పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : కర్దమప్రజాపతి వంశాభివృద్ధి

 •  
 •  
 •  

4-7-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నుఁడౌ మరీచికిఁ ర్దమాత్మజ యగు-
ళ యను నంగనలనఁ గశ్య
పుం డను కొడుకును బూర్ణిమ యను నాఁడు-
బిడ్డయుఁ బుట్టిరి పేర్చి వారి
లనఁ బుట్టిన ప్రజాళి పరంపరలచే-
భువనంబు లెల్ల నాపూర్ణ మగుచు
రగెను; బూర్ణిమ న్మాంతరంబున-
రిపదప్రక్షాళితాంబువు లను

4-7.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

గంగ యను పేరఁ బుట్టిన న్య దేవ
కుల్య యను దాని నొక్కతె గూఁతు నఖిల
విష్టపవ్యాపకుం డగు విరజుఁ డనెడి
నయు నొక్కనిఁ గాంచె మోదంబుతోడ.

టీకా:

ఘనుడౌ = గౌప్పవాడైన; మరీచి = మరీచి {మరీచి - కిరణము}; కిన్ = కి; కర్దమాత్మజ = కర్దముని పుత్రి; అగు = అయినట్టి; కళ = కళ; అను = అనెడి; అంగన = స్త్రీ {అంగన - మంచి అంగములు కలామె, స్త్రీ}; వలనన్ = అందు; కశ్యపుండు = కశ్యపుడు {కశ్యపుడు - గ్రహముల ఆవరించి యుండు ఆకాశము}; అను = అనెడి; కొడుకును = కొడుకును; పూర్ణిమ = పూర్ణిమ {పూర్ణిమ - చంద్రుని పూర్ణ బింబము}; అను = అనెడి; ఆడుబిడ్డయున్ = ఆడపిల్ల; పుట్టిరి = జన్మించిరి; పేర్చి = కూడి, అతిశయించి; వారి = వారి; వలనన్ = వలన; పుట్టిన = జన్మించిన; ప్రజా = సంతతుల; ఆవళి = సమూహముల; పరంపరల్ = వరుసలు; చేన్ = చేత; భవనంబులు = లోకములు; ఎల్లన్ = అన్నియును; ఆపూర్ణము = నిండినవి; అగుచున్ = అగుట; జరిగెను = జరిగెను; పూర్ణిమ = పూర్ణిమ; జన్మాంతరంబున = మరొక జన్మలో; హరిపదప్రక్షాళితాంబులు = విష్ణుమూర్తి పాదములు కడిగిన నీళ్ళు; అను = అనెడి.
గంగ = గంగ; అను = అనెడి; పేరన్ = పేరుతో; పుట్టిన = జన్మించినట్టి; కన్య = స్త్రీ; దేవకుల్య = దేవకుల్య {దేవకుల్య - దేవనది}; అను = అనెడి; దానిన్ = దానిని; ఒక్కతెన్ = ఒకర్తెను; కూతున్ = పుత్రికను; అఖిల = సమస్తమైన; విష్టప = లోకములను; వ్యాపకుండు = వ్యాపించినవాడు; అగు = అయినట్టి; విరజుడు = విరజుడు {విరజుడు - రజోగుణము లేనివాడు}; అనెడి = అనెడి; తనయున్ = పుత్రుని; ఒక్కనిన్ = ఒక్కడిని; కాంచె = పుట్టించెను; మోదంబు = సంతోషము; తోడన్ = తో.

భావము:

గొప్పవాడైన మరీచి మహర్షికి కర్దముని కూతురైన కళ అనే భార్యవల్ల కశ్యపుడు అనే కొడుకు, పూర్ణిమ అనే కూతురు పుట్టారు. ఆ కశ్యపుని సంతానం లోకాలన్నిటా నిండిపోయింది. ఆ పూర్ణిమ మరుజన్మలో విష్ణువుయొక్క పాదప్రక్షాళన జలాలతో గంగగా పుట్టినట్టి, దేవకుల్య అనే కుమార్తెను, విరజుడు అనే కుమారుని కన్నది.

4-8-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఘుం డత్రిమహాముని
సూయాదేవివలన జ హరి పురసూ
నుల కళాంశంబుల నం
నులను మువ్వురను గాంచెఁ ద్దయుఁ బ్రీతిన్."

టీకా:

అనఘుండు = పాపము లేనివాడు; అత్రి = అత్రి అనెడి; మహా = గొప్ప; ముని = ముని; అనసూయాదేవి = అనసూయాదేవి; వలనన్ = అందు; అజ = బ్రహ్మదేవుడు {అజుడు - పుట్టుక లేనివాడు, బ్రహ్మదేవుడు}; హరి = విష్ణుమూర్తి; పురసూదనుల = శివుడుల యొక్క {పురసూదనుడు - పురములను కూల్చినవాడు, శంకరుడు}; కళ = కళల యొక్క; అంశంబులన్ = అంశలతో; నందనులనున్ = పుత్రులను; మువ్వురనున్ = ముగ్గురిని (3); కాంచెన్ = కనెను; దద్దయు = మిక్కిలి; ప్రీతిన్ = ప్రీతితో.

భావము:

పుణ్యాత్ముడయిన అత్రిమహాముని తన భార్య అయిన అనసూయాదేవి వల్ల బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశలతో ముగ్గురు కొడుకులను పొందాడు.”

4-9-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వుడు విదురుఁడు మైత్రే
యునిఁ గనుఁగొని పలికె "మునిజనోత్తమ! జగతిన్
నస్థితిలయకారణు
వెలసిన పద్మగర్భ రి హరు లెలమిన్.

టీకా:

అనవుడు = అని చెప్పగా; విదురుఁడు = విదురుడు; మైత్రేయునిన్ = మైత్రేయుడిని; కనుఁగొని = చూసి; పలికె = అనెను; ముని = మునులైన; జన = ప్రజలలో; ఉత్తమ = ఉత్తమమైనవాడ; జగతిన్ = లోకమున; జననస్థితిలయకారణులు = ప్రపంచ కారణులు { జననస్థితిలయకారణులు – జనన -సృష్టి; స్థితి - స్థితి; లయ లయములకు; కారణులు - కారణభూతులు}; అన = అనగా; వెలసిన = అవతరించిన; పద్మగర్భ = బ్రహ్మదేవుడు {పద్మగర్భ - పద్మమున జన్మించినవాడు, బ్రహ్మదేవుడు}; హరి = నారాయణుడు; హరులు = శివుడు; ఎలమిన్ = దయతో.

భావము:

అని మైత్రేయుడు చెప్పగా విదురుడు అతన్ని చూచి ఇలా అన్నాడు “మునీంద్రా! జగత్తు పుట్టుటకు, ఉనికికి, వినాశనానికి కారణమైన బ్రహ్మ, విష్ణువు, శివుడు....

4-10-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మి నిమిత్తం బత్రి మ
హాముని మందిరమునందు నసూయకు ను
ద్దాగుణు లుదయమై" రన
నా మైత్రేయుండు పలికె వ్విదురునితోన్.

టీకా:

ఏమి = ఏమి; నిమిత్తంబునన్ = కారణముచేత; అత్రి = అత్రి అనెడి; మహాముని = గొప్పముని; మందిరము = ఇంటి; అందు = లో; అనసూయ = అనసూయాదేవి; కున్ = కు; ఉద్ధామ = ఉత్తమమైన; గుణులు = గుణములు కలవారు; ఉదయమైరి = జన్మించిరి; అనన్ = అని పలుకగా; ఆ = ఆ; మైత్రేయుండు = మైత్రేయుడు; పలికెన్ = చెప్పెను; ఆ = ఆ; విదురుని = విదురుని; తోన్ = తో.

భావము:

ఏ కారణంచేత అత్రిమహాముని ఇంట అనసూయకు కుమారులై జన్మించారు?” అనగా మైత్రేయుడు ఆ విదురునితో ఇలా అన్నాడు.

4-11-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"సుచరిత్ర! విను విధిచోదితుండై యత్రి-
ప మాచరింపఁ గాంతా సమేతుఁ
యి ఋక్షనామ కులాద్రి తటంబున-
ఘుమఘుమారావ సంకుల విలోల
ల్లోల జాల సంలిత నిర్వింధ్యా న-
దీల పరిపుష్ట రాజితప్ర
సూ గుచ్ఛస్వచ్ఛ మానితాశోక ప-
లాశ కాంతారస్థమున కెలమి

4-11.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రిగి యచ్చట నిర్ద్వంద్వుఁ గుచుఁ బ్రాణ
నియమమున నేక పదమున నిలిచి గాలిఁ
దివుటఁ గ్రోలి కృశీభూతదేహుఁ డగుచుఁ
పముఁ గావించె దివ్యవత్సరశతంబు.

టీకా:

సుచరిత్ర = మంచి వర్తన కలవాడ; విను = వినుము; విధి = బ్రహ్మదేవునిచే; చోదితుండు = ప్రేరేపింబడినవాడు; ఐ = అయ్యి; అత్రి = అత్రి; తపము = తపస్సు; ఆచరింపన్ = చేయుటకు; కాంతా = భార్యా; సమేతుండు = తోకూడినవాడు; అయి = అయ్యి; = ఋక్ష = ఋక్ష అనెడి; నామ = పేరుగల; కులాద్రి = కులపర్వతము; తటంబున = సానువు నందు; ఘమఘమారావ = ఘమఘమ యను శబ్దములు; సంకుల = వ్యాపించుతూ; విలోల = ప్రవహిస్తున్న; కల్లోల = పెద్ద అలల; జాల = సమూహములతో; సంకలిత = కూడిన; నిర్వింధ్యా = నిర్వింధ్య అనెడి; నదీ = నదియొక్క; జల = నీటిచే; పరిపుష్ట = చక్కగా పోషింపబడుతున్న; రాజిత = విలసిల్లుతున్న; ప్రసూన = పూల; గుచ్ఛ = గుత్తుల; స్వచ్ఛ = స్వచ్ఛతతో; మానిత = గౌరవింపబడిన; అశోక = నరమామిడి చెట్లు; పలాశ = మోదుగ చెట్ల; కాంతార = అటవీ; స్థలమున్ = ప్రదేశమున; కిన్ = కి; ఎలమిన్ = వికాసముగా, సంతోషముగా; అరిగి = వెళ్ళి.
అచ్చట = అక్కడ; నిర్ద్వంద్వుడు = ద్వంద్వములు విడచినవాడు {నిర్ద్వంద్వండు - సుఖదుఃఖ శీతోష్ణాది ద్వంద్వములను అధిగమించినవాడు}; అగుచున్ = అవుతూ; ప్రాణనియమమున = ప్రాణాయామపూర్వకముగ; ఏకపదమున = ఒంటికాలిమీద; నిలిచి = నిలబడి; గాలిన్ = గాలిని; తివుటన్ = కోరి; క్రోలి = త్రాగుతూ; కృశీభూత = శుష్కించిపోయిన; దేహుడు = శరీరము కలవాడు; అగుచున్ = అవుతూ; తపమున్ = తపస్సును; కావించెన్ = చేసెను; దివ్యవత్సర = దివ్యసంవత్సరములు {దివ్యవత్సరము - 365 దివ్యదినములు (365 మానవసంవత్సరములు)}; శతమున్ = నూరింటిని (100).

భావము:

“పుణ్యాత్మా! విను. విధిప్రేరణతో అత్రిమహర్షి తపస్సు చేయడానికి పూనుకొని, భార్య అయిన అనసూయతో కూడి ఋక్షం అనే కులపర్వతానికి వెళ్ళాడు. అక్కడ నిర్వింధ్యానది ఉత్తుంగ తరంగాలతో ప్రవహిస్తున్నది. ఆ నదీ ప్రవాహం వల్ల అక్కడి అడవిలోని అశోకవృక్షాలు, మోదుగుచెట్లు ఏపుగా పెరిగి పూలగుత్తులతో నిండి కనువిందు చేస్తున్నాయి. అటువంటి ప్రదేశంలో అత్రిమహర్షి జితేంద్రియుడై ప్రాణాలను నియమించి, ఒంటికాలిపై నిలుచుండి, శీతోష్ణ సుఖదుఃఖాది ద్వంద్వాలను జయించి, గాలిని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ నూరు దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు. అతని శరీరం బాగా కృశించింది.

4-12-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇట్లతి ఘోరం బైన తపంబు సేయుచుఁ దన చిత్తంబున.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; అతి = మిక్కిలి; ఘోరంబు = భయంకరము; ఐన = అయినట్టి; తపంబున్ = తపస్సును; చేయుచున్ = చేస్తూ; తన = తన యొక్క; చిత్తంబునన్ = మనసులో.

భావము:

ఇలా మిక్కిలి తీవ్రమైన తపస్సు చేస్తూ తన మనస్సులో...

4-13-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

విభుఁడు జగదధీశ్వరుఁ
డా విభు శరణంబు సొత్తు తఁ డాత్మసమం
బై వెలసిన సంతతిని ద
యారమతి నిచ్చుఁగాక ని తలఁచు నెడన్.

టీకా:

ఏ = ఏ; విభుండున్ = ప్రభువు ఐతే; జగత్ = భువనమునకు; అధీశ్వరుడు = ప్రభువో; ఆ = ఆ; విభున్ = ప్రభువును; శరణంబు = శరణము; సొత్తున్ = వేడెదను; అతడు = అతను; ఆత్మ = తనకు; సమంబు = సమానము; ఐ = అయ్యి; వెలసిన = విలసిల్లు; సంతతిని = సంతానమును; దయా = దయతో కూడిన; వరమతి = వరము ప్రసాదించే మనసుతో; ఇచ్చు = ఇయ్య; కాక = వలసినది; అని = అని; తలచున్ = అనుకొను; ఎడన్ = సమయములో.

భావము:

ఏ ప్రభువు ఈ సమస్త లోకాలకు అధీశ్వరుడో అతనిని శరణు కోరుతున్నాను. ఆ ప్రభువు దయతో తనతో సమానమైన సంతానాన్ని నాకు ప్రసాదించుగాక!’ అని భావించుచుండగా...

4-14-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మునుకొని యత్తపోధనుని మూర్ధజమైన తపః కృశాను చే
ను ద్రిజగంబులుం గరఁగి ప్తము లైనను జూచి పంకజా
మురశాసనత్రిపురశాసను లచ్చటి కేఁగి రప్సరో
సుర సిద్ధ సాధ్య ముని న్నుత భూరియశోభిరాములై.

టీకా:

మునుకొని = పూనుకొని; ఆ = ఆ; తపోధనుని = తపస్సు అను ధనము కలవాని; మూర్ధజమైన = శిరస్సున పుట్టినట్టి; తపస్ = తపస్సు యొక్క; కృశాను = కృశానువు, అగ్ని; చేతను = వలన; త్రిజగములున్ = ముల్లోకములును; కరగి = కాగి; తప్తములు = కాలినవి; ఐనను = కాగా; చూచి = చూసి; పంకజాసన = బ్రహ్మదేవుడు {పంక జాసనుడు - పంకజము (నీట పుట్టినది, పద్మము) యందు ఆసనుడు (ఉండువాడు), బ్రహ్మదేవుడు}; మురశాసన = విష్ణుమూర్తి {ముర శాసనుడు - ముర యను రాక్షసుని శాసించినవాడు, నారాయణుడు}; త్రిపురశాసనులు = శివుడును {త్రిపుర శాసనుడు - త్రిపురములను కూల్చినవాడు, శంకరుడు}; అచ్చటికిన్ = అక్కడికి; ఏగిరి = వెళ్ళిరి; అప్సరస్ = అప్సరసలు; జన = సమూహము; సుర = దేవతలు; సిద్ధ = సిద్ధులు; సాధ్య = సాధ్యులు; ముని = మునులతో; సన్నుత = చక్కగా స్తోత్రము చేయబడుతున్న; భూరి = అత్యధికమైన {భూరి - సంఖ్యాలలో 1 తరువాత 34 సున్నాలతో చాల పెద్దది అదే కోటియాతే 7 సున్నాలే ఉంటాయి, అత్యధికమైన}; యశో = కీర్తితో; అభిరాములు = ప్రకాశించువారు; ఐ = అయ్యి.

భావము:

ఆ అత్రిమహాముని శిరస్సునుండి వెలువడిన అగ్నిజ్వాలలచేత మూడులోకాలు కరిగి వేడెక్కగా చూచి అప్సరసలు, దేవతలు, సిద్ధులు, సాధ్యులు, మునులు తమ యశస్సును గానం చేస్తుండగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అతని దగ్గరకు వెళ్ళారు.

4-15-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అట్లు మునీంద్రు నాశ్రమంబు డాయం జను నవసరంబున.

టీకా:

అట్లు = అలా; మునీంద్రు = మునులలో శ్రేష్ఠుని; ఆశ్రమంబున్ = ఆశ్రమము; డాయన్ = దగ్గరకు; జను = వెళ్ళు; అవసరంబున = సమయమున.

భావము:

ఆ విధంగా ఆ మునీంద్రుని ఆశ్రమాన్ని సమీపించే సమయంలో...

4-16-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఘతపోభిరాముఁ డగు త్రి మునీంద్రుఁడు గాంచెఁ దప్తకాం
ఘన చంద్రికా రుచిర చారుశరీరుల హంస నాగసూ
వృషభేంద్ర వాహుల నుదారకమండలు చక్ర శూల సా
నుల విరించి విష్ణు పురదాహుల వాక్కమలాంబికేశులన్.

టీకా:

అనఘ = పవిత్రమైన; తపస్ = తపస్సుచే; అభిరాముడు = ఒప్పుతున్నవాడు; అగు = అయిన; అత్రి = అత్రి అనెడి; మునీంద్రుడున్ = మునులలో శ్రేష్ఠుడు; కాంచెన్ = చూసెను; తప్త = బాగా కాలిన {తప్త కాంచన రుచిర శరీరి - తప్తకాంచనము (పుటము వేసిన బంగారము) వంటి రుచిర (రంగుకలిగిన) శరీరి (దేహము కలవాడు), బ్రహ్మదేవు}; కాంచన = బంగారము; ఘన = మేఘము {ఘన రుచిర శరీరి - ఘన (మేఘము) వంటి రుచిర (రంగు కలిగిన) శరీరి (దేహము కలవాడు), విష్ణువు}; చంద్రికా = వెన్నెలల వంటి {చంద్రికా రుచిర శరీరి - చంద్రిక (వెన్నెల) వంటి రుచిర (రంగు కలిగిన) శరీరి (దేహము కలవాడు), శివుడు}; రుచిర = రంగులతో; చారు = అందమైన; శరీరుల = దేహములు కలవారిని; హంస = హంస {హంస - బ్రహ్మదేవుని వాహనము}; నాగసూదన = గరుత్మంతుడు {గరుత్మంతుడు - విష్ణుని వాహనము}; వృషభేంద్ర = శ్రేష్ఠమైన వృషభము {వృషభము - శివుని వాహనము}; వాహులన్ = వాహనములుగా కలవారిని; ఉదార = గొప్ప; కమండలు = కమండలము; చక్ర = చక్రము; శూల = త్రిశూలము; సాధనులన్ = ఆయుధములుగా కలవారిని; విరించి = బ్రహ్మదేవుడు {విరించి - వివరముగ రచించువాడు, బ్రహ్మదేవుడు}; విష్ణు = విష్ణుమూర్తి {విష్ణువు - ప్రకాశింపజేయువాడు, నారాయణుడు}; పురదాహుల = శంకరులను {పురదాహు - త్రిపురములను దహింపజేసినవాడు, శివుడు}; వాక్కు = సరస్వతిదేవి; కమల = లక్ష్మీదేవి; అంబిక = పార్వతీదేవి; ఈశులన్ = భర్తలని.

భావము:

సరస్వతీ లక్ష్మీ గౌరీ వల్లభులైన ఆ త్రిమూర్తులను అత్రి మహర్షి చూచాడు. బ్రహ్మ మేలిమి బంగారం వలె పసుపుపచ్చగా ఉన్నాడు. విష్ణువు మేఘంవలె నల్లగా ఉన్నాడు. శివుడు వెన్నెలవలె తెల్లగా ఉన్నాడు. బ్రహ్మ హంసను, హరి గరుత్మంతుని, శివుడు వృషభాన్ని అధిష్ఠించి ఉన్నారు. బ్రహ్మ చేతిలో కమండలువు, విష్ణువు చేతిలో చక్రం, శివుని చేతిలో త్రిశూలం ఉన్నాయి.
సూత్రం :- “ఒకదాని తరువాత ఒకటి వరుసగా సమాన సంఖయాకాలయ్యే వాటి యొక్క సముదాయం ఉంటే యథాసంఖ్య (క్రమ) అలంకారం.” బ్రహ్మవిష్ణుమహేశ్వరులను వారి శరీర ఛాయ, వాహనాలు, ఆయుధాలు, భార్యలను క్రమాలంకారంలో చెప్పడంలో యథాసంఖ్య (క్రమ) అలంకారం వెల్లివిరిసింది ఇక్కడ ఆస్వాదించండి.

4-17-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మఱియుఁ గృపావలోకన మందహాస సుందర వదనారవిందంబులు గల మహాత్ముల సందర్శించి; యమందానంద కందళిత హృదయార విందుండై సాష్టాంగ దండప్రణామంబు లాచరించి పుష్పాంజలి గావించి నిటలతట ఘటిత కరపుటుం డై దుర్నిరీక్ష్యంబైన తత్తేజోవిశేషంబు దేఱి చూడంజాలక ముకుళితనేత్రుండై తత్పదాయత్త చిత్తుం డగుచు సర్వలోక గరిష్ఠంబు లైన మృదుమధుర గంభీర భాషణంబుల నిట్లని స్తుతియించె.

టీకా:

మఱియున్ = ఇంకను; కృపావలోకన = దయతో కూడిన చూపులు; మందహాస = చిరునవ్వులు కల; సుందర = అందమైన; వదన = మోములు అనెడి; అరవిందంబులున్ = పద్మములు; కల = కలిగిన; మహాత్ముల = గొప్పవారిని; సందర్శించి = చక్కగా చూసి; అమంద = మిక్కిలి {అమంద – తక్కువ కాని}; ఆనంద = ఆనందముతో; కందళిత = వికసించిన; హృదయ = హృదయ మనెడి; అరవిందుండు = పద్మము కలవాడు; ఐ = అయ్యి; సాష్టాంగదండప్రణామంబులు = సాష్టాంగనమస్కారములు {సాష్టాంగ దండ ప్రణామము - స (తోకూడిన) అష్టాంగ (ఎనిమిది అంగములు, 1నుదురు 2కళ్ళు 3ముక్కు 4చెవులు 5నోరు 6వక్షము 7కాళ్లు 8చేతులు) దండ (కఱ్ఱవలె తిన్ననైన) విధముగ నుండి చేయు ప్రణామము (నమస్కారము)}; ఆచరించి = చేసి; పుష్పాంజలిన్ = పుష్పాంజలిని {పుష్పాంజలి - పుష్పములు గల దోసిలి జోడించి చేయు నమస్కారము}; కావించి = చేసి; నిటలతట = నుదురు ప్రదేశమున; ఘటిత = చేర్చబడిన; కరపుటుండు = దోసిలి కలవాడు; ఐ = అయ్యి; దుర్నిరీక్ష్యంబు = తేరిపారచూడ శక్యము కానిది; ఐన = అయినట్టి; తత్ = ఆ; తేజః = తేజస్సు యొక్క; విశేషంబు = గొప్పదనమును; తేఱి = తేరిపార; చూడన్ = చూచుటకు; చాలక = సామర్థ్యము సరిపడక; ముకుళిత = ముకుళించిన, దించిన; నేత్రుండు = కన్నులు కలవాడు; ఐ = అయ్యి; తత్ = వారి; పద = పాదము లందు; ఆయత్త = లగ్నమైన; చిత్తుండు = మనసు కలవాడు; అగుచున్ = అవుతూ; సర్వ = సమస్తమైన; లోక = లోకము లందు; గరిష్ఠంబులు = గొప్పవి; ఐన = అయినట్టి; మృదు = సున్నితమైన; మధుర = మధురమైన; గంభీర = గంభీరమైన; భాషణంబులన్ = మాటలతో; ఇట్టు = ఈ విధముగ; అని = పలికి; స్తుతియించె = స్తోత్రములు చేసెను.

భావము:

ఇంకా కరుణాకటాక్షవీక్షణాలను ప్రసరింపజేసే ముఖాలలో చిరునవ్వులు చిందులాడుతున్న ఆ మహాత్ములను చూచి అత్రి పట్టరాని ఆనందంతో పొంగిపోయి, సాగిలపడి నమస్కరించి, పుష్పాంజలి సమర్పించి, నుదుట చేతులు మోడ్చి, కన్నులకు మిరుమిట్లు గొలిపే ఆ త్రిమూర్తుల తేజస్సును చూడలేక కన్నులు మూసుకొని, వారి పాదాలపైనే తన మనస్సును లగ్నం చేసి మృదువుగా, మధురంగా, గంభీరంగా ఇలా స్తుతించాడు.
”అనఘతపోభిరాముఁ డగు” పద్యంలోనుంచి క్రమాలంకారం పొంగి పొర్లిందా అన్న అభాసం స్పురించే “కృపావలోకన మందహాస సుందర వదనారవిందంబులు గల మహాత్ముల” పదాల అందం చూసారా?

4-18-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"ప్రతి కల్పమందు సర్వప్రపంచోద్భవ-
స్థితి వినాశంబులఁ జేయునట్టి
హిత మాయాగుణయ దేహములఁ బొల్చు-
జ వాసుదేవ శివాభిధాన
ములు గల్గు మీ పాదజాతములకు నే-
తిభక్తి వందనం బాచరింతు;
ఖిల చేతన మానసాగమ్య మన నొప్పు-
మూర్తులు గల్గు మీ మువ్వురందుఁ

4-18.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రఁగ నాచేతఁ బిలువంగఁ డిన ధీరుఁ
డెవ్వఁడే నొక్కరునిఁ బిల్వ నిపుడు మీరు
మువ్వు రేతెంచుటకు నాదు బుద్ధి విస్మ
యంబు గదిరెడిఁ జెప్పరే నఘులార!

టీకా:

ప్రతి = అన్ని; కల్పము = కల్పముల; అందు = లోను; సర్వ = సమస్తమైన; ప్రపంచన్ = ప్రపంచములకు; ఉద్భవ = సృష్టి; స్థితి = స్థితి; వినాశంబులన్ = లయములను; చేయునట్టి = కలిగించెడి; మహిత = గొప్ప; మాయా = మాయతో నేర్పడిన; గుణ = గుణములుతో; మయ = కూడిన; దేహంబులన్ = శరీరము లందు; పొల్చు = ఒప్పుతున్నవారు; అజ = బ్రహ్మదేవుడు {అజ - పుట్టుక లేనివాడు, బ్రహ్మదేవుడు}; వాసుదేవ = విష్ణుమూర్తి {వాసుదేవ - వసించి ఉండు దేవుడు, విష్ణుమూర్తి}; శివ = శివుడును {శివ - శుభకరమైనవాడు, శంకరుడు}; అభిదానములు = పేర్లు; కల్గు = కలిగియున్నట్టి; = మీ = మీ; పాద = పాదము లనెడి; జలజాతముల్ = పద్మముల; కున్ = కు; నేన్ = నేను; అతి = మిక్కిలి; భక్తిన్ = భక్తితో; వందనంబు = నమస్కారములు; ఆచరింతు = చేసెదను; అఖిల = సమస్తమైన; చేతన = చేతనములకు; మానస = మనస్సులకు; అగమ్యము = అందనిది; అనన్ = అనుటకు; ఒప్పు = సరిపడు; మూర్తులున్ = స్వరూపములు; కల్గు = కలిగియుండు; మీ = మీరు; మువ్వురు = ముగ్గురు; అందు = లో; పరగన్ = ప్రసిద్ధముగ.
నా = నా; చేతన్ = చేత; పిలువంగబడిన = పిలువబడ్డ; ధీరుడు = గొప్పవాడు; ఎవ్వడు = ఎవరు; ఏని = అయినా; ఒక్కరున్ = ఒక్కరిని; పిల్వ = పిలవగా; ఇపుడు = ఇప్పుడు; మీరు = మీరు; మువ్వురు = ముగ్గురు; ఏతెంచుటకు = వచ్చుటకు; నాదు = నాయొక్క; బుద్ధి = మనస్సు; విస్మయంబున్ = ఆశ్చర్యము; కదిరెడిన్ = కలుగుచున్నది; చెప్పరే = తెలియజెప్పండి; అనఘులార = మహాత్ములార.

భావము:

“ఓ మహనీయులారా! ప్రతికల్పంలోను మీరు సర్వప్రపంచాన్ని సృజించి, పోషించి, నాశనం చేస్తారు. మాయాస్వరూపులై, బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే పేర్లుకల మీ పాదపద్మాలకు నేను భక్తిపూర్వకంగా ప్రణామం చేస్తున్నాను. చైతన్యవంతా లయిన మానవుల స్వాంతాలకు కూడ మీ తత్త్వం అందదు. మీ ముగ్గురిలో నేను ఒక్కరినే పిలిచాను. మీరు ముగ్గురూ వేంచేశారు. నాకు వింతగా ఉన్నది.

4-19-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అదియునుం గాక, సంతానార్థంబు నానావిధ పూజలు గావించి నా చిత్తంబున ధరియించిన మహాత్ముం డొక్కరుండ” యనిన నమ్మువ్వురు విబుధశ్రేష్ఠులు నతనిం గనుంగొని సుధామధురంబు లయిన వాక్యంబుల నిట్లనిరి.

టీకా:

అదియునుం = అంతే; కాక = కాకుండ; సంతానార్థంబు = సంతానముకోరి; నానావిధ = అనేక విధములైన; పూజలు = పూజలు; కావించి = చేసి; నా = నా యొక్క; చిత్తంబునన్ = మనసులో; ధరియించిన = నిలుపుకొన్న; మహాత్ముండు = గొప్పవాడు {మహాత్ముడు – గొప్ప ఆత్మ కలవాడు, గొప్పవాడు}; ఒక్కరుండ = ఒక్కడినే; అనినన్ = అనగా; ఆ = ఆ; మువ్వురు = ముగ్గురు; విబుధ = దేవతలలో; శ్రేష్ఠులు = శ్రేష్ఠులు; అతనిన్ = అతనిని; కనుంగొని = చూసి; సుధా = అమృతము వలె; మధురంబులు = తీయనివి; అయిన = అయినట్టి; వాక్యంబులన్ = మాటలతో; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.

భావము:

అంతేకాక నేను సంతానం కోసం పెక్కువిధాలైన పూజలు చేసి నా మనస్సులో నిలుపుకున్న మహాత్ముడు ఒక్కడు మాత్రమే” అని అత్రిమహర్షి పలుకగా త్రిమూర్తులు అమృతం వంటి తియ్యనైన మాటలతో ఇలా అన్నారు.

4-20-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"విను మేము ముగుర మయ్యును
నుపమమతిఁ దలఁప నేకమై యుందుము; నీ
మందు నేమి గోరితి
యము నా కోర్కి సఫల య్యెడుఁ జుమ్మీ.

టీకా:

విను = వినుము; మేము = మేము; ముగురము = ముగ్గురము; అయ్యును = అయినప్పటికిని; అనుపమతిన్ = చక్కటి బుద్ధితో; తలపన్ = తరచిచూసిన; ఏకమై = ఒకరిగనే; ఉందుము = తెలియుదుము; నీ = నీ యొక్క; మనము = మనసు; అందున్ = లో; ఏమి = ఏదైతే; కోరితివి = కోరుకొంటివో; అనయము = తప్పక; ఆ = ఆ; కోర్కి = కోరిక; సఫలమున్ = తీరినది; అయ్యెడి = అగును; చుమ్మీ = సుమా.

భావము:

“అత్రీ! విను. మేము లెక్కకు ముగ్గురం అయినా వాస్తవానికి ఒక్కరమే. మేము ముగ్గురమూ వేరు కాదు. నీ మనసులోని కోరిక తప్పక నెరవేరుతుంది.

4-21-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మా మువ్వుర యంశంబుల
ధీమంతులు సుతులు పుట్టి త్రిభువనములలో
నీ మంగళగుణకీర్తిన్
శ్రీహితము చేయఁగలరు; సిద్ధము సుమ్మీ."

టీకా:

మా = మా; మువ్వుర = ముగ్గురి యొక్క; అంశంబులన్ = అంశలతోను; ధీమంతులు = బుద్ధిబలము గలవారు; సుతులు = పుత్రులు; పుట్టి = జన్మించి; త్రిభువనముల = ముల్లోకముల; లోన్ = అందు; నీ = నీ యొక్క; మంగళ = శుభ; గుణ = గుణముల; కీర్తిన్ = కీర్తిని; శ్రీ = గొప్పదనముతో; మహితము =వాసికెక్కినదిగా; చేయగలరు = చేయగలరు; సిద్ధము = నిక్కము; సుమ్మీ = సుమా.

భావము:

మా ముగ్గురి అంశలతో బుద్ధిమంతులైన ముగ్గురు కుమారులు నీకు జన్మిస్తారు. వారు మంగళమయమైన నీ కీర్తిని మూడులోకాలలో వ్యాపింప జేస్తారు. ఇది జరిగి తీరుతుంది.”

4-22-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ని మునిచంద్రుఁడు దన మన
మునఁ గామించిన వరంబు బుధవరులు ముదం
బు నొసఁగి యతనిచేఁ బూ
ములఁ బరితృప్తు లగుచుఁ నిరి యథేచ్ఛన్.

టీకా:

అని = అని; మునిచంద్రుడు = మునులలో చక్కనివాడు; తన = తన యొక్క; మనమున = మనసులో; కామించిన = కోరుకున్న; వరంబున్ = వరమును; బుధవరులు = జ్ఞానశ్రేష్ఠులు; ముదంబునన్ = సంతోషముతో; ఒసగి = ఇచ్చి; అతనిన్ = అతని; చేన్ = చేత; పూజనములన్ = పూజింపబడుట యందు; తృప్తులు = తృప్తిచెందినవారు; అగుచున్ = అవుతూ; చనిరి = వెళ్ళిరి; యథేచ్ఛన్ = ఇష్టానుసారము.

భావము:

అని మునీంద్రుడైన అత్రి తన మనస్సులో కోరుకున్న వరాన్ని అనుగ్రహించి, ఆ మహర్షి చేసిన పూజలకు సంతుష్టులై త్రిమూర్తులు యథేచ్ఛగా వెళ్ళిపోయారు.

4-23-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

సుచరిత్ర దంపతు లుదంచితలీలఁ గనుంగొనంగ న
బ్జాను నంశమందు నమృతాంశుఁడు, విష్ణుకళన్ సుయోగ వి
ద్యాసుభగుండు దత్తుఁడుఁ, బురాంతకు భూరికళాంశమందు దు
ర్వాసుఁడు నై జనించి రనద్య పవిత్ర చరిత్రు లిమ్ములన్.

టీకా:

ఆ = ఆ; సుచరిత్ర = మంచి చరిత్ర గల; దంపతులు = భార్యాభర్తలు; ఉదంచిత = ఉత్తేజితులై; లీలన్ = లీలవలె; కనుగొనన్ = చూస్తుండగా; అబ్జాసనున్ = బ్రహ్మదేవుని; అంశము = అంశ; అందు = తో; అమృతాంశుడు = చంద్రుడు; విష్ణు = విష్ణుమూర్తి యొక్క; కళన్ = అంశతో; సు = చక్కటి; యోగవిద్యా = యోగవిద్యతో కూడిన; సుభగుండు = సౌభాగ్యము గలవాడు; దత్తుడున్ = దత్తుడు; పురాంతకు = శివుని {పురాంతకుడు - త్రిపురములను దహింపజేసినవాడు, శంకరుడు}; భూరి = అత్యధికమైన; కళాంశము = అంశ; అందున్ = లో; దుర్వాసుడున్ = దుర్వాసుడు; ఐ = అయ్యి; జనించిరి = పుట్టిరి; అనవద్య = వంకలులేని; పవిత్ర = పుణ్య; చరిత్రులు = వర్తనలు కలవారు; ఇమ్ములన్ = ఇంపుగా.

భావము:

పుణ్యచరిత్రులైన ఆ దంపతులకు బ్రహ్మదేవుని అంశవల్ల చంద్రుడు, విష్ణుదేవుని అంశవల్ల దత్తుడు, శివుని అంశవల్ల దుర్వాసుడు కలిగారు. ఆ ముగ్గురు పుత్రులు ఉత్తమగుణ సంపన్నులు.

4-24-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అంగిరసుఁ డనెడు మునికిఁ గు
లాంన యగు శ్రద్ధ యందు నంచిత సౌంద
ర్యాంగులు గూఁతులు నలువురు
మంళవతు లుదయమైరి మాన్యచరిత్రా!

టీకా:

అంగిరసుడు = అంగిరసుడు; అనెడు = అను; మునికిన్ = మునికి; కులాంగన = భార్య; అగు = అయిన; శ్రద్ధ = శ్రద్ధ; అందున్ = అందు; అంచిత = పవిత్రమైన; సౌందర్యాంగులు = అందగత్తెలు {సౌందర్యాంగులు - సౌందర్యముతో కూడిన అంగములు (అవయవములు) కలవారు}; కూతులు = పుత్రికలు; నలువురు = నలుగురు; మంగళవతులు = శుభలక్షణములు కలవారు; ఉదయమైరి = జన్మించిరి; మాన్యచరిత్రా = గౌరవింపదగిన నడవడిక కలవాడా.

భావము:

మాననీయుడవైన విదురా! విను. అంగిరసుడు అను మునీంద్రునికి భార్యయైన శ్రద్ధయందు సుగుణవతులు, సుందరాంగులు అయిన నలుగురు కుమార్తెలు కలిగారు.

4-25-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వారు సినీవాలి యనఁ గు
హూ రాకానుమతు లనఁగ నొప్పిరి; మఱియుం
గో సుత యుగము గలిగెను
స్వారోచిషమనువు వేళ స్తఖ్యాతిన్.

టీకా:

వారు = వారు; సినీవాలి = సినీవాలి {సినీవాలి – అమావాస్యా భేదము, అంతకు ముందు తెల్లవారుఝామున సన్నటి చంద్రరేఖ తూర్పున కనబడు అమావాస్య}; అనన్ = అని; కుహూ = కుహూ {కుహూ – అమావాస్యా భేదము, అంతకు ముందు తెల్లవారుఝామున కూడ చంద్రరేఖ కనబడని అమావాస్య}; రాకా = రాకా {రాకా – పూర్ణిమా భేదము, నిండుపున్నమి, సంపూర్ణ కళలుగల చంద్రునితోగూడిన పౌర్ణమి}; అనుమతులు = అనుమతీలు {అనుమతి – పూర్ణిమా భేదము, ఒక కళ తక్కువైన చంద్రుడుగల పౌర్ణమి}; అనగన్ = అనగా; ఒప్పిరి = తగి యుండిరి; మఱియున్ = మరల; కోరన్ = కోరగా; సుత = కుమారుల; యుగము = ద్వయము (2); కలిగెను = పుట్టిరి; స్వారోచిష = స్వారోచిష యనెడి {స్వారోచిష - స్వ (తనంతతాను) రోచిష (ప్రకాశము కలవాడు)}; మనువు = మనువు యొక్క; వేళ = మన్వంతరమునందు; శస్త = శ్రేష్ఠమైన; ఖ్యాతిన్ = కీర్తితో.

భావము:

సినీవాలి, కుహువు, రాక, అనుమతి అని ఆ నలుగురి పేర్లు. వీరు కాక అంగిరసునికి ఇద్దరు కుమారులు కలిగి, స్వారోచిష మనువు కాలంలో ప్రసిద్ధులయ్యారు.

4-26-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వార లెవ్వ రనిన, భగవంతు డగు నుచథ్యుండును బ్రహ్మనిష్ఠుం డగు బృహస్పతియు ననం బ్రసిద్ధి వహించిరి; పులస్త్యుండు హవిర్భుక్కను నిజభార్య యందు నగస్త్యునిం బుట్టించె; నా యగస్త్యుండు జన్మాంతరంబున జఠరాగ్ని రూపంబై ప్రవర్తించె; వెండియు నా పులస్త్యుండు విశ్రవసునిం గలిగించె; ఆ విశ్రవసునకు నిలబిల యను భార్యవలనం గుబేరుండును, గైకసి యను దానివలన రావణ కుంభకర్ణ విభీషణులునుం బుట్టిరి; పులహునకు గతి యను భార్యవలనఁ గర్మశ్రేష్ఠుండును వరీయాంసుండును సహిష్ణుండును నను మువ్వురు గొడుకులు జనియించిరి; మఱియుఁ గ్రతువునకుఁ గ్రియ యను భార్య యందు బ్రహ్మతేజంబున జ్వలించుచున్న షష్టిసహస్ర సంఖ్యలుగల వాలఖిల్యు లను మహర్షులు గలిగిరి; వశిష్ఠుం డూర్జ యను భార్య యందుఁ జిత్రకేతుండును సురోచియు విరజుండును మిత్రుండును నుల్బణుండును వసుభృద్ధ్యానుండును ద్యుమంతుండును నను సప్తఋషులను, భార్యాంతరంబున శక్తి ప్రముఖ పుత్రులనుం బుట్టించె; అథర్వుం డనువానికిఁ జిత్తి యను భార్య యందు ధృతవ్రతుండు నశ్వ శిరస్కుండు నయిన దధ్యంచుండు పుట్టె; మహాత్ముండగు భృగువు ఖ్యాతి యను పత్ని యందు ధాతయు విధాతయు నను పుత్రద్వయంబును, భగవత్పరాయణ యగు "శ్రీ" యను కన్యకం బుట్టించె; ఆ ధాతృవిధాతృలు మేరు వనువాని కూఁతు లైన యాయతి నియతు లను భార్యలవలన మృకండ ప్రాణులను కొడుకులం బుట్టించిరి: అందు మృకండునకు మార్కండేయుండును, బ్రాణునకు వేదశిరుం డను మునియుం బుట్టిరి ;భార్గవునకు నుశన యను కన్యయందుఁ గవి యనువాఁడు పుట్టె; ఇట్లు కర్దమదుహితలయిన కన్యకా నవకంబు వలనఁ గలిగిన సంతాన పరంపరలచేత సమస్తలోకంబులుఁ బరిపూర్ణంబు లయ్యె; అట్టి సద్యః పాపహరంబును శ్రేష్ఠతమంబును నైన కర్దమదౌహిత్రసంతాన ప్రకారంబు శ్రద్ధాగరిష్ఠచిత్తుండ వగు నీకుం జెప్పితి: ఇంక దక్షప్రజాపతి వంశం బెఱింగింతు వినుము.

టీకా:

వారలు = వారు; ఎవ్వరు = ఎవరు; అనినన్ = అంటే; భగవంతుడు = సర్వశక్తులు కలవాడు; అగు = అయిన; ఉచథ్యుండును = ఉచథ్యుడు {ఉచథ్యుడు – ఔచిత్యము గలవాడు}; బ్రహ్మనిష్ఠుండు = బ్రహ్మజ్ఞాననిష్ఠ గలవాడు; అగు = అయిన; బృహస్పతియున్ = బృహస్పతి {బృహస్పతి - బ్రహ్మవిద్యకు అధిపతి}; అనన్ = అని; ప్రసిద్ధివహించిరి = పేరుపొందిరి; పులస్త్యుండు = పులస్త్యుడు; హవిర్భుక్కు = హవిర్భుక్కు {హవిర్భుక్కు - హవిస్సు (హోమద్రవ్యము) భుజించునది, అగ్ని}; అను = అనెడి; నిజ = తన యొక్క; భార్య = భార్య; అందున్ = అందు; అగస్త్యుని = అగస్త్యుని; పుట్టించెన్ = కనెను; ఆ = ఆ; అగస్త్యుండు = అగస్త్యుడు; జన్మ = జన్మము; అంతరంబున = మరియొక దానిలో; జఠరాగ్ని = జఠరాగ్ని {జఠరాగ్ని - కడుపులోని ఆహారమును జీర్ణముచేయు అగ్ని}; రూపంబు = స్వరూపముగ కలవాడు; ఐ = అయ్యి; ప్రవర్తించె = నడచెను; వెండియున్ = ఇంకనూ; ఆ = ఆ; పులస్త్యుండు = పులస్త్యుడు; విశ్రవసునిన్ = విశ్రవసుని; కలిగించెన్ = పుట్టించెను; ఆ = ఆ; విశ్రవసున్ = విశ్రవసుని; కున్ = కు; ఇలబిల = ఇలబిల {ఇలబిల - నాసారంధ్రములు}; అను = అనెడి; భార్య = భార్య; వలనన్ = అందు; కుబేరుండునున్ = కుబేరుడుని {కుబేరుడు – గుహ్యకుల నాయకుడు, గుటకవేయుటకు మ్రింగుటకు నాయకుడు}; కైకసి = కైకసి {కైకసి - కీకసము (కంఠ మందలి స్వరపేటిక) కలది}; అనుదాని = అనెడి ఆమె; వలనన్ = అందు; రావణ = రావణుడు {రావణుడు - రవము కలవాడు}; కుంభకర్ణ = కుంభకర్ణుడు {కుంభకర్ణుడు - కుండలవంటి చెవులు కలవాడు}; విభీషణులునున్ = విభీషణుడును {విభీషణుడు – భయము పోగొట్టువాడు}; పుట్టిరి = జనించిరి; పులహున్ = పులహున; కున్ = కు; గతి = గతి {గతి - గమనము}; అను = అనెడి; భార్య = భార్య; వలనన్ = అందు; కర్మశ్రేష్ఠుండును = కర్మశ్రేష్ఠుడు {కర్మశ్రేష్ఠుడు - కర్మములు (పనిచేయుట) యందు ఉత్తముడు}; వరీయాంసుండును = వరీయాంసుడు {వరీయాంసుడు - కోరదగినవారిలో గొప్పవాడు, సామర్థ్యము గలవాడు}; సహిష్ణుండును = సహిష్ణుడు {సహిష్ణుడు – సహనము కలవాడు}; అను = అనెడి; మువ్వురు = ముగ్గురు; కొడుకులు = తనయులు; జనియించిరి = పుట్టిరి; మఱియున్ = ఇంకను; క్రతువున్ = క్రతువు {క్రతువు - జరపబడు విధానము}; కున్ = కి; క్రియ = క్రియ {క్రియ - జరుపు పని}; అను = అనెడి; భార్య = భార్య; అందు = అందు; బ్రహ్మతేజంబునన్ = బ్రహ్మజ్ఞానమువలని ప్రకాశముతో; జ్వలించుచున్ = వెలిగిపోతున్నట్టి; షష్టిసహస్ర = ఆరువేలు (6000); సంఖ్యలు = లెక్కకు; కల = ఉన్నట్టి; వాలఖిల్యులు = వాలఖిల్యులు {వాలఖిల్యులు - వాలము (తోక) ఖిల్యులు మిగిలినవారు, అంతరిక్షమున సుర్యుని స్తోత్రము చేయుచు తలక్రిందులుగనుండు వారు, అహోరాత్రము అరువది గడియలుగను ఒక్కొక గడియ వేయి వాలఖిల్యములుగను లెక్కించబడును}; అను = అనెడి; మహర్షులు = గొప్పఋషులు; కలిగిరి = పుట్టిరి; వశిష్ఠుండు = వశిష్ఠుడు; ఊర్జ = ఊర్జ {ఊర్జ - కార్తీకమాసము, ఆహారము నుండి పుట్టు బలము}; అను = అనెడి; భార్య = భార్య; అందున్ = అందు; చిత్రకేతుండును = చిత్రకేతుడు {చిత్రకేతుడు - రంగురంగుల కేతనము(జండా) కలవాడు}; సురోచియున్ = సురోచి {సురోచి - సు (మంచి) రోచి (వెలుగు కలవాడు)}; విరజుండును = విరజుడు {విరజుడు - ధూళి అంటనివాడు}; మిత్రుండును = మిత్రుడు {మిత్రుడు - మితి (కొలతలకి) అధిపతి}; ఉల్బణండును = ఉల్బణుడు {ఉల్బణుడు - ఉబ్బిన వాడు}; వసుభృద్ధ్వానుండును = వసుభృద్ధ్వానుడు {వసుభృద్ధ్వానుడు - వసు (సంపదలను) భృత్ (భరించు) ధ్వానుడు (ధ్వానము కలవాడు)}; ద్యుమంతుండును = ద్యుమంతుడు; అను = అనెడి; సప్త = ఏడుగురు; ఋషులను = ఋషులను; భార్య = భార్యా; అంతరంబునన్ = భేదమున; శక్తి = శక్తి; ప్రముఖ = మొదలైన ప్రముఖలగు; పుత్రులన్ = సుతులను; పుట్టించెన్ = కనెను; అథర్వుండు = అథర్వుండు {అథర్వుండు – అథర్వణవేదమున నధికారి, క్రిందనుండువాడు}; అను = అనెడి; వానికి = అతనికి; చిత్తి = చిత్తి {చిత్తి - ద్రవ్యము (పదార్థము)ను కూడబెట్టునది, చిత్తము తానైనది}; అను = అనెడి; భార్య = భార్య; అందున్ = కి; ధృతవ్రతుండున్ = ధృడమైన వ్రతము కలవాడును; అశ్వశిరస్కుండునున్ = గుఱ్ఱపుతల కలవాడు {అశ్వశిరస్కుడు - హయగ్రీవుడు, అశ్వనితో మొదలగు కాలమానవిశేషము}; దధ్యంచుండు = దధ్యంచుడు {దధ్యంచుడు - దధి (పెరుగు) అంచుడు (కారణుడు), దధన (ధీ) శక్తి ఐనవాడు}; పుట్టెన్ = జన్మించెను; మహాత్ముండు = గొప్పవాడు; అగు = అయిన; భృగువు = భృగువు {భృగువు - తెల్లని తేజస్సు}; ఖ్యాతి = ఖ్యాతి {ఖ్యాతి - ప్రసిద్ధి}; అను = అనెడి; పత్ని = భార్య; అందు = తో; ధాతయున్ = ధాత {ధాత - బ్రహ్మ, ధరించువాడు, పగలుకి అధిపతి}; విధాతయున్ = విధాత {విధాత - బ్రహ్మ, మన్మథుడు, రాత్రికి అధిపతి}; అను = అనెడి; పుత్ర = సుతులను; ద్వయంబును = ఇద్దరను; భగవత్పరాయణ = భగవంతుని యందు లగ్నమైనామె; అగు = అయిన; శ్రీ = శ్రీ {శ్రీ - సంపద, భార్గవి (భృగువుసుత)}; అను = అనెడి; కన్యకంబున్ = ఆడపిల్లను; పుట్టించెన్ = పుట్టించెను; ఆ = ఆ; ధాతృ = ధాతయు; విధాతృ = విధాతయు; మేరువు = మేరువు {మేరువు - మేరుపర్వతము, వెన్నుపూస}; అనువాని = అనెడువాని; కూతులు = కుమార్తెలు; ఐన = అయిన; యాయతి = యాయతి; నియతులు = నియతి; అను = అనెడి; భార్యల = భార్యలు; వలనన్ = అందు; మృకండ = మృకండుడు {మృకండుడు - మృకండ (మృత్యువు) కలవాడు}; ప్రాణులున్ = ప్రాణుడు {ప్రాణుడు - ప్రాణము కలవాడు}; అను = అనెడి; కొడుకులన్ = పుత్రులను; పుట్టించిరి = కంటిరి; అందు = వారిలో; మృకండున్ = మృకండున; కున్ = కు; మార్కండేయుండున్ = మార్కండేయుడు {మార్కండేయుడు - మార్కము (మృత్యువు)ను జయించినవాడు}; ప్రాణున్ = ప్రాణుని; కున్ = కి; వేదశిరుండు = వేదశిరుడు {వేదశిరుడు - వేదమునకు శిరస్సు, ఓంకారము}; అను = అనెడి; మునియున్ = ముని; పుట్టిరి = జన్మించిరి; భార్గవున్ = భార్గవుని; కును = కి; ఉశన = ఉశన {ఉశన - వసించుట}; అను = అనెడి; కన్య = స్త్రీ; అందున్ = అందు; కవి = కవి {కవి - రూపములను వ్యాపింపజేయువాడు, ఉశనసుడు, శుక్రుడు}; అను = అనెడి; వాడు = వాడు; పుట్టెన్ = జన్మంచెను; ఇట్లు = ఈ విధముగ; కర్దమ = కర్దముని యొక్క; దుహితలు = పుత్రికలు; అయిన = అయినట్టి; కన్యకా = ఆడబిడ్డల; నవకంబున్ = తొమ్మండుగురు; వలనన్ = అందు; కలిగిన = పుట్టిన; సంతాన = సంతతి; పరంపర = వరసలు; చేత = తో; సమస్త = సమస్తమైన; లోకంబులున్ = లోకములు; పరిపూర్ణంబులు = నిండినవి; అయ్యెన్ = అయినవి; అట్టి = అటువంటి; సద్యఃపాపహరంబును = అప్పుడే పాపమును పోగొట్టునది; శ్రేష్ఠతమంబును = అత్యంత శ్రేష్ఠమైనది {శ్రేష్ఠము - శ్రేష్ఠతరము - శ్రేష్ఠతమము}; ఐన = అయినట్టి; కర్దమ = కర్దముని; దౌహిత్ర = దుహితల (సుతల) యొక్క; సంతాన = సంతతి; ప్రకారము = వృత్తాంతము; శ్రద్ధా = శ్రద్ధచేత; గరిష్ఠ = గొప్పది యైన; చిత్తుండవు = చిత్తము కలవాడవు; అగు = అయిన; నీకున్ = నీకు; చెప్పితిన్ = చెప్పేను; ఇంక = మరి; దక్షప్రజాపతి = దక్షప్రజాపతి; వంశంబున్ = వంశవృత్తాంతమును; ఎఱింగింతున్ = తెలిపెదను; వినుము = వినుము.

భావము:

వా రెవరంటే జ్ఞానవంతుడైన ఉచథ్యుడు, బ్రహ్మణ్యుడైన బృహస్పతి. వారిద్దరూ ఎంతో ప్రసిద్ధులు. పులస్త్యునికి హవిర్భుక్కు అనే భార్యవల్ల అగస్త్యుడు, విశ్రవసుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. ఆ అగస్త్యుడు జన్మాంతరంలో జఠరాగ్ని రూపంలో ప్రవర్తించాడు. విశ్రవసునికి ఇలబిల అనే భార్యవల్ల కుబేరుడు, కైకసి అనే భార్యవల్ల రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు జన్మించారు. పులహునికి గతి అనే భార్యవల్ల కర్మశ్రేష్ఠుడు, వరీయాంసుడు, సహిష్ణుడు అనే ముగ్గురు కొడుకులు పుట్టారు. క్రతువుకు క్రియ అనే భార్యవల్ల బ్రహ్మతేజస్సుతో సమానులైన వాలఖిల్యులు అనే మహర్షులు కలిగారు. వారు అరవైవేలమంది. వసిష్ఠునికి ఊర్జ అనే భార్యవల్ల చిత్రకేతుడు, సురోచి, విరజుడు, మిత్రుడు, ఉల్బణుడు, వసుభృద్ధ్యానుడు, ద్యుమంతుడు అనే ఏడుగురు ఋషులు జన్మించారు. మరొక భార్యవల్ల శక్తి మొదలైన కొడుకులు కలిగారు. అథర్వునికి చిత్తి అనే భార్యవల్ల ధృతవ్రతుడూ, అశ్వశిరస్కుడూ అయిన దధ్యంచుడు జన్మించాడు. భృగువునకు ఖ్యాతి అనే భార్యవల్ల ధాత, విధాత అనే ఇద్దరు కొడుకులూ, భగవద్భక్తురాలైన శ్రీ అనే కుమార్తె జన్మించారు. భృగువు పుత్రులైన ధాత, విధాత అనేవారు మేరువు కుమార్తెలయిన ఆయతి, నియతి అనేవారిని పెండ్లాడారు. ధాతకు ఆయతి వల్ల మృకండుడు పుట్టాడు. విధాతకు నియతి వల్ల ప్రాణుడు జన్మించాడు. మృకండునకు మార్కండేయుడు కలిగాడు. ప్రాణునకు వేదశిరుడు పుట్టాడు. భార్గవునికి ఉశన అనే భార్యవల్ల కవి జన్మించాడు. ఈ విధంగా కర్దముని కూతుళ్ళ సంతాన వృత్తాంతం నీకు చెప్పాను. ఈ వృత్తాంతం విన్నవారికి వెంటనే పాపాలు తొలగిపోతాయి. ఇక దక్షప్రజాపతి వంశాన్ని వివరిస్తాను. విను.