పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : భూమిని బితుకుట

  •  
  •  
  •  

4-485-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు మహాభూతేంద్రియ కారక చేతనాహంకారంబులను శక్తులం జేసి యీ జగంబుల కుత్పత్తి స్థితి లయంబులఁ గావించుచు సముత్కట విరుద్ధ శక్తులు గల పురుషునకు నమస్కరించెద; నట్టి పరమ పురుషుండ వయిన నీవు నిజనిర్మితంబును భూతేంద్రియాంతఃకరణాత్మకంబును నైన యీ విశ్వంబు సంస్థాపింపం బూని.

టీకా:

మఱియున్ = ఇంకను; మహాభూత = పంచమహాభూతములు {పంచ మహా భూతములు - 1గగనము 2వాయువు 3తేజస్సు 4జలము 5భూమి}; ఇంద్రియ = పంచేంద్రియములు {పంచేంద్రియములు - పంచ జ్ఞానేంద్రియములు, 1కన్ను 2చెవులు 3ముక్కు 4నాలిక 5చర్మము}; కారక = పంచ కర్మేంద్రియములు {పంచకర్మేంద్రియములు - 1కాళ్ళు 2చేతులు 3నోరు 4గుదము 5మర్మావయవము}; చేతన = చిత్తము; అహంకారంబులు = అహంకారములు; అను = అనెడి; శక్తులున్ = శక్తుల; చేసి = వలన; ఈ = ఈ; జగంబుల్ = లోకముల; కున్ = కు; ఉత్పత్తిన్ = సృష్టి; స్థితిన్ = స్థితి; లయంబున్ = లయములను; కావించుచున్ = ఏర్పరుస్తూ; సమ = మిక్కిలి; ఉత్కటన్ = విజృంభించిన; విరుద్ధ = పరస్పర ఘర్షణ చెందెడి; శక్తులున్ = శక్తులు; కల = కలిగిన; పురుషున్ = పురుషుని; కున్ = కి; నమస్కరించెదన్ = నమస్కరించెదను; అట్టి = అటువంటి; పరమపురుషుడవు = నారాయణుడవు; అయిన = అయిన; నీవున్ = నీవు; నిజ = స్వంత; నిర్మితంబునున్ = సృష్టి యైన; భూత = పంచభూతములు; ఇంద్రియ = పంచేంద్రియములు; అంతఃకరణ = అంతఃకరణ; ఆత్మకంబు = కలిగినది; ఐన = అయిన; ఈ = ఈ; విశ్వంబున్ = జగము; సంస్థాపింపన్ = చక్కగా స్థాపించుటకు; పూని = పూనుకొని.

భావము:

ఇంకా మహాభూతాలు, ఇంద్రియాలు, బుద్ధి, అహంకార అనే శక్తుల చేత ఈ లోకాలను సృజించి, పెంచి, త్రుంచుతున్నవు. విరుద్ధాలైన శక్తులతో నిండి ఉండే నీకు నమస్కారం చేస్తున్నాను. అటువంటి భగవంతుడవైన నీచేత నిర్మింపబడిన ఈ విశ్వాన్ని సంస్థాపించాలని పూర్వం పూనుకొని…