పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : భాగవత వైభవంబు

 •  
 •  
 •  

2-201-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రి మాయా బల మే నెఱుంగ నఁట శక్యంబే సనందాది స
త్పురుషవ్రాతము కైన, బుద్ధి నితరంబున్ మాని సేవాధిక
స్ఫుణం దచ్ఛరితానురాగగుణవిస్ఫూర్తిన్ సహస్రాస్య సుం
తం బొల్పగు శేషుఁడుం దెలియఁ డన్నం జెప్ప నే లొండొరున్.

టీకా:

హరి = విష్ణువుని; మాయా = మాయల యొక్క; బలము = శక్తిని; ఏన్ = నేనే; ఎఱుంగన్ = తెలియను; అఁటన్ = అంటే; శక్యంబే = సాధ్యమా ఏమిటి; సనంద = సనందుడు; ఆది = మొదలగు; సత్పురుష = గొప్పవారి; వ్రాతమున్ = సమూహమున; కైనన్ = కైనా; బుద్ధి = మనసులో; ఇతరంబున్ = మిగిలినవన్నీ; మాని = వదిలి; సేవ = సేవించుటందే; అధిక = మిక్కిలి; స్ఫురణన్ = స్ఫురణతో; తత్ = అతని; చరిత = ప్రవర్తన లందు; అనురాగ = ప్రేమ పూర్వక; గుణ = గుణముల; విస్ఫూర్తిన్ = విశిష్టమైన స్ఫూర్తితో; సహస్ర = వేయి; ఆస్య = ముఖముల; సుందరతన్ = సౌందర్యముతో; పొల్పగు = ఒప్పి ఉండు; శేషుండున్ = ఆదిశేషుడైన; తెలియఁడు = తెలియలేడు; అన్నన్ = అంటే; చెప్పన్ = చెప్పుట; ఏలన్ = ఎందులకు; ఒండొరున్ = ఇంకొకరిని.

భావము:

నేనే శ్రీహరి మాయాశక్తిని తెలుసుకోలేకున్నాను. ఇక తెలుసుకోవడానికి సనందుడు, సనకుడు, సనత్కుమారుడు మొదలైన సజ్జన సంఘాలకు మాత్రం వీలవుతుందా. ఆదిశేషుడు ఇతరమైన ఆలోచనలన్నీ వదలి పెట్టి బుద్ధిని సదా భగవత్సేవకే అంకితం చేసాడు. వేయి నోళ్లతో ఆ పరమేశ్వరుని చరిత్రను అనురక్తుడై కీర్తిస్తు ఉంటాడు. అట్టి శేషుడు గూడ ఆయన మాయామహిమ ఎలాంటిదో తెలుసుకోలేకున్నాడు. ఇక ఇతరుల సంగతి చెప్పాలా.

2-202-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రముమాని తన్ను మది నెంతయు నమ్మి భజించువారి నా
శ్రిజన సేవితాంఘ్రి సరసీరుహుఁడైన సరోజనాభుఁ డం
చిదయతోడ నిష్కపటచిత్తమునం గరుణించు; నట్టివా
తుల దురంతమై తనరు వ్విభు మాయఁ దరింతు రెప్పుడున్.

టీకా:

ఇతరము = మిగిలినవి అన్నిటిని; మాని = వదలి; తన్నున్ = తనను; మదిన్ = మనస్ఫూర్తిగా; ఎంతయున్ = ఎంతో, చాలా; నమ్మి = నమ్మి; భజించు = సేవించు; వారిన్ = వారిని; ఆశ్రిత = ఆశ్రయించిన; జన = జనులచే; సేవిత = సేవింపబడు; అంఘ్రి = పాదములు అను; సరసీరుహుఁడు = పద్మములు కలవాడు; ఐన = అయినట్టి; సరోజ = పద్మ; నాభుఁడు = నాభుడు (విష్ణువు); అంచిత = పూజనీయమైన; దయ = కరుణ; తోడన్ = తో; నిష్కపట = కపటములేని; చిత్తమునున్ = మనస్సును; కరుణించున్ = దయచేయును; అట్టి = అటువంటి; వారలు = వారు; అతుల = సాటిలేని; దురంతము = తెలియరానిది {దురంతము - అంతమును చూచుటకు కష్టమైనది}; ఐ = అయి; తనరున్ = విస్తరించునట్టి; ఆ = ఆ; విభుని = ప్రభువు; మాయఁన్ = మాయను; తరింతురు = దాటుదురు; ఎప్పుడున్ = ఎల్లప్పుడును.

భావము:

ఎవరు ఇతర చింతలు మాని సదా శ్రీమన్నారాయణుణ్ణే దృఢంగా నమ్మి సేవిస్తారో, వాళ్లను, ఆశ్రితులు అర్చించే పాదపద్మాలు కలవాడైన పద్మనాభుడు మిక్కిలి దయగలిగి, కల్లాకపటంలేని మనస్సుతో అనుగ్రహిస్తాడు. అలా భగవంతుని సేవించి ఆయన కృపకు పాత్రులైనవాళ్లు మాత్రమే సాటిలేనిది, దాటరానిది అయిన ఆ భగవంతుని మాయను నిరంతరం తరింపగలుగుతారు.

2-203-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మఱియును సంసారమగ్నులయి దివసంబులు ద్రోఁచియు నంతంబున శునక సృగాల భక్షణంబులైన కాయంబులందు మమత్వంబు సేయక భగవదర్పణంబు సేసిన పుణ్యాత్ములుం గొందఱు గల రెఱింగింతు; వినుము; నేను నీ బ్రహ్మత్వంబునం జెందు రాజసంబు విడిచి యమ్మహాత్ముని పాదారవిందంబుల భక్తినిష్ఠుండ నయి శరణాగతత్వంబున భజియించు నప్పుడు దెలియుదు రాజసగుణుండనై యున్న వేళం దెలియంజాలఁ; గావున శాస్త్రంబులు ప్రపంచింపక కేవల భక్తిజ్ఞానయోగంబున సేవింతు; మఱియు సనకాదులగు మీరును, భగవంతుండైన రుద్రుండును, దైత్యపతియైన ప్రహ్లాదుండును, స్వాయంభువమనువును, నతని పత్ని యగు శతరూపయుఁ, దత్పుత్రులగు ప్రియవ్రతోత్తానపాదులునుం, దత్పుత్రికలగు దేవహూత్యాదులునుం, బ్రాచీనబర్హియు, ఋభువును, వేనజనకుం డగు నంగుండును, ధ్రువుండును గడవంజాలుదురు వెండియు.

టీకా:

మఱియును = ఇంక; సంసార = సంసారములో; మగ్నులు = మునిగినవారు; అయి = అయి; దివసంబులున్ = రోజులు; తోఁచియున్ = గడపేసి; అంతంబునన్ = చివరకి (చనిపోయాక); శునక = కుక్కలు; సృగాల = నక్కలుకి; భక్షణంబున్ = తినదగినవి; ఐన = అయిన; కాయంబులున్ = శరీరములు; అందున్ = వలని; మమత్వంబున్ = నాది అను భావించుట {మమత్వము - మమకారము, ఇది నాది అను అభాస భావము యొక్క బంధనములు}; సేయక = చేయకుండా; భగవత్ = భగవంతునకు; అర్పణంబున్ = సమర్పించుకొనుట; చేసిన = చేసినట్టి; పుణ్యాత్ములున్ = పుణ్యాత్ములును; కొందరు = కొంతమంది; కలరు = ఉన్నారు; ఎఱింగింతున్ = చెప్తాను; వినుము = వినుము; నేనున్ = నేను (బ్రహ్మదేవుడు); ఈ = ఈ; బ్రహ్మత్వంబునన్ = సృష్ట్యాధికారము వలన; చెందు = కలుగు; రాజసంబున్ = రజోగుణమును; విడిచి = వదలి; ఆ = ఆ; మహాత్మునిన్ = గొప్పవాని; పాద = పాదములు అను; అరవిందంబులన్ = పద్మములను; భక్తిన్ = భక్తి; నిష్ఠుండన్ = నిష్ఠ కలవాడను; అయి = అయి; శరణాగత = శరణాగతము యొక్క; తత్వంబున = భావముతో; భజియించున్ = సేవించు; అప్పుడు = సమయమున; తెలియుదున్ = తెలిసికొనగలను; రాజస = రజో; గుణుండన్ = గుణములు కలవాడను; ఐ = అయి; ఉన్న = ఉన్నట్టి; వేళన్ = సమయములో; తెలియన్ = తెలిసికొనుటకు; చాలఁన్ = సరిపోను; కావునన్ = అందుచేత; శాస్త్రంబులున్ = శాస్త్రములను; ప్రపంచింపక = విస్తరింపచేసుకొనక; కేవల = కేవలము; భక్తి = భక్తి; ఙ్ఞాన = ఙ్ఞాన; యోగంబునన్ = యోగము వలన; సేవింతున్ = సేవింతును; మఱియున్ = ఇంక; సనక = సనకసనందనులు; ఆదులున్ = మొదలగువారు; అగు = అయిన; మీరునున్ = మీరును; భగవంతుండు = మహిమాన్వితుడు; ఐన = అయిన; రుద్రుండును = శివుడును; దైత్య = రాక్షసుల; పతి = ప్రభువు; ఐన = అయిన; ప్రహ్లాదుండునున్ = ప్రహ్లాదుడును; స్వాయంభువ = స్వాయంభువ అను; మనువునున్ = మనువును; అతని = అతని; పత్ని = భార్య; అగు = అయిన; శతరూపయున్ = శతరూప యును; తత్ = వారి; పుత్రులు = కుమారులు; అగు = అయిన; ప్రియవ్రత = ప్రియవ్రతుడు; ఉత్తనపాదులునున్ = ఉత్తానపాదుడును; తత్ = వారి; పుత్రికలు = కుమాఱ్ఱెలు; అగు = అయిన; దేవహూతి = దేవహూతి; ఆదులునుం = మున్నగువారు; తత్ దత్పుత్రికలగు దేవహూత్యాదులు, ప్రాచీనబర్హియున్ = ప్రాచీనబర్హియును; ఋభువునున్ = ఋభువును; వేన = వేనుని; జనకుండు = తండ్రి; అగు = అయిన; అంగుండునున్ = అంగుడును; ధ్రువుండునున్ = ధ్రువుడును; కడవన్ = దాట; చాలుదురున్ = కలరు; వెండియున్ = ఇంక.

భావము:

ఇంతేకాదు. ఇంక కొందరు పుణ్యాత్ము లున్నారు. వాళ్ల సంగతి వివరిస్తాను విను. వాళ్లు సంసారంలో మునగి తేలుతూ దినాలు గడిపిన చివరకి కుక్కలు, నక్కలు పీక్కొని తినే ఈ శరీరాలపై మమకారం పెట్టుకోలేదు. తమ దేహాలను పూర్తిగా భగవంతునికే అర్పించారు. నేను బ్రహ్మదేవుడిని గదా అన్న గర్వంతో ఒక్కొక్కసారి రజోగుణం నన్ను ఆక్రమిస్తుంది. ఆ సందర్భంలో నే నా మహాత్ముని తత్త్వం ఇలాంటి దని తెలుసుకోలేను. రజోగుణం వదలి భక్తియుక్తుడనై ఆయన పాదపద్మాలను శరణాగతి భావంతో సేవించేటప్పుడు మాత్రమే ఆ భగవన్మహిమ తెలుసుకోగలుగుతున్నాను. అందుచేతనే శాస్త్రాలపై ఆధారపడక భక్తి జ్ఞానయోగాలతో మాత్రమే నేను ఆ పరమాత్మను సేవిస్తాను. నేను కాదు, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు, నీవు మొదలైన వాళ్లు, భగవంతుడైన శివుడు, దైత్యులను పాలించే ప్రహ్లాదుడు, స్వాయంభువుడనే మనువు, అతని భార్య శతరూప అనే సతీమణి, వాళ్ల కుమారులైన ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, పుత్రికలైన దేవహూతి మొదలైనవారు, ప్రాచీనబర్హి అనే రాజేంద్రుడు, ఋభువు అనే మహర్షి, వేనుని తండ్రి అయిన అంగుడు, ఉత్తానపాదుని కుమారుడగు ధ్రువుడు భగవన్మాయను తరింపగల్గినవారే. ఇంకా విను.

2-204-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

గాధి, గయాదు; లిక్ష్వాకు, దిలీప, మాం-
ధాతలు; భీష్మ, యయాతి, సగర,
ఘు, ముచుకుందైళ, రంతిదేవోద్ధవ,-
సాస్వతోదంక, భూరిషేణ,
శ్రుదేవ, మారుతి, ధన్వ, పిప్పల,-
లి, విభీషణ, శిబి, పార్థ, విదురు;
లంబరీష, పరాశరాలర్క, దేవల,-
సౌభరి, మిథిలేశ్వరాభిమన్యు,

2-204.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

లార్ష్ణిషేణాదులైన మహాత్ము లెలమిఁ
విలి యద్దేవు భక్తిఁ జిత్తముల నిల్పి
త్పరాయణు లౌట దుర్దాంతమైన
విష్ణుమాయఁ దరింతురు విమలమతులు.

టీకా:

గాధి = గాధి {గాధి - విశ్వామిత్రుని వంశమునకు మూల పురుషుడు}; గయ = గయాసురుడు {గయాసురుడు - గయాక్షేత్రము ఇతని శరీరమున నిర్మింపబడి యందు పితృదేవతలు తరించుచున్నారు}; ఆదులు = మొదలగువారు; ఇక్ష్వాకు = ఇక్ష్వాకుడు {ఇక్ష్వాకుడు - సూర్య వంశపు మహారాజు, శ్రీరాముని పూర్వీకుడు}; దిలీప = దిలీపుడు {దిలీపుడు - సూర్య వంశపు మహారాజు, శ్రీరాముని పూర్వీకుడు, ఇతని మునిమనవడు దశరథుడు}; మాంధాతలున్ = మాంధాతలును {మాంధాత - సూర్యవంశపు చక్రవర్తి}; భీష్మ = భీష్ముడు {భీష్ముడు - కురువృద్దుడు - భీష్మ ప్రతిజ్ఞ చేసిన కురువంశ మహాపురుషుడు}; యయాతి = యయాతి {యయాతి - చంద్రవంశపు రాజు, ఇతని కొడుకు యదువు. అతని వంశము వారు యాదవులు}; సగర = సగరుడు {సగరుడు - సూర్యవంశపు మహారాజు, ఇతని పుత్రులు తవ్వగ నేర్పడినదే సాగరము}; రఘు = రఘువు {రఘువు - సూర్య వంశపు మహారాజు దిలీపుని పుత్రుడు}; ముచుకుంద = ముచుకుందుడు {ముచుకుందుడు - మునీశ్వరుడు, కాలయవనుని మరణ కారకుడు}; ఐళ = ఐళుడు {ఐళుడు - ఇల యొక్క పుత్తుడు}; రంతిదేవ = రంతిదేవుడు {రంతిదేవుడు - మహాదానశీలి, ఇతని దానశీల మహత్యమే వలన ముంగిసకు బంగారు శరీరము వచ్చినది}; ఉద్ధవుడు = ఉద్ధవుడు {ఉద్ధవుడు - కృష్ణునికి తండ్రి వరుసైన వాడు}; సారస్వత = సారస్వతుడు; ఉదంక = ఉదంకుడు {ఉదంకుడు - పరమ భాగవతుడు, పైల మహర్షి శిష్యుడు, ముందు చాలాకాలము తక్షకునిపై పగబట్టి జనమేజయునిచే సర్పయాగము చేయించెను}; భూరిషేణుడు = భూరిషేణుడు; శ్రుతదేవ = శ్రుతదేవుడు; మారుతి = ఆంజనేయుడు {ఆంజనేయుడు - పరమ భాగవతుడు, భగవంతుని సేవయే కాని తనకు కావలసిన దేమియును లేని మొదటి భక్తుడు}; శతధన్వ = శతధన్వుడు; పిప్పల = పిప్పలుడు {పిప్పలుడు - పిప్పలాచార్యుడు తత్వశాస్త్రవేత్త}; బలి = బలి చక్రవర్తి {బలి చక్రవర్తి - వామనునకు దానమిచ్చిన మహాదాలశీలి}; విభీషణ = విభీషణుడు {విభీషణుడు - రావణాసురుని తమ్ముడు, రామునకు శరణాగతి యైనవాడు}; శిబి = శిబి చక్రవర్తి {శిబి చక్రవర్తి - కపోతరూపుని కిచ్చిన శరణము కొరకు తన కండలు కోసి ఇచ్చినవాడు}; పార్థ = పార్థుడు {పార్థుడు - పృథ కొడుకు, అర్జునుడు}; విదురులు = విదురుడు {విదురుడు - యమధర్మ రాజు అవతారము, కురు పాండవుల పినతండ్రి}; అంబరీష = అంబరీషుడు {అంబరీషుడు - అథిధి సత్కారమున శ్రేష్ఠుడు, సాధు వర్తనమున దూర్వాసుని గెలిచినవాడు}; పరాశర = పరాశరుడు {పరాశరుడు - వ్యాసుని తండ్రి}; అలర్క = అలర్కుడు {అలర్కుడు - దత్తాత్రేయుని శిష్యుడు, యోగవిద్య ఉపదేశము పొందినవాడు}; దేవల = దేవలుడు; సౌభరి = సౌభరి; మిథిలేశ్వర = జనకుడు {మిథిలేశ్వరుడు - జనక మహారాజు, సీతాదేవి తండ్రి}; అభిమన్యు = అభిమన్యువు {అభిమన్యువు - ఇతడు అర్జునుని పుత్రుడు కాదు, ఇంకా పూర్వపు రాజు}; ఆర్ష్ణిషేణ = ఆర్ష్ణిషేణుడు; ఆదులు = మొదలగువారు; ఐన = అయిన;
మహాత్ములు = గొప్పవారు; ఎలమిఁన్ = వికాసముతో; తవిలి = మనసున లగ్నముచేసికొని; ఆ = ఆ; దేవుని = భగవంతుని; భక్తిఁన్ = భక్తితో; చిత్తములన్ = మనసులలో; నిల్పి = నిలుపుకొని; తత్ = దాని యందే; పరాయణులు = లగ్నమైనవారు; ఔటన్ = అగుటచేత; దుర్దాంతము = దమించుటుకు రానిది; ఐన = అయిన; విష్ణు = విష్ణువు యొక్క; మాయఁన్ = మాయను; తరింతురు = తరించెదరు; విమల = నిర్మలమైన; మతులు = బుద్ధి కలవారు.

భావము:

గాధి, గయుడు మొదలైనవారు, ఇక్ష్యాకుడు, దిలీపుడు, మాంధాత, భీష్ముడు, యయాతి, సగర చక్రవర్తి, రఘు మహారాజు, ముచుకుందుడు, ఐలుడు, రంతిదేవుడు, ఉద్ధవుడు, సారస్వతుడు, ఉదంకుడు, భూరిషేణుడు, శ్రుతదేవుడు, హనుమంతుడు, శతధన్వుడు, పిప్పలుడు, బలిచక్రవర్తి, విభీషణుడు, శిబిచక్రవర్తి, అర్జునుడు, విదురుడు, అంబరీషుడు, పరాశరమహర్షి, అలర్క మహారాజు, దేవలుడు, సౌభరి, జనకమహారాజా, అభిమన్యుడు, ఆర్ష్ణిషేణుడు మొదలగు నిర్మలమతులైన మహాత్ములందరూ అనురక్తులై భక్తితో ఆ దేవదేవుని తమ మనస్సులో నిల్పారు. ఆయనే గతి అని సేవించారు. అందువల్లనే దాట వీలుగాని విష్ణుమాయను దాటగలవారయ్యారు.

2-205-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఘా! వీరల నెన్ననేమిటికిఁ; దిర్యగ్జంతుసంతాన ప
క్షి నిశాటాటవికాఘ జీవనివహస్త్రీ శూద్ర హూణాదులై
ను నారాయణభక్తి యోగమహితానందాత్ములై రేని వా
యంబుం దరియింతు రవ్విభుని మాయావైభవాంభోనిధిన్.

టీకా:

అనఘా = పాపములు లేనివాడా; వీరలన్ = వీళ్ళనే; ఎన్నన్ = ఎంచుట; ఏమిటికిన్ = ఎందుకు; తిర్యక్ = పశువులు; జంతు = జంతువుల; సంతాన = సంతానములు; పక్షి = పక్షులు; నిశాట = రాత్రించరులు; ఆటవిక = ఆటవికులు; అఘ = పాప; జీవ = జీవుల; నివహ = సమూహములు; స్త్రీ = స్త్రీలు; శూద్ర = శూద్రులు; హూణ = హూణులు; ఆదులు = మొదలగువారు; ఐననున్ = అయినను; నారాయణ = భగవంతుని {నారాయణుడు - నారములను వసించువాడు}; భక్తియోగ = భక్తియోగము యొక్క; మహిత = గొప్ప; ఆనంద = ఆనందము కల; ఆత్ములు = ఆత్మలు కలవారు; ఐరేని = అయినట్లయతే; వారు = వారు; అనయంబున్ = తప్పక, అవశ్యము; తరియింతురు = దాటుదురు; ఆ = ఆ; విభుని = ప్రభువు; మాయా = మాయ యొక్క; వైభవ = వైభవము అను; అంభోనిధిన్ = సముద్రమును.

భావము:

పుణ్యాత్ముడ! నారద! సహజంగా పుణ్యాత్ములయిన వీళ్లను గూర్చి చెప్పవలసిన పనిలేదు. పశువులైన, పక్షులైన, రాక్షసులైన, అడవిలో జీవించేవారైన, పాపజీవనులైన, స్త్రీలైన, శూద్రులైన, హూణులు మొదలైన వారైన లేదా మరి ఎవరైనా సరే ఆ శ్రీమన్నారాయణుని మీది భక్తి యోగంతో అఖండమైన ఆత్మానందం పొందినవారైతే చాలు. అవశ్యం ఆ దేవదేవుని మాయావైభవమనే మహాసముద్రాన్ని సులభంగా తరిస్తారు.

2-206-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కావున.

టీకా:

కావున = అందువలన.

భావము:

అందువల్ల

2-207-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

శ్వత్ప్రశాంతు నభయుని
విశ్వాత్ముఁ బ్రబోధమాత్రు విభు సంశుద్ధున్
శాశ్వతు సము సదసత్పరు
నీశ్వరుఁ జిత్తమున నిలుపు మెపుడు మునీంద్రా!

టీకా:

శశ్వత్ ప్రశాంతున్ = భగవంతుని {శశ్వత్ప్రశాంతుడు - శాశ్వతమైన ప్రశాంతి కలవాడు, భగవంతుడు}; అభయునిన్ = భగవంతుని {అభయుడు - భయము లేని వాడు, భగవంతుడు}; విశ్వాత్ము = భగవంతుని {విశ్వాత్ముడు - విశ్వమునకు ఆత్మ ఐనవాడు, పరమాత్మ, విశ్వమే శరీరముగా కలవాడు, భగవంతుడు}; ప్రబోధమాత్రున్ = భగవంతుని {ప్రబోధమాత్రుడు - జ్ఞానముచే మాత్రమే తెలియబడువాడు, భగవంతుడు}; విభున్ = భగవంతుని {విభుడు - ప్రభువు, భగవంతుడు}; సంశుద్ధున్ = భగవంతుని {సంశుద్ధుడు - పరిశుద్ధమైన వాడు}; శాశ్వతున్ = భగవంతుని {శాశ్వతుడు - శాశ్వతముగ ఉండు వాడు, భగవంతుడు}; సమున్ = భగవంతుని {సముడు - సమస్తమున సమముగ చూచువాడు}; సదసత్పూరుషున్ = భగవంతుని {సదసత్పూరుషుడు - సత్ లోను అసత్ లోనూ నివసించు వాడు, భగవంతుడు}; ఈశ్వరున్ = భగవంతుని {ఈశ్వరుడు - ప్రభువు, భగవంతుడు}; చిత్తమున = మనసులో; నిలుపుము = నిలుపుకొనుము; ఎపుడున్ = ఎల్లప్పుడును; ముని = మునులలో; ఇంద్ర = శ్రేష్ఠుడా (నారదుడా).

భావము:

నారదమునీశ్వర! ఎల్లవేళల మిక్కిలి శాంతుడై వుండేవాడు, భయరహితుడు, విశ్వమయుడు, కేవల జ్ఞానస్వరూపుడు, సర్వేశ్వరుడు, శుద్ధాత్ముడు, శాశ్వతుడు, సముడు, సత్తు అసత్తులకు అతీతుడు అయినట్టి పరమేశ్వరుణ్ణి సదా నీ హృదయంలో ప్రతిష్ఠించుకో.

2-208-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అట్లయిన నప్పుణ్యాత్ముల ననవద్యశీలుర నవిద్య లజ్జావనత వదనయై పొందంజాలక వైముఖ్యంబున దవ్వుదవ్వులం దలంగిపోవు మఱియును.

టీకా:

అట్లు = ఆ విధముగ; అయినన్ = చేసినచో; ఆ = అట్టి; పుణ్యాత్ములన్ = పుణ్యాత్ములను; అనవద్య = నింద్యము కాని; శీలురన్ = ప్రవర్తన కలవారిని; అవిద్య = అవిద్య, మాయ, అజ్ఞానము; లజ్జ = సిగ్గుతో; అవనత = వంచిన; వదన = ముఖము (తల) కలది; ఐ = అయి; పొందన్ = దరి; చాలక = చేరలేక; వైముఖ్యంబునన్ = విముఖము కలదై; దవ్వుదవ్వులన్ = దూరందూరంగా; తలంగిన్ = తొలగి; పోవున్ = పోవును; మఱియును = ఇంకను.

భావము:

ఎవరైతే పరమాత్ముని తమ చిత్తంలో ప్రతిష్ఠించుకొంటారో, అట్టి పుణ్యాత్ములు, సచ్చరిత్రులు అయిన మహనీయుల చెంతకు పోలేక అవిద్య సిగ్గుతో తల వంచుకొని పెడమొగమై దూరందూరంగా తొలగి పోతుంది. ఇంతేకాదు.

2-209-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రిఁ బరమాత్ము నచ్యుతు ననంతునిఁ జిత్తములం దలంచి సు
స్థిత విశోక సౌఖ్యములఁ జెందిన ధీనిధు లన్యకృత్యము
ల్మచియుఁ జేయనొల్లరు ;తలంచిన నట్టిదయౌ; సురేంద్రుఁడుం
రువడి నుయ్యి; ద్రవ్వునె పిపాసితుఁడై సలిలాభిలాషితన్?

టీకా:

హరిఁన్ = భగవంతుని {హరి - దుఃఖములను హరించు వాడు, విష్ణువు}; పరమాత్మున్ = భగవంతుని {పరమాత్ముడు - పరమమైన ఆత్మ కల వాడు, విష్ణువు}; అచ్యుతున్ = భగవంతుని {అచ్యుతుడు - చ్యుతము (పతనము) లేని వాడు, విష్ణువు}; అనంతునిఁన్ = భగవంతుని {అనంతుడు - అంతము లేనివాడు, విష్ణువు}; చిత్తములన్ = మనసులలో; తలంచిన్ = స్మరించుచు; సుస్థిరతన్ = చక్కటి నిశ్చలత్వము; విశోక = శోకములేని; సౌఖ్యములన్ = సుఖములను; చెందినన్ = పొందినట్టి; ధీనిధులు = బుద్ధిమంతులు {ధీనిధులు - బుద్ధికి గని వంటి వారు, బుద్ధిమంతులు}; అన్య = ఇతరమైన; కృత్యములు = కార్యములను; మఱచియుఁన్ = మరిచిపోయి కూడ; చేయన్ = చేయుటకు; ఒల్లరు = ఒప్పకోరు; తలంచినన్ = ఆలోచించి చూస్తే; అట్టిదయ = అలాంటిది; ఔ = అది; సురేంద్రుఁడున్ = దేవేంద్రుడు (వర్షాధిపతి) {సురేంద్రుడు - దేవేంద్రుడు, వర్షాధిపతి, అమృతము పానము చేయువాడు}; పరువడి = పనిగట్టుకొని, పరుగెట్టి; నుయ్యి = నూతిని; త్రవ్వునే = తవ్వుతాడా; పిపాసితుఁడు = దాహము వేసిన వాడు; ఐ = అయినాక; సలిల = మంచినీరు; అభిలాషితన్ = కావలెనని.

భావము:

పరమాత్ముడు, చ్యుతి లేనివాడు, అంతం లేనివాడు అయిన శ్రీమహావిష్ణుని మనస్సులో స్థిరంగా భావించిన వాళ్లు, శోకం లేని సుఖస్థితి పొందుతారు. అలాంటి బుద్ధిమంతులు భగవంతుని స్మరణ తప్ప ఇతర కార్యాలు ఏమరుపాటువ గూడ చేయరు. ఆలోచిస్తే అది అంతే వర్షం కురిపించే దేవేంద్రుడు అయినా దాహంవేసిన పిమ్మట నీళ్లకొరకై బావి త్రవ్వడానికి పరుగెడతాడా.

2-210-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ర్వఫలప్రదాతయును, ర్వశరణ్యుఁడు, సర్వశక్తుఁడున్,
ర్వజగత్ప్రసిద్ధుఁడును, ర్వగతుం డగు చక్రపాణి యీ
ర్వశరీరులున్ విగమసంగతిఁ జెంది విశీర్యమాణులై
ర్వినచో నభంబుగతి బ్రహ్మము దాఁ జెడకుండు నెప్పుడున్.

టీకా:

సర్వ = సమస్తమైన; ఫల = ఫలితములను; ప్రదాతయునున్ = చక్కగ ఇచ్చువాడును; సర్వ = అందరకును; శరణ్యుండునున్ = శరణము పొంద తగిన వాడు; సర్వ = సమస్తమైన; శక్తుఁడునున్ = శక్తులు ఉన్న వాడు; సర్వ = సమస్తమైన; జగత్ = లోకములందును; ప్రసిద్ధుడునున్ = ఖ్యాతికి ఎక్కినవాడు; సర్వ = సమస్తమందును; గతుండు = ఉండువాడు; అగు = అయిన; చక్రపాణి = విష్ణువు {చక్రపాణి - చక్రము చేతిన ధరించిన వాడు, విష్ణువు}; ఈ = ఈ; సర్వ = సమస్తమైన; శరీరులన్ = మానవులును {శరీరులు - శరీరము ధరించిన వారు, మానవులు}; విగమసంగతిన్ = నాశము చేరుటను (మరణము); చెంది = చెంది; విశీర్యమాణులు = నశించిన వారు, మరణించిన వారు; ఐ = అయి; పర్వినచోన్ = పోతున్నప్పటికిని; అభంబున్ = ఆకాశము; గతిన్ = వలె; బ్రహ్మము = హరి {బ్రహ్మమము - పరబ్రహ్మము, భగవంతుడు}; తాన్ = తను; చెడకుండున్ = చెడిపోక ఉండును; ఎప్పుడున్ = ఎల్లప్పుడున్.

భావము:

ఆ భగవంతుడు అందరికీ తగిన ఫలితాలు అన్ని ఇచ్చేవాడు. అందరికీ శరణు పొందదగినవాడు. అన్ని శక్తులు గలవాడు. అన్ని లోకాలలో ప్రసిద్ధి పొందినవాడు. అంతటా వ్యాపించినవాడు. సుదర్శన మనే చక్రం ధరించిన బ్రహ్మస్వరూపుడైన ఆ దేవుడు, తక్కిన ఈ సమస్త ప్రాణులు చిక్కి స్రుక్కి శిథిలమై అంతరించిపోయిన కల్పాంత కాలంలో గూడ ఆకాశంలాగ తానొక్కడు చెక్కుచెదరకుండా నిర్వికారుడై నిలిచి ఉంటాడు.

2-211-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కాణకార్యహేతు వగు కంజదళాక్షునికంటె నన్యు లె
వ్వారును లేరు; తండ్రి! భగవంతు ననంతుని విశ్వభావనో
దారుని సద్గుణావళు లుదాత్తమతిం గొనియాడకుండినం
జేవు చిత్తముల్ ప్రకృతిఁ జెందని నిర్గుణమైన బ్రహ్మమున్.

టీకా:

కారణ = కారణమునకు, చేసేది; కార్య = కార్యమునకు, చేసినది; హేతువు = కారణభూతము, చేయించేది; అగు = అయిన; కంజదళాక్షునిన్ = విష్ణువుని {కంజదళాక్షుడు - కం (నీట) జ (పుట్టిన) (పద్మము) వంటి అక్షమున్ (కన్నులు) ఉన్న వాడు, భగవంతుడు}; కంటెన్ = కంటె; అన్యులున్ = ఇతరులు; ఎవ్వారునున్ = ఎవ్వరూ; లేరు = లేరు; తండ్రిన్ = తండ్రిని; భగవంతునిని = భగవంతుని {భగవంతుడు - సద్గుణములు, ఐశ్వర్యములు, మహిమలు కలవాడు}; అనంతునిన్ = అనంతుని {అనంతునిన్ - అంతము లేనివాడు, భగవంతుడు}; విశ్వభావనోదారునిన్ = విశ్వభావనోదారుని {విశ్వభావనోదారుడు - విశ్వ (జగత్తును) భావన లో( కల్పనలో) ఉదారుడు (అతిశయించిన వాడు)}; సద్గుణావళులు = గుణవంతులు {సద్గుణావళులు - స (మంచి) గుణ (గుణముల) ఆవళి (సమూహములు) లు (కలవారు)}; ఉదాత్త = ఉత్తమమైన; మతిన్ = బుద్ధితో; కొనియాడక = స్తోత్రములు చేయక; ఉండినన్ = ఉండిపోయినట్లైతే; చేరవున్ = చేరలేవు; చిత్తముల్ = చిత్తవృత్తములు, మనసులు; ప్రకృతిఁన్ = ప్రకృతితో; చెందని = కూడని; నిర్గుణమున్ = గుణాతీతము; ఐన = అయిన; బ్రహ్మమున్ = పరబ్రహ్మమును (ముక్తిని).

భావము:

నాయనా! నారద! అటు కారణాలకు, ఇటు కార్యాలకు అన్నిటికి కారణభూతుడైనవాడు ఆ కమలాక్షుడే. ఆయన కంటే ఇతరు లెవరూ ఆశ్రయింపదగిన వాళ్లు లేరు. షడ్గుణైశ్వర్య సంపన్నుడు, తుది లేనివాడు, ప్రపంచసృష్టి గావించే ఉదారుడు అయిన ఆ పరమాత్ముని గుణవంతులు గొప్ప మనస్సుతో కొనియాడాలి. లేకుంటే మనస్సులు ప్రకృతికి అతీతమైన నిర్గుణ బ్రహ్మను పొందలేవు.

2-212-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నిమార్థప్రతిపాదకప్రకటమై; నిర్వాణ సంధాయిగా
వంతుండు రచింప భాగవతకల్పక్ష్మాజమై శాస్త్ర రా
జి రిష్ఠంబగు నీ పురాణ కథ సంక్షేపంబునం జెప్పితిన్;
తిన్ నీవు రచింపు దాని నతివిస్తారంబుగాఁ బుత్రకా!

టీకా:

నిగమము = వేదముల; అర్థ = అర్థమునకు, ప్రయోజనమునకు; ప్రతిపాదక = నిరూపణలను; ప్రకటము = వెల్లడిజేయునది, తెలిపేది; ఐ = అయి; నిర్వాణ = నిర్వాణమును, ముక్తిని; సంధాయిన్ = సమకూర్చునది; కాన్ = అగునట్లు; భగవంతుండు = భగవంతుడు; రచింపన్ = రచింపగ; భాగవత = భాగవత మను; కల్పక్ష్మాజము = కల్పవృక్షము; ఐ = అయి; శాస్త్ర = శాస్త్రముల; రాజిన్ = సమూహములో; గరిష్ఠంబు = గొప్పది; అగు = అయిన; ఈ = ఈ; పురాణకథన్ = పురాణకథను; సంక్షేపంబునన్ = సంగ్రహముగ; చెప్పితిన్ = చెప్పితిని; జగతిన్ = భూలోకమున; నీవున్ = నీవు; రచింపుము = రచింపుమ; దానిన్ = దానిని; అతి = మిక్కిలి; విస్తారంబునన్ = వివరముగ; పుత్రకా = కుమారా.

భావము:

కుమార! నారద! ఈ భాగవతం అనే పురాణకథ వేదార్థాలను ప్రతిపాదించడం చేత ప్రశస్తమై వుంది. మోక్షప్రదంగా ఉండేటట్లు ఆ భగవంతుడు దీన్ని రచించాడు. ఇది భగవద్భక్తులకు కల్పవృక్షం, శాస్త్రాలంన్నిటి కంటె శ్రేష్ఠమైనది. ఈ పురాణకథను నేను నీకు సంగ్రహంగా చెప్పాను. నీవు దీన్ని లోకంలో బహు విస్తృతమైన కృతిగా కావించుము.

2-213-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

పురుషభవంబునొందుట యపూర్వము జన్మము లందు; నందు భూ
సు కుల మందుఁ పుట్టు టతిచోద్యము; నిట్లగుటన్ మనుష్యుల
స్థి మగు కార్య దుర్దశలచేత నశింపక విష్ణు సేవనా
తఁ దనర్చి నిత్యమగు వ్యపథంబును బొందు టొప్పదే?

టీకా:

పురుష = మానవ; భవంబున్ = జన్మను; ఒందుటన్ = పొందుట; అపూర్వము = అపురూపము {అపూర్వము - పూర్వము లేనిది, పూర్వమిమాంసా శాస్త్రమున సత్కర్మఫలము అని సంకేతార్థము కలదు}; జన్మములు = జన్మలు అన్నిటి; అందున్ = లోను; అందున్ = దానిలో; భూసుర = బ్రాహ్మణ {భూసురుడు - భూమికి దేవత, బ్రాహ్మణుడు}; కులము = వంశము; అందుఁన్ = లో; పుట్టుటన్ = పుట్టుట; అతి = మిక్కిలి; చోద్యమున్ = ప్రత్యేకముగ సిద్దించినది {చోద్యము - చోదన (తోలుట) చేయబడినది}; ఇట్లు = ఈ విధముగ; అగుటన్ = అగుటచేత; మనుష్యులు = మానవులు; అస్థిర = స్థిరత్వము లేనివి; అగు = అయిన; కార్య = పనుల వలని; దుర్దశలన్ = దుస్థితులు; చేతన్ = చేత; నశింపక = నాశనము కాక; విష్ణు = విష్ణువు యొక్క; సేవనా = భక్తి యందు; పరతఁన్ = నిష్ఠను; తనర్చి = పెంచుకొని; నిత్యము = శాశ్వతము; అగు = అయినట్టి; భవ్య = శుభమైన, పరమ; పథంబున్ = మార్గమును, పదమును; పొందుటన్ = పొందుట; ఒప్పదే = ఉచితము కదా.

భావము:

అన్ని జన్మలలోను పురుషజన్మం చాలా అపురూపం. అందులోను బ్రాహ్మణకులంలో పుట్టడం మరీ అరుదు. అందువల్ల మానవులు అనిత్యమైన నిష్ర్పయోజన కార్యాలలో బడి దురవస్థల పాలు కాకుండ, శ్రీహరిని సేవించి నిత్యమైన పరమపదం పొందడం సముచితం కదా.

2-214-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వాసవ్రత శౌచ శీల మఖ సంధ్యోపాస నాగ్నిక్రియా
దానాధ్యయ నాది కర్మముల మోక్షప్రాప్తిసేకూర; ద
చ్చపుభక్తిన్ హరిఁ బుండరీకనయనున్ ర్వాతిశాయిన్ రమా
ధిపుఁ బాపఘ్నుఁ బరేశు నచ్యుతుని నర్థిం గొల్వలేకుండినన్.

టీకా:

ఉపవాస = ఉపవాసములు {ఉపవాసములు - ఆహారమును నియమించుటలు}; వ్రత = వ్రతములు; శౌచ = శుచిత్వములు; శీల = సత్ప్రవర్తనలు; మఖ = యఙ్ఞములు; సంధ్యా = సంధ్యా; ఉపాసన = వందనములు; అగ్నిక్రియా = హోమములు; జప = జపములు; దాన = దానములు; అధ్యయ = (వేదాదుల) అధ్యయనములు; ఆది = మొదలగు; కర్మములన్ = పనుల వలన; మోక్ష = మోక్షము; ప్రాప్తిన్ = పొందుట; చేకూరదు = లభింపదు; అచ్చపు = స్వచ్ఛమైన; భక్తిన్ = భక్తి; హరిఁన్ = హరిని {హరి - పాపములను హరించు వాడు, విష్ణువు}; పుండరీకనయనున్ = పుండరీకాక్షుని {పుండరీకనయనుడు - పుండరీకముల వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; సర్వాతిశాయిన్ = సర్వాతిశాయిని {సర్వాతిశాయి - సమస్తమును అతిశయించి (మించి) ఉండువాడు, విష్ణువు}; రమాధిపున్ = లక్ష్మీపతిని {రమాధిపుడు - రమ (లక్ష్మి) రి అధిపుడు (పతి), విష్ణువు}; పాపఘ్నున్ = పాపనాశనుని {పాపఘ్నుడు - పాపములను పోగొట్టు వాడు, విష్ణువు}; పరేశు = పరేశుని {పరేశుడు - పరమమైన (ఉత్కృష్టమైన గతి, ముక్తి) కి అధిపతి}; అచ్యుతునిన్ = అచ్యుతుని {అచ్యుతుడు - పతనము లేనివాడు}; అర్థిన్ = కోరి; కొల్వన్ = కొలుచుట; లేకుండినన్ = లేకపోతే;

భావము:

పద్మాక్షుడు, అన్నిటి యందు మించినవాడు, లక్ష్మీపతి, పాపనాశకుడు, పరమేశ్వరుడు, చ్యుతిరహితుడు అయిన శ్రీహరిని నిర్మలభక్తి గలిగి ఆసక్తితో భజించాలి. అలా చేయకుండ ఉపవాసాలు, వ్రతాలు, శౌచాలు, శీలాలు, యాగాలు, సంధ్యోపాసనలు, అగ్నికార్యాలు, జపాలు, దానాలు, వేదాధ్యయనాలు లాంటి వెన్ని చేసినా మోక్షం లభించదు.

2-215-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

జాక్షు మహిమ నిత్యము
వినుతించుచు; నొరులు వొగడ వినుచున్; మదిలో
నుమోదించుచు నుండెడు
ములు దన్మోహవశతఁ నరు మునీంద్రా!"

టీకా:

వనజాక్షు = వనజాక్షుని {వనజాక్షుడు - వన (నీటి) లో జ (పుట్టునది) పద్మము వంటి అక్షుడు (కన్నులు ఉన్నవాడు)}; మహిమన్ = మహిమను; నిత్యమున్ = ప్రతి నిత్యము; వినుతించుచున్ = స్తోత్రము చేయుచు; ఒరులున్ = ఇంకొకరు; పొగడన్ = స్తుతించు చుండగ; వినుచున్ = వింటూ; మదిలోన్ = మనసులో; అనుమోదించు = సంతోషముతో; ఉండెడు = ఉండునట్టి; జనములున్ = మానవులు; తత్ = ఆ; మోహ = మోహమునకు; వశతఁన్ = వశమగుట వలన; చనరు = విడిచి వెళ్ళలేరు; ముని = మునులలో; ఇంద్రా = ఇంద్రుడా.

భావము:

నారదమునిశ్రేష్ఠ! ఎల్లవేళలా కమలనయనుని మహిమను స్తుతించాలి. ఇతరులు స్తుతిస్తూ వుంటే వినాలి. మనస్సులో ఆ మహిమను మననం చేస్తూ సంతసించాలి. అలా చేసే వాళ్లు దేవుని మాయకు లోనుగారు.”

2-216-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ని వాణీశుఁడు నారద
మునివరునకుఁ జెప్పినట్టి ముఖ్యకథా సూ
మతిభక్తిఁ బరీక్షి
జ్జపాలునితోడ యోగిచంద్రుఁడు నుడివెన్.

టీకా:

అని = అని; వాణీశుఁడు = బ్రహ్మ {వాణీశుడు - వాణి (సరస్వతి) కి ఈశుడు (భర్త), బ్రహ్మ}; నారద = నారదుడు అను; ముని = మునులలో; వరున్ = శ్రేష్ఠుని; కున్ = కి; చెప్పినట్టిన్ = చెప్పినది; ముఖ్య = ముఖ్యమైన; కథా = కథ యొక్క; సూచనమున్ = సూచనను; అతి = మిక్కిలి; భక్తిఁన్ = భక్తితో; పరీక్షిత్ = పరీక్షిత్తు అను; జన = జనులను; పాలునిన్ = పాలించు వాని; తోడన్ = తో; యోగి = యోగులలో; చంద్రుడున్ = శ్రేష్ఠుడు; నుడివెన్ = చెప్పెను.

భావము:

ఇలా పూర్వం బ్రహ్మదేవుడు ఋషీశ్వరుడైన నారదునికి భాగవత ముఖ్యకథను వివరించాడు. ఆ విషయాన్ని యోగీశ్వరుడైన శుకుడు మహా భక్తితో పరీక్షిన్మహారాజుకు తెలియజేప్పాడు.