పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : భూమిని బితుకుట

  •  
  •  
  •  

4-478-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“ఓనాథ! పరమపురుషుఁడ
వై నిజమాయా గుణంబు లందిన కతనన్
నానావిధ దేహములం
బూనుదు సగుణండ వగుచు బుధనుతచరితా!

టీకా:

ఓ = ఓ; నాథ = ప్రభువ; పరమపురుషుడవు = విష్ణుమూర్తివి {పరమపురుషుడు - అత్యుత్తమ పురుషుడు, నారాయణుడు}; ఐ = అయ్యి; నిజ = స్వంత; మాయా = మాయ యొక్క; గుణంబుల్ = లక్షణములను; అందినన్ = చెందిన; కతనన్ = కారణముచేత; నానా = అనేక; విధ = రకముల; దేహములన్ = దేహములను; పూనుదు = ధరించెదవు; సగుణుండవు = గుణములతో కూడిన వాడవు; అగుచున్ = అవుతూ; బుధ = జ్ఞానులచే; నుత = కీర్తింపబడెడి; చరితా = నడవడిక కలవాడ.

భావము:

“ఓ భూపతీ! నీవు సాక్షాత్తుగా భగవంతుడవు. స్వకీయమైన మాయాగుణం చేత నానావిధాలైన శరీరాలను ధరించి సగుణుడవుగా కనిపిస్తావు. నీ చరిత్ర సంస్తవనీయమైనది.