పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : భూమిని బితుకుట

  •  
  •  
  •  

4-480-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ను సకల జీవతతికిని
మును నీ వాధారభూతముగ నిర్మింపన్
విను నా యందుఁ జతుర్విధ
భూతవిసర్గ మర్థిఁ గైకొన వలసెన్.

టీకా:

ననున్ = నన్ను; సకల = సమస్తమైన; జీవ = ప్రాణి; తతి = సమూహమున; కిన్ = కిని; మును = పూర్వము; నీవ = నీవే; ఆధారభూతముగన్ = ఆధారమైనదిగా; నిర్మింపన్ = సృష్టింపగా; విను = వినుము; నా = నా; అందున్ = అందు; చతుః = నాలుగు {చతుర్విధ భూత సృష్టి – 1 అండజములు – గ్రుడ్డు నుండి పుట్టునవి, పక్షులు, పాములు మున్నగునవి; 2 స్వేదజములు స్వేదముల (ఉక్క మొదలగునవి) వలన కలుగునవి పురుగులు మున్నగునవి; 4 ఉద్భిజములు – నేలను పగుల్చుకుని పొడమునవి, చెట్లు, తీగెలు మొ. 4 జరాయుజములు – (తల్లి గర్భకోశము నందలి) మావి నుండి జనించునవి, జంతువులు, మానవులు ము.}; విధ = రకముల; ఘన = గొప్ప; భూత = జీవజాలము; విసర్గమున్ = సృష్టిని; అర్థిన్ = కోరి; కైకొనవలసెన్ = చేపట్టవలసి వచ్చినది.

భావము:

నన్ను సకల ప్రాణికోటికి ఆధారంగా పూర్వం సృజించావు. అందువల్లనే నేను నానావిధాలైన ప్రాణికోటిని భరిస్తున్నాను.