పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : భూమిని బితుకుట

  •  
  •  
  •  

4-484-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నఘ! స్వకీయంబునై యతర్కితమునై-
హిమ నొప్పిన భవన్మాయచేత
కల చరాచర ర్గంబు నిర్మించి-
ర్మార్థపరుఁడవై నరు దీశ!
నీవిక్రమము నవనీరజలోచన!-
కల లోకులకు దుర్జయము; దలఁపఁ
గు నట్టి నీవు స్వతంత్రుఁడ వగుటను-
బ్రహ్మఁ బుట్టించి యా బ్రహ్మచేత

4-484.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కల జగములఁ జేయింతు మతఁ బేర్చి;
యేక మయ్యు మహాత్మ! యనేక విధము
గుచు వెలుగొందు చుందు వీ ఖిలమందుఁ
జారుతరమూర్తి! యో! పృథుక్రవర్తి!

టీకా:

అనఘ = పుణ్యుడ; స్వకీయంబున్ = తనది; ఐ = అయ్యి; అతర్కితము = తర్కమునకందనిది; ఐ = అయ్యి; మహిమన్ = గొప్పదనముతో; ఒప్పిన = ఒప్పుతున్న; భవత్ = నీ యొక్క; మాయ = మాయ; చేతన్ = వలన; సకల = సమస్తమైన; చర = చలనముకలిగిన; అచర = చలనములేని; సర్గంబున్ = సృష్టిని; నిర్మించి = సృష్టించి; ధర్మ = ధర్మము; అర్థ = రక్షించెడి; పరుడవు = దీక్షకలవాడవు; ఐ = అయ్యి; తనరుదు = విలసిల్లెదవు; ఈశ = ప్రభువ; నీ = నీ యొక్క; విక్రమమున్ = పరాక్రమము; నవనీరజలోచన = తాజాపద్మములవంటి కన్నులుకలవాడ; సకల = సమస్తమైన; లోకుల్ = ప్రజల; కున్ = కు; దుర్జయమున్ = జయింపరానిది; తలపన్ = అనుకొనుటకు; తగున్ = తగిన; అట్టి = అటువంటి; నీవున్ = నీవు; స్వతంత్రుడవు = స్వతంత్రుడవు; అగుటనున్ = అగుటచేత; బ్రహ్మన్ = బ్రహ్మదేవుని; పుట్టించి = సృష్టించి; ఆ = ఆ; బ్రహ్మ = బ్రహ్మదేవుని; చేతన్ = చేత.
సకల = సమస్తమైన; జగములన్ = లోకములను; చేయింతు = సృష్టింపజేసెదవు; సమతన్ = మిక్కిలి; పేర్చి = అతిశయించి; ఏకము = ఒక్కడవే; అయ్యున్ = అయినప్పటికిని; మహాత్మ = గొప్పవాడ; అనేక = అనేకమైన; విధములున్ = విధములుగా; అగుచున్ = అవుతూ; వెలుగొందుచుందువు = ప్రకాశించెదవు; ఈ = ఈ; అఖిలము = సమస్తము; అందున్ = లోను; చారుతరమూర్తి = అత్యంతఅందమైనరూపముకలవాడ {చారు - చారుతర - చారుతమ}; ఓ = ఓ; పృథుచక్రవర్తి = పృథువు అనెడి చక్రవర్తి.

భావము:

ఓ పుణ్యపురుషా! ఊహింపరాని మహిమతో కూడిన నీ మాయచేత ఈ చరాచర ప్రపంచాన్ని సృజించావు. నీవు ధర్మరక్షకుడవు. కొత్త తామరల వంటి కన్నులు కల ఓ ప్రభూ! నీ మాయను లోకులెవ్వరూ జయింపలేరు. నీవు స్వతంత్రుడవు. బ్రహ్మను పుట్టించావు. ఆ బ్రహ్మచేత సకల లోకాలను సృజింప జేశావు. సౌందర్యమూర్తివైన ఓ పృథు చక్రవర్తీ! నీవు ఒక్కడవే అయినా పెక్కు విధాలుగా సమస్తమందూ వెలుగొందుతావు.