పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువోపాఖ్యానము

 •  
 •  
 •  

4-216-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"విను నిఖిలభువన పరిపా
మునకై చంద్రధరకళా కలితుండై
జజునకు స్వాయంభువ
ను వపు డుదయించెఁ గీర్తిమంతుం డగుచున్.

టీకా:

విను = వినుము; నిఖిల = సమస్తమైన; భువన = లోకముల; పరిపాలనమున్ = పరిపాలనము; కై = కోసము; చంద్రధర = శివుని {చంద్రధరుడు - చంద్రుని ధరించినవాడు, శివుడు}; కళా = కళతో; కలితుండు = కూడినవాడు; వనజుజున్ = బ్రహ్మదేవుని {వనజజుడు - వనజము (నీట పుట్టినది, పద్మము)న పుట్టినవాడు, బ్రహ్మదేవుడు}; స్వాయంభువ = స్వాయంభువ అనెడి {స్వాయంభువుడు - స్వయంభువుల (పుట్టినవారి) పుత్రుడు}; మనువు = మనువు; అపుడు = అప్పుడు; ఉదయించెన్ = జనియించెను; కీర్తిమంతుడు = కీర్తి కలవాడు; అగుచున్ = అవుతూ.

భావము:

“విదురా! విను. స్వాయంభువ మనువు అనే కీర్తిమంతుడు సకల లోకాలను పాలించడానికి ఈశ్వరుని అంశతో బ్రహ్మదేవునికి జన్మించాడు.

4-217-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రూఢి నమ్మనునకు శతరూపవలన
భూనుతు లగు ప్రియవ్రతోత్తాపాదు
నఁగ నిద్దఱు పుత్రులై రందులోనఁ
వ్య చారిత్రుఁ డుత్తానపాదునకును.

టీకా:

రూఢిన్ = ప్రసిద్ధముగ; ఆ = ఆ; మనువు = మనువున; కున్ = కు; శతరూప = శతరూప; వలన = అందు; భూ = భూమి యందు; నుతులు = స్తుతింపబడినవారు; అగు = అయిన; ప్రియవ్రత = ప్రియవ్రతుడు {ప్రియవ్రతుడు - ప్రియమే వ్రతముగా కలవాడు}; ఉత్తానపాదులు = ఉత్తానపాదుడు {ఉత్తానపాదుడు - ఎత్తినపాదము కలవాడు, సిద్దముగ ఉన్నవాడు}; అనగన్ = అనగ; ఇద్దఱు = ఇద్దరు; పుత్రులు = కొడుకులు; ఐరి = పుట్టిరి; అందులోన = వారిలో; భవ్య = యోగ్యమైన; చారిత్రుడు = ప్రవర్తన కలవాడు; ఉత్తానపాదున్ = ఉత్తానపాదున; కును = కు.

భావము:

ఆ స్వాయంభువ మనువుకు శతరూప అనే భార్యవల్ల ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కొడుకులు కలిగారు. వారిలో ఉత్తానపాదునికి...

4-218-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వినుము సునీతియు సురుచియు
ను భార్యలు గలరు; వారి యందును ధ్రువునిం
నిన సునీతియు నప్రియ
యును, సురుచియుఁ బ్రియయు నగుచు నున్నట్టి యెడన్.

టీకా:

వినుము = వినుము; సునీతియు = సునీతి {సునీతి - సు (మంచి) నీతి కలామె}; సురుచియు = సురుచి {సురుచి - సు (మంచి) కాంతి కలామె}; అను = అనెడి; భార్యలు = భార్యలు; కలరు = ఉన్నారు; వారి = వారి; అందును = లో; ధ్రువునిన్ = ధ్రువుని; కనిన = కన్నట్టి; సునీతియు = సునీతి; అప్రియయును = ప్రియము కానిది; సురుచియు = సురుచి; ప్రియయున్ = ప్రియమైనది; అగుచున్ = అగుచు; ఉన్నట్టి = ఉన్నటువంటి; ఎడన్ = సమయములో.

భావము:

(ఉత్తానపాదునికి) సునీతి, సురుచి అని ఇద్దరు భార్యలున్నారు. వారిలో ధ్రువుడు అనే కొడుకును కన్న సునీతిపై రాజుకు ప్రీతి లేదు. సురుచి అంటే రాజుకు మిక్కిలి మక్కువ. ఇలా ఉండగా...

4-219-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కనాఁడు సుఖలీల నుత్తానపాదుండు-
నెఱిఁ బ్రియురాలైన సురుచి గన్న
కొడుకు నుత్తముఁ దన తొడలపై నిడుకొని-
యుపలాలనము చేయుచున్న వేళ
ర్థిఁ దదారోహణాపేక్షితుం డైన-
ధ్రువునిఁ గనుంగొని తిక నాద
రింపకుండుటకు గర్వించి యా సురుచియు-
తి బిడ్డండైన ధ్రువునిఁ జూచి

4-219.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"తండ్రి తొడ నెక్కు వేడుక గిలెనేనిఁ
బూని నా గర్భమున నాఁడె పుట్ట కన్య
ర్భమునఁ బుట్టి కోరినఁ లదె నేఁడు
నకు తొడ నెక్కు భాగ్యంబు వతి కొడుక!

టీకా:

ఒకనాడు = ఒకనాడు; సుఖ = సుఖమైన; లీలన్ = విధముగ; ఉత్తానపాదుండు = ఉత్తానపాదుడు; నెఱి = బాగుగా, వక్రంగా; ప్రియురాలు = ప్రియురాలు; ఐన = అయిన; సురుచి = సురుచి; కన్న = కన్నట్టి; కొడుకున్ = పుత్రుని; ఉత్తమున్ = ఉత్తముని {ఉత్తముడు - మంచివాడు}; తొడల = తొడల; పైన్ = మీద; ఇడుకొని = ఉంచుకొని; ఉపలాలనము = బుజ్జిగిస్తుండగ; చేయుచున్న = చేస్తున్న; వేళ = సమయములో; అర్థిన్ = కోరి; తత్ = ఆ; ఆరోహణ = ఎక్కుట; ఆపేక్షితుడు = కోరినవాడు; = ధ్రువునిన్ = ధ్రువుని; కనుంగొని = చూసి; తివక = దగ్గరకు తీయక; ఆదరింపకుండుట = ఆదరించకుండుట; కున్ = కు; గర్వించి = గర్వము చెంది; ఆ = ఆ; సురుచియు = సురుచి; సవతి = సవతియొక్క; బిడ్డడు = కొడుకు; ఐన = అయిన; ధ్రువునిన్ = ధ్రువుని; చూచి = చూసి.
తండ్రి = తండ్రి యొక్క; తొడన్ = తొడను; ఎక్కు = ఎక్కెడి; వేడుక = ఆపేక్ష; తగిలినేని = కలిగినట్లయితే; పూని = యత్నించి; నా = నా యొక్క; గర్భమున = గర్భములో; నాడె = ఆవేళనే; పుట్టక = పుట్టకుండ; అన్య = ఇతరమైన; గర్భమున = గర్భములో; పుట్టి = జన్మించి; కోరినన్ = కోరితే; కలదె = కలుగుతుందా; నేడు = ఈవేళ; జనకున్ = తండ్రి యొక్క; తొడను = తొడను; ఎక్కు = ఎక్కెడి; భాగ్యంబు = అదృష్టము; సవతి = సపత్నీ; కొడుక = సుతుడ.

భావము:

ఒకనాడు ఉత్తానపాదుడు సురుచి కొడుకైన ఉత్తముణ్ణి చక్కగా (నెఱి అంటే బాగా అని, వక్రత అని కూడ అర్థం ఉంది కనుక అంతర్లీనంగా ఇద్దరు కొడుకులలో ఒకని యందు పక్షపాతం చూపడం అను వక్రత స్పురిస్తున్నది) తన తొడలపై కూర్చుండబెట్టుకొని ముద్దు చేస్తుండగా ధ్రువుడు తానుకూడ తన తండ్రి తొడలపైకి ఎక్కటానికి ఉబలాటపడ్డాడు.కాని ఉత్తానపాదుడు ధ్రువుని దగ్గరకు తీసుకోలేదు. ఆప్యాయంగా ఆదరించలేదు. అందుకు సురుచి గర్వించి, సవతి కొడుకైన ధ్రువుణ్ణి చూచి ఇలా అన్నది. “నా కడుపున పుట్టినవాడే తండ్రితొడ ఎక్కటానికి అర్హుడు. మరొక స్త్రీ గర్భాన పుట్టిన నీకు తండ్రి తొడ ఎక్కే అదృష్టం ఎలా కలుగుతుంది?

4-220-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

దిగాన నీ వధోక్షజు
పద్మము లాశ్రయింపు; పాయక హరి నా
యురమునఁ బుట్టఁ జేయును,
లక యట్లయిన ముదము ఱలెడి నీకున్."

టీకా:

అదిగాన = అందుచేత; నీవు = నీవు; అధోక్షజు = విష్ణుని; పద = పాదములు అనెడి; పద్మములు = పద్మములు; ఆశ్రయింపు = అశ్రయించుము; పాయక = విడువకుండ; హరి = విష్ణువు; నా = నా యొక్క; ఉదరమున = కడుపులో; పుట్టన్ = పుట్టునట్లు; చేయును = చేయును; వదలక = తప్పక; అట్లు = ఆ విధముగ; అయిన = అయినచో; ముదము = సంతోషము; వఱలెడి = వర్థిల్లును; నీకున్ = నీకు.

భావము:

కనుక ధ్రువకుమారా! నీవు విష్ణుదేవుని పాదపద్మాలను ఆశ్రయించు. ఆయన నిన్ను నా కడుపున పుట్టేటట్లు అనుగ్రహిస్తాడు. అప్పుడు నీ కోరిక నెరవేరుతుంది.”

4-221-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ని యీ రీతి నసహ్యవ
ములు పినతల్లి యపుడు నకుఁడు వినగాఁ
ను నాడిన దుర్భాషా
శరములు మనము నాఁటి కాఱియపెట్టన్.

టీకా:

అని = అని; ఈ = ఈ; రీతిన్ = విధముగ; అసహ్య = సహింపరాని; వచనములు = మాటలు; పినతల్లి = పినతల్లి; అపుడు = అప్పుడు; జనకుడు = తండ్రి; వినగాన్ = వింటుండగ; తనున్ = తనను; ఆడిన = అనిన; దుర్భాషా = తిట్లు అనెడి; ఘన = పెద్ద; శరములన్ = బాణములు; మనమున్ = మనసున; నాటి = తగిలి; కాఱియపెట్టన్ = బాధపెట్టగా.

భావము:

అని ఈ విధంగా తండ్రి వింటూ ఉండగా పినతల్లి సురుచి పలికిన వాక్యాలను ధ్రువుడు సహించలేకపోయాడు. ఆమె నిందావాక్యాలు బాణాలవలె అతని మనస్సులో నాటుకొని పీడించగా...

4-222-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ను నట్లుపేక్ష చేసిన
కునికడఁ బాసి దుఃఖ లనిధిలోనన్
మునుఁగుచును దండతాడిత
భుజగముఁబోలె రోషలితుం డగుచున్,

టీకా:

తనున్ = తనను; అట్లు = ఆవిధముగ; ఉపేక్ష = నిర్లక్ష్యము; చేసిన = చేసినట్టి; జనకుని = తండ్రి; కడ = దగ్గరనుండి; పాసి = దూరమై; దుఃఖ = దుఃఖము అనెడి; జలనిధి = సముద్రము {జలనిధి - జలమునకు నిధివంటిది, సముద్రము}; లోనన్ = లో; మునుగుచున్ = మునిగిపోతూ; దండ = కఱ్ఱచేత; తాడిత = కొట్టబడిన; ఘన = పెద్ద; భుజగము = సర్పము; పోలెన్ = వలె; రోష = కోపముతో; కలితుండు = కూడినవాడు; అగుచున్ = అవుతూ.

భావము:

ఆ విధంగా తనను నిర్లక్ష్యం చేసిన తండ్రి దగ్గరనుండి దెబ్బ తిన్న పాములాగా రోషంతో, పట్టరాని దుఃఖంతో ధ్రువుడు తల్లి వద్దకు వచ్చాడు.

4-223-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రోదనంబు చేయుచుఁ
నుఁగవలను శోకబాష్ప ణములు దొరఁగన్
ని కడ కేగుటయు నిజ
యునిఁ గని యా సునీతి ద్దయుఁ బ్రేమన్.

టీకా:

ఘన = అధికమైన; రోదనంబుచేయుచూ = ఏడుస్తూ; కనుగవలను = కళ్ళ జంట వెంట; శోక = దుఃఖపు; బాష్ప = కన్నీటి; కణములు = బొట్లు; తొరగన్ = స్రవిస్తుండగా; జనని = తల్లి; కడకున్ = వద్దకు; ఏగుటయు = వెళ్లెను; నిజ = తన; తనయుని = పుత్రుని; కని = చూసి; ఈ = ఈ; సునీతియు = సునీతి; దద్దయున్ = మిక్కిలి; ప్రేమన్ = ప్రేమతో.

భావము:

బిగ్గరగా ఏడుస్తూ, కన్నులనుండి దుఃఖబాష్పాలు రాలుతూ ఉండగా కన్నతల్లిని సమీపించగా సునీతి కన్నకొడుకును చూచి మిక్కిలి ప్రేమతో....

4-224-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

తొడలపై నిడుకొని.

టీకా:

తొడల = తొడల; పైన్ = మీద; ఇడుకొని = ఉంచుకొని.

భావము:

తన తొడలపై కూర్చుండబెట్టుకొని....

4-225-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మనురక్తిని మోము ని
విరి తద్వృత్తాంత మెల్ల వెలఁదులు నంతః
పువాసులుఁ జెప్పిన విని
పుగ నిట్టూర్పు లెసఁగ బా ష్పాకుల యై.

టీకా:

కరము = మిక్కిలి; అనురక్తిన్ = ప్రేమతో; మోము = ముఖము; నివిరి = నివిరి; తత్ = ఆ; వృత్తాంతము = సమాచారము; వెలదులు = స్త్రీలు; అంతఃపుర = అంతఃపురమున; వాసులు = నివసించువారు; చెప్పినన్ = చెప్పగ; విని = విని; పఱపుగ = పొడవైన, విరివిగా; నిట్టూర్పులు = విట్టూర్పులు; ఎసగన్ = అతిశయించగ; బాష్పా = కన్నీటి చే; ఆకుల = వ్యాకులము చెందినది; ఐ = అయ్యి.

భావము:

ఎంతో గారాబంతో కొడుకు ముఖాన్ని నిమిరి, జరిగిన వృత్తాంతం అంతఃపుర కాంతలు చెప్పగా విని, నిట్టూర్పులు విడుస్తూ, కన్నీరు కార్చుతూ...

4-226-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వతి యాడిన మాటలు సారెఁ దలఁచి
కొనుచుఁ బేర్చిన దుఃఖాగ్నిఁ గుందుచుండెఁ
దావపావక శిఖలచేఁ గిలి కాంతి
వితిఁ గందిన మాధవీతికబోలె.

టీకా:

సవతి = సపత్ని; ఆడిన = పలికిన; మాటలు = పలుకులు; సారెన్ = మరల మరల; తలచికొనుచున్ = తలచుకొంటూ; పేర్చిన = అతిశయించిన; దుఃఖ = దుఃఖము అనెడి; అగ్నిన్ = నిప్పులో; కుందుచుండె = శోకించుచుండె; దావ = అడవి, కార్చిచ్చు; పావక = అగ్ని; శిఖల = మంటల; చేన్ = చేత; తగిలి = చిక్కుకొని; కాంతి = కాంతి; వితతిని = పుంజములను; కందిన = కందిపోయిన; మాధవీ = మాధవి అనెడి; లతిక = పూలతీగ; పోలెన్ = వలె.

భావము:

సవతి అయిన సురుచి తన కొడుకును అన్న మాటలను మాటిమాటికీ తలచుకొంటూ కార్చిచ్చు మంటల వేడికి కంది కళతప్పిన మాధవీలతలాగా శోకాగ్నితో కుమిలిపోయింది.

4-227-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అంత నా సునీతి బాలునిం జూచి "తండ్రీ! దుఃఖింపకు" మని యిట్లనియె.

టీకా:

అంతన్ = అంతట; ఆ = ఆ; సనీతి = సునీతి; బాలునిన్ = పిల్లవానిని; చూచి = చూసి; తండ్రీ = తండ్రీ; దుఃఖింపకుము = దుఃఖించకుము; అని = అని; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

అప్పుడు ఆ సునీతి తన కొడుకును చూచి “తండ్రీ! దుఃఖించకు” అంటూ ఇలా అన్నది.

4-228-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"అఘా! యీ దుఃఖమునకుఁ
నిలే దన్యులకు సొలయ లవంతంబై
పూర్వ జన్మ దుష్కృత
కర్మము వెంటనంటఁగా నెవ్వలనన్.

టీకా:

అనఘా = పుణ్యుడ; ఈ = ఈ; దుఃఖమున్ = దుఃఖమున; కున్ = కు; పనిలేదు = అవసరంలేదు; అన్యుల = ఇతరుల; కున్ = కి; సొలయన్ = నిందించవలసిన; బలవంతంబు = శక్తికలది; ఐ = అయ్యి; తన = తన యొక్క; పూర్వ = కిందటి; జన్మ = జన్మమునకు చెందిన; దుష్కృత = పాపపు; ఘన = గొప్ప; కర్మము = కర్మము; వెంటనంటన్ = కూడా రాగ; ఎవ్వలనన్ = ఏలాగైనాసరే.

భావము:

“నాయనా! మన దుఃఖానికి ఇతరులను అనవలసిన పని లేదు. పూర్వజన్మంలో చేసిన పాపం మానవులను వెంబడించి వస్తుంది.

4-229-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కావున.

టీకా:

కావువ = అందుచేత.

భావము:

కనుక...

4-230-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

పెనిమిటి చేతను బెండ్లా
ని కాదు నికృష్టదాసి నియును బిలువం
ను జాలని దుర్భగురా
నఁగల నా కుక్షి నుదయ మందిన కతనన్.

టీకా:

పెనిమిటి = భర్త; చేతను = చే; పెండ్లాము = భార్య; అని = అని; కాదు = కాదు; నికృష్ట = నీచమైన; దాసి = పనిమనిషి; అనియును = అనైన; పిలువంగను = పిలుచుటకైన; చాలని = తగని; దుర్భగురాలను = దౌర్భాగ్యురాలను, ద్వేషింపబడుదానిని; అనగల = అనగలిగిన; నా = నా; కుక్షిన్ = కడుపున; ఉదయమందిన = పుట్టిన; కతనన్ = కారణముచేతను.

భావము:

భర్తచేత భార్యగానే కాదు, దాసిగా కూడా పిలువబడని దురదృష్టవంతురాలినైన నా కడుపున పుట్టిన కారణంచేత నీకు అవమానం తప్పలేదు.

4-231-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నిను నాడిన యా సురుచి వ
ములు సత్యంబు లగును; ర్వశరణ్యుం
నఁగల హరిచరణంబులు
ను జనకుని యంక మెక్కఁగాఁ దలఁతేనిన్.

టీకా:

నిను = నిన్ను; ఆడిన = అన్నట్టి; ఆ = ఆ; సురుచి = సురుచి; వచనములు = మాటలు; సత్యంబులు = నిజము; అగును = అవును; సర్వ = అందరికిని; శరణ్యుండు = శరణమిచ్చువాడు; అనగల = అనగలిగిన; హరి = హరి; చరణంబులు = పాదములు; కను = పొందుము; జనకుని = తండ్రి; అంకము = ఒడిని; ఎక్కగాన్ = ఎక్కనలెనని; తలతేనిన్ = తలుస్తే.

భావము:

నీ సవతి తల్లి సురుచి నీతో పలికిన మాటలు వాస్తవమే. నీకు తండ్రి ఒడిలో కూర్చోవాలనే ఆశ ఉన్నట్లయితే అందరికీ దిక్కు అయిన హరిపాదాలను ఆరాధించు.

4-232-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కావునం బినతల్లి యైన యా సురుచి యాదేశంబున నధోక్షజు నాశ్రయింపుము" అని వెండియు నిట్లనియె.

టీకా:

కావునన్ = అందుచేత; పినతల్లి = పిన్ని, పిన్నమ్మ; ఐన = అయిన; ఆ = ఆ; సురుచి = సురుచి; ఆదేశంబునన్ = ఆజ్ఞాపించిన ప్రకారము; అధోక్షజున్ = హరిన్; అని = అని; వెండియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

కనుక పినతల్లి ఐన ఆ సురిచి ఆజ్ఞను పాటించి విష్ణువును ఆశ్రయించు” అని తల్లి ఇంకా ఇలా అన్నది.

4-233-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"రికింప నీ విశ్వరిపాలనమునకై-
ర్థి గుణవ్యక్తుఁ డైనయట్టి
నారాయణుని పాదళినముల్ సేవించి-
గ బ్రహ్మ బ్రహ్మపదంబు నొందె;
నుఁడు మీ తాత యా నువు సర్వాంతర-
యామిత్వ మగు నేకమైన దృష్టిఁ
జేసి యాగముల యజించి తా భౌమ సు-
ములను దివ్యసుముల మోక్ష

4-233.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

సుఖములను బొందె నట్టి యచ్యుతునిఁ బరుని
వితత యోగీంద్ర నికర గవేష్యమాణ
రణ సరసిజ యుగళు శశ్వత్ప్రకాశు
క్తవత్సలు విశ్వసంపాద్యు హరిని.

టీకా:

పరికింపన్ = పరిశీలించి చూసిన; ఈ = ఈ; విశ్వ = లోకములను; పరిపాలనమున్ = పరిపాలించుట; కై = కోసము; అర్థిన్ = కోరి; గుణ = గుణములచే; వ్యక్తుడు = తెలియబడువాడు; ఐనయట్టి = అయినటువంటి; నారాయణుని = హరి {నారాయణుడు - నారములు (నీరు) యందు వసించువాడు, విష్ణువు}; పాద = పాదములు అనెడి; నళినముల్ = పద్మములు; సేవించి = పూజించి; తగన్ = అవశ్యము; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; బ్రహ్మపదంబున్ = బ్రహ్మపదమును; ఒందెన్ = పొందెను; ఘనుడు = గొప్పవాడు; మీ = మీ; తాత = తాత; ఆ = ఆ; మనువు = స్వాయంభువ మనువు; సర్వ = సమస్తము; అంతర = లోను; యామిత్వము = వ్యాపించునది; అగు = అయిన; ఏకమైన = ఏకాగ్ర; దృష్టిన్ = దృష్టి; చేసి = తో; యాగముల = యజ్ఞములచే; యజించి = అర్చించి; తాన్ = తను; భౌమ = భూలోక; సుఖములను = సుఖములను; దివ్య = దేవలోక; సుఖములను = సుఖములను; మోక్ష = మోక్షము అనెడి.
సుఖములను = సుఖములను; పొందెన్ = పొందెను; అట్టి = అటువంటి; అచ్యుతుని = నారాయణుని {అచ్యుతుడు - చ్యుతము (పతనము) లేనివాడు, విష్ణువు}; పరుని = నారాయణుని {పరుడు - అతీతమైన వాడు, విష్ణువు}; వితతయోగీంద్రనికరగవేష్యమాణచరణసరసిజయుగళు = నారాయణుని {వితత యోగీంద్ర నికర గవేష్యమాణ చరణ సరసిజ యుగళు - విస్తారమైన యోగీంద్ర సమూహములచే గవేష్యమాణ (వెదకబడుతున్న) పాదపద్మముల యుగళము (ద్వయము) కలవాడు, విష్ణువు}; శశ్వత్ప్రకాశు = నారాయణుని {శశ్వత్ప్రకాశుడు - శాశ్వతముగా ప్రకాశించువాడు, విష్ణువు}; భక్తవత్సలు = నారాయణుని {భక్తవత్సలుడు - భక్తులయెడ వాత్యల్యము కలవాడు, విష్ణువు}; విశ్వసంపాద్యు = నారాయణుని {విశ్వసంపాద్యుడు - విశ్వ (లోకములను) సంపాద్యుడు (సంపాదింపదగినవాడు), విష్ణువు}; హరిని = నారాయణుని.

భావము:

“లోకాలను రక్షించడానికి సగుణస్వరూపాన్ని గ్రహించిన నారాయణుని పాదపద్మాలను ఆరాధించి బ్రహ్మదేవుడు బ్రహ్మపదాన్ని పొందాడు. నీ తాత అయిన స్వాయంభువ మనువు భగవంతుని సర్వాంతర్యామిత్వాన్ని గుర్తించి ఏకాగ్రతతో యజ్ఞాలను చేసి ఆ దేవదేవుని సేవించి ఇహలోక సుఖాలను, పరలోక సుఖాలను అనుభవించి పరమపదాన్ని పొందాడు. నాశం లేనివాడు, యోగీశ్వరులు అన్వేషించి ఆరాధించే పాదపద్మాలు కలవాడు, ఆయన అనంత కాంతిస్వరూపుడు, భక్తవత్సలుడు, విశ్వ సంసేవ్యుడు అయిన హరిని ఆశ్రయించు.

4-234-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మఱియును.

టీకా:

మఱియిను = ఇంకను.

భావము:

ఇంకా...

4-235-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

తల గృహీత లీలాం
బురుహ యగుచుఁ బద్మగర్భముఖ గీర్వాణుల్
రికింపం గల లక్ష్మీ
రుణీమణిచేత వెదకఁ గు పరమేశున్.

టీకా:

కరతల = అరచేతిలో; గృహీత = చేపట్టిన; లీలాంబురుహ = విలాసమునకైన పద్మము కలామె; అగుచున్ = అవుతూ; పద్మగర్భ = బ్రహ్మదేవుడు; ముఖ = మొదలగు; గీర్వాణుల్ = దేవతలు; పరికింపంగల = ఎదురు చూడగల; లక్ష్మీ = లక్ష్మి అనెడి; తరుణీ = స్త్రీలలో; మణి = రత్నమువంటి యామె; చేతన్ = చే; వెదకన్ = వెతుకబడుతూ; తగు = ఒప్పియున్న; పరమేశున్ = విష్ణుమూర్తిని.

భావము:

బ్రహ్మ మొదలైన దేవతలు వెదకినా కనిపించని లక్ష్మీదేవి లీలాకమలాన్ని చేత ధరించి ఆ హరి కోసం వెదకుతూ ఉంటుంది. అటువంటి పరమేశ్వరుని (ఆశ్రయించు).