పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ఈశ్వర దక్షుల విరోధము

  •  
  •  
  •  

4-43-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నయంబు లుప్తక్రియాకలాపుఁడు మాన-
హీనుఁడు మర్యాదలేని వాఁడు
త్తప్రచారుఁ డున్మత్తప్రియుఁడు దిగం-
రుఁడు భూతప్రేత రివృతుండు
దామస ప్రమథ భూములకు నాథుండు-
భూతిలిప్తుం డస్థిభూషణుండు
ష్టశౌచుండు నున్మదనాథుఁడును దుష్ట-
హృదయుఁ డుగ్రుఁడును బరేతభూ ని

4-43.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కేతనుఁడు వితతస్రస్తకేశుఁ డశుచి
యిన యితనికి శివనాముఁ ను ప్రవాద
మెటులు గలిగె? నశివుఁ డగు నితని నెఱిఁగి
యెఱిఁగి వేదంబు శూద్రున కిచ్చినటులు.

టీకా:

అనయంబున్ = ఎప్పుడు, నీతి కానట్టి; లుప్త = శూన్యమైమపోయిన; క్రియా = పనులు, యజ్ఞకర్మములు; కలాపుడు = చేయుటలు కలవాడు; మాన = శీలము, అభిమానము; హీనుడు = లేనివాడు; మర్యాద = మర్యాద, నియమములు; లేనివాడు = లేనట్టివాడు; మత్తప్రచారుడు = మత్తెక్కి తిరుగువాడు, మిక్కిలి ప్రచారము కల వాడు; ఉన్మత్తప్రియుడు = పిచ్చివారి కిష్ఠుడు, మిక్కిలి (వెఱ్ఱి) ప్రేమస్వభావి; దిగంబరుడు = దిక్కులే అంబరముగా కలవాడు; భూతప్రేత = భూతప్రేతములుచేత; పరివృతుండు = చుట్టబడి యుండువాడు; తామస = తమోగుణము కల; ప్రమథ = ప్రమథ; భూతముల్ = గణముల; కున్ = కి; నాథుండు = నాయకుడు; భూతి = బూడిద, విభూతి; లిప్తుండు = పూసుకొనువాడు; అస్థి = ఎముకలు; భూషణుండు = అలంకారములుగ కలవాడు; నష్టశౌచుండు = కోల్పోయిన శుచిత్వము కలవాడు; ఉన్మదనాథుఁడును = అమితమైన మదము కలవారికి నాయకుడు, ఉన్మదులను భూతగణములకు నాయకుడు; దుష్టహృదయుడు = దుష్టమైన మనసు కలవాడు; ఉగ్రుడు = ఉగ్రరూపము కలవాడు; పరేతభూమినికేతనుడు = శ్మశానవాసి;
వితతస్రస్త = మిక్కిలి విరబోసుకొన్న; కేశుడు = కేశములు కలవాడు; అశుచి = శుచిత్వము లేనివాడు; అయిన = అయినట్టి; ఇతని = ఇతని; కిన్ = కి; శివ = శివ యనెడి; నాముడు = పేరుబడ్డవాడు; అను = అనెడి; ప్రవాదము = తప్పుడు ప్రచారము; ఎటులన్ = ఎలా; కలిగెన్ = కలిగినది; అశివుడు = అశుభమైనవాడు; అగు = అయినట్టి; ఇతనినన్ = ఇతనిని; ఎఱిగియెఱిగి = బాగ తెలిసి కూడ; = వేదంబున్ = వేదములను; శూద్రున్ = శూద్రుని; కిన్ = కి; ఇచ్చినటుల = ఇచ్చినట్లు.

భావము:

దక్షుడు శివుని ఇలా నిందిస్తున్నా స్తుతి కూడ స్పురిస్తున్న చమత్కారం ఉన్న పద్యం యిది – ఇతను ఎప్పుడు వేదకర్మ లాచరించని వాడు. (కర్మలు చేయని వాడు అంటే పూర్తిగా కర్మలకు అతీతుడు); మానాభిమానాలు లేని వాడు. (మానం లేనివాడు అంటే గౌరవ అగౌరవాలు పట్టని వాడు); నియమాలు లేని వాడు. (మర్యాద లేదంటే దేశకాలాలకి తరతమ భేదాలకి అతీతుడు); మత్తెక్కి తిరుగు వాడు. (ఆత్మానందంలో మెలగు వాడు); పిచ్చివారి కిష్టుడు. (ఉన్నత్తాకారంలో మెలగే సిద్ధులకు ఇష్టుడు); నగ్నంగా ఉంటాడు. (దిగంబరుడు ఆకాశ అంతరిక్షాలు దేహంగా కలవాడు); భూతాలు ప్రేతాలు ఎప్పుడు చుట్టూ ఉంటాయి. (పంచభూతాలు మరణానంతర జీవాత్మలు కూడ ఆశ్రయించి ఉంటాయి); తమోగుణం గల ప్రమథ గణాలకు నాయకుడు. బూడిద పూసుకుంటాడు. (ఆది విరాగి కనుక వైరాగ్య చిహ్న మైన విభూతి రాసుకుంటాడు); ఎముకలు అలంకారాలుగా ధరిస్తాడు. (అస్థి భూషణుడు అంటే బ్రహ్మ కపాలాలు ధరిస్తాడు); అపవిత్రుడు. (శౌచాశౌచాలకి అతీత మైన వాడు); మదించి తిరుగువారికి, పిచ్చి వారికి నాయకుడు (ఉన్మదులనే భూతగణాలకి అధిపతి. లౌకిక విలువలు లెక్కచెయ్యని వాడు;). దుష్టబుద్ధి. (దుష్ట అర్థచేసుకోరాని నిగూఢ మనస్సు కలవాడు);. ఉగ్రమైన స్వభావం కల వాడు. (ఉగ్రుడు అంటే రుద్రుడు); శ్మశాన వాసి. (మరణ స్థితులకు అవ్వల నుండు వాడు); జుట్టు విరబోసుకొని ఉంటాడు. (సంకోచ సందేహాదులకు అతీతుడు); శుచి శుభ్రం లేకుండా మలినదేహంతో ఉంటారు. (అశుచి అంటే సర్వం తానే కనుక శుచి అశుచి భేదాలు లేని వాడు); అలాంటి వాడికి శివుడు అని ఎందుకో అసందర్భంగా పిలుస్తారు. శివుడు అంటే శుభాలను కలిగించే వాడు అని చూడొద్దా. (శివనాముడను ప్రవాదము పేరుకు మాత్రమే శివుడు అనటం అసందర్భం); ఇంతటి అశివుడు అని తెలిసికూడ, శూద్రునికి వేదాలు చెప్పినట్లు, శివుడు అని పేరు పెట్టారు.