పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : భూమిని బితుకుట

 •  
 •  
 •  

4-486-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

దివరాహంబవై యా రసాతల-
తనైన నన్ను నక్కటికతోడ
నుద్ధరించితి; వట్టి యుదకాగ్ర భాగంబు-
నం దర్థి నున్న నే నెఁడి నావ
యందున్న నిఖిల ప్రజావళి రక్షింపఁ-
గోరి యీ పృథురూపధారి వైతి;
ట్టి భూభరణుండ వైన నీ విపుడు ప-
యో నిమిత్తంబుగా నుగ్రచరుఁడ

4-486.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

గుచు నన్ను వధించెద నుచు బుద్ధిఁ
లఁచుచున్నాఁడ; విది విచిత్రంబుగాదె?
విశ్వసంపాద్య! నిరవద్య! వేదవేద్య!
వ్యగుణసాంద్ర! వైన్య భూపాలచంద్ర!

టీకా:

ఆదివరాహంబవు = వరాహాతారుడవు; ఐ = అయ్యి; ఆ = ఆ; రసాతల = పాతాళమున; గత = ఉన్నది; ఐన = అయిన; నన్నున్ = నన్ను; అక్కటిక = జాలి; తోడన్ = తోటి; ఉద్ధరించితివి = కాపాడితివి; అట్టి = అటువంటి; ఉదక = నీటి; అగ్ర = పై; భాగంబున్ = భాగము; అందున్ = అందు; అర్థిన్ = కోరి; ఉన్న = ఉన్నట్టి; నేను = నేను; అనెడి = అనెడి; నావన్ = నౌక; అందున్ = అందు; ఉన్న = ఉన్నట్టి; నిఖిల = సమస్తమైన; ప్రజా = ప్రజల; ఆవళిన్ = సమూహమును; రక్షింపన్ = కాపాడవలెనని; కోరి = ఆకాక్షించి; ఈ = ఈ; పృథు = పృథుచక్రవర్తి; రూప = రూపమును; ధారివి = ధరించినవాడవు; ఐతి = అయితివి; భూ = భూమిని; భరణుండవు = భరించెడివాడవు; ఐన = అయిన; నీవున్ = నీవు; ఇపుడున్ = ఇప్పుడు; పయస్ = పాలు; నిమిత్తంబుగన్ = కొరకు; ఉగ్ర = భీకరముగ; చరుడవు = తిరుగుతున్నవాడవు; అగుచున్ = అవుతూ;
నన్నున్ = నన్ను; వధించెదన్ = సంహరించెదను; అనుచున్ = అంటూ; బుద్ధిన్ = మనసులో; తలచుచున్నాడవు = సంకల్పిస్తున్నావు; ఇది = ఇది; విచిత్రంబున్ = విచిత్రము; కాదె = కాదా, ఏమి; విశ్వసంపాద్య = విశ్వాధిపత్యమును సంపాదించిన వాడా; నిరవద్య = వంకపెట్టుటకులేనివాడా; వేదవేద్య = జ్ఞానముచేతెలియబడువాడా; భవ్యగుణసాంద్ర = దివ్యమైనగుణములుదట్టముగకలవాడా; వైన్య = వేనునిపుత్రుడైన (పృథువుఅనెడి); భూపాల = భూమిని పరిపాలించెడి రాజులలో; చంద్ర = చంద్రునివంటివాడా.

భావము:

ఆదివరాహ రూపాన్ని ధరించి పాతాళంలో ఉన్న నన్ను దయతో పైకి లేవనెత్తావు. అలా ఎత్తి మహాజలాలపైన నావ వలె నన్ను నిలిపావు. నాపైన ప్రాణులను నిలిపావు. నాపై నున్న ప్రజలను రక్షించటం కోసం పృథు రూపాన్ని ధరించావు. ఈ విధంగా భూభారం వహించి ప్రజలను రక్షిస్తున్న నీవు కేవల పాలకోసం నన్ను సంహరించాలని భావిస్తున్నావు. రాజచంద్రా! పుణ్యగుణ సాంద్రా! అనద్యుడవు, వేదవేద్యుడవు, విశ్వరక్షకుడవు అయిన నీకిది విచిత్రంగా లేదూ?