పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : భగణ విషయము

  •  
  •  
  •  

5.2-77-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మలజాండ మధ్యతుఁడైన సూర్యుండు
రితమైన యాతపంబుచేత
మూఁడు లోకములను ముంచి తపింపంగఁ
జేసి కాంతి నొందఁజేయుచుండు.

టీకా:

కమలజాండ = బ్రహ్మాండమునకు {కమలాజాండము - కమలజ (బ్రహ్మ) అండము, బ్రహ్మాండము}; మధ్య = నడుమ; గతుడున్ = తిరుగువాడు; ఐన = అయిన; సూర్యుండు = సూర్యుడు; భరితము = నిండు; ఐన = అయినట్టి; ఆ = ఆ; తపంబున్ = ఎండ, వేడి; చేతన్ = వలన; మూడులోకములను = ముల్లోకములను {ముల్లోకములు - 1ద్రవ్యమయ 2శక్తిమయ 3ప్రజ్ఞామయ లోకములు మూడు, సమస్తలోకములు}; ముంచి = తడిపివేసి; తపింపంగన్ = తపించునట్లు; చేసి = చేసి; కాంతిన్ = వెలుగును; ఒందన్ = పొందునట్లు; చేయుచుండున్ = చేయుచుండును;

భావము:

బ్రహ్మాండం మధ్యలో ప్రకాశించే సూర్యుడు తన వెలుగుతో, వేడిమితో ముల్లోకాలను ముంచెత్తుతూ ప్రకాశింప జేస్తాను.

5.2-78-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు భాస్కరుం డుత్తరాయణ దక్షిణాయన విషువు లను నామంబులు గల మాంద్య తీవ్ర సమానగతుల నారోహణావరోహణ స్థానంబుల యందు దీర్ఘ హ్రస్వ సమానంబులుగాఁ జేయుచుండు.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; భాస్కరుండు = సూర్యుడు; ఉత్తరాయణ = ఉత్తరాయణము; దక్షిణాయన = దక్షిణాయనము; విషువులున్ = విషువులు {విషువు - పగలు రాత్రి సమానముగ నుండు దినములు, (1)మార్చి21న వచ్చెడి ఉత్తర (వసంత) విషువు మొదటిది, (2)సెప్టంబరు 21న వచ్చెడి దక్షిణ (శరత్) విషువు రెండవది}; అను = అనెడి; నామంబులున్ = అనెడి పేర్లు; కల = కలిగిన; మాంద్య = మెల్లని; తీవ్ర = వేగవంతమైన; సమాన = సమానమైన; గతులన్ = నడకలతో; ఆరోహణ = పైకెక్కెడి; అవరోహణ = కిందకు దిగెడి; స్థానంబులన్ = స్థానములు; అందున్ = లోను; దీర్ఘ = పెద్దది; హ్రస్వ = చిన్నవి; సమానంబులుగా = మానమైనవిగా; చేయుచుండున్ = కలుగ జేయును;

భావము:

అటువంటి సూర్యునికి ఉత్తరాయణం, దక్షిణాయనం, విషువత్తు అనే మూడు గమనాలు ఉన్నాయి. ఉత్తరాయణంలో ఆ గమనం మందకొడిగా, దక్షిణాయనంలో తీవ్రంగా, విషువత్తులో సమానంగా ఉంటుంది. సూర్యుని ఈ మూడు గమనాలను అనుసరించి ఆరోహణ, అవరోహణ, సమస్థానాలలో రాత్రింబవళ్ళు దీర్ఘాలుగా, హ్రస్వాలుగా, సమానాలుగా మారుతూ ఉంటాయి.

5.2-79-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మేషతులల యందు మిహిరుం డహోరాత్ర
మందుఁ దిరుగు సమవిహారములను;
రఁగఁగ వృషభాది పంచరాసులను నొ
క్కొక్క గడియ రాత్రి క్కి నడచు.

టీకా:

మేష = మేషరాశి; తులల = తులారాశుల; అందున్ = లో; మిహిరుండు = సూర్యుండు; అహోరాత్రము = రాత్రింబవళ్లు; అందున్ = అందును; తిరుగున్ = తిరుగును; సమ = సమానమైన; విహారములనున్ = నడకలతోను; పరగగన్ = ప్రసిద్ధముగ; వృషభ = వృషభమురాశి; ఆది = మొదలగు రాశులు; పంచ = ఐదింట తిరిగెడు; మాసములున్ = మాసము లందు; ఒక్కొక్క = ఒకటి చొప్పున; గడియ = గడియ; రాత్రి = రాత్రిసమయము; తగ్గి = తగ్గుతూ; నడచున్ = నడచును;

భావము:

మేషరాశిలో, తులారాశిలో సూర్యుడు సంచరిస్తున్నపుడు పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య అనే ఐదు రాసులలో సంచరించే సమయంలో ఒక్కొక్క గడియ ప్రకారం రాత్రి తగ్గుతూ వస్తుంది.

5.2-80-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మించి వృశ్చికాది పంచరాసులను నొ
క్కొక్క గడియ రాత్రి నిక్కి నడచు;
దినములందు నెల్ల దిగజారు నొక్కొక్క
డియ నెలకుఁ దత్ప్రకారమునను.

టీకా:

మించి = అతిశయించి; వృశ్చిక = వృశ్చికరాశి; ఆది = మొదలగు రాశులు; పంచ = ఐదింట తిరిగెడు; మాసములున్ = మాసములందు; ఒక్కొక్క = ఒకటి చొప్పున; గడియ = గడియ; రాత్రి = రాత్రిసమయము; నిక్కి = పెరుగుతూ; నడచున్ = నడచును; దినములు = పగళ్ళు; అందున్ = అందు; ఎల్లన్ = అన్నిటిలోను; దిగజారున్ = తగ్గుతూ; ఒక్కొక్క = ఒకటి చొప్పున; గడియ = గడియ; నెలకున్ = మాసమునకు; తత్ = ఆ; ప్రకారముననున్ = ప్రకారముగా;

భావము:

సూర్యుడు వృశ్చికం, ధనుస్సు, మకరం, మీనం అనే ఐదు రాసులలో ఉన్నపుడు ఒక్కొక్క గడియ ప్రకారం రాత్రి పెరుగుతుంది. పగటికాలం తగ్గిపోతుంది.

5.2-81-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు; నివ్విధంబున దివసంబు లుత్తరాయణ దక్షణాయనంబుల వృద్ధిక్షయంబుల నొంద నొక్క యహోరాత్రంబున నేకపంచాశదుత్తరనవ కోటి యోజనంబుల పరిమాణంబు గల మానసోత్తర పర్వతంబున సూర్యరథంబు దిరుగుచుండు; నా మానసోత్తరపర్వతంబు నందుఁ దూర్పున దేవధాని యను నింద్రపురంబును, దక్షిణంబున సంయమని యను యమ నగరంబును, పశ్చిమంబున నిమ్లోచని యను వరుణ పట్టణంబును, నుత్తరంబున విభావరి యను సోముని పుటభేదనం బును దేజరిల్లుచుండు; నా పట్టణంబుల యందు నుదయ మధ్యాహ్నా స్తమయ నిశీథంబు లనియెడు కాలభేదంబులను, భూత ప్రవృత్తి నిమిత్తం బచ్చటి జనులకుఁ బుట్టించు చుండు; సూర్యుం డెపు డింద్ర నగరంబున నుండి గమనించు నది యాదిగాఁ బదియేను గడియలను రెండుకోట్ల ముప్పదియేడులక్షల డెబ్బదియైదువేల యోజనంబులు నడచు; నివ్వింధంబున నింద్ర యమ వరుణ సోమ పురంబుల మీఁదఁ జంద్రాది గ్రహ నక్షత్రంబులం గూడి సంచరించుచుం బండ్రెండంచులు, నాఱు గమ్ములును, మూఁడు దొలులుం గలిగి సంవత్సరాత్మకంబయి యేకచక్రం బయిన సూర్యుని రథంబు ముహూర్త మాత్రంబున ముప్పది నాలుగులక్షల నెనమన్నూఱు యోజనంబులు సంచరించు.

టీకా:

మఱియున్ = ఇంకను; ఈ = ఈ; విధంబునన్ = విధముగ; దివసంబులు = పగళ్ళు; ఉత్తరాయణ = ఉత్తరాయణము; దక్షిణాయనంబులన్ = దక్షిణాయనములందు; వృద్ధి = పెరుగుట; క్షయంబులన్ = తగ్గుటలను; ఒందన్ = పొందుతుండగ; ఒక్క = ఒక; అహోరాత్రంబునన్ = పగలు రాత్రిసమయములో; ఏకపంచాశదుత్తరనవకోటి = తొమ్మిదికోట్లయేభైయొక్క; యోజనంబులన్ = యోజనముల; పరిమాణంబున్ = పరిమాణము; కల = కలిగిన; మానసోత్తర = మానసోత్తరము అనెడి; పర్వతంబునన్ = పర్వతము నందు; సూర్య = సూర్యుని; రథంబున్ = రథము; తిరుగుచుండున్ = తిరుగుతుండును; ఆ = ఆ; మానసోత్తరపర్వతంబు = మానసోత్తరపర్వతము; అందున్ = అందు; తూర్పున = తూర్పువైపున; దేవధాని = దేవధాని; అను = అనెడి; ఇంద్ర = ఇంద్రుని యొక్క; పురంబునున్ = పట్టణము; దక్షిణంబునన్ = దక్షిణమువైపున; సంయమని = సంయమని; అను = అనెడి; యమ = యముని యొక్క; నగరంబునున్ = పట్టణము; పశ్చిమంబునన్ = పడమరవైపున; నిమ్లోచని = నిమ్లోచని; అను = అనెడి; వరుణ = వరుణుని యొక్క; పట్టణంబునున్ = పట్టణము; ఉత్తరంబునన్ = ఉత్తరమువైపున; విభావరి = విభావరి; అను = అనెడి; సోముని = సోముని యొక్క; పుటభేదనంబునున్ = పట్టణము; తేజరిల్లుచుండున్ = విలసిల్లుచుండును; ఆ = ఆ; పట్టణంబులన్ = పట్టణములు; అందునున్ = లోను; ఉదయ = ఉదయము; మధ్యాహ్న = మధ్యాహ్నము; అస్తమయ = అస్తమయము; నిశీథంబులు = రాత్రులు; అనియెడు = అనెడు; కాల = కాలము లందలి; భేదంబులను = రకములతో; భూత = ప్రాణుల; ప్రవృత్తి = ప్రవర్తించుట; నిమిత్తంబు = కోసము; అచ్చటన్ = అక్కడి; జనుల్ = ప్రజల; పుట్టించుచుండున్ = సృష్టించుచుండును; సూర్యుండు = సూర్యుడు; ఎపుడున్ = ఎప్పుడైతే; ఇంద్ర = ఇంద్రుని యొక్క; నగరంబున్ = పట్టణము (తూర్పున ఉన్నది); నుండి = నుండి; గమనించునది = నడచెడిది {గమనించునది - గమనము చేసెడిది, నడచెడిది}; ఆదిగా = మొదలు; పదియేను = పదిహేను; గడియలను = గడియలలో; రెండుకోట్లముప్పదియేడులక్షలడెబ్బదియైదువేల = రెండుకోట్లముప్పైయేడులక్షలడెబ్బైయైదువేల (2,37,55,000); యోజనంబులున్ = యోజనములు; నడచున్ = నడచును; ఈ = ఈ; విధంబునన్ = విధముగ; ఇంద్ర = ఇంద్రుని యొక్క; యమ = యముని యొక్క; వరుణ = వరుణుని యొక్క; సోమ = సోముని యొక్క; పురంబులు = పట్టణములు; మీదన్ = పైన; చంద్ర = చంద్రుడు; ఆది = మొదలగు; గ్రహ = గ్రహములు; నక్షత్రంబులన్ = నక్షత్రములను; కూడి = కలిసి; సంచరించుచున్ = తిరుగుతూ; పండ్రెండు = పన్నెండు (12); అంచులున్ = అంచులు; ఆఱు = ఆరు (6); కమ్ములు = కమ్మీలు; మూడు = మూడు (3); తొలులు = కుండలు, తొట్లు; కలిగి = కలిగుండి; సంవత్సర = సంవత్సరము; ఆత్మకంబున్ = స్వరూపము; అయి = అయ్యి; ఏక = ఒక; చక్రంబున్ = చక్రము కలది; అయిన = అయిన; సూర్యుని = సూర్యుని యొక్క; రథంబున్ = రథము; ముహూర్త = ముహూర్తపు; మాత్రంబునన్ = మాత్రపు సమయములో; ముప్పదినాలుగులక్షలనెనమన్నూఱు = ముప్పైనాలుగులక్షలఎనిమిదివందల (34,00,800); యోజనంబులున్ = యోజనములు; సంచరించున్ = తిరుగును;

భావము:

ఈ ప్రకారంగా అహోరాత్రాలను ఉత్తరాయణ, దక్షిణాయనాలలో పెంచుతూ తగ్గిస్తూ ఒక్కదినంలో తొమ్మిది కోట్ల యాభైఒక్క లక్షల యోజనాల పరిమాణం కలిగిన దూరం మానసోత్తర పర్వతం నలువైపులా సూర్యరథం తిరుగుతూ ఉంటుంది. ఈ పర్వతం తూర్పున దేవధాని అనే ఇంద్రుని పట్టణం, దక్షిణంలో సంయమని అనే యముని పట్టణం, పశ్చిమంలో నిమ్లోచన అనే వరుణుని పట్టణం, ఉత్తరంలో విభావరి అనే సోముని పట్టణం ఉన్నాయి. ఈ నాలుగు పట్టణాలలోను సూర్యుడు క్రమంగా ఉదయం, మధ్యాహ్నం, అస్తమయం, అర్ధరాత్రం అనే కాల భేదాలను కల్పిస్తూ ఉంటాడు. ఈ ఉదయం మొదలైనవి అక్కడి జీవుల ప్రవృత్తి నివృత్తులకు కారణా లవుతుంటాయి. సూర్యుడు ఇంద్రనగరం నుండి యమనగరానికి పయనించేటప్పుడు పదిహేను గడియలలో రెండు కోట్ల ముపై ఏడు లక్షల డెబ్బై ఐదు వేల యోజనాలు అతిక్రమించి యమనగరానికి, ఇదే విధంగా అక్కడి నుంచి వరుణ, సోమ నగరాలకు చంద్రాది గ్రహాలతో, నక్షత్రాలతో సంచరిస్తాడు. పన్నెండు ఆకులూ, ఆరు కమ్ములూ, మూడు కుండలూ (నాభి ప్రదేశాలు) కలిగి ఏకచక్రంతో కూడి సంవత్సరాత్మకమైన సూర్యుని రథం ఒక ముహూర్తకాలంలో ముప్పై నాలుగు లక్షల ఎనిమిది వందల యోజనాలు ప్రయాణం చేస్తుంది.

5.2-82-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నురథంబున కున్న యిరుసొక్కటియ మేరు-
శిఖరంబునందును జేరి యుండు;
నొనరఁ జక్రము మానసోత్తర పర్వతం-
బందులఁ దిరిగెడు నా రథంబు
నిరుసున నున్న రెం డిరుసులు దగులంగఁ-
వన పాశంబుల ద్ధ మగుచు
ధ్రువమండలంబు నందుల నంటియుండఁగా-
సంచరించుచునుండు సంతతంబు;

5.2-82.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్టి యరదంబు ముప్పదియాఱులక్ష
లందు నంటిన కాడిఁయు న్ని యోజ
ముల విస్తారమై తురంముల కంధ
ములఁ దగులుచు వెలుఁగొందు మణతోడ.

టీకా:

ఇను = సూర్యుని; రథంబునన్ = రథముల; కున్ = కు; ఉన్న = ఉన్నట్టి; ఇరుసు = ఇరుసు; ఒక్కటియ = ఒకటి; మేరు = మేరువు యొక్క; శిఖరంబున్ = శిఖరము; అందునున్ = అందు; చేరి = కలిసి; ఒనరన్ = చక్కగ; చక్రము = ఆ రథ చక్రము; మానసోత్తరపర్వతంబు = మానసోత్తరపర్వతము; అందులన్ = అందలో; తిరిగెడున్ = తిరుగుచుండెడి; ఆ = ఆ; రథంబున్ = రథము; ఇరుసునన్ = ఇరుసునకు; ఉన్న = ఉన్నట్టి; రెండు = రెండు (2); ఇరుసులున్ = ఇరుసులు; తగులంగన్ = తగుల్కొనునట్లు; పవన = వాయు; పాశంబులన్ = తాళ్ళతో; బద్ధము = కట్టబడినది; అగుచున్ = అగుచు; ధ్రువమండలంబున్ = ధ్రువమండలము; అందులన్ = అందు; అంటి = అంటుకొని; ఉండగా = ఉండగా; సంచరించుచునుండు = తిరుగుతుండును; సతతంబున్ = ఎల్లప్పుడును; అట్టి = అటువంటి;
అరదంబున్ = రథము; ముప్పదియాఱులక్షలందు = ముప్పైయారులక్షలను; అంటిన = వరకు పొడవున్న; కాడియున్ = కాడి; అన్ని = అన్నే; యోజనముల = యోజనముల; విస్తారము = విశాలముగలది; ఐ = అయ్యి; తురంగముల = గుఱ్ఱముల; కంధరములన్ = మెడలను; తగులుచున్ = తగులుతూ; వెలుగొందున్ = ప్రకాశించును; రమణ = మనోజ్ఞము; తోడన్ = తోటి;

భావము:

సూర్యుని రథ చక్రానికి ఒక ఇరుసు అమర్చబడి ఉంది. ఆ ఇరుసుకు ఒకవైపు మేరు పర్వతం, రెండవవైపు మానసోత్తర పర్వతం ఉన్నాయి. రెండువైపులు వాయుపాశాలతో గట్టిగా బిగింపబడి ఉన్నాయి. ఇవి భూమి రెండు ధ్రువాలకు అంటి ఉన్నాయి. అటువంటి సూర్యరథానికి అమర్చబడిన కాడి ముప్పై ఆరు లక్షల యోజనాల పొడవు ఉంటుంది. ఆ కాడి సూర్యరథానికి కట్టిన గుఱ్ఱాల మెడలపై మోపబడి ఉంటుంది.

5.2-83-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఆ రథంబునకు గాయత్రీచ్ఛందం బాదిగా సప్తచ్ఛందంబులు నశ్వంబులై సంచరించు; భాస్కరునకు నగ్రభాగంబున నరుణుండు నియుక్తుండై రథంబు గడపుచుండు; వెండియు నంగుష్ఠపర్వమాత్ర శరీరంబులుగల యఱువదివేల వాలఖిల్యాఖ్యు లగు ఋషివరులు సూర్యుని ముందట సౌరసూక్తంబుల స్తుతియింప, మఱియు ననేక మునులును గంధర్వ కిన్నర కింపురుష నాగాప్సరః పతంగాదులును నెలనెల వరుస క్రమంబున సేవింపం, దొమ్మిదికోట్ల నేబఁది యొక లక్ష యోజనంబుల పరిమాణంబు గల భూమండలంబు నం దొక క్షణంబున సూర్యుండు రెండువేలయేబది యోజనంబులు సంచరించుచు, నొక యహోరాత్రంబు నందె యీ భూమండలం బంతయు సంచరించు" ననిన శుకయోగీంద్రునకుఁ బరీక్షిన్నరేంద్రుం డిట్లనియె.

టీకా:

ఆ = ఆ; రథంబున్ = రథమున; కున్ = కు; గాయత్రీచ్ఛందంబున్ = గాయత్రీ ఛందస్సు; ఆదిగా = మొదలుగా; సప్తచ్ఛందంబులున్ = ఏడు ఛందస్సులును {సప్తచ్ఛందస్సులు - 1గాయత్రి 2ఉష్టిక్ 3త్రిష్టుప్ 4అనుష్టుప్ 5జగతీ 6పంక్తి 7బృహతి అనెడి ఏడు ఛందస్సులు}; అశ్వంబులును = గుఱ్ఱములు; ఐ = అయ్యి; సంచరించు = తిరుగుచుండెడి; భాస్కరున్ = భాస్కరున; కున్ = కు; అగ్ర = పై; భాగంబునన్ = భాగములో; అరుణుండు = అరుణుడు; నియుక్తుండు = నియమింపబడినవాడు; ఐ = అయ్యి; రథంబున్ = రథమును; గడుపుచుండున్ = నడుపుచుండును {గడుపుచుండును - సమయమును నడుపుచుండును, నడుపుచుండును}; వెండియున్ = ఇంకను; అంగుష్ఠ = బొటకనవేలి; పర్వ = కణుపు; మాత్ర = అంతమాత్రపు; శరీరంబున్ = దేహము; కల = కలిగిన; అఱువదివేల = అరవైవేలమంది; వాలఖిల్య = వాలఖిల్యులు; ఆఖ్యులు = అనెడి పేరు కలవారు; అగు = అయిన; ఋషి = ఋషులలో; వరులు = ఉత్తములు; సూర్యునిన్ = సూర్యుని; ముందటన్ = ముందు; సౌరసూక్తంబులన్ = సూర్యస్తోత్రములను; స్తుతియింపన్ = స్తుతించుతుండగా; మఱియున్ = ఇంకను; అనేక = అనేకమైన; మునులునున్ = మునులు; గంధర్వ = గంధర్వులు; కిన్నర = కిన్నరలు; కింపురుష = కింపురుషులు; నాగ = నాగులు; అప్సరః = అప్సరసలు; పతంగ = పక్షులు; ఆదులు = మొదలగువారు; నెలనెల = మాసము తరువాత మాసము; వరుసన్ = వరసగా; క్రమంబునన్ = క్రమముగ; సేవింపన్ = కొలచుతుండగా; పందొమ్మిది కోట్ల నేబది యొక లక్ష = పంతొమ్మిదికోట్లయేభైయొక్కలక్షల (19,51, 00,000); యోజనంబులన్ = యోజనముల; పరిమాణము = పరిమాణము; కల = కలిగిన; భూమండలంబున = భూమండలము; అందున్ = లో; ఒక్క = ఒక; క్షణంబునన్ = క్షణములో; సూర్యుండు = సూర్యుడు; రెండువేలఏబది = రెండువేలయోభై (2,050); యోజనంబులున్ = యోజనములను; సంచరించున్ = ప్రయాణించును; ఒక = ఒక; అహోరాత్రంబున్ = రాత్రింబవలు; అందె = అందలోనే; ఈ = ఈ; భూమండలంబున్ = భూమండలము; అంతయున్ = మొత్తమంతా; సంచరించున్ = ప్రయాణించును; అనిన = అనగా; శుక = శుకుడు యనెడి; యోగి = యోగులలో; ఇంద్రున్ = ఇంద్రుని వంటివాని; కున్ = కి; పరీక్షిత్ = పరీక్షితుడు యనెడు; నరేంద్రుడు = రాజు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను;

భావము:

ఆ సూర్యరథానికి గాయత్రి ఉష్టిక్ త్రిష్టుప్ అనుష్టుప్ జగతీ పంక్తి బృహతి అనెడి ఏడు ఛందస్సులు గుఱ్ఱాలుగా ఉన్నాయి. సూర్యునికి అరుణుడు రథసారథి. అతడు సూర్యుని ముందు భాగంలో కూర్చుండి రథాన్ని నడుపుతుంటాడు. బొటనవ్రేలి కణుపు పరిమాణం దేహం కలిగిన వాలఖిల్యులు అనే ఋషిపుంగవులు అరవై వేల మంది జ్యోతిర్మయ స్వరూపాలను ధరించినవారు సూర్యుని ముందుండి వేద సూక్తాలతో స్తోత్రం చేస్తుంటారు. ఎందరో మునులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, నాగులు, అప్సరసలు, గరుడులు మొదలైనవారు క్రమం తప్పకుండా సూర్యుణ్ణి సేవిస్తూ ఉంటారు. తొమ్మిది కోట్ల యాభైఒక్క లక్షల యోజనాల పరిమాణం కలిగిన భూమండలం చుట్టూ సూర్యుడు క్షణానికి రెండువేల యాభై యోజనాల చొప్పున అహోరాత్రంలో సంచరిస్తాడు” అని చెప్పిన శుకయోగీంద్రునితో పరీక్షిత్తు ఇలా అన్నాడు.

5.2-84-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"మునివర! మేరుధ్రువులకు
నొరఁ బ్రదక్షిణము దిరుగుచుండెడు నజుఁ డా
యినుఁ డభిముఖుఁడై రాసుల
నుకూలత నేగు నంటి; ది యెట్లొప్పున్."

టీకా:

ముని = మునులలో; వర = ఉత్తముడ; మేరు = మేరువునకు; ధ్రువులు = ధ్రువమండలముల; కున్ = కు; ఒనరన్ = చక్కగా; ప్రదక్షిణము = చుట్టును; తిరుగుచుండెడున్ = తిరుగుతుండెడి; అజుడు = పుట్టుక లేనివాడు; ఆ = ఆ; = ఇనుడు = సూర్యుడు; అభిముఖుడు = ఎదురుగ తిరుగువాడు; ఐ = అయ్యి; రాసులన్ = రాశుల; కున్ = కు; అనుకూలతన్ = అనుకూలముగ; ఏగును = ప్రయాణించును; అంటివి = చెప్పితివి; అది = అది; ఎట్లు = ఏవిధముగ; ఒప్పున్ = జరుగును;

భావము:

“మునీంద్రా! సూర్యుడు మేరువుకు, ధ్రువునికి ప్రదక్షిణంగా తిరుగుతూ ఉంటాడని చెప్పావు కదా! బ్రహ్మ స్వరూపుడైన సూర్యుడు పన్నెండు రాసులలోను అభిముఖుడై తిరిగుతాడని కూడా అన్నావు. అది ఎలా పొసగుతుంది?”

5.2-85-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని పలికిన భూవరునిం
నుగొని శుకయోగి మిగులఁ రుణాన్వితుఁడై
మున శ్రీహరిఁ దలఁచుచు
విను మని క్రమ్మఱఁగ నిట్లు వినిపించెఁ దగన్.

టీకా:

అని = అని; పలికిన = అనిన; భూవరునిన్ = రాజుని; కనుంగొని = చూసి; శుక = శుకుడు అనెడి; యోగి = యోగి; మిగులన్ = మిక్కిలి; కరుణ = దయతో; ఆన్వితుడు = కూడినవాడు; ఐ = అయ్యి; మనమునన్ = మనసులో; శ్రీహరిన్ = నారాయణుని; తలచుచున్ = తలచుకొనుచు; వినుము = వినుము; అని = అని; క్రమ్మఱగన్ = మరల; ఇట్లు = ఈ విధముగ; వినిపించెన్ = చెప్పెను; తగన్ = చక్కగా;

భావము:

అని ప్రశ్నించిన పరీక్షిత్తును చూచి శుకయోగి దయాపూర్ణుడై మనస్సులో శ్రీహరిని తలచుకొని “విను” అంటూ మళ్ళీ ఇలా చెప్పాడు.

5.2-86-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నరేంద్రా! యతి వేగంబునఁ దిరుగుచుండు కులాల చక్రంబు నందు జక్ర భ్రమణంబునకు వేఱైన గతి నొంది బంతిసాగి తిరిగెడు పిపీలకాదుల చందంబున నక్షత్రరాసులతోడం గూడిన కాలచక్రంబు ధ్రువమేరువులం బ్రదక్షిణంబు దిరుగునపు డా కాలచక్రంబు నెదుర సంచరించు సూర్యాదిగ్రహంబులకు నక్షత్రాంతరంబుల యందును రాశ్యంతరంబుల యందును నునికి గలుగుటం జేసి సూర్యాది గ్రహంబులకుఁ జక్రగతి స్వగతులవలన గతిద్వయంబు గలుగుచుండు; మఱియు నా సూర్యుం డాదినారాయణమూర్తి యగుచు లోకంబుల యోగక్షేమంబులకు వేదత్రయాత్మకంబై కర్మసిద్ధి నిమిత్తంబై దేవర్షి గణంబులచేత వేదాం తార్థంబుల ననవరతంబు వితర్క్యమాణం బగుచున్న తన స్వరూపంబును ద్వాదశ విధంబులుగ విభజించి వసంతాది ఋతువుల నాయా కాలవిశేషంబుల యందుఁ గలుగఁ జేయుచుండు; నట్టి పరమ పురుషుని మహిమ నీ లోకంబున మహాత్ములగు పురుషులు దమతమ వర్ణాశ్రమాచారముల చొప్పున వేదోక్త ప్రకారంబుగా భక్త్యతిశయంబున నారాధించుచు క్షేమంబు నొందుచుందు; రట్టి యాదినారాయణమూర్తి జ్యోతిశ్చక్రాంతర్వర్తియై స్వకీయ తేజఃపుంజదీపితాఖిల జ్యోతిర్గణంబులు గలవాడై ద్వాదశరాసుల యందు నొక సంవత్సరంబున సంచరించుచుండు; నట్టి యాదిపురుషుని గమన విశేషకాలంబును లోకు లయన ఋతు మాస పక్ష తిథ్యాదులచే వ్యవహరించుచుందురు; మఱియు నప్పరమపురుషుం డా రాసుల యందు షష్టాంశ సంచారంబు నొందిన సమయంబును ఋతు వని వ్యవహరింపుదు; రా రాసుల యందు నర్థాంశ సంచారమ్మున రాశిషట్కభోగం బొందిన తఱి యయనం బని చెప్పుదురు; సమగ్రంబుగా రాశుల యందు సంచార మొందిన యెడల నట్టి కాలంబును సంవత్సరం బని నిర్ణ యింపుదు; రట్టి సమగ్రరాశి సంచారంబునందు శీఘ్రగతి మందగతి సమగతు లనియెడు త్రివిధగతి విశేషంబులవలన వేఱుపడెడు నా వత్సరంబును సంవత్సరంబు పరివత్సరం బిడావత్సరం బనువత్సరం బిద్వత్సరం బని పంచవిధంబులఁ జెప్పుదురు; చంద్రుండు నీ తెఱంగున నా సూర్యమండలంబు మీఁద లక్షయోజనంబుల నుండి సంవత్సర పక్ష రాశి నక్షత్ర భుక్తులు గ్రహించుచు నగ్రచారియై శీఘ్ర గతిం జరించునంత వృద్ధిక్షయరూపంబునం బితృగణంబులకుఁ బూర్వ పక్షాపరపక్షంబులచేత నహోరత్రంబులఁ గలుఁగఁ జేయుచు సకలజీవ ప్రాణంబై యొక్క నక్షత్రంబు త్రింశన్మూహూర్తంబు లనుభవించుచు షోడశ కళలు గలిగి మనోమయాన్నమ యామృతమయ దేహుండై దేవ పితృ మనుష్య భూత పశు పక్షి సరీసృప వీరుత్ప్ర భృతులకుఁ బ్రాణాప్యాయనశీలుం డగుటంజేసి సర్వసముం డనంబడు.

టీకా:

నరేంద్రా = రాజా; అతి = మిక్కిలి; వేగంబునన్ = వేగముగా; తిరుగుచుండు = తిరుగుచుండెడి; కులాల = కుమ్మరి; చక్రంబున్ = చక్రము; అందున్ = లో; చక్రభ్రమణంబున్ = గుండ్రముగా తిరుగుట; కున్ = కు; వేఱు = ఇతరము; ఐన = అయిన; గతిన్ = గమనమును; ఒంది = పొంది; బంతిసాగి = వరుసకట్టి; తిరుగెడు = తిరుగుచుండెడి; పిపీలక = చీమలు; ఆదులన్ = మొదలగువాని; చందంబునన్ = విధముగా; నక్షత్రరాసులు = నక్షత్రరాశుల; తోడన్ = తోటి; కూడిన = కూడి ఉన్న; కాలచక్రంబున్ = కాలచక్రము; ధ్రువ = ధ్రువమండలము; మేరువులన్ = మేరుపర్వతముల; ప్రదక్షిణంబున్ = చుట్టును; తిరుగున్ = తిరుగును; అపుడు = అప్పుడు; ఆ = ఆ; కాలచక్రంబున్ = కాలచక్రము; ఎదురన్ = ఎదురుగా; సంచరించు = ప్రయాణించెడి; సూర్య = సూర్యుడు; ఆది = మొదలగు; గ్రహంబులు = గ్రహముల; కున్ = కు; నక్షత్ర = నక్షత్రముల; అంతరంబులన్ = మధ్యప్రదేశముల; అందునున్ = లోను; రాశి = రాశుల; అంతరంబులన్ = మధ్యప్రదేశముల; అందునున్ = లోను; ఉనికి = స్థానము; కలుగుటన్ = కలిగి ఉండుట; చేతన్ = వలన; సూర్య = సూర్యుడు; ఆది = మొదలగు; గ్రహంబులు = గ్రహముల; కున్ = కు; చక్రగతి = చక్రభ్రమణము; స్వ = తన; గతుల = గమనములు; వలన = వలన; గతి = గమనముల; ద్వయంబున్ = రెండేసి; కలుగుచుండున్ = ఉండును; మఱియున్ = ఇంకను; ఆ = ఆ; సూర్యుండు = సూర్యుడు; ఆదినారాయణమూర్తి = ఆదినారాయణుని విగ్రహము {ఆదినారాయణుడు - ఆది (సృష్టికి ముందు) నారములు (నీటి) యందు వసించెడివాడు, సూర్యుడు}; అగుచున్ = అగుచు; లోకంబులన్ = లోకములకు; యోగక్షేమంబుల = శుభములు; కున్ = కు; వేద = వేదములు; త్రయ = మూటి (3); ఆత్మకంబున్ = స్వరూపము; ఐ = అయ్యి; కర్మ = పనులు; సిద్ధి = నెరవేరుట; నిమిత్తంబున్ = కోసము; ఐ = అయ్యి; దేవర్షి = దేవతలలో ఋషియైనవారి; గణంబుల = సమూహముల; చేతన్ = చేత; వేదాంత = వేదాంతముల; అర్థంబులన్ = అర్థములను; అనవరతంబున్ = ఎల్లప్పుడును; వితర్క్యమాణంబు = తర్కింపబడుతున్నవి; అగుచున్న = అగుతున్న; తన = తన యొక్క; స్వరూపంబును = స్వరూపమును; ద్వాదశ = పన్నెండు (12); విధంబులుగన్ = విధములుగా; విభజించి = విభజించుతూ; వసంత = వసంతము; ఆది = మొదలగు; ఋతువులన్ = ఋతువులను {ఋతువులు - వసంతాది - 1వసంతఋతువు 2గ్రీష్మఋతువు 3వర్షఋతువు 4శరదృతువు 5హేమంతఋతువు 6శిశిరఋతువు}; ఆయా = ఆయా; కాల = కాలముల యొక్క; విశేషంబులు = విశేషముల; అందున్ = లో; కలుగన్ = కలిగునట్లు; చేయుచుండున్ = చేయుచుండును; అట్టి = అటువంటి; పరమ = అఖిలమునకు పరమమైనట్టి; పురుషునిన్ = పురుషుని; మహిమన్ = గొప్పదనమును; ఈ = ఈ; లోకంబునన్ = లోకములో; మహాత్ములు = గొప్పవారు; అగు = అయిన; పురుషులు = వారు; తమతమ = వారివారి; వర్ణ = వర్ణధర్మములు {వర్ణములు - 1బ్రాహ్మణ 2క్షత్రియ 3వైశ్య 4శూద్ర అనెడి చాతుర్వర్ణములు}; ఆశ్రమ = ఆశ్రమముల ధర్మములు {ఆశ్రమములు - 1బ్రహ్మచర్యము 2గార్హస్త్యము 3వానప్రస్థము 4సన్యాసము అనెడి చతురాశ్రమములు}; ఆచారముల = ఆచారములు; చొప్పున = ప్రకారము; వేద = వేదములందు; ఉక్త = చెప్పబడిన; ప్రకారంబుగా = విధముగా; భక్తి = భక్తి యొక్క; అతిశయంబునన్ = పెరుగుటచేత; ఆరాధించుచు = సేవించుతూ; క్షేమంబున్ = శుభములను; ఒందుచుందురు = పొందుతుందురు; అట్టి = అటువంటి; ఆదినారాయణమూర్తి = ఆదినారాయణుని విగ్రహము; జ్యోతిశ్చక్ర = జ్యోతిశ్చక్రము {జ్యోతిశ్చక్రము - గ్రహనక్షత్రాదులైన జ్యోతిర్మండలభ్రమణముగల చక్రము, అంతరిక్షము}; అంతర్వర్తి = లోన తిరిగెడువాడు; ఐ = అయ్యి; స్వకీయ = తన యొక్క; తేజః = వెలుగుల; పుంజ = పుంజములచేత; దీపిత = ప్రకాశమానమైన; అఖిల = నిఖిలమైన; జ్యోతిః = జ్యోతిర్మండలముల; గణంబులు = సమూహములు; కలవాడు = కలిగినవాడు; ఐ = అయ్యి; ద్వాదశ = పన్నెండు (12) {ద్వాదశరాశులు - 1మేషము (మేక) 2వృషభము (ఎద్దు) 3మిథునము (దంపతులు 4కర్కాటకము (పీత) 5సింహము 6కన్య (పడచు) 7తుల (త్రాసు) 8వృశ్చికము (తేలు) 9ధనుస్సు (విల్లు) 10మకరము (మొసలి) 11కుంభము (కుండ) 12మీనము (చేప)}; రాసుల = రాశుల; అందున్ = లోను; ఒక = ఒక; సంవత్సరంబునన్ = సంవత్సరములో; సంచరించుచుండు = తిరుగుతుండెడి; అట్టి = అటువంటి; ఆదిపురుషుని = మూలపురుషుని; గమన = గతుల; విశేష = విశిష్ఠమైన; కాలంబునున్ = కాలమును; లోకులు = ప్రజలు; అయన = అయనములు {అయనములు - 1ఉత్తరాయణము 2దక్షిణాయనము}; ఋతు = ఋతువులు; మాస = నెలలు {నెలలు - పన్నెండు, 1చైత్రము 2వైశాఖము 3జేష్ఠము 4ఆషాడము 5శ్రావణము 6బాధ్రపదము 7ఆశ్వయుజము 8కార్తీకము 9మార్గశిరము 10పుష్యమి 11మాఘము 12ఫాల్గుణము}; పక్ష = పక్షములు {పక్షములు - 1శుక్లపక్షము 2కృష్ణపక్షము}; తిథులు = తిథులు {తిథులు - 1పాడ్యమి 2విదియ 3తదియ 4చవితి 5పంచమి 6షష్ఠి 7సప్తమి 8అష్టమి 9నవమి 10దశమి 11ఏకాదశి 12ద్వాదశి 13త్రయోదశి 14చతుర్దశి 15పున్నమి లేక అమావాస్య}; ఆదులు = మొదలగువాని; చేన్ = చేత; వ్యవహరించుచుందురు = చెప్పుకొనెదరు; మఱియున్ = ఇంకను; ఆ = ఆ; పరమ = సమస్తమునకు పరముయైనట్టి; పురుషుండు = వాడు; ఆ = ఆ; రాసుల = రాశుల; అందున్ = అందు; షష్ఠాంశ = ఆరవవంతు; సంచారంబున్ = తిరుగుట; అందిన = జరిగిన; సమయంబునున్ = కాలమును; ఋతువు = ఋతువు; అని = అని; వ్యవహరింపుదురు = అనెదరు; ఆ = ఆ; రాసుల = రాశుల; అందున్ = లో; అర్థాంశ = సగముభాగమును; సంచారమ్మునన్ = తిరుగుటయందు; రాశి = రాశుల; షట్క = ఆరింటిని; భోగం = అనుభవించుటను; పొందిన = పొందినట్టి; తఱి = కాలమును; అయనంబు = అయనము; అని = అని; చెప్పుదురు = చెప్పుతారు; సమగ్రంబుగా = పూర్తిగా; రాశులన్ = అన్ని రాశుల; అందున్ = లోను; సంచారమున్ = తిరుగుట; ఒందిన = పొందిన; ఎడలన్ = అట్లయితే; కాలంబునున్ = కాలమును; సంవత్సరంబున్ = సంవత్సరము; అని = అని; నిర్ణయింపుదురు = నిర్ణయించిరి; సమగ్ర = సంపూర్ణమైన; రాశి = రాశుల; సంచారంబున్ = సంచరించుట; అందున్ = లో; శీఘ్రగతి = వేగముగానడచుట; మందగతి = మెల్లగానడచుట; సమగతులన్ = సమానముగానడచుట; అనియెడు = అనెడు; త్రివిధగతి = మూడురకములనడకల; విశేషంబుల = విశిష్టతల; వలన = వలన; వేఱుపడెడు = ఏర్పడెడు; ఆ = ఆ; వత్సరంబునున్ = వత్సరమును; సంవత్సరంబు = సంవత్సరము; పరివత్సరంబు = పరివత్సరము; ఇడావత్సరంబు = ఇడావత్సరము; అనువత్సరంబు = అనువత్సరము; బిద్వత్సరంబు = బిద్వత్సరము; అని = అని; పంచ = ఐదు (5); విధంబులన్ = రకములుగ; చెప్పుదురు = చెప్పెదరు; చంద్రుండు = చంద్రుడు; ఈ = ఈ; తెఱంగునన్ = విధముగా; ఆ = ఆ; సూర్యమండలంబు = సూర్యమండలము; మీదన్ = పైన; లక్ష = ఒకలక్ష; యోజనంబులన్ = యోజనముల దూరములో; ఉండి = ఉండి; సంవత్సర = సంవత్సరము; పక్ష = పక్షములు; రాశి = రాశుల; నక్షత్ర = నక్షత్రముల; భుక్తులు = అనుభవించుటలు; గ్రహించుచు = తెలిసికొనుచు; అగ్ర = పైన; సంచారి = తిరిగెడువాడు; శీఘ్రగతిన్ = వేగముగా వెళ్ళుట; చరించు = సంచరిస్తున్న; అంతన్ = అంతట; వృద్ధి = అభివృద్ధి; క్షయ = క్షీణించుట; రూపంబున్ = రూపముతో; పితృ = పితృదేవతా; గణంబులన్ = సమూహముల; గణంబులు = గణముల; పూర్వ = శుక్ల; పక్షంబున్ = పక్షములు; అపర = కృష్ణ; పక్షంబుల = పక్షములు; చేతన్ = చేత; అహోరాత్రంబులన్ = రాత్రింబవళ్ళు; కలుగన్ = కలుగునట్లు; సకల = అఖిల; జీవ = ప్రాణులకు; ప్రాణంబు = ప్రాణాధారము; ఐ = అయ్యి; ఒక్క = ఒక్కక్క; నక్షత్రంబున్ = నక్షత్రమును; త్రింశ = ముప్పై (30); ముహూర్తంబులను = ముహూర్తములను; అనుభవించుచున్ = అనుభవించుచు; షోడశ = పదహారు; కళలు = చంద్రకళలు; కలిగి = ఉండి; మనోమయ = మనస్సుతోను; అన్నమయ = అన్నముతోను; అమృతమయ = అమృతముతోను; దేహుండు = శరీరము గలవాడు; ఐ = అయ్యి; దేవ = దేవతలకు; పితృ = పితృగణములకు; మనుష్య = మానవులకు; భూత = జంతువులకు; పశు = పశువులకు; పక్షి = పక్షులకు; సరీసృప = పొట్టతోపాకెడు ప్రాణులకు; వీరుత్ = పొదలు దుబ్బులు తీగలు; ప్రభృతుల = ఆదుల; కున్ = కు; ప్రాణ = ప్రాణములకు; ఆప్యాయ = తృప్తిని; శీలుండు = కలిగించెడి తత్వముగలవాడు; అగుటన్ = అగుట; చేసి = వలన; సర్వసముండు = సర్వసముడు; అనంబడు = అందురు;

భావము:

“రాజా! కుమ్మరిసారె వేగంగా గిరగిరా తిరుగుతుంటుంది. ఆ సారెమీద చీమల బారులు తిరుగుతుంటాయి. అయితే వాటి గమనం ఆ చక్ర భ్రమణానికి భిన్నంగా ఉంటుంది. అదే విధంగా నక్షత్రాలతో, రాసులతో కూడిన కాలచక్రం తిరుగుతున్నది. ఆ కాలచక్రం ధ్రువ మేరువులను ప్రదక్షిణం చేస్తూ తిరిగేటప్పుడు ఆ కాలచక్రం వెంట తిరిగే సూర్యాది గ్రహాలు నక్షత్రాలలోను, రాసులలోను సంచరిస్తూ ఉంటాయి. అందువల్ల సూర్యాది గ్రహాలకు కాలచక్ర గమనం, స్వగమనం అనే రెండు రకాల గమనాలు కలుగుతున్నాయి. అంటే తమంత తాము తిరగడం, కాలచక్ర గమనంతో తిరగడం. ఆదినారాయణుడే సూర్యుడుగా ప్రకాశిస్తున్నాడు. ఆ సూర్యభగవానుడు సమస్త లోకవాసుల యోగక్షేమాలు ప్రసాదించేవాడు. అతడు ఋగ్యజుస్సామ వేదస్వరూపుడు. మానవులు నిర్వహించే కర్మలకు సిద్ధి ప్రదాత. ఆ దేవుని స్వరూపాన్ని దేవర్షి గణాలు వేదాంతపరంగా భావించి సంభావిస్తారు. అటువంటి సూర్యుడు తన స్వరూపాన్ని పన్నెండు విధాలుగా విభజించి వసంతం గ్రీష్మం మొదలైన ఋతువులను ఆయా కాలాలలో కలుగజేస్తూ ఉంటాడు. అటువంటి పరమ పురుషుని మహిమను అర్థం చేసుకొన్న మహాత్ములు వర్ణాశ్రమాలను పాటిస్తూ వేదాలలో చెప్పబడ్డట్టు అతిశయమైన భక్తితో ఆయనను ఆరాధిస్తూ క్షేమంగా ఉంటారు. సూర్య రూపుడైన ఆదినారాయణమూర్తి జ్యోతిశ్చక్రంలో తిరుగుతూ తన తేజస్సుతో గ్రహగోళాలను వెలిగిస్తూ ద్వాదశ రాసులలో ఒక సంవత్సరకాలం సంచరిస్తాడు. ఆ ఆదిపురుషుని గమన విశేషాన్ని లోకులు అయనాలు, ఋతువులు, మాసాలు, పక్షాలు, తిథులు అనే పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు. రాసులలో ఆరవ భాగం సంచారం చేసే కాలాన్ని ఋతువని వ్యవహరిస్తారు. ఆ రాసులలో సగభాగం సంచరిస్తూ ఆరు రాసులలో తిరిగే కాలాన్ని అయన మంటారు. రాసులన్నిటిలోను పూర్తిగా తిరిగిన కాలాన్ని సంవత్సర మని నిర్ణయిస్తారు. ఆ సమగ్ర రాశి సంచారంలో మూడు రకాలైన గమనాలు ఉంటాయి. మొదటిది శ్రీఘ్రగతి. రెండవది మందగతి. మూడవది సమగతి. ఈ గతుల కారణంగా సంవత్సరంలో కలిగిన మార్పులను వరుసగా వత్సరం, పరివత్సరం, ఇడావత్సరం, అనువత్సరం, ఇద్వత్సరం అని ఐదు విధాలుగా చెబుతారు. ఇదే పద్ధతిలో చంద్రుడు సూర్యమండలం మీద లక్ష యోజనాల దూరం నుండి సంవత్సరం, పక్షాలు, రాసులు, నక్షత్రాలు భుక్తులను గ్రహిస్తూ ముందుండి వేగంగా సంచరిస్తాడు. చంద్రుని వృద్ధి క్షయాల వల్ల పితృగణాలకు పూర్వపక్షం, అపరపక్షం అనేవి ఏర్పడతాయి. వీటివల్లనే పగలు రాత్రులు కలుగుతాయి. చంద్రుడు ఒక్కొక్క నక్షత్రంలో ముప్పై ముహూర్తాల కాలం సంచరిస్తాడు. పదహారు కళలతో మనోమయ, అన్నమయ, అమృతమయ దేహంతో ఒప్పుతూ ఉంటాడు. దేవతలకు, పితృగణానికి, మానవులకు, భూతాలకు, జంతువులకు, పక్షులకు, పాములు మొదలైనవాటికి, తీగలకు, పొదలకు ప్రాణప్రదమైన తన స్పర్శవల్ల సంతృప్తిని కలిగిస్తూ చంద్రుడు సర్వసముడుగా ప్రకాశిస్తాడు.

5.2-87-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చందురునకు మీఁదై యా
నందంబున లక్ష యోజనంబులఁ దారల్
క్రందుకొని మేరు శైలం
బంది ప్రదక్షిణము దిరుగు భిజిద్భముతోన్.

టీకా:

చందురున్ = చంద్రుని; కున్ = కి; మీదన్ = పైన; ఐ = ఉండి; ఆనందంబున = సంతోషముగ; లక్ష = లక్ష (1,00,000); యోజనంబులన్ = యోజనముల దూరములో; తారల్ = తారకలు; క్రందుకొని = గుమికూడి; మేరుశైలంబున్ = మేరుపర్వతమును; అంది = అందుల; ప్రదక్షిణమున్ = చక్రభ్రమణమున; తిరుగున్ = తిరుగును; అభిజిద్భము = అభిజిత్ అనెడి తార; తోన్ = తోటి;

భావము:

చంద్రుని పైన లక్షయోజనాల ఎత్తు ప్రదేశంలో నక్షత్ర మండలం ఉంది. అందలి నక్షత్రాలన్నీ అభిజిత్తుతో కూడా కలిసి మేరుపర్వతానికి ప్రదక్షిణం చేస్తూ ఉంటాయి.

5.2-88-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట మీఁదఁ దారల న్నిటి కుపరి యై-
రెండులక్షల శుక్రుఁ డుండి భాస్క
రుని ముందఱం బిఱుఁను సామ్యమృదు శీఘ్ర-
సంచారములను భాస్కరుని మాడ్కిఁ
రియించుచుండును నులకు ననుకూలుఁ-
డై వృష్టి నొసఁగుచు నంతనంతఁ
తురత వృష్టి విష్కంభక గ్రహశాంతి-
నొనరించువారల కొసఁగు శుభము;

5.2-88.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లుండు నా మీఁద సౌమ్యుండు రెండులక్ష
ను జరించుచు రవిమండలంబుఁ బాసి
కానఁబడినను జనులకు క్షామ డాంబ
రాది భయములఁ బుట్టించు తుల మహిమ

టీకా:

అట = అక్కడనుండి; తారల్ = తారలు; కున్ = కు; అన్నిటి = అన్నిటి; కిన్ = కి; ఉపరి = పైనున్నది; ఐ = అయ్యి; రెండులక్షల = రెండులక్షల (2,00,000) ఎత్తులో; శుక్రుడు = శుక్రగ్రహము; ఉండి = ఉండి; భాస్కరుని = సూర్యుని; ముందఱన్ = రాకకు ముందర; పిఱుందను = వెనుక; సామ్య = సామానముగ; మృదు = మెల్లగా; శీఘ్ర = వేగముగ; సంచారములను = తిరుగుటలను; భాస్కరుని = సూర్యుని; మాడ్కిన్ = వలె; చరియించుచుండును = వర్తించుచుండును; జనుల్ = ప్రజల; కున్ = కు; అనుకూలుడు = అనుకూలముగ నుండువాడు; ఐ = అయ్యి; వృష్టిన్ = వర్షమును; ఒసగుచున్ = కలిగించుచు; అంతనంతన్ = అప్పుడప్పుడు; చతురతన్ = నేర్పుగా; వృష్టి = వర్షమునకు; విష్కంభక = విఘ్నములకై; గ్రహశాంతి = గ్రహములకు శాంతికర్మలు; ఒనరించు = చేసెడి; వారల = వారి; కిన్ = కి; ఒసగున్ = ఇచ్చును; శుభములు = శుభములను; ఉండున్ = ఉండును; ఆ = ఆ; మీద = పైన;
సౌమ్యుండు = బుధుడు {సౌమ్యండు - సోముని (చంద్రుని) పుత్రుడు, బుధుడు}; రెండులక్షలను = రెండులక్షల (2,00,000) ఎత్తులో; చరించుచున్ = సంచరించుచు; రవి = సూర్య; మండలంబున్ = మండలమును; పాసి = విడిచి; కానబడినను = కనపడుతున్నప్పటికిని; జనుల్ = ప్రజల; కున్ = కి; క్షామ = కరువులు; ఆడంబర = యుద్ధసన్నాహాలు; ఆది = మొదలగు; భయములన్ = భయములను; పుట్టించు = కలిగించును; అతుల = సాటిలేని; మహిమన్ = మహిమతోటి;

భావము:

నక్షత్ర మండలానికి రెండు లక్షల యోజనాల ఎత్తున శుక్రుడు సంచరిస్తూ ఉంటాడు. ఇతడు సూర్యునికి ముందూ, వెనుకా ఉదయిస్తూ సూర్యునిలాగే సంచారం చేస్తాడు. ఇతని గమనం కొన్నిసార్లు మెల్లగా, కొన్నిసార్లు మృదువుగా, కొన్నిసార్లు తొందరగా సాగుతుంది. ఈ శుక్రుడు ప్రజల కందరికీ అనుకూలుడై వర్షం కురుపిస్తాడు. వర్షాలకు ఆటకం కలిగించే గ్రహాలకు శాంతి చేసినట్లయితే శుక్రుడు సంతుష్టి పొంది శుభం కలుగజేస్తాడు. శుక్రుని కంటె పైన రెండు లక్షల యోజనాల దూరంలో బుధుడు తిరుగుతూ ఉంటాడు. అతడు సూర్యమండలాన్ని వదలి దూరంగా కనిపించినా ప్రజలందరికీ కరువు కాటకాలు, దోపిడీల భయాన్ని కలిగిస్తాడు.

5.2-89-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రణీతనూజుఁ డంటిమీఁద రెండుల-
క్షల నుండి మూఁడు పక్షముల నొక్క
రాశి దాఁటుచు నుండుఁ; గ్రమమున ద్వాదశ-
రాసుల భుజియించు రాజసమున;
క్రించియైన నక్రత నైనను-
ఱచుగాఁ బీడలు రుల కొసఁగు;
నంగారకుని టెంకి కావల రెండుల-
క్షల యోజనంబుల నత మించి

5.2-89.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యొక్క రాశినుండి యొక్కొక్క వత్సరం
నుభవించుచుండు మరగురుఁడు
క్రమందు నైన సుధామరులకును
శుము నొసఁగు నెపుడు భినవముగ.

టీకా:

ధరణీతనూజుడు = అంగారకుడు {ధరణీతనూజుడు - ధరణీ (భూమికి) తనూజుడు (పుత్రుడు), అంగారకుడు}; రెండులక్షలన్ = రెండులక్షల (2,00,000) ఎత్తులో; ఉండి = ఉండి; మూడు = మూడు (3); పక్షములన్ = పక్షములకు; ఒక్క = ఒక; రాశిన్ = రాశిని; దాటుచున్ = కడచుచు; ఉండున్ = ఉండును; క్రమమున = వరుసగా; ద్వాదశ = పన్నెండు (12); రాసుల = రాశుల; భుజియించు = అనుభవించును; రాజసమున = రజోగుణముతో; వక్రించి = వక్రగతియందు; ఐనన్ = అయినను; అవక్రతన్ = వక్రగతిలేకుండగ; ఐననున్ = అయినను; తఱచుగా = బహుళముగా; పీడలు = చీడపీడలు; నరుల్ = జనుల; కున్ = కు; ఒసగున్ = ఇచ్చును; అంగారకుని = అంగారకుని; టెంకి = నివాసమున; కిన్ = కి; ఆవల = అవతల; రెండులక్షల = రెండులక్షల (2,00,000); యోజనంబులన్ = యోజనముల దూరములో; ఘనతన్ = గొప్పగా; మించి = అతిశయించి;
ఒక్క = ఒక్కక్క; రాశిన్ = రాశిలోను; ఉండి = ఉండి; ఒక్కక్క = ఒక్కక్క; వత్సరంబున్ = సంవత్సరము; అనుభవించుచుండున్ = అనుభవించుతుండును; అమరగురుడు = బృహస్పతి {అమరగురుడు - అమరుల (దేవతల) కు గురువు, బృహస్పతి}; = వక్రమందున్ = వక్రగతిలోనుండి; ఐనన్ = అయినను; వసుధామరుల్ = బ్రాహ్మణుల {వసుధామరలు - వసుధ (భూమి)కి అమరులు (దేవతలు), బ్రాహ్మణులు}; కునున్ = కి; శుభమున్ = శుభములను; ఒసగున్ = ఇచ్చును; ఎపుడున్ = ఎల్లప్పుడును; అభినవముగ = కొత్తకొత్తగ;

భావము:

బుధునికంటే పైన రెండు లక్షల యోజనాల దూరంలో అంగారకుడు ఉన్నాడు. అతడు మూడు పక్షాల కాలంలో ఒక్కొక్క రాశి దాటుతూ సంచారం చేస్తాడు. ఈ విధంగా పన్నెండు రాసులలో రాజసంతో సంచరిస్తూ ఉంటాడు. వక్రగతిలో కాని, వక్రగతిలో లేనప్పుడు కాని అంగారకుడు ప్రజలకు పీడలే కలిగిస్తాడు. అతనికి రెండు లక్షల యోజనాల దూరంలో బృహస్పతి సంచరిస్తున్నాడు. అతడు ప్రతి ఒక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం సంచరిస్తూ ఉంటాడు. ఇతడు వక్రగతిలో ఉన్నా బ్రాహ్మణులకు ఎప్పటి కప్పుడు శుభపరంపరలను ప్రసాదిస్తూ ఉంటాడు.

5.2-90-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సుగురునకు మీఁదై భా
స్కసుతుఁ డిరు లక్షలను జములకు బీడల్
పుచుఁ ద్రింశన్మాసము
రుదుగ నొక్కొక్క రాశియందు వసించున్.

టీకా:

సురగురున్ = బృహస్పతి; కున్ = కి; మీద = పైన; ఐ = ఉండి; భాస్కరసుతుడున్ = శని {భాస్కర సుతుడు - భాస్కర (సూర్యుని) సుతుడు (పుత్రుడు), శనీశ్వరుడు}; ఇరులక్షలను = రెండు లక్షల (2,00,000) దూరములో; జగముల్ = లోకముల; కున్ = కు; పీడల్ = పీడలను; జరుపుచు = కలిగించుచు; త్రింశత్ = ముప్పై (30); మాసములు = నెలలు; అరుదుగ = అపూర్వముగ; ఒక్కక్క = ఒక్కక్క; రాశిన్ = రాశి; అందున్ = లోను; వసించున్ = నివసించును;

భావము:

బృహస్పతి కన్న రెండు లక్షల యోజనాలకు పైన శని తిరుగుతూ ఉంటాడు. ఇతను ప్రతిరాశిలోను ముప్పై మాసాలు చరిస్తాడు. ఈ ముప్పై మాసాలలోను శని ప్రజలకు కష్టాలే కలిగిస్తాడు.

5.2-91-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రాటముగ రవి సుతునకు
నేకాదశలక్షలను మహీసురులకు నీ
లోకులకు మేలు గోరుచుఁ
జోగ మునిసప్తకంబు సొంపు వహించున్.

టీకా:

ప్రాకటముగ = ప్రసిద్ధముగ; రవిసుతున్ = శని {రవిసుతుడు - రవి (సూర్యుని) సుతుడు (కుమారుడు), శనీశ్వరుడు}; కున్ = కి; ఏకాదశలక్షలను = పదకొండులక్షలలో (11,00,000); మహీసురుల్ = బ్రాహ్మణుల; కున్ = కు; లోకుల్ = లోకులు; కు = కు; మేలు = శుభములను; కోరుచున్ = ఆశించుతూ; జోకగ = జతగా; మునిసప్తకంబున్ = సప్తర్షిమండలము {సప్తర్షులు - 1మరీచి 2అత్రి 3అంగిరసుడు 4పులస్త్యుడు 5పులహుడు 6క్రతువు 7వసిష్ఠుడు అనెడి ఏడుగురు ఋషులు}; సొంపు = చక్కదనము; వహించున్ = కలిగియుండును;

భావము:

శనికి పదకొండు లక్షల యోజనాల దూరంలో సప్తర్షి మండలం ఉంది. ఇందులోని ఋషులు బ్రాహ్మణులకు, ప్రజలకు మేలు కోరుతుంటారు.

5.2-92-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మునిసప్తకమున కెగువం
రుచు నా మీఁదఁ ద్రియుతశలక్షలఁ బెం
పు శింశుమారచక్రం
నఁగా నిన్నిఁటికి నుపరి గుచుండు నృపా!

టీకా:

మునిసప్తకమున్ = సప్తర్షిమండలమున; కిన్ = కి; ఎగువన్ = పైన; తనరుచున్ = అతిశయించుతూ; ఆ = ఆ; మీద = పైన; త్రియుతదశలక్షల = పదమూడులక్షల (13,00,000); పెంపునన్ = ఎత్తున; = శింశుమారచక్రంబున్ = శింశుమారచక్రము {శింశుమారము - మొసలి}; అనగాన్ = అనగా; ఇన్నిటికిన్ = అన్నిటికి; ఉపరి = పైనున్నది; అగుచుండున్ = అయ్యి ఉండును; నృపా = రాజా;

భావము:

రాజా! సప్తర్షి మండలం కంటె పదమూడు లక్షల యోజనాల దూరంలో శింశుమారచక్రం ఉంది. ఇదే ఆకాశంలో అన్నిటికన్న పైన ఉన్న చక్రం.

5.2-93-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శింశుమారాఖ్యగు చక్రమున భాగ-
తుఁడైన ధ్రువుఁ డింద్ర రుణ కశ్య
ప్రజాపతి యమప్రముఖులతోఁ గూడి-
హుమానముగ విష్ణుదముఁ జేరి
ణఁక నిచ్చలుఁ బ్రదక్షిముగాఁ దిరుగుచుఁ-
జెలఁగి యుండును గల్పజీవి యగుచు;
నఘుఁ డుత్తాన పాదాత్మజుఁ డార్యుఁడు-
యిన యా ధ్రువుని మత్త్వ మెల్లఁ

5.2-93.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దెలిసి వర్ణింప బ్రహ్మకు విగాదు
నే నెఱింగినయంతయు నీకు మున్న
తెలియఁ బలికితిఁ; గ్రమ్మఱఁ లఁచికొనుము
జితరిపువ్రాత! శ్రీపరీక్షిన్నరేంద్ర!

టీకా:

ఆ = ఆ; శింశుమార = శింశుమారము యనెడి; ఆఖ్యము = పేరుగలది; అగు = అయిన; చక్రమున = చక్రమునందు; భాగవతుడు = భాగవతుడు; ఐన = అయిన; ధ్రువుడు = ధ్రువుడు; ఇంద్ర = ఇంద్రుడు; వరుణ = వరుణుడు; కశ్యప = కశ్యపుడు యనెడి; ప్రజాపతి = ప్రజాపతి; యమ = యముడు; ప్రముఖుల్ = మొదలగు ముఖ్యుల; తోన్ = తోటి; కూడి = కలిసి; బహుమానముగ = సమ్మానరూపముగ; విష్ణుపదమున్ = విష్ణులోకమును; చేరి = ఒంగి; కణక = కడక, యత్నించి; నిచ్చలున్ = నిత్యము; ప్రదక్షిణమున్ = చుట్టుతిరుగుచు; చెలగి = చక్కగా; ఉండునున్ = ఉండును; కల్పజీవి = బ్రహ్మకల్పాంతము ఉండెడి జీవి; అగుచున్ = అగుచు; అనఘుడు = పుణ్యుడు; ఉత్తానపాద = ఉత్తానపాదుని; ఆత్మజుడు = పుత్రుడు; ఆర్యుడు = పూజ్యుడు; అయిన = అయినట్టి; = ఆ = ఆ; ధ్రువుని = ధ్రువుని; మహత్త్వమున్ = గొప్పదనమును; ఎల్లన్ = అంతటిని; తెలిసి = తెలిసికొని;
వర్ణింపన్ = కీర్తించుటకు; బ్రహ్మ = బ్రహ్మదేవుని; కున్ = కి; అలవి = సాధ్యము; కాదు = కాదు; నేన్ = నేను; ఎఱింగిన = తెలిసినది; అంతయున్ = అంతా; నీవు = నీవు; కున్ = కు; మున్నన్ = ఇంతకు ముందే; తెలియ = తెలియునట్లు; పలికితిన్ = చెప్పితిని; క్రమ్మఱన్ = మరల; తలచికొనుము = జ్ఞప్తిచేసుకొనుము; జిత = జయించిన; రిపు = శత్రువుల; వ్రాత = సమూహముగలవాడ; శ్రీ = సంపత్కరమైన; పరీక్షిత్ = పరీక్షిత్తు యనెడి; నరేంద్ర = రాజా;

భావము:

పరీక్షిన్మహారాజా! ఆ శింశుమారచక్రంలో పరమ భక్తుడైన ధ్రువుడు ఉన్నాడు. అతడు ఇంద్రుడు, వరుణుడు, కశ్యపుడు, యముడు మొదలైన దేవతలతో, ప్రజాపతులతో విష్ణుపదానికి ప్రతినిత్యం ప్రదక్షిణం చేస్తూ ఉంటాడు. అతడు కల్పం చివరిదాకా జీవిస్తాడు. ఉత్తానపాదుని కుమారుడైన ఆ ధ్రువుడు పూజ్యుడు, మహాత్ముడు. ఆయన మహిమలను బ్రహ్మకూడా వర్ణింపలేడు. నాకు తెలిసిన విశేషాలన్నీ నీకు ముందే తెలియజేశాను. ఒకసారి ఆ కథలన్నీ గుర్తుకు తెచ్చుకో.

5.2-94-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు నా ధ్రువుండు గాలంబుచేత నిమిషమాత్రం బెడలేక సంచరించు జ్యోతిర్గ్రహ నక్షత్రంబులకు నీశ్వరునిచేత ధాన్యాక్రమణంబునఁ బశువులకై యేర్పఱిచిన మేధిస్తంభంబు తెఱంగున మేటిగాఁ గల్పింపంబడి ప్రకాశించుచుండు; గగనంబు నందు మేఘంబులును శ్యేనాది పక్షులును వాయువశంబునం గర్మసారథులై చరించు తెఱంగున జ్యోతిర్గణంబులును బ్రకృతిపురుష యోగ గృహీతాశులై కర్మనిమిత్తగతి గలిగి వసుంధరం బడకుందురు.

టీకా:

మఱియున్ = ఇంకను; ఆ = ఆ; ధ్రువుండు = ధ్రువుడు; కాలంబున్ = కాలము; చేతన్ = వలన; నిమిష = నిమేష; మాత్రంబున్ = మాత్రమైనా; ఎడలేక = సందులేక, ఏమరుపాటులేక; సంచరించున్ = తిరుగును; జ్యోతిః = జ్యోతిర్మండలములు; గ్రహ = గ్రహములు; నక్షత్రంబుల్ = నక్షత్రముల; కున్ = కు; ఈశ్వరుని = భగవంతుని; చేతన్ = చేత; ధాన్యాక్రమణంబునన్ = కళ్ళమున ధాన్యము నూర్చుటకు; పశువుల్ = పశువుల; కై = కోసము; ఏర్పరచిన = ఏర్పాటుచేసిన; మేధిస్తంభంబు = కట్రాట; తెఱంగునన్ = విధముగ; మేటిగాన్ = శ్రేష్ఠముగా; కల్పింపంబడి = ఏర్పాటు చేయబడి; ప్రకాశించుచుండున్ = విరాజిల్లుతుండును; గగనంబున్ = ఆకాశము; అందున్ = లో; మేఘంబులును = మేఘములు; శేన్య = డేగ; ఆది = మొదలగు; పక్షులును = పక్షులు; వాయు = గాలికి; వశంబునన్ = లొంగి; కర్మ = కర్మలను; సారథులు = అనుసరించినవారు; ఐ = అయ్యి; చరించున్ = తిరిగెడు; తెఱంగునన్ = విధముగ; జ్యోతిః = జ్యోతిర్మండలముల; గణంబులును = సమూహములును; ప్రకృతి = ప్రకృతి; పురుష = పరమపురుషుల; యోగ = కూర్పులను; గృహీత = స్వీకరించిన; ఆశులు = దిక్కు (ఆధారము) కలవారు; ఐ = అయ్యి; కర్మనిమిత్త = కర్మానుసార; గతి = చలనము; కలిగి = కలిగి ఉండి; వసుంధరన్ = భూమిపైన; పడకన్ = పడకుండగ; ఉందురు = ఉంటారు;

భావము:

ధాన్యం నూర్చే కళ్ళంలో పశువులను కట్టడం కోసం మధ్యలో పాతిన స్తంభంలాగా ధ్రువుడు ఆ శింశుమారచక్రం నడుమ ప్రకాశిస్తూ ఉన్నాడు. అతని చుట్టూ గ్రహాలు, నక్షత్రాలు ఉన్నాయి. అవన్నీ కాలవిభాగంలో నిమేషమాత్రం కూడా ఏమరుపాటు లేక ధ్రువుని చుట్టూ ప్రదక్షిణంగా తిరుగుతూ ఉంటాయి. ఆకాశంలో మేఘాలు, డేగలు మొదలైన పక్షులు కర్మానుసారంగా గాలికి లోబడి ఆకాశంలో ఎలా పరిభ్రమిస్తున్నాయో అలా జ్యోతిర్గణాలు కర్మను అవలంబించి ప్రకృతి పురుషులకు లోబడి గగనాన తిరుగుతూ ఉంటాయి. ఈ కారణం వల్లనే ఆ గ్రహాలు నేలమీద పడడం లేదు.

5.2-95-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పొందుగ జ్యోతిర్గణముల
నంఱ నా శింశుమారమందుల నుండం
గొంఱు దఱచుగఁ జెప్పుచు
నుందురు; వినిపింతు, విను మనూనచరిత్రా!

టీకా:

పొందుగన్ = ఒప్పుగా; జ్యోతిః = జ్యోతిర్మండల రూపుల; గణములన్ = సమూహములను; అందఱన్ = అందరును; ఆ = ఆ; శింశుమారము = శింశుమారచక్రము; అందులన్ = లో; ఉండన్ = ఉన్నవని; కొందఱున్ = కొంతమంది; తఱచుగన్ = ఎక్కువగా; చెప్పుచున్ = చెప్పుచు; ఉందురు = ఉంటారు; = వినిపింతున్ = (ఆ విషయములు) చెప్పెదను; వినుము = వినుము; అనూన = వెలితిలేని; చరిత్రా = చరిత్ర కలవాడా;

భావము:

సచ్చరిత్రుడవైన ఓ రాజా! జ్యోతిర్గణాలన్నీ శింశుమారచక్రంలో ఉన్నాయని కొందరు చెబుతుంటారు. ఆ శింశుమారచక్ర స్వరూపం నీకు వినిపిస్తాను. విను.

5.2-96-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్రిందై వట్రువ యై
లితమగు శింశుమార క్రము నందున్
నెకొని పుచ్ఛాగ్రంబున
నిలిచి ధ్రువుం డుండు నెపుడు నిర్మల చరితా!

టీకా:

తలక్రింద = తలకిందులుగానున్నది; ఐ = అయ్యి; వట్రువ = గుండ్రముగా నున్నది; ఐ = అయ్యి; సలలితము = మనోహరత్వము కలది; అగు = అయిన; శింశుమారచక్రము = శింశుమారచక్రము; అందున్ = లో; నెలకొని = స్థిరమై; పుచ్ఛ = తోక; అగ్రంబునన్ = చివర యందు; నిలిచి = నిలిచి ఉండి; ధ్రువుండు = ధ్రువుడు; ఉండున్ = ఉండును; ఎపుడున్ = ఎల్లప్పుడును; నిర్మల = స్వచ్ఛమైన; చరితా = వర్తన కలవాడా;

భావము:

నిర్మలచరిత్రా! శింశుమారచక్రం తలక్రిందుగా, గుండ్రంగా అందంగా ఉంటుంది. ఆ చక్రం తోక చివర ధ్రువుడు సర్వదా ప్రకాశిస్తూ ఉంటాడు.

5.2-97-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు; నా శింశుమార చక్రపుచ్ఛంబునఁ బ్రజాపతియు నగ్నీంద్ర ధర్ములును, బుచ్ఛమూలంబున ధాతృవిధాతలును, గటిప్రదేశంబున ఋషిసప్తకంబును, దక్షిణావర్తకుండలీభూతభూత శరీరంబునకు నుదగయన నక్షత్రంబులును, దక్షిణపార్శ్వంబున దక్షిణాయన నక్షత్రంబులును, బృష్టంబున దేవమార్గంబును, నాకాశగంగయు నుత్తర భాగంబునఁ బునర్వసు పుష్యంబులును, దక్షిణభాగంబున నార్ద్రాశ్లేష లును, దక్షిణ వామ పాదంబుల నభిజి దుత్తరాషాఢలును, దక్షిణ వామ నాసారంధ్రంబుల శ్రవణ పూర్వాషాఢలును, దక్షిణ వామ లోచనంబుల ధనిష్ఠా మూలలును, దక్షిణ వామ కర్ణంబుల మఘాద్యష్ట నక్షత్రంబులును, వామ పార్శ్వంబున దక్షిణాయనంబును, దక్షిణ పార్శ్వంబునఁ గృత్తికాది నక్షత్ర త్రయంబును, నుత్తరాయణంబును, వామ దక్షిణ స్కంధంబుల శతభిషగ్జ్యేష్ఠలును, నుత్తర హనువున నగస్త్యుండును, నపర హనువున యముండును, ముఖంబున నంగారకుండును, గుహ్యంబున శనైశ్చరుండును, మేఢ్రంబున బృహస్పతియును, వక్షంబున నాదిత్యుండును, నాభిని శుక్రుండును, మనంబునం జంద్రుండును, స్తనంబుల నాశ్వినులును, బ్రాణాపానంబుల బుధుండును, గళంబున రాహువును, సర్వాంగంబులఁ గేతుగ్రహంబును, రోమంబులఁ దారలును నుండు; నది సర్వదేవతామయంబైన పుండరీకాక్షుని దివ్యదేహంబు ధ్రువునింగా నెఱుంగుము.

టీకా:

మఱియున్ = ఇంకను; శింశుమారచక్ర = శింశుమారచక్రము; పుచ్ఛంబునన్ = తోక యందు; ప్రజాపతియున్ = ప్రజాపతి; అగ్ని = అగ్ని; ఇంద్ర = ఇంద్రుడు; ధర్ములును = ధర్ముడులును; పుచ్ఛ = తోక; మూలంబునన్ = మొదలులో; ధాతృ = ధాత మరియు; విధాతలును = విధాతలును; కటిప్రదేశంబునన్ = మొలభాగమున; ఋషిసప్తకంబును = సప్తఋషులును; దక్షిణ = కుడి వైపునకు; ఆవర్త = చుట్టుకున్న; కుండలి = పాము; భూత = వలె ఉన్నట్టి; భూత = భౌతిక; శరీరంబునన్ = శరీరము నందు; ఉదగయన = ఉత్తరాయణ; నక్షత్రంబుల్ = నక్షత్రములు; దక్షిణ = కుడి; పార్శ్వంబునన్ = వైపున; దక్షణాయన = దక్షిణాయన; నక్షత్రంబులునున్ = నక్షత్రములు; పృష్టంబునన్ = వీపు నందు; దేవమార్గంబునున్ = దేవయాన, పాలపుంత {దేవయాన, పాలపుంత - అంతరిక్షమున ప్రకాశవంతమైన దారివలె నుండు తారల వరుస}; ఆకాశగంగయును = ఆకాశగంగ; ఉత్తర = ఎడమ; భాగంబునన్ = వైపున; పునర్వసు = పునర్వసు; పుష్యంబులునున్ = పుష్యమి నక్షత్రములును; దక్షిణ = కుడి; భాగంబునన్ = ప్రదేశములో; ఆర్ధ్ర = ఆర్ధ్ర; ఆశ్లేషలును = ఆశ్లేష నక్షత్రములును; దక్షిణ = కుడి; వామ = ఎడమ; పాదంబులన్ = కాళ్ళవద్ద; అభిజిత్ = అభిజిత్తు; ఉత్తరాషాఢలును = ఉత్తరాషాఢ నక్షత్రములును; దక్షిణ = కుడి; వామ = ఎడమ; నాసా = ముక్కు; రంధ్రంబులన్ = పుటములయందు; శ్రవణ = శ్రవణ; పూర్వాషాఢలును = పూర్వాషాఢ నక్షత్రములును; దక్షిణ = కుడి; వామ = ఎడమ; లోచనంబులన్ = కన్నుల యందు; ధనిష్ఠా = ధనిష్ఠ మరియు; మూలలును = మూల నక్షత్రములును; దక్షిణ = కుడి; వామ = ఎడమ; కర్ణంబులన్ = చెవులందు; మఘ = మఘ {మఘాద్యష్ట నక్షత్రములు - 1మఘ 2పుబ్బ 3 ఉత్తర 4హస్త 5చిత్త 6స్వాతి 7విశాఖ 8అనూరాధ అనెడి ఎనిమిది నక్షత్రములు}; ఆది = మొదలగు; అష్ట = ఎనిమిది; నక్షత్రంబులునున్ = నక్షత్రములు; వామ = ఎడమ; పార్స్వంబునన్ = పక్కన; దక్షిణాయనంబును = దక్షిణాయనము; దక్షిణ = కుడి; పార్శ్వంబునన్ = పక్కన; కృత్తిక = కృత్తిక {కృత్తికాదినక్షత్రత్రయంబు - 1కృత్తిక 2రోహిణి 3మృగశిర యనెడి మూడు నక్షత్రములు}; ఆది = మొదలగు; నక్షత్ర = నక్షత్రములు; త్రయంబునున్ = మూడును; ఉత్తరాయణంబునున్ = ఉత్తరాయణము; = వామ = ఎడమ; దక్షిణ = కుడి; స్కంధంబులన్ = భుజములయందు; శతభిషగ్ = శతభిష (నక్షత్రము); జ్యేష్ఠలును = జేష్ఠా నక్షత్రములును; ఉత్తమ = పై; హనువున = దవడ అందు; అగస్త్యుండును = అగస్త్యుడు; అపర = కింది; హనువున = దవడ అందు; యముండును = యముడును; ముఖంబునన్ = నోరు వద్ద; అంగారకుండును = అంగారకుడు; గుహ్యంబునన్ = మర్మస్థానముల; శనైశ్చరుండును = శనీశ్వరుడును; మేఢ్రంబునన్ = పురుషావయవమున; బృహస్పతియును = బృహస్పతి; వక్షంబునన్ = వక్షస్థలమున; ఆదిత్యుండును = సూర్యుడును; నాభిని = బొడ్డు అందు; శుక్రుండును = శుక్రుడును; మనంబునన్ = మనసు వద్ద; చంద్రుండును = చంద్రుడు; స్తనంబులన్ = స్తనముల అందు; ఆశ్వినులును = అశ్వినీదేవతలును; ప్రాణాపానంబులన్ = ఆధారచక్రస్థానమున; బుధుండును = బుధుడు; గళంబునన్ = గొంతు వద్ద; రాహువును = రాహువు; సర్వాంగంబులన్ = సర్వావయవము లందు; కేతు = కేతువు అనెడి; గ్రహంబును = గ్రహము; రోమంబులన్ = వెంట్రుక లందు; తారలునున్ = తారలు; ఉండునున్ = ఉండును; అది = అది; సర్వ = అఖిలమైన; దేవతా = దేవతలతోను; మయంబున్ = కూడినది; ఐన = అయిన; పుండరీకాక్షుని = నారాయణుని; దివ్య = దివ్యమైన; దేహంబున్ = శరీరము, స్వరూపము; ధ్రువునింగా = ధ్రువమైనదిగా; ఎఱుంగుము = తెలియుము;

భావము:

ఆ శింశుమారచక్రం తోకభాగంలో ప్రజాపతి, అగ్ని, ఇంద్రుడు, ధర్ముడు ఉన్నారు. తోక ముందుభాగంలో ధాత, విధాత ఉన్నారు. నడుము భాగంలో సప్తర్షులు ఉన్నారు. కుడివైపుకు చుట్టుకొని కుండలీభూతంగా ఉన్నదానికి ఉత్తరభాగంలో ఉత్తరాయణ నక్షత్రాలు, దక్షిణభాగంలో దక్షిణాయన నక్షత్రాలు, వీపుమీద దేవమార్గం అనబడే తారకాసముదాయం, అక్కడే ఆకాశగంగ ఉన్నాయి. ఉత్తరభాగంలో పునర్వసు, పుష్యమి నక్షత్రాలు; దక్షిణభాగంలో ఆర్ద్ర, ఆశ్లేషలు; కుడిపాదంలో అభిజిత్తు; ఎడమపాదంలో ఉత్తరాషాఢ; కుడివైపు ముక్కుపుటంలో శ్రవణం; ఎడమవైపున పూర్వాషాఢ ఉన్నాయి. కుడి ఎడమ నేత్రాలలలో ధనిష్ఠ, మూల ఉన్నాయి. కుడి ఎడమ చెవులలో మఘ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ నక్షత్రాలు ఉన్నాయి. ఎడమ ప్రక్క దక్షిణాయన నక్షత్రాలు, కుడిప్రక్క కృత్తిక, రోహిణి, మృగశిర అనే మూడు నక్షత్రాలు ఉన్నాయి. ఇవికాక ఉత్తరాయణ నక్షత్రాలు కూడా అక్కడే ఉన్నాయి. ఎడమ కుడివైపుల మూపులయందు శతభిషం, జ్యేష్ఠం నక్షత్రాలున్నాయి. పై దవడ ప్రదేశంలో అగస్త్యుడు, క్రింది దవడ స్థానంలో యముడు, ముఖంలో అంగారకుడు, మర్మావయవ స్థానంలో శని, పురుషాంగంగా బృహస్పతి ఉన్నారు. వక్షోభాగంలో సూర్యుడు, నాభిలో శుక్రుడు, మనసులో చంద్రుడు, స్తనాలలో అశ్వినులు, ప్రాణాపానాలలో బుధుడు, కంఠభాగంలో రాహువు ఉన్నారు. అయితే కేతువు మాత్రం అన్ని అవయవాలను ఆవరించి ఉంటాడు. ఈ శింశుమార చక్రానికి రోమాలుగా ఇంకా ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి. ఇది సర్వదేవతామయమైన నారాయణుని దివ్య స్వరూపం. ఇది స్థిరమైనది, ధ్రువమైనది.

5.2-98-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్టి దివ్యశరీర మెవ్వఁడు ప్రతిదినం-
బందు సంధ్యాకాల తులభక్తి
నమందు నిలిపి యేఱక మిక్కిలి ప్రయ-
త్నంబున నియతుఁడై త్త్వబుద్ధి
మౌవ్రతంబునఁ బూని వీక్షించుచు-
నీ సంస్తవంబు దానెంతొ ప్రేమ
పియించి కడుఁ బ్రశస్తమును మునీంద్ర సే-
వ్యమును జ్యోతిస్స్వరూమున వెలుఁగు

5.2-98.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విపుల శింశుమార విగ్రహంబునకు వం
నము వందనంబు నుచు నిలిచి
న్నుతించెనేని కలార్థసిద్ధులఁ
బొందు మీఁద ముక్తిఁ జెందు నధిప!

టీకా:

ఇట్టి = ఇటువంటి; దివ్య = దివ్యమైన; శరీరమున్ = దేహమును; ఎవ్వడున్ = ఎవరైతే; ప్రతిదినంబు = ప్రతిదినము; అందున్ = అందు; సంధ్యాకాలమున్ = సంధ్యాసమయమునందు; అతుల = సాటిలేని; భక్తిన్ = భక్తితో; మనము = మనసు; అందున్ = లో; నిలిపి = నిలుపుకొని; ఏమఱక = ఏమరుపాటులేకుండగ; మిక్కిలి = అదికమైన; ప్రయత్నంబునన్ = ప్రయత్నముతో; నియతుడు = నియమించుకొన్నవాడు; ఐ = అయ్యి; తత్త్వబుద్ధి = తత్తవజ్ఞానముతో; మౌనవ్రతంబునన్ = మౌనదీక్షను; పూని = ధరించి; వీక్షించుచున్ = ఈ శింశుమారమును చూచుచు; ఈ = ఈ యొక్క; సంస్తవంబున్ = స్తోత్రమును; తాను = తను; ఎంతో = మిక్కిలి; ప్రేమన్ = ఆపేక్షతో; జపియించి = జపించి; కడున్ = మిక్కిలి; ప్రశస్తమునున్ = శ్రేష్ఠమును; ముని = మునులలో; ఇంద్ర = ఇంద్రుని వంటివారిచే; సేవ్యంబును = కొలువబడునది; జ్యోతిష్ = వెలుగుల, అంతరిక్షము నందలి; స్వరూపమునన్ = రూపములు కలిగిన; వెలుగు = ప్రకాశించు;
విపుల = విస్తారమైన; శింశుమార = శింశుమారము యనెడి; విగ్రహంబున్ = స్వరూపమున; కున = కు; వందనము = నమస్కారము; వందనంబులున్ = నమస్కారములు; అనుచున్ = అంటూ; నిలిచి = స్థిరముగా; సన్నుతించెను = స్తుతించిన; ఏని = ఎడల; సకల = అఖిలమైన; అర్థ = ప్రయోజనములను; సిద్ధులన్ = సిద్ధులను; పొందు = పొందును; మీదన్ = ఆపైన; ముక్తిన్ = ముక్తిని కూడ; చెందున్ = పొందును; అధిప = రాజా;

భావము:

రాజా! శ్రీమన్నారాయణుని దివ్య శరీరమైన ఈ శింశుమారచక్రాన్ని ఎవరు ప్రతిదినం సంధ్యాకాలంలో మనసులో నిలుపుకొని దీక్షతో, నియమంతో, భక్తితో స్మరిస్తారో, తత్త్వాన్ని గ్రహించి మౌనవ్రతం చేపట్టి ఏ చక్ర దర్శనం చేస్తూ ఎవరు ఈ స్తోత్రాన్ని ప్రీతితో జపించి నమస్కరిస్తారో, ఎవరు ప్రశస్తమూ మునీంద్ర సేవ్యమూ జ్యోతిస్స్వరూపమూ అయిన శింశుమార చక్రానికి వందనం వందనం అంటూ మ్రొక్కులు చెల్లిస్తారో అటువంటి వారికి ఇహలోకంలో సకల సిద్ధులు, పరలోకంలో ముక్తి లభిస్తాయి.

5.2-99-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మండలంబునకుఁ గ్రిం
ను దశసాహస్ర యోజనంబుల స్వర్భా
నుని మండలంబు గ్రహమై
ముగ నపసవ్యమార్గతి నుండు నృపా!

టీకా:

ఇనమండలంబున్ = సూర్యమండలమున; కున్ = కు; క్రిందను = కింది వైపు; దశసాహస్ర = పదివేల; యోజనంబులన్ = యోజనముల దిగువున; స్వర్భానుని = రాహువు యొక్క; మండలంబున్ = బింబము; గ్రహము = గ్రహము; ఐ = అయ్యి; ఘనముగన్ = గొప్పగా; అపసవ్య = అప్రదక్షిణ; మార్గ = దారిలో; గతిన్ = గమనముతో; ఉండున్ = ఉండును; నృపా = రాజా;

భావము:

రాజా! సూర్యమండలానికి దిగువ పదివేల యోజనాల దూరంలో రాహుమండలం ఉన్నది. ఈ రాహువు అపసవ్యంగా నడుస్తూ ఉంటాడు.

5.2-100-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సురాధముఁడగు రాహువు
బిరుహసంభవుని వరము పెంపున నెంతో
యగు నమరత్వంబున
మానంబైన గ్రహవిహారముఁ బొందెన్

టీకా:

అసుర = రాక్షసులలో {అసురుడు - సురలు కానివాడు, దానవుడు}; అధముడు = నీచుడు; అగు = అయిన; రాహువు = రాహువు; బిసరుహసంభవుని = బ్రహ్మదేవుని {బిసరుహసంభవుడు - బిసరుహము (పద్మము)న సంభవుడు (జనించినవాడు), బ్రహ్మ}; వరము = వరము యొక్క; పెంపునన్ = అతిశయమున; ఎంతో = అతి మిక్కిలి; పస = సామర్థ్యము; అగు = కలిగిన; అమరత్వంబునన్ = మరణరాహిత్యమువలన; అసమానంబున్ = సాటిలేని విధముగా; గ్రహ = గ్రహమై; విహారమున్ = సంచరించుటను; పొందెన్ = పొందెను;

భావము:

రాక్షసులలో అధముడైన రాహువు బ్రహ్మ వరంవల్ల అమరత్వాన్ని పొంది గ్రహాలలో తానూ సాటిలేని ఒక గ్రహమై విహరిస్తున్నాడు.

5.2-101-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ననాథ! రాహువు న్మకర్మంబులు-
వినిపింతు ముందఱ విస్తరించి
యుత యోజన విస్తృతార్క మండలము ద్వి-
ట్సహస్ర విశాల చంద్రమండ
ముఁ బర్వకాలంబును ద్రయోదశ సహ-
స్ర విశాలమై మీఁద రాహు గప్పు
ది చూచి యుపరాగ నుచును బలుకుదు-
రెల్ల వారును స్వధర్మేచ్ఛు లగుచు;

5.2-101.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నంతలోన నినశశాంక మండలములఁ
రుణఁ బ్రోవఁదలచి రిసుదర్శ
నంబు వచ్చునను భయంబున నై దాఱు
డియలకును రాహు డిఁకి తొలఁగు.

టీకా:

జననాథ = రాజా {జననాథుడు - జనులకు నాథుడు (ప్రభువు), రాజు}; రాహువు = రాహువు; జన్మ = పుట్టుక; కర్మంబులు = వర్తనలు; వినిపింతు = చెప్పెదను; ముందఱ = ముందుగా; విస్తరించి = విస్తరించి; అయుత = పదివేల (10,000); యోజన = యోజనముల; విస్తృత = విస్తారముకలిగిన; అర్క = సూర్య; మండలమున్ = మండలమును; ద్విషట్సహస్ర = పన్నెండువేల(12,000); విశాల = విస్తారముకలిగిన; చంద్రమండలమున్ = చంద్రమండలమును; పర్వకాలంబులను = గ్రహణసమయములలో; త్రయోదశసహస్ర = పదమూడువేల (13,000); = విశాలము = విస్తారము కలిగినది; ఐ = అయ్యి; మీదన్ = పైన; రాహువున్ = రాహువు; కప్పును = కప్పవేయును; అది = దానిని; చూచి = చూసి; ఉపరాగము = గ్రహణము; అనుచునున్ = అని; పలుకుదురు = అనెదరు; ఎల్లవారును = అందరును; స్వ = తమ; ధర్మన్ = విద్యుక్త కర్మమములను; ఇచ్చులు = నేరవేర్చదలచినవారు; అగుచున్ = అగుచు; అంతలోనన్ = కొద్దిసమయములోనే; ఇన = సూర్య; శశాంక = చంద్ర; మండలములన్ = మండలములను; కరుణన్ = దయతో; ప్రోవన్ = కాపడవలెనని; తలచి = భావించి;
= హరి = నారాయణుని; సుదర్శనంబు = సుదర్శన చక్రము; వచ్చును = వచ్చును; అను = అనెడి; భయంబునన్ = భయమముతో; ఐదు = ఐదు (5); ఆఱు = ఆరు (6); గడియల = గడియల సమయమున; కున్ = కే; రాహువు = రాహువు; నడిఁకిన్ = బెదురుతో; తొలగున్ = తొలగిపోవును;

భావము:

రాజా! రాహువు యొక్క జన్మ కర్మాలను గూర్చి సవిస్తరంగా వినిపిస్తాను. ఈ రాహువు పదివేల యోజనాల విస్తృతి కలిగిన సూర్యమండలాన్ని, పన్నెండు వేల (12,000) యోజనాల విస్తృతి కలిగిన చంద్రమండలాన్ని కప్పేస్తాడు. రాహుమండలం పదమూడువేల యోజనాల వైశాల్యం కలిగింది. పూర్ణిమ పర్వదినంలో చంద్రుణ్ణి, అమావాస్య పర్వదినంలో సూర్యుణ్ణి రాహువు మాటు పరుస్తాడు. దీనినే గ్రహణం అంటారు. ఆ గ్రహణ కాలంలో జనులంతా తమ తమ జపతపో రూపాలైన ధర్మాలను చక్కగా ఆచరించుకొంటారు. అయితే దయామయుడైన శ్రీహరి సుదర్శన చక్రం సూర్య చంద్ర మండలాలను రక్షించడానికి వస్తుందేమో అన్న భయంతో ఐదారు ఘడియలలోనే రాహువు వారిని వదిలిపెట్టి తొలగిపోతాడు.

5.2-102-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వర! యా రాహువునకు
సత నా క్రింద సిద్ధ చారణ విద్యా
రు లయుత యోజనంబులఁ
దిముగ వసియించి లీలఁ దిరుగుదు రచటన్.

టీకా:

నరవర = రాజా; ఆ = ఆ; రాహువున్ = రాహువున; కున్ = కు; సరసతన్ = చక్కగా; ఆ = ఆ; క్రిందన్ = కిందకి; సిద్ధ = సిద్ధులు; చారణ = చారణులు; విద్యాధరులు = విద్యాధరులు; అయుత = పదివేల (10,000); యోజనములన్ = యోజనములలో; తిరముగన్ = స్థిరపడి; వసియించి = నివసించి; లీలన్ = క్రీడగా; తిరుగుదురు = తిరుగుతుందురు; అచటన్ = అక్కడ;

భావము:

రాజా! రాహువుకు దిగువ పదివేల యోజనాల దూరంలో సిద్ధులు, చారణులు, విద్యాధరులు స్థిరనివాసం ఏర్పరచుకొని తిరుగుతూ ఉంటారు.

5.2-103-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రికింప సిద్ధ విద్యా
రులకుఁ బదివేలు క్రింద రలక యక్షుల్
ఱియును భూతప్రేతలు
రియింతురు రాక్షసులు పిశాచులు గొలువన్.

టీకా:

పరికింప = చూడగా; సిద్ధ = సిద్ధులు; విద్యాధరులు = విద్యాధరుల; కున్ = కు; పదివేలు = పదివేలు (10,000); క్రిందన్ = కిందుగా; తరలక = కదలక; యక్షుల్ = యక్షులు; మఱియును = ఇంకను; భూత = భూతములు {భూతములు - పిశాచ విశేషము}; ప్రేతలున్ = ప్రేతములు {ప్రేతములు - పిశాచ విశేషము}; రాక్షసులు = దానవులు; పిశాచులున్ = పిశాచములు; కొలువన్ = ఆరాధించుతుండగా;

భావము:

సిద్ధ విద్యాధరుల నివాసస్థానానికి క్రింద పదివేల యోజనాల దూరంలో రాక్షసులు, పిశాచాలు సేవిస్తుండగా యక్షులు, భూత ప్రేతాలు తిరుగుతుంటారు.

5.2-104-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వారి క్రిందఁ దగిలి వాయువశంబున
లయుచుండు మేఘమండలంబు
మేఘమండలంబు మీఁ దగుచుండు భూ
మండలంబు క్రిందనుండు నధిప!

టీకా:

వారి = వారికి; క్రిందన్ = క్రిందన; తగిలి = పూని; వాయు = గాలి వాలునకు; వశంబునన్ = అనుకూలముగా; మలయుచుండు = కదులుతుండును; మేఘమండలంబున్ = మేఘమండలము; మేఘమండలంబున్ = మేఘమండలము; మీదన్ = పైనున్నది; అగుచుండున్ = అయి ఉండును; భూమండలంబున్ = భూమండలము; క్రిందన్ = క్రిందన; ఉండును = ఉండును; అధిపా = గొప్పవాడ;

భావము:

రాజా! వారి క్రింద గాలికి చలిస్తూ ఉండే మేఘమండలం ఉంది. మేఘమండలం పైన ఉంటే దానికి క్రింది భాగంలో భూమండలం ఉంది.