పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : భూ ద్వీప వర్ష విస్తారములు

  •  
  •  
  •  

5.2-13-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని పలికిన శుకయోగిం
నుఁగొని యభిమన్యు సుతుఁడు డు మోదముతో
జదళాక్షుని మహిమలు
విని సంతస మంది యనియె వేడుక మఱియున్.

టీకా:

అని = అని; పలికిన = చెప్పిన; శుక = శుకుడు యనెడి; యోగిన్ = యోగిని; కనుగొని = చూసి; అభిమన్యుసుతుడు = పరీక్షితు {అభిమన్యు సుతుడు - అభిమన్యుని పుత్రుడు, పరీక్షిత్తు}; కడు = మిక్కిలి; మోదము = సంతోషము; తోన్ = తోటి; వనజదళాక్షుని = హరి; మహిమలున్ = మహత్యములు; విని = విని; సంతసమున్ = సంతోషమును; అంది = పొంది; అనియె = పలికెను; వేడుకన్ = వేడుకగా; మఱియున్ = ఇంకను;

భావము:

అని చెప్పిన శుకమహర్షిని చూచి పరీక్షిత్తు విష్ణుదేవుని మహిమలను విన్న సంతోషంతో, కుతూహలంతో ఇలా అన్నాడు.

5.2-14-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"మునీంద్రా! సూర్యరశ్మి యెందాఁకం బ్రవర్తిల్లు, నక్షత్రయుక్తంబైన చంద్ర కిరణంబు లెంతమేరఁ దిరుగు, నంత దూరంబు ప్రియవ్రతుని రథనేమి ఘట్టనలచేత సప్తద్వీపంబులును, సప్తసముద్రంబులు నయ్యె నని పలికితి; వా ద్వీపసముద్రంబుల పరిమాణంబులు సవిస్తరంబుగా నెఱింగింపుము; గుణమయంబును స్థూలరూపంబును నయిన శ్రీహరి శరీరంబగు నీ లోకంబునందు నిలిపిన చిత్తంబగుణంబును, సూక్ష్మంబును, నాత్మజ్యోతియు, బ్రహ్మంబును నయిన వాసుదేవునియందు నిల్చుం గావున, ద్వీపవర్షాది విస్తారంబు వినిపింపు"మనిన శుకయోగీంద్రు డిట్లనియె.
సప్తద్వీపాలు వివరాలు

టీకా:

ముని = మునులలో; ఇంద్ర = శ్రేష్ఠుడా; సూర్యరశ్మి = సూర్యకాంతి; ఎందాక = ఎప్పటిదాక; ప్రవర్తిల్లు = ఉండునో; నక్షత్ర = నక్షత్రములతో; యుక్తంబున్ = కూడినది; ఐన = అయినట్టి; చంద్రకిరణంబుల్ = చంద్రుని యొక్క కాంతి; ఎంత = ఎంత; మేర = వరకు; తిరుగున్ = వర్తించుచుండునో; అంతన్ = అంత; దూరంబు = వరకు; ప్రియవ్రతుని = ప్రియవ్రతుని; రథనేమి = రథ చక్రముల పట్టీల వలన; ఘట్టనల = నలిగిపోయి; సప్త = ఏడు (7); ద్వీపంబులును = దీవులు; సప్త = ఏడు (7); సముద్రంబులును = సముద్రములును; అయ్యెను = కలిగినది అయ్యెను; అని = అని; పలికితివి = చెప్పితివి; ఆ = ఆ; ద్వీప = ద్వీపంబులు, ఖండములు; సముద్రంబులన్ = మహాసముద్రముల; పరిమాణంబున్ = పరిమాణము; సవిస్తరంబుగా = విపులంబుగా; ఎఱిగింపుము = తెలుపుము; గుణ = సుగుణములతో; మయంబునున్ = నిండినదియును; స్థూల = స్థూలమైన; రూపంబునున్ = స్వరూపమును; అయిన = అయినట్టి; శ్రీహరి = నారాయణుని; శరీరంబున్ = దేహము; అగు = అయినట్టి; ఈ = ఈ; లోకంబున్ = లోకము; అందున్ = లో; నిలిపిన = ధరించిన; చిత్తంబున్ = మనస్సు; అగుణంబునున్ = నిర్గుణము; సూక్ష్మంబునున్ = సూక్ష్మమైనది; ఆత్మజ్యోతియున్ = ఆత్మజ్యోతి; బ్రహ్మంబునున్ = పరబ్రహ్మము; అయిన = అయినట్టి; వాసుదేవుని = నారాయణుని; అందున్ = ఎడల; నిల్చున్ = స్థిర పడును; కావునన్ = అందుచేత; ద్వీప = ద్వీపములు, ఖండములు; వర్షములు = వర్షములు, దేశములు; ఆది = మొదలగువాని; విస్తారంబున్ = విస్తృతులు, కొలతలు; వినిపింపుము = తెలియజేయుము; అనినన్ = అనగా; శుక = శుకుడు యనెడి; యోగిన్ = యోగులలో; ఇంద్రుడు = ఇంద్రుని వంటివాడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను;

భావము:

“మునీంద్రా! ఎంతదాక సూర్యరశ్మి ప్రసరిస్తుందో, ఎంతదాక నక్షత్రాలతో కూడిన చంద్ర కిరణాలు వ్యాపిస్తుంటాయో అంతదాక ప్రియవ్రతుని రథచక్రాల ఒరపిడి వల్ల సప్తద్వీపాలు, సప్తసముద్రాలు ఏర్పడ్డాయని చెప్పావు. ఆ ద్వీపాల పరిమాణాలను, సముద్రాల పరిమాణాలను సవిస్తరంగా చెప్పు. ఈ లోకమంతా గుణమయమైన శ్రీహరి స్థూల స్వరూపమే. అందువల్ల అటువంటి భావనను లోకంలో నిలిపితే నిర్గుణమూ, సూక్ష్మమూ, స్వయంప్రకాశమూ, బ్రహ్మస్వరూపమూ అయిన వాసుదేవుని యందు మనస్సు సుస్థిరంగా లగ్నమౌతుంది. అందుచేత ద్వీపాలకు, వర్షాలకు, సముద్రాలకు సంబంధించిన విశేషాలను సవిస్తరంగా వెల్లడించు” అని ప్రార్థించగా శుకమహర్షి పరీక్షిత్తుతో ఇలా అన్నాడు.

5.2-15-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ధణీవల్లభ! విను శ్రీ
రిమాయాగుణవిభూతు గు జలనిధులుం
రఁగిన దీవులు వర్షము
యంగా గొలఁదిపెట్ట లవియె జగతిన్?

టీకా:

ధరణీవల్లభ = రాజా; విను = వినుము; శ్రీహరి = నారాయణుని; మాయా = మాయ యొక్క; గుణ = గుణములు; విభూతులున్ = వైభవములు; అగు = అయిన; జలనిధులున్ = సముద్రములు {జలనిధి - జలమునకు నిధి (గని) వంటిది, సముద్రము}; పరగిన = ప్రసిద్ధమగు; దీవులున్ = ద్వీపములు, ఖండములు; వర్షములు = వర్షములను, దేశములను; అరయంగ = తెలిసికొనుటకు; కొలదిపెట్టన్ = లెక్కించుట; అలవియె = సాధ్యమా ఏమి; జగతిన్ = విశ్వములో;

భావము:

“రాజా! విను. ఈ సముద్రాలు, ద్వీపాలు, వర్షాలు అన్నీ శ్రీహరి మాయవల్ల పుట్టిన వైభవాలే. వాటిని సంపూర్ణంగా వర్ణించి చెప్పడం ఎవరికి చేతనవుతుంది?

5.2-16-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తెలసినంత నేను దెలిపెద సంక్షేప
మును జిత్తగించి వినుము దెలియ"
నుచుఁ జెప్పఁదొడఁగె భిమన్యుసుతునకు
నింపుగాను శుకమునీంద్రుఁ డిట్లు.

టీకా:

తెలిసినంత = నాకు తెలిసన అంతవరకు; నేనున్ = నేను; తెలిపెదన్ = చెప్పెదను; సంక్షేపముననున్ = క్లుప్తముగా; చిత్తగించి = మనసుపెట్టి; వినుము = వినుము; తెలియన్ = అర్థమగునట్లు; అనుచున్ = అంటూ; చెప్పదొడగెన్ = చెప్పసాగెను; అభిమన్యుసుతున్ = పరీక్షితున; కున్ = కు; ఇంపుగాను = చక్కగాను; = శుక = శుకుడు యనెడి; ముని = మునులలో; ఇంద్రుడు = ఇంద్రుని వంటివాడు; ఇట్లు = ఈ విధముగను.

భావము:

నాకు తెలిసినంత వరకు సంక్షేపంగా వర్ణించి చెబుతాను. నీవు ఏకాగ్రచిత్తంతో విను” అని శుకమహర్షి అభిమన్యుని కుమారుడైన పరీక్షిత్తుకు ఇలా చెప్పాడు.

5.2-17-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నరేంద్ర జంబుద్వీపంబు భూపద్మంబునకు మధ్యప్రదేశంబున లక్ష యోజనంబుల వెడల్పు నంతియ నిడుపునుం గలిగి కమలపత్రంబునుం బోలె వర్తులాకారంబు నవసహస్ర యోజన పరిమితాయామంబు గల నవవర్షంబుల నష్ట మర్యాదా గిరులునుం గలిగి విభక్తం బయి యుండు; నందు మధ్యవర్షం బిలావృతవర్షం బగు; నందు మధ్యప్రదేశంబున సువర్ణమయంబయి.

టీకా:

నరేంద్ర = రాజా; జంబుద్వీపంబున్ = జంబూద్వీపము; భూ = భూమి యనెడి; పద్మంబున్ = పద్మమున; కున్ = కు; మధ్య = నడిమిది యైన; ప్రదేశంబునన్ = స్థలము యందు; లక్ష = లక్ష (1,00,000); యోజనంబుల = యోజనముల; వెడల్పు = వెడల్పు; అంతియ = అంతే; నిడుపునున్ = పొడుగు; కలిగి = ఉండి; కమల = తామర; పత్రంబునున్ = ఆకు; పోలెన్ = వలె; వర్తుల = గుండ్రని; ఆకారంబున్ = ఆకారము; నవసహస్ర = తొమ్మిదివేల (9,000); యోజన = యోజనముల; పరిమిత = వరకు గల; ఆయంబున్ = వైశాల్యమును; కల = కలిగిన; నవ = తొమ్మిది (9); వర్షంబులన్ = వర్షములను; అష్ట = ఎనిమిది; మర్యాదా = సరిహద్దులవలె; గిరులునున్ = పర్వతములు; కలిగి = ఉండి; విభక్తంబు = విభజింపబడినది; అయి = అయ్యి; ఉండున్ = ఉండును; అందున్ = దానిలో; మధ్య = నడిమినిగల; వర్షంబున్ = వర్షము; ఇలావృతంబున్ = ఇలావృతవర్షము {ఇలావృతము - ఇల (భూమి)చేత ఆవృతము (చుట్టబడినది), సముద్రము ఏసరిహద్దున లేనిది}; అగున్ = అయియున్నది; అందున్ = దానిలో; మధ్య = నడిమి; ప్రదేశంబునన్ = స్థలము యందు; సువర్ణ = బంగారముతో; మయంబున్ = నిండియున్నది; ఆయి = అయ్యి.

భావము:

“రాజా! పద్మాకారమైన భూమి మధ్య జంబూద్వీపం తామరరేకు వలె గుండ్రంగా కనిపిస్తుంది. అది లక్ష యోజనాల పొడవు, లక్షయోజనాల వెడల్పు కలిగి ఉంటుంది. దానిలో గుండ్రటి ఆకారాలతో తొమ్మిది వేల యోజనాల విస్తీర్ణం కలిగిన తొమ్మిది వర్షాలు ఉన్నాయి. వాటి నన్నిటినీ విభజించే సరిహద్దులుగా ఎనిమిది పర్వతాలు ఉన్నవి. ఆ తొమ్మిది వర్షాలలో నట్టనడుమ ఇలావృతం అనే వర్షం ఉంది. దాని నడుమ బంగారు రంగుతో కూడి…

5.2-18-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భూద్మమునకు మేరువు
దీపించుచుఁ గర్ణికాకృతిని బెం పగుచుం
బ్రాపై కులగిరిరాజుగఁ
జూట్టును సురగణాళి చోద్యం బందన్.

టీకా:

భూ = భూమి యనెడి; పద్మంబున్ = పద్మమున; కున్ = కు; మేరువున్ = మేరుపర్వతము, ఇరుసువలె; దీపించుచున్ = ప్రకాశించుతూ; కర్ణిక = బొడ్డు; ఆకృతిన్ = రూపమున; పెంపగుచున్ = అతిశయించుతూ; ప్రాపు = ఆధారము; ఐ = అగుచు; కులగిరి = కుల పర్వతములకు {కులపర్వతములు - ప్రధానపర్వతములు ఇవి (7) - మహేంద్రోమలయస్సహ్యశ్శుక్తిమాన్ గంధమాదనః. వింద్యశ్చపారియాత్రాశ్చసప్తై తే కులపర్వతాః}; రాజుగన్ = రాజువలె; చూపట్టును = కనబడును; సురగణ = దేవతల; అళి = సమూహము; చోద్యంబున్ = ఆశ్చర్యమును; అందన్ = పోవునట్లు.

భావము:

మేరుపర్వతం భూమి పద్మానికి కర్ణిక వలె ప్రకాశిస్తున్నది. కులపర్వతాలకే రాజుగా కనిపిస్తుంది. దానిని చూచి దేవతలంతా ఆశ్చర్యపడతారు.

5.2-19-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఱియును నా మేరుగిరి లక్ష యోజనో-
న్నత మగుచుండి యా డిమి దళము
విదితమై పదియాఱువేల యోజనములు-
నంతియ పాఁతునై తిశయిల్లు;
నా మీఁద విస్తార రయ ముప్పది రెండు-
వేల యోజనముల వెలసి యుండు
నాగిరి కుత్తరంబందు నీలశ్వేత-
శృంగ పర్వతములు నింగి ముట్టి

5.2-19.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యుండు; రెండువేల యోజనంబుల దాఁకఁ
ఱపు గలిగి పూర్వశ్చిమాయ
తంబు దక్షిణోత్తరంబును విస్తార
గుచు మిగుల రమ్యమై నరేంద్ర!

టీకా:

మఱియును = ఇంకను; మేరుగిరి = మేరుపర్వతము; లక్ష = లక్ష (1,00,000); యోజన = యోజనముల; ఉన్నతము = పెద్దది; అగుచుండి = అయ్యి; ఆ = ఆ; నడిమి = మధ్య; దళము = భాగము; విదితము = విస్తృతి, తెలియబడునది; ఐ = అయితే; పదియాఱువేల = పదహారువేల (16,000); యోజనములున్ = యోజనములు; అంతియ = అంతే; పాతును = పాదముకలది; ఐ = అయ్యి; అతిశయిల్లున్ = అతిశయించును; ఆమీదన్ = ఆపైన; విస్తారము = వైశాల్యము; ముప్పదిరెండువేల = ముప్పైరెండువేల (32,000); యోజనములన్ = యోజనములతో; వెలసి = విలసిల్లుతూ; ఉండున్ = ఉండును; ఆ = ఆ; గిరి = కొండ; కిన్ = కి; ఉత్తరంబున్ = ఉత్తరదిక్కు; అందున్ = వైపు; నీల = నల్లని; శ్వేత = తెల్లని; శృంగ = శిఖరములు కలిగిన; పర్వతములున్ = పర్వతములు; నింగిముట్టి = ఆకాశమునంటుతూ;
ఉండున్ = ఉండును; రెండువేల = రెండువేల (2,000); యోజనంబుల = యోజనముల; దాక = వరకు; పఱపున్ = విస్తీర్ణము; కలిగి = ఉండి; పూర్వ = తూర్పు; పశ్చిమ = పడమరలకు; ఆయతంబున్ = పొడవు; దక్షిణ = దక్షిణము; ఉత్తరంబునున్ = ఉత్తరములకు; విస్తారమున్ = వెడల్పును; అగుచున్ = కలిగినదగుచు; మిగులన్ = మిక్కిలి; రమ్యము = అందముకలది; ఐ = అయ్యి; నరేంద్ర = రాజా;

భావము:

రాజా! ఆ మేరు పర్వతం లక్ష యోజనాల ఎత్తు కలిగి ఉంది. దాని పాదప్రదేశం పదారువేల యోజనాల విస్తృతి కలిగి అంతే కొలత గల లోతు కలిగి ఉంది. అది పైన ముప్పది రెండు వేల యోజనాల విస్తృతి కలిగి ఉంది. దానికి ఉత్తరపు దిక్కులో నీలం, శ్వేతం, శృంగవంతం అనే పర్వతాలు ఆకాశాన్ని తాకుతూ నిలిచి ఉన్నాయి. వీని విస్తారము రెండు వేల యోజనాలు. ఇవి తూర్పు నుండి పడమర వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు విస్తరించి ఉంటాయి. ఈ దృశ్యం చాల రమణీయంగా ఉంటుంది.

5.2-20-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు పూర్వపశ్చిమంబులు లవణసాగరాంతంబులై యున్న సీమాపర్వతంబుల యందు నీలశ్వేతశృంగవ త్పర్వతంబులు నిడివిని యథాక్రమంబుగా దశమాంశ న్యూనప్రమాణ యోజనంబులు గలవిగా నుండు; వీని మధ్య ప్రదేశంబున రమ్యక హిరణ్మయ కురువర్షంబు లను నామంబులు గల వర్షంబులుండు; వాని విస్తారంబులు నవ సహస్ర యోజనంబులు గలిగి లవణ సముద్రాంతంబులై క్రమంబున నీలాది పర్వతదీర్ఘ పరిమాణంబుల నుండు; నిలావృత వర్షంబునకు దక్షిణంబున నిషధ హేమకూట హిమవత్పర్వతంబు లను సీమాపర్వతంబులును, బూర్వపశ్చిమంబులు నిడుపును, దక్షిణోత్తరంబులు విశాలంబును నగుచు, నా నీలాదిపర్వతంబుల తీరున నుండు; నా గిరుల మధ్యప్రదేశంబున హరివర్ష కింపురుషవర్ష భారతవర్షంబు లను నామంబులు గల వర్షంబు లుండు; నా యిలావృతవర్షంబునకుఁ బశ్చిమంబున మాల్యావత్పర్వతంబును, బూర్వభాగంబున గంధమాదనంబును, సీమాపర్వతంబులు; పూర్వపశ్చిమంబులు నిడుపును దక్షిణోత్తరంబులు విశాలంబును నగుచు నీలపర్వత నిషధపర్వతంబులం గదిసి, ద్విసహస్ర యోజనంబుల విస్తారంబై యుండు; మాల్యవత్పర్వతంబు పశ్చిమసముద్రాంతంబై కేతుమాలవర్షంబును, గంధమాదనపర్వతంబునకుఁ బూర్వభాగంబున సముద్రాంతం బగుచు భద్రాశ్వవర్షంబును, మేరువునకుం దూర్పున మందరపర్వతంబును, దక్షిణంబున మేరు మందర పర్వతంబులును, బడమటి పార్శంబుల నుత్తరమునం గుముదపర్వతంబులు నను నామంబులు గలిగి యయుత యోజనోన్నతంబులయి మేరునగం బను మధ్యోన్నత మేధి స్తంభంబునకుం జతుర్ముఖంబుల హ్రస్వస్తంభములుం బోలె నుండు; నా చతుస్తంభంబుల యందును బర్వతశిఖరంబులఁ వెలుఁగొందు కేతువులబోలె చూత జంబూ కదంబ న్యగ్రోధంబు లను వృక్షరాజంబులు గ్రమంబున నొండొంటికి నేకాదశశత యోజనాయతంబును శత యోజన విస్తారంబును గలిగి యుండు; మఱియు నా పర్వత శిఖరంబులం గ్రమంబునం బయో మధ్విక్షు రస మృష్ట జలంబులు గలిగి శత యోజన విస్తారంబు లయిన సరోవరంబులు దేజరిల్లు; నందు సుస్నాతు లగు వారలకు యోగైశ్వర్యంబులు స్వభావంబునం గలుగు మఱియు నందన చైత్రరథ వైభ్రాజిక సర్వతోభద్రంబు లను నామంబులుగల దేవో ద్యానంబు లా పర్వతశిఖరంబుల వెలుఁగొందుచుండు; నందు దేవతాగణంబులు దేవాంగనలం గూడి గంధర్వుల గీతనృత్యంబులు గనుంగొనుచు విహరింతు; రంత.

టీకా:

ఇట్లు = ఈ విధముగను; పూర్వ = తూర్పు; పశ్చిమంబులు = పడమరలను; లవణసాగర = ఉప్పుసముద్రము; అంతంబులు = వరకు గలవి; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; సీమా = సరిహద్దులలోని; పర్వతంబులన్ = పర్వతములు; అందున్ = అందలి; నీల = నల్లని; శ్వేత = తెల్లని; శృంగవత్ = శృంగవంతము; పర్వతంబులు = పర్వతములు; నిడివిని = పొడవులో; యథాక్రమంబుగా = వరుసగా; దశమాంశ = పదవవంతు (1/10వంతు); న్యూన = తక్కువ; ప్రమాణ = కొలతలు కలిగిన; యోజనంబులున్ = యోజనముల; కలవిగాన్ = కలిగినవిగా; ఉండున్ = ఉండును; వీని = వీటి యొక్క; మధ్య = నడిమి; ప్రదేంబునన్ = ప్రదేశములో; రమ్యక = రమ్యకవర్షము; హిరణ్మయ = హిరణ్మయవర్షము; కురు = కురు; వర్షంబులున్ = వర్షములు; అను = అనెడి; నామంబులున్ = పేర్లు; కల = కలిగిన; వర్షంబులున్ = వర్షములు, దేశములు; ఉండున్ = ఉండును; వాని = వాటి; విస్తారంబులు = వైశాల్యములు; నవసహస్ర = తొమ్మిదివేల (9,000); యోజనంబులున్ = యోజనములు; కలిగి = ఉండి; లవణసముద్ర = లవణసముద్రములు; అంతంబులు = వరకుగలవి; ఐ = అయ్యి; క్రమంబునన్ = వరుసగా; నీల = నీలికొండలు; ఆది = మొదలైన; పర్వత = పర్వతముల; దీర్ఘ = పొడవైన; పరిమాణంబుల = కొలతలు కలిగి; ఉండున్ = ఉండును; ఇలావృత = ఇలావృత మనెడి; వర్షంబున్ = వర్షమున; కున్ = కు; దక్షిణంబునన్ = దక్షిణమువైపున; నిషద = నిషదము; హిమకూట = హిమకూటము; హిమవత్ = హిమవంతములు అనెడి; పర్వతంబులు = పర్వతములు; అను = అనెడి; సీమా = సరిహద్ధు; పర్వతంబులును = పర్వతములు; పూర్వ = తూర్పు; పశ్చిమంబులు = పడమరలు; నిడుపునున్ = పొడవులు; దక్షిణ = దక్షిణము; ఉత్తరంబున్ = ఉత్తరములతో; విశాలంబున్ = వైశైల్యములు గలవి; అగుచున్ = అగుచూ; ఆ = ఆ; నీల = నీలికొండలు; ఆది = మొదలగు; పర్వతంబుల = పర్వతముల; తీరునన్ = వలె; ఉండున్ = ఉండును; ఆ = ఆ; గిరుల = కొండల; మధ్య = మధ్య; ప్రదేశంబునన్ = ప్రదేశములో; హరివర్ష = హరివర్షము; కింపురుషవర్ష = కింపురుషవర్షము; భారతవర్షంబులు = భారతవర్షము; అను = అనెడి; నామంబులున్ = పేర్లు; కల = కలిగిన; వర్షంబులున్ = దేశములు; ఉండున్ = ఉండును; ఆ = ఆ; ఇలావృతవర్షంబున్ = ఇలావృతవర్షమున; కున్ = కు; పశ్చిమంబున = పడమర వైపు; మాల్యవత్ = మాల్యవంతము యనెడి; పర్వతంబును = పర్వతమును; పూర్వ = తూర్పు; భాగంబునన్ = దిక్కున; గంధమాదనంబును = గంధమాదనపర్వతమును; సీమా = సరిహద్ధు; పర్వతంబులు = పర్వతములు; పూర్వ = తూర్పు; పశ్చిమంబులున్ = పడమరలకు; నిడుపునున్ = పొడవును; దక్షిణ = దక్షిణము; ఉత్తరంబులున్ = ఉత్తరములకు; విశాలంబున్ = వెడల్పును; అగుచు = కలిగియుండి; నీలపర్వత = నీలికొండలు; నిషధ = నిషధ అనెడి; పర్వతంబులన్ = పర్వతములను; కదిసి = చేరి; ద్విసహస్ర = రెండువేల (2,000); యోజనంబులున్ = యోజనముల; విస్తారంబున్ = విస్తృతి కలిగినవి; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; మాల్యవత్ = మాల్యవంతము అనెడి; పర్వతంబు = పర్వతము; పశ్చిమసముద్ర = పశ్చిమసముద్రము; అంతంబు = వరకు గలది; ఐ = అయ్యి; కేతుమాలవర్షంబును = కేతుమాలవర్షము; గంధమాదనపర్వతంబున్ = గంధమాదనపర్వతమున; కున్ = కు; పూర్వ = తూర్పు; భాగంబునన్ = దిక్కువైపున; సముద్ర = సముద్రము; అంతంబు = వరకు కలది; అగుచున్ = అగుచూ; భద్రాశ్వవర్షంబును = భద్రాశ్వవర్షము; మేరువున్ = మేరునగమున; కున్ = కు; తూర్పునన్ = తూర్పువైపున; మందరపర్వతంబును = మందరపర్వతమును; దక్షిణంబునన్ = దక్షిణమువైపున; మేరు = మేరు మరియు; మందర = మందర; పర్వతంబులును = పర్వతములును; పడమటి = పశ్చిమము; పార్శంబులన్ = వైపుల; ఉత్తరమునన్ = ఉత్తరపువైపు; కుముదపర్వతంబులును = కుముదపర్వతములును; అను = అనెడి; నామంబులున్ = పేర్లు; కలిగి = కలిగినట్టి; అయుత = పదివేల (10,000); యోజన = యోజనముల; ఉన్నతంబులున్ = పెద్దవి; అయి = అయ్యి; మేరునగంబు = మేరుశిఖరము; అను = అనెడి; మధ్య = నడిమి నుండెడి; ఉన్నత = ఎత్తైన; మేధిస్తంభంబున్ = నట్రాట, నెడికఱ్ఱ, ఇరుసు; కున్ = కు; చతుర్ = నాలుగు (4); ముఖంబులన్ = వైపులను; హ్రస్వ = పొట్టి; స్తంభంబులున్ = రాటలు; పోలెన్ = వలె; ఉండున్ = ఉండును; ఆ = ఆ; చతుః = నాలుగు (4); స్తంభంబులన్ = స్తంభముల; అందున్ = అందలి; పర్వత = పర్వతముల; శిఖరంబులన్ = కొండకొన లందు; వెలుగొందు = ప్రకాశించెడి; కేతువులన్ = జండాల; పోలెన్ = వలె; చూత = మామిడి; జంబూ = నేరేడు; కదంబ = కడిమి; న్యగ్రోధంబులను = జువ్వి; అను = అనెడి; వృక్షరాజంబులున్ = మహావృక్షములు {వృక్షరాజము - వృక్షములలో రాజు వంటివి, మహావృక్షములు}; క్రమంబునన్ = వరుసగా; ఒండొంటికిన్ = ఒకదానికొకటి; ఏకాదశశత = పదకొండువేల (11,000); యోజన = యోజనముల; ఆయతంబును = పొడవును; శత = వంద (100); యోజన = యోజనముల; విస్తారంబునున్ = విస్తీర్ణమును; కలిగి = ఉండి; ఉండున్ = ఉండును; మఱియున్ = ఇంకనూ; ఆ = ఆ; పర్వతశిఖరంబులన్ = కొండకొన లందు; క్రమంబునన్ = చక్కగా; పయస్ = పాలు; మధు = తేనె; ఇక్షురస = చెరుకురసము; మృష్ట = రుచిగల; జలంబులున్ = నీరును; కలిగి = కలిగి నట్టి; శత = నూరు (100); యోజన = యోజనముల; విస్తారంబులున్ = వైశాల్యములు; అయిన = అయిన; సరోవరంబులున్ = సరోవరములు; తేజరిల్లున్ = విలసిల్లును; అందున్ = వానిలో; సుస్నాతులు = చక్కగా స్నానము చేసినవారు; అగు = అయిన; వారల్ = వారి; కున్ = కి; యోగ = అపూర్వ వస్తు ప్రాప్తి; ఐశ్వర్యంబులున్ = సంపదలు; స్వభావంబునన్ = సహజసిద్ధముగ; కలుగున్ = కలుగును; మఱియున్ = ఇంకను; నందన = నందనము; చైత్రరథ = చైత్రరథము; వైభ్రాజిక = వైభ్రాజికము; సర్వతోభద్రంబుల్ = సర్వతోభద్రము; అను = అనెడి; నామంబులున్ = పేర్లు; కల = కలిగిన; దేవ = దివ్యమైన; ఉద్యానంబులున్ = ఉద్యానవనములు; ఆ = ఆ; పర్వతశిఖరంబులన్ = కొండకొన లందు; వెలుగొందుచుంచున్ = ప్రకాశిస్తుండును; అందున్ = వానిలో; దేవతా = దేవతల; గణంబులున్ = సమూహములు; దేవాంగనలన్ = దేవతాస్త్రీలను; కూడి = కలిసి; గంధర్వుల = గంధర్వుల యొక్క; గీత = గీతములు, పాటలు; నృత్యంబులున్ = నృత్యములు; కనుగొనుచు = తిలకించుతూ; విహరింతురు = విహరిస్తుంటారు; అంత = అంతట;

భావము:

తూర్పు పడమరలలో ఉప్పునీటి సముద్రం వరకూ ఉన్న సరిహద్దు పర్వతాలలో నీల శ్వేత శృంగవత్పర్వతాలు క్రమంగా ఒకదాని కంటె ఒకటి పది యోజనాలు తక్కువ పొడవు కలిగి ఉంటాయి. ఈ మూడు పర్వతాల నడిమి ప్రదేశంలో రమ్యకం, హిరణ్మయం, కురు అనే మూడు వర్షాలు ఉన్నాయి. అవి ఒక్కొక్కటి తొమ్మిది వేల యోజనాల విస్తృతి కలిగి ఉన్నాయి. ఇవన్నీ సముద్రం దాకా వ్యాపించి ఉన్నాయి. ఆ మూడు వర్షాల పొడవు నీల శ్వేత శృంగవత్పర్వతాల పొడవుతో సమానంగా ఉంటుంది. ఇలావృత వర్షానికి దక్షిణంగా మూడు సరిహద్దు పర్వతాలు ఉన్నాయి. అవే నిషధ పర్వతం, హేమకూట పర్వతం, హిమవత్పర్వతం. ఇవి తూర్పునుండి పడమటి వరకు పొడవు, ఉత్తరం నుండి దక్షిణం వరకు వెడల్పు కలిగి ఉన్నాయి. వీని నిడివి నీల శ్వేత శృంగవత్పర్వతాలతో సమానంగా ఉంటుంది. ఈ మూడు పర్వతాల నడుమ మూడు భూప్రదేశాలు ఉన్నాయి. అవే హరివర్షం, కింపురుషం, భారతవర్షం అనేవి. ఇలావృత వర్షానికి పడమట మాల్యవంతం, తూర్పున గంధమాదనం అనే సరిహద్దు పర్వాలున్నాయి. అవి తూర్పు పడమరలకు పొడవూ, ఉత్తర దక్షిణాలకు వెడల్పూ కలిగి నీలపర్వత నిషధపర్వతాలను ఆనుకొని ఉన్నాయి. వాని విస్తృతి రెండు వేల యోజనాలు. మాల్యవంతం, గంధమాదనం అనే ఈ రెండూ కేతుమాల భద్రాశ్వ వర్షాలకు సరిహద్దు పర్వతాలుగా ఉన్నాయి. సుమేరు పర్వతానికి తూర్పున మందర పర్వతం, దక్షిణాన మేరుమందర పర్వతం, పడమట సుపార్శ్వ పర్వతం, ఉత్తరాన కుముద పర్వతం ఉన్నాయి. ఈ నాలుగు పర్వతాలు పదివేల యోజనాలు ఎత్తు కలిగి ఉన్నవి. ఇన్నిటికి నడుమ మేరుపర్వతం ఎత్తుగా పొడుగైన స్తంభంలాగా ఉంటే మిగిలిన పర్వతాలు నాలుగు ప్రక్కల నాటిన పొట్టి గుంజల లాగా ఉన్నాయి. ఈ నాలుగు పర్వత శిఖరాల మీద పతాకాల లాగా క్రమంగా పెద్ద పెద్ద మామిడి చెట్లూ, నేరేడు చెట్లూ, కడిమి చెట్లూ, మఱ్ఱిచెట్లూ ఉంటాయి. ఈ వృక్షరాజాలు ఒక్కొక్కటి పదకొండు వందల యోజనాల పొడవు, నూరు యోజనాల వెడల్పు కలిగి ఉంటాయి. ఇంతేకాక ఆ నాలుగు పర్వత శిఖరాల మీద వంద యోజనాల విస్తీర్ణం కలిగిన నాలుగు పెద్ద పెద్ద సరోవరాలు ఉన్నాయి. క్రమంగా వాటి పేర్లు క్షీరసరస్సు, మధు సరస్సు, ఇక్షురస సరస్సు, నిర్మల జల సరస్సు. ఆ సరస్సులలో స్నానం చేసేవారికి స్వభావం చేతనే యోగనిష్ఠ, అణిమాది సిద్ధులు సిద్ధిస్తాయి. ఇంకా ఆ పర్వత శిఖరాలపై నందనం, చైత్రరథం, వైభ్రాజకం, సర్వతోభద్రం అనే దేవోద్యానాలు ఉన్నాయి. ఈ ఉద్యానవనాలలో దేవతలు దేవకాంతలతో కూడి గంధర్వుల ఆటపాటలను ఆలకిస్తూ, ఆలోకిస్తూ ఆనందంగా విహరిస్తారు.

5.2-21-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మంరపర్వతంబు తుది మామిడిపం డ్లమృతోపమానమై
మంర శైల శృంగ సుసమానములై గిరిమీఁద నట్టి మా
కంఫలామృతంబు గలఁగం బడి జాఱి మహాప్రవాహమై
యం రుణోదనామమున ద్భుతమై విలసిల్లు నెంతయున్.

టీకా:

మందర = మందర యనెడి; పర్వతంబున్ = పర్వతము యొక్క; తుదిన్ = కొన, శిఖరము నందు; మామిడి = మామిడి; పండ్లు = పండ్ల యొక్క; అమృత = అమృతముతో; ఉపమానము = సమానమైనది; ఐ = అయ్యి; మందరశైల = మందరపర్వతము యొక్క; శృంగ = శిఖరమునకు; సు = చక్కగా; సమానములు = సమానము; ఐ = అయిన; గిరి = కొండ, పర్వతము; మీదన్ = పైన; అట్టి = అటువంటి; మాకంద = మామిడి; ఫల = పండ్ల యొక్క; అమృతంబున్ = అమృతమువంటి రసము; కలగంబడి = కలసిపోయి; జాఱి = జారుతూ; మహా = గొప్ప; ప్రవాహము = వెల్లువలు; ఐ = అయ్యి; అందు = అక్కడ; అరుణోద = అరుణోదము {అరుణోదము - ఎఱ్ఱని నీరు గలది}; నామమునన్ = పేర; అద్భుతము = అద్భుతమైనది; ఐ = అయ్యి; విలసిల్లున్ = ప్రసిద్ద మగును; ఎంతయున్ = అత్యధికముగ;

భావము:

మందర పర్వతం మీది మామిడి చెట్ల పండ్లు పర్వత శిఖరాలంత పెద్దవి. ఆ పండ్ల రుచి అమృతంతో సమానంగా ఉంటుంది. బాగా మాగిన ఆ పండ్లు చెట్లమీదనుండి ఆ కొండమీద రాలుతాయి. ఆ పండ్లు పడి పగిలినపుడు ఆ పండ్లరసం అద్భుతమైన మహాప్రవాహమై అరుణోదం అనే నదిగా ప్రవహిస్తుంది.

5.2-22-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

డు మధురంబునన్ సురభిగంధముచే నరుణప్రకాశతన్
డిగొని మందరాచలము వంతలచెంతల జాఱి యంతలోఁ
దొడితొడి నా యిలావృతముఁ దోఁచుచు వింతగఁ బూర్వవాహియై
రుఁ దరంగసంతతుల నందఱి నచ్చటఁ జేయు ధన్యులన్.

టీకా:

కడు = మిక్కిలి; మధురంబునన్ = తీయదనముతో; సురభి = మనోహరమైనట్టి; గంధము = సువాసన; చేన్ = తోటి; అరుణ = ఎఱ్ఱని; ప్రకాశతన్ = ప్రకాశముతో; వడిగొని = మిక్కిలి వేగము కలిగిన; మందరాచలమున్ = మందరాచలము; వంతల = ఏరుల; చెంతలన్ = దగ్గరలో; జాఱి = ప్రవహించుతూ; అంతలోన్ = అంతలో; తొడితొడిన్ = ససంభ్రమముగా; ఆ = ఆ; ఇలావృతమున్ = ఇలావృతపర్వతము నందు; తోచుచున్ = కనబడుతూ; వింతగన్ = అద్భుతముగా; పూర్వ = తూర్పునకు; వాహి = ప్రవహించునది; ఐ = అయ్యి; అడరున్ = అతిశయించును; తరంగ = అలల; సంతతులన్ = వరుసలుతో; అందఱిన్ = అందరిని; అచ్చటన్ = అక్కడ; చేయున్ = చేయును; ధన్యులన్ = ధన్యులుగా;

భావము:

మిక్కిలి తీయగా, సుగంధంతో కూడి, ఎఱ్ఱని రంగు కలిగిన రసాలు ప్రవహించే ఆ నది మందరాచలం నుండి బయలుదేరి తూర్పు వైపుగా ఇలావృత వర్షాన్ని ఒరుసుకుంటూ సాగిపోతుంది. ఆ నదీ తరంగాలు అందరినీ పవిత్రం చేస్తూ ఉంటాయి.

5.2-23-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నదీజలంబు లాడిన యచ్చటి
యంబికానుచరుల యంగగంధ
మంది పవనుఁ డంత నుజేశ! పది యోజ
ములు జుట్టుఁ బరిమముల నింపు.

టీకా:

ఆ = ఆ యొక్క; నదీ = నదియందు; జలంబులాడిన = స్నానములు చేసిన; అచ్చటి = అక్కడి; అంబికా = పార్వతీదేవి; అనుచరులు = చెలికత్తెలు; అంగ = దేహము లందలి; గంధమున్ = సువాసనలను; అంది = పొంది; పవనుడు = వాయుదేవుడు; అంతన్ = అంతట; మనుజేశ = రాజ {మనుజేశ - మనుజులకు ఈశుడు (ప్రభువు), రాజు}; పది = పది; యోజనములున్ = యోజనముల వరకు; చుట్టున్ = చుట్టుపక్కల; పరిమళములన్ = సువాసనలను; నింపున్ = నింపును.

భావము:

రాజా! ఆ నదీజలాలలో పార్వతీదేవి చెలికత్తెలు స్నానం చేస్తారు. వారి శరీరమందలి దివ్యపరిమళాన్ని గ్రహించిన వాయువు పదివేల యోజనాల పర్యంతం సుగంధాలను వెదజల్లుతుంది.

5.2-24-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మేరు మందరముల మీఁద జంబూఫలం
బులు మహాగజోపములుగ వ్రాలి
విసి యంతఁ దద్రసామృతం బల్లన
మ్మహానగంబునందుఁ బొడమి.

టీకా:

మేరు = మేరుపర్వతము; మందరములన్ = మందరపర్వతముల; మీదన్ = పైన; జంబూఫలంబులు = నేరేడుపండ్లు; మహా = పెద్ద; గజ = ఏనుగులను; ఉపములుగన్ = సరిపోలుతూ; వ్రాలి = రాలిపడి; అవిసి = బద్దలై; అంతన్ = అంతట; తత్ = వాటి; రస = రసము యనెడి; అమృతంబున్ = అమృతము; అల్లన్ = మెల్లగా; ఆ = ఆ; మహా = పెద్ద; నగంబున్ = కొండ, పర్వతము; అందున్ = అందు; పొడమి = జనించి;

భావము:

మేరుమందర పర్వతం మీద నేరేడు పండ్లున్నాయి. ఆ పండ్లు పెద్ద ఏనుగులంత ఉంటాయి. చెట్లనుండి రాలిపడి పగిలిన ఆ పండ్ల రసమే ప్రవాహంగా ఆ కొండమీద జాలువారుతుంది.

5.2-25-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నుపమ మగు జంబూనది
ను పేరను వెలసి లీల రుగుచు నంతన్
త నిలావృత వర్షము
నుపడఁ దడుపుచును ధరణి బ్రవహించుఁ దగన్

టీకా:

అనుపము = సాటిలేనిది; అగు = అయిన; జంబూనది = జంబూనది; అను = అనెడి; పేరను = పేరుతో; వెలసి = ప్రసిద్ధమై; లీలన్ = లీలగా; అరుగుచున్ = ప్రవహించును; అంతన్ = అంతట; ఘనతన్ = గొప్పగా; ఇలావృతవర్షమున్ = ఇలావృతపర్వతమును; పనుపడన్ = పూని; తడుపుచున్ = తడుపుతూ; ధరణిన్ = నేలపైన; ప్రవహించున్ = ప్రవహించును; తగన్ = చక్కగా;

భావము:

ఆ నేరేడు పండ్ల రసం జంబూనదిగా ప్రవహిస్తూ ఇలావృత వర్ష ప్రదేశాన్ని తడుపుతూ ఆ భూభాగం మీద ప్రవహిస్తుంది.

5.2-26-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దినీటఁ దోఁగి పదనై యటు మృత్తని లార్క సంగతిం
బూని కడున్ విపాకమునఁ బొందుచు శుద్ధసువర్ణజాతి జాం
బూద నామ మొంది సురముఖ్యుల కెల్లను భూషణార్హమై
మానుగ వన్నె మించి కడు మంచిదియై విలసిల్లు నెంతయున్.

టీకా:

ఆ = ఆ; నది = నదియొక్క; నీటన్ = నీటితో; దోగి = తడసి; పదనై = నానినది; ఐ = అయ్యి; అటున్ = అలా; మృత్త = మన్ను; అనిల = వాయువు; అర్క = సూర్యరశ్మి; సంగతిన్ = కలయికచే; పూని = పూని; కడున్ = మిక్కిలి; విపాకమునన్ = పరిపాకము చెందుటను; పొందుచున్ = పొందుతూ; శుద్ద = స్వచ్ఛమైన; సువర్ణ = బంగారము; జాతి = జాతి; జాంబూనద = జాంబూనదము యనెడి; నామమున్ = పేరును; ఒంది = పొంది; సుర = దేవతలు; ముఖ్యుల్ = మొదలగువారి; కి = కి; ఎల్లన్ = అందరకును; భూషణా = అలంకరించుకొనుటకు; అర్హము = తగినది; ఐ = అయ్యి; మానుగ = చక్కగా; వన్నెమించి = మిక్కిలి ప్రసిద్ధమై; కడున్ = మిక్కిలి; మంచిది = మంచిది; ఐ = అయ్యి; విలసిల్లున్ = విరాజిల్లును; ఎంతయున్ = అత్యధికముగ;

భావము:

ఆ జంబూనదీ జలంతో బాగా నానిన మట్టి వాయు సూర్య సంపర్కంవల్ల పరిపక్వమై బంగారంగా మారిపోతుంది. ఆ కారణంగా బంగారానికి జాంబూనదం అనే పేరు వచ్చింది. మంచి వన్నె గల ఆ శుద్ధ సువర్ణాన్ని దేవతలు భూషణాలుగా చేసుకొని అలంకరించుకొంటారు.

5.2-27-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు సుపార్శ్వ నగాగ్రంబునందుఁ బంచవ్యామ పరీణాహ బంధురంబు లగు నైదు మధుధారా ప్రవాహంబులు పంచముఖంబుల వెడలి సుపార్శ్వనగ శృంగంబులం బడి యిలావృత వర్షంబు పశ్చిమభాగంబుఁ దడపుచుం బ్రవహిం; చా తేనియ ననుభవించువారల ముఖమారుత సుగంధంబు శత యోజన పర్యంతంబు పరిమళించు.

టీకా:

మఱియున్ = ఇంకను; సుపార్శ్వ = సుపార్శ్వము అనెడి; నగ = శిఖరము; అందున్ = అందు; పంచ = ఐదు; వ్యామ = బారలు; పరీణాహ = వైశాల్యమున; బంధురంబులు = నిండుగా ఉన్నవి; అగు = అయిన; ఐదు = అయిదు (5); మధు = తియ్యటి నీటి; ధారా = ధారలతో; ప్రవాహంబులున్ = ప్రవాహములు; పంచ = ఐదు (5); ముఖంబులన్ = పక్కలను; వెడలి = వెలువడి; సుపార్శ్వ = సుపార్శ్వము అనెడి; నగశృంగంబులన్ = కొండశిఖరము లందు; పడి = పడి; ఇలావృతవర్షంబున్ = ఇలావృతదేశము; పశ్చిమ = పడమర; భాగంబున్ = భాగమును; తడపుచున్ = తడుపుతూ; ప్రవహించు = ప్రవహించెడి; ఆ = ఆ; తేనియన్ = తేనెలను; అనుభవించు = భుజించెడి; వారల = వారి యొక్క; ముఖ = నోటి; మారుత = గాలి యొక్క; సుగంధంబున్ = సువాసన; శత = నూరు; యోజన = యోజనముల వరకు; పర్యంతంబున్ = వరకు; పరిమళించున్ = పరిమళించును;

భావము:

ఇంకా సుపార్శ్వమనే పర్వతం మీద పెద్ద కడిమి చెట్టున్నది. ఆ వృక్ష కోటరాల నుండి ఐదు మధుధారా ప్రవాహాలు ఐదు దిక్కులా ప్రవహిస్తూ ఉంటాయి. ఒక్కొక్క ప్రవాహం ఐదు బారల వెడల్పు కలిగి చిన్న నదిగా ఉంటుంది. ఈ ఐదు ప్రవాహాలు సుపార్శ్వ పర్వత శిఖరం మీదనుండి క్రిందికి ప్రవహిస్తూ ఇలావృత వర్షం పడమటి భాగాన్ని తడుపుతూ ఉంటాయి. ఆ ఐదు తేనె ప్రవాహాలను ఆస్వాదించినవారి ముఖాల నుండి వెలువడిన పరిమళం నూరు యోజనాల పర్యతం వ్యాపిస్తుంది.

5.2-28-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కుముద పర్వత శిఖాగ్రమున నుత్పన్నమై-
నుపట్టు వటతరు స్కంధమునను
నుదయించునట్టి పయో దధి ఘృత మధు-
గుడ విశిష్టాన్నంబు లుడుగ కెపుడు
నంబర శయ్యాసనాభరణాది వ-
స్తువులఁ గోరికలు దీర్చుచును గుముద
ర్వతాగ్రంబునఁ డి యిలావృతవర్ష-
మున జనులకు నెల్ల భోగ్యములను

5.2-28.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దల కొసఁగు; వారి ళిపలితంబులు
లఁగు దుష్టగంధములును బాయు
ణభయము ముదిమి పొయ దెన్నడును శీ
తోష్ణబాధ జెందకుండు నధిప!

టీకా:

కుముదపర్వత = కుముదపర్వతము యొక్క; శిఖా = శిఖరము; అగ్రమునన్ = కొన యందు; ఉత్పన్నము = పుట్టినది; ఐ = అయ్యి; కనుపట్టు = కనబడెడి; వట = మఱ్ఱి; తరు = చెట్టు; స్కంధముననున్ = మ్రాను; ఉదయించున్ = పుట్టెడివి; అట్టి = అటువంటి; పయస్ = పాలు; ఘృత = నెయ్యి; మధు = తేనె; గుడ = బెల్లము; విశిష్ట = వంటి ప్రత్యేకమైన; అన్నంబులున్ = ఆహారములు; ఉడుగక = విడువక; ఎపుడున్ = ఎప్పుడును; అంబర = వస్త్రములు; శయ్యా = పాన్పులు; ఆసన = ఆసనములు; ఆభరణ = భూషణములు; ఆది = మొదలగునవి; వస్తువులన్ = వస్తువులను; కోరికలు = కోరికలు; తీర్చుచునున్ = తీర్చుచూ; కుముదపర్వత = కుముదపర్వతము యొక్క; అగ్రంబునన్ = కొనలందు; పడి = పడి; = ఇలావృతవర్షమున = ఇలావృతవర్షమునందలి; జనుల్ = ప్రజల; కున్ = కు; ఎల్లన్ = అందరకు; భోగ్యములను = అనుభవించదగినవానిని;
వదలక = తప్పకుండగ; ఒసగున్ = ఇచ్చును; వారి = వారి యొక్క; వళి = చర్మము ముడుతలు పడుట; ఫలితంబులున్ = జుట్టు నెరయుట; తలగు = తొలగిపోవును; దుష్ట = చెడు; గంధములున్ = (నోటి) వాసనలు; పాయున్ = పోగొట్టును; మరణ = చావు; భయమున్ = భయమును; ముదిమిన్ = ముసలితనము; పొరయదు = కలుగదు; ఎన్నడునున్ = ఎప్పుడును; శీత = చలి; ఉష్ణ = వేడిల; బాధన్ = బాధను; చెందక = పొందకుండగ; ఉండున్ = ఉండును; అధిప = రాజ;

భావము:

రాజా! కుముద పర్వత శిఖరం మీద బాగా పెరిగిన పెద్ద మఱ్ఱిచెట్టు ఉన్నది. ఆ చెట్టునుండి పాలు, పెరుగు, నేయి, తేనె, బెల్లం ఇంకా రకరకాల రుచులు కలిగిన ఆహార పదార్థాలు ఎప్పుడూ ఉత్పన్నమౌతూ ఉంటాయి. వస్త్రాలు, పాన్పులు, ఆసనాలు, నగలు మొదలైన వస్తువులను ఆ వటవృక్షం ప్రసాదిస్తుంది. కోరికలు తీర్చే ఆ మఱ్ఱిమాను ఇలావృత వర్షంలో నివసించే ప్రజల కందరికీ సమస్త విధాలైన సుఖ సంపత్తిని ప్రసాదిస్తుంది. ఆ ఆహార పదార్థాలను వాడడం వల్లను, ఆ ప్రదేశంలో అయాచితంగా దక్కే సుఖ భోగాలను అనుభవించడం వల్లను అక్కడ ఎవరికీ ముసలితనం రాదు. చర్మ ముడతలు పడదు. జుట్టు నెరసిపోదు. శరీర దుర్గంధం ఉండదు. మరణభయం అసలు లేదు. చలి, ఎండల బాధలు ఉండనే ఉండవు.

5.2-29-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దేవదానవులును దివ్యమునీంద్ర గం
ర్వు లాదిగాఁగఁ గిలి యాశ్ర
యించి యుందు; రా గిరీంద్ర మూలమునందు
ర్షమంది ఘన విహార లీల.

టీకా:

దేవ = దేవతలు; దానవులునున్ = రాక్షసులు; దివ్య = దివ్యమైన; ముని = మునులలో; ఇంద్ర = ఇంద్రుని వంటివారు; గంధర్వులు = గంధర్వులు; ఆదిగాగన్ = మొదలగువారు; తగిలి = పూని; ఆశ్రయించి = చేరి; యుందురు = ఉంటారు; ఆ = ఆ; గిరి = పర్వతములలో; ఇంద్ర = ఇంద్రునివంటిదాని; మూలమున్ = మొదలు; అందున్ = అందు; హర్షమున్ = సంతోషమును; అంది = పొంది; ఘన = గొప్ప; విహార = విహారముల; లీలన్ = లీలలతో;

భావము:

దేవతలు, రాక్షసులు, దివ్య మునీంద్రులు, గంధర్వులు మొదలైన వారందరూ ఆ కుముద పర్వతాన్ని ఆశ్రయించి పట్టరాని సంతోషంతో విహరిస్తూ ఉంటారు.

5.2-30-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నరేంద్రా! కురంగ కురర కుసుంభ వైకంకత త్రికూట శిశిర పతంగ రుచక నిషధ శితివాస కపిల శంఖాదులయిన పర్వతంబులు మేరుపర్వతకర్ణికకుఁ గేసరంబులయి పరివేష్టించి యుండు; నా మేరు నగేంద్రంబునకుఁ బూర్వభాగంబున జఠర దేవకూటంబులును, బశ్చిమంబునం బవన పారియాత్రంబులు నను పర్వతంబులు నాలుగు, దక్షిణోత్తరంబు లొండొంటికి నష్టాదశసహస్ర యోజనంబుల నిడుపును బూర్వపశ్చిమంబులు ద్విసహస్ర యోజనంబుల వెడల్పును నగుచు దక్షిణంబునఁ గైలాస కరవీరంబులు నుత్తరంబున ద్రిశృంగ మకరంబు లను నామంబులు గల పర్వతంబులు నాలుగును, బూర్వపశ్చిమంబుల నష్టాదశసహస్ర యోజనంబుల నిడుపును దక్షిణోత్తరంబుల ద్విసహస్ర యోజనంబుల వెడల్పు నగుచు నగ్నిపురుషునకుం బ్రదక్షిణం బగు పరిస్తరణంబుల చందంబున మేరువునకుం బ్రదక్షిణంబుగా నష్ట నగంబులు నిలిచి యుండు; మేరుశిఖరంబున దశసహస్ర యోజనంబుల నిడుపు నంతియ విస్తారంబు నగుచు సువర్ణమయం బైన బ్రహ్మపురంబు దేజరిల్లు చుండు; నా పట్టణంబునకు నష్టదిక్కుల యందును లోకపాలుర పురంబు లుండు.

టీకా:

నరేంద్ర = రాజా {నరేంద్రుడు - నరులలో ఇంద్రునివంటివాడు, రాజు}; కురంగ = కురంగము {కురంగము - లేడి}; కురర = కురరము {కురురము - గొఱ్ఱె}; కుసుంభ = కుసుంభము {కుసుంభము - కుంకుమ పువ్వు}; వైకంకత = వైకంకతము; త్రికూట = త్రికూటము {త్రికూటము - మూడు శిఖరములు గలది}; శిశిర = శిశిరము {శిశిరము - చల్లనిది}; పతంగ = పతంగము {పతంగ - సూర్యుడు}; రుచక = రుచకము; నిషధ = నిషధము {నిషదము - కఠినమైనది}; శితివాస = శితివాసము {శితివాస - శితి (శివుని) వాసము (నివాసము)}; కపిల = కపిలము; శంఖ = శంఖము; ఆదులున్ = మొదలగునవి; అయిన = అయినట్టి; పర్వతంబులున్ = పర్వతములు; మేరుపర్వత = మేరుపర్వతము అనెడి; కర్ణిక = బొడ్డున; కున్ = కు; కేసరంబులు = కేసరములు; అయి = అయ్యి; పరివేష్టించి = చుట్టుకొని; ఉండున్ = ఉండును; ఆ = ఆ; మేరు = మేరువు యనెడి; నగ = పర్వతములలో; ఇంద్రంబున్ = ఇంద్రునివంటిదాని; కున్ = కి; పూర్వ = తూర్పు; భాగంబునన్ = వైపు; జఠర = జఠరకూటము; దేవకూటంబులునున్ = దేవకూటము; పశ్చిమంబునన్ = పశ్చిమదిక్కున; పవన = పవనయాత్రంబు; పారియాత్రంబులు = పారియాత్రము; అను = అనెడి; పర్వతంబులున్ = పర్వతములు; నాలుగు = నాలుగు (4); దక్షిణ = దక్షిణము; ఉత్తరంబులన్ = ఉత్తరము లందు; ఒండొంటికి = ఒక్కోదానికి; అష్టాదశసహస్ర = పద్దెనిమిదివేలు (18,000); యోజనంబులన్ = యోజనముల; నిడుపును = పొడవు; పూర్వ = తూర్పు; పశ్చిమంబులున్ = పడమరలు; ద్విసహస్ర = రెండువేల (2,000); యోజనంబులన్ = యోజనముల; వెడల్పునున్ = వెడల్పును; అగుచున్ = అగుచూ; దక్షిణంబునన్ = దక్షిణమువైపున; కైలాస = కైలాసపర్వతము; కరవీరంబులు = కరవీరపర్వతములు; ఉత్తరంబునన్ = ఉత్తరదిక్కున; త్రిశృంగ = త్రిశృంగపర్వతము; మకరంబులు = మకరపర్వతములు; అను = అనెడి; నామంబులు = పేర్లు; కల = కలిగిన; పర్వతంబులున్ = పర్వతములు; నాలుగును = నాలుగు (4); పూర్వ = తూర్పు; పశ్చిమంబులన్ = పడమరలకి; అష్టాదశసహస్ర = పద్దెనిమిదివేలు (18,000); యోజనంబులున్ = యోజనములు; నిడుపును = పొడవు; దక్షిణ = దక్షిణము; ఉత్తరంబులన్ = ఉత్తరములకి; ద్విసహస్ర = రెండువేల (2, 000); యోజనంబుల = యోజనములు; వెడల్పునున్ = వెడల్పును; అగుచున్ = అగుచు; అగ్నిపురుషున్ = అగ్నిహోత్రున; కున్ = కు; ప్రదక్షిణంబు = చుట్టుకొని ఉండునవి; అగు = అయినట్టి; పరిస్తరణంబుల = చుట్టు పరచిన దర్భల; చందంబునన్ = విధముగ; మేరువున్ = మేరు పర్వతమున; కున్ = కు; ప్రదక్షిణంబుగా = చుట్టును; అష్ట = ఎనిమిది (8); నగంబులున్ = కొండలు; నిలిచి = నిలబడి; ఉండున్ = ఉండును; మేరు = మేరుపర్వత; శిఖరంబునన్ = శిఖరము నందు; దశసహస్ర = పదివేల (10, 000); యోజనంబుల = యోజనముల; నిడుపును = పొడవును; అంతియ = అంతే; విస్తారంబును = వెడల్పును; అగుచున్ = అగుచూ; సువర్ణ = బంగారముతో; మయంబున్ = నిండినది; ఐన = అయినట్టి; బ్రహ్మపురంబున్ = బ్రహ్మపురము; తేజరిల్లుచుండున్ = ప్రకాశిస్తుండును; ఆ = ఆ; పట్టణంబున్ = పట్టణమున; కున్ = కు; అష్ట = ఎనిమిది (8); దిక్కులన్ = దిక్కుల; అందునున్ = వైపునను; లోకపాలుర = లోకపాలకుల; పురంబులున్ = పట్టఁములు; ఉండున్ = ఉండును;

భావము:

రాజా! మేరుపర్వతం తామరదుద్దు. దాని చుట్టూ కురంగం, కురరం, కుసుంభం, వైకంకతం, త్రికూటం, శిశిరం, పతంగం, రుచకం, విషధం, శితివాసం, కపిలం, శంఖం మొదలైన పర్వతాలు కేసరాలుగా ఉన్నాయి. ఆ మేరుపర్వతానికి తూర్పుభాగంలో జఠరగిరి, దేవకూటం అనే పర్వతాలున్నాయి. పడమట పవనగిరి, పారియాత్రం అనే పర్వతాలున్నాయి. ఈ నాలుగు పర్వతాలు ఒక్కొక్కటి దక్షిణం నుండి ఉత్తరం వరకు పద్దెనిమిది యోజనాల పొడవు, తూర్పు నుండి పడమటి వరకు రెండువేల యోజనాల వెడల్పు కలిగి ఉంటాయి. మేరువు చుట్టూ ఉన్న ఎనిమిది కొండలు అగ్నిహోత్రునికి ప్రదక్షిణం చేస్తున్న జ్వాలల వలె నిలిచి ఉన్నాయి. మేరుపర్వత శిఖరంలో బ్రహ్మపురం ఉంది. అది పదివేల యోజనాల పొడవు, అంతే వెడల్పు కలిగిన ప్రదేశం. అదంతా బంగారు భూమి. ఆ బ్రహ్మపురానికి ఎనిమిది దిక్కులలోను అష్టదిక్పాలకుల పట్టణాలున్నాయి.

5.2-31-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మేష్ఠి పట్టణంబున
రి మున్ను త్రివిక్రమణము లందన్ సర్వే
శ్వ చరణాగ్ర నఖాహతిఁ
రువడి నూర్ధ్వాండ మంతఁ గిలె నరేంద్రా!

టీకా:

పరమేష్టిపట్టణంబునన్ = బ్రహ్మపురము; హరి = విష్ణుమూర్తి; మున్ను = పూర్వము; త్రివిక్రమణములున్ = త్రివిక్రమును {త్రివిక్రమము - మూడు పదములతో ముల్లోకములను కొలచిన విక్రమము}; అందన్ = చెందుతుండగా; సర్వేశ్వర = విష్ణుని యొక్క; చరణ = కాలి; అగ్ర = వేలు యొక్క; నఖ = గోరు యొక్క; ఆహతిన్ = దెబ్బకి; పరువడిన్ = తటాలున; ఊర్ధ్వాండము = పైనుండు బ్రహ్మాండము; అంతన్ = అంతట; పగిలెన్ = పగిలినది; = నరేంద్రా = రాజా;

భావము:

రాజా! బ్రహ్మపట్టణంలో నారాయణుడు త్రివిక్రమత్వాన్ని ప్రదర్శించాడు. అప్పుడాయన కాలిగోటి దెబ్బకు బ్రహ్మాండం పైభాగం చిట్లి బ్రద్దలయింది.

5.2-32-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు చరణనఖస్పర్శం జేసి భేదింపబడ్డ యూర్ధ్వకటాహ వివరంబు వలన నంతఃప్రవేశంబు జేయుచున్న బాహ్యజలధార శ్రీహరిపాదస్పర్శం జేయుచుఁ జనుదెంచి, సకలలోకజనంబుల దురితంబులు వాపుచు భగవత్పాదియను పేరం దేజరిల్లుచు దీర్ఘకాలంబు స్వర్గంబున విహరించు విష్ణుపదంబున నుత్తానపాద పుత్రుండును బరమ భాగవతుండును నైన ధ్రువుండు దన కులదేవత యైన శ్రీహరి పాదోదకంబుఁ బ్రతిదినంబును భక్తియోగంబున నిమీలితనేత్రుండై యానందబాష్పంబుల రోమాంచితగాత్రుండై యత్యాదరంబున నేఁడును శిరంబున ధరియించుచు నున్నవాఁడు; యతనికి నధోభాగంబున నుండు మండలాధిపతు లైన సప్తర్షులును హరిపాదోదక ప్రభావంబు నెఱింగి తాము పొందు తపస్సిద్ధి యాకాశగంగాజలంబుల స్నాతు లగుటయే యని సర్వభూతాంతర్యామి యగు నీశ్వరుని యందు భక్తి సలిపి యితరపదార్థాపేక్ష జేయక మోక్షార్థి ముక్తిమార్గంబు బహుమానంబు జేయు తెఱంగున బహుమానయుక్తంబుగాఁ దమ జటాజూటంబుల యందు నేడును ధరియించుచుండుదురు.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; చరణనఖ = కాలిగోరు; స్పర్శన్ = తగులుట; చేసి = వలన; భేదింపబడ్డ = పగలగొట్టబడిన; ఊర్ధ్వకటాహ = పైకప్పు {ఊర్ధ్వకటాహము - బ్రహ్మాండము యొక్క పై కప్పు}; వివరంబున్ = కన్నము; వలనన్ = ద్వారా; అంతః = లోనికి; ప్రవేశంబున్ = ప్రవేశము; చేయుచున్న = చేస్తున్న; బాహ్య = బయటి; జలధార = నీటిధార; శ్రీహరి = విష్ణుని; పాద = పాదములను; స్పర్శన్ = తగులుట; చేయుచున్ = చేయుచూ; చనుదెంచె = వచ్చెను; సకల = నిఖిల; లోక = భువనముల; జనంబుల = ప్రజల యొక్క; దురితంబులున్ = పాపములను; వాపుచున్ = పోగొడుతూ; భగవత్పాది = భగవత్పాది {భగవత్పాది - భగవంతుని పాదము లందు పుట్టినది}; అను = అనెడి; పేరన్ = పేరుతో; తేజరిల్లుచు = విలసిల్లుతూ; దీర్ఘ = పెద్ద; కాలంబున్ = కాలము; స్వర్గంబునన్ = స్వర్గము నందు; విహరించున్ = ప్రవహించును; విష్ణుపదంబునన్ = విష్ణులోకము నందు; ఉత్తానపాద = ఉత్తానపాదుని; పుత్రుండునున్ = కొడుకు; పరమ = అత్యుత్తమ; భాగవతుండునున్ = భాగవతానుయాయి; ఐన = అయిన; ధ్రువుండు = ధ్రువుడు; తన = తన యొక్క; కులదేవత = కులదేవత {కులదేవత - వంశస్థుల ప్రధాన ఆరాధ్య దైవము}; ఐన = అయిన; శ్రీహరి = నారాయణుని; పాదోదకంబున్ = కాళ్ళు కడిగిన నీరు; ప్రతి = ప్రతి యొక్క; దినంబునున్ = దినమును; భక్తియోగంబునన్ = భక్తిపూర్వకంబుగా; నిమీలిత = అరమోడ్పు; నేత్రుండు = కన్నులు కలవాడు; ఐ = అయ్యి; ఆనంద = ఆనందముచే కలగిన; బాష్పంబులన్ = కన్నీటితో; రోమాంచిత = రోమములు గగుర్పాటు చెందిన; గాత్రుండు = దేహము కలవాడు; ఐ = అయ్యి; అత్యాదరంబునన్ = మిక్కిలి ఆదరముతో; నేడునున్ = ఈ నాటికిని; శిరంబునన్ = తలపైన; ధరియించుచున్నవాడు = ధరిస్తున్నాడు; అతని = తని; కిన్ = కి; అధోభాగంబునన్ = కిందివైపున; ఉండు = ఉండెడి; మండలాధిపతులు = సప్తర్షిమండలమునకు అధిపతులు; ఐన = అయిన; సప్తర్షులును = సప్తర్షులు {సప్తర్షులు - 1మరీచి 2అత్రి 3అంగిరుడు 4పులస్త్యుడు 5పులహుడు 6క్రతువు 7వసిష్ఠుడు (మరియొక క్రమమున) 1కశ్యపుడు 2అత్రి 3భరద్వాజుడు 4విశ్వామిత్రుడు 5గౌతముడు 6జమదగ్ని 7వసిష్ఠుడు}; హరి = నారాయణుని; పాదోదక = కాళ్ళు కడిగిన నీటి; ప్రభావంబున్ = ప్రభావమును; ఎఱింగి = తెలిసి; తాము = తాము; పొందు = పొందెడి; తపస్ = తపస్సు; సిద్ధి = సిద్ధియనగా; ఆకాశగంగా = ఆకాశగంగ యందు; స్నాతులు = స్నానము చేసినవారు; అగుటయే = అగటే; అని = అని; సర్వ = నిఖిల; భూత = భూతము లందు; అంతర్యామి = లోపల ఉండెడివాడు; అగు = అయినట్టి; ఈశ్వరుని = భగవంతుని; అందు = అందు; భక్తి = భక్తి; సలిపి = చేసి; ఇతర = ఇతరమైన ఏ; పదార్థ = పదార్థముల యందు; ఆపేక్ష = కోరుట; చేయక = చేయకుండ; మోక్షార్థి = మోక్షమును అపేక్షించువాడు; ముక్తిమార్గంబున్ = ముక్తిమార్గమును; బహుమానంబున్ = సమ్మానము; చేయు = చేసెడి; తెఱంగునన్ = విధముగా; బహుమాన యుక్తంబుగాన్ = గౌరవపూర్వకముగా; తమ = తమ యొక్క; జటాజూటంబులన్ = జటల చుట్టల; అందున్ = అందు; నేడునున్ = ఈనాటికిని; ధరియించుచుందురు = ధరించెదరు;

భావము:

ఈ విధంగా నారాయణుని ఎడమకాలి గోటిచేత బ్రహ్మాండం పైకప్పు బ్రద్దలు కాగా ఒక రంధ్రం ఏర్పడింది. అప్పుడు అంతవరకు వెలుపలి వైపు ప్రవహిస్తున్న జలధార అంతర్వాహినియై త్రివిక్రమదేవుని పాదాన్ని స్పృశిస్తూ ప్రవహించింది. ఆ ప్రవాహమే భగత్పాది అనే పేరుతో సకల లోకాల పాపాలను పరిహరిస్తూ చాలాకాలం స్వర్గంలో విహరించింది. ఉత్తానపాదుని కుమారుడు, భాగవతులలో అగ్రేసరుడు అయిన ధ్రువుడు తన ఇలవేల్పు అయిన శ్రీహరి పాదోదకాన్ని ప్రతిదినం నిమీళిత నేత్రుడై భక్తితో స్వీకరిస్తూ, ఆనంద బాష్పాలతో పులించిన దేహంతో ఎంతో ఆదరంతో నేటికీ తలపై చల్లుకొంటూ ఉంటాడు. ఆ ధ్రువునికి దిగువ భాగంలోనే మండలాధిపతులైన సప్తర్షు లున్నారు. వారు శ్రీమన్నారాయణుని పాదోదక ప్రభావం తెలిసికొని ఆకాశగంగలో స్నానం చేయడమే తమ తపస్సిద్ధి అని భావిస్తారు. అలా స్నానం చేయడం వల్ల తమ జన్మ చరితార్థ మౌతున్నట్లు విశ్వసిస్తారు. అఖిల జగత్తులో అంతర్యామిగా ఉన్న శ్రీమన్నారాయణునిపై భక్తి దృఢంగా నిలిపి, వేరే ప్రాపంచికమైన వస్తువులపై అపేక్ష లేకుండా, మోక్షం కోరే వ్యక్తి ముక్తిమార్గాన్ని గౌరవించినట్లు భక్తి గౌరవాలతో సప్తర్షులు ఆ ఆకాశగంగా జలాన్ని తమ జటాజూటాలలో ఈనాటికీ ధరిస్తూ ఉంటారు.

5.2-33-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత నసంఖ్యంబు లైన దివ్యవిమాన-
సంకులంబుల సువిశాలమైన
దేవమార్గంబున దిగి వచ్చి చంద్రమం-
లముఁ దోఁచుచు మేరుగ శిఖాగ్ర
మునను నా బ్రహ్మదేవుని పట్టణమునకు-
చ్చి యందులఁ జతుర్ధ్వారములను
రుసతో దీర్ఘప్రవాహంబు లగుచును-
బ్రవహించి యమల ప్రభావములను

5.2-33.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రుగు లవణసాగరాంతంబులుగ నాల్గు
మోములందు నాల్గు నాములను
న్నుఁ గన్నవారిఁ న వారిఁదోగిన
వారి కెల్ల నమృతవారి యగుచు.

టీకా:

అంతన్ = అంతట; అసంఖ్యంబులున్ = లెక్కలేనన్నివి; ఐన = అయిన; దివ్య = దేవ; విమాన = విమానముల యొక్క; సంకులంబులన్ = సందడులతో; సువిశాలము = మిఖ్కిలి విశాలమైన; దేవ = ఆకాశ; మార్గంబునన్ = దారిలో; దిగివచ్చి = దిగివచ్చి; చంద్రమండలము = చంద్రలోకము; దోచుచున్ = అనిపించుతూ; మేరునగ = మేరుపర్వతము యొక్క; శిఖర = శిఖరము; అగ్రముననున్ = పైన; ఆ = ఆ; బ్రహ్మదేవుని = బ్రహ్మదేవుని; పట్టణమున్ = పట్టణమున; కున్ = కు; వచ్చి = వచ్చి; అందులన్ = దానిలో; జతుర్ = నాలుగు; ద్వారములనున్ = ద్వారములలోను; వరుస = వరుస; తో = ప్రకారము; దీర్ఘ = పెద్ధ; ప్రవాహంబులు = ప్రవాహములు; అగుచునున్ = అగుచు; ప్రవహించి = ప్రవహించి; అమల = స్వచ్ఛమైన; ప్రభావములనున్ = ప్రభావములతో; అరుగున్ = వెళ్ళును, ప్రవహించును;
లవణ = ఉప్పు; సాగర = సముద్రములందు; అంతంబులుగన్ = అంతమగునవి; నాల్గు = నాలుగు; మోములు = వైపుల; అందున్ = అందులోను; నాల్గు = నాలుగు; నామములనున్ = పేర్లతో; తన్ను = తనను; కన్నవారిన్ = దర్శించినవారిని; తన = తన యొక్క; వారిన్ = నీటిలో; తోగిన = స్నానముచేసిన; = వారి = వారి; కిన్ = కి; ఎల్లన్ = అందరకు; అమృతవారి = అమృతవంటి నీరు; అగుచున్ = అగుతూ;

భావము:

విష్ణుమూర్తి పాదంనుండి వినిర్గతమైన ఆకాశగంగ లెక్కలేనన్ని దివ్యవిమానాలతో నిండి సువిశాలంగా ఉండే దేవమార్గం గుండా వచ్చి చంద్రమండలాన్ని ఒరుసుకుంటూ మేరుపర్వత శిఖరాగ్రానికి చేరుకుంటుంది. అక్కడి ఆ బ్రహ్మపట్టణం నాలుగు ద్వారాల గుండా సీత, చక్షువు, భద్ర, అలకనంద అనే నాలుగు పేర్లతో నాలుగు విధాలుగా ప్రవహించి చివరకు లవణ సముద్రంలో కలిసిపోతుంది. ఆ గంగాజలాలు తమను దర్శించే వారికి, తమలో స్నానం చేసేవారికి అమృతత్వాన్ని ప్రసాదిస్తూ ఉంటాయి.

5.2-34-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు సీత యను పేర వినుతి నొందిన యమ్మహానదీప్రవాహంబు బ్రహ్మసదన పూర్వద్వారంబున వెడలి కేసరావలయంబుఁ దడుపుచు గంధమాదనాద్రికిం జని భద్రాశ్వవర్షంబుం బావనంబు జేయుచుఁ బూర్వలవణసాగరంబునం బ్రవేశించు; చక్షు వను పేరం దేజరిల్లెడు దీర్ఘప్రవాహంబు పశ్చిమద్వారంబున వెడలి మాల్యవత్పర్వతంబు నుత్తరించి కేతుమాలవర్షంబుం బవిత్రంబు జేయుచుఁ బశ్చిమ లవణార్ణవంబునం గలయు; భద్ర యనుపేర వెలుఁగొందిన యతుల ప్రవాహం బుత్తరద్వారంబున వెడలి కుముద నీల శ్వేతాఖ్య పర్వత శిఖరంబులం గ్రమంబునఁ బ్రవహించుచు శృంగ నగరంబునకుం జని మానసోత్తరంబు లగు నుత్తర కురుభూములఁ బవిత్రంబు జేయుచు నుత్తర లవణ సాగరంబుఁ జేరు; నలకనంద యనం బ్రఖ్యాతి గాంచిన యమ్మహానదీ ప్రవాహంబు బ్రహ్మ సదన దక్షిణద్వారంబున వెడలి యత్యంత దుర్గమంబు లైన భూధరంబులఁ గడచి హేమకూట హిమకూట నగంబుల నుత్తరించి యతివేగంబునఁ గర్మక్షేత్రంబగు భారతవర్షంబుఁ బావనంబు జేయుచు దక్షిణ లవణాంబుధిం గలయు; నంత.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; సీత = సీత; అను = అనెడి; పేరన్ = పేరుతో; వినుతిన్ = ప్రసిద్ధి; ఒందిన = పొందినట్టి; ఆ = ఆ; మహా = పెద్ద; నదీ = నది యొక్క; ప్రవాహంబున్ = ప్రవాహమును; బ్రహ్మసదన = బ్రహ్మపురము; పూర్వ = తూర్పు; ద్వారంబునన్ = ద్వారము నందు; వెడలి = వెలువడి; కేసర = కేసరముల; వలయంబున్ = మండలమును; తడుపుచున్ = తడుపుతూ; గంధమాదనాద్రి = గంధమాదన పర్వతమున; కిన్ = కు; చని = వెళ్ళి; భద్రాశ్వవర్షంబున్ = భద్రాశ్వవర్షమును; పావనంబున్ = పవిత్రము (తడపుట); చేయుచున్ = చేయుచు; పూర్వ = తూర్పు; లవణ = ఉప్పు; సాగరంబున్ = సముద్రమును; ప్రవేశించున్ = చేరును; చక్షువు = చక్షువు; అను = అనెడి; పేరన్ = పేరుతో; తేజరిల్లెడు = ప్రకాశించెడి; దీర్ఘ = పొడవైన; ప్రవాహంబున్ = ప్రవాహము; పశ్చిమ = పడమర; ద్వారంబునన్ = ద్వారము నందు; వెడలి = వెలువడి; మాల్యవత్పర్వతంబున్ = మాల్యవత్పర్వతములను; ఉత్తరించి = దాటి; కేతుమాలవర్షంబున్ = కేతుమాలదేశమును; పవిత్రంబున్ = పావనము; చేయుచున్ = చేయుచు; పశ్చిమ = పడమర; లవణ = ఉప్పు; ఆర్ణవంబున్ = సముద్రమును; కలయు = కలియును; భద్ర = భద్ర; అను = అనెడి; పేరన్ = పేరుతో; వెలుగొందిన = ప్రకాశించెడి; అతుల = పెద్ద; ప్రవాహంబున్ = ప్రవాహము; ఉత్తర = ఉత్తరము వైపు; ద్వారంబునన్ = ద్వారము నందు; వెడలి = వెలువడి; కుముద = కుముదపర్వతములు; నీల = నీలపర్వతములు; శ్వేత = శ్వేత పర్వతములు; ఆఖ్యన్ = పేరు కలిగిన; పర్వతశిఖరంబులన్ = కొండకోన లందు; క్రమంబునన్ = వరుసగా; ప్రవహించుచున్ = ప్రవహించుతూ; శృంగనగరంబున్ = శృంగపట్టణమున; కున్ = కు; చని = వెళ్ళి; మానస = మానససరోవరమునకు; ఉత్తరంబులున్ = ఉత్తరదిక్కున ఉన్నట్టివి; అగు = అయిన; ఉత్తరకురుభూములన్ = ఉత్తరకురుదేశములను; పవిత్రంబున్ = పావనము; చేయుచున్ = చేయుచు; ఉత్తర = ఉత్తరపు; సాగరంబున్ = సముద్రమును; చేరున్ = చేరును; అలకనంద = అలకనంద; అనన్ = అని; ప్రఖ్యాతి = ప్రసిద్ధి; కాంచిన = పొందినట్టి; ఆ = ఆ; మహా = పెద్ద; నదీ = నది యొక్క; ప్రవాహంబున్ = ప్రవాహము; బ్రహ్మసదన = బ్రహ్మపురము; దక్షిణ = దక్షిణపు; ద్వారంబునన్ = ద్వారము నందు; వెడలి = వెలువడి; అత్యంతదుర్గమంబులు = ఏ మాత్రమును చొరరానివి; ఐన = అయినట్టి; భూధరంబులన్ = పర్వతములను; కడచి = దాటి; హేమకూట = హేమకూటము; హిమకూట = హిమకూటము అనెడి; నగంబులన్ = పర్వతశిఖరములను; ఉత్తరించి = దాటి; అతి = మిక్కిలి; వేగంబునన్ = వేగముతో, గతితో; కర్మక్షేత్రంబున్ = కర్మక్షేత్రము; అగు = అయిన; భారతవర్షంబున్ = భారతదేశమును; పావనంబున్ = పవిత్రము (తడపుట); చేయుచున్ = చేయుచు; దక్షిణ = దక్షిణపు; లవణ = ఉప్పు; అంబుధి = సాగరమున; కలయున్ = చేరును; అంత = అంతట;

భావము:

సీత అనే పేరుతో ప్రఖ్యాతమైన నదీ ప్రవాహం బ్రహ్మపురం తూర్పుద్వారం నుంచి ప్రవహించి కేసరగిరి శిఖరాలను తడుపుతూ గంధమాదన పర్వతం మీదుగా సాగి భద్రాశ్వ వర్షాన్ని పవిత్రం చేస్తూ తూర్పువైపున లవణ సముద్రంలో ప్రవేశిస్తుంది. బ్రహ్మపురం పడమటి ద్వారం నుండి వెలువడిన చక్షువు అనే ప్రవాహం మాల్యవంత పర్వతాన్ని దాటి కేతుమూల వర్షాన్ని పవిత్రం చేస్తూ పడమటి సముద్రంలో సంగమిస్తుంది. బ్రహ్మపట్టణం ఉత్తరద్వారం గుండా వెలువడిన భద్ర అనే ప్రవాహం కుముదం, నీలం, శ్వేతం అనే పర్వత శిఖరాల మీదుగా ప్రవహిస్తూ, శృంగనగరం చేరుకొని అక్కడనుండి మానసోత్తరాలైన కురుభూములను పవిత్రం చేస్తూ ఉత్తర సముద్రంలో కలుస్తుంది. బ్రహ్మనగరం దక్షిణద్వారం నుండి వెలువడిన అలకనందా ప్రవాహం మిక్కిలి దుర్గమాలైన పర్వత పంక్తుల గుండా ప్రవహించి హేమకూటం, హిమకూటం అనే పర్వతాలను దాటి వచ్చి మిక్కిలి ఉరవడితో కర్మక్షేత్రమైన భారతవర్షాన్ని పవిత్రం చేస్తూ దక్షిణ సముద్రంలో కలుస్తుంది.

5.2-35-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తిలో మేరు వాదిగఁ బర్వతములకుఁ-
బుత్రిక లై నట్టి పుణ్యతీర్థ
ములు వేలసంఖ్యలు వు; జంబూద్వీప-
మందు భారతవర్ష రయఁ గర్మ
భూమి దక్కిన వర్షముల దివంబున నుండి-
భువికి వచ్చినవారు పుణ్యశేష
ములు భుజించుచు నుండ్రు; భూస్వర్గమనఁ దగు-
నా వర్షముల నుండుట్టి వార

5.2-35.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యుతసంఖ్య వత్స రాయువు లయుత మా
తంగబలులు దేవతాసమాను
తుల వజ్రదేహు ధిక ప్రమోదితు
ప్రమత్తు లార్యు నఘు లధిప!

టీకా:

జగతి = లోకము; లో = అందు; మేరువు = మేరుపర్వతము; ఆదిగన్ = మొదలగు; పర్వతముల్ = పర్వతముల; కున్ = కు; పుత్రికలు = పుట్టినవి; ఐనట్టి = అయినటువంటి; పుణ్యతీర్థములున్ = పుణ్యతీర్థములు; వేలసంఖ్యలు = వేలకొలది; కలవు = ఉన్నవి; జంబూద్వీపము = జంబూద్వీపము; అందున్ = లోన; భారతవర్షము = భారతదేశము; అరయన్ = తరచిచూసిన; కర్మభూమి = కర్మభూమి; తక్కిన = ఇతరమైన; వర్షములన్ = దేశముల; దివంబున = ఆకాశము, స్వర్గము; నుండి = నుండి; భువి = భూమి; కిన్ = కి; వచ్చిన = వచ్చినట్టి; వారు = జనులు; పుణ్య = పుణ్యఫలములో; శేషములు = మిగిలిన భాగములను; భుజించుచున్ = అనుభవించుతూ; ఉండ్రు = ఉంటారు; భూస్వర్గము = భూలోకమునున్న స్వర్గము; అనన్ = అనుటకు; తగు = తగిన; ఆ = ఆ; వర్షములన్ = దేశముల; ఉండున్ = ఉండెడి; అట్టి = అటువంటి; వారలు = జనులు; అయుత = పదివేలకొలదిగల;
వత్సర = సంవత్సరముల; ఆయువులు = ఆయుష్షుగలవారు; అయుత = పదివేల; మాతంగ = ఏనుగులకు సమానమైన; బలులు = బలముగలవారు; దేవతా = దేవతలతో; సమానులు = సమానమైనవారు; అతుల = మిక్కిలి; వజ్ర = వజ్రమువలె దృఢమైన; దేహులు = శరీరములు కలవారు; అధిక = ఎక్కువగా; ప్రమోదితులు = ఆనందముకలవారు; అప్రమత్తులు = అలక్ష్యములేనివారు; ఆర్యులు = పూజ్యులు; అనఘులు = పుణ్యులు; అధిప = రాజా;

భావము:

రాజా! ప్రపంచంలో మేరువు వంటి పర్వతాలకు పుత్రికలేమో అన్నట్లుగా వేల కొలది పుణ్యతీర్థాలు ఉన్నాయి. జంబూద్వీపంలో భారతవర్షం కర్మభూమి. తక్కిన వర్షాలు భోగభూములు. స్వర్గం నుండి భూమికి దిగి వచ్చినవారు అక్కడ పుణ్యఫలాలను అనుభవిస్తారు.భూలోకస్వర్గం వంటి ఆ వర్షాలలో జీవించేవారు పదివేల సంవత్సరాల ఆయుర్దాయం కలిగి ఉంటారు. పదివేల ఏనుగుల బలం కలిగి ఉంటారు. దేవతలతో సమానులుగా ఉంటారు. వజ్రాలవంటి దృఢమైన దేహాలు కలిగి ఉంటారు. ఎంతో సంతోషంతో జీవిస్తారు. వారి ప్రవర్తనలో ఎటువంటి పొరపాట్లు ఉండవు. వారు పూజ్యులు, పుణ్యాత్ములు.

5.2-36-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు సురతసుఖానందంబున మోక్షంబు నైనం గైకొనక సకృత్ప్రసూతు లగుచు ననవరతంబును ద్రేతాయుగకాలంబు గలిగి ప్రవర్తింతు; రీ యష్ట వర్షంబులయందు దేవతాగణంబులు దమ భృత్యువర్గంబు లత్యుపచారంబులు జేయుచుండ నెల్ల ఋతువుల యందుం గిసలయ కుసుమ ఫల భరితంబులైన లతాదుల శోభితంబు లగు వనంబులు గల వర్ష నిధి గిరిద్రోణుల యందును, వికచ వివిధ నవ గమలా మోదితంబు లగు రాజహంస కలహంసలు గల సరోవరంబుల యందును జలకుక్కుట కారండవ సారస చక్రవాకాది వినోదంబులు గలిగి మత్తాళిఝంకృతి మనోహరంబులై నానావిధంబు లయిన కొలంకుల యందును దేవాంగనల కామోద్రేకజంబు లయిన విలాస హాస లీలావలోకనంబులం దివియంబడిన మనోదృష్టులు గలిగి దేవగణంబులు విచిత్ర వినోదంబులఁ దగిలి యిచ్చావిహారంబులు సలుపుచుండుదురు.

టీకా:

మఱియున్ = ఇంకను; సురత = స్త్రీ సంగమము యొక్క; సుఖ = సుఖము అనెడి; ఆనందంబునన్ = ఆనందముల ముందు; మోక్షంబున్ = మోక్షమును; ఐనన్ = అయినప్పటికి; కైకొనక = గ్రహించక; సకృత్ = ఎప్పుడైనా ఒకమారు; ప్రసూతులు = పిల్లలు కనువారు; అగుచున్ = అగుచు; అనవరతంబున్ = ఎల్లప్పుడు; త్రేతాయుగంబునన్ = త్రేతాయుగపు; కాలంబున్ = కాలధర్మములు; కలిగి = కలిగి; ప్రవర్తింతురు = ప్రవర్తిస్తుంటారు; ఈ = ఈ; అష్ట = ఎనిమిది (8); వర్షములు = దేశములు; అందున్ = లోను; దేవతా = దేవతల; గణంబులున్ = సమూహములు; తమ = తమ యొక్క; భృత్యు = భక్తుల; వర్గంబులన్ = సమూహములు; అతి = అధికమైన; ఉపాచారములు = సేవలు; చేయుచుండన్ = చేయుచుండగ; ఎల్ల = సమస్తమైన; ఋతువులన్ = ఋతువుల; అందున్ = లోను; కిసలయ = చిగురుటాకులు; కుసుమ = పూలు; ఫల = పండ్లుతో; భరితంబులున్ = నిండినవి; ఐనన్ = అయినట్టి; లత = లతలు; ఆదుల = మొదలగువాటితో; శోభితంబులున్ = శోభిల్లుతున్నవి; అగు = అయినట్టి; వనంబులున్ = అడవులు; కల = కలిగిన; వర్షనిధి = సరోవరములు {వర్షనిధి - వర్షపు నీటికి నిధివంటిది, సరస్సు}; గిరిద్రోణుల = కొండపల్లములు, కుంటలు; అందునున్ = లోను; వికచ = వికసించిన; వివిధ = అనేక రకముల; నవ = తాజా; కమల = కలువలతో; ఆమోదితంబులు = సంతృప్తి చెందినవి; అగు = అయినట్టి; రాజహంసలు = రాయంచలు; కలహంసలు = కలహంసలు; కల = కలిగిన; సరోవరంబుల = సరస్సుల; అందున్ = లో; జలకుక్కుట = నీటికోళ్ళు; కారండవ = కారండవములు; సారస = బెగ్గురు పక్షులు; చక్రవాక = చక్రవాక పక్షులు; ఆది = మొదలగువాటి; వినోదంబులు = సంతోషములు; కలిగి = ఉండి; మత్త = మదించిన; అళి = తుమ్మెదల; ఝంకృతిన్ = ఝంకారములుచేత; మనోహరంబులు = బహు చక్కగ నైనవి; ఐ = అయ్యి; నానా = అనేక; విధంబులు = విధములు; అయిన = అయిన; కొలంకుల = కొలనుల; అందునున్ = లోను; దేవాంగనల = దేవతాస్త్రీల; కామ = కామమును; ఉద్రేకజంబులు = ప్రేరేపించునవి; అయిన = అయిన; విలాస = విలాసములు; హాస = నవ్వులు; లీలా = క్రీడలు; అవలోకనంబులన్ = చూపులచే; తివియంబడిన = ఆకర్షించబడిన; మనః = మనసులు; దృష్టులు = చూపులు; కల = కలిగిన; దేవ = దేవతల; గణంబులున్ = సమూహములు; విచిత్ర = విచిత్రములైన; వినోదంబులు = వేడుక లందు; తగిలి = తగుల్కొని; ఇచ్చా = ఇష్టము వచ్చినట్లు; విహారంబులు = తిరుగుటలు; సలుపుచుండుదురు = చేయుచుందురు;

భావము:

ఇంకా ఈ ఎనిమిది వర్షాలలో ఉన్నవారు సురత సుఖానంద పరవశులై మోక్షాన్ని సైతం కోరుకోరు. అక్కడి స్త్రీలు ఎప్పుడైనా ఒకసారి మాత్రమే బిడ్డలను కంటూ ఉంటారు. అక్కడ ఎల్లప్పుడూ త్రేతాయుగమే ప్రవర్తిస్తూ ఉంటుంది. ఈ ఎనిమిది వర్షాలలోను దేవతలు తమ సేవకులు చేసే ఉపచారాలను గ్రహిస్తూ విహరిస్తూ ఉంటారు. అన్ని ఋతువులలోను చివుళ్ళతో, పువ్వులతో, ఫలాలతో నిండిన తీగెలు, వృక్షాలు గల వనాలు అక్కడ ఉంటాయి. సరోవరాలలో వికసించిన పద్మాలు ఉంటాయి. ఆ పద్మాల పరిమళం ఆఘ్రాణిస్తూ రాజహంసలు, కలహంసలు విహరిస్తూ ఉంటాయి. నీటికోళ్ళు, కొక్కెరలు, బెగ్గురు పక్షులు, జక్కవలు కొలకులలో ఈదులాడుతూ ఉంటాయి. మత్తెక్కిన తుమ్మెదలు ఝంకారాలు చేస్తుంటాయి. అటువంటి వనాలలో, సరస్సులలో, కొండ లోయలలో దేవతాస్త్రీలు విహరిస్తూ విలాసంగా ఆడుతూ, పాడుతూ, పకపక నవ్వుతూ, ప్రక్కచూపులు చూస్తూ, కామేద్రేకం కలిగిస్తూ సంచరిస్తూ ఉంటారు. వారి విలాస చేష్టలకు ఆకర్షితులైన పురుషులు అక్కడ స్వేచ్ఛావిహారాలు చేస్తుంటారు.

5.2-37-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వవర్షంబుల యం
దా నారాయణుఁడు వచ్చి నవరతము లో
కానుగ్రహమునకై సు
జ్ఞానం బీఁ దలఁచి లీలఁ రియించుఁ దగన్.

టీకా:

ఈ = ఆ; నవ = తొమ్మిది {నవవర్షములు - భారతాది, 1భారతము 2రమ్యకము 3కింపురుషము 4హరి 5భద్రాశ్వము 6కురువు 7హిరణ్మయము 8ఇలావృతము 9కేతుమూలము}; వర్షంబు = వర్షముల; అందున్ = లోను; ఆ = ఆ; నారాయణుడు = విష్ణువు; వచ్చి = అవతరించి; అనవరతంబున్ = ఎల్లప్పుడు; లోకాన్ = లోకములను; అనుగ్రహమున్ = అనుగ్రహించుట; కై = కొరకు; సు = మంచి; జ్ఞానంబున్ = జ్ఞానమును; ఈన్ = ఇయ్య వలెన నని; తలచి = భావించి; లీలన్ = క్రీడగా; చరియించున్ = వర్తించును; తగన్ = అవశ్యము;

భావము:

ఈ తొమ్మిది వర్షాలలోను జీవులకు సరియైన జ్ఞానం అనుగ్రహించడం కోసం నారాయణుడు అనేక లీలావిలాసాలు ప్రదర్శిస్తూ సంచరిస్తూ ఉంటాడు.

5.2-38-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సుధ నిలావృత ర్షాధిపతి యైన-
పురహరుం డా వర్షమున వనంబు
నందు నుండుటకు నా యంబికాశాప వ-
శంబున నా వనస్థలములందు
నెవ్వరు వచ్చిన నింతులై యుందు రా-
నమందుఁ బార్వతి నుదినంబు
నంగనాజన సహస్రార్బుదంబులతోడ-
సమలోచనుఁ గొల్చు తుల భక్తి

5.2-38.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్టి శివునిఁ గోరి యా యిలావృతవర్ష
మునఁ జరించు జనులు మోదమునను
దిసి తత్ప్రకాశములైన మంత్ర తం
త్రములఁ బూజ జేసి లఁతు రెపుడు.

టీకా:

వసుధన్ = భూమిపైన; ఇలావృతవర్ష = ఇలావృతవర్షమునకు; అధిపతి = అధిదేవత; ఐనన్ = అయినట్టి; పురహరుండు = శివుడు {పురహరుడు - పురములను దేహముల హరించువాడు, త్రిపురములను కూల్చినవాడు, శివుడు}; ఆ = ఆ; వర్షమునన్ = దేశములో; వనంబున్ = అడవి; అందున్ = లే; ఉండుట = ఉండుట; కున్ = వలన; ఆ = ఆ; అంబికా = పార్వతీదేవి; శాప = శాపము; వశంబునన్ = కారణముచేత; ఆ = ఆ; వన = అడవి; స్థలములు = ప్రదేశముల; అందున్ = లో; ఎవ్వరున్ = ఇతరులు ఎవరైనను; వచ్చిన = ప్రవేశించిన; ఇంతుల = స్త్రీలు; ఐ = అయ్యి; ఉందురు = పోతారు; ఆ = ఆ; వనమున్ = వనము; అందున్ = లో; పార్వతి = పార్వతీదేవి; అనుదినంబున్ = ప్రతిదినము; అంగనాజన = స్త్రీ జనములు; సహస్రఅర్బుదంబుల = మహాఖర్వము, 1013; తోడన్ = తోటి; అసమానలోచనున్ = శివుని {అసమానలోచనుడు - అసమాన (ఎగుడు దిగుడు)గా లోచనుడు (కన్నులు ఉన్నవాడు), శివుడు}; కొల్చున్ = సేవించును; అతుల = సాటిలేని; భక్తిన్ = భక్తితో; అట్టి = అటవంటి;
శివునిన్ = పరమశివుని {శివుడు - శుభకరుడు, శంకరుడు}; కోరి = కోరి; ఆ = ఆ; ఇలావృతమునన్ = ఇలావృతవర్షమున; చరించు = తిరుగుతుండెడి; జనులు = ప్రజలు; మోదముననున్ = సంతోషముతో; కదిసి = చేరి; తత్ = అతని; ప్రకాశకములు = ప్రసిద్దములు; ఐనన్ = అగు; మంత్ర = మంత్రములు; తంత్రములన్ = తంత్రములచే; పూజజేసి = పూజించి; తలతురు = స్మరింతురు; ఎపుడున్ = ఎల్లప్పుడు;

భావము:

ఇలావృత వర్షానికి త్రిపురాసుర సంహారకుడైన శివుడు అధిపతి. ఆ ఇలావృత వర్షంలో పార్వతీదేవి విహరించే ఉద్యానవనం ఉంది. పార్వతి శాపం వల్ల ఆ వనంలోనికి పురుషు లెవరైనా ప్రవేశిస్తే స్త్రీలుగా మారుతారు. అక్కడ పార్వతీదేవి వేలకొలది చెలికత్తెలతో వచ్చి ప్రతినిత్యం పరమేశ్వరుణ్ణి పరమభక్తితో సేవిస్తూ ఉంటుంది. ఆ ఇలావృతవర్షంలోని జనులు ఎంతో సంతోషంతో ఆయా మంత్ర తంత్రాలతో పరమేశ్వరుణ్ణి పూజించి సదా సంస్మరించి తరిస్తూ ఉంటారు.

5.2-39-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ద్రాశ్వవర్షమందుల
ద్రశ్రవు డనెడి పేరఁ రఁగుచుఁ దపనీ
యాద్రిసమ ధైర్యుఁ డగుచు స
ముద్రాంతంబైన జగతిఁ బొలుపుగ నేలున్.

టీకా:

భద్రాశ్వవర్షము = భద్రాశ్వవర్షము; అందులన్ = లో; భద్రశ్రవుడు = భద్రశ్రవుడు; అనెడి = అనెడి; పేరన్ = పేరుతో; పరగుచున్ = ప్రసిద్ధమగుచు; తపనీయాద్రి = మేరు పర్వతముతో {తపనీయాద్రి - తపసు చేసుకొన తగినట్టి అద్రి, మేరుపర్వతము}; సమ = సమానమైన; ధైర్యుడు = ధైర్యము గలవాడు; అగుచున్ = అగుచూ; సముద్ర = సముద్రము; అంతంబున్ = సరిహద్దు; ఐనన్ = అయినట్టి; జగతిన్ = భూమిని; పొలుపుగన్ = ఒప్పుగా, స్థైర్యముతో; ఏలున్ = పరిపాలించును;

భావము:

భద్రాశ్వ వర్షానికి భద్రశ్రవుడు అధిపతి. అతడు మేరుపర్వతం వంటి ధైర్యం కలవాడు. అతడు సముద్రాలు హద్దుగా గలిగిన భూమిని పరిపాలించాడు.

5.2-40-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రవరునకుఁ బ్రియతముఁ
డై హయగ్రీవమూర్తి నవరతంబున్
ధ్యాస్తోత్రజపాను
ష్ఠానాదులఁ బూజచేసి జ్జను లంతన్.

టీకా:

ఆ = ఆ; నరవరున్ = రాజు; కున్ = కి; ప్రియతముడు = అత్యంత ఇష్టుడు; ఐన = అయిన; హయగ్రీవ = హయగ్రీవుని; మూర్తిన్ = విగ్రహమును; అనవరతంబున్ = ఎల్లప్పుడు; ధ్యాన = ధ్యానము చేయుట; స్తోత్ర = కీర్తించుట; జప = జపము చేయుట; ఆదులన్ = మొదలగు వాటిచే; పూజచేసి = పూజించి; సత్ = మంచి; జనులు = వారు; అంతన్ = అంతట;

భావము:

ఆ భద్రశ్రవుని ఇష్టదైవమైన హయగ్రీవ మూర్తిని ధ్యానాలతో, జపాలతో, స్తోత్రాలతో, అనుష్ఠానాలతో సజ్జనులు సేవించి తరిస్తూ ఉంటారు.

5.2-41-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

త్ప్రకాశకృత్ప్రధాన మంత్రార్థ సం
సిద్ధిఁ జేసి ముక్తిఁజెంది రప్పు
ట్టి వర్షమందు నా హయగ్రీవునిఁ
లఁచి కొలిచి మిగుల న్యు లగుచు.

టీకా:

తత్ = ఆ; ప్రకాశకృత = ప్రకాశింపజెయునట్టి; ప్రధాన = ముఖ్యమైన; మంత్ర = మంత్రము; అర్థ = పరమార్థము; సంసిద్ధిన్ = చక్కగా సిద్ధించుట; చేసి = వలన; ముక్తిన్ = ముక్తిని; చెందిరి = పొందిరి; అప్పుడు = అప్పుడు; అట్టి = అటువంటి; వర్షము = దేశము; అందున్ = లో; ఆ = ఆ; హయగ్రీవునిన్ = హయగ్రీవుని; తలచి = స్మరించి; కొలచి = సేవించి; మిగులన్ = మిక్కిలిగా; ధన్యులు = ధన్యులు; అగుచున్ = అగుచు;

భావము:

ఆ హయగ్రీవ తత్త్వాన్ని ప్రకాశింపజేసే ప్రధాన మంత్రాల మహిమతో ఆ వర్షంలోని వారు హయగ్రీవుని అర్చించి, స్తుతించి, ధ్యానించి ముక్తిని పొందుతున్నారు.

5.2-42-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రివర్ష పతి యైన రహరి ననిశంబు-
నందున్న జనులు మహాత్ము లయిన
దైత్యదానవ కులోత్తములు ప్రహ్లాదాది-
వృద్ధులఁ గూడి సంప్రీతితోడ
సుస్నాతులై భక్తిఁ జూచుచు నుందురు-
మ్య దుకూలాంబములు దాల్చి
త్ప్రకాశక మంత్రతంత్రజపస్తోత్ర-
ఠన సుధ్యానతపః ప్రధాన

5.2-42.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మైన సత్పూజలనుజేసి చల బుద్ధి
శ్రీ నృసింహునిఁ జేరి పూజించి యతని
రుణ నొందుచు నతుల ప్రకాశు లగుచు
భుక్తి ముక్తులఁ గైకొండ్రు భూపవర్య!

టీకా:

హరివర్ష = హరివర్షమునకు; పతి = ప్రభువు; ఐన = అయిన; నరహరిన్ = నరసింహుని; అనిశంబున్ = ఎల్లప్పుడును; అందున్ = దానిలో; ఉన్న = ఉన్నట్టి; జనులు = ప్రజలు; మహాత్ములు = గొప్పవారు; అయిన = ఐనట్టి; దైత్య = దైత్యుల {దైత్యులు - దితి యొక్క కుమారులు, రాక్షసులు}; దానవ = దానవ; కుల = కులములందు; ఉత్తములు = శ్రేష్ఠులు; ప్రహ్లాద = ప్రహ్లాదుడు; ఆది = మొదలైన; వృద్ధులన్ = పెద్దల; కూడి = తో కలిసి; సంప్రీతిన్ = మిక్కిలి ప్రేమతో; సుస్నాతులు = చక్కగా స్నానములు చేసినవారు; ఐ = అయ్యి; భక్తిన్ = భక్తితో; చూచుచున్ = సేవించుకొనుచు; ఉందురు = ఉంటారు; రమ్య = అందమైన; దుకూల = పట్టు; అంబరములు = బట్టలు; తాల్చి = ధరించి; తత్ = ఆ; ప్రకాశక = ప్రకాశకరములైన; మంత్ర = మంత్రములు; తంత్ర = తంత్రములు; జప = జపములు; స్తోత్ర = స్తుతులను; పఠన = చదువుట; సు = చక్కటి; ధ్యాన = ధ్యానములు; తపస్ = తపస్సులు; ప్రధానము = మొదలగు ముఖ్యము; ఐన = అయినట్టి;
సత్ = సత్యమైన; పూజలనున్ = పూజలను; చేసి = వలన; అచల = చాంచల్యరహితమైన; బుద్ధి = మనసుతో; శ్రీ = శుభకరుడైన; నృసింహునిన్ = నరసింహుని; చేరి = చేరి; పూజించి = కొలచి; అతని = అతని యొక్క; కరుణన్ = దయను; ఒందుచున్ = పొందుతూ; అతుల = సాటిలేని; ప్రకాశులు = ప్రకాశముగలవారు; అగుచున్ = అగుచు; భుక్తి = ఇహలోకార్థమైన జీవికాదులు; ముక్తులన్ = పరలోకార్థమైన మోక్షము; కైకొండ్రు = చేపట్టెదరు; భూపవర్య = మహారాజా {భూపవర్యుడు - భూపు (రాజు)లలో వర్యుడు (ఉత్తముడు), మహారాజు};

భావము:

రాజా! హరివర్షానికి అధిపతి నరసింహుడు. అక్కడున్న జనులు దైత్య దానవ వంశాలలో ఉత్తములైనవారు. వారు ఎల్లప్పుడూ ప్రహ్లాదుడు మొదలైన పెద్దలతో కలిసి స్నానం చేసి శుచులై నరసింహుని సేవిస్తూ ఉంటారు. రమణీయాలైన పట్టుబట్టలు కట్టుకొని ఆ నరసింహ తత్త్వాన్ని ప్రకాశింపజేసే మంత్రం జపిస్తూ, ఆ మంత్రానికి సంబంధించిన తంత్ర కార్యాలను నిర్వహిస్తూ, నరసింహునికి ప్రీతిపాత్రమైన ధ్యానాలు, జపాలు, తపాలు, స్తోత్రాలు చేస్తూ నిలుకడ గల బుద్ధితో స్వామిని సేవిస్తూ ఉంటారు. ఆ స్వామి కరుణకు పాత్రులై ఇహపర సుఖాలను అనుభవిస్తూ ఉంటారు.

5.2-43-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియుఁ గేతుమాల వర్షంబునందు భగవంతుండు శ్రీదేవికి సంతోషంబు నొసంగుటకుఁ గామదేవరూపంబున నుండును; అమ్మహాపురుషుని యస్త్రతేజః ప్రకాశంబునఁ బ్రజాపతి దుహితలగు రాత్ర్యధి దేవతల గర్భంబులు సంవత్సరాంతంబున నిర్జీవంబు లై స్రవించును; ఆ కామదేవుండును దన గతి విలాసలీలావిలోకన సుందర భ్రూమండల సుభగ వదనారవింద కాంతులంజేసి శ్రీరమాదేవిని రమింపం జేయు; భగవన్మాయారూపిణి యగు శ్రీదేవియుఁ బ్రజాపతి పుత్రికలును బుత్రులు నైన రాత్రులం బగళ్ళం గూడి కామదేవుని స్తోత్రపఠన పూజాధ్యానాదులం బూజించుచుండు; మఱియును.

టీకా:

మఱియున్ = ఇంకను; కేతుమాలవర్షంబున్ = కేతుమాలవర్షము; అందున్ = లో; భగవంతుండు = నారాయణుడు; శ్రీదేవి = లక్ష్మీదేవి; కిన్ = కి; సంతోషంబున్ = సంతోషమును; ఒసగుట = ఇచ్చుట; కున్ = కు; కామదేవ = మన్మథుని; రూపంబునన్ = స్వరూపములో; ఉండునున్ = ఉండును; ఆ = ఆ; మహా = పరమ; పురుషునిన్ = పురుషుని యొక్క; అస్త్ర = అస్త్రముల; తేజస్ = తేజస్సు యొక్క; ప్రకాశంబునన్ = ప్రకాశము వలన; ప్రజాపతి = ప్రజాపతి యొక్క; దుహితలు = పుత్రికలు; అగు = అయిన; రాత్రి = రాత్రులకు; అధిదేవతల = అధికారము కల దేవతల యొక్క; గర్భంబులున్ = గర్భములు; సంవత్సర = అహోరాత్రంబుల, సంవత్సరము; అంతంబునన్ = చివరకు; నిర్జీవంబులు = నిర్జీవములు; ఐ = అయ్యి; స్రవించును = స్రవించును; ఆ = ఆ; కామదేవుండునున్ = మన్మథుడును; తన = తన యొక్క; గతి = వర్తన; విలాస = విలాసములు; లీలా = క్రీడలు; విలోకన = దృక్కులు; సుందర = అందమైన; భ్రూమండల = భ్రుకుటి ప్రదేశము; సుభగ = సౌభాగ్యవంతమైన; వదన = మోము అనెడి; అరవింద = పద్మము యొక్క; కాంతులన్ = ప్రకాశములు; చేసి = వలన; శ్రీ = శ్రీ; రమాదేవినిన్ = లక్ష్మీదేవిని; రమింపన్ = సంతోషింప; చేయున్ = చేయును; భగవత్ = భగవంతుని; మాయా = మాయ యొక్క; రూపిణి = రూపము ధరించినామె; అగు = అయిన; శ్రీదేవియున్ = లక్ష్మీదేవికూడ; ప్రజాపతి = ప్రజాపతి యొక్క; పుత్రికలు = కుమార్తెలు; పుత్రులు = కుమారులు; ఐన = అయినట్టి; రాత్రులు = రాత్రులు; పగళ్ళన్ = పగళ్ళతో; కూడి = తో కలసి; కామదేవునిన్ = మన్మథుని; స్తోత్రపఠన = స్తుతించుట; పూజ = పూజలు; ధ్యాన = ధ్యానములు; పూజించుచుండున్ = కొలచుతుండును; మఱియునున్ = ఇంకను;

భావము:

ఇంకా కేతుమాల వర్షంలో భగవంతుడు శ్రీదేవిని సంతోషపెట్టడం కోసం మన్మథరూపంలో సాక్షాత్కరిస్తాడు. ఆ కామదేవుని అస్త్ర ప్రభావం వల్ల ప్రజాపతి కుమార్తెలైన రాత్రులకు అధిదేవతలైనవారి గర్భాలు సంవత్సరకాలం సంరక్షింపబడి నప్పటికీ నిర్జీవములై స్రవిస్తాయి. ఆ కామదేవుని రూపంలో ఉన్న శ్రీహరి తన నడకల సొగసులతో, విలాస వీక్షణాలతో, అందమైన కనుబొమలతో, పద్మాలవంటి మనోహర ముఖ కాంతులతో రమాదేవిని సంతోషపెడతాడు. భగవంతుని మాయకు ప్రతిరూపమైన ఆ శ్రీదేవి కూడా ప్రజాపతి పుత్రికలు, పుత్రులు అయిన రాత్రులతో, పగళ్ళతో కామదేవుణ్ణి స్తుతిస్తూ, పూజలు చేస్తూ, ధ్యానిస్తూ, ఆరాధిస్తూ ఉంటుంది. ఇంకా…

5.2-44-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విలమతిఁ జిత్తగింపుము
ణీయంబైన విమల మ్యక మను వ
ర్షమునకు నధిదేవత దా
రంగా మత్స్యరూపుఁగు హరి దలపన్.

టీకా:

విమల = స్వచ్ఛమైన; మతిన్ = మనసుతో; చిత్తగింపుము = వినుము; రమణీయంబు = మనోహరము; ఐన = అయిన; విమల = నిర్మలమైన; రమ్యకము = రమ్యకవర్షము; అను = అనెడి; వర్షమున = వర్షమున; కున్ = కు; అధిదేవత = ప్రభువు; తాన్ = తను; అమరంగన్ = చక్కగా; = మత్స్య= చేప; రూపుడు = స్వరూపము కలవాడు; అగు = అయిన; హరిన్ = నారాయణుని; తలపన్ = తెలుసుకొనుటకు;

భావము:

రాజా! పరిశుద్ధమైన మనస్సుతో శ్రద్ధగా విను. రమణీయమైన రమ్యక మనే వర్షానికి మత్స్యరూపుడైన హరి అధిదేవత.

5.2-45-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్టి వర్షమునకు ధిపతి యగుచున్న
నువు పుత్రపౌత్ర మంత్రివరులఁ
గూడి మత్స్యమైన కుంభినీధరుఁ జిత్త
తుల భక్తియుక్తి త్తఁ గొలుచు.

టీకా:

అట్టి = అటువంటి; వర్షమున్ = దేశమున; కున్ = కు; అధిపతి = ప్రభువు; అగుచున్న = అయినట్టి; మనువు = మనువు; పుత్ర = కుమారులు; పౌత్ర = మనుమలు; మంత్రి = మంత్రులలో; వరులన్ = ఉత్తములను; కూడి = తో కలిసి; మత్స్యము = మత్స్యావతారము; ఐన = ఎత్తిన; కుంభినీధరున్ = విష్ణుని {కుంభినీధరడు - వరహావతారములో కుంభిని (భూమండలమును) ధరుడు (ధరించిన వాడు), విష్ణువు}; చిత్తము = మనసున; అతుల = మిక్కిలి; భక్తి = భక్తి; యుక్తి = కలిగి; హత్తన్ = హత్తుకొనునట్లు; కొలుచు = సేవించును;

భావము:

ఆ రమ్యక వర్షానికి మనువు అధిపతి. అతడు తన కొడుకులతో, మంత్రులతో మత్స్యరూపుడైన శ్రీహరిని సాటిలేని భక్తితో ఆరాధిస్తూ ఉంటాడు.

5.2-46-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

త్ప్రకాశ కృత్ప్రధాన మంత్రస్తోత్ర
ములను ధర్మకర్మములను హోమ
ములను జనులు చేసి పుణ్యులై భుక్తి ము
క్తును బొందుచుందు రెమితోడ.

టీకా:

తత్ = ఆ; ప్రకాశకృత్ = ప్రకాశమును కలుగజేయునవి యైన; ప్రధాన = ముఖ్యమైన; మంత్ర = మంత్రములు; స్తోత్రములనున్ = స్తుతులను; ధర్మ = ధర్మబద్ధమైన; కర్మములనున్ = ఆచరణలు; హోమములను = హోమక్రియలను; జనులు = ప్రజలు; చేసి = ఆచరించి; పుణ్యులు = పుణ్యవంతులు; ఐ = అయ్యి; భుక్తి = జీవికలు; ముక్తులను = మోక్షములను; పొందుచుందురు = పొందెదరు; ఎలమి = వికాసము; తోడన్ = తోటి;

భావము:

అక్కడి జనులు మత్స్యమూర్తిని ప్రకాశింపజేసే మంత్రాలతో, స్తోత్రాలతో అర్చిస్తూ, ధర్మకార్యాలు నిర్వహిస్తూ, అగ్నికార్యాలు నెరవేరుస్తూ పుణ్యాత్ములై భక్తి ముక్తులను ఆనందంగా అనుభవిస్తారు.

5.2-47-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వినుము; హిరణ్మయ వర్షం
బుకుం గూర్మావతారమును దాల్చిన యా
జోదరుఁ డధిదేవత
ఘుఁడు పితృపతి మహాత్ముఁ ర్యముఁడు నృపా!

టీకా:

వినుము = వినుము; హిరణ్మయవర్షంబున్ = హిరణ్మయవర్షమున; కున్ = కు; కూర్మావతారమునున్ = కూర్మావతారమును; తాల్చిన = ధరించిన; ఆ = ఆ; వనజోదరుడు = నారాయణుడు {వనజోదరుడు - వనజము (పద్మము) ఉదరుడు (ఉదరమున కలవాడు), విష్ణువు}; అధిదేవత = అధికార దేవత; అనఘుడు = పుణ్యుడు; పితృపతి = యముడు {పితృపతి - పితరుల ఱేడు, యముడు}; మహాత్ముడు = మహిమాన్వితుడు; అర్యముడు = సూర్యుడు {అర్యముడు - సూర్యుడు, పితృదేవతలలో ఒకడు}; నృపా = రాజా;

భావము:

రాజా! విను. హిరణ్మయ వర్షానికి కూర్మావతారం ధరించిన ఆ శ్రీహరి అధిదేవత. పాపరహితుడు, పితృదేవతలకు అధిపతి, మహాత్ముడు అయిన ఆర్యముడు దానిని పరిపాలిస్తూ ఉంటాడు.

5.2-48-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర్షమందు నర్యముఁ
డా ర్షజనంబుగూడి రిఁ జిత్తములో
భావించి సంస్తవంబులు
గావించుచుఁ గాంతు రతని కైవల్యంబున్.

టీకా:

ఆ = ఆ; వర్షము = వర్షము, దేశము; అందున్ = లో; అర్యముడు = అర్యముడు; ఆ = ఆ; వర్ష = దేశ; జనంబున్ = ప్రజలతో; కూడి = కలిసి; హరిన్ = నారాయణుని; చిత్తము = మనసు; లోన్ = లోపల; భావించి = ధ్యానించి; సంస్తవంబులు = స్తోత్రములు; కావించుచున్ = చేయుచు; కాంతురు = పొందెదరు; అతని = అతని యొక్క; కైవల్యంబున్ = కైవల్యమును;

భావము:

ఆర్యముడు ఆ హిరణ్మయ వర్షంలోని జనులతో కలిసి కూర్మరూపుడైన శ్రీహరిని మనస్సులో ధ్యానిస్తూ, సంస్తుతిస్తూ భుక్తి ముక్తులను అందుకుంటాడు.

5.2-49-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

త్తర కురుభూములఁ దను
త్తుకొని వరాహదేవుఁ ధిపతియైనన్
త్తుగ భూసతి యతనిం
జిత్తములో నిలిపి పూజ చేయుచు నుండున్.

టీకా:

ఉత్తరకురుభూములన్ = ఉత్తర కురు దేశము లందు; తను = తను; హత్తుకొని = దగ్గరకు తీసుకొని; వరాహదేవుడు = వరహావతారుడు; అధిపతి = అధిదేవత; ఐనన్ = కాగా; సత్తుగన్ = గట్టిగా; భూసతి = భూదేవి; అతనిన్ = అతనిని; చిత్తము = మనసు; లోన్ = లోపల; నిలిపి = నిలుపుకొని; పూజ = కొలచుట; చేయుచునుండున్ = చేయుచుండును;

భావము:

ఉత్తర కురువర్షానికి వరాహదేవుడు అధిపతి. అక్కడ భూదేవి వరాహ రూపుడైన శ్రీహరిని మనస్సులో నిలుపుకొని పూజలు చేస్తుంటుంది.

5.2-50-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర్షమందులను బ్రజ
లా విపుల వరాహమూర్తి నవతరంబున్
సేవించి కొలిచి సంస్తుతిఁ
గావించుచుఁ గాంతు రంతఁ గైవల్యంబున్.

టీకా:

ఆ = ఆ; వర్షము = వర్షము, దేశము; అందులను = లో; ప్రజలు = జనులు; ఆ = ఆ; విపుల = భూదేవి సహిత; వరాహమూర్తిన్ = యజ్ఞవరాహమును; అనవరతంబున్ = ఎడతెగక; సేవించి = పూజించి; కొలిచి = ధ్యానించి; సంస్తుతిన్ = చక్కగా స్తుతించుటను; కావించుచున్ = చేయుచు; కాంతురు = పొందెదరు; అంతన్ = అంతట; కైవల్యంబున్ = మోక్షమును;

భావము:

ఆ ఉత్తర కురువర్షంలోని ప్రజలు వరాహమూర్తిని అనుదినమూ సేవిస్తూ, సంభావిస్తూ, సంస్తుతులు గావిస్తూ మోక్షపదాన్ని చేరుకొంటారు.

5.2-51-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యఁగ సీతాలక్ష్మణ
రివృతుఁడై వచ్చి రామద్రుఁడు గడిమిం
రఁగు నధిదేవతగఁ గిం
పురుష మహావర్షమునకు భూపవరేణ్యా!

టీకా:

అరయగన్ = చూడగా; సీతా = సీతయు; లక్ష్మణ = లక్ష్మణుడు; పరివృతుండు = చుట్టును ఉన్నవాడు; ఐ = అయ్యి; వచ్చి = చేరి; రామభద్రుడు = శ్రీరాముడు; కడిమిన్ = అతిశయముతో; పరగున్ = ప్రసిద్ధ మగు; అధిదేవతగన్ = అధిదేవతగ; కింపురుష = కింపురుషము యనెడి; మహా = గొప్ప; వర్షమున్ = వర్షమున; కున్ = కు; = భుపవరేణ్య = మహారాజా {భూపవరేణ్యుడు - భూప (రాజు)లలో వరేణ్యుడు (ముఖ్యుడు), మహారాజు};

భావము:

ఓ పరీక్షిన్మహారాజా! కింపురుష వర్షానికి సీతా లక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రుడు అధిదేవత.

5.2-52-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్టి రామభద్రు నంజనీసుతుఁడు గిం
పురుషగణముఁ గూడి పూజ చేసి
త్ప్రకాశకప్రధాన మంత్రస్తోత్ర
ఠనములను దగ నుప్రాస్తి సేయు.

టీకా:

అట్టి = అటువంటి; రామభద్రున్ = శ్రీరాముని; అంజనీసుతుడు = ఆంజనేయుడు {అంజనీ సుతుడు - అంజనీదేవి యొక్క పుత్రుడు, ఆంజనేయుడు}; కింపురుష = కింపురుషుల; గణమున్ = సమూహముతో; కూడి = కలిసి; పూజ = కొలచుట; చేసి = చేసి; తత్ = అతనిని; ప్రకాశక = ప్రకాశము కలిగించెడు; ప్రధాన = ముఖ్య; మంత్ర = మంత్రములు; స్తోత్ర = స్తుతులను; పఠనములనున్ = చదువుటలను; తగన్ = అవశ్యము; ఉప్రాస్తిజేయు = సేవ చేయును;

భావము:

అటువంటి కింపురుష వర్షంలో అంజనాదేవి కుమారుడైన ఆంజనేయుడు కింపురుష గణాలతో కూడి మహనీయాలైన మంత్ర స్తోత్రాలతో శ్రీరామచంద్రుని ఆరాధిస్తూ ఉంటాడు.

5.2-53-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భారతవర్షాధితియైన బదరికా-
శ్రమమున నున్న నారాయణుండు
భూనాథ! యా మహాత్ముని నారదాదులు-
భారతవర్షంబు ప్రజలఁ బ్రేమ
బాయక చేరి యుపాస్తి చేయుచు సాంఖ్య-
యోగంబు నుపదేశ ముచితవృత్తి
నంది యందఱును గృతార్థులై యట్టి నా-
రాయణదేవు నారాధనంబు

5.2-53.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చేసి యాత్మఁ జాలఁ జింతించి తత్ప్రకా
కము లయిన మంత్ర సంస్తవములఁ
బూజ చేసి ముక్తిఁ బొందుచు నుండుదు
చలమైన భక్తి నుదినంబు,

టీకా:

భారతవర్ష = భరతవర్షమునకు; అధిపతి = అధిదేవత; ఐన = అయిన; బదరికాశ్రమమునన్ = బదరికాశ్రమములో; ఉన్న = ఉన్నట్టి; నారాయణుండు = విష్ణుని; భూనాథ = రాజా; ఆ = ఆ; మహాత్ముని = మహాత్ముడిని; నారద = నారదుడు; ఆదులు = మొదలగువారు; భారతవర్షంబు = భరతవర్షమును; ప్రజలన్ = (అందలి) జనులను; ప్రేమన్ = ప్రేమతో; పాయక = విడువక; చేరి = కలిసి; ఉపాస్తి = ఆరాధించుట; చేయుచున్ = చేయుచు; సాంఖ్యయోగంబున్ = సాంఖ్యయోగమును; ఉపదేశము = ఉపదేశము {ఉపదేశము - సాధికారముగ అనువర్తనకు నేర్పుట}; ఉచిత = తగిన; వృత్తిన్ = విధముగ; అంది = పొంది; = అందఱునున్ = సర్వులు; కృతార్థులు = ధన్యులు {కృతార్థుడు - కృత (నెరవేరిన) అర్థుడు (ప్రయోజనము గలవాడు), ధన్యుడు}; ఐ = అయ్యి; అట్టి = అటువంటి; నారాయణ = నారాయణుడను; దేవున్ = దేవుని; ఆరాధనంబున్ = పూజించుట;
చేసి = చేసి; ఆత్మన్ = మనసున; చాలన్ = అధికముగ; చింతించి = ఆలోచించి; తత్ = అతనిని; ప్రకాశకములు = ప్రకాశము కలిగించునవి; అయిన = ఐన; మంత్ర = మంత్రములు; సంస్తవములన్ = స్తోత్రములను; పూజన్ = కొలచుట; చేసి = చేసి; ముక్తిన్ = ముక్తిని; పొందుచునుండుదురు = పొందుతుందురు; అచలము = చలించనిది; ఐన = అయినట్టి; భక్తిన్ = భక్తితో; అనుదినంబున్ = ప్రతిదినము;

భావము:

భారతవర్షానికి బదరికాశ్రమవాసి అయిన నారాయణుడు అధిపతి. ఈ భారతవర్షంలోని వారు మహాత్ములైన నారదాది మునుల సాంగత్యంతో సాంఖ్యయోగాన్ని ఉపదేశంగా పొంది తమ జన్మలను సార్థకం చేసుకొంటారు. నారాయణ దేవుణ్ణి ఆరాధించి ఆ దేవునికి ప్రియమైన మంత్ర స్తోత్రాదులతో పూజలు చేస్తారు. భక్తితో మ్రొక్కి ముక్తి దక్కించుకొంటారు.

5.2-54-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భాతవర్షము నందుల
సారాంశములైన పుణ్య శైలంబులు గం
భీప్రవాహములుఁ గల
వాయ నెఱిఁగింతు వాని వనీనాథా!

టీకా:

భారతవర్షమున్ = భరతవర్షము; అందులన్ = లో; సారాంశములు = సారవంతములు; ఐన = అయినట్టి; పుణ్య = పుణ్యవంతము లైన; శైలంబులు = పర్వతములు; గంభీర = లోతైన; ప్రవాహములు = నదీనదములు; కలవు = ఉన్నవి; ఆరయన్ = వివరముగ; ఎఱిగింతు = తెలిపెద; వానినిన్ = వాటిని; అవనీనాథ = రాజా;

భావము:

రాజా! భారతవర్షంలో లెక్కలేనన్ని పుణ్యపర్వతాలు ఉన్నాయి. అంతేకాక లోతయిన నదీప్రవాహాలు కూడా ఉన్నాయి. వాటి విశేషాలను తెలియజేస్తాను.

5.2-55-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మలయపర్వతంబును, మంగళప్రస్థంబును, మైనాకంబును, ద్రికూటంబును, ఋషభపర్వతంబును, గూటరంబును, గోల్లంబును, సహ్యపర్వతంబును, వేదగిరియును, ఋష్యమూకపర్వతంబును, శ్రీశైలంబును, వేంకటాద్రియును, మహేంద్రంబును, వారిధరంబును, వింధ్య పర్వతంబును, శుక్తిమత్పర్వతంబును, ఋక్షగిరియును, బారియాత్రంబును, ద్రోణపర్వతంబును, చిత్రకూటంబును, గోవర్ధనాద్రియును, రైవతకంబును, గుకుంభంబును, నీలగిరియును, గాకముఖంబును, నింద్రకీలంబును, రామగిరియును నాదిగాఁ గల పుణ్య పర్వతంబు లనేకంబులు గలవా పర్వతపుత్రిక లైన చంద్రవటయు, దామ్రపర్ణియు, నవటోదయుఁ, గృతమాలయు, వైహాయసియుఁ, గావేరియు, వేణియుఁ, బయస్వినియుఁ, బయోదయు, శర్కరావర్తయుఁ, దుంగభద్రయుఁ, గృష్ణవేణియు, భీమరథియు, గోదావరియు, నిర్వింధ్యయుఁ, బయోష్ణయుఁ, దాపియు, రేవానదియు, శిలానదియు, సురసయుఁ, జర్మణ్వతియు, వేదస్మృతియు, ఋషికుల్యయుఁ, ద్రిసమయుఁ, గౌశికియు, మందాకినియు, యమునయు, సరస్వతియుఁ, దృషద్వతియు, గోమతియు, సరయువును, భోగవతియు, సుషుమయు, శతద్రువును, జంద్రభాగయు, మరుద్వృథయు, వితస్తయు, నసిక్నియు, విశ్వయు నను నీ మహానదులును, నర్మద, సింధువు, శోణ యను నదంబులును నైన మహా ప్రవాహంబు లీ భారతవర్షంబునఁ గల; వందు సుస్నాతులైన మానవులు ముక్తిం జెందుదురు; మఱియు నీ భారత వర్షంబున జన్మించిన పురుషులు శుక్ల లోహిత కృష్ణవర్ణ రూపంబు లగు త్రివిధ కర్మంబులంజేసి క్రమంబుగ దేవ మనుష్య నరక గతులను త్రివిధ గతులం బొందుదురు; వినుము; రాగద్వేషాది శూన్యుండు, నవాఙ్మానసగోచరుండు, ననాధారుండు నగు శ్రీవాసుదేవమూర్తి యందుఁ జిత్తంబు నిలిపి భక్తియోగంబున నారాధించెడు మహాత్ముల విద్యాగ్రంథి దహనంబు గావించుట జేసి పరమ భాగవతోత్తములు పొందెడు నుత్తమగతిం జెందుదురు; కావున భారత వర్షంబు మిగుల నుత్తమం బని మహాపురుషు లిట్లు స్తుతించు చుండుదురు;

టీకా:

మలయపర్వతంబునున్ = మలయపర్వతము; మంగళప్రస్థంబునున్ = మంగళప్రస్థపర్వతము; మైనాకంబును = మైనాకపర్వతము; త్రికూటంబునున్ = త్రికూట పర్వతము; ఋషభపర్వతంబునున్ = ఋషభపర్వతమును; కూటరంబునున్ = కూటర పర్వతము; గోల్లంబునున్ = గోల్హపర్వతము; సహ్యపర్వతంబును = సహ్యాద్రి; వేదగిరియును = వేదగిరి; ఋష్యమూకపర్వతంబునున్ = ఋష్యమూకపర్వతము; శ్రీశైలంబునున్ = శ్రీశైలము; వెంకటాద్రియునున్ = వెంకటాద్రి; మహేంద్రంబునున్ = మహేంద్రగిరి; వారిధరంబునున్ = వారిధరపర్వతము; వింద్యపర్వతంబునున్ = వింధ్యపర్వతములును; శుక్తిమత్పర్వతంబునున్ = శుక్తిమత్ పర్వతములును; ఋక్షగిరియును = ఋక్షగిరి; పారియాత్రంబునున్ = పారియాత్ర పర్వతములు; ద్రోణపర్వతంబునున్ = ద్రోణాచలము; చిత్రకూటంబును = చిత్రకూటము; గోవర్ధనాద్రియును = గోవర్ధనగిరి; రైవతకంబునున్ = రైవతక పర్వతములు; కుకుంభంబును = కుకుంభగిరులు; నీలగిరియును = నీలగిరి; కాకముఖంబును = కాకముఖ కొండలు; ఇంద్రకీలంబును = ఇంద్రకీలాద్రి; రామగిరియును = రామగిరి; ఆదిగా = మొదలగునవియై; కల = ఉన్నట్టి; పుణ్య = పుణ్యవంతములైన; పర్వతంబులు = పర్వతములు; అనేకంబులు = లెక్కకు మిక్కిలి; కలవు = ఉన్నవి; ఆ = ఆ; పర్వత = పర్వతముల యొక్క; పుత్రికలు = పుట్టినవి; ఐన = అయిన; చంద్రపటయున్ = చంద్రవటము; తామ్రపర్ణియున్ = తామ్రపర్ణి; అవటోదయయున్ = అవటోదయ; కృతమాలయున్ = కృతమాల; వైహాయసియున్ = వైహాయసి; కావేరియున్ = కావేరి; వేణియున్ = వేణీ; పయస్వియున్ = పయస్వి; పయోదయున్ = పయోద; శర్కరావర్తయున్ = శర్కరావర్తి; తుంగభద్రయున్ = తుంగభద్ర; కృష్ణవేణియున్ = కృష్ణవేణి; భీమరథియున్ = భీమరథి; గోదావరియున్ = గోదావరి; నిర్వింధ్య = నిర్వింధ్య; పయోష్ణియున్ = పయోష్ణి; తాపియున్ = తాపి; రేవానదియున్ = రేవానది; శిలానదియున్ = శిలానది; సురసయున్ = సురస; చర్మణ్వతియున్ = చర్మణ్వతి; వేదవతియున్ = వేదవతి; ఋషికుల్యయున్ = ఋషికుల్య; త్రిసమయున్ = త్రిసమ; కౌశికియున్ = కౌశికి; మందాకినియున్ = మందాకిని; యమునయున్ = యమున; సరస్వతియున్ = సరస్వతి; తృషద్వతియున్ = తృషద్వతి; గోమతియున్ = గోమతి; సరయువునున్ = సరయువు; భోగవతియున్ = భోగవతి; సుషుమయున్ = సుషుమ; శతధ్రువును = శతధ్రువ; చంద్రభాగయున్ = చంద్రభాగ; మరుద్వృథయున్ = మరుద్వృథ; వితస్తయును = వితస్త; అసిక్నియున్ = అసిక్ని; విశ్వ = విశ్వ; అను = అనెడి; ఈ = ఈ; మహా = గొప్ప; నదులునున్ = నదులు {నదులు - తూర్పునకు ప్రవహించు ప్రవాహములు}; నర్మద = నర్మద; సింధువు = సింధు; శోణ = శోణ; అను = అనెడి; నదంబులునున్ = నదములు {నదములు - పడమరకు ప్రవహించు ప్రవాహములు}; ఐన = అయిన; మహా = గొప్ప; ప్రవాహంబులు = నదీనదములు; ఈ = ఈ; భారతవర్షంబునన్ = భరతవర్షము నందు; కలవు = ఉన్నవి; అందున్ = వాటిలో; స్నాతులు = స్నానము చేసినవారు; ఐన = అయిన; మానవులు = మనుషులు; ముక్తిన్ = ముక్తిని; చెందుదురు = పొందుదురు; మఱియున్ = ఇంకను; ఈ = ఈ; భారతవర్షంబునన్ = భారతవర్షమున; జన్మించిన = పుట్టిన; పురుషులు = జనులు; శుక్ల = తెల్లని; లోహిత = ఎఱ్ఱని; కృష్ణ = నల్లని; వర్ణ = రంగులు కలిగిన; రూపంబులు = రూపములు; అగు = కలిగి; త్రి = మూడు (3) {త్రివిధకర్మములు – సత్త్వ రజోతమో గుణములు కలిగిన కర్మములు}; విధ = విధములైన; కర్మములన్ = కర్మల; చేసి = వలన; క్రమంబుగన్ = వరుసగా; దేవ = దేవలోక; మనుష్య = మానవలోక; నరక = నరకలోక; గతులు = జన్మాంతర ప్రాప్తములు; అను = అనెడి; త్రి = మూడు (3); విధ = రకముల; గతులన్ = జన్మాంతర ప్రాప్తములు; పొందుదురు = పొందెదరు; వినుము = వినుము; రాగద్వేషాదిశూన్యుండు = నారాయణుడు {రాగ ద్వేషాది శూన్యుడు - రాగము ద్వేషము లాంటివి లేనివాడు, విష్ణువు}; అవాఙ్మానసగోచరుండు = నారాయణుడు {అవాఙ్మానస గోచరుడు - వాక్కు (వర్ణించుటకు) మానస (ఊహించుటకు) అగోచరుండు (అందనివాడు), విష్షువు}; అనాధారుండును = నారాయణుడు {అనాధారుడు - వేరు ఆధారము అవసరములేని వాడు, విష్ణువు}; అగు = అయిన; శ్రీ = శుభకరుడైన; వాసుదేవమూర్తి = శ్రీకృష్ణుని {వాసుదేవమూర్తి - వాసుదేవ (వసుదేవుని పుత్రుడు) యొక్క మూర్తి (విగ్రహము), శ్రీకృష్ణుడు}; అందున్ = ఎడల; చిత్తంబున్ = మనసును; నిలిపి = లగ్నముచేసి; భక్తియోగంబునన్ = భక్తియోగముతో; ఆరాధించెడు = కొలిచెడు; మహాత్ములు = గొప్పవారు; అవిద్యాగ్రంథి = అవిద్య అనెడి ముడి; దహనంబున్ = నాశనము; కావించుటన్ = చేయుట; చేసి = వలన; పరమ = అత్యుత్తమ; భాగవత = భాగవతులలో; ఉత్తములు = శ్రేష్ఠులు; పొందెడున్ = పొందెడి; ఉత్తమ = ఉత్తమమైన; గతిన్ = గతిని; చెందుదరు = పొందెదరు; కావునన్ = అందుచేత; భారతవర్షంబున్ = భారతవర్షమున; మిగులన్ = అధికముగ; ఉత్తమంబు = ఉత్తమమైనది; అని = అని; మహా = గొప్ప; పురుషులు = మానవులు; ఇట్లు = ఈ విధముగ; స్తుతించుచుందురు = కీర్తించుతుందురు;

భావము:

భారతవర్షంలో మలయం, మంగళప్రస్థం, మైనాకం, త్రికూటం, ఋషభం, కూటరం, గోల్లం, సహ్యాద్రి, వేదాద్రి, ఋశ్యమూకం, శ్రీశైలం, వేంకటాద్రి, మహేంద్రగిరి, మేఘపర్వతం, వింధ్యపర్వతం, శుక్తిమంతం, ఋక్షగిరి, పారియాత్రం, ద్రోణగిరి, చిత్రకూటం, గోవర్ధనం, రైవతకం, కుకుంభం, నీలగిరి, కాకముఖం, ఇంద్రకీలం, రామగిరి మొదలైనవి ప్రసిద్ధ పర్వతాలు. ఆ పర్వతాలకు పుత్రికల వంటివైన చంద్రవట, తామ్రపర్ణి, అవటోద, కృతమాల, వైహాయసి, కావేరి, వేణి, పయస్విని, పయోద, శర్కరావర్త, తుంగభద్ర, కృష్ణవేణి, భీమరథి, గోదావరి, నిర్వింధ్య, పయోష్ణ, తాపి, రేవా, శిలా, సురస, చర్మణ్వతి, వేదస్మృతి, ఋషికుల్య, త్రిసమ, కౌశికి, మందాకిని, యమున, సరస్వతి, దృషద్వతి, గోమతి, సరయువు, భోగవతి, సుషమ, శతద్రువు, చంద్రభాగ, మరుద్వృథ, వితస్త, అసిక్ని, విశ్వ మొదలైనవి ప్రధానమైన నదులు. నర్మద, సింధు, శోణ అనేవి నదాలు. ఇటువంటి మహానదులు భారతవర్షంలో ఎన్నో ఉన్నాయి. వీటిలో స్నానం చేసిన మానవులకు ముక్తి కరతలామలకం. ఈ భారతవర్షంలో పుట్టిన మానవులు మూడు విధాలైన కర్మలను చేస్తుంటారు. కొన్ని తెల్లనివి, కొన్ని ఎఱ్ఱనివి, కొన్ని నల్లనివి. తెల్లనివి సత్త్వగుణ ప్రధానమైన కర్మలు. ఎఱ్ఱనివి రజోగుణ ప్రధానమైన కర్మలు. నల్లనివి తమోగుణ ప్రధానమైన కర్మలు. ఇటువంటి కర్మల కారణంగా భారతవర్షంలో పుట్టిన ప్రజలు క్రమంగా దేవలోకం, మానవలోకం, నరకలోకం చేరుకొంటారు. ఇంకా విను. రాగద్వేషాలు లేనివాడు, వాక్కులకు కాని మనస్సుకు కాని అందనివాడు, సర్వానికి తానే ఆధారమైనవాడు అయిన శ్రీవాసుదేవమూర్తియందు హృదయం పదిలంగా నిలుపుకొని భక్తితో ఆరాధించేవారు ఉత్తమగతిని తప్పక పొందుతారు. అటువంటి మహాత్ములు అజ్ఞానం రూపుమాసి పోగా పరమ భాగవతులు పొందే పుణ్యలోకాలకు యోగ్యు లవుతారు. అందువల్ల మహాపురుషులు భారతవర్షం ఉత్తమోత్తమ మైనదని ఈ విధంగా కొనియాడుతూ ఉంటారు.

5.2-56-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భాతవర్ష జంతువుల భాగ్యము లేమని చెప్పవచ్చు? నీ
భాతవర్షమందు హరి ల్మఱుఁ బుట్టుచు జీవకోటికిన్
ధీతతోడఁ దత్త్వ ముపదేశము చేయుచుఁ జెల్మి జేయుచు
న్నాయ బాంధవాకృతిఁ గృతార్థులఁ జేయుచునుండు నెంతయున్.

టీకా:

భారతవర్ష = భారతవర్షపు; జంతువుల = ప్రాణుల; భాగ్యములు = అదృష్టములు; ఏమని = ఎంతయో ఎలా; చెప్పవచ్చును = చెప్పగలము; ఈ = ఈ; భారతవర్షమున్ = భారతవర్షము; అందున్ = లో; హరి = నారాయణుడు; పల్మఱు = అనేక సార్లు; పుట్టుచున్ = అవతరించుతూ; జీవ = ప్రాణుల; కోటి = సమస్తమున; కిన్ = కు; ధీరత = ధీశక్తి; తోడన్ = తోటి; తత్త్వము = తత్త్వమును; ఉపదేశము = ఉపదేశించుట; చేయుచున్ = చేయుచు; చెల్మి = చెలిమి, స్నేహము; చేయుచున్ = చేయుచూ; ఆరయన్ = తరచి చూసిన; బాంధవ = బంధువు; ఆకృతిన్ = వలె; కృతార్థులన్ = ధన్యులను; చేయుచుండును = చేయుచుండును; ఎంతయున్ = అధికముగ;

భావము:

భారతవర్షంలో పుట్టిన జీవుల అదృష్టమే అదృష్టం. ఈ భారతవర్షంలోనే శ్రీమన్నారాయణుడు ఎన్నో అవతారాలను ఎత్తాడు. ఇందలి మానవులకు తత్త్వం ఉపదేశించాడు. వారితో స్నేహం చేసాడు. ఆత్మబంధువు వలె జీవుల కష్టసుఖాలలో భాగం పంచుకొని వారిని కృతార్థులను చేసాడు.

5.2-57-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జన్మ కర్మములనుం
గొనియాడెడివారికెల్లఁ గోరిన వెల్లం
నియఁగ నొసఁగుచు మోక్షం
యముఁ గృపచేయుఁ గృష్ణు వనీనాథా!

టీకా:

తన = తన యొక్క; జన్మ = అవతారములు; కర్మములనున్ = ఆచరణలను; కొనియాడెడి = కొనియాడు; వారి = వారల; కిన్ = కు; ఎల్లన్ = అందరకు; కోరినవి = మనోరథములను; ఎల్లన్ = అన్నిటిని; తనియన్ = తనివి తీరునట్లుగ; ఒసగుచున్ = ఇచ్చుచును; = మోక్షంబు = మోక్షమును; అనయమున్ = తప్పక; కృపచేయు = దయతో కలుగజేయును; కృష్ణుడు = శ్రీకృష్ణుడు; అవనీనాథా = రాజా {అవనీనాథడు - అవని (భూమికి) నాథుడు (ప్రభువు), రాజు};

భావము:

రాజా! కృష్ణుడు తన అవతారాలను, లీలా విలాసాలను కొనియాడే వారికి అందరికీ కోరిన వరాలన్నీ ప్రసాదిస్తాడు. మోక్షాన్ని కూడా అనుగ్రహిస్తాడు.

5.2-58-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు భారత వర్షంబునందుల జనంబులకు నెద్దియు నసాధ్యంబు లేదు; నారాయణ స్మరణంబు సకల దురితంబుల నడంచు; తన్నామస్మరణ రహితంబులైన యజ్ఞ తపో దానాదులు దురితంబుల నడంప లేవు; బ్రహ్మకల్పాంతంబు బ్రదికెడి యితర స్థానంబునం బునర్జన్మ భయంబున భీతిల్లుచు నుండుటకన్న భారతవర్షంబు నందు క్షణమాత్రంబు మనంబున సర్వసంగపరిత్యాగంబు చేసిన పురుషశ్రేష్ఠునకు శ్రీమన్నారాయణ పదప్రాప్తి యతి సులభంబుగ సంభవించుం; గావున నట్టి యుత్తమంబగు నీ భారతవర్షంబె కోరుచుండుదురు; మఱియు నెక్కడ వైకుంఠుని కథావాసన లేకుండు, నే దేశంబున సత్పురుషులైన పరమభాగవతులు లేకుండుదు, రే భూమిని యజ్ఞేశ్వరుని మహోత్సవంబులు లేక యుండు, నది సురేంద్రలోకంబైన నుండ దగదు; జ్ఞానానుష్ఠాన ద్రవ్యకలాపంబుల చేత మనుష్యజాతిం బొంది తపంబున ముక్తిం బొందకుండెనేని మృగంబుల మాడ్కి నతండు దనకుం దానె బంధనంబు నొందు భారతవర్షంబునందుఁ బ్రజలచేత శ్రద్ధాయుక్తంబుగా ననుష్ఠింపంబడిన యజ్ఞంబులయందు వేల్వంబడు హవిస్సులను బెక్కు నామంబులం బుండరీకాక్షుం డంది తనమీఁది భక్తి యధికంబుగాఁ జేయు; నట్టి భారతవర్షంబు నందలి ప్రజమీఁదం గరుణించి సర్వేశ్వరుం డిహపర సౌఖ్యంబుల నొసంగుచుండు; జంబూద్వీపంబున సగరాత్మజు లశ్వమేధాశ్వంబు నన్వేషింపం బూని భూఖననంబు చేయుటంజేసి స్వర్ణప్రస్థ చంద్రశుక్లావర్తన రమణక మందేహారుణ పాంచజన్య సింహళ లంకాద్వీపంబు లన నెనిమిది యుపద్వీపంబులు గలిగె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; భారతవర్షంబున్ = భారతవర్షము; అందులన్ = లో; జనంబుల్ = ప్రజల; కున్ = కు; ఎద్దియున్ = ఏదీకూడ; అసాధ్యంబు = సాధ్యము కానిది అన్నది; లేదు = లేదు; నారాయణ = విష్ణుని; స్మరణంబున్ = ధ్యానించుటవలన; సకల = అఖిల; దురితంబులు = పాపములును; అడంచున్ = అణగజేయును; తత్ = ఆతని; నామ = నామములను; స్మరణ = తలచుటలు; రహితంబులు = లేనివి; ఐన = అయిన; యజ్ఞ = యజ్ఞములు; తపస్ = తపస్సులు; దాన = దానములు; ఆదులు = మొదలగునవి; దురితంబులన్ = పాపములను; అడపన్ = అణచుటలు; లేవు = చేయలేవు; బ్రహ్మకల్ప = బ్రహ్మకల్పము; అంతంబున్ = చివరివరకు; బ్రతికెడు = జీవించెడు; ఇతర = మిగిలిన; స్థానంబున్ = ప్రదేశములలో; పునర్జన్మ = పునర్జన్మల వలన; భయంబునన్ = భయముతో; భీతిల్లుచున్ = భీతిచెందుతూ; ఉండుట = ఉండుట; కన్నన్ = కంటెను; భారతవర్షంబున్ = భారతవర్షము; అందున్ = లో; క్షణమాత్రంబు = క్షణము కాలము యైనను; మనంబునన్ = మనసులో; సర్వసంగపరిత్యాగంబున్ = అఖిల సాంగత్యములను పూర్తిగ వదలుట; చేసిన = చేసినట్టి; పురుష = పురుషులలో; శ్రేష్ఠున్ = శ్రేష్ఠున; కున్ = కు; శ్రీమత్ = శ్రీమంతమైన; నారాయణ = హరి; పద = పదమును; ప్రాప్తిన్ = పొందుటను; అతి = మిక్కిలి; సులభంబుగన్ = సుళువుగ; సంభవించున్ = కలుగును; కావునన్ = అందుచేత; అట్టి = అటువంటి; ఉత్తమంబు = ఉత్తమమైనది; అగు = అయిన; ఈ = ఈ; భారతవర్షంబె = భారతవర్షమే; కోరుచుండుదురు = కోరుతుందురు; మఱియున్ = ఇంకను; ఎక్కడ = ఎక్కడైతే; వైకుంఠుని = హరి {వైకుంఠుడు - వైకుఠమున ఉండెడివాడు, విష్ణువు}; కథా = కథల; వాసనలు = అనుభూతార్థస్మృతి; లేకుండున్ = లేకుండగ ఉండునో; ఏ = ఏ; దేశంబునన్ = దేశములో నైతే; సత్పురుషులు = మంచివారు; ఐన = అయిన; పరమ = అత్యుత్తమ; భాగవతులు = భాగవతులు {భాగవతులు – భాగవత అనుయాయులు}; లేకుండుదురు = ఉండరో; ఏ = ఏ; భూమినిన్ = దేశములో నైతే; యజ్ఞేశ్వరునిన్ = హరిని {యజ్ఞేశ్వరుడు - యజ్ఞములకు ఈశ్వరుడు, విష్ణువు}; మహా = గొప్ప; ఉత్సవంబులు = ఉత్సవములు; లేక = లేకుండగ; ఉండున్ = ఉండునో; అది = అది; సురేంద్ర = దేవేంద్ర; లోకంబున్ = లోకము; ఐననున్ = అయినప్పటికిని; ఉండన్ = ఉండుటకు; తగదు = తగినది కాదు; జ్ఞాన = సుజ్ఞానము; అనుష్ఠాన = మంచి నడవడిక, ఆచారములు; ద్రవ్య = పదార్థములను; కలాపంబుల = వినియోగములు; చేతన్ = వలన; మనుష్య = మానవ; జాతిన్ = జాతి యందు జనించుటను; పొంది = పొంది; తపంబునన్ = తపస్సువలన; ముక్తిన్ = ముక్తిని; పొందకుండెను = పొందకండగ; ఏని = ఉండె నేని; మృగంబుల్ = జంతువుల; మాడ్కిన్ = వలె; అతండు = అతడు; తనకుందానే = తనకు తనే; బంధనంబున్ = బంధనములను; ఒందున్ = పొందును; భారతవర్షంబున్ = భారతవర్షము; అందున్ = లో; ప్రజల్ = జనుల; చేతన్ = చేత; శ్రద్ధా = శ్రద్ధతో; యుక్తంబుగాన్ = కూడినట్టి; అనుష్ఠింపంబడిన = ఆచరింపబడిన; యజ్ఞంబుల్ = యాగముల; అందున్ = అందు; వేల్వంబడు = వేల్చబడెడి {వేల్చుట - అగ్నిహోత్రమున నేయి మొదలగునవి సమర్పించుట}; హవిస్సులన్ = హవిస్సులను {హవిస్సు - అగ్నిహోత్రమున వేల్చుటకైన ఇగర్చబడిన అన్నము నెయ్యి}; పెక్కు = అనేకమైన; నామంబులన్ = పేర్లతో; పుండరీకాక్షుండు = నారాయణుడు; అంది = స్వీకరించి; తన = తన; మీది = పైని; భక్తిన్ = భక్తిని; అధికంబుగాన్ = ఎక్కువగా; చేయున్ = చేసెడి; అట్టి = అటువంటి; భారతవర్షంబున్ = భారతవర్షము; అందలి = లోని; ప్రజ = జనుల; మీదన్ = పైన; కరుణించి = దయచూపి; సర్వేశ్వరుండు = హరి; ఇహ = ఈ లోకపు; పర = పరలోకపు; సౌఖ్యంబులన్ = సుఖములను; ఒసగుచుండున్ = ఇచ్చుచుండును; జంబూద్వీపంబునన్ = జంబూద్వీపము నందు; సగర = సగరుని {సగర - సగరుడు యనెడి చక్రవర్తి, ఇతని మాయమైన యజ్ఞాశ్వము కొరకు భూమిని తవ్విరి అక్కడనే సాగరము ఏర్పడెను}; ఆత్మజులు = పుత్రులు; అశ్వమేధా = అశ్వమేధయాగము యొక్క; అశ్వంబున్ = గుఱ్ఱమును; అన్వేషింపన్ = వెదకుటను; పూని = పూనుకొని; భూ = భూమిని; ఖననంబు = తవ్వుట; చేయుటన్ = చేయుట; చేసి = వలన; స్వర్ణప్రస్థ = స్వర్ణప్రస్థము; చంద్రశుక్ల = చంద్రశుక్లము; ఆవర్తన = ఆవర్తనము; రమణక = రమణకము; మందేహారణ = మందేహారణము; పాంచజన్య = పాంచజన్యము; సింహళ = సింహళము; లంకా = లంక యనెడు; ద్వీపంబులు = దీవులను; అనన్ = అనెడి; ఎనిమిది = ఎనిమిది (8); ఉపద్వీపంబులు = ఉపద్వీపములు; కలిగెన్ = ఏర్పడెను;

భావము:

ఈ విధంగా భారతవర్షంలో పుట్టిన జనులకు సాధ్యం కానిదంటూ లేనే లేదు. శ్రీమన్నారాయణుని సంస్మరణం సమస్త పాపాలను పటాపంచలు చేస్తుంది. అతని స్మరణం లేని యజ్ఞాలు, తపస్సులు, దానాలు నిరర్థకాలు. వాటివల్ల పాపాలు పోవు. పునర్జన్మ మళ్ళీ వస్తుందేమో అన్న భయంతో ఇతర ప్రదేశాలలో బ్రహ్మకల్పం చివరిదాకా జీవించటం కంటే భారతవర్షంలో క్షణకాలం జీవించి సర్వసంగ పరిత్యాగం చేసినట్లయితే అటువంటి పురుషశ్రేష్ఠునికి శ్రీమన్నారాయణ పదప్రాప్తి చాల సులభంగా దక్కుతుంది. అందుచేత అందరూ భారతవర్షంలో జన్మించాలని కోరుకుంటారు. అదీగాక ఏ స్థలంలో వైకుంఠనిలయుని పుణ్యకథల వాసన ఆవంత అయినా ఉండదో, ఏ ప్రదేశంలో పుణ్యపురుషులైన భాగవతోత్తములు ఉండరో, ఏ స్థలంలో యజ్ఞేశ్వరుని ఉత్సవాలు జరుగవో అటువంటి ప్రదేశం దేవేంద్ర లోకమైనా ఆ ప్రదేశంలో నివసించరాదు. మానవజన్మ ఎత్తి జ్ఞానం, సదనుష్ఠానం, ద్రవ్యసంపత్తి అన్నీ ఉండికూడా తపస్సు ద్వారా ముక్తి అందుకోలేని మానవులు పశువులలాగా తమకు తామే బంధనాల పాలవుతారు. భారతవర్షంలోని ప్రజలు శ్రద్ధతో యజ్ఞాలు నిర్వహించినట్లయితే, ఆ హోమాలలోని హవిస్సును అనేక నామాలతో ఆ పుండరీకాక్షుడు అందుకొని ప్రసన్నుడై వారికి తనమీది భక్తిని అతిశయింప జేస్తాడు. భారతవర్షంలోని ప్రజలమీద అపరిమితమైన అనుగ్రహం ప్రకటిస్తూ, ఆ భగవంతుడు ఇహపర సౌఖ్యాలను వారికి ప్రసాదిస్తాడు. జంబూద్వీపంలోని సగరుని కుమారులు అపహరింపబడిన అశ్వమేధాశ్వాన్ని వెదకుతూ నలువైపులా భూమిని త్రవ్వినపుడు ఎనిమిది ఉపద్వీపాలు ఏర్పడ్డాయి. అవే స్వర్ణప్రస్థం, చంద్రశుక్లం, ఆవర్తనం, రమణకం, మందేహారుణం, పాంచజన్యం, సింహళం, లంక అనేవి.

5.2-59-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్ష యోజనముల వణాబ్ధి పరివృత-
గుచు జంబూద్వీప తిశయిల్లు;
విను రెండు లక్షల విస్తృతముగను ప్ల-
క్షద్వీప ముండు నా క్షార సాగ
ముఁ జుట్టి; యందుల మ్యమై యొప్పెడు-
వృక్షంబు ప్లక్షంబు విదితముగను;
నరు నా ద్వీపంబు రునామ మహిమచే-
మిగులఁ బ్లక్షం బన మించి రహిని;

5.2-59.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నందు సంచరించు ట్టి వారల కగ్ని
దేవుఁ డమరు నాది దేవతయుఁగ;
నందులోన నా ప్రివ్రత పుత్రుండు
నిధ్మజిహ్వుఁడగు మహీవరుండు.

టీకా:

లక్ష = లక్ష (100000); యోజనముల = యోజనముల కొలతగల; లవణ = ఉప్పు; అబ్ధిన్ = సముద్రముచే; పరివృతము = చుట్టబడినది; అగుచున్ = అగుచు; జంబూద్వీపము = జంబూద్వీపము; అతిశయిల్లు = పెచ్చుమీరును; విను = వినుము; రెండులక్షల = రెండులక్షల (200000); విస్తృతముగను = వెడల్పుతో; ప్లక్షద్వీపము = ప్లక్షద్వీపము; ఉండున్ = ఉండును; ఆ = ఆ; క్షార = ఉప్పు; సాగరమున్ = సముద్రమును; చుట్టి = చుట్టుకొని; అందులన్ = అందులో; రమ్యము = మనోహరము; ఐ = అయ్యి; ఒప్పెడు = చక్కగనుండెడి; వృక్షంబు = వృక్షము; ప్లక్షంబు = జువ్విచెట్టు; విదితముగను = ప్రసిద్దముగను; తనరున్ = అతిశయించును; ఆ = ఆ; ద్వీపంబు = ద్వీపము; తరు = వృక్షము; నామ = కీర్తి యొక్క; మహిమ = గొప్పదనము; చేన్ = చేత; మిగులన్ = మిక్కిలిగ; ప్లక్షంబు = ప్లక్షద్వీపము; అనన్ = అనగా; మించి = అతిశయించి; అహిని = భూమి; అందున్ = పైన;
సంచరించున్ = వర్తించెడి; అట్టి = అటువంటి; వారల్ = వారల; కున్ = కు; అగ్నిదేవుడు = అగ్నిదేవుడు; అమరున్ = చక్కగనమరియుండు; ఆదిదేవతయుగ = ముఖ్యదేవతగా; అందులోనన్ = దానిలో; ఆ = ఆ; ప్రియవ్రత = ప్రియవ్రతుని; పుత్రుండు = కుమారుడు; ఇధ్మజిహ్వుడు = ఇధ్మజిహ్వుడు; అగు = అయిన; మహీవరుండు = రాజు {మహీవరుడు - మహి (భూమి)కి వరుడు, రాజు};

భావము:

జంబూద్వీపం లక్షయోజనాల వైశాల్యం కలిగి ఉంది. దాని చుట్టూ అంతే ప్రమాణం గల లవణసముద్రం ఉంది. ఆ తరువాత ప్లక్షద్వీపం రెండు లక్షల యోజనాల విస్తృతి కలిగి ఉంది. దానిని అంతటి పరిమాణం గల చెరకు రస సముద్రం పరివేష్టించి ఉంటుంది. ఆ ప్లక్షద్వీపం నట్టనడుమ ఒక పెద్ద జువ్విచెట్టు ఉంది. ఆ చెట్టు కారణంగానే దానికి ప్లక్షద్వీపం అనే పేరు వచ్చింది. ఆ ద్వీపంలో నివసించే వారికి అగ్నిదేవుడు అధిదేవత. ఆ ద్వీపాన్ని ప్రియవ్రతుని కుమారుడైన ఇధ్మజిహ్వుడు పరిపాలిస్తున్నాడు.

5.2-60-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నరేంద్రా! యా యిధ్మజిహ్వుం డా ప్లక్షద్వీపంబు నేడు వర్షంబులుగ విభజించి యందు నా వర్షనామధారులుగా నుండు తన పుత్రు లగు శివ యశస్య సుభద్ర శాంత క్షేమాభయామృతు లనియెడు నేడుగుర నేడు వర్షంబుల కధిపతులం గావించి తపంబునకుం జనియె; నా వర్షంబుల యందు మణికూట వజ్రకూట యింద్రసేన జ్యోతిష్మద్ధూమ్రవర్ణ హిరణ్యగ్రీవ మేఘమాల లను నామంబులు గల సప్త కులపర్వతంబులును, నరుణయు సృమణయు నాంగీరసయు సావిత్రియు సుప్రభాతయు ఋతంభరయు సత్యంభరయు నన సప్తమహానదులును, నా నదులయందు సుస్నాతు లగుచు గత పాపు లైన హంస పతం గోర్ధ్వాయన సత్యాంగు లను నామంబులు గల చాతుర్వర్ణ్యంబును గలగి యుండు; నందుఁ బురుషులు సహస్ర వత్సర జీవులును దేవతాసములును దృష్టిమాత్రంబునం గ్లమస్వేదాది రహితంబగు నపత్యోత్పాదనంబు గలవార లగుచు వేద త్రయాత్మకుండును, స్వర్గద్వార భూతుండును, భగవత్స్వరూపియు నగు సూర్యుని వేదత్రయమ్మున సేవింపుదురు; ప్లక్షద్వీపం బాదిగా మీఁదటి ద్వీపపంచకంబు నందలి పురుషులకు నాయు రింద్రియ పటుత్వంబులును దేజో బలంబులును దోడనె జనియించుచుండు.

టీకా:

నరేంద్ర = రాజా; ఆ = ఆ; ఇధ్మజిహ్వుండు = ఇధ్మజిహ్వుడు; ఆ = ఆ; ప్లక్షద్వీపంబున్ = ప్లక్షద్వీపమును; ఏడు = ఏడు (7); వర్షంబులుగన్ = వర్షములుగ; విభజించి = భాగములుగ జేసి; అందున్ = వానికి; ఆ = ఆ; వర్ష = వర్షముల యొక్క; నామ = పేరు; ధారులుగా = ధరించినవారై; ఉండున్ = ఉండెడి; తన = తన యొక్క; పుత్రులు = కుమారులు; అగు = అయిన; శివ = శివ; యశస్య = యశస్య; సుభద్ర = సుభద్ర; శాంత = శాంత; క్షేమ = క్షేమ; అభయ = అభయ; అమృతల్ = అమృత; అనియెడు = అనెడు; ఏడుగురన్ = ఏడుగురను (7); ఏడు = ఏడు (7); వర్షంబుల్ = వర్షముల; కున్ = కు; అధిపతులన్ = రాజులు; కావించి = చేసి; తపంబున్ = తపస్సు చేసుకొనుట; కున్ = కు; చనియెన్ = వెళ్ళెను; ఆ = ఆ; వర్షంబుల = వర్షముల, దేశముల; అందున్ = లో; మణికూట = మణికూటము; వజ్రకూట = వజ్రకూటము; ఇంద్రసేన = ఇంద్రసేనము; జ్యోతిష్మత్ = జ్యోతిష్మత్తు; ధూమ్రవర్ణ = ధూమ్రవర్ణము; హిరణ్యగ్రీవ = హిరణ్యగ్రీవము; మేఘమాల = మేఘమాల; అను = అనెడి; నామంబులున్ = పేర్లుగల; సప్త = ఏడు (7); కులపర్వతంబులునున్ = కులపర్వతములును; అరుణయున్ = అరుణ; సృమణయున్ = సృమణ; ఆంగీరసయున్ = ఆంగీరస; సావిత్రియున్ = సావిత్రి; సుప్రభాతయున్ = సుప్రభాత; ఋతంభరయున్ = ఋతంభర; సత్యంభరయున్ = సత్యంభర; అన = అనెడి; సప్త = ఏడు (7); మహా = గొప్ప; నదులునున్ = నదులు; ఆ = ఆ; నదుల = నదుల; అందున్ = లో; సుస్నాతులు = చక్కగ స్నానము చేసినవారు; అగుచున్ = అగుచు; గత = పోయిన; పాపులున్ = పాపములు కలవారు; ఐన = అయిన; హంస = హంసలు; పతంగ = పతంగులు; ఊర్ధ్వాయన = ఊర్ధ్వాయనులు; సత్యాంగులు = సత్యాంగులు; అను = అనెడి; నామంబులున్ = పేర్లు కల; చాతుర్వర్ణంబునున్ = నాలుగు కులములును; కలిగి = కలిగి; ఉండున్ = ఉండును; అందున్ = దానిలోని; పురుషులు = జనులు; సహస్ర = వేయి (1000); వత్సర = సంవత్సరములు; జీవులును = జీవించెడివారును; దేవతా = దేవతలకు; సములున్ = సమానమైనవారు; దృష్ఠి = దర్శన; మాత్రంబున్ = మాత్రముచేత; క్లమ = అలసట; స్వేద = చమట; ఆది = మొదలగు; రహితంబున్ = లేకపోవుట; అగు = కలిగి; అపత్య = సంతతిని; ఉత్పాదనంబు = పుట్టించుట; కలవారలు = కలవారు; అగుచున్ = అగుచు; వేదత్రయ = ఋగ్వేద యజుర్వేద అధర్వణవేదములు; ఆత్మకుండును = ఆత్మగ కలవాడును; స్వర్గ = స్వర్గము యొక్క; ద్వార = ప్రవేశము; భూతుండును = అయినవాడు; భగవత్ = భగవంతున్; స్వరూపియున్ = స్వరూపము కలవాడు; అగు = అయిన; సూర్యుని = సూర్యుని; వేదత్రయమ్మునన్ = వేదత్రయముతో; సేవింపుదురు = కొలచెదరు; ప్లక్షద్వీపంబు = ప్లక్షద్వీపము; ఆదిగా = మొదలైన; మీదటి = పైనున్న; ద్వీపపంచకంబున్ = ఐదు ద్వీపములు; అందలి = వానిలోని; పురుషుల్ = మానవుల; కున్ = కు; ఆయుః = ఆయుష్షు; ఇంద్రియ = ఇంద్రియముల; పటుత్వంబులున్ = సామర్థ్యములు; తేజస్ = తేజస్సు; బలంబులున్ = శక్తి; తోడనె = పుట్టుకతోనే; జనియించుచుండు = కలిగి ఉండును;

భావము:

రాజా! ఇధ్మజిహ్వుడు ప్లక్షద్వీపాన్ని ఏడు వర్షాలుగా విభజించాడు. ఆ వర్షాల పేర్లు కలిగిన తన ఏడుగురు కుమారులు శివుడు, యశస్యుడు, సుభద్రుడు, శాంతుడు, క్షేముడు, అభయుడు, అమృతుడు అనే వారిని వాటికి అధిపతులను చేసాడు. ఆ తరువాత ఇధ్మజిహ్వుడు నిస్సంగుడై తపస్సుకై అడవికి వెళ్ళిపోయాడు. విభజింపబడిన ఒక్కొక్క వర్షంలో ఒక్కొక్క కులపర్వతం, ఒక్కొక్క మహానది ఉన్నాయి. ఆ విధంగా ఆ సప్తవర్షాలలో వరుసగా మణికూటం, వజ్రకూటం, ఇంద్రసేనం, జ్యోతిష్మంతం, ధూమ్రవర్ణం, హిరణ్యగ్రీవం, మేఘమాలం అనేవి ఆ కులపర్వతాలు. అరుణ, సృమణ, అంగిరసి, సౌమిత్రి, సుప్రభాత, ఋతంభర, సత్యంభర అనేవి ఆ మహానదులు. ఆ నదులలో స్నానం చేసి నాలుగు వర్ణాలవారు పాపం పోగొట్టుకుంటారు. ఆ నాలుగు వర్ణాలవారిని హంసులు, పతంగులు, ఊర్ధ్వాయనులు, సత్యాంగులు అని వ్యవహరిస్తారు. ప్లక్షద్వీపంలో నివసించే పురుషుల ఆయుర్దాయం వేయి సంవత్సరాలు. వారు దేవతలతో సమానమైనవారు. కేవలం చూపుతోనే శ్రమ స్వేదాదులు లేని సంతానాన్ని అనుగ్రహింపగలవారు. వేదస్వరూపుడు, స్వర్గానికి ద్వారమైనవాడు, భగవంతుడు అయిన సూర్యుణ్ణి వారు ఋగ్యజుస్సామ వేద మంత్రాలతో సేవిస్తుంటారు. ప్లక్షద్వీపం మొదలైన ముందు చెప్పబోయే ఐదు ద్వీపాలలోని పురుషులకు ఆయుర్బలం, ఇంద్రియపటుత్వం, తేజోబలం పుట్టుకతోనే సంక్రమిస్తాయి.

5.2-61-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్లక్షద్వీపము ద్విగుణిత
క్షేక్షురసాబ్ధి చుట్టిరా విలసిల్లు
న్నిక్షురసోదద్విగుణం
క్షయముగ శాల్మలీ మహాద్వీప మిలన్.

టీకా:

ప్లక్ష = ప్లక్షము యనెడి {ప్లక్షము - జువ్విచెట్టు}; ద్వీపము = ద్వీపము; ద్విగుణిత = రెండు {ద్విగుణిత - రెండుచేత గుణింపబడినది, రెట్టింపు, రెండు}; లక్ష = లక్షల; ఇక్షురస = చెరకురసపు; అబ్ధి = సముద్రమును; చుట్టిరా = చుట్టూతా; విలసిల్లున్ = విరాజిల్లును; ఇక్షురస = చెరకురసపు; ఉదత్ = సముద్రమునకు; ద్విగుణంబు = రెట్టింపునకు; అక్షయముగ = తరుగకుండగ; = శాల్మలీ = శాల్మలి అనెడు {శాల్మలి - బూరుగుచెట్టు}; ద్వీపము = ద్వీపము; ఇలన్ = భూమండలమున;

భావము:

ప్లక్షద్వీపం చుట్టూ రెండు లక్షల యోజనాల విస్తృతి కలిగిన చెరకురస సముద్రం ఉంది. దీనికి రెట్టింపు విస్తృతితో శాల్మలీ ద్వీపం ఉంది.

5.2-62-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అందు శాల్మలీ వృక్షంబు ప్లక్షాయామంబై తేజరిల్లు; నా వృక్షరాజంబు నకు నధోభాగంబునం బతత్రిరాజుగా నుండు గరుత్మంతుండు నిలుకడగా వసించు; నా శాల్మలీ వృక్షంబు పేర నా ద్వీపంబు శాల్మలీ ద్వీపం బన విలసిల్లు; ఆ ద్వీపపతియైన ప్రియవ్ర తాత్మజుండగు యజ్ఞబాహువు దన పుత్రులగు సురోచన సౌమనస్య రమణక దేవబర్హ పారిబర్హాప్యాయ నాభిజ్ఞాతు లనియెడు వారి పేర నేడు వర్షంబుల నేర్పఱచి యా వర్షంబుల యం దేడ్వురఁ గుమారుల నభిషిక్తులం జేసె; నా వర్షంబుల యందు స్వరస, శతశృంగ, వామదేవ, కుముద, ముకుంద, పుష్పవర్ష, శతశ్రుతు లను పర్వత సప్తకంబును ననుమతియు, సినీవాలియు, సరస్వతియుఁ, గుహువును, రజనియు, నందయు, రాకయు నను సప్త మహానదులును గలవు; నందు శ్రుతధర, విద్యాధర, వసుంధ, రేధ్మధర సంజ్ఞులగు నా వర్షపురుషులు భగవత్స్వరూపుండు, వేదమయుండు, నాత్మస్వరూపుండు నగు సోముని వేదమంత్రంబులచే నారాధింపుదు; రా ద్వీపంబు లక్షచతుష్టయపరిమిత యోజన విస్తృతం బయిన సురాసముద్రంబుచే నావృతంబై తేజరిల్లు; నందు.

టీకా:

అందు = దానిలో; శాల్మలీవృక్షంబు = బూరుగుచెట్లు; ప్లక్ష = జువ్విచెట్లంత; ఆయామంబు = విస్తృతి కలగి; ఐ = అయ్యి; తేజరిల్లు = విరాజిల్లును; ఆ = ఆ; వృక్ష = వృక్షములలో; రాజంబున్ = గొప్పదాని; కున్ = కి; అధః = క్రింది; భాగంబునన్ = పక్క; పతత్రి = పక్షులకు {పతత్రి – రెక్కలు గలది, పక్షి}; రాజు = రాజు; కాన్ = అయ్యి; ఉండు = ఉండెడి; గరుత్మంతుండు = గరుత్మంతుడు; నిలుకడగా = స్థిరముగా; వసించున్ = నివసించును; ఆ = ఆ; శాల్మలీవృక్షంబు = బూరుగుచెట్లు; పేరన్ = పేరుతో; ఆ = ఆ; ద్వీపంబున్ = ద్వీపమును; శాల్మలీద్వీపంబున్ = శాల్మలీద్వీపము; అనన్ = అనగా; విలసిల్లున్ = ప్రసిద్ధమగును; ఆ = ఆ; ద్వీప = ద్వీపమునకు; పతి = ప్రభువు; ఐన = అయినట్టి; ప్రియవ్రత = ప్రియవ్రతుని; ఆత్మజుండు = పుత్రుడు; అగు = అయినట్టి; యజ్ఞబాహువు = యజ్ఞబాహువు; తన = తన యొక్క; పుత్రులు = కుమారులు; అగు = అయినట్టి; సురోచన = సురోచనుడు; సౌమనస్య = సౌమనస్యుడు; రమణక = రమణకుడు; దేవబర్హ = దేవబర్హుడు; పారిబర్హ = పారిబర్హుడు; ఆప్యాయన = ఆప్యాయనుడు; అభిజ్ఞాతులు = అభిజ్ఞాతుడు; అనియెడి = అనెడి; వారి = వారి యొక్క; పేరన్ = పేరుతో; వర్షంబులన్ = వర్షములను; ఏర్పరచి = ఏర్పాటుచేసి; ఆ = ఆ; వర్షంబులన్ = వర్షముల; అందున్ = అందును; ఏడ్వురన్ = ఏడుగురు (7); కుమారులన్ = పుత్రులను; అభిషిక్తులన్ = పట్టాభిషిక్తులునుగా; చేసెన్ = చేసెను; ఆ = ఆ; వర్షంబులన్ = వర్షముల, దేశముల; అందున్ = లో; స్వరస = స్వరసము; శతశృంగ = శతశృంగము; వామదేవ = వామదేవము; కుముద = కుముదము; ముకుంద = ముకుందము; పుష్పవర్ష = పుష్పవర్షము; శతశ్రుతులు = శతశ్రుతము; అను = అనెడి; పర్వత = పర్వతముల; సప్తకంబునున్ = ఏడును (7); అనుమతియున్ = అనుమతి {అనుమతి - ఒక కళ తక్కువైన చంద్రుడుగల పౌర్ణమి}; సినీవాలియున్ = సినీవాలి {సినీవాలి - చంద్రకళ కనబడెడి అమావాస్య}; సరస్వతియున్ = సరస్వతి; కుహువునున్ = కుహువు {కుహువు - చంద్రకళ కానరాని అమావాస్య}; రజనియున్ = రజని {రజని - రాత్రి}; నందయున్ = నంద {నంద - శుక్లపక్షమునుండి మొదటి ఐదు తిథులు (పాడ్యమి విదియ తదియ చవితి పంచమి)}; రాకయున్ = రాక {రాక - నిండు పౌర్ణమి, సంపూర్ణ కళలతో కూడిన చంద్రుడుగల పున్నమి}; అను = అనెడి; సప్త = ఏడు; మహా = పెద్ద; నదులునున్ = నదులు; కలవు = ఉన్నవి; అందు = వానిలో; శ్రుతధర = శ్రుతధరులు; విద్యాధర = విధ్యాధరులు; వసుంధర = వసుంధరులు; ఇధ్మధర = ఇధ్మధరులు; సంజ్ఞులు = అనెడి పేర్లు కలవారు; అగు = అయిన; ఆ = ఆ; వర్ష = వర్షము నందలి, దేశపు; పురుషులున్ = వారు; భగవత్ = భగవంతుని యొక్క; స్వరూపుండు = స్వరూప మైనవాడును; వేద = వేదములతో; మయుండునున్ = నిండినవాడును; ఆత్మ = పరమాత్మ; స్వరూపుండున్ = స్వరూప మైనవాడును; అగు = అయినట్టి; సోమునిన్ = సోముడిని; వేద = వేదము లందలి; మంత్రంబుల్ = మంత్రముల; చేన్ = చేత; ఆరాధింపుదురు = పూజింతురు; ఆ = ఆ; ద్వీపంబున్ = ద్వీపము, ఖండము; లక్షచతుష్టయ = లక్షలు నాలుగు (400000); పరిమిత = మేర; యోజన = యోజనముల; విస్తృతంబున్ = విస్తృతి కలగినది; అయిన = అయినట్టి; సురా = మధ్యపు, సురారసపు; సముద్రంబున్ = సముద్రము; చేతన్ = వలన; ఆవృతంబున్ = చుట్టబడినది; ఐ = అయ్యి; తేజరిల్లున్ = అతిశయించును; అందు = దానికి;

భావము:

ఈ ద్వీపంలో ఉన్న శాల్మలీవృక్షం (బూరుగు చెట్టు) ప్లక్షద్వీపంలోని జువ్విచెట్టంత ఉంది. ఈ బూరుగు చెట్టు దిగువభాగంలో పక్షులకు రాజైన గరుత్మంతుడు స్థిరనివాసం చేస్తుంటాడు. ప్రియవ్రతుని కుమారుడైన యజ్ఞబాహువు ఈ ద్వీపాన్ని పరిపాలిస్తుంటాడు. అతడు తాను పాలించే భూభాగాన్ని ఏడు వర్షాలుగా విభజించాడు. ఒక్కొక్క వర్షంలో ఒక్కొక్క పర్వతం, ఒక్కొక్క నది ఉన్నాయి. అతడు సురోచనుడు, సౌమనస్యుడు, రమణకుడు, దేవబర్హుడు, వారిబర్హుడు, ఆప్యాయనుడు, అభిజ్ఞాతుడు అనే తన ఏడుగురు కుమారులను వారి పేర్లతోనే వ్యవహరింపబడే ఆ ఏడు వర్షాలకు అభిషిక్తులను చేసాడు. ఈ ఏడు వర్షాలలో స్వరసం, శతశృంగం, వామదేవం, కుముదం, ముకుందం, పుష్పవర్షం, శతశ్రుతి అనే పర్వతాలు; అనుమతి, సినీవాలి, సరస్వతి, కుహువు, రజని, నంద, రాక అనే ఏడు మహానదులు ఉన్నాయి. ఆ వర్షంలోని పురుషులు శ్రుతధరులు, విద్యధరులు, వసుంధరులు, ఇధ్మధర్ములు అని పిలువబడతారు. వారు భగవత్ స్వరూపుడు, వేదమయుడు, ఆత్మస్వరూపుడు అయిన సోముణ్ణి వేదమంత్రాలతో ఆరాధిస్తారు. ఆ ద్వీపం చుట్టూ నాలుగు లక్షల యోజనాల విస్తృతి కలిగిన సురా (కల్లు) సముద్రం ఉంది.

5.2-63-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భూనాథ! యా సురాంభోధికిఁ జుట్టుగా-
నుండు కుశద్వీప ముర్విమీఁదఁ;
దోరమై తా ద్విచతుర్లక్ష యోజనం-
బులను విస్తారమై పొలుపు మిగుల;
నందుఁ గుశస్తంభ నిశంబు దేవతా-
ల్పితం బైనట్టి కాంతిచేత
దిక్కులు వెలిఁగించు ద్వీపంబునకుఁ దన-
పేరను సత్కీర్తి పెంపు జేయు

5.2-63.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్టి దీవికి నధిపతి గు ప్రియవ్ర
తనయుండు హిరణ్యరేసుఁ డనం ద
రెడి భూపతి తన సుతనామములను
ర్షములఁ జేసె నత్యంత ర్షమునను

టీకా:

భూనాథ = రాజా; ఆ = ఆ; సురాంభోధి = సురాసముద్రమున; కిన్ = కు; చుట్టుగాన్ = చుట్టూతా; ఉండు = ఉండెడి; కుశ = కుశ యనెడి {కుశలు - దర్భలు}; ద్వీపమున్ = ద్వీపము; ఉర్వి = భూమి; మీదన్ = పైన; తోరము = స్థూలము, పెద్దది; ఐ = అయ్యి; తాన్ = అది; ద్విచతుర్లక్ష = ఎనిమిదిలక్షల; యోజనంబులను = యోజనముల; విస్తారము = విస్తరించినది; ఐ = అయ్యి; పొలుపుమిగులన్ = అతిశయించి; అందున్ = దానిలో; కుశస్తంభము = దర్భపుల్ల; అనిశంబున్ = ఎల్లప్పుడు; దేవతా = దేవతలచేత; కల్పితంబున్ = ఏర్పరుపబడినది; ఐనట్టి = అయినట్టి; కాంతి = ప్రకాశము; చేతన్ = చేత; దిక్కులున్ = నల్దిక్కులను; వెలిగించున్ = వెలుగు నిచ్చును; ద్వీపంబున్ = ద్వీపము; కున్ = కు; తన = తన యొక్క; పేరను = పేరుతో; సత్ = మంచి; కీర్తిన్ = ప్రసిద్ధిని; పెంపున్ = వృద్ధి; చేయున్ = చేయును; అట్టి = అటువంటి;
దీవి = ద్వీపమున; కిన్ = కు; అధిపతి = రాజు, ఏలిక; అగు = అయిన; ప్రియవ్రత = ప్రియవ్రతుని; తనయుండు = పుత్రుడు; హిరణ్యరేతసుడు = అగ్ని, సూర్యుడు; అనన్ = అనగా; తనరెడి = అతిశయించెడి; భూపతి = రాజు; తన = తన యొక్క; సుత = పుత్రుల; నామములను = పేర్లుతో; వర్షములన్ = వర్షమును, దేశములను; చేసెన్ = ఏర్పరచెను; అత్యంత = అతిమిక్కిలి; హర్షమునను = సంతోషముతో;

భావము:

రాజా! ఆ సురాసముద్రం ఆవల కుశద్వీపం ఉంది. అది ఎనిమిది లక్షల యోజనాల విస్తృతి కలిగింది. దాని మధ్య ఒక పెద్ద కుశస్తంబం (దర్భదుబ్బు) మొలిచి ఎత్తుగా పెరిగి ఉంది. అది దివ్యకాంతులతో దిక్కులను వెలిగింపజేస్తుంది. ఈ కారణం వల్లనే దీనికి కుశద్వీపం అనే పేరు కలిగింది. ప్రియవ్రతుని పుత్రుడు హిరణ్యరేతసుడు అనేవాడు దీనికి అధిపతి. అతడు తన కుమారుల పేర్లతో ఆ ద్వీపాన్ని ఏడు వర్షాలుగా విభజించాడు.

5.2-64-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు హిరణ్యరేతసుండు వసుదాన, దృఢరుచి, నాభి, గుప్త, సత్యవ్రత, విప్ర, వామదేవులను నామంబులుగల పుత్రుల,నామంబుల సప్త వర్షంబులం గావించి యా కుమారులనందు నిలిపి తాను దపంబు నకుం జనియె; నా వర్షంబునందు బభ్రు చతుశ్శృంగ కపిల చిత్రకూట దేవానీకోర్ధ్వరోమ ద్రవిణంబులను నామంబులు గల సప్తగిరులును, రసకుల్యయు, మధుకుల్యయు, శ్రుతవిందయు, మిత్రవిందయు, దేవగర్భయు, ఘృతచ్యుతయు, మంత్రమాలయు నను సప్త మహానదులును గల వా నదీజలంబులఁ గృతమజ్జను లగుచు భగవంతుండగు యజ్ఞపురుషునిఁ గుశల కోవిదాభియుక్త కులక సంజ్ఞలు గల వర్షపురుషు లారాధించుచుందురు.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; హిరణ్యరేతసుండు = హిరణ్యరేతసుడు; వసుదాన = వసుదానుడు; దృఢరుచి = దృఢరుచి; నాభి = నాభుడు; గుప్త = గుప్తుడు; సత్యవ్రత = సత్యవ్రతుడు; విప్ర = విప్రుడు; వామదేవులు = వామదేవుడు; అను = అనెడి; నామంబులున్ = పేర్లు; కల = కలిగిన; పుత్రుల = కుమారుల యొక్క; నామంబులన్ = పేర్లతో; సప్త = ఏడు (7); వర్షంబులన్ = వర్షములను, దేశములను; కావించి = ఏర్పరచి; ఆ = ఆ; కుమారులన్ = పుత్రులను; అందున్ = వాని యందు; నిలిపి = నిలబెట్టి; తాను = తను; తపంబున్ = తపస్సు చేసుకొనుట; కున్ = కు; చనియెన్ = వెళ్ళెను; వర్షంబున్ = వర్షము, దేశము; అందున్ = లో; బభ్రు = బభ్రువు; చతుశ్శృంగ = చతుశ్శృంగము; కపిల = కపిలము; చిత్రకూట = చిత్రకూటము; దేవానీక = దేవానీకము; ఊర్ధ్వరోమ = ఊర్ధ్వరోమము; ద్రవిణంబులు = ద్రవిణములు; అను = అనెడి; నామంబులున్ = పేర్లు; కల = కలిగిన; సప్త = ఏడు (7); గిరులును = పర్వతములును; రసకుల్యయున్ = రసకుల్యము; మధుకుల్యయున్ = మధుకుల్యము; శ్రుత విందయు = శ్రుతవింద; మిత్రవిందయు = మిత్రవింద; దేవగర్భయున్ = దేవగర్భము; ఘృతచ్యుత = ఘృతచ్యతము; మంత్రమాలయున్ = మంత్రమాల; అను = అనెడి; సప్త = ఏడు (7); మహా = పెద్ద; నదులునున్ = నదులు; కలవు = ఉన్నవి; ఆ = ఆ; నదీ = నదియొక్క; జలములన్ = నీటిలో; కృత = చేసిన; మజ్జనులు = స్నానముచేసినవారు; అగుచున్ = అగుచు; భగవంతుండు = నారాయణుని {భగవంతుడు – మహత్యము గలవాడు, సృష్టి పుట్టుక స్థానమైనవాడు, మోక్ష స్థానమైనవాడు, విష్ణువు}; యజ్ఞపురుషుని = నారాయణుని {యజ్ఞ పురుషుడు - యజ్ఞములకు పతియైనవాడు, విష్ణువు}; కుశల = కుశలులు; కోవిద = కోవిదులు; అభియుక్త = అభియుక్తులు; కులక = కులకులు; సంజ్ఞలున్ = అనెడి పేర్లు; కల = కలిగిన; వర్ష = వర్షము నందలి, దేశపు; పురుషులున్ = మానవులు; ఆరాధించుచుందురు = పూజింతురు;

భావము:

ఈ విధంగా హిరణ్యరేతసుడు వసుదానుడు, దృఢరుచి, నాభి, గుప్తుడు, సత్యవ్రతుడు, విప్రుడు, వామదేవుడు అనే కుమారుల పేర్లతో ఏడు వర్షాలను ఏర్పాటు చేసి వారిని అందులో నియమించి తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడు. ఆ కుశద్వీపంలోనివర్షములలో బభ్రువు, చతుశ్శృంగం, కపిలం, చిత్రకూటం, దేవానీకం, ఊర్ధ్వరోమం, ద్రవిణం అనే ఏడు పర్వతాలు, రసకుల్య, మధుకుల్య, శ్రుతనింద, మిత్రవింద, దేవగర్భ, ఘృతచ్యుత, మంత్రమాల అనే ఏడు మహానదులు ఉన్నాయి. కుశలులు, కోవిదులు, అభియుక్తులు, కులకులు అనే నాలుగు వర్ణాలవారు ఆ పవిత్ర నదీజలాలలో స్నానం చేసి శుచులై భగవంతుడైన యజ్ఞపురుషుని ఆరాధిస్తుంటారు.

5.2-65-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కుశద్వీపంబు రికట్టుకొని యుండు-
నెనిమిదిలక్షల ఘృతాబ్ధి;
యా ఘృతసాగరం వ్వల షోడశ-
క్ష యోజనముల లిత మగుచు
నుండుఁ గ్రౌంచద్వీప; ముర్వీశ! యందు మ-
ధ్యప్రదేశంబున ట్టి దీని
పేరుగాఁ దనపేరఁ బెద్దగాఁ జేసిన-
క్రౌంచాద్రి గల; దా నగంబు మున్ను

5.2-65.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ణ్ముఖుండు దివ్యరమున ఘననితం
బంబు దూయ నేయఁ బాలవెల్లి
రిమఁ దడుపుచుండు రుణుండు రక్షింప
నందు మిగుల భయము నొందకుండె.

టీకా:

ఆ = ఆ; కుశద్వీపంబున్ = కుశద్వీపమును; అరికట్టుకొని = సరిహద్దులుగ నుంచుకొని; ఉండు = ఉండెడి; ఎనిమిదిలక్షల = ఎనిమిదిలక్షల (800000); ఘన = మిక్కిలి పెద్దదైన {ఘన - పొడవు వెడల్పు లోతు మిక్కిలి యున్నది, పెద్దది}; ఘృత = నేతి; అబ్ధి = సముద్రము; ఆ = ఆ; ఘృతసాగరంబు = ఘృతసముద్రమునకు; అవ్వలన్ = ఆవతల; షోడశలక్ష = పదహారులక్షల (1600000); యోజనముల = యోజనములతో; లలితము = మనోజ్ఞము, లలి (వికాసము)కలిగినది; అగుచున్ = అగుచు; ఉండున్ = ఉండును; క్రౌంచ = క్రౌంచము యనెడు; ద్వీపమున్ = ద్వీపము; ఉర్వీశ = రాజా; అందున్ = దానిలో; మధ్య = నడిమి; ప్రదేశంబునన్ = స్థలములో; అట్టి = అటువంటి; దీని = దీని యొక్క; పేరున్ = పేరును; తన = తన యొక్క; పేరన్ = పేరుగా; పెద్దగాన్ = గొప్పగానగునట్లు; చేసిన = చేసినట్టి; క్రౌంచాద్రి = క్రౌంచము యనెడు పర్వతము; కలదు = ఉన్నది; ఆ = ఆ; నగంబున్ = కొండను; మున్ను = ఇంతకు పూర్వము;
షణ్ముఖుండు = కుమారస్వామి {షణ్ముఖుడు - షట్ (ఆరు (6)) ముఖుడు, ముఖములుగలవాడు, కుమారస్వామి}; దివ్య = దివ్యమైన; శరమునన్ = బాణమును; ఘన = పెద్దదైన; నితంబంబున్ = కొండనడుమభాగమున; దూయన్ = ఇటునుండినటుదూరిపోవునట్లు; ఏయన్ = వేయగా; గరిమన్ = గొప్పగా; తడపుచుండున్ = తడుపుతూనుండును; వరుణుండు = వానదేవుడు; రక్షింపన్ = రక్షించుతుండగా; అందున్ = అక్కడ; మిగులన్ = మిక్కిలి, అతిశయించి; భయమున్ = భయమును; ఒందక = పొందకుండగ; ఉండెన్ = ఉండడెదరు;

భావము:

ఆ కుశద్వీపం చుట్టూ ఎనిమిది లక్షల యోజనాల పరిమాణం కలిగిన ఘృత (నేతి) సముద్రం ఉన్నది. ఆ నేతి సముద్రం ఆవల పదునారు లక్షల యోజనాల విస్తృతి కలిగిన అందమైన క్రౌంచద్వీపం ఉన్నది. ఆ ద్వీపం మధ్యభాగంలో క్రౌంచాద్రి ఉన్నది. ఆ పర్వతం వల్లనే ఆ ద్వీపానికి ఆ పేరు వచ్చింది. ఒకసారి షణ్ముఖుడు దివ్యశరాన్ని ప్రయోగించగా అది ఆ క్రౌంచపర్వతానికి కన్నం చేస్తూ దూసుకుపోయింది. ఆ కన్నంగుండా పాలవెల్లి ప్రవాహం వెలువడింది. ఆ ప్రవాహమే ఆ క్రౌంచద్వీపాన్ని తడుపుతూ ఉంది. వరుణదేవుడు ఆ ప్రదేశాన్ని కాపాడుతూ ఎవరికీ ఏమాత్రం భయం లేకుండేవిధంగా చూస్తూ ఉంటాడు.

5.2-66-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నరేంద్రా! యా క్రౌంచద్వీపపతి యగు ఘృతపృష్ఠుండు దన కుమారుల నా పేళ్ళుగల యామోద, మధువహ, మేఘపృష్ఠ, సుదామ, ఋషిజ్య, లోహితార్ణ, వనస్పతు లను వర్షంబుల కభిషిక్తులం జేసి పరమ కల్యాణ గుణ యుక్తుం డయిన శ్రీహరి చరణారవిందంబుల సేవించుచు దపంబు నకుం జనియె; నా వర్షంబుల యందు శుక్ల వర్ధమాన భోజ నోపబర్హణానంద నందన సర్వతోభద్రంబు లను సప్త సీమాపర్వతం బులును నభయయు, నమృతౌఘయు, నార్యకయు, తీర్థవతియుఁ, దృప్తిరూపయుఁ, బవిత్రవతియు, శుక్లయు నను సప్తనదులును గల; వందులఁ బవిత్రోదకంబు లనుభవించుచు గురు ఋషభ ద్రవిణక దేవక సంజ్ఞలు గలిగి వరుణదేవుని నుదకాంజలులం బూజించు చున్న చాతుర్వర్ణ్యంబు గలిగి యుండు.

టీకా:

నరేంద్ర = రాజా; ఆ = ఆ; క్రౌంచద్వీప = క్రౌంచద్వీపమునకు; పతి = ప్రభువు; అగు = అయిన; ఘృతపృష్ఠుండున్ = ఘతపృష్టుడు; తన = తన యొక్క; కుమారులన్ = పుత్రులను; ఆ = ఆ; పేళ్ళు = పేర్లు; కల = కలిగిన; ఆమోద = ఆమోదము; మధువహ = మధువహము; మేఘపృష్ఠ = మేఘపృష్ఠము; సుదామ = సుదామము; ఋషిజ్య = ఋషిజ్యము; లోహితార్ణ = లోహితార్ణము; వనస్పతులు = వనస్పతము; అను = అనెడి; వర్షంబుల్ = వర్షములు, దేశములు; కున్ = కు; అభిషిక్తులన్ = పట్టాభిషేకము; చేసి = చేసి; పరమ = అత్యుత్తమ; కల్యాణ = శుభకరమైన; గుణ = సుగుణములతో; యుక్తుండు = కూడినవాడు; అయిన = అయిన; శ్రీహరి = నారాయణుని; చరణ = పాదము లనెడి; అరవిందంబులన్ = పద్మములను; సేవించుచున్ = కొలచుచు; తపంబున్ = తపస్సు చేసుకొనుట; కున్ = కు; జనియెన్ = వెళ్ళెను; ఆ = ఆ; వర్షంబుల = వర్షములు, దేశములు; అందున్ = లో; శుక్ల = శుక్లము; వర్ధమాన = వర్ధమానము; భోజన = భోజనము; ఉపబర్హణ = ఉపబర్హణము; ఆనంద = ఆనందము; నందన = నందనము; సర్వతోభద్రంబుల్ = సర్వతోభద్రము; అను = అనెడి; సప్త = ఏడు (7); సీమా = సరిహద్దు; పర్వతంబులునున్ = పర్వతములును; అభయమున్ = అభయ; అమృతౌఘయున్ = అమృతౌఘ; ఆర్యకయున్ = ఆర్యక; తీర్థవతియున్ = తీర్థవతి; తృప్తిరూపయున్ = తృప్తిరూప; పవిత్రవతియున్ = పవిత్రవతి; శుక్లయున్ = శుక్ల; అను = అనెడి; సప్త = ఏడు (7); నదులునున్ = నదులు; కలవు = ఉన్నవి; అందులన్ = వాని యందలి; పవిత్ర = పవిత్రమైన; ఉదకంబులనున్ = నీటిని; అనుభవించుచున్ = భుజించుచు; గురు = గురువులు; ఋషభ = ఋషభులు; ద్రవిణక = ద్రవిణకులు; దేవక = దేవకులు; సంజ్ఞలున్ = అనెడి పేర్లు; కలిగి = ఉండి; వరుణదేవుని = వరుణదేవుని; ఉదక = నీరుపట్టిన; అంజలులన్ = దోసిళ్ళతో; పూజించుచున్న = ఆరాధించుతున్నట్టి; చాతుర్వర్ణ్యంబున్ = నాలుగుకులములు; కలిగి = కలిగి; ఉండున్ = ఉండును;

భావము:

రాజా! ప్రియవ్రతుని కుమారుడైన ఘృతపృష్ఠుడు క్రౌంచద్వీపానికి అధిపతి. అతనికి ఆమోదుడు, మధువహుడు, మేఘపృష్ఠుడు, సుదాముడు, ఋషిజ్యుడు, లోహితార్ణుడు, వనస్పతి అని ఏడుగురు కుమారులున్నారు. అతడు తన కుమారుల పేరు మీదుగా క్రౌంచద్వీపాన్ని ఏడు వర్షాలుగా విభజించి ఒక్కొక్క వర్షానికి ఒక్కొక్క కుమారుని రాజుగా నియమించాడు. తరువాత తాను మంగళ గుణనిలయుడైన శ్రీహరి పాదపద్మాలను సేవిస్తూ తపం చేయడానికి అడవులకు వెళ్ళాడు. ఆ క్రౌంచద్వీపంలోని ఏడు వర్షాలలో శుక్లం, వర్ధమానం, భోజనం, ఉపబర్హణం, ఆనందం, నందనం, సర్వతోభద్రం అనే ఏడు కొండలు; అభయ, అమృతౌఘ, ఆర్యక, తీర్థవతి, తృప్తిరూప, పవిత్రగతి, శుక్ల అనే ఏడు నదులు ఉన్నాయి. ఆ నదీజలాలలో స్నానం చేసి గురువులు, ఋషభులు, ద్రవిణకులు, దేవకులు అనే నాలుగు వర్ణాలవారు జలాంజలులను సమర్పిస్తూ వరుణదేవుని సేవిస్తూ ఉంటారు.

5.2-67-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గతీశ! వినుము; క్రౌంద్వీపమును జుట్టి-
యుండు షోడశలక్ష యోజనముల
విస్తారమై పాలవెల్లి; యందునను శా-
ద్వీప మతుల ప్రకాశ మొందు;
దండిమై ముప్పదిరెండులక్షల యోజ-
ముల విస్తారమై మరి యుండు;
నందుల శాకవృక్షామోద మా ద్వీప-
మును సుగంధంబునఁ బెనఁగఁ జేసి

5.2-67.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యంతఁ దనపేర దీవి ప్రఖ్యాత మగుటఁ
జేసి యందుల మిగులఁ బ్రసిద్ధికెక్కె;
నందు మేధాతిథియుఁ గర్త గుచు నుండెఁ
విలి వేడుకఁ దనదు నంనులఁ జూచి.

టీకా:

జగతీశ = రాజా; వినుము = వినుము; క్రౌంచద్వీపమునున్ = క్రౌంచద్వీపమును; చుట్టి = చుట్టుకొని; ఉండు = ఉండును; షోడశలక్ష = పదహారులక్షల (1600000); యోజనముల = యోజనములతో; విస్తారము = విస్తృతి; ఐ = కలదై; పాలవెల్లి = పాలసముద్రము, క్షీరాబ్ధి; అందునను = అందలి; శాక = శాకము యనెడి {శాకము - టేకు}; ద్వీపమున్ = ద్వీపము; అతుల = మిక్కిలి; ప్రకాశమున్ = ప్రసిద్దిని; ఒందున్ = పొందును; దండిమై = నిండుగా; ముప్పదిరెండులక్షల = ముప్పైరెండులక్షల (3200000); యోజనముల = యోజనములతో; విస్తారము = విస్తృతి; ఐ = కలదై; అమరి = పొందికగ; ఉండున్ = ఉండును; శాకావృక్ష = టేకుచెట్ల; ఆమోదము = సువాసన; ఆ = ఆ; ద్వీపమును = ద్వీపమును; సుగంధంబునన్ = మంచివాసనలతో; పెనగన్ = కలియునట్లు; చేసి = చేసి;
అంతన్ = అంతట; తన = తన యొక్క; పేరన్ = పేరుతో; దీవి = ద్వీపము; ప్రఖ్యాతము = ప్రసిద్దిచెందినది; అగుటన్ = అగుట; చేసి = వలన; అందులన్ = అక్కడ; మిగులన్ = మిక్కిలి; ప్రసిద్ధికెక్కెన్ = పేరుపొందెను; అందున్ = దానిలో; మేధాతిథియున్ = మేథాతిథి; కర్త = ప్రభువు; అగుచున్ = అగుచు; ఉండెన్ = ఉండెను; తవిలి = ధరించి; వేడుకన్ = సంబరముతో, వినోదముగ; తనదు = తన యొక్క; నందనులన్ = పుత్రులను; చూచి = చూసి;

భావము:

రాజా! విను. క్రౌంచద్వీపం చుట్టూ పదునారు లక్షల యోజనాల విస్తృతిలో పాలసముద్రం ఉంది. క్రౌంచద్వీపానికి ఆవల శాకద్వీపం ప్రసిద్ధి పొందిన ద్వీపం. ఆ ద్వీపం ముప్పదిరెండు లక్షల యోజనాల విస్తృతి కలిగింది. ఆ ద్వీపంలో ఒక పెద్ద శాకవృక్షం ఉంది. దాని సుగంధంవల్ల ఆ ద్వీపమంతా పరిమళవంతంగా ఉంటుంది. ఆ కారణంగానే ఆ ద్వీపానికి శాకద్వీపం అనే పేరు వచ్చింది. ఆ ద్వీపానికి ప్రియవ్రతుని కుమారుడైన మేధాతిథి అధిపతి.

5.2-68-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు; నా ప్రియవ్రతపుత్రుం డయిన మేధాతిథి దన పుత్రుల పేరం గల పురోజవ మనోజవ వేపమాన ధూమ్రానీక చిత్రరథ బహురూప విశ్వచారంబు లను సంజ్ఞలు గల సప్త వర్షంబుల యందు వారలకుఁ బట్టంబు గట్టి శ్రీహరి పాదసేవ జేయుచుఁ దపోవనంబునకుం జనియె; నా శాకద్వీపంబునందు నీశానోరుశృంగ బలభద్ర శతకేసర సహస్రస్రోతో దేవపాల మహానస నామంబులు గల సీమాగిరులును, ననఘాయు ర్దోభయసృ ష్ట్యపరాజిత పంచపరీ సహస్రసృతి నిజధృతు లను సప్త నదులును గల; వా నదీజలంబు లుపయోగించి యచ్చటి వారలు ప్రాణాయామంబు జేసి విధ్వస్త రజస్తమో గుణులయి పరమసమాధిని వాయురూపంబైన భగవంతుని సేవింతురు; ఋతువ్రత సత్యవ్రత దానవ్రత సువ్రత నామంబులు గల చాతుర్వర్ణ్యం బందు గలిగి యుండు.

టీకా:

మఱియున్ = ఇంకను; ఆ = ఆ; ప్రియవ్రత = ప్రియవ్రతుని; పుత్రుండు = కుమారుడు; అయిన = అయిన; మేధాతిథి = మేథాతిథి; తన = తన యొక్క; పుత్రుల = కుమారుల; పేరన్ = పేరు; కల = కలిగిన; పురోజవ = పురోజవము; మనోజవ = మనోజవము; వేపమాన = వేపమానము; ధూమ్రానీక = ధూమ్రానీకము; చిత్రరథ = చిత్రరథము; బహురూప = బహురూపము; విశ్వచారంబులు = విశ్వచారము; అను = అనెడి; సంజ్ఞలున్ = పేర్లు; కల = కలిగిన; సప్త = ఏడు (7); వర్షంబులన్ = వర్షములు, దేశములు; అందున్ = లోను; వారల్ = వారల; కున్ = కు; పట్టంబుగట్టి = పట్టాభిషేకముచేసి; శ్రీహరి = నారాయణుని; పాద = పాదములను; సేవ = పూజించుట; చేయుచున్ = చేయుచు; తపోవనంబున్ = తపస్సు చేసుకొనెడి అడవి; కున్ = కి; జనియెన్ = వెళ్ళెను; ఆ = ఆ; శాకద్వీపంబున్ = శాకద్వీపము; అందున్ = లో; ఈశాన = ఈశానము; ఉరుశృంగ = ఉరుశృంగము; బలభద్ర = బలభద్రము; శతకేసర = శతకేసరము; సహస్రస్రోతః = సహస్రస్రోతము; దేవపాల = దేవపాలము; మహానస = మహానసము; నామంబులన్ = అనెడు పేర్లు; కల = కలిగిన; సీమా = సరిహద్దు; గిరులునున్ = పర్వతములును; అనఘ = అనఘ; ఆయుర్దః = ఆయుర్ద; ఉభయసృష్ట్య = ఉభయసృష్ట్య; అపరాజిత = అపరాజిత; పంచపరి = పంచపరి; సహస్రసృతి = సహస్రసృతి; నిజధృతులు = నిజధృతులు; అను = అనెడి; సప్త = ఏడు (7); నదులున్ = నదులు; కలవు = ఉన్నవి; ఆ = ఆ; నదీ = నది యొక్క; జలంబులున్ = నీటిని; ఉపయోగించి = వాడుకొని; అచ్చటి = అక్కడి; వారలు = వారు; ప్రాణాయామంబున్ = ప్రాణాయామము; చేసి = చేసి; విధ్వస్త = నశింపజేసుకొన్న; రజః = రజోగుణము; తమః = తమోగుణములైన; గుణులు = గుణములు గలవారు; అయి = అయ్యి; పరమ = అత్యుత్తమ; సమాధిని = సమాధితో; వాయు రూపంబైన భగవంతుని = వాయుదేవుని; సేవింతురు = కొలతురు; ఋతువ్రత = ఋతువ్రతులు; సత్యవ్రత = సత్యవ్రతులు; దానవ్రత = దానవ్రతులు; సువ్రత = సువ్రతులు; నామంబులున్ = అనెడి పేర్లు; కల = కలిగిన; చాతుర్వర్ణ్యంబున్ = నాలుగుకులములు; కలిగి = కలిగి; ఉండును = ఉండును;

భావము:

ఇంకా ఆ ప్రియవ్రతుని కుమారుడైన మేధాతిథి తన కుమారులైన పురోజనుడు, మనోజనుడు, వేపమానుడు, ధూమ్రానీకుడు, చిత్రరథుడు, బహురూపుడు, విశ్వాచారుడు అనే ఏడుగురి పేర శాకద్వీపాన్ని ఏడు వర్షాలను విభజించి, వారికి పట్టంగట్టి తాను శ్రీహరి పాదసేవ చేస్తూ తపోవనానికి వెళ్ళాడు. ఆ ఏడు వర్షాలలో క్రమంగా ఈశానం, ఉరుశృంగం, బలభద్రం, శతకేసరం, సహస్రస్రోతం, దేవపాలం, మహానసం అనే ఏడు సరిహద్దు పర్వతాలు; అనఘ, ఆయుర్ద, ఉభయసృష్ట్య, అపరాజిత, పంచపరి, సహస్ర సృతి, నిజధృతి అనే ఏడు నదులు ఉన్నాయి. ఆ ద్వీపవాసులు ఆ నదీ జలాలను సేవిస్తూ ప్రాణాయామం చేస్తూ రజోగుణ, తమోగుణాలను నశింపజేసికొని సమాధి నిష్ఠులై వాయురూపుడైన భగవంతుని ఆరాధిస్తారు. అక్కడ ఋతవ్రతులు, సత్యవ్రతులు, దానవ్రతులు, సువ్రతులు అనే నాలుగు వర్ణాలవారు ఉన్నారు.

5.2-69-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్టి శాకద్వీప రికట్టి తత్ప్రమా-
ణంబున దధిసముద్రంబు వెలుఁగు;
నందుకుఁ బరివృతంయి పుష్కరద్వీప-
మిలఁ జతుష్షష్టిలక్ష విశాల;
మ్మహాద్వీపమం యుత కాంచన పత్ర-
ములు గల్గి కమలగర్భునకు నాస
నంబగు పంకేరుహంబుండు; నా ద్వీప-
ధ్యంబునను నొక్క మానసోత్త

5.2-69.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రం బనంగఁ బర్వతం; బుండుఁ దనకుఁ బూ
ర్వాపరముల నుండుట్టి వర్ష
ముకు రెంటి కట్లు నిలిచిన మర్యాద
మనంగఁ జాలఁ బొడ నెగడు.

టీకా:

అట్టి = అటువంటి; శాకద్వీపమున్ = శాకద్వీపమును; అరికట్టి = సరిహద్దులుగ నుంచుకొని; తత్ = అదే; పరిమాణంబునన్ = పరిమాణములో; దధి = పెరుగు; సముద్రంబున్ = సముద్రము; వెలుగున్ = ప్రకాశించును; అందుకున్ = దానికి; పరివృతంబున్ = చుట్టుకొని యున్నది; అయి = అయ్యి; పుష్కర = పుష్కరము యనెడి {పుష్కరము - మెట్టతామర}; ద్వీపము = ద్వీపము; ఇలన్ = భూమండలమున; చతుష్షష్ఠిలక్షల = అరవైనాలుగు లక్షల (6400000); విశాలమున్ = విస్తారముగలది; ఆ = ఆ; మహా = పెద్దదైన; ద్వీపమున్ = ద్వీపము; అందున్ = లో; అయుత = పదివేల (10000); కాంచన = బంగారు; పత్రములు = రేకులు; కల్గి = కలిగుండి; కమలగర్భున్ = బ్రహ్మదేవుని; కున్ = కి; ఆసనంబున్ = ఆసనము; అగు = అయిన; పంకేరుహంబున్ = పద్మము {పంకేరుహము - పంకమున ఈరుహమైనది (పుట్టినది), పద్మము}; ద్వీప = ద్వీపము యొక్క; మధ్యంబునను = నడిమిభాగమున; ఒక్క = ఒక; మానసోత్తరంబు = మానసోత్తరము; అనంగన్ = అనెడి; పర్వతంబున్ = పర్వతములు; ఉండున్ = ఉండును; తన = తన; కున్ = కు; పూర్వ = ముందటి; పరములన్ = వెనుకవైపు; ఉండునట్టి = ఉండెడి;
= వర్షముల్ = వర్షములు, దేశములు; కున్ = కు; రెంటి = రెండిటి; కిన్ = కి; అట్లు = ఆవిధముగ; నిలిచిన = నిలబడిన; మర్యాద = మర్యాదకొరకైన; నగము = కొండ; అనంగన్ = అనుటకు; చాలన్ = మిక్కిలి; పొగడన్ = పొగడబడుతు; నెగడున్ = వర్ధిల్లును;

భావము:

శాకద్వీపం చుట్టూ అంతే పరిమాణం కలిగిన దధి (పెరుగు) సముద్రం ఉంది. దాని తర్వాత అరవైనాలుగు లక్షల యోజనాల విస్తృతి కలిగిన పుష్కరద్వీపం ఉంది. ఆ మహాద్వీపంలో పదివేల బంగారు రేకులు కలిగి బ్రహ్మదేవునికి ఆసనమైన పద్మం ఉంది. ఆ ద్వీపం నడుమ మానసోత్తరం అనే పెద్ద పర్వతం ఉంది. తూర్పు పడమరలలో గల రెండు వర్షాలకు ఈ మానసోత్తరం సరిహద్దు పర్వతం.

5.2-70-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు దనకు లోపలి వెలుపలి వర్షంబులు రెంటికి మర్యాదాచలంబునుం బోలె నున్న మానసోత్తర పర్వతం బయుత యోజన విస్తారంబును నంతియ యౌన్నత్యంబునుం గలిగి యుండు; నా నగంబునకు నలుదిక్కుల యందు నాలుగు లోకపాలుర పురంబులుండు; నా మానసోత్తరపర్వతంబు తుద సూర్యరథచక్రంబు సంవత్సరాత్మకం బయి యహోరాత్రంబుల యందు మేరు ప్రదక్షిణంబు జేయు; నందు నా పుష్కరద్వీపాధిపతియగు వీతిహోత్రుండు రమణక ధాతక నామంబులు గల పుత్రుల నిరువుర వర్షద్వయంబునం దభిషిక్తులం జేసి తాను బూర్వజు లేగిన తెఱంగున భగవత్కర్మశీలుం డగుచుఁ దపంబునకుం జనియె; నంత.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; తన = తన; కున్ = కు; లోపలి = లోపలి ప్రక్క; వెలుపలి = వెలుపలి పక్క; వర్షంబులు = వర్షములు, దేశములు; రెంటి = రెండింటి; కిన్ = కి; మర్యాద = సరిహద్దు; చలంబునున్ = పర్వతమును; పోలెన్ = వలె; ఉన్న = ఉన్నట్టి; మనసోత్తరపర్వతంబు = మానసోత్తర పర్వతము; అయుత = పదివేల (10000); యోజన = యోజనముల; విస్తారంబునున్ = విశాలమును; అంతియన్ = అంతే; ఔన్నత్యంబునున్ = ఎత్తు; కలిగి = కలిగి; ఉండున్ = ఉండును; ఆ = ఆ; నగంబున్ = పర్వతమున; కున్ = కు; నలుదిక్కులన్ = నాలుగు పక్కల; అందున్ = లోను; నాలుగు = నాలుగు; లోకపాలుర = లోకపాలకుల; పురంబులు = పట్టణములు; ఉండున్ = ఉండును; ఆ = ఆ; మానసోత్తరపర్వతంబు = మానసోత్తరపర్వతపు; తుద = చివర; సూర్య = సూర్యుని; రథ = రథము యొక్క; చక్రంబున్ = చక్రము; సంవత్సర = సంవత్సరము; ఆత్మకంబున్ = స్వరూపము; అయి = అయ్యి; అహోరాత్రంబుల = రాత్రింబగళ్ల; అందున్ = లో; మేరు = మేరువునకు; ప్రదక్షిణంబుజేయున్ = చుట్టును తిరుగుచుండును; అందున్ = దాని యందు; ఆ = ఆ; పుష్కరద్వీప = పుష్కరద్వీపమునకు; అధిపతి = ప్రభువు; అగు = అయిన; వీతిహోత్రుండు = వీతిహోత్రుడు; రమణక = రమణకుడు; ధాతక = ధాతకుడు; నామంబులున్ = అనెడి పేర్లు; కల = కలిగిన; పుత్రులన్ = కుమారులను; ఇరువురన్ = ఇద్దరిని; వర్ష = వర్షములు, దేశములు; ద్వయంబున్ = జంట (2); అందున్ = అందు; అభిషిక్తులన్ = పట్టాభిషిక్తులను; చేసి = చేసి; తాను = తను; పూర్వజులు = ముందు పుట్టిన వారు; ఏగిన = వెళ్లిన; తెఱంగునన్ = విధముగనే; భగవత్ = భగవంతుని; కర్మ = సేవ జేసెడి; శీలుండు = వర్తన కలవాడు; అగుచున్ = అగుచు; తపంబున్ = తపస్సు చేసుకొనుట; కున్ = కు; చనియెన్ = వెళ్ళెను; అంత = అంతట;

భావము:

ఈ విధంగా లోపల వెలుపల ఉన్న వర్షాలకు సరిహద్దుగా ఉన్న మానసోత్తర పర్వతం పదివేల యోజనాల విస్తీర్ణం, అంతే ఎత్తు కలిగి ఉంది. ఆ పర్వతానికి నాలుగు దిక్కులలోను నలుగురు లోకపాలకుల పట్టణాలు ఉన్నాయి. ఆ మానసోత్తర పర్వత శిఖరంపై సంవత్సరాత్మకమైన సూర్యరథచక్రం తిరుగుతూ రాత్రింబగళ్ళు మేరువునకు ప్రదక్షిణం చేస్తూ ఉంటుంది. ఆ పుష్కరద్వీపానికి అధిపతి వీతిహోత్రుడు. అతనికి రమణకుడు, ధాతకుడు అని ఇద్దరు కుమారులు. వీతిహోత్రుడు పుష్కరద్వీపాన్ని రెండు వర్షాలుగా విభజించి వాటికి తన కొడుకులను రాజులను చేసాడు. తన అన్నల అడుగు జాడల్లో వీతిహోత్రుడు భగవత్ప్రీతికరాలైన కార్యాలను ఆచరిస్తూ తపోవనానికి వెళ్ళిపోయాడు.

5.2-71-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నుజేశ్వర; యా వర్షం
బు నప్పుడు సంచరించు పురుషులు పద్మా
ను దగ సకర్మ కారా
చేయుదు రచల బుద్ధి తాత్పర్యమునన్.

టీకా:

మనుజేశ్వర = రాజా; ఆ = ఆ; వర్షంబునన్ = వర్షము నందు; అప్పుడు = అప్పుడు; సంచరించు = తిరిగెడి; పురుషులున్ = మనుజులు; పద్మాసనునిన్ = బ్రహ్మదేవుని; తగన్ = చక్కగా; అర్చన = పూజించుట {అర్చన - పూజ, ముగ్గు సుగంధము అక్షతలు పుష్పము ధూపము దీపము ఉపహారము (నైవేద్యము) తాంబూలము అని ఎనిమిది విధమైనవి కలది}; ఆరాధన = సేవించుట; = చేయుదురు = చేయుచుందురు; అచల = నిశ్చలమైన; బుద్ధిన్ = బుద్ధి; తాత్పర్యమునన్ = నిష్ఠలతో;

భావము:

రాజా! ఆ పుష్కరద్వీపంలో నివసించే పురుషులు వేదోక్త కర్మలను ఆచరిస్తూ బ్రహ్మదేవుణ్ణి కొలుస్తుంటారు. వారు నిశ్చలమైన బుద్ధిబలం, నియమ నిష్ఠలు కలవారు.

5.2-72-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ణీవల్లభ! విను పు
ష్క మను ద్వీపమున లేరు చాతుర్వర్ణ్యుల్
గఁగ భేదము లేకే
సత సము లగుదు రందు కల జనములున్.

టీకా:

ధరణీవల్లభ = రాజా; విను = వినుము; పుష్కరము = పుష్కరము; అను = అనెడి; ద్వీపమునన్ = ద్వీపములో; లేరు = లేరు; చాతుర్వర్ణ్యుల్ = నాలుగు కులాల వారని; పరగగన్ = ప్రసిద్ధముగ; భేదము = తేడాలు; లేకే = లేకుండగనే; సరసతన్ = ఒప్పుగా; సములు = సమానమైనవారు; అగుదురు = ఐ ఉందురు; అందున్ = అక్కడ; సకల = అందరు; జనములున్ = ప్రజలు;

భావము:

రాజా! పుష్కరద్వీపంలో నాలుగు వర్ణాల విభాగం లేదు. అక్కడి వారంతా భేదభావం లేకుండా సమభావంతో కలిసి మెలిసి సంచరిస్తారు.

5.2-73-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు; పుష్కరద్వీపంబు చతుష్షష్టిలక్ష యోజన విస్తారం బైన శుద్ధోదక సముద్ర ముద్రితం బగుచుండు; నవ్వల లోకాలోకపర్వతం బుండు; శుద్ధోదక సముద్ర లోకాలోకపర్వతంబుల నడుమ రెండుకోట్ల యోజన విస్తారంబయిన నిర్జన భూమి దర్పణోదర సమానంబై దేవతావాస యోగ్యంబుగా నుండు; నా భూమిం జేరిన పదార్థంబు మరలఁ బొంద నశక్యంబుగా నుండు; అటమీఁద లోకాలోకపర్వతం బెనిమిది కోట్ల యోజనంబులు సువర్ణభూమియు సూర్యాది ధ్రువాంతంబు లగు జ్యోతిర్గణంబుల మధ్యంబున నుండుటంజేసి లోకాలోకపర్వతం బనందగి యుండు; పంచాశత్కోటి యోజనవిస్తృతం బగు భూమండల మానంబునకు దురీయాంశ ప్రమాణంబుగల యా లోకాలోక పర్వతంబు మీఁద నఖిల జగద్గురువగు బ్రహ్మచేతఁ జతుర్దిశల యందు ఋషభ పుష్కరచూడ వామ నాపరాజిత సంజ్ఞలుగల దిగ్గజంబులు నాలుగును లోకరక్షణార్థంబు నిర్మితంబై యుండు; మఱియును.

టీకా:

మఱియున్ = ఇంకను; పుష్కరద్వీపంబున్ = పుష్కరద్వీపము; చతుష్షష్టిలక్ష = అరవైనాలుగు లక్షల (6400000); యోజన = యోజనముల; విస్తారంబున్ = విశాలము; ఐన = అయిన; శుద్ద = స్వచ్ఛమైన, మంచి; ఉదక = నీటి; సముద్ర = సముద్రముచేత; ముద్రితంబున్ = సరిహద్దులు కలది; అగుచుండున్ = అయ్యి ఉండును; అవ్వలన్ = దానికి ఆవతల; లోకాలోకపర్వతంబున్ = లోకాలోకపర్వతము; ఉండున్ = ఉండును; శుద్ధోదకసముద్ర = మంచినీటి సముద్రము; లోకాలోకపర్వతంబుల = లోకాలోకపర్వతముల; నడుమ = మధ్యన; రెండుకోట్ల = రెండుకోట్ల (20000000); యోజన = యోజనముల; విస్తారంబున్ = విస్తారము కలది; అయిన = అయినట్టి; నిర్జన = జనసంచారములేని; భూమి = ప్రదేశము; దర్పణ = అద్దము; ఉదర = పైతలమునకు; సమానంబున్ = సమానమైనది; ఐ = అయ్యి; దేవతా = దేవతలు; వాస = నివసించుటకు; యోగ్యంబుగాన్ = తగినదిగా; ఉండున్ = ఉండును; ఆ = ఆ; భూమిన్ = ప్రదేశమును; చేరిన = చేరినట్టి; పదార్థంబున్ = పదార్థములను; మరల = వెనుకకు; పొందుట = పొందుట; కున్ = కు; అశక్యంబుగాన్ = అసాధ్యముగా; ఉండున్ = ఉండును; అటమీద = తరువాత; లోకాలోకపర్వతంబు = లోకలోకపర్వతము; ఎనిమిదికోట్ల = ఎనిమిదికోట్ల (80000000); యోజనంబులున్ = యోజనములు; సువర్ణభూమియున్ = బంగారు భూమియును; సూర్య = సూర్యుడు; ఆది = మొదలు; ధ్రువ = ధ్రువమండలము; అంతంబులు = అంత మగువరకు; అగు = అయిన; జ్యోతిర్గణంబుల = జ్యోతిర్మండలముల గుంపుల; మధ్యంబునన్ = నడుమ; ఉండుటన్ = ఉండుట; చేసి = వలన; లోకాలోకపర్వతంబు = లోకాలోకపర్వతము {లోకాలోకపర్వతము - లోక (ఉన్నది, లోకములకు) అలోక (లేనిది ఐన, పరలోకములకు మధ్యన ఉన్నట్టి) పర్వతము}; అనన్ = అనుటకు; తగి = తగినది ఐ; ఉండున్ = ఉండును; పంచాశత్కోటి = యాభైకోట్ల (50,00,00,000); యోజన = యోజనముల; విస్తృతంబున్ = విస్తారము కలది; అగున్ = అయ్యి ఉండును; భూమండల = భూమండలముపై ఉండెడి; మానంబున్ = మానము, కొలతలకు; కున్ = కు; తురీయాంశ = నాలుగవవంతు; ప్రమాణంబున్ = ప్రమాణములు, కొలతలు; కల = కలిగిన; ఆ = ఆ; లోకాలోకపర్వతంబు = లోకాలోకపర్వతము; మీదన్ = పైన; అఖిల = సర్వ; జగత్ = లోకములకు; గురువు = గురువు, పెద్దవాడు; అగు = అయిన; బ్రహ్మ = బ్రహ్మదేవుని; చేతన్ = చేత; చతుః = నాలుగు; దిశలన్ = దిక్కులు; అందున్ = లోను; ఋషభ = ఋషభము; పుష్కరచూడ = పుష్కరచూడము; వామన = వామనము; అపరాజిత = అపరాజితము; సంజ్ఞలు = అనెడి పేర్లు; కల = కలిగిన; దిగ్గజంబులు = దిగ్గజములు {దిగ్గజములు – దిక్కు లందు ఉండెడి ఏనుగులు}; నాలుగును = నాలుగు; లోక = లోకములను; రక్షణ = రక్షణ కలిగించుట; అర్థంబున్ = కొరకు; నిర్మితంబు = తయారు చేయబడి; ఉండు = ఉండును; మఱియును = ఇంకను;

భావము:

ఇంకా ఆ పుష్కరద్వీపం అరవై నాలుగు లక్షల యోజనాల విస్తృతి కలిగి ఉంటుంది. దాని చుట్టూ అంతే విస్తీర్ణం కలిగి పరిశుద్ధమైన జలంతో నిండిన సముద్రం ఉంది. ఆ సముద్రానికి ఆవల లోకాలోకం అనే పర్వతం ఉంది. సముద్రానికి ఆ పర్వతానికి మధ్యగల ప్రదేశం రెండు కోట్ల యోజనాల విస్తీర్ణం కలిగి ఉంటుంది. అక్కడ మానవ సంచారం లేదు. ఆ భూమి అద్దంలాగా స్వచ్ఛంగా ఉంటుంది. అది దేవతల నివసించడానికి ప్రయత్నించినా చేతికందదు. ఆ పైన ఎనిమిది కోట్ల యోజనాల ప్రదేశం బంగారు భూమిలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. సూర్యుని నుండి ధ్రువతార వరకు వ్యాపించిన జ్యోతిర్గణం మధ్య ఉండడం వల్ల ఆ పర్వతానికి లోకాలోక పర్వతమనే పేరు సార్థకం అవుతున్నది. ఈ భూమండలమంతా యాభైకోట్ల యోజనాల విస్తృతి కలిగి ఉందు. అందులో నాల్గవవంతు లోకాలోక పర్వతం. ఆ పర్వతం మీద సకలలోక గురుడైన బ్రహ్మదేవుడు ఋషభం, పుష్కరచూడం, వామనం, అపరాజితం అనే దిగ్గజాలను లోకరక్షణార్థం నిలిపి ఉంచాడు.

5.2-74-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నదు విభూతులై నరిన యా దేవ-
బృంద తేజశ్శౌర్య బృంహణార్థ
మై భగవంతుండు నాదిదేవుండును-
నైన జగద్గురుం చ్యుతుండు
రిలేని ధర్మ విజ్ఞాన వైరాగ్యాదు-
యిన విభూతుల లరి యున్న
ట్టి విష్వక్సేను డాదిగాఁ గలుగు పా-
ర్షదులతోఁ గూడి ప్రస్తమైన

5.2-74.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిజవరాయుధ దోర్దండ నిత్య సత్త్వుఁ
గుచు నా పర్వతంబుపై ఖిలలోక
క్షణార్థంబు కల్పపర్యంత మతఁడు
యోగమాయా విరచితుఁడై యొప్పుచుండు.

టీకా:

తనదు = తనయొక్క; విభూతులు = వైభవములు; ఐ = అయ్యి; తనరిన = అతిశయించిన; ఆ = ఆ; దేవ = దేవతల; బృంద = సమూహముయొక్క; తేజస్ = తేజస్సు; శౌర్య = శౌర్యముల; బృంహరణ = విస్తరింపజేయుట; అర్థము = కోసము; ఐ = అయ్యి; = భగవంతుండు = భగవంతుడు {భగవంతుడు - మహిమాన్వితుడు, జగత్సృష్టికి మూలస్థానమైనవాడు, విష్ణువు}; ఆదిదేవుడు = ఆదినారాయణుడు {ఆదిదేవః - సృష్ట్యాది నుండినున్న దేవుడు విష్ణువు, సృష్టికార్యమును ప్రారంభించినవాడు, కారణమై దీప్తి మొదలగు గుణములచే విరాజిల్లువాడు, విష్ణుసహస్రనామాలు శ్రీశంకరభాష్యం 334వ నామం, 490వ నామం}; ఐన = అయినట్టి; జగద్గురుండు = నారాయణుడు {జగద్గురుడు - జగత్తు (విశ్వము) అంతటికి గురువైనవాడు (పెద్దవాడు), విష్ణువు}; అచ్యుతుండు = నారాయణుడు {అచ్యుతుడు - చ్యుతము (పతనము) లేనివాడు}; సరిలేని = సాటిలేని; ధర్మ = ధర్మము; విజ్ఞాన = విజ్ఞానము; వైరాగ్య = వైరాగ్యము; ఆదులు = మొదలగునవి; అయిన = అయినట్టి; విభూతులన్ = వైభవములతో; అలరి = వికసించి; ఉన్న = ఉండిన; అట్టి = అటువంటి; విష్వక్సేనుడు = విష్వక్సేనుడు {విష్వక్సేనుడు - విష్ణుమూర్తి యొక్క సేనాని, ఇతనినే వైష్ణవ సంప్రదాయమున విఘ్నేశ్వరుడందురు)}; ఆదిగాన్ = మొదలుగా; కలుగు = ఉండెడి; పార్షదులు = కొలువుననుండువారు {పార్షదుడు - పార్శ్వమున (పక్కన) ఉండువాడు, కూడనుండువాడు, కొలువుననుండువాడు}; తోన్ = తోటి; కూడి = కలిసుండి; ప్రశస్తము = ప్రసిద్దికెక్కినవి; ఐన = అయినట్టి;
నిజ = తన యొక్క; వర = శ్రేష్ఠమైన; ఆయుధ = ఆయుధములుగల; దోః = భుజములనెడి; దండ = దండములచే; నిత్య = శాశ్వతమైన; సత్వుడున్ = శక్తిగలవాడు; అగుచున్ = అగుచు; ఆ = ఆ; పర్వతంబు = లోకాలోకపర్వతము; పైన = మీద; అఖిల = నిఖిలమైన; లోక = లోకములను; రక్షణ = రక్షణకలిగించుట; అర్థంబున్ = కోసము; కల్ప = బ్రహ్మకల్పము; పర్యంతము = చివరివరకు; అతడు = అతడు (హరి); యోగమాయా = యోగమాయను; విరచితుండు = కల్పించువాడు; ఐ = అయ్యి; ఒప్పుచుండు = ఒప్పుచుండును;

భావము:

ఆ లోకాలోక పర్వతం మీద ఆదిదేవుడు, జగద్గురుడు, భగవంతుడు అయిన శ్రీమన్నారాయణుడు లోకాలను రక్షించడం కోసం యోగమాయా సమేతుడై కల్పాంత పర్యంతం ఉంటాడు. దేవతల సమూహమంతా అతని వైభవ స్వరూపమే. ఆ దేవతల తేజస్సును, పరాక్రమాన్ని విస్తరింపజేయడం కోసం విష్ణు భగవానుడు ధర్మం, జ్ఞానం, వైరాగ్యం అనే విభూతులతో ప్రకాశించే విష్వక్సేనుడు మొదలైన పార్షదులతో కూడి చతుర్బాహువులలో శ్రేష్ఠమైన ఆయుధాలను ధరించి ఆ పర్వతం మీద ప్రకాశిస్తాడు.

5.2-75-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు వివిధమంత్ర గోపనార్థం బా నగాగ్రంబున నున్న భగవంతుండు దక్క లోకాలోకపర్వతంబునకు నవ్వల నొరులకు సంచరింప నశక్యంబయి యుండు; బ్రహ్మాండంబునకు సూర్యుండు మధ్య గతుండై యుండు; నా సూర్యునకు నుభయ పక్షంబుల యందు నిరువదేను కోట్ల యోజన పరిమాణంబున నండకటాహం బుండు; నట్టి సూర్యునిచేత నాకాశదిక్స్వర్గాపవర్గంబులును నరకంబులును నిర్ణయింపంబడు; దేవ తిర్యఙ్మనుష్య నాగ పక్షి తృణ గుల్మలతాది సర్వజీవులకును సూర్యుం డాత్మ యగుచు నుండు.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; వివిధ = అనేక రకము లైన; మంత్ర = మంత్రముల; గోపన = రహస్యములను; అర్థంబున్ = కాపాడుటకు; ఆ = ఆ యొక్క; నగ = పర్వతము యొక్క; అగ్రంబునన్ = శిఖరమున; ఉన్న = ఉన్నట్టి; భగవంతుండు = నారాయణుడు; తక్క = తప్పించి; లోకాలోకపర్వతంబున్ = లోకాలోకపర్వతమున; కున్ = కు; అవ్వలన్ = ఆవతల; ఒరుల్ = ఇతరుల; కున్ = కు; సంచరింపన్ = వర్తించుటకు, తిరుగుటకు; అశక్యంబున్ = అసాధ్యము; అయి = అయ్యి; ఉండున్ = ఉండును; బ్రహ్మాండంబున్ = బ్రహ్మాండమున {బ్రహ్మాండము - భూగోళ ఖగోళాదికములు కల పెద్ద అండము (గోళము)}; కున్ = కు; సూర్యుండు = సూర్యుడు; మధ్య = నడుమ; గతుండు = తిరుగువాడు; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; ఆ = ఆ; సూర్యున్ = సూర్యుని; కున్ = కి; ఉభయ = రెండు; పక్షంబులన్ = వైపుల; అందున్ = లోను; ఇరువదేనుకోట్ల = ఇరవైదుకోట్ల (25,00,00,000); యోజన = యోజనముల; పరిమాణంబునన్ = దూరమున; అండకటాహంబున్ = అండకటాహము {అండకటాహము - అండ (బ్రహ్మాండ) కటాహము (పైడిప్ప)}; ఉండున్ = ఉండును; అట్టి = అటువంటి; సూర్యుని = సూర్యభగవానుని; చేతన్ = చేత; ఆకాశ = ఆకాశము; దిక్క్ = దిక్కులు; స్వర్గ = స్వర్గము; అపవర్గంబులును = మోక్షములును; నరకంబులును = నరకములును; నిర్ణయింపంబడున్ = నిర్ణయము చేయబడును; దేవ = దేవతలు; తిర్యక్ = తిర్యక్కులు {తిర్యక్కు - తిరిగెడివి, జంతువులు మొదలగునవి}; మనుష్యు = మానవులు; నాగ = నాగులు; పక్షి = పక్షులు; తృణ = గడ్డిమొక్కలు; గుల్మ = పొదలు; లత = లతలు; ఆది = మొదలైన; సర్వ = నిఖిలమైన; జీవులు = ప్రాణుల; కును = కు; సూర్యుండు = సూర్యభగవానుడు; ఆత్మ = లో ఉండువాడు; అగుచున్ = అగుచు; ఉండు = ఉండును;

భావము:

ఈ విధంగా వివిధ మంత్రాలను రహస్యంగా రక్షించడానికి ఆ పర్వతం మీద ఉన్న భగవంతుడు తప్ప ఆ లోకాలోక పర్వతం ఆవల ఎవ్వరికి సంచరించడానికి శక్యం కాదు. బ్రహ్మాండానికి మధ్య భాగంలో సూర్యుడు ఉన్నాడు. ఆ సూర్యునికి ఇరువైపులా ఇరవై అయిదు కోట్ల యోజనాల దూరంలో బ్రహ్మాండ కటాహం ఉంది. ఆ సూర్యభగవానుడే ఆకాశం, దిక్కులు, స్వర్గనరకాలు, మోక్షం అనే వాటిని నిర్దేశిస్తాడు. దేవతలకు, మానవులకు, జంతువులకు, సర్పాలకు, పక్షులకు, గడ్డిపోచలకు, తీగలకు, పొదలకు, సర్వజీవరాసులకు సూర్యుడే ఆత్మ.

5.2-76-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మనురాగంబున నీ
ణీమండలము సంవిధానం బెల్ల
న్నెఱిఁగించితి నింతియ కా
దెఱిఁగించెద దివ్యమాన మెల్ల నరేంద్రా!

టీకా:

కరము = మిక్కిలి; అనురాగంబునన్ = ఆపేక్షతో; ఈ = ఈ; ధరణీమండలమున్ = భూమండలము; సంవిధానంబు = కూర్పులను; ఎల్లన్ = సమస్తమును; ఎఱిగించితిని = తెలిపితిని; ఇంతియున్ = ఇంతే; కాదు = కాదు; ఎఱిగించెదన్ = తెలిపెదను; = దివ్య = దివ్యమైన; మానమున్ = కొలతలును; ఎల్లన్ = అన్నిటిని; నరేంద్ర = రాజా;

భావము:

రాజా! ఎంతో ప్రేమతో ఈ భూమండల నిర్మాణానికి సంబంధించిన విశేషాలన్నీ తెలియజేశాను. ఇప్పుడు సృష్టి కొలతను కూడా చెబుతాను విను.