పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : యుద్ధవ దర్శనంబు

  •  
  •  
  •  

3-59-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్రోధమాత్సర్యధనుఁడు సుయోధనుండు
వొలుచు నెవ్వనిసభఁ జూచి లుష మొదవి
నములోన నసూయానిగ్నుఁ డయ్యె
ట్టి ధర్మజుఁ డున్నాడె? నఘచరిత!

టీకా:

క్రోధ = క్రోధము; మాత్సర్య = మాత్సర్యము; ధనుండు = ధనముగా కలవాడు; సుయోధనుడు = దుర్యోధనుడు; పొలుచున్ = వెలుగు, శోభిల్లు; ఎవ్వని = ఎవని; సభన్ = సభాభవనమును (మయసభ); చూచి = చూసి; కలుషము = క్రోధము; ఒదవి = పొంది; మనసు = మనసు; లోనన్ = లోపల; అసూయా = అసూయలో; నిమగ్నుడు = మునిగినవాడు; అయ్యెన్ = ఆయెనో; అట్టి = అటువంటి; ధర్మజుడు = ధర్మరాజు {ధర్మజుడు - యమధర్మరాజు పుత్రుడు, ధర్మరాజు}; ఉన్నాడే = బాగున్నాడా; అనఘ = పాపములేని; చరిత = ప్రవర్తన కలవాడ.

భావము:

ఓ పుణ్యాత్ముడా! ఉద్దవా! దేదీప్యమానమైన ఏ మయసభను చూసి, మితిమీరిన క్రోధం మాత్సర్యం గల ఆ దుర్యోధనుడు కల్మషం పుట్టి,, మనసులో అసూయతో నిండిపోయాడో, ఆ ధర్మరాజు సుఖంగా ఉన్నాడా?