పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మకు హరి ప్రత్యక్ష మగుట

 •  
 •  
 •  

3-282-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ట్లు గ్రమ్మఱఁ జేరి యయ్యబ్జపీఠ
మందు నష్టాంగయోగక్రియానురక్తిఁ
వను బంధించి మహిత తస్సమాధి
నుండి శతవర్షములు సనుచుండ నంత.

టీకా:

అట్లు = ఆవిధముగ; క్రమ్మఱన్ = వెనుకకు; చేరి = చేరి; ఆ = ఆ; అబ్జ = పద్మము యొక్క {అబ్జము - అప్పు (నీరు) లో పుట్టినది, పద్మము}; పీఠము = బొడ్డు; అందున్ = లో; అష్టాంగ = అష్టాంగ; యోగ = యోగ {అష్టాంగయోగ మార్గములు - 1 యమము 2 నియమము 3 ఆసనము 4 ప్రాణాయామము 5 ప్రత్యాహారము 6 ధారణ 7 ధ్యానము 8 సమాధి}; క్రియా = క్రియా; అనురక్తిన్ = ఆచరించు కొరకు; పవను = ప్రాణ వాయువులను; బంధించి = బంధించి; మహిత = గొప్ప; తపస్ = తపస్సు యొక్క; సమాధిన్ = సమాధిలో; ఉండి = ఉండి; శత = నూరు; వర్షములు = సంవత్సరములు; చనుచున్ = జరుగుచు; ఉండన్ = ఉండగా; అంతన్ = అంతట.

భావము:

అలా చతుర్ముఖుడు ఆ పద్మపీఠంపై కూర్చుండి అష్టాంగయోగంపై ఆసక్తి గలవాడైనాడు. గాలిని బంధించి, ఏకాగ్రభావంతో తపస్సు చేసాడు. ఈ విధంగా నూరేళ్ళు గడిచాయి.

3-283-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ట్టి యోగజనిత మైన విజ్ఞానంబు
లిగి యుండి దానఁ మలనయనుఁ
గానలేక హృదయమలకర్ణిక యందు
నున్నవానిఁ దన్నుఁ న్నవాని.

టీకా:

అట్టి = అటువంటి; యోగ = యోగమువలన; జనితము = పుట్టినది; ఐన = అయిన; విజ్ఞానంబు = విజ్ఞానము; కలిగి = పొంది; ఉండి = ఉండియు; దానన్ = దానివలన; కమలనయనున్ = విష్ణుని; కానన్ = చూడ; లేక = లేక; హృదయ = హృదయము అను; కమల = కమలము యొక్క; కర్ణిక = గదుల; అందున్ = లోపల; ఉన్న = ఉన్నట్టి; వానిన్ = వానిని; తన్నున్ = తనను; కన్న = పుట్టించిన; వానిన్ = వానిని;

భావము:

బ్రహ్మదేవుడు ఇలా చేసిన యోగాభ్యాసం వల్ల విజ్ఞానాన్ని పొందాడు. ఆ విజ్ఞానం వల్లకూడా అతడు విష్టువును చూడలేకపోయాడు. అప్పుడు తన ధ్యానాన్ని తన హృదయంలో నిలిపాడు. అక్కడ పరాత్పరుని దర్శించి తన హృదయంలో ఉన్నవాడే తనను కన్నవా డని తెలుసుకొన్నాడు.

3-284-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నియెన్ నిశ్చలభక్తియోగ మహిమం గంజాతగర్భుండు శో
చారిత్రు జగత్పవిత్రు విలసత్పద్మాకళత్రున్ సుధా
ముఖ్యస్తుతిపాత్రు దానవచమూజైత్రున్ దళత్పద్మనే
త్రు వీనోజ్జ్వలనీలమేఘనిభగాత్రుం బక్షిరాట్పత్రునిన్.

టీకా:

కనియెన్ = చూచెను; నిశ్చల = నిశ్చలమైన; భక్తిన్ = భక్తి; యోగ = యోగము యొక్క; మహిమన్ = ప్రభావము వలన; కంజాతగర్భుండు = బ్రహ్మదేవుడు {కంజాతగర్భుడు - కం (నీరు) అందున జాత (పుట్టినది, పద్మము) అందు గర్భుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు}; శోభనచారిత్రు = విష్ణుని {శోభనచారిత్రుడు - శుభకరమైన నడవడిక కలవాడు, విష్ణువు}; జగత్పవిత్రు = విష్ణుని {జగత్పవిత్రుడు - సకల భువనములను పవిత్రము చేయువాడు, విష్ణువు}; విలసత్పద్మాకళత్రున్ = విష్ణుని {విలసత్పద్మాకళత్రుడు - ప్రకాశమానమైన పద్మ (లక్ష్మీదేవి) కళత్రుడు(భర్త), విష్ణువు}; సుధాశనముఖ్యస్తుతిపాత్రున్ = విష్ణుని {సుధాశనముఖ్యస్తుతిపాత్రుడు - సుధా (అమృతము) ఆశన (తాగువారు) ముఖ్య (మొదలగువారి)చే స్తుతింపబడుటకు పాత్రుడు (అర్హుడు), విష్ణువు}; దానవచమూజైత్రున్ = విష్ణుని {దానవచమూజైత్రుడు - రాక్షసుల చమూ (సైన్యములను) జైత్రుడు (జయించువాడు), విష్ణువు}; దళత్పద్మనేత్రు = విష్ణుని {దళత్పద్మనేత్రుడు - దళత్ (వికసించిన) పద్మముల వంటి నేత్రములు కలవాడు, విష్ణువు}; నవీనోజ్జ్వలనీలమేఘనిభగాత్రున్ = విష్ణుని {నవీనోజ్జ్వలనీలమేఘనిభగాత్రుడు -నవీన (సరికొత్తగా) ఉజ్జ్వల (ప్రకాశిస్తున్న) నీలమేఘముల నిభ (వంటి) గాత్రము (శరీరము) కలవాడు, విష్ణువు};పక్షిరాట్పత్రునిన్ = విష్ణుని {పక్షిరాట్పత్రుడు - పక్షులకురాజు (గరుత్మంతుడు) యొక్క పత్రుడు (ఱెక్కలుపై తిరుగువాడు, వాహనముగా కలవాడు), విష్ణువు.}.

భావము:

ఈ విధంగా అచంచలమైన భక్తితో కూడిన యోగమాహాత్మ్యం వల్ల బ్రహ్మదేవుడు శుభచరిత్రుడూ, పరమపవిత్రుడూ, లక్ష్మీకళత్రుడూ, అయిన శ్రీమన్నారాయణుని దర్శించాడు. ఆయన వేలుపు పెద్దల వినతులు అందుకొనే వాడు. దానవసైన్యాలను తరిమికొట్టేవాడు. వికసించిన కమలాలవంటి కన్నులు కలవాడు. క్రొత్తదై వెలిగిపోతూ ఉన్న నీలమేఘంతో సమానమైన దేహం కలవాడు గరుడవాహనుడు.

3-285-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మఱియును.

టీకా:

మఱియును = ఇంకనూ.

భావము:

ఇంకా

3-286-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఘు ఫణాతపత్రనిచయాగ్ర సమంచిత నూత్నరత్న ని
ర్మరుచిచే యుగాంత తిమిరంబు నడంచి యకల్మషోల్లస
జ్జములఁ జేసి యందు నవసారసనాళసితైకభోగముం
లిగిన శేషతల్పమునుఁ గైకొని యున్న మహాత్ము నొక్కనిన్.

టీకా:

అలఘు = గొప్పదైన; ఫణా = పడగలు అను; అతపత్ర = గొడుగుల; నిచయ = సమూహముల; అగ్ర = పైన; సమంచిత = చక్కగా నొప్పతున్న; నూత్న = సరికొత్త; రత్న = రత్నముల యొక్క; నిర్మల = పరిశుభ్రమైన; రుచి = కాంతి; చేన్ = చేత; యుగ = యుగముల; అంత = అంత మందలి; తిమిరంబున్ = చీకటిని; అడంచి = అణచి; అకల్మష = నిర్మలముగా; ఉల్లసత్ = ప్రకాశిస్తున్న; జలములన్ = నీరు; చేసి = ఏర్పరచి; అందున్ = దానిలో; నవ = లేత; సారస = పద్మముల; నాళ = కాడల; సిత = తెలుపు; ఏక = వంటి; భోగమున్ = శరీరము; కలిగిన = కల; శేష = శేషుడు అను; తల్పమునున్ = శయన తల్పమును; కైకొని = గ్రహించి; ఉన్న = ఉన్నట్టి; మహాత్యునిన్ = గొప్పవానిని; ఒక్కనిన్ = ఒకనిన్.

భావము:

అంతేకాదు. ఆ మహానుభావుడు గొప్పవైన పడగలనే గొడుగుల చివర గల స్వచ్ఛమైన రత్నాల కాంతులతో ప్రళయకాలంలోని చీకట్లను పోకార్చుతూ కొంగ్రొత్త తామరతూడులాంటి తెల్లని దేహసంపద కలిగన ఆదిశేషుణ్ణి పాన్పుగా చేసికొని మిక్కిలి నిర్మలంగా ఉన్న నీళ్ళమధ్యలో శయనించి ఉన్నాడు.

3-287-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ర పీతకౌశేయరిధానకాంతి సం-
ధ్యాంబుదరుచి నిచయంబుగాఁగఁ
మనీయ నవహేమలిత కిరీటంబు-
మణఁ గాంచనశిఖరంబుగాఁగ
మానిత మౌక్తికమాలికారుచి సాను-
తిత నిర్ఝర పరంరలుగాఁగఁ
జెలువొందు నవతులసీదామకములు లా-
లి తటజౌషధీ లుగాఁగ

3-287.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ర భుజంబులు నికటస్థ వంశములుగఁ
దము లంగణపాదప ప్రచయములుగ
లితగతి నొప్పు మరకతాల విడంబి
తాత్మదేహంబు గలుగు మహాత్ము; హరిని.

టీకా:

వర = శ్రేష్ఠమైన; పీత = పచ్చని; కౌశేయ = పట్టు బట్టతో; పరిధాన = కట్టిన వస్త్రము యొక్క; కాంతి = కాంతి; సంధ్యా = సంధాయ సమయమందలి; అంబుద = మేఘము యొక్క; రుచి = చాయల, రంగుల; నిచయంబున్ = సమూహములు; కాగ = అవ్వగా; కమనీయ = చూడచక్కని; నవ = సరికొత్త; హేమ = బంగారముతో; కలిత = చేయబడిన; కిరీటంబున్ = కిరీటము; రమణ = రమణీయమైన; కాంచన = బంగరపు, కాంచనగంగా; శిఖరంబున్ = శిఖరము; కాగ = అవ్వగా; మానిత = పొగడతగ్గ; మౌక్తిక = ముత్యాల; మాలికా = దండల; రుచి = కాంతి; సాను = కొండసానువులనుండి; పతిత = పడుతున్న; నిర్ఝర = సెలయేళ్ళ; పరంపరలు = పరుగులు; కాగ = అవ్వగా; చెలువొందు = చక్కగానొప్పతున్న; నవ = తాజా; తులసీ = తులసి; దామకములు = మాలలు; లాలిత = మృదువైన; తటత్ = తీరమున; జ = పుట్టిన; ఓషధీ = ఓషధులు; లతలున్ = లతలు; కాగ = అవ్వగా; షవీ వర = శ్రేష్ఠమైన; భుజంబులు = భుజములు; నికటస్త = సమీపమందలి; వంశములుగన్ = వెదుళ్లుగా; పదములు = పాదములు; అంగణ = ముంగిలి; పాదప = చెట్ల; ప్రచయములుగవ్ = చక్కటి గుంపులుగా; లలిత = విలాస; గతిన్ = వంతముగా; ఒప్పు = ఒప్పుచున్న; మరకత = పచ్చల, మలయ {మరకతాచలము - మలయపర్వతము}; అచల = పర్వతమును; విడంబిత = హేళన చేసేటటువంటి; ఆత్మ = తన; దేహంబున్ = శరీరమును; కలుగు = కలిగిన; మహాత్ము = గొప్పవానిని; హరిన్ = విష్ణుని.

భావము:

కట్టుకొన్న మేలైన పట్టుస్ర్తాల కాంతులు సాయంకాలపు మేఘాల కాంతులు కాగా, పెట్టుకొన్న సుందర సువర్ణ కిరీటం బంగారు శిఖరం కాగా, రొమ్ముపై వ్రేలాడే ముత్యాలహారాలు చరియలపై నుండి జాలువారే సెలయేళ్ళు కాగా, అందాలు చిందే తులసీమాలలు దరుల్లో ప్రకాశించే ఓషధీలతలు కాగా, ఉన్నతభుజాల చెంగట ఉన్న మొదళ్ళు కాగా, పాదాలు ముంగిట ఉన్న తరుగుల్మాలు కాగా, పచ్చని దేహంతో పచ్చల పర్వతంలాగా ప్రకాశిస్తున్నాడు ఆ పరాత్పరుడు.

3-288-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మఱియు, నప్పరిచ్ఛిన్నంబును, నిరుపమానంబును, నిఖిలలోక సంగ్రహంబును, నతి విస్తార వర్తులాయామంబును నై వివిధ విచిత్ర దివ్య మణిభూషణంబుల నాత్మీయ నిర్మలద్యుతిచేతం బ్రకాశంబు నొందం జేయు దివ్యదేహంబు దనర; వివిధంబు లగు కామంబు లభిలషించి విశుద్ధం బైన వేదోక్తమార్గంబున భజియించు పురుషశ్రేష్ఠులకుఁ గామధేను వనం దగిన పాదపద్మయుగంబును, నలికఫలక లలితరుచి నిచయంబులకు నోటువడి కృపాపాత్రుండై చంద్రుండు బహురూపంబులఁ బదసరోజంబుల నాశ్రయించె నన నొప్పు పదనఖంబులును, కమలా భూకాంతలకు నుపధాన రూపంబు లనందగి నీలకదళీకా స్తంభంబుల డంబు విడంబించు నూరుయుగళంబును, కనకమణిమయ మేఖలాకలా పాభిరామంబుఁ గదంబ కింజల్క శోభిత పీతాంబ రాలంకృతంబునై విలసిల్లు కటిమండలంబును, శృంగారవాహినీ జలావర్తంబునాఁ బొలుపొందు నాభీవివరంబును, జఠరస్థ నిఖిల బ్రహ్మాండ ముహుర్ముహుఁరుద్భవ కృశీభూతం బనందగు మధ్య భాగంబును, మహిత ముక్తాఫలమాలికా విరచిత రంగవల్లీ విరాజితంబు నవతులసీదామ కిసలయ తల్పంబుఁ గుసుమమాలికాలంకృతంబు ఘనసార కస్తురికా చందన విలిప్తంబుఁ కౌస్తుభరత్నదీప్తి ప్రదీప్తంబు శ్రీవత్సలక్షణ లక్షితంబు నై యిందిరారమణికిఁ గేళీమందిరం బనం బొల్చు వక్షస్థలంబును, సుఖకేళీ సమారంభ పరిరంభ ణాంభోధిరాట్కన్యకా కరాంబుజ కీలిత కనకమణికంకణ నికషంబుల బొలుపారు రేఖాత్రయ విరాజమానం బైన కంధరంబును, సుమహితానర్ఘ దివ్యమణి ప్రభా విభాసిత కేయూర కంకణ ముద్రికాలంకృతంబు లయిన బాహువులును, సకల లోకార్తి నివారక దరహాసచంద్రికా ధవళితంబు లైన కర్ణకుండలమండన మణి మరీచులు నర్తనంబులు సలుంపం దనరి నిద్ధంబు లగు చెక్కుటద్దంబులును, పరిపక్వ బింబఫల ప్రవాళ పల్లవారుణాధరంబును, యఖిల భువన పరిపాలనంబునకు నేన చాలుదు నని నినదించు నయనయుగళంబునకు సీమాస్తంభంబుఁ జంపకప్రసూన రుచి విలసంబు నగు నాసాదండంబును, కమలకుముదంబులకుం బెంపు సంపాదించుచుఁ గరుణామృత తరంగింతాపాంగంబు లై కర్ణాంతవిశ్రాంతంబు లై చెలువొందు నేత్రంబులును, సలలిత శ్రీకారంబునకు నక్షరత్వంబు సార్థకం బయ్యె ననం దగు కర్ణంబులును, నిక్షుచాప చాప ద్వయంబునాఁ జూపట్టు భ్రూయుగళంబును, నపరపక్షాష్టమీ శశాంక శంకాస్పద ఫాలఫలకంబును, నీలగిరీంద్రశృంగ సంగత బాలమార్తాండ మండల విడంబిత పద్మరాగమణిఖచిత కాంచనకిరీటంబునం బొలుపారి సూర్యేందు పవనానల ప్రకాశంబులకు నవకాశంబు సూపక త్రిలోక వ్యాపక సమర్థంబు లగు తేజోవిశేషంబులఁ జెలువొంది సంగర రంగంబుల దానవానీకంబుల హరింపం జాలు సుదర్శనాది దివ్యసాధనంబులచే దురాసదం బగు దివ్యరూపంబును గలిగి; మఱియును.

టీకా:

మఱియును = ఇంకనూ; అపరిచ్ఛిన్నంబునున్ = అంతు చిక్కనిదియును; నిరుపమానంబునున్ = సాటి లేనిదియును; నిఖిల = సమస్తమైన; లోక = భువనములను; సంగ్రహంబునున్ = ఇముడ్చుకొన్నదియును; అతి = మిక్కిలి; విస్తార = పెద్ద; వర్తులా = గుండ్రని; ఆయమంబున్ = నిడివి కలదియును; ఐ = అయి; వివిధ = వివిధరకములైన; విచిత్ర = విచిత్రమైన; దివ్య = దివ్యమైన; మణి = మణులచే; భూషణంబులన్ = అలంకారముల యొక్క; ఆత్మీయ = స్వంత; నిర్మల = స్వచ్ఛమైన; ద్యుతిన్ = కాంతి; చేతన్ = చేత; ప్రకాశంబున్ = ప్రకాశవంతము; ఒందన్ = పొందునట్లు; చేయు = చేసేటటువంటి; దివ్య = దివ్యమైన; దేహంబున్ = శరీరము; తనరన్ = అతిశయిస్తుండగా; వివిధంబులు = రకరకములు; అగు = అయిన; కామంబులన్ = కోరికలను; అభిలషించి = కోరి; విశుద్ధంబు = పరిశుభ్రము; ఐన = అయిన; వేద = వేదములందు; ఉక్త = చెప్పబడిన; మార్గంబునన్ = పద్ధతి ప్రకారము; భజియించు = సేవించు; పురుష = మానవులలో; శ్రేష్ఠుల = ఉత్తముల; కున్ = కు; కామధేనువు = కామధేనువు {కామధేనువు - కోరిన కోరికలు ఇచ్చెడి దేవలోకపు ఆవు}; అనన్ = అనుటకు; తగిన = తగినట్టి; పాద = పాదములు అనెడి; పద్మ = పద్మముల; యుగంబును = జంటయును; అలిక = ఫాల, నుదుటి; ఫలక = భాగము యొక్క; లలిత = చక్కటి; రుచి = కాంతుల; నిచయంబుల = సమూహముల; కున్ = కు; ఓటువడి = ఓడిపోయి; కృపాపాత్రుండు = దీనుడు {కృపాపాత్రుడు – దయకు పాత్రుడు, దీనుడు}; ఐ = అయి; చంద్రుండు = చంద్రుడు; బహు = అనేక; రూపంబులన్ = స్వరూపములతో; పద = పాదములు అనెడి; సరోజంబులన్ = పద్మములను {సరోజము - సరస్సున జ(పుట్టినది), పద్మము}; ఆశ్రయించెన్ = ఆశ్రయించెను; అనన్ = అనగా; ఒప్పు = ఒప్పుచున్న; పద = పాదముల; నఖంబులును = గోర్లునూ; కమలా = లక్ష్మీదేవి; భూ = భూదేవి అను; కాంతలకున్ = భార్యలకు; ఉపధాన = తలగడ; రూపంబులన్ = రూపమునకు; తగి = తగినట్టి; నీల = నల్లని; కదళీకా = అరటి; స్తంభంబుల = స్తంభముల; డంబు = సొగసును; విడంబించు = హేళన చేసేటటువంటి; ఊరు = తొడల; యుగళంబునున్ = జంటయును; కనక = బంగారముతో; మణి = మణులచే; మయ = కూడినదైన; మేఖలా = నడుము పటకా; కలాప = భూషణ కలయికతో; అభిరామంబున్ = సొగసైనదియును; కదంబ = కదంబ పూల; కిజల్క = కేసరములవలె; శోభిత = శోభకలిగిన; పీత = పచ్చని; అంబర = పట్టువస్త్రముతో; అలంకృతంబును = అలంకరింపబడినదియును; ఐ = అయి; విలసిల్లు = అతిశయించు; కటి = నడుము; మండలంబునున్ = ప్రదేశమునూ; శృంగార = శృంగార; వాహినీ = ప్రవాహపు; జల = నీటి; ఆవర్తంబున్ = సుడిగుండము; నాన్ = అనిపిస్తూ; పొలుపు = విలాసమును; ఒందు = పొందే; నాభీ = బొడ్డు; వివరంబునున్ = రంధ్రమును; జఠరస్థ = కడుపులో నున్న; నిఖిల = సమస్తమైన; బ్రహ్మాండ = బ్రహ్మాండములు; ముహుర్ = మరల; ముహుర్ = మరల; ఉద్భవ = పుట్టుటచేత; కృశీభూతంబు = సన్నబడినది; అనన్ = అనుటకు; తగు = తగినట్టి; మధ్య = నడుము; భాగంబునున్ = భాగమును; మహిత = గొప్ప; ముక్తాఫల = ముత్యముల; మాలికా = దండలచే; విరచిత = చక్కగావేయబడిన; రంగవల్లీ = ముగ్గులుతో, రంగవల్లులుతో; విరాజితంబున్ = ప్రకాశితమును; నవ = తాజా; తులసీ = తులసీ; దామ = దండలలోని; కిసలయ = దళముల; తల్పంబున్ = పాన్పును; కుసుమ = పుష్ప; మాలికా = మాలికలచే; అలంకృతంబున్ = అలంకరింపబడినదియును; ఘనసార = కర్పూరము; కస్తూరిక = కస్తూరి; చందన = మంచిగంధము; విలిప్తంబున్ = పూయబడినదియును; కౌస్తుభ = కౌస్తుభము అను; రత్న = మణి యొక్క; దీప్తిన్ = కాంతులచేత; ప్రదీప్తంబున్ = ప్రకాశింపబడుచున్నదియును; శ్రీవత్స = శ్రీవత్స అను పేరుగల; లక్షణ = పుట్టుమచ్చ; లక్షితంబున్ = కలిగినదియును; ఐ = అయి; ఇందిర = లక్ష్మీ; రమణి = దేవి; కిన్ = కి; కేళీ = విహరించు; మందిరంబు = మందిరము; అనన్ = అన్నట్లు; పొల్చు = అతిశయించు; వక్షస్థలంబునున్ = వక్షస్థలమును; సుఖ = సుఖమైన మన్మథ; కేళీ = కేళి; సమారంభ = చక్కటి ప్రారంభమున; పరిరంభణ = కౌగలింతలలో; అంభోధి = సముద్రుని; రాట్కన్యకా = రాకుమారి; కర = చేతులు అను; అంబుజ = పద్మములకు; కీలిత = తగిలింపబడిన; కనక = బంగారపు; మణి = మణులు పొదిగిన; కంకణ = కంకణముల; నికషంబులన్ = రాపిడుల వలని; పొలుపారు = విలసిల్లు; రేఖా = గీతల; త్రయ = మూటితోను; విరాజమానంబు = మిక్కిలి ప్రకాశిస్తున్నది; ఐన = అయిన; కంధరంబునున్ = మెడయును; సు = చాలా; మహితా = గొప్ప; అనర్ఘ = వెలకట్టలేని; దివ్య = దివ్యమైన; మణి = మణుల; ప్రభా = కాంతులచేత; విభాసిత = బాగామెరిసిపోతున్న; కేయూర = భుజకీర్తులు; కంకణ = కంకణములు, మురుగులు; ముద్రికా = ఉంగరములు చేత; అలంకృతంబులు = అలంకరింపబడినవి; అయిన = అయినట్టి; బాహువులును = చేతులును; సకల = సమస్తమైన; లోక = లోకుల యొక్క; ఆర్తి = ఆర్తిని; నివారక = పోగొట్టుటవలని; దరహాస = చిరునవ్వులు అను; చంద్రికా = వెన్నెలలచే; ధవళితంబులు = తెలుపెక్కినవి; ఐన = అయినట్టి; కర్ణ = చెవి; కుండల = కుండలముల; మండన = అలంకరించు; మణి = రత్నముల యొక్క; మరీచులు = కాంతులు; నర్తనంబులు = నాట్యములు; సలుపన్ = చేయుచుండగ; తనరి = అతిశయించి; నిద్దంబులు = నున్నటివి; అగు = అయిన; చెక్కు = చెంపలు అను; అద్దంబులును = అద్దములును; పరిపక్వ = పరువుకొచ్చిన, పండిన; బింబ = దొండ; ఫల = పండు; ప్రవాళ = పగడము; పల్లవ = చిగురుటాకుల వలె; అరుణ = ఎఱ్ఱనైన; అధరంబును = పెదవియును; అఖిల = సమస్తమైన; భువన = లోకములను; పరిపాలనంబున్ = పరిపాలించుట; కున్ = కు; నేన = నేనే; చాలుదును = సరిపోవుదును; అని = అని; నినదించు = ప్రకటించు; నయన = కన్నుల; యుగళంబున = జంట; కున్ = కు; సీమా = సరిహద్దు; స్తంభంబున్ = స్తంభమును; చంపక = సంపంగి; ప్రసూన = పువ్వు; రుచిన్ = కాంతితో; విభాసితంబు = ప్రకాశించునది; అగు = యిన; నాసా = ముక్కు అను; దండంబును = దండమును; కమల = కమలములు; కుముదంబు =తెల్ల కలువలు; కున్ = కు; పెంపు = అతిశయమును; సంపాదించుచు = ఒసగుతూ; కరుణా = దయ అను; అమృత = అమృతపు; తరంగిత = అలలు కలిగిన; అపాంగంబులు = కటాక్షములు; ఐ = అయి; కర్ణ = చెవుల; అంత = అంతవరకు; విశ్రాంతంబులు = వెడల్పైనవి; ఐ = అయి; చెలువొందు = విలసిల్లు; నేత్రంబులును = కన్నులును; సలలిత = సుకుమారముతో కూడుకొన్నవియును; శ్రీకారంబున = శుభకరమున, శ్రీకారమున {శ్రీకారము - శ్రీ అను అక్షరము యొక్క రూపము, శుభకరము}; కున్ = కు; అక్షరత్వంబున్ = నాశనము లేకుండుటను, అక్షరరూపమును; సార్థకంబున్ = సార్థక్యము, ఇచ్చుచున్నవి; అయ్యెన్ = అయినది; అనన్ = అనుటకు; తగు = తగినట్టి; కర్ణంబులును = చెవులును; ఇక్షుచాప = మన్మథుని{ఇక్షుచాపుడు - చెఱుకు విల్లు వాడు, మన్మథుడు}; చాప = ధనుస్సుల; ద్వయ = జంట; నాన్ = అనునట్లు; చూపట్టు = కనబడెడి; భ్రూయుగళంబును = కనుబొమలు రెండూ; అపర = కృష్ణ; పక్ష = పక్షపు; అష్టమీ = అష్టమినాటి; శశాంక = చంద్రుడు అను; శంక = సందేహమునకు; ఆస్పద = అస్కారమిచ్చు; ఫాల = నుదిటి; ఫలకంబునున్ = భాగమును; నీలగిరి = నీలగిరిపర్వతములలో; ఇంద్ర = శ్రేష్ఠమైన; శృంగ = శిఖరములను; సంగత = చేరిన; బాల = ఉదయ; మార్తాండ = భాస్కరుని; మండల = బింబమును; విడంబిత = హేళన చేసేటటువంటి; పద్మరాగ = పద్మరాగ; మణి = మణులు; ఖచిత = పొదిగబడిన; కాంచన = బంగారు; కిరీటంబునన్ = కిరీటముతో; పొలుపారి = అతిశయించి; సూర్య = సూర్యుని; ఇందు = చంద్రుని; పవన = వాయుదేవుని; అనల = అగ్నిదేవుల; ప్రకాశంబుల = కాంతుల; కున్ = కు; అవకాశంబున్ = అవకాశమును; చూపక = ఇవ్వక; త్రి = మూడు; లోక = లోకములందు; వ్యాపక = వ్యాపించుటకు; సమర్థంబులు = దిట్టములు; అగు = అయిన; తేజస్ = తేజస్సు యొక్క; విశేషంబులన్ = విశిష్టితలచే; చెలువొంది = విలసిల్లి; సంగర = సంగ్రామ, యుద్ధ; రంగంబులన్ = భూములలో; దానవ = రాక్షస; అనీకంబులన్ = సేనలను; హరింపన్ = సంహరింపను; చాలు = సమర్థంబులగు; సుదర్శన = సుదర్శనచక్రము; ఆది = మొదలగు; దివ్య = దివ్యమైన; సాధనంబుల = ఆయుధముల; చేన్ = వలన; దురాసదంబున్ = దరిచేరరానిది; అగు = అయిన; దివ్య = దివ్యమైన; రూపంబునున్ = స్వరూపమును; కలిగి = కలిగి ఉండి; మఱియును = ఇంకనూ.

భావము:

అంతేకాక ఆ మహాత్ముని దివ్యదేహం వేరుపరుపరానిది. సాటిలేనిది. సమస్త లోకాలను తనలో ఇముడ్చుకొన్నది. చాలా విశాలమై గుండ్రనై నిడివి కలిగి ఉన్నది. విచిత్రమైన మనోజ్ఞమైన అనేక దివ్యభూషణాలను ధరించి వాటిని స్వచ్ఛమైన తన కాంతులచే అలంకరిస్తున్నది. పలువిధాలైన కోర్కెలు కోరుతూ యాథావిధిగా పూజించే పుణ్యపురుషులకు కామధేనువు అనదగిన చరణ కమలద్వయం కలిగి ఉన్నది. ఫాలఫలక కాంతులకు ఓడిపోయిన చంద్రుడు అనుగ్రహింప బడినవాడై ఆయన పాదపద్మాలను అనేక రూపాల్లో ఆశ్రయించాడా అన్నట్లు ఉన్నాయి ఆయన కాలిగోళ్లు. శ్రీదేవికీ, భూదేవికీ తలగడలా అన్నట్లు, నున్నని అరటిస్తంభాల నీలద్యుతిని అతిశయిస్తున్నాయి అతని తొడలు ఉన్నాయి. ఆయన కటిప్రదేశం మణులు చెక్కిన బంగారు ఒడ్డాణంతో మనోహరమై ఉన్నది. ఆయన నడుము కడిమిపువ్వుల కేసరాల కాంతులొలికే పట్టుపీతాంబరంతో ప్రకాశిస్తున్నది. ఆయన నాభి శృంగారతరంగిణి సుడివలె ఉన్నది. ఆయన మధ్యప్రదేశం (నడుము) కడుపులో సమస్త జగత్తులూ మాటిమాటికీ పుట్టుతున్నందువల్ల కృశించిందా అన్నట్లు ఉన్నది.
ఆయన వక్షఃస్థలం మంచి ముత్యాలు కూర్చిన ముగ్గులతో ముచ్చటగా ప్రకాశిస్తూ, క్రొంగ్రొత్త తులసీమాలలనే చిగురుల పాన్పుతో ఒప్పుతూ పూలదండలతో అలంకృతమై, పచ్చకర్పూరం కస్తూరి మంచి గందం పూతలతో పరిమళిస్తూ, కౌస్తుభరత్న కాంతులతో వెలిగిపోతూ, శ్రీవత్సశోభితమై లక్ష్మీదేవు విహరించే విలాసమందిరమా అన్నట్లు ఉన్నది. శృంగార క్రీడకు ముందు గట్టిగా కౌగిలించుకొన్న లక్ష్మీదేవి చేతులందలి మణులు చెక్కిన బంగారుగాజులు ఒత్తుకున్న గుర్తులా ఉన్నట్లు ఆయన కంఠాన మూడురేఖలు కన్పిస్తున్నాయి.
ఆయన చేతులు వెలకట్టరాని రమణీయ రత్నకాంతులతో విరాజిల్లే భుజకీర్తులతో, కంకణాలతో, ఉంగరాలతో అలంకృతములై ఉన్నాయి. ఆయన చెక్కుటద్దాలు సమస్తలోకుల బాధలను పోగొట్టగల చిరునవ్వు వెన్నెలలతో తెల్లనై కర్ణకుండలాల మణిప్రభల నాట్యాలతో తళతళలాడుతూ ఉన్నాయి.
ఆయన క్రిందిపెదవి పండిన దొండపండులాగా, పగడంలా, చిగురుటాకులాగా అరుణారుణమై అలరారుతున్నది. ఆయన ముక్కు చక్కని సంపెంగ పువ్వులా, సమస్తలోకాలను పాలించడానికి చాలిన దానిని నేనంటే నే నని వాదులాడే కన్నులకు సరిహద్దుస్తంభం అన్నట్లు ఉన్నది. ఆయన కన్నులు కమలాలకూ, కలువలకూ శోభ చేకూర్చుతూ, కరుణామృతం పొంగిపొరలే కటాక్ష వీక్షణాలతో చెవులవరకు విస్తరిల్లి ఉన్నాయి. ఆయన చెవులు శ్రీకారానికి అక్షరానికి అక్షరమైన ఆకారం చేకూరుస్తున్నాయి. ఆయన కనుబొమలు మన్మథుని ధనుస్సూలా అన్నట్లు ఉన్నాయి. ఆయన నెన్నుదురు బహుళపక్షం అష్టమినాటి చంద్రుడా అన్నట్లు కన్నుల విందు చేస్తున్నది.
ఆయన శిరస్సుమీద పద్మరాగమణులు పొదిగిన బంగారు కిరీటం నీలపర్వత శిఖరంమీద ఉండే భాలసూర్యుణ్ణి తిరస్కరిస్తున్నది. సూర్యుడు, చంద్రుడు, వాయువు. ఆగ్ని వీని ప్రకాశానికి కూడా అవకాశం ఇవ్వకుండా, మూడులోకాల్లోనూ వ్యాపించడానికి సమర్థమైన తేజోవిశేషంతో విరాజిల్లుతూ ఉన్న ఆ దేవదేవుడు రణరంగాలలో రాక్షసుల సమూహాన్ని చించి చెండాడ గల్గిన సుదర్శనం మొదలైన దివ్యాయుధాలు ధరించి ఉన్నాడు. అనన్యసామాన్యమైన దివ్యరూపంతో దేదిప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నాడు.

3-289-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

హాకలాప పుష్పనిచయంబులఁ జంచ దనర్ఘరత్నకే
యూ కరాంగళీయక మహోజ్జ్వల బాహు సహస్రశాఖ లొ
ప్పారఁగఁ జూడ నొప్పి భువనాత్మక లీల నదృష్టమూల వి
స్ఫారిత భోగివేష్టిత విభాసిత చందనభూరుహాకృతిన్.

టీకా:

హార = హారములు; కలాప = భూషణములు; పుష్ప = పువ్వుల యొక్క; నిచయంబులన్ = సమూహములచే; చంచత్ = ప్రకాశిస్తున్న; అనర్ఘ = వెలకట్టలేని, విలువైన; కేయూర = దండకడియములు; కర = చేతి; అంగుళీక = వేళ్ళ ఉంగరములుతోను; మహ = గొప్పగా; ఉజ్జ్వల = ప్రకాశిస్తున్న; బాహు = చేతులు అను; సహస్ర = వేలకొలది; శాఖలు = కొమ్మలు; ఒప్పారగన్ = ఒప్పి యుండగా; చూడన్ = చూచుటకు; ఒప్పి = చక్కగానుండి; భువన = జగములే; ఆత్మక = తానైన; లీలన్ = లీలతో, విధముగ; అదృష్ట = కనబడని; మూల = మొదలు కలదియును; విస్ఫారిత = విప్పారిన; భోగి = సర్పములు; పరివేష్టిత = చుట్టబడుటచే; విభాసిత = ప్రకాశిస్తున్న; చందన = మంచిగంధపు; భూరుహము = చెట్టు {భూరుహము - భూమి నుండి పుట్టునది, వృక్షము}; ఆకృతిన్ = స్వరూపముతో.

భావము:

ఆ మహాత్ముడు హారాది అలంకారాలు పుష్పసమూహాలుగా, వెలకట్టరాని రత్నాలు చెక్కిన భుజకీర్తులతో ఉంగరాలతో, విరాజిల్లే వేలకొలది బాహువులు శాఖోపశాఖలుగా ప్రకాశిస్తూ, భువనానికి ఆత్మయై మూలం తెలియరానిదై పడగవిప్పిన మహాసర్పం చుట్టుకున్న చందన వృక్షంలా ఉన్నాడు.

3-290-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

విసత్కుండలిరాజ సఖ్యమున నుర్వీభృత్సమాఖ్యన్ సము
జ్జ్వలితోదార శిరోవిభూషణ సహస్రస్వర్ణకూటంబులన్
లిలావాసతఁ జారు కౌస్తుభవిరాద్రత్నగర్భంబునన్
లినాక్షుండు గనుంగొనంగఁ దగె మైనాకావనీభృద్గతిన్.

టీకా:

విలసత్ = చక్కగా ఒప్పుచున్న; కుండలి = సర్ప; రాజ = రాజుతో; సఖ్యమునన్ = సహవాసము వలన; ఉర్వీభృత్ = భూధరుడు అను {ఉర్వీభృత్ - భూమిని ధరించువాడు, విష్ణువు}; సమ = చక్కటి; ఆఖ్యాతన్ = పేరుతో; సమ = చక్కగా; ఉజ్జ్వలిత = ప్రకాశిస్తున్న; ఉదార = అనేకమైన; శిరస్ = తలలపై; విభూషణ = అలంకరింపబడిన; సహస్ర = వేలకొలది; స్వర్ణ = బంగారు; కూటంబులన్ = కిరీటములతో; సలిల = నీటియందు; ఆవాస = నివసించుటచేతను; కౌస్తుభ = కౌస్తుభము అను; విరాజత్ = విలసిల్లే; రత్నగర్భంబునన్ = సముద్రములో {రత్నగర్భుడు - రత్నములు గర్భమున గలవాడు, సముద్రము}; నలినాక్షుండు = విష్ణువు {నలినాక్షుడు - పద్మములవంటి కన్నులు ఉన్న వాడు, విష్ణువు}; కనుగొనంగన్ = చూచుటకు; తగెన్ = తగి ఉన్నాడు; మైనాక = మైనాకడు అను {మైనాకుడు - హిమవంతుని కుమారుడును, సముద్ర మధ్యమున ఉండు పర్వతరాజము}; అవనీభృత్ = పర్వతము; గతిన్ = వలె.

భావము:

పడగవిప్పిన సర్పరాజుతో కలిసి మెలసి ఉన్నందువల్లా, భూమిని మోస్తూ ఉండటంవల్లా, శిరోవిభూషణాలుగా ప్రకాశించే వేలకొలది కిరీటాలవంటి బంగారు శిఖరాలవల్లా, సముద్రజలమధ్యంలో నివసించడం వల్లా, మనోహరమైన కౌస్తుభాది రత్నాలు కలిగివుండటం వల్లా మహావిష్ణువు మైనాక పర్వతంలా చూడదగినవాడు అయ్యాడు.

3-291-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వితార్థజ్ఞానజప
స్తుతి మకరందప్రహృష్ట శ్రుతిజాత మధు
వ్రగణపరివృతశోభా
కీర్తిప్రసవమాలిలు గలవానిన్.

టీకా:

వితత = వివరమైన; అర్థ = అర్థములు; జ్ఞాన = తెలిసిన; జప = జపములు; స్తుతి = స్తోత్రములు అను; మకరంద = తేనె వలన; ప్రహృష్ట = చక్కగా సంతృప్తమైన; శశ్రుతి = వేద; జాత = సముదాయములు అను; మధువ్రత = తేనెటీగల {మధువ్రత - తేనె మాత్రమే తీసుకొను వ్రతము కలవి, తేనెటీగలు}; గణ = సమూహములచే; పరివృత = ముప్పిరిగొనియున్; శోభా = శోభను; గత = పొందిన; కీర్తి = కీర్తులు అను; ప్రసవ = పుష్ప; మాలికలు = మాలలు; కలవానిని = కలవానిని.

భావము:

విష్ణువు వైభవోపేతంగా ప్రకాశించే కీర్తి అనే పూలదండలు ధరించాడు; వాటికి ఆకర్షించబడి వేద సమూహాలు అనే విశేషమైన తుమ్మెదలు మూగాయి; అవి సామాన్యమైన తుమ్మెదలా? విస్తారమైన భావంతో జ్ఞానం, జపం, స్తోత్రం ఆనే తేనెలు త్రాగటంచే సంతోషించే విశేషమైన తుమ్మెదలు. అట్టి విష్ణుమూర్తిని చతుర్ముఖబ్రహ్మ చూసాడు.