పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : పూర్ణి

 •  
 •  
 •  

2-285-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రా! గుణాభిరామ! దినరాజకులాంబుధిసోమ! తోయద
శ్యా! దశాననప్రబలసైన్యవిరామ! సురారిగోత్రసు
త్రా! సుబాహుబాహుబలర్ప తమఃపటుతీవ్రధామ! ని
ష్కా! కుభృల్లలామ! కఱకంఠసతీనుతనామ! రాఘవా!

టీకా:

రామ = రామ; గుణ = సద్గుణములతో; అభిరామ = ఒప్పువాడ; దినన్ = దినమునకు; రాజ = రాజు (సూర్య); కుల = వంశము అను; అంబుధి = సముద్రమునకు; సోమ = చంద్రుడ; తోయద = మేఘము వలె; శ్యామ = నల్లని రంగు కలవాడ; దశానన = దశకంఠుని {దశానన - దశ (పది) ఆనన (ముఖములు) కలవాడ, రావణుడు, దశకంఠుడు}; ప్రబల = బలమైన; సైన్య = సైన్యమును; విరామ = అంతము చేయువాడ; సురారి = రాక్షసులు అను {సురారులు - దేవతలకు శత్రువులు, రాక్షసులు}; గోత్ర = పర్వతములకు; సుత్రామ = ఇంద్రుని వంటివాడ; సుబాహున్ = సుబాహిని; బాహున్ = చేతుల; బల = బలము వలని; దర్ప = గర్వము అను; తమస్ = చీకటికి; పటు = మిక్కిలి; తీవ్ర = తీవ్రమైన కిరణములు; ధామ = నివాసమైన సూర్యుని వంటి వాడ; నిష్కామ = కోరికలు లేనివాడ; కుభృత్ = రాజులలో; లలామ = తిలకమా, శ్రేష్ఠుడా; కఱ = నల్లని {కఱకంఠుడు - నల్లని కంఠము కలవాడు, శివుడు}; కంఠ = కంఠము కలవాని, శివుని {కఱకంఠసతి - కఱకంఠుని భార్య, పార్వతి}; సతీ = భార్య చేత, పార్వతి చేత; నుత = స్తుతింపబడు; నామ = పేరు కలవాడ; రాఘవా = రఘు వంశపు వాడా.

భావము:

ఓ శ్రీరామచంద్ర! నీవు కల్యాణగుణాలచే సుందరుడవు. సూర్యవంశ మనే సముద్రానికి చంద్రుడవు. నీలమేఘశ్యాముడవు. రావణాసురుని భీకర సైన్యాన్ని అంతమొందించిన వాడవు. రాక్షసులనే పర్వతాల పాలిటి వజ్రాయుధధారైన ఇంద్రుడవు. సుబాహుని బాహుబల గర్వం అనే చీకటి పాలిటి తీక్ష్ణకిరణాల సూర్యుడవు. కాంక్షలు లేనివాడవు. అవనీపతులలో అగ్రగణ్యుడవు. పరమశివుని భార్య సతీదేవిచే సర్వదా సన్నుతి చేయబడుతుండే నామం గలవాడవు.

2-286-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రేంద్రసుతవిదారణ!
లాప్తతనూజరాజ్యకారణ! భవసం
సదినేశ్వర! రాజో
త్త! దైవతసార్వభౌమ! శరథరామా!

టీకా:

అమరేంద్ర = దేవంద్ర; సుత = పుత్రుని (వాలిని); విదారణ = చంపినవాడ; కమల = కమలములకు; ఆప్త = ఆప్తుడు (సూర్యుని); తనూజ = పుత్రుని (సుగ్రీవుని); రాజ్య = రాజ్య ప్రాప్తికి; కారణ = కారణమైనవాడ; భవ = సంసారము అను; సం = మిక్కిలి; తమస = చీకటికి; దిన = దినమునకు; ఈశ్వర = ప్రభువ (సూర్యుడ); రాజ = రాజులలో; ఉత్తమ = ఉత్తముడ; దైవత = దేవతలకు; సార్వభౌమ = చక్రవర్తి యైనవాడ; దశరథ = దశరథుని; రామ = రాముడ.

భావము:

శ్రీరామచంద్ర ప్రభువ! దశరథ పుత్రుడ! నీవు దేవేంద్రుని కొడుకు, మహాబలశాలి అయిన వాలిని సంహరించినవాడవు, సాక్షాన్నారాయణుడైన సూర్యభగవానుని పుత్రుడు సుగ్రీవునికి రాజ్యాధికారం దక్కుటకు కారణభూతుడవు, సూర్యుడు చీకటిని పారదోలునట్లు సంసారమనే తమస్సు సర్వం తొలగించువాడవు, ప్రభువు లందరిలోను మేలైన దివ్యసార్వభౌముడవు.

2-287-మాలి.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నిరుపమగుణజాలా! నిర్మలానందలోలా!
దురితఘనసమీరా! దుష్టదైత్యప్రహారా!
ధిమదవిశోషా! చారుసద్భక్తపోషా!
సిజదళనేత్రా! జ్జనస్తోత్రపాత్రా!

టీకా:

నిరుపమ = సాటిలేని; గుణ = గుణముల; జాలా = సమూహము కలవాడ; నిర్మల = మలినము లేని; ఆనంద = ఆనందముతో; లోలా = వర్తించు వాడ; దురిత = పాపములు అను; ఘన = మేఘములకు; సమీర = వాయువు వంటి వాడ; దుష్ట = దుష్టమైన; దైత్య = రాక్షసులను; ప్రహారా = సంహరించినవాడ; శరధి = సముద్రుని; మద = గర్వమును; విశోషా = మాపినవాడ; చారు = చక్కటి; సత్ = మంచి; భక్తన్ = భక్తులను; పోషా = పోషించువాడా; సరసిన్ = సరసులో; జ = పుట్టినదాని (పద్మము యొక్క) {సరసిజదళ - సరసున జ (పుట్టినది, పద్మము) యొక్క దళ (రేకులు)}; దళ = రేకుల వంటి; నేత్రా = కన్నులు కలవాడ; సత్ = మంచి; జనన్ = జనుల; స్తోత్రన్ = స్తోత్రములకు; పాత్రా = తగినవాడ.

భావము:

ఓ శ్రీరామ చంద్ర ప్రభు! అనంతగుణసాగరా! నీవు నిర్మలానందసాగరమున ఓలలాడుచుండు వాడవు. వాయువు మేఘలను చెదరగొట్టునట్లు పాపాలను చెదరగొట్టువాడవు. క్రూర మైన రాక్షసులను ఎందరినో సంహరించినవాడవు, సముద్రుని గర్వం సర్వం పరిహరించినవాడవు, భక్తకోటిని చక్కగా పోషించువాడవు, కలువరేకుల వంటి కన్నులు గలవాడవు, సజ్జనులచే స్తుతింపబడువాడవు.

2-288-గ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

pothana at bammera
ఇది శ్రీపరమేశ్వరకరుణాకలిత కవితావిచిత్ర కేసనమంత్రిపుత్ర సహజపాండిత్య పోతనామాత్య ప్రణీతం బైన శ్రీమహాభాగవత పురాణంబు నందు పరీక్షిత్తుతోడ శుకయోగి భాషించుటయు, భాగవతపురాణ వైభవంబును, ఖట్వాంగు మోక్షప్రకారంబును, ధారఁణాయోగ విషయం బయిన మహావిష్ణుని శ్రీపాదాద్యవయవంబుల సర్వలోకంబులు నున్న తెఱంగును, సత్పురుష వృత్తియు, మోక్షవ్యతిరిక్త సర్వకామ్యఫలప్రదదేవత భజన ప్రకారంబును, మోక్షప్రదుండు శ్రీహరి యనుటయు, హరిభజనవిరహితులైన జనులకు హేయతాపాదనంబును, రాజప్రశ్నంబును, శుకయోగి శ్రీహరి స్తోత్రంబు సేయుటయు, వాసుదేవ ప్రసాదంబునం జతుర్ముఖుండు బ్రహ్మాధిపత్యంబు వడయుటయు, శ్రీహరి వలన బ్రహ్మరుద్రాదిలోక ప్రపంచంబు వుట్టుటయు, శ్రీమన్నారాయణ దివ్యలీలావతార పరంపరా వైభవ వృత్తాంతసూచనంబును, భాగవత వైభవంబునుఁ, బరీక్షిత్తు శుకయోగి నడిగిన ప్రపంచాది ప్రశ్నంబులును, నందు శ్రీహరి ప్రధానకర్తయని తద్వృత్తాంతంబు సెప్పు టయు, భగవద్భక్తి వైభవంబును, బ్రహ్మ తపశ్చరణంబునకుం బ్రసన్నుండై హరి వైకుంఠనగరంబుతోడఁ బ్రసన్నుండయిన స్తోత్రంబు సేసి తత్ప్రసాదంబునం దన్మహిమంబు వినుటయు, వాసుదేవుం డానతిచ్చిన ప్రకారంబున బ్రహ్మ నారదునికి భాగవతపురాణ ప్రధాన దశలక్షణంబు లుపన్యసించుటయు, నారాయణ వైభవంబును, జీవాది తత్త్వసృష్టియు, శ్రీహరి నిత్యవిభూత్యాది వర్ణనంబునుఁ, గల్పప్రకారాది సూచనంబును, శౌనకుండు విదుర మైత్రేయ సంవాదంబు సెప్పు మని సూతు నడుగుటయు, నను కథలు గల ద్వితీయస్కంధము సంపూర్ణము.

టీకా:

ఇది = ఇది; శ్రీ = శ్రీ; పరమేశ్వర = ఉత్కృష్టమైన ఈశ్వరుడు – శివుని; కరుణా = దయ వలన; కలిత = పుట్టిన వాడును; కవితా = కవిత్వ రచనములో; విచిత్ర = విశేషమైన చిత్రములు కలవాడును; కేసనమంత్రి = కేసన మంత్రికి; పుత్ర = పుత్రుడును; సహజ = స్వాభావికముగా అబ్బిన; పాండిత్య = పాండిత్యము కలవాడును; పోతనామాత్య = పోతనామాత్యునిచే; ప్రణీతంబు = చక్కగా రచింపబడినది; ఐన = అయినట్టి; శ్రీ = శుభకరమైన; మహా = గొప్ప; భాగవత = భాగవతము అను; పురాణంబు = పురాణము; అందున్ = లో; పరీక్షిత్తు = పరీక్షిన్మహారాజు; తోడన్ = తో; శుక = శుకుడు అను; యోగి = యోగి; భాషించుటయున్ = మాట్లాడుట; భాగవత = భాగవతము అను; పురాణ = పురాణము యొక్క; వైభవంబునున్ = వైభవమును; ఖట్వాంగు = ఖట్వాంగుడు; మోక్ష = మోక్షము పొందిన; ప్రకారంబును = విధానమును; ధారఁణాయోగ = ధారఁణాయోగమునకు; విషయం = సంబంధించినది; అయిన = అయిన; మహా = గొప్ప; విష్ణుని = విష్ణుమూర్తి యొక్క; శ్రీ = శ్రీకరమైన; పాద = పాదములు; ఆది = మొదలైన; అవయవంబులన్ = అవయవములలో; సర్వ = సమస్తమైన; లోకంబులున్ = లోకంబులు; ఉన్నన్ = ఉన్నట్టి; తెఱంగునున్ = విధమును; సత్పురుష = సత్పరుషుల; వృత్తియున్ = నడవడికలు; మోక్ష = మోక్షము పొందుటకు; వ్యతిరిక్త = వీలుకానివియు; సర్వ = సర్వమైన; కామ్య = కోరిన; ఫల = ఫలితములను; ప్రద = ఇచ్చు; దేవత = దేవతల; భజన = సేవించు; ప్రకారంబునున్ = విధములును; మోక్ష = మోక్షమును; ప్రదుండు = ఇచ్చువాడు; శ్రీహరి = విష్ణువే; అనుటయు = అనుటయును; హరి = విష్ణుని; భజన = సేవ; విరహితులు = లేనివారు; ఐనన్ = అయిన; జనులన్ = ప్రజల; కున్ = కు; హేయతాదనంబునున్ = హేయత్వమును; ఆదనంబును = పొందుటయు; రాజ = (పరీక్షిన్మహా) రాజు యొక్క; ప్రశ్నంబునున్ = ప్రశ్నించుటయును; శుక = శుకుడు అను; యోగి = యోగి; శ్రీహరి = విష్ణువు యొక్క; స్తోత్రంబున్ = స్తోత్రము; చేయుటయున్ = చేయుటయును; వాసుదేవ = వాసుదేవుని; ప్రసాదంబునన్ = అనుగ్రహము వలన; చతుర్ముఖుండున్ = చతుర్మఖ బ్రహ్మ; బ్రహ్మ = బ్రహ్మగ; అధిపత్యంబున్ = అధికారమును; పడయుటయున్ = పొందుటయు; శ్రీహరి = విష్ణువు; వలనన్ = వలన; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; రుద్ర = శివుడు; ఆది = మొదలైన; లోక = లౌకిక; ప్రపంచంబున్ = ప్రపంచములు; పుట్టుటయున్ = పుట్టుటయును; శ్రీమన్నారాయణ = విష్ణుని; దివ్య = దివ్యమైన; లీల = లీలగా యెత్తిన; అవతార = అవతారముల; పరంపరా = పరంపరల; వైభవ = వైభవముల యొక్క; వృత్తాంత = వృత్తాంతముల; సూచనంబునున్ = చెప్పబడుటయును; భాగవత = భాగవతము యొక్క; వైభవంబునున్ = వైభవములును; పరీక్షిత్తు = పరీక్షిన్మహారాజు; శుక = శుకుడు అను; యోగిన్ = యోగిని; అడిగినన్ = అడిగినట్టి; ప్రపంచ = ప్రపంచము గురించినవి; ఆది = మొదలైన; ప్రశ్నంబులునున్ = ప్రశ్నలును; అందున్ = అందులో; శ్రీహరి = విష్ణుమూర్తి; ప్రధాన = ప్రధానమైన; కర్త = కారణభూతము; అని = అని; తత్ = ఆ; వృత్తాంతంబున్ = వృత్తాంతములు; చెప్పుటయున్ = చెప్పుటయును; భగవత్ = భగవంతుని అందలి; భక్తిన్ = భక్తి యొక్క; వైభవంబునున్ = వైభవమును; బ్రహ్మ = బ్రహ్మ యొక్క; తపస్ = తపస్సు; చరణంబున్ = చేయుట; కున్ = వలన; ప్రసన్నుండు = సంతోషించినవాడు; ఐ = అయి; హరి = విష్ణువు; వైకుంఠ = వైకుంఠ; నగరము = పురము; తోడనో = తో; ప్రసన్నుండు = ప్రత్యక్షము; అయిన = అవ్వగా; స్తోత్రంబున్ = స్తోత్రములు; చేసి = చేసి; తత్ = అతని; ప్రసాదంబునన్ = అనుగ్రహము చేత; తత్ = అతని; మహిమంబున్ = మహిమలను; వినుటయునున్ = వినుటయును; వాసుదేవుండు = విష్ణువు; ఆనతి = ఆఙ్ఞ; ఇచ్చిన = ఇచ్చిన; ప్రకారంబున్ = ప్రకారము; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; నారదున్ = నారదుని; కిన్ = కి; భాగవత = భాగవత; పురాణ = పురాణము యొక్క; ప్రధాన = ముఖ్యమైన; దశ = పది; లక్షణంబులున్ = లక్షణాలను; ఉపన్యసించుటయున్ = వివరించుటయును; నారాయణ = నారాయణుని; వైభవంబునున్ = వైభవమును; జీవ = జీవులు; ఆది = మొదలైన వాని; తత్త్వ = తత్వముల; సృష్టియున్ = సృష్టియును; శ్రీహరి = విష్ణువు యొక్క; నిత్య = నిత్యమైన; విభూతిన్ = వైభవములు; ఆది = మొదలైన; వర్ణనంబునున్ = వర్ణనలును; కల్ప = కల్పముల; ప్రకార = వివరములు; ఆది = మొదలైన వాని; సూచనంబును = చెప్పుటయును; శౌనకుండు = శౌనకుడు; విదుర = విదురుడు; మైత్రేయ = మైత్రేయుల; సంవాదంబున్ = చర్చలను; చెప్పుము = చెప్పుము; అని = అని; సూతున్ = సూతుని; అడగుటయున్ = అడగుటయును; అను = అను; కథలు = కథలు; కల్ప = కలిగిన; ద్వితీయ = రెండవ; స్కంధము = స్కంధము; సంపూర్ణము = పూర్తి అయినది.

భావము:

ఇది పరమేశ్వరుని దయ వలన పొందిన కవితా వైచిత్రి కలిగిన వాడూ; కేసన మంత్రి కుమారుడూ; సహజ సిద్ధంగా అబ్బిన పాండిత్యము కలవాడూ అయిన పోతనామాత్యుని చే చక్కగా రచించబడినది అయినట్టి శుభకరమైన, గొప్ప భాగవతము అను పురాణము నందలి పరీక్షిన్మహారాజు శుక యోగి సంభాషించుట; భాగవత పురాణం వైభవము; ఖట్వాంగుడు మోక్షము పొందుట; ధారణా యోగమునకు సంబంధించినది అయి విష్ణుమూర్తి పాదాది అవయవాలలో సమస్త లోకాలు ఉన్న విధము; సత్పురుషుల నడవడికలు; మోక్ష వ్యతిరిక్తాలు అయి కోరిన ఫలాలను ఇచ్చు ఇతర దేవతల భజన విశేషాలు; మోక్షం ఇచ్చువాడు విష్ణువే అని చెప్పుట; విష్ణు భజన లేని వారు హేయత్వము పొందుట; పరీక్షిన్మహారాజు ప్రశ్నించుట; శుక యోగి శ్రీహరి స్తోత్రము చేయుట; వాసుదేవుని అనుగ్రహం వలన చతుర్మఖ బ్రహ్మ; బ్రహ్మ అధికారము పొందుట; శ్రీ మహా విష్ణువు వలన బ్రహ్మ రుద్రుడు మొదలైన లౌకిక ప్రపంచాలు పుట్టుట; శ్రీమన్నారాయణుడు ఎత్తిన అవతారముల వైభవములు; భాగవత వైభవము; పరీక్షిన్మహారాజు శుక యోగిని అడిగినట్టి ప్రపంచం మొదలైన ప్రశ్నలు; వాటిలో విష్ణుమూర్తి ప్రధాన కర్త అని చూపించుట; భగవద్భక్తి వైభవం; బ్రహ్మ దేవుడు తపస్సుకు ప్రసన్నుడు అయి విష్ణువు వైకుంఠంతో సహా ప్రత్యక్షం కాగా స్తోత్రం చేసి అతని అనుగ్రహం చేత అతని మహిమలను వినుట; విష్ణువు ఆజ్ఞ ప్రకారం బ్రహ్మదేవుడు నారదుని కి భాగవత పురాణ దశ లక్షణాలను వివరించుట; నారాయణుని వైభవం; జీవ తత్వాల సృష్టి; శ్రీ మహా విష్ణువు నిత్య విభూతి వర్ణనలు; కల్పముల వివరములు మొదలైన వానిని చెప్పుట; శౌనకుడు, విదుర మైత్రేయ సంవాదం చెప్పమని సూతుని అడుగుట; అను కథలు కలిగిన ద్వితీయ స్కంధము సంపూర్ణము అయినది.


ఓం నమో భగవతే వాసుదేవాయ!!
ఓం! ఓం! ఓం!
ఓం! శాంతిః! శాంతిః! శాంతిః!
సర్వే జనా స్సుఖినో భవతు!!