారిని వదిలిపెట్టి తొలగిపోతాడు.