పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మస్తవంబు

 •  
 •  
 •  

3-668-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"అంచిత దివ్యమూర్తి! పరమాత్మక! యీ కలుషాత్ముఁ డైన న
క్తంరుఁ డస్మదీయ వరర్వమునన్ భువనంబు లెల్లఁ గా
రించు మదించి యిట్టి విపరీతచరిత్రునిఁ ద్రుంప కిట్లుపే
క్షించుటగాదు వీని బలిసేయు వసుంధరకున్ శుభంబగున్.

టీకా:

అంచిత = చక్కటి; దివ్య = దివ్యమైన; మూర్తిన్ = స్వరూపా; పరమాత్మక = నారాయణ {పరమాత్మక - పరమ (అత్యన్నతమైన) ఆత్మకలవాడ, విష్ణువు}; ఈ = ఈ; కలుషాత్ముడు = పాపాత్ముడు; ఐన = అయిన; నక్తం = రాత్రులందు; చరుడు = తిరుగువాడు; అస్మదీయ = నా యొక్క; వర = వరము వలని; గర్వమునన్ = గర్వముతో; భువనంబులున్ = లోకములు; ఎల్లన్ = సమస్తమును; గారించు = చీకాకుపెట్టు; మదించి = గర్వించి; ఇట్టి = ఇటువంటి; విపరీత = చెడు; చరిత్రునిన్ = వర్తనకలవానిన; త్రుంపక = సంహరించకుండగ; ఇట్లు = ఈ విధముగ; ఉపేక్షించుట = నిర్లక్ష్యము చేయుట; కాదు = సరికాదు; వీనిన్ = వీడిని; బలి = బలిచ్చుట; చేయు = చేయుము; వసుంధర = భూదేవి; కున్ = కి; శుభంబున్ = శుభము; అగున్ = అగును.

భావము:

“దివ్యస్వరూపా! పరమాత్మా! ఈ పాపాత్ముడైన రాక్షసుడు నా వరంవల్ల గర్వించి లోకాలనన్నిటినీ చీకాకు పరుస్తున్నాడు. ఇటువంటి దుశ్చరిత్రుని చంపకుండా ఇలా నిర్లక్ష్యం చేయడం సరి కాదు. వీనిని సంహరించు. భూదేవికి శుభం కలుగుతుంది.

3-669-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

బాలుఁడు గరమున నుగ్ర
వ్యాము ధరియించి యాడు డుపున రక్షః
పాలునిఁ ద్రుంపక యూరక
పాలార్చుట నీతియే శుప్రద! యింకన్.

టీకా:

బాలుడు = చిన్నపిల్లవాడు; కరమునన్ = చేతిలో; ఉగ్ర = భయంకరమైన; వ్యాళమున్ = సర్పమును; ధరియించి = ధరించి; ఆడు = ఆడుకొను; వడుపునన్ = విధముగ; రక్షస = రాక్షస; పాలునిన్ = రాజుని; త్రుంపక = సంహరించకుండగ; ఊరక = ఉత్తినే; పాలార్చుటన్ = ఉపేక్షించుట; నీతియే = పద్ధతా ఏమి; శుభప్రద = ఆదివరాహ {శుభప్రదుడు - శుభకరుడు, విష్ణువు}; ఇంకన్ = ఇంకనూ.

భావము:

శుభకరా! చిన్న పిల్లవాడు చేతిలో భయంకర సర్పాన్ని పట్టుకొని ఆడుకొనే విధంగా ఈ రాక్షసరాజును చంపకుండా ఊరికే ఉపేక్షించడం మంచిదా?

3-670-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అదియునుం గాక.

టీకా:

అదియునున్ = అంతే; కాక = కాకుండగ.

భావము:

అంతే కాక...

3-671-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఘా! యీ యభిజిన్ముహూర్తమున దేవారాతి మర్దింపవే
యంబున్ మఱి దైత్యవేళ యగు సంధ్యాకాల మేతెంచినన్
మాయాబలశాలి యైన దనుజున్ ఖండింపఁగా రాదు గా
వు నీవేళన త్రుంపు సజ్జనహితప్రోద్యోగరక్తుండవై."

టీకా:

అనఘా = ఆదివరాహ {అనఘుడు - పాపములు లేనివాడు, విష్ణువు}; ఈ = ఈ; అభిజిత్ = అభిజిత్తు {అభిజిత్ - సూర్యోదయమునుండి పద్నాలుగు (14) నుండి పదహారు గడియల కాలము}; ముహూర్తమునన్ = ముహూర్తములోనే; దేవారాతిన్ = రాక్షసుని {దేవారాతి - దేవతలకు ఆరాతి (శత్రువు), రాక్షసుడు}; మర్దంపవేని = సంహరింపకపొయినచో; అనయంబున్ = అవశ్యము; మఱి = మరల; దైత్య = రాక్షసుల యొక్క {దైత్యుడు - దితి యొక్క సంతానము, రాక్షసులు}; వేళ = సమయము; అగున్ = అయిన; సంధ్యా = (సాయంకాల) సంధ్య; కాలము = సమయము; ఏతెంచినన్ = వచ్చేసినచో; ఘన = గొప్ప; మాయా = మాయలతొ కూడిన; బలశాలి = బలము కలవాడు; ఐన = అయిన; దనుజున్ = రాక్షసుని; ఖండింపగన్ = సంహరించుటకు; రాదు = వీలుకాదు; కావునన్ = అందుచేత; ఈ = ఈ; వేళన్ = సమయమందే; త్రుంపు = సంహరించు; సత్ = మంచి; జన = జనుల; హిత = మంచిని; ప్రా = గట్టి; ఉద్యోగ = సంకల్పమునందు; రక్తుండవు = ఆసక్తి కలవాడవు; ఐ = అయ్యి.

భావము:

పుణ్యాత్మా! ఈ అభిజిత్తు ముహూర్తంలోనే (మిట్ట మధ్యాహ్నమే) రాక్షసుని చంపకపోతే ఆ తరువాత రాక్షసులవేళ అయిన సాయంకాలం వస్తుంది. ఆ సమయంలో రాక్షసుల మాయాబలం వృద్ధి చెందుతుంది. అప్పుడు చంపడం సాధ్యం కాదు. కావున సాధుజనులకు మేలు చేసే సంకల్పంతో ఇప్పుడే వీనిని చంపు.”

3-672-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ని సరసిజగఁర్భుడు ప
ల్కివచనము లర్థి విని నిలింపులు గుంపుల్
కొనిచూడ సస్మితానన
జముసెలువొంద నసురరు కభిముఖుఁడై.

టీకా:

అని = అని; సరసిజగర్భుడు = బ్రహ్మదేవుడు {సరసిజగర్భుడు - సరసిజము (పద్మము)న పుట్టినవాడు, బ్రహ్మదేవుడు}; పల్కిన = పలికినట్టి; వచనముల్ = మాటలు; అర్థిన్ = కోరి; విని = విని; నిలింపులు = దేవతలు; గుంపుల్ = గుంపులు గుంపులుగా; కొని = కూడి; చూడన్ = చూస్తుండగా; స = కూడిన; స్మిత = చిరునవ్వు కలిగిన; ఆనన = వదనము అనెడి; వనజమున్ = పద్మము; చెలువొంద = ఒప్పుతుండగా; అసుర = రాక్షసులలో; వరున్ = శ్రేష్ఠుని; కున్ = కి; ఆభిముఖుండు = ఎదురుగ తిరిగినవాడు; ఐ = అయ్యి.

భావము:

అని ఈ విధంగా పల్కిన బ్రహ్మ మాటలు విని విష్ణువు దేవతలంతా చూస్తుండగా మందహాస వదనారవిందంతో ఒప్పుతూ రాక్షసుని ఎదుట నిలబడి...

3-673-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

పుండరీకాక్షుఁ డయ్యును భూరిరోష
నిరతిఁ దరుణారుణాంభోజనేత్రుఁ డగుచు
నగదాదండ మెత్తి రాక్షసుని హనువు
నుగ్రగతి మొత్తె వాఁడును నోపరించె.

టీకా:

పుండరీకాక్షుడు = తెల్లకలువల వంటి కన్నులున్నవాడు {పుండరీకాక్షుడు - పుండరీకముల (తెల్ల కలువలు) వంటి అక్షుడు (కన్నులు) కలవాడు, విష్ణువు}; అయ్యున్ = అయినప్పటికిని; భూరి = అతిమిక్కిలి; రోష = రోషము; నిరతిన్ = అతిశయించుటచే; తరుణ = లేత {తరుణారుణాంభోజనేత్రుఁడడు - లేత ఎఱ్ఱకలువల వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; అరుణాంభోజ = ఎఱ్ఱకలువల వంటి; నేత్రుండు = కన్నులు కలవాడు; అగుచున్ = అవుతూ; ఘన = పెద్ద; గదాదండమున్ = గదాయుధమును; ఎత్తి = ఎత్తి; రాక్షసుని = రాక్షసుని; హనువున్ = చెక్కిలికి పైభాగమున; ఉగ్ర = భయంకరమైన; గతిన్ = విధముగ; మొత్తెన్ = మోదెను; వాడునున్ = వాడును; ఓపరించెన్ = తట్టుకొనెను, ఓర్చుకొనెను.

భావము:

విష్ణువుయొక్క తెల్ల తామరల వంటి కన్నులు రోషంతో ఎఱ్ఱతామరల వలె కాగా తన పెను గదాదండంతో ఆ రాక్షసుని దవడపై తీవ్రంగా మోదాడు. వాడు ఆ దెబ్బను తట్టుకొన్నాడు.

3-674-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రువడి దితిసుతుఁ డతి భీ
గదఁ జేబూని చిత్రతులను బద్మో
రుఁ డాసి చేతిగద సా
మునఁ బడ నడిచె బాహుర్వమెలర్పన్.

టీకా:

పరువడి = వెనువెంటనే; దితిసుతుడు = హిరణ్యాక్షుడు {దితిసుతుడు - దితి యొక్క సుతుడు, హిరణ్యాక్షుడు}; అతి = మిక్కిలి; భీకర = భయంకరమైన; గద = గదను; చేన్ = చేత; పూని = ధరించి; చిత్ర = విచిత్రమైన; గతులన్ = విధములుగ; పద్మోదరున్ = ఆదివరాహుని {పద్మోదరుడు - పద్మము ఉదరమున (కడుపున) కలవాడు, విష్ణువు}; డాసి = దగ్గరకువచ్చి; చేతి = చేతులో ఉన్న; గదన్ = గదను; సాగరమునన్ = సముద్రములో; పడన్ = పడునట్లు; అడిచెన్ = కొట్టెను; బాహు = బాహుబలము; గర్వము = అతిశయము; ఎలర్పన్ = వికసించగ.

భావము:

ఆ హిరణ్యాక్షుడు వెంటనే భయంకరమైన గదను పట్టుకొని విచిత్ర భంగిమలతో, బాహుగర్వంతో విష్ణువును సమీపించి అతని చేతిలోని గదను సముద్రంలో పడగొట్టాడు.

3-675-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అంత.

టీకా:

అంత = అంతట.

భావము:

అప్పుడు...

3-676-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రి నిరాయుధుఁడైన సురారి సమర
ర్మ మాత్మను దలఁచి యుద్ధంబుఁ దక్కి
నిలిచి చూచుచునుండెను నింగి నమర
రుల హాహా రవంబుల రిత మయ్యె.

టీకా:

హరి = ఆదివరాహుడు; నిరాయుధుడు = ఆయుధము లేనివాడు; ఐన = అయిన; సురారి = రాక్షసుడు {సురారి - సురల (దేవతల)కు అరి (శత్రువు), రాక్షసుడు}; సమర = యుద్ధ; ధర్మము = నీతిని; ఆత్మను = మనసున; తలచి = తలచుకొని; యుద్ధంబున్ = యుద్ధము చేయుట; తక్కి = వదలి; నిలిచి = ఆగి; చూచుచున్ = చూస్తూ; ఉండెను = ఉండెను; నింగిన్ = ఆకాశము; అమర = దేవతల; వరుల = శ్రేష్ఠుల; హాహా = హాహా అను; రవముల = శబ్దములతో; భరితమున్ = నిండినది; అయ్యె = అయినది;

భావము:

హరి నిరాయుధుడు కావడంతో హిరణ్యాక్షుడు యుద్ధధర్మాన్ని పాటించి పోరాటం ఆపి నిలబడి చూస్తూ ఉన్నాడు. ఆకాశమంతా దేవతల హాహాకారాలతో నిండిపోయింది.

3-677-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

సిజనేత్రుఁడు దనుజే
శ్వరు సంగరధర్మమునకు మధికశౌర్య
స్ఫుణకుఁ దన చిత్తంబున
మాశ్చర్యంబు నొంది డఁకదలిర్పన్.

టీకా:

సరసిజనేత్రుడు = ఆదివరాహుడు {సరసిజ నేత్రుడు - సరసిజము (పద్మము)లవంటి కన్నులు కలవాడు, విష్ణువు}; దనుజ = రాక్షసుల; ఈశ్వరు = ప్రభువు యొక్క; సంగర = యుద్ధ; ధర్మమున = నీతి; కున్ = కి; సమధిక = మిక్కిలి అధికమైన; శౌర్య = పరాక్రమ; స్ఫురణ = స్ఫూర్తి; కున్ = కి; తన = తన యొక్క; చిత్తమునన్ = మనసులో; కరము = మిక్కిలి; ఆశ్చర్యంబున్ = ఆశ్చర్యమును; పొంది = పొంది; కడకన్ = పట్టుదల; తలిర్పన్ = చిగురొత్తగ.

భావము:

కమలాక్షుడైన విష్ణువు రాక్షసరాజైన హిరణ్యాక్షుని యుద్ధధర్మానికి, అపార శౌర్యస్ఫూర్తికి మిక్కిలి ఆశ్చర్యపడినా పట్టుదల విడువలేదు.

3-678-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కులోద్ధర్త మనంబునం దలఁచె రక్షోరాడ్వధార్థంబుగా
దితిసంతానకులాటవీమహితసందీప్తప్రభా శుక్రమున్
తోద్యజ్జయశబ్దసన్ముఖరభాస్వచ్ఛక్రమున్ సంతతా
శ్రినిర్వక్రముఁ బాలితప్రకటధాత్రీచక్రముం జక్రమున్.

టీకా:

కుతలోద్ధర్త = ఆదివరాహుడు {కుతలోద్ధర్త - కుతలము (భూమి)ని ఉద్ధర్త (ఉద్దరించినవాడు), విష్ణువు}; మనంబునన్ = మనసులో; తలంచెన్ = అనుకొనెను; రక్షోరాట్ = రాక్షసరాజుని; వధ = సంహరించుట; అర్థంబునన్ = కొరకు; దితిసంతాన కులాటవీమహితసందీప్తప్రభాశుక్రమున్ = విష్ణుచక్రమును {దితి సంతాన కులాటవీ మహిత సందీప్త ప్రభా శుక్రము - దితి యొక్క సంతానము (పుత్రుల) కుల (సమూహము) అను అటవీ (అడవి)ని మహిత (గొప్ప) సందీప్త (బాగా వెలిగిపోయిన) ప్రభా (కాంతులు) కల శుక్రము (అగ్నిహోత్రము), విష్ణుచక్రము}; సతతోద్యజ్జయశబ్దసన్ముఖరభాస్వచ్ఛక్రమున్ = విష్ణుచక్రమును {సత తోద్య జ్జయశబ్ద సన్ముఖర భాస్వ చ్ఛక్రము - సంతత (ఎల్లప్పుడును) ఉద్యత్ (గట్టిగపలకబడు) జయ అను శబ్దముచేయు సత్ (మంచి) ముఖర (వాడియైన పళ్లు) కల భాస్వత్ (ప్రకాశించు) చక్రము, విష్ణుచక్రము}; సంతతాశ్రితనిర్వక్రమున్ = విష్ణుచక్రమును {సంత తాశ్రిత నిర్వక్రముఁ - సంతతా (ఎల్లప్పుడును) ఆశ్రిత (ఆశ్రయించినవారికి) నిర్వక్రము (అనుకూలమైనట్టిది), విష్ణుచక్రము}; పాలితప్రకటధాత్రీచక్రమున్ = విష్ణుచక్రమును {పాలిత ప్రకట ధాత్రీ చక్రము - పాలిత (పాలింపబడుతున్న) ప్రకట (ప్రసిద్దమైన) ధాత్రీచక్రము (భూమండలము) కలది, విష్ణుచక్రము}; చక్రమున్ = విష్ణుచక్రమును;

భావము:

భూమిని ఉద్ధరించిన విష్ణువు ఆ రాక్షసరాజును వధించడం కోసం తన మనస్సులో సుదర్శన చక్రాన్ని స్మరించాడు. ఆ చక్రం దైత్యుల వంశమనే మహారణ్యాన్ని దహించే జాజ్వల్యమానమైన దావానలం. ఎల్లప్పుడు జయజయ శబ్దాలతో ప్రతిధ్వనించే దిక్చక్రం కలది. సర్వదా ఆశ్రయించేవారికి రక్షణ కలిగించేది. సమస్త భూమండలాన్ని పాలించేది.

3-679-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అదియునుం, బ్రచండమార్తాండమండలప్రభాపటల చటుల విద్యోత మానంబును, పటునటజ్జ్వాలికాపాస్త సమస్త కుపితారాతి బలాఖర్వ దుర్వార బాహాగర్వాంధకారంబును, యసహ్య కహకహ నినదాధరీకృత సాగరఘోషంబును, సకల దేవతాగణ జేగీయమానంబును, ననంత తేజోవిరాజితంబును, నిజ ప్రభాపటలపూరిత బ్రహ్మాండకటాహంబును నై; రయంబునం జనుదెంచి దనుజారి దక్షిణ కరసరోజంబు నలంకరించిన నా శుభాంగుండు రథాంగపాణియై దివంబున నమర గణంబులు జయజయశబ్దంబులు పలుక నసురవిభున కెదురుగా నడచిన.

టీకా:

అదియునున్ = అదికూడ; ప్రచండ = భయంకరమైన; మార్తాండ = సూర్య; మండల = మండలము యొక్క; ప్రభా = కాంతుల; పటల = సమూహమువంటి; చటుల = భయంకరమైన; విద్యోత = వెలుగుతో; మానంబునున్ = ఒప్పియున్నదియును; పటు = మిక్కిలి; నటత్ = ఆడుతున్న, చెలరేగుతున్న; జ్వలికా = జ్వాలలచే; అపాస్త = తొలగింపబడిన; సమస్త = సమస్తమైన; కుపిత = కోపగించిన; ఆరాతి = శత్రువుల యొక్క; బలా = బలము అందు; అఖర్వ = కుంటుపడని; దుర్వార = వారింపరాని; బాహా = బాహువుల యొక్క; గర్వ = గర్వము అను; అంధకారంబునున్ = చీకటియును; అసహ్య = సహింపరాని; కహకహ = కహకహ అను; నినద = అరుపులచే; ఆధరీ = తక్కువయినట్లు; కృత = చేయబడిన; సాగర = సముద్ర; ఘోషంబునున్ = ఘోషయును; సకల = సమస్తమైన; దేవతా = దేవతల యొక్క; గణ = సమూహములచే; జేగీయ = కీర్తింపబడుతూ; మానంబునున్ = ఒప్పియున్నదియును; అనంత = అనంతమైన; తేజస్ = తేజస్సుతో; విరాజితంబునున్ = విరాజిల్లుతున్నదియును; నిజ = తన; ప్రభా = కాంతుల; పటల = సమూహములచే; పూరిత = నింపబడిన; బ్రహ్మాండ = బ్రహ్మాండ; కటాహంబునున్ = భాండము కలదియును; ఐ = అయ్యి; రయంబునన్ = వేగముగా; చనుదెంచి = వచ్చి; దనుజారి = ఆదివరాహుని {దనుజారి - దనుజులు (రాక్షసులు) కి అరి (శత్రువు), విష్ణువు}; దక్షిణ = కుడి; కర = చేయి అను; సరోజంబున = పద్మమునందు; అలంకరించినన్ = అలంకరించగా; ఆ = ఆ; శుభ = శుభకరమైన; అంగుండు = అంగములు కలవాడు; రథాంగ = చక్రాయుధము {రథాంగము - రథముయొక్క అంగము (భాగము) వలె ఉండునది, చక్రము}; పాణి = చేత ధరించినవాడు; ఐ = అయ్యి; దివంబునన్ = ఆకాశము నందు; అమర = దేవతల; గణంబులున్ = సమూహములు; జయజయ = జయజయ అను; శబ్దంబులు = పలుకులు; పలుకన్ = పలుకుతుండగ; అసుర = రాక్షస; విభున్ = ప్రభువున; కున్ = కి; ఎదురుగా = ఎదురుగ; నడచిన = వెళ్ళగ.

భావము:

ఆ సుదర్శనచక్రం ప్రచండ సూర్యమండలం వలె తీవ్రంగా వెలిగిపోతున్నది. చెలరేగుతున్న అగ్నిజ్వాలలతో కోపంతో ఉన్న సమస్త శత్రువుల అడ్డులేని అహంకారమనే అంధకారాన్ని అణచివేస్తున్నది. సహింపరాని రివ్వురివ్వుమనే ధ్వనులతో సాగరఘోషను చులకన చేస్తున్నది. అది సమస్త దేవతలచేత పొగడబడుతూ, అనంత కాంతులతో విరాజిల్లుతూ, తన కాంతులతో బ్రహ్మాండాన్ని నింపుతూ వేగంగా వచ్చి విష్ణువు కుడిచేతిని అలంకరించింది. రాక్షసవైరి యైన విష్ణువు ఆ చక్రాన్ని ధరించి ఆకాశంనుండి దేవతలు జయజయ ధ్వానాలు చేస్తుండగా హిరణ్యాక్షునికి ఎదురుగా నడిచాడు.

3-680-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

పొగని దనుజుఁడు పెదవులు
డుపుచుఁ బొలివోని బంటునమున బీరం
బుడుగక భీషణగదఁ గొని
డిచెన్ మఖమయవరాహు మితోత్సాహున్.

టీకా:

పొడగని = చూసి; దనుజుడు = రాక్షసుడు; పెదవులున్ = పెదవులను; తడపుకొనుచున్ = తడుపుకొంటూ; పొలివోని = భంగపడని; బంటుతనమున = శౌర్యముతో; బీరంబున్ = గాంభీర్యము; ఉడుగక = తగ్గకుండ; భీషణ = భయంకరమైన; గదన్ = గదను; కొని = తీసుకొని; అడిచెన్ = కొట్టెను; మఖమయవరాహున్ = యజ్ఞమయవరాహుని; అమిత = మిక్కిలి; ఉత్సాహున్ = ఉత్సాహము కలవానిని.

భావము:

చక్రాన్ని ధరించి అమితోత్సాహంతో వస్తున్న ఆదివరాహమూర్తిని చూచి హిరణ్యాక్షుడు పెదవులు తడుపుకుంటూ, మొక్కవోని శౌర్యంతో, ధైర్యం చెడక భయంకరమైన గదతో కొట్టాడు.

3-681-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

త్రిశారి దన్ను వ్రేసిన
దఁ బదమునఁ బోవదన్ని మలాక్షుఁడు పెం
పొవగ మనమున మోదము
దురగ లేనగవు వదనమలము బొదువన్.

టీకా:

త్రిదశారి = రాక్షసుడు {త్రిదశారి - త్రిదశులు (దేవతలు) కు అరి (శత్రువు), రాక్షసుడు}; తన్నున్ = తనను; వ్రేసినన్ = కొట్టగా; గదన్ = గదను; పదమునన్ = కాలితో; పోవన్ = పోవునట్లు; తన్ని = తన్ని; కమలాక్షుడు = యజ్ఞవరాహుడు {కమలాక్షుడు - కమలముల వంటి అక్షుడు (కన్నులు ఉన్నవాడు), విష్ణువు}; పెంపొదవగ = అంతిశయము మించగా; మనమునన్ = మనసులో; మోదము = సంతోషము; కదురగన్ = కలుగగా; లేనగవు = చిరునవ్వు; వదన = మోము అను; కమలమున్ = పద్మము నందు; పొదువన్ = హత్తుకొనగా.

భావము:

హిరణ్యాక్షుడు విసిరిన గదను విష్ణువు ఆనందంగా మందహాసం చేస్తూ ప్రక్కన పడేవిధంగా కాలితో తన్నాడు.

3-682-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇవ్విధంబున గదఁ బోవందన్ని యసురవిభునితో నిట్లనియె.

టీకా:

ఈ = ఈ; విధంబునన్ = విధముగ; గదన్ = గదను; పోవందన్ని = పోగొట్టి; అసుర = రాక్షస; విభుని = ప్రభువుని; తోన్ = తో; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

ఈ విధంగా గదను దూరంగా తన్ని హిరణ్యాక్షునితో విష్ణువు ఇలా అన్నాడు.

3-683-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"గదఁ గేలఁబూని భుజర్వమెలర్పఁగ నన్ను సంగరా
ని నెదిరింతు; రార; యనివారణ దైత్యకులేశ్వరాధమా! "
వుడు వాఁడు నుబ్బి గద నంబుజనాభుని వ్రేసె; వ్రేసినన్
నుజవిభేది పట్టికొనెఁ దార్క్ష్యుఁ డహీంద్రునిఁ బట్టుకైవడిన్.

టీకా:

ఘన = పెద్ద; గదన్ = గదను; కేలన్ = చేత; పూని = ధరించి; భుజ = బాహుబలము వలని; గర్వము = గర్వము; ఎలర్పగన్ = అతిశయించగా; నన్నున్ = నన్ను; సంగర = యుద్ధ; అవనిన్ = భూమి యందు; ఎదురింతు = ఎదుర్కొందువుగాని; రార = రార; అనివారణ = వారింపరాని విధముగ; దైత్య = రాక్షస; కుల = వంశ; ఈశ్వర = రాజులలో; అధమ = నీచుడా; అనవుడున్ = అనగా; వాడున్ = వాడు; ఉబ్బి = సంతోషించి; గదన్ = గదతో; అంబుజనాభుని = యజ్ఞవరాహుని {అంబుజనాభుడు - పద్మము నాభిన కలవాడు, విష్ణువు}; వ్రేసెన్ = కొట్టెను; వ్రేసినన్ = కొట్టగా; దనుజవిభేధి = యజ్ఞవరాహుడు {దనుజవిభేధి - దనుజ (రాక్షసుల)కు విభేధి (శత్రువు), విష్ణువు}; పట్టికొనె = పట్టుకొనెను; తార్క్ష్యుడు = గరుత్మంతుడు; అహి = సర్ప; ఇంద్రునిన్ = ప్రభువుని; పట్టుకొను = పట్టుకొనెడి; విధమునన్ = విధముగ.

భావము:

“రాక్షసరాజులలో నీచుడవు. పెద్ద గద పట్టుకొని మహాబలవంతుడ నని గర్వించి యుద్ధరంగంలో నన్నెదిరిస్తున్నావు. రారా!” అని పలుకగా హిరణ్యాక్షుడు చెలరేగి గదతో విష్ణువును కొట్టాడు. ఆయన ఆ గదను గరుత్మంతుడు పామును పట్టినట్లుగా ఒడిసిపట్టుకొన్నాడు.

3-684-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

దితిజుఁడు దన బల మప్రతి
తేజుం డగు సరోరుహాక్షుని శౌర్యో
న్నతిమీఁద బెట్టకుండుట
తి నెఱిఁగియుఁ బెనఁగె దురభిమానముపేర్మిన్.

టీకా:

దితిజుడు = హిరణ్యాక్షుడు {దితిజుడు - దితికి జుడు (పుత్రుడు), హిరణ్యకశిపుడు}; తన = తన యొక్క; బలము = బలము; అప్రతిహత = ఎదురులేని; తేజుండు = తేజస్సు కలవాడు; అగు = అయిన; సరోరుహాక్షుని = వరాహమూర్తి యొక్క {సరోరుహాక్షుడు - సరోరుహము (పద్మము) వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; శౌర్య = పరాక్రమము ను; ఉన్నతిన్ = గొప్పతనమును; మీదపెట్టక = నెగ్గలేక; ఉండుట = పోవుట; మతిన్ = మనసున; ఎఱిగియున్ = తెలిసినను; పెనగెన్ = పెనుగులాడెను; దురభిమానము = దురభిమానము; పేర్మిన్ = అతిశయించుటచేత.

భావము:

హిరణ్యాక్షుడు తన బలం విష్ణువు యొక్క అడ్డులేని శౌర్యం ముందు ఎందుకూ పనికిరాదన్న సంగతి మనస్సులో తెలిసికూడ దురభిమానంతో ఎదిరించాడు.

3-685-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అంత.

టీకా:

అంత = అంతట.

భావము:

అప్పుడు...

3-686-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కాలానలజ్వలజ్జ్వాలావిలోల క-
రామై పెంపొందు శూ మంది
సువైరి యజ్ఞసూరూపధరుఁ డైన-
నజనాభునిమీఁద వైవ నదియు
ద్విజోత్తముమీఁదఁ పలత గావించు-
భిచారకర్మంబు ట్ల బెండు
డి పఱితేఁ గని ద్మోదరుడు దానిఁ-
క్రధారాహతిఁ జండవిక్ర

3-686.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మున నడమన వడి ద్రుంచె మరభర్త
హిత దంభోళిచే గరుత్మంతు పక్ష
తిరయంబునఁ ద్రుంచినతిఁ జెలంగి
సురలు మోదింప నసురులు సొంపు డింప.

టీకా:

కాల = ప్రళయకాలపు; అనల = అగ్నివలె; జ్వలత్ = మండుతున్న; జ్వాలా = మంటలతో; విలోల = కంపిస్తున్న; కరాళము = భయంకరము; ఐ = అయ్యి; పెంపొందు = అతిశయించు; శూలమున్ = శూలమును; అంది = అందుకొని; సురవైరి = రాక్షసుడు {సురవైరి - సురలు (దేవతలు) కి అరి (శత్రువు), రాక్షసుడు}; యజ్ఞసూకర = యజ్ఞవరాహము యొక్క; రూప = రూపమును; ధరుడు = ధరించినవాడు; ఐన = అయినట్టి; వనజనాభుని = హరి {వనజనాభుడు - వనజము (పద్మము) నాభి (బొడ్డు)న కలవాడు, విష్ణువు}; మీదన్ = పైన; వైవన్ = వేయగా; అదియునున్ = అదికూడ; సత్ = మంచి; ద్విజ = బ్రాహ్మణులలో; ఉత్తము = ఉత్తముని; మీదన్ = పైన; చపలతన్ = చపలత్వముతో; కావించు = ప్రయోగించబడిన; అభిచారకర్మంబున్ = అభిచారకర్మము {అభిచారకర్మ - హింసార్థమైన తంత్రవిద్య}; అట్ల = వలె; బెండుపడి = వ్యర్థమైపోయి; పఱితేన్ = పరుగెట్టుకొనిరాగా; కని = చూసి; పద్మోదరుడు = వరహావతారుడు {పద్మోదరుడు - పద్మము ఉదరమున కలవాడు, విష్ణువు}; దానిన్ = దానిని; చక్ర = చక్రము యొక్క; ధారా = అంచుతో; హతిన్ = కొట్టెడి; చండ = భయంకరమైన; విక్రమమున = పరాక్రమముతో;
నడమన = మధ్యలోనే; వడిన్ = వేగముగ; త్రుంచెన్ = ముక్కలుచేసెను; అమరభర్త = వరహావతారుడు {అమరభర్త - అమరుల (దేవతల)కి భర్త (ప్రభువు), విష్ణువు}; మహిత = గొప్ప; దంభోళి = వజ్రాయుధము; చేన్ = చేత; గరుత్మంతు = గరుత్మంతుని; పక్షమున్ = ఈకను; అతి = మిక్కిలి; రయంబునన్ = వేగముగ; త్రుంచిన = ముక్కలుచేసిన; గతిన్ = వలె; చెలంగి = చెలరేగి; సురలు = దేవతలు; మోదింపన్ = సంతోషించగా; అసురులు = రాక్షసులు యొక్క; సొంపు = శోభ; డింపన్ = దిగిపోగా.

భావము:

రాక్షసుడు ప్రళయాగ్నిలాగా భయంకరంగా మండుతున్న శూలాన్ని అందుకొని యజ్ఞవరాహ రూపంలో ఉన్న విష్ణువుపై వేశాడు. సద్బ్రాహ్మణునిమీద చాపల్యంతో ప్రయోగించిన చేతబడిలాగా; ఇంద్రుడు తన వజ్రాయుధంతో గరుత్మంతుని రెక్కలోని ఈకను మాత్రమే త్రుంచ గలిగినట్లు; హిరణ్యకశిపుని అంతటి శూలమూ వ్యర్థమైపోయింది. విష్ణువు తన చక్రాయుధంతో ఆ శూలాన్ని మధ్యలోనే చటుక్కన రెండుగా ఖండించాడు. అది చూసి దేవతలకు సంతోషం చెలరేగింది; రాక్షసులకు సంతోషం క్షీణించింది.

3-687-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అయ్యవసరంబున నయ్యసురుడు దన శూలంబు చక్రంబుచేత నిహతం బగుటం గని.

టీకా:

ఆ = ఆ; అవసరంబునన్ = సమయమున; ఆ = ఆ; అసురుడు = రాక్షసుడు; తన = తన యొక్క; శూలంబున్ = శూలము; చక్రంబు = విష్ణుచక్రము; చేతన్ = వలన; నిహతంబున్ = దెబ్బతిన్నది; అగుటన్ = అయిపోవుట; కని = చూసి.

భావము:

ఆ సమయంలో రాక్షసుడు తన శూలం చక్రాయుధం చేత ఖండింపబడటం చూచి...

3-688-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

దితిజుఁడు రోషోద్ధతుఁడై
తి నిష్ఠుర ముష్టిఁ బొడిచె రి నా లోకో
న్నతుఁ డొప్పెఁ గుసుమమాలా
తి దిగ్గజరాజుఁ బోలె తి దర్పితు డై.

టీకా:

దితిజుడు = హిరణ్యాక్షుడు {దితిజుడు - దితికి పుట్టినవాడు, హిరణ్యాక్షుడు}; రోష = రోషము; ఉద్దతుడు = పెరిగినవాడు; ఐ = అయ్యి; అతి = మిక్కిలి; నిష్ఠుర = కఠినమైన; ముష్టిన్ = పిడికిటిపోటును; పొడిచెన్ = పొడిచెను; హరిని = వరహాతారుని {హరి - విష్ణువు}; ఆ = ఆ; లోక = సమస్త లోకములకు; ఉన్నతుడు = గొప్పవాడు; ఒప్పెన్ = చక్కగా ఉండెను; కుసుమ = పూల; మాలా = దండచేత; హతి = కొట్టబడిన; దిగ్గజరాజు = ఐరావతము {దిగ్గజరాజు - దిగ్గజములలో శ్రేష్ఠమైనది, ఐరావతము}; పోలెన్ = వలె; అతి = మిక్కిలి; దర్పితుడు = దర్పించినవాడు; ఐ = అయ్యి.

భావము:

ఆ రాక్షసుడు కోపంతో మండిపడి కఠోరమైన తన పిడికిలితో విష్ణువును పొడిచాడు. హరి పూలదండ తాకిన ఐరావతం వలె కలత చెందక విరాజిల్లాడు.

3-689-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రిమీఁదన్ దితిసంభవుండు ఘనమాయాకోట్లు పుట్టించినన్
ణీచక్రము భూరి పాంసుపటలధ్వాంతంబునం గప్పె భీ
పాషాణ పురీష మూత్ర ఘనదుర్గంధాస్థి రక్తావళుల్
గురిసెన్ మేఘము లభ్రవీథిని మహాక్షోభక్రియాలోలమై.

టీకా:

హరి = ఆదివరాహుని; మీదన్ = పైన; దితిసంభవుడు = హిరణ్యాక్షుడు {దితిసంభవుడు - దితికి పుట్టినవాడు, హిరణ్యాక్షుడు}; ఘన = గొప్ప; మాయా = మాయలు; కోట్లు = అనేకములను; పుట్టించినన్ = పుట్టించగా; ధరణీ = భూ; చక్రమున్ = మండలము; భూరి = అతిమిక్కిలి; పాంసు = ధూళిమేఘముల; పటల = సమూహముల వలన; ధ్వాంతమున్ = చీకటి; కప్పెన్ = కమ్మినది; భీకర = భయంకరమైన; పాషాణ = బండరాళ్ళు; పురీష = మల; మూత్ర = మూత్రముల; ఘన = మిక్కిలి; దుర్గంధా = దుర్గంధముతో; అస్తి = ఎముకలు; రక్తా = రక్తము; ఆవళుల్ = మొదలగునవి; కురిసెన్ = కురిసినవి; మేఘముల్ = మబ్బులు; అభ్ర = ఆకాశ; వీథినిన్ = వీథిలో; మహా = మిక్కిలి; క్షోభ = చీకాకులు; క్రియాలోలము = తాండవించునది; ఐ = అయ్యి.

భావము:

ఆ రాక్షసుడు విష్ణువుమీద కోట్లకొలది మాయలు ప్రయోగించాడు. భూమండలమంతా దుమ్ము రేగి చీకటితో నిండిపోయింది. మేఘాలు భయంకరంగా రాళ్ళను, మలమూత్రాలను, కుళ్ళిన ఎముకలను, రక్తప్రవాహాన్ని కురిపించి చీకాకును కలిగించాయి.

3-690-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మఱియును.

టీకా:

మఱియును = ఇంకనూ.

భావము:

ఇంకా...

3-691-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

విలి విముక్తకేశపరిధానము లుగ్రకరాళదంత తా
లువులును రక్తలోచనములుం గల భూత పిశాచ ఢాకినీ
నిహము లంతరిక్షమున నిల్చి నిజాయుధపాణులై మహా
ముగ యక్ష దైత్య చతురంగ బలంబులఁ గూడి తోచినన్.

టీకా:

తవిలి = పూని; విముక్త = విడిచిపెట్టబడిన; కేశ = జుట్టు; పరిధానములున్ = వస్త్రములును; ఉగ్ర = భయంకరమైన; కరాళ = విషపు; దంత = కోరలును; తాలువులున్ = దవడలును; రక్త = ఎఱ్ఱని; లోచనములున్ = కన్నులును; కల = కలిగిన; భూత = భూతముల; పిశాచ = పిశాచముల; ఢాకినీ = ఢాకినీల; నివహములు = సమూహములు; అంతరిక్షమునన్ = ఆకాశమున; నిల్చి = నిలబడి; నిజ = తమ; ఆయుధ = ఆయుధములు; పాణులు = చేతులలో కలవారు; ఐ = అయ్యి; మహా = పెద్ద; రవముగ = శబ్దములతో; యక్ష = యక్షులు; దైత్య = రాక్షసులు; చతురంగబలంబులన్ = చతురంగబలములతో {చతురంగబలములు - 1కాల్బలము 2ఆశ్విక 3 గజ 4 రధాంగబలములు నాలుగు అంగములు (భాగములు) కల సైన్యము}; కూడి = కలిసి; తోచినన్ = కనిపించగా.

భావము:

భూతాలు, పిశాచాలు, డాకినులు జుట్టు విరబోసుకొని, భయంకరమైన కరకు కోరలతో, దౌడలతో, ఎఱ్ఱని కన్నులతో గుంపులుగా ఆకాశంలో నిల్చి ఆయుధాలు ధరించి, పెద్దగా కేకలు వేస్తూ యక్ష రాక్షస సైన్యాలతో కూడి కనిపించాయి.

3-692-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అంత.

టీకా:

అంత = అంతట.

భావము:

అప్పుడు...

3-693-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

త్రివనపాదుం డగు నా
బిరుహనేత్రుండు లోకభీకర మగు నా
సురాధిపు మాయావిని
నకరం బైన శస్త్రరాజముఁ బనిచెన్.

టీకా:

త్రిసవన = మూడు కాలములు ప్రాతః, మధ్యాహ్న, సాయంకాలములు అందు లేదా మూడు యాగములందు; పాదుడు = తిరుగగలవాడు; అగు = అయిన; ఆ = ఆ; బిసరుహనేత్రుండు = యజ్ఞవరాహుడు {బిసరుహనేత్రుడు - బిసరుహము (పద్మము) లవంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; లోక = లోకములకు; భీకరము = భయంకరము; అగు = అయిన; ఆ = ఆ; అసుర = రాక్షసుల; అధిపున్ = ప్రభువు యొక్క; మాయా = మాయను; వినిరసన = పూర్తిగా తిరస్కరించుట; కరంబున్ = చేయునది; ఐన = అయిన; శస్త్రరాజమున్ = చక్రమును {శస్త్రరాజము - శస్త్రములలో శ్రేష్ఠమైనది, చక్రము}; పనిచెన్ = పంపించెను.

భావము:

ప్రాతః, మధ్యాహ్న, సాయంకాలములు అను కాలత్రయంలో లేదా మూడు యాగములందు చరించువాడైన ఆ యజ్ఞవరాహ రూప విష్ణువు ఆ రాక్షసరాజు మాయను నిరోధించగల ఆయుధాలలో అగ్రగణ్యమైన తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు.

3-694-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

క్రభానుదీప్తి ధ
రాక్రమునందు నిండియముననమ్మా
యాక్రమునడఁగించెను
నీక్రముఁడైన యామినీచరు నెదురన్

టీకా:

ఆ = ఆ; చక్ర = చక్రము యొక్క; భాను = సూర్య; దీప్తి = కాంతి; ధరా = భూ; చక్రమున్ = మండలము; అందున్ = అందు; నిండి = నిండిపోయి; రయమునన్ = వేగముగ; ఆ = ఆ; మాయా = మాయల; చక్రమును = దండునంతటిని; అడగించెను = అణచివేసెను; నీచ = నీచమైన; క్రముడు = నడత కలవాడు; ఐన = అయినట్టి; యామినీచరున్ = రాక్షసుని {యామినీ చరుడు - రాత్రి తిరుగువాడు, రాక్షసుడు}; ఎదురన్ = ఎదురుగా.

భావము:

విష్ణువు ప్రయోగించిన ఆ చక్రం యొక్క సూర్యకాంతి భూమండలమంతా నిండి ఆ మాయావి అయిన రాక్షసుడు ప్రయోగించిన మాయాచక్రాన్ని అతడు చూస్తుండగా అణచివేసింది.

3-695-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అంత నిక్కడ.

టీకా:

అంత = అంతట; ఇక్కడ = ఇక్కడ.

భావము:

ఆ సమయంలో ఇక్కడ....

3-696-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

దితి దన విభువాక్యంబుల
తిదప్పద యనుచుఁ దలఁపఁగాఁ జన్నుల శో
ణిధార లొలికె రక్షః
తి యగు కనకాక్షుపతనభావము దోఁపన్.

టీకా:

దితి = దితి; తన = తన; విభు = ప్రభువు; వాక్యంబులన్ = మాటల యొక్క; గతి = ప్రకారము జరుగుట; తప్పద = తప్పదు; అనుచున్ = అని; తలపగాన్ = తలుచుకొనగా; చన్నులన్ = స్తనములనుండి; శోణిత = రక్తపు; ధారల్ = ధారలు; ఒలికెన్ = కారెను; రక్షస = రాక్షసుల; పతి = రాజు; అగు = అయినట్టి; కనకాక్షు = హిరణ్యాక్షుని; పతన = మరణము; భావము = కలుగునను భావము; తోపన్ = తోచగా.

భావము:

తన భర్త అయిన కశ్యప ప్రజాపతి చెప్పిన మాటలు తప్పవేమో అని దితి అనుకొంటుండగా హిరణ్యాక్షుని పతనాన్ని సూచిస్తున్నట్లుగా ఆమె పాలిండ్లనుండి రక్తధారలు ప్రవహించాయి.

3-697-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అయ్యవసరంబున, నసురవిభుండు దనచేసిన మాయాశతంబులు గృతఘ్నునకుం గావించిన యుపకారంబులుం బోలె హరిమీఁదఁ బనిసేయక విఫలంబు లయినం; బొలివోవని బంటుతనంబునఁ బుండరీకాక్షుఁ జేరం జనుదెంచి బాహుయుగళంబు సాఁచి పూఁచి పొడచి రక్షోవైరి వక్షంబుఁ బీడించిన; నయ్యధోక్షజుండు దప్పించుకొని తలంగినం జెలంగి దైత్యుండు నిష్ఠురం బగు ముష్టిం బొడచిన; నసురాంతకుండు మిసిమింతుడు గాక రోషభీషణాకారాంబున వాసవుండు వృత్రాసురుం దెగటార్చిన చందంబున వజ్రివజ్రసన్నిభం బగు నటచేతం గఱకు టసురకటితటంబుఁ జటులగతి వ్రేసిన నా హిరణ్యాక్షుండు దిర్దిరందిరిగి యుదస్తలోచనుండై సోలి; యెట్టకేలకు నెదుర నిలువంబడె; నంత.

టీకా:

ఆ = ఆ; అవసరంబునన్ = సమయము అందు; అసుర = రాక్షసుల {అసుర - సురలు (దేవతలు) కాని వారు, రాక్షసులు}; విభుండు = ప్రభువు; తన = తను; చేసిన = ప్రయోగించిన; మాయా = మాయల; శతంబులున్ = అన్నీ; కృతఘ్నున్ = మేలు మరచువాని; కున్ = కి; కావించిన = చేసిన; ఉపకారంబులున్ = ఉపకారము; పోలెన్ = వలె; హరి = వరహావతారుని {హరి - విష్ణువు}; మీదన్ = పై; పని = ఉపయోగ; చేయక = పడక; విఫలంబులున్ = నిరర్థకములు; అయినన్ = అయిపోగా; పొలివోని = మొక్కపోని; బంటుతనంబునన్ = శౌర్యముతో; పుండరీకాక్షున్ = వరహావతారుని {పుండరీ కాక్షుడు - పుండరీకము (పద్మము)ల వంటి అక్షుడు (కన్నులు కలవాడు), విష్ణువు}; చేరన్ = దగ్గరకు; చనుదెంచి = వచ్చి; బాహు = చేతులు; యుగళంబున్ = రెంటిని; చాచి = చాచిపెట్టి; పూచి = పూర్తి బలంకొద్దీ; పొడిచి = పోటుపొడిచి; రక్షోవైరి = వరహావతారుని {రక్షోవైరి - రాక్షసుల వైరి (శత్రువు), విష్ణువు}; వక్షంబున్ = వక్షస్థలమును; పీడించినన్ = కొట్టగా; ఆ = ఆ; అధోక్షజుండు = వరహావతారుడు {అధోక్షజుడు - వ్యు. (అక్షజం – ఇంద్రియ జ్ఞానమ్ – అధి – అధరం, అధి+అక్షజం యస్య అధోక్షజః) బ.వ్రీ. వేనిని తెలియుటకు ఇంద్రియజ్ఞానము అస్మర్థమైనదో అతడు, విష్ణువు, ఆంద్రశబ్దరత్నాకరం}; తప్పించుకొని = తప్పించుకొని; తలంగినన్ = తొలగిపోగా; చెలంగి = చెలరేగి; దైత్యుండు = హిరణ్యాక్షుడు {దైత్యుడు - దితి యొక్క పుత్రుడు, హిరణ్యాక్షుడు}; నిష్ఠురంబు = కఠినము; అగు = అయిన; ముష్టిన్ = పిడికిలితో; పొడిచినన్ = పొడవగా; అసురాంతకుండు = ఆదివరాహుడు {అసురాంతకుడు - అసురులు (రాక్షసులు) ను అంతకుడు (సంహరించినవాడు), విష్ణువు}; మిసిమింతుడు = శ్రాంతుడు, అలసినవాడు; కాక = కాకుండగ; రోష = రోషముతో; భీషణ = భయంకరమైన; ఆకారంబునన్ = ఆకారముతో; వాసవుండు = ఇంద్రుడు; వృత్ర = వృత్ర అను; అసురునిన్ = రాక్షసుని; తెగటార్చిన = సంహరించిన; చందంబునన్ = విధముగ; వజ్రి = ఇంద్రుని {వజ్రి - వజ్రాయుధము కలవాడు, ఇంద్రుడు}; వజ్ర = వజ్రాయుధమునకు; సన్నిభంబున్ = సాటిరాగలది; అగు = అయిన; అటచేతన్ = అరచేతితో; కఱకు = మోటువాడైన; అసుర = రాక్షసుని {అసురుడు - సురలు (దేవతలు) కాని వాడు, రాక్షసుడు}; కటి = మొల; తటంబునన్ = భాగమున; చటుల = భయంకరమైన; గతిన్ = విధముగ; వ్రేసినన్ = కొట్టగా; హిరణ్యాక్షుండు = హిరణ్యాక్షుడు; తిర్దిరన్ = గిరగిర, గింగిర్లు; తిరిగి = తిరిగిపోయి; ఉదస్త = తేలవేసిన; లోచనుండు = కన్నులు కలవాడు; ఐ = అయ్యి; సోలి = అలసిపొయి; ఎట్టకేలకున్ = చివరకు; ఎదురన్ = ఎదురుగ; నిలువంబడెన్ = నిలబడెను; అంత = అంతట.

భావము:

అప్పుడు ఆ రాక్షసుడు కృతఘ్నునికి చేసిన ఉపకారం లాగా తాను ప్రయోగించిన వందల కొలది మాయలు హరిమీద పనిచేయక విఫలం కాగా మొక్కవోని శౌర్యంతో విష్ణువును సమీపించి రెండు చేతులు చాచి అతని వక్షస్థలాన్ని బలంకొద్ది పొడచి బాధపెట్టాడు. విష్ణువు తప్పించుకొని ప్రక్కకు తొలిగాడు. రాక్షసుడు విజృంభించి బలమైన పిడికిలితో వరాహమూర్తిని పొడిచాడు. హరి అలసిపోక కోపంతో భయంకరమైన ఆకారం కలవాడై ఇంద్రుడు వృత్రాసురుణ్ణి సంహరించిన విధంగా వజ్రాయుధం వంటి తన అరచేతితో మోటుగా నున్న రాక్షసుని నడుముపైన తీవ్రంగా కొట్టాడు. ఆ దెబ్బకు హిరణ్యాక్షుడు గిరగిర తిరిగి కన్నులు తేలిపోగా సోలిపోయి ఎట్టకేలకు తేరుకొని ఎదుట నిలబడ్డాడు. అప్పుడు....