పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విదురుని తీర్థాగమనంబు

  •  
  •  
  •  

3-21-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"కౌవ పాండవు లిరువురు
నాయ నీ కొక్క సమమ వనీవర! నీ
వే రీతి నైన బాండుకు
మారుల పాలొసఁగి తేని ను నుభయంబున్."

టీకా:

కౌరవ = కౌరవులు నూర్గురు; పాండవులు = పాండవులు ఐదుగురు {పాండవులు - పంచపాండవులు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు}; ఇరువురున్ = ఇద్దరును; అరయన్ = చూడగా; నీకున్ = నీకు; ఒక్కసమమ = సమానమే; అవనీవర = రాజ {అవనీవర - భూమికి వరుడు, రాజు}; నీవు = నీవు; ఏరీతిన్ = ఏవిధముగనైన; పాండుకుమారుల = పాండవుల; పాలు = వంతు, భాగము; ఒసంగితేని = ఇచ్చినచో; మనున్ = బ్రతుకుదురు; ఉభయంబున్ = ఇద్దరును.

భావము:

“మహారాజ నువ్వు కన్న కౌరవులు, నీ తమ్ముడు కన్న పాండవులు ఇద్దరూ నీకు సమానమే. నీవు ఎలాగైనా సరే పాండవుల వాటాకు రావలసిన రాజ్యభాగం ఇచ్చినట్లైతే ఉభయులు క్షేమంగా ఉంటారు.”