పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : దక్షప్రజాపతి వంశ విస్తారము

 •  
 •  
 •  

4-27-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

జజునివలన భవ మం
ది యా దక్షప్రజాపతికి మను నిజ నం
యగు ప్రసూతి సతి యం
ఘా! పదియార్వు రుదయ మందిరి కన్యల్.

టీకా:

వనజజుని = బ్రహ్మదేవుని {వనజజుడు – వనము (నీరు) నందు జ (పుట్టినది) (పద్మము) అందు జుడు (పుట్టినవాడు) బ్రహ్మదేవుడు}; వలనన్ = కి; భవము = జన్మము; అందిన్ = పొందిన; ఆ = ఆ; దక్షప్రజాపతి = దక్షప్రజాపతి; కిన్ = కి; మను = మనువు యొక్క; నిజ = స్వంత; నందన = కూతురు; అగు = అయిన; ప్రసూతిసతి = ప్రసూతీదేవి; అందున్ = కి; అనఘా = పుణ్యుడా; పదియార్వుర్ = పదహారుగురు; ఉదయమందిరి = పుట్టిరి; కన్యల్ = ఆడపిల్లలు.

భావము:

బ్రహ్మ కుమారుడైన దక్షప్రజాపతికి స్వాయంభువ మనువు పుత్రిక అయిన ప్రసూతి వల్ల పదహారుమంది కుమార్తెలు కలిగారు.

4-28-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇట్లావిర్భవించిన కన్యకలందు శ్రద్ధయు, మైత్రియు, దయయు, శాంతియుఁ, దుష్టియుఁ, బుష్టియుఁ, బ్రియయుఁ, నున్నతియు, బుద్ధియు, మేధయుఁ, దితిక్షయు, హ్రీయు, మూర్తియు నను నామంబులు గల పదుమువ్వురను ధర్మరాజున కిచ్చె; నొక్క కన్యక నగ్నిదేవునకును నొక్కతెం బితృదేవతలకును నొక్కతె జన్మమరణాది నివర్తకుం డగు నభవునకుం బెండ్లి చేసె; నంత నా ధర్ముని పత్నుల యందు శ్రద్ధవలన శ్రుతంబును, మైత్రివలనఁ బ్రసాదంబును, దయవలన నభయంబును, శాంతివలన సుఖంబునుఁ, దుష్టివలన ముదంబునుఁ, బుష్టివలన స్మయంబునుఁ, బ్రియవలన యోగంబును, నున్నతివలన దర్పంబును, బుద్ధివలన నర్థంబును, మేధవలన స్మృతియుఁ, దితిక్షవలన క్షేమంబును, హ్రీవలనఁ బ్రశ్రయంబును, మూర్తివలన సకలకల్యాణగుణోత్పత్తి స్థానభూతు లగు నరనారాయణు లను ఋషు లిద్దఱును సంభవించిరి; వారల జన్మకాలంబున.

టీకా:

ఇట్లు = ఇలా; ఆవిర్భవించిన = పుట్టిన; శ్రద్ధయున్ = శ్రద్ధ; మైత్రియున్ = మైత్రి {మైత్రి - స్నేహము}; దయయున్ = దయ; శాంతియున్ = శాంతి {శాంతి – శమము, కామక్రోధాది రాహిత్యము, వ్యు. శమ (ఉశమే) క్తిన్, క-.ప్ర.}; తుష్టియున్ = తుష్టి {తుష్టి - సంతృప్తి}; పుష్టియున్ = పుష్టి {పుష్టి - బలము}; ప్రియయున్ = ప్రియ; ఉన్నతియున్ = ఉన్నతి {ఉన్నతి - అభివృద్ధి}; బుద్ధియున్ = బుద్ధి; మేధయున్ = మేధ {మేధ - తెలివి}; తితిక్షయున్ = తితిక్ష {తితిక్ష - ఓర్పు}; హ్రీయున్ = హ్రీ {హ్రీ - లజ్జ}; మూర్తియున్ = మూర్తి {మూర్తి - అందము}; అను = అనెడి; నామంబులు = పేర్లు; కల = కలిగిన; పదుమువ్వురను = పదమూడుమందిని (13); ధర్మరాజున్ = ధర్మరాజు; కిన్ = కి; ఇచ్చెన్ = వివాహముచేసెను; ఒక్క = ఒక; కన్యకన్ = ఆడపిల్లను; అగ్నిదేవున్ = అగ్నిదేవున; కునున్ = కి; ఒక్కతెన్ = ఒకర్తెను; ప్రితృదేవతల్ = ప్రితృదేవతల; కును = కి; ఒక్కతెన్ = ఒకర్తెను; జన్మ = జన్మములు; మరణ = మృతి; ఆది = మొదలైనవానిని; నివర్తకుండు = నియమించువాడు; అగు = అయిన; అభవున్ = శివుని; కున్ = కి; పెండ్లి = వివాహము; చేసెన్ = చేసెను; అంతన్ = అంతట; ఆ = ఆ; ధర్ముని = ధర్ముని యొక్క; పత్నులు = భార్యలు; అందున్ = అందు; శ్రద్ధ = శ్రద్ధ; వలనన్ = అందు; శ్రుతంబును = శ్రుతము {శ్రుతము - వినబడినది, శాస్త్రము}; మైత్రి = మైత్రి; వలనన్ = అందు; ప్రసాదంబును = ప్రసాదము {ప్రసాదము - ప్రసన్నత, అనుగ్రహము}; దయ = దయ; వలనన్ = అందు; అభయంబును = అభయము; శాంతి = శాంతి; వలనన్ = అందు; సుఖంబును = సుఖము; తుష్టి = తుష్టి; వలనన్ = అందు; ముదంబును = ముదము {ముదము - సంతోషము}; పుష్టి = పుష్టి; వలనన్ = వలన; స్మయంబును = స్మయము {స్మయము - గర్వము, ఆశ్చర్యము}; ప్రియ = ప్రియ; వలనన్ = అందు; యోగంబును = యోగము; ఉన్నతి = ఉన్నతి; వలనన్ = అందు; దర్పంబును = దర్పము; బుద్ధి = బుద్ధి; వలనన్ = అందు; అర్థంబును = అర్థము {అర్థము - ప్రయోజనము, ధనము}; మేధ = మేధ; వలనన్ = అందు; స్మృతియున్ = స్మృతి {స్మృతి - జ్ఞాపకము}; తితిక్ష = తితిక్ష; వలనన్ = అందు; క్షేమంబును = క్షేమము; హ్రీ = హ్రీ; వలనన్ = అందు; ప్రశ్రయంబును = ప్రశ్రయము {ప్రశ్రయము - అనునయము}; మూర్తి = మూర్తి {మూర్తి - అందము, స్వరూపము}; వలనన్ = అందు; సకల = సమస్తమైన; కల్యాణ = శుభకరమైన; గుణ = గుణములకును; ఉత్పత్తిస్థానభూతులు = జన్మస్థానము అయినవారు; అగు = అయిన; నరనారాయణులు = నరనారాయణులు; అను = అనెడి; ఋషులు = ఋషులు; ఇద్దఱును = ఇద్దరు; సంభవించిరి = పుట్టిరి; వారల = వారి; జన్మ = జీవించి యున్న, జీవిత; కాలంబున = కాలములో.

భావము:

దక్షుడు ఇలా జన్మించిన తన పదహారుమంది కుమార్తెలలో శ్రద్ధ, మైత్రి, దయ, శాంతి, తుష్టి, పుష్టి, ప్రియ, ఉన్నతి, బుద్ధి, మేధ, తితిక్ష, హ్రీ, మూర్తి అనే పదముగ్గురిని ధర్ముని కిచ్చి వివాహం చేసాడు. ఒక కుమార్తెను అగ్నిదేవునికి, ఒక కుమార్తెను పితృదేవతకు, మరొక కుమార్తెను జనన మరణాలు లేని శివునికి ఇచ్చాడు. ధర్ముని భార్యలలో శ్రద్ధ వల్ల శ్రుతం, మైత్రి వల్ల ప్రసాదం, దయ వల్ల అభయం, శాంతి వల్ల సుఖం, తుష్టి వల్ల ముదం, పుష్టి వల్ల స్మయం, ప్రియ వలన యోగం, ఉన్నతి వల్ల దర్పం, బుద్ధి వల్ల అర్థం, మేధ వల్ల స్మృతి, తితిక్ష వల్ల క్షేమం, హ్రీ వల్ల ప్రశ్రయం, మూర్తి వల్ల సకల కళ్యాణ గుణ సంపన్నులైన నరనారాయణులనే ఇద్దరు ఋషులు జన్మించారు. ఆ నరనారాయణులు పుట్టిన సమయంలో...

4-29-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

గంధవాహుఁడు మందతి ననుకూలుఁడై-
వీచె; నల్దిక్కులు విశద మయ్యె;
ఖిలలోకంబులు నానందమును బొందెఁ-
దుములమై దేవదుందుభులు మ్రోసెఁ;
రమొప్ప జలధుల లఁక లడంగెను-
మించినగతిఁ బ్రవహించె నదులు;
గంధర్వ కిన్నర గానముల్ వీతెంచె-
ప్సరోజనముల నాట్యమొనరె

4-29.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

సులు గురియించి రందంద విరులవాన;
మునిజనంబులు సంతోషమునఁ జెలంగి
వినుతు లొనరించి; రవ్వేళ విశ్వ మెల్లఁ
రమమంగళమై యొప్పె వ్యచరిత!

టీకా:

గంధవాహుడు = వాయుదేవుడు {గంధవాహుడు - గంధ (వాసనను) వాహుడు (మోసుకొని వెళ్ళువాడు), వాయుదేవుడు}; మందగతి = మెల్లిగ; అనుకూలుడు = అనుకూలముగ నున్నవాడు; ఐ = అయ్యి; వీచెన్ = వీచెను; నల్దిక్కులు = నాలుగు (4) దిక్కులు; విశదము = తేటపడినవి; అయ్యెన్ = అయినవి; అఖిల = సమస్తమైన; లోకంబులున్ = లోకములు; ఆనందమునున్ = సంతోషమును; పొందెన్ = పొందినవి; తుములము = సందడిచేయునవి; ఐ = అయ్యి; = దేవదుందుభులు = దేవతాభేరీలు; మ్రోసెన్ = మ్రోగినవి; కరము = మిక్కిలి; ఒప్పన్ = శోభతో; జలధులన్ = సముద్రము లందు {జలధి - జలము (నీటి)కి నిలయము, సముద్రము}; కలకలలు = సంక్షోభములు; అడంగెన్ = అణిగినవి; మించిన = మిక్కిలి; గతిన్ = వేగముతో; ప్రవహించె = ప్రవహించినవి; నదులు = నదులు; గంధర్వ = గంధర్వుల; కిన్నర = కిన్నరల; గానముల్ = పాటలు; వీతెంచె = వినవచ్చెను; అప్సరస్ = అప్సరసల; జనములు = సమూహముల; నాట్యము = నాట్యములు; ఒనరెన్ = కలిగాయి.
సురలు = దేవతలు; కురియించిరి = కురిపించిరి; అందంద = అక్కడక్కడ; విరుల = పూల; వాన = వర్షము; ముని = మునుల; జనంబులు = సమూహములు; సంతోషమునన్ = సంతోషముతో; చెలంగి = చెలరేగి; వినుతుల్ = స్తోత్రములు; ఒనరించిరి = చేసిరి; ఆ = ఆ; వేళ = సమయమున; విశ్వము = భువనము; ఎల్లన్ = అంతయు; పరమ = మిక్కిలి; మంగళము = శుభకరము; ఐ = అయ్యి; ఒప్పెన్ = చక్కగ నుండెను; భవ్యచరిత = యోగ్యమైన నడవడిక కలవాడ.

భావము:

(నరనారాయణులు జన్మించిన సమయంలో) అనుకూల వాయువు చల్లగా, మెల్లగా వీచింది. నాలుగు దిక్కులు ప్రకాశించాయి. అఖిల లోకాలు ఆనందం పొందాయి. ఆకాశంలో దేవ దుందుభులు మ్రోగాయి. సముద్రాలు కలతలు లేకుండా ప్రశాంతంగా ఉన్నాయి. నదులు వేగంగా ప్రవహించాయి. గంధర్వులు, కిన్నరులు గానం చేశారు. అప్సరసలు నాట్యం చేశారు. దేవతలు పూలవాన కురిపించారు. మునులు సంతోషంతో స్తుతించారు. ప్రపంచమంతా పరమ మంగళోపేతమై భాసించింది.

4-30-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఆ సమయంబున బ్రహ్మాది దేవత లమ్మహాత్ములకడకుఁ జనుదెంచి యిట్లని స్తుతించిరి.

టీకా:

ఆ = ఆ; సమయంబున = సమయమున; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆది = మొదలగు; దేవతలు = దేవతలు; ఆ = ఆ; మహాత్ముల = గొప్పవారి; కడకున్ = దగ్గరకు; చనుదెంచి = వచ్చి; ఇట్లని = ఇలా; స్తుతించిరి = స్తోత్రములు చేసిరి.

భావము:

ఆ సమయంలో బ్రహ్మ మొదలైన దేవతలు ఆ మహాత్ములైన నరనారాయణుల దగ్గరకు వచ్చి ఇలా స్తుతించారు.

4-31-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"గనస్థలిం దోఁచు గంధర్వనగరాది-
రూప భేదము లట్లు రూఢి మెఱసి
యే యాత్మయందేని యేపార మాయచే-
నీ విశ్వ మిటు రచియింపఁబడియె
ట్టి యాత్మప్రకాశార్థమై మునిరూప-
ముల ధర్ముగృహమునఁ బుట్టినట్టి
రమపురుష! నీకుఁ బ్రణమిల్లెద; మదియుఁ-
గాక యీ సృష్టి దుష్కర్మవృత్తి

4-31.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రగనీకుండు కొఱకునై త్త్వగుణము
చే సృజించిన మమ్మిట్లు శ్రీనివాస
మైన సరసీరుహప్రభ పహసించు
నీ కృపాలోకనంబుల నెమ్మిఁ జూడు."

టీకా:

గగనస్థలి = ఆకాశము నందు; తోచు = కనబడు ( మేఘములు); గంధర్వనగర = గంధర్వుల నగరములు, మేఘములు; ఆది = మొదలైన; రూప = ఆకారముల; భేదములు = రకములు; అట్లు = వలె; రూఢిన్ = చక్కగ; మెఱసి = ప్రకాశించి; ఏ = ఏ; ఆత్మ = పరమాత్మ; అందు = లో; ఏని = అయితే; ఏపారు = విస్తరిల్లు; మాయ = మాయ; చేన్ = చేత; ఈ = ఈ; విశ్వమున్ = జగము; ఇటు = ఈవిధముగ; రచియింపన్ = ఏర్పరుప; పడియెన్ = చేయబడినదో; అట్టి = అటువంటి; ఆత్మ = ఆత్మ; ప్రకాశార్థము = ప్రసిద్ధము చేయుట కొరకు; ఐ = అయ్యి; ముని = మునుల; రూపములన్ = రూపములతో; ధర్ము = ధర్ముని యొక్క; గృహమునన్ = ఇంట; పుట్టిన = జన్మంచిన; అట్టి = అటువంటి; పరమపురుష = మహాపురుషుడ; నీకున్ = నీకు; ప్రణమిల్లెదము = నమస్కరించెదము; ఈ = ఈ; సృష్టిన్ = సృష్టిలో; దుష్కర్మ = చెడుపనుల, పాపముల; వృత్తి = విస్తారము.
జరగనీకుండు = పెరగకుండుట; కొఱకున్ = కోసము; ఐ = అయ్యి; సత్త్వగుణము = సత్త్వగుణము; చేన్ = తో; సృజించిన = సృష్టించిన; మమ్ము = మమ్ములను; ఇట్లు = ఈవిధముగ; శ్రీ = సంపదలకు; నివాసము = నిలయము; ఐన = అయిన; సరసీరుహ = పద్మముల {సరసీరుహము - సరసునందు ఈరుహము(పుట్టునది), పద్మము}; ప్రభన్ = శోభను; అపహసించు = పరిహసించు; నీ = నీ యొక్క; కృపా = దయతోకూడిన; ఆలోకనంబులన్ = చూపులతో; నెమ్మిన్ = ప్రేమగా; చూడు = చూడుము.

భావము:

ఆకాశంలో గంధర్వనగరం పెక్కురూపాలను పొందినట్లు ఈ విశ్వం నీ మాయచేత సృష్టింపబడింది. నిన్ను నీవు లోకానికి తెలియజేయడానికి నరనారాయణుల రూపాలతో ధర్ముని ఇంట అవతరించావు. అటువంటి మహాపురుషుడ వయిన నీకు నమస్కారం. సృష్టిలో దుష్కర్మలు జరుగకుండా ఉండటానికి సత్త్వగుణంతో నీవే మమ్ము సృజించావు. అటువంటి మమ్ము శ్రీదేవికి నివాసమైన పద్మశోభను పరిహసించే నీ దయాదృష్టులతో మమ్ము చూడు.

4-32-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ని యిట్లు దేవగణములు
వినుతింపఁ గృపాకటాక్షవీక్షణములచేఁ
ని వారు గంధమాదన
ము కేగిరి తండ్రి ముదము ముప్పిరిగొనఁగన్.

టీకా:

అని = అని; ఇట్లు = ఇలా; దేవ = దేవతల; గణములు = సమూహములు; వినుతింపన్ = స్తుతింపగా; కృపా = దయతో కూడిన; కటాక్ష = కడకంటి; వీక్షణముల్ = చూపుల; చేన్ = తో; కని = చూసి; వారు = వారు; గంధమాదనమున్ = గంధమాదనపర్వతమున; కున్ = కు; ఏగిరి = వెళ్ళిరి; తండ్రి = తండ్రి యొక్క; ముదము = సంతోషము; ముప్పిరిగొనగన్ = ఉప్పొంగగ {ముప్పిరిగొను - మూడు పేటల పెరుగు, ఉప్పొంగు}.

భావము:

అని ఈ విధంగా దేవతలు స్తుతింపగా వారిని కరుణాకటాక్ష వీక్షణాలతో చూచి నరనారాయణులు తండ్రి సంతోషింపగా గంధమాదన పర్వతానికి వెళ్ళిపోయారు.

4-33-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ణీభర ముడుపుట కా
నారాయణులు భువి జన మనయము నొం
దిరి యర్జున కృష్ణాఖ్యలఁ
గురుయదువంశముల సత్త్వగుణయుతు లగుచున్.

టీకా:

ధరణీ = భూ, భూమి యొక్క; భరమున్ = భారమును; ఉడుపుటకు = తగ్గించుటకు; ఆ = ఆ; నరనారాయణులు = నరనారాయణులు; భువిన్ = భూమిపైన; జననమున్ = జన్మమును; అనయమున్ = అవశ్యము, తప్పకుండగ; ఒందిరి = పొందిరి; అర్జున = అర్జునుడు; కృష్ణ = కృష్ణుడు; ఆఖ్యలన్ = పేర్లతో; కురు = కౌరవ; యదు = యాదవ; వంశములన్ = వంశముల యందు; సత్త్వగుణ = సత్త్వగుణము; యుతులు = కలవారు; అగుచున్ = అవుతూ.

భావము:

భూభారాన్ని తగ్గించడానికి ఆ నరనారాయణులే అర్జునుడు, కృష్ణుడు అనే పేర్లతో కురు యదు వంశాలలో సత్త్వగుణ సంపన్నులై జన్మించారు.

4-34-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మఱియు నగ్నిదేవునకు దక్షపుత్రియైన స్వాహాదేవి యను భార్య యందు హుతభోజనులగు పావకుండును బవమానుండును శుచియు నను మువ్వురు గొడుకులు గలిగిరి; వారివలనం బంచచత్వారింశత్సంఖ్యలం గల యగ్ను లుత్పన్నంబు లయ్యె; నిట్లు పితృపితామహ యుక్తంబుగా నేకోనపంచాశత్సంఖ్యలు గల యగ్నులు బ్రహ్మవాదులచే యజ్ఞకర్మంబులం దగ్నిదేవతాకంబు లైన యిష్టులు దత్తన్నామంబులచేతఁ జేయంబడుచుండు; నా యగ్ను లెవ్వరనిన నగ్నిష్వాత్తులు బర్హిషదులు సౌమ్యులు బితలు నాజ్యపులు సాగ్నులు నిరగ్నులు నన నేడు దెఱంగులై యుందురు; దాక్షాయణి యగు స్వధ యను ధర్మపత్ని యందు వారలవలన వయునయు ధారిణియు నను నిద్దఱు కన్య లుదయించి జ్ఞానవిజ్ఞానపారగ లగుచు బ్రహ్మనిష్ఠ లయి పరఁగిరి; వెండియు.

టీకా:

మఱియున్ = ఇంకను; అగ్నిదేవున్ = అగ్నిదేవుని; కున్ = కి; దక్ష = దక్షుని; పుత్రి = కుమార్తె; ఐన = అయిన; స్వాహాదేవి = స్వాహాదేవి; అను = అనెడి; భార్య = భార్య; అందున్ = అందు; హుత = హోమముచేయబడిన ద్రవ్యములు; భోజనులు = తినువారు; అగు = అయిన; పావకుండును = పావకుడు {పావకుడు - పవిత్రము చేయువాడు}; పవమానుండు = పవమానుడు {పవమానుడు - వాయుదేవుడు}; శుచియున్ = శుచి {శుచి - పరిశుద్ధి యైనవాడు}; అను = అనెడి; మువ్వురు = ముగ్గురు; కొడుకులున్ = పుత్రులు; కలిగిరి = పుట్టిరి; వారి = వారి; వలన = వలన; పంచచత్వారింశత = నలభైయైదు (45); సంఖ్యలుగల = లెక్కకువచ్చు; అగ్నులు = అగ్నులు; ఉత్పన్నంబులు = పుట్టినవి; అయ్యెన్ = అయినవి; ఇట్లు = ఈ విధముగ; పితృ = తండ్రి; పితామహ = తాతలతో; యుక్తంబుగాన్ = కలిపి; ఏకోనపంచాశత = ఒకటితక్కువఏభై (49); సంఖ్యలుగల = లెక్కకువచ్చు; అగ్నులు = అగ్నులు; బ్రహ్మవాదులు = వేదము నుచ్చరించువారి; చేన్ = చేత; యజ్ఞ = యజ్ఞముల; కర్మములు = పనుల; అందున్ = లో; అగ్ని = అగ్ని; దేవతాకంబులు = దేవతలుగా కలవి; ఐన = అయినట్టి; ఇష్టులన్ = యాగములందు {ఇష్టి - కోరికల సాదనకై చేయు యజ్ఞములు}; త్తత్తత్ = ఆయా; నామంబుల్ = పేర్ల; చేతన్ = తో; చేయంబడుచున్ = చేయబడుతూ; ఉండు = ఉండును; ఆ = ఆ; అగ్నులు = అగ్నులు; ఎవ్వరు = ఎవరు; అనినన్ = అనగా; అగ్నిష్వాత్తులు = అగ్నిష్వాత్తులు {అగ్నిష్వాత్తులు - అగ్నికలవారు}; బర్హిషదులు = బర్హిషదులు {బర్హిషదులు - బర్హి (దర్భ)లందు కలవారు}; సౌమ్యులు = సౌమ్యులు {సౌమ్యులు - సోమమునకు చెందినవారు}; పితలు = పితలు {పితలు - పూర్వ వంశీకులకు చెందినవారు, పిహ (దహింప) చేయువారు}; ఆజ్యపులు = ఆజ్యపులు {ఆజ్యపులు - ఆజ్యము (నేతి)ని తాగువారు}; సాగ్నులు = సాగ్నులు {సాగ్నులు – మంటలతో నుండువారు}; నిరగ్నులు = నిరగ్నులు {నిరగ్నులు – మంటలేక నుండువారు}; అనన్ = అనగా; ఏడు = ఏడు (7); తెఱంగులు = విధములుగ; ఐ = అయ్యి; ఉందురు = ఉంటారు; దాక్షాయణి = దక్షునిపుత్రిక; అగు = అయిన; స్వధ = స్వధ {స్వధ - స్వయముగ (తనకుతానై) ధరించునామె, సత్తువ}; అను = అనెడి; ధర్మపత్ని = భార్య; అందున్ = అందు; వారల = వారి; వలన = వలన; వయునయున్ = వయున {వయున – జ్ఞానము, తెలివి కలామె}; ధారిణియున్ = ధారిణి {ధారిణి – ధారణాశక్తి కలామె }; అను = అనెడి; ఇద్దఱున్ = ఇద్దరు; కన్యలు = ఆడపిల్లలు; ఉదయించి = పుట్టి; జ్ఞాన = జ్ఞానము; విజ్ఞాన = విజ్ఞానములలో; పారగులు = బహునేర్పరులు; అగుచున్ = అవుతూ; బ్రహ్మనిష్ఠలు = బ్రహ్మనిష్ఠ కలవారు; ఐ = అయ్యి; పరిగిరి = ప్రసిద్ధిచెందిరి; వెండియున్ = తరువాత.

భావము:

ఇంకా అగ్నిదేవునకు దక్షుని కుమార్తె అయిన స్వాహాదేవి అనే భార్య వల్ల పావకుడు, పవమానుడు, శుచి అనే ముగ్గురు కొడుకులు కలిగారు. ఆ ముగ్గురివల్ల నలభైఐదు విధాలైన అగ్నులు ఉద్భవించాయి. తాత, తండ్రులతో కూడి మొత్తం నలభైతొమ్మిది అగ్నులు అయినాయి. అగ్నిష్వాత్తులు, బర్హిషదులు, సౌమ్యులు, పితలు, ఆజ్యపులు, సాగ్నులు, విరగ్నులు అని ఏడు విధాలైన ఆ అగ్నుల నామాలతో బ్రహ్మవాదులైనవారు యజ్ఞకర్మలలో ఇష్టులు నిర్వహిస్తూ ఉంటారు. దక్ష ప్రజాపతి పుత్రిక అయిన స్వధ అనే భార్యవల్ల ఆ అగ్నులకు వయున, ధారిణి అనే ఇద్దరు కన్యలు పుట్టారు. వారిద్దరూ జ్ఞాన విజ్ఞాన పరాయణలు. బ్రహ్మనిష్ఠ కలవారు.