ద్వితీయ స్కంధము : నరనారాయణావతారంబు
- ఉపకరణాలు:
కాముని దహించెఁ గ్రోధమ
హామహిమను రుద్రుఁ; డట్టి యతికోపము నా
ధీమంతులు గెలిచి రనం;
గామము గెలుచుటలు సెప్పఁగా నేమిటికిన్.
టీకా:
కాముని = మన్మథుని; దహించెఁన్ = కాల్చివేసెను; క్రోధ = కోపము యొక్క; మహా = గొప్ప; మహిమనున్ = మహిమచే; రుద్రుఁడున్ = శివుడు; అట్టి = అటువంటి; అతి = ఎక్కువ; కోపమున్ = కోపమును; ఆ = ఆ; ధీ = బుద్ధి; మంతులున్ = శాలురు; గెలిచిరి = గెలిచారు; అనన్ = అనగ; కామమున్ = కామమును; గెలుచుటలున్ = గెలుచుట; చెప్పగ = చెప్పుట; ఏమిటి = ఎందుల; కిన్ = కు.
భావము:
కామానికి అధిదేవత యైన మన్మథుని, పూర్వం శివుడు తన కోపపు తీవ్రతచే కాల్చివేసాడు. అంతటి అలవికానిది కోపము. అటువంటి కోపాన్ని కూడ జయించారు ఆ మహా జ్ఞానులు నరనారాయణులు. ఇక కామాన్ని గెలవటం గురించి చెప్పేదేం ఉంది.