పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : నరనారాయణావతారంబు

 •  
 •  
 •  

2-124-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మఱియు నరనారాయణావతారంబు వినుము

టీకా:

మఱియున్ = ఇంకను; నరనారాయణ = నరనారాయణుల; అవతారంబున్ = అవతారమును; వినుము = వినుము.

భావము:

ఇంక నరనారాయణుల అవతార పద్ధతి ఆలకించు.

2-125-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ణుతింపఁగ నరనారా
ణు లన ధర్మునకు నుదయ మందిరి; దాక్షా
ణియైన మూర్తి వలనం
బ్రణుతగుణోత్తరులు పరమపావనమూర్తుల్.

టీకా:

గణుతింపఁగన్ = ఎంచి చూసిన; నర = నర; నారాయణులు = నారాయణులు; అనన్ = అనగ; ధర్మున్ = ధర్ముడున; కున్ = కు; ఉదయమందిరి = పుట్టిరి; దాక్షాయణి = దక్షుని కూతురు; ఐనన్ = అయిన; మూర్తి = మూర్తి అనే ఆమె; వలనన్ = వలన; ప్రణుత = స్తుతింపబడిన; గుణ = గుణములు కలవారిలో; ఉత్తరులు = ఉత్తములు; పరమ = అత్యుత్తమ; పావన = పవిత్రమైన; మూర్తులు = స్వరూపులు.

భావము:

మిక్కిలి ప్రసిద్ధమైన గుణాలు గలవారు, మిక్కిలి పవిత్రమూర్తులైన నరనారాయణు లనేవారు ధర్మానికి అధిష్ఠానమైన ధర్ముడికి, దక్షుని కుమార్తె అయిన మూర్తి యందు, జన్మించారు.

2-126-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఘులు బదరీవనమున
వినుత తపోవృత్తి నుండ, విబుధాధిపుఁడున్
మున నిజపదహానికి
ముగఁ జింతించి దివిజకాంతామణులన్.

టీకా:

అనఘులు = పాపములు లేనివారు; బదరీ = బదరీ అను {బదరీ - రేగుపళ్ళు}; వనమునన్ = వనములో; వినుత = గౌప్ప; తపస్ = తపసు; వృత్తిన్ = చేయుచు; ఉండన్ = ఉండగ; విబుధ = దేవతలకు {విబుధాధిపుడు - దేవతలకు ప్రభువు - దేవేంద్రుడు}; అధిపుఁడున్ = ప్రభువు - దేవేంద్రుడు; మనమునన్ = మనసులో; నిజ = తన; పద = పదవికి; హానికిన్ = నష్టమగునని; ఘనముగఁన్ = ఎక్కువగ; చింతించి = విచారించి; దివిజ = దేవతా; కాంతామణులన్ = స్త్రీలలో ఉత్తములు - అప్సరసలు {దివిజకాంతామణులు - దేవరమణులు, అప్సరసలు}.

భావము:

అలా అవతరించిన నరనారాయణులు బదరికావనంలో గొప్ప తపస్సు చేయసాగారు. అందువలన, తన పదవికి ప్రమాదం వాటిల్లుతుంది అని ఇంద్రుడు బెదిరాడు. అందుచేత ఇంద్రుడు దేవకాంతలను పిలిపించి “నరనారాయణుల తపస్సు చెడగొట్టండి” అని చెప్పి పంపాడు.

2-127-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రావించి తపోవిఘ్నముఁ
గావింపుం డనుచు బనుపఁ డు వేడుకతో
భాభవానీకిను లనఁ
గా నితలు సనిరి బదరికావనమునకున్.

టీకా:

రావించి = పిలిపించి; తపస్ = తపస్సునకు; విఘ్నమున్ = ఆటంకమును; కావింపుడు = చేయండి; అనుచున్ = అనుచు; పనుపన్ = నియోగించగ; కడు = మిక్కిలి; వేడుకన్ = వేడుక; తోన్ = తో; భావభవ = మన్మథుని {భావభవుడు - (కామ) భావములను పుట్టించు వాడు, మన్మథుడు}; అనీకినులు = సైనికులు; అనఁగా = అన్నట్లుగ; వనితలు = (దేవ) రమణులు; సనిరి = వెళ్ళిరి; బదరికా = బదరిక {బదరిక - రేగుపళ్ళు}; వనమున్ = ఆశ్రమము; కున్ = నకు.

భావము:

అలా పిలిపించి నరనారాయణుల తపస్సు భగ్నం చేయమని ఇంద్రుడు పంపగా, అప్సరసలు ఎంతో సంతోషంతో కంతుని చతురంగసేనలా అన్నట్లు బయలుదేరి బదరీవనానికి వెళ్ళారు.

2-128-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అందు.

టీకా:

అందున్ = అందులో (ఆ బదరికాశ్రమములో).

భావము:

అంతట, ఆ బదరికావనంలో.....

2-129-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నారాయణు లున్న చోటికి మరున్నారీ సమూహంబు భా
స్వలీలం జని రూప విభ్రమ కళా చాతుర్య మేపారఁగాఁ
రిహాసోక్తుల నాటపాటలఁ జరింపం జూచి నిశ్చింతతన్
రితధ్యాన తపః ప్రభావ నిరతిం బాటించి నిష్కాములై.

టీకా:

నర = నరుడు; నారాయణులు = నారాయణులు; ఉన్న = అన్నట్టి; చోటికిన్ = స్థలమునకు; మరున్ = దేవ; నారీ = రమణుల; సమూహంబున్ = సమూహము; భాస్వర = ప్రకాశించు; లీలన్ = లీలతో; చని = వెళ్ళి; రూప = రూపము; విభ్రమము = శృంగార భంగిమల; కళా = కళలోని; చాతుర్యమున్ = నేర్పరితము; ఏపారగాన్ = అతిశయింపగ; పరిహాసోక్తులన్ = పరిహాసపుమాటల; ఆట = ఆటలు; పాటలన్ = పాటలుతో; చరింపన్ = తిరుగుతుండగ; చూచి = చూసి; నిశ్చింతతన్ = నిశ్చింతగా; భరిత = నిండు; ధ్యానన్ = ధ్యానముతో కూడిన; తపః = తపస్సు యొక్క; ప్రభావన్ = మహిమందు; నిరతిన్ = మిక్కిలి ఆసక్తి; పాటించి = పాటిస్తూ; నిష్కాములు = కోరికలు లేని వారు; ఐ = అయి.

భావము:

అక్కడ నరుడు, నారాయణుడు తపస్సు చేస్తున్న ప్రదేశానికి దేవకాంతలు సవిలాసంగా వచ్చారు. అందచందాల తీరు, కళానైపుణ్యాల సౌరు ఉట్టిపడేలా పరాచికాలాడుతు, ఆటలాడుతూ, పాటలు పాడుతూ విహరించారు. అలా విలాసలీలలతో తపోవనంలో విచ్చలవిడిగా విహరిస్తున్న అప్సరసలను నరనారాయణులు చూసారు. కాని ఏ మాత్రం చలించలేదు. కామానికి లోను కాలేదు. నిశ్చింతులై, నిర్మోహులై వాళ్లు అలాగే నిరతిశయ నిశ్చల ధ్యానంతో మహా తపస్సుతో నిమగ్నులై ఉండిపోయారు.

2-130-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

క్రోము దమ తపములకును
బాక మగు టెఱిఁగి దివిజభామలపై న
మ్మేధాత్మకు లొక యింతయు
క్రోముఁ దేరైరి సత్వగుణయుతు లగుటన్.

టీకా:

క్రోధమున్ = కోపమును; తమ = తమ యొక్క; తపములున్ = తపస్సుల; కున్ = కు; బాధకము = నష్టపరచునది; అగుటన్ = అగుట; ఎఱిఁగి = తెలిసి; దివిజ = దేవ; భామలన్ = రమణుల; పైనన్ = మీద; ఆ = ఆ; మేధ = ప్రజ్ఞాయుత; ఆత్మకులు = స్వభావము కలవారు; ఒక = ఒక; ఇంతయున్ = ఇంత కూడ, కొంచెము కూడ; క్రోధమున్ = కోపమును; తేరైరి = తెచ్చుకొన లేదు; సత్వ = సాత్విక; గుణ = గుణములు; యుతులు = కలవారు; అగుటన్ = అగుటచేత.

భావము:

తమ తపస్సులకు కోపం నష్టదాయక మని తెలిసిన సత్త్వ సంపన్నులు, బుద్ధిమంతులు అయిన నరనారాయణులు సురసుందరులపై ఏ మాత్రం కోపం చూపలేదు.

2-131-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నారాయణుఁ డప్పుడు దన
యూరువు వెసఁ జీఱ నందు నుదయించెను, బెం
పారంగ నూర్వశీ ముఖ
నారీజనకోటి దివిజనారులు మెచ్చన్.

టీకా:

నారాయణుఁడు = నారాయణుడు; అప్పుఁడు = అప్పుడు; తన = తన; ఊరువున్ = తోడను; వెసన్ = వేగముగ; చీఱగన్ = గీరగా, గోకగా; అందున్ = అందువలన; ఉదయించెన్ = పుట్టెను; పెంపు = గొప్పతనము; ఆరంగన్ = మించుతుండగ; ఊర్వశీ = ఊర్వశియు; ముఖ = మొదలగు; నారీ = స్త్రీ; జన = జనముల; కోటి = సమూహము; దివిజ = దేవతా; నారులు = స్త్రీలు; మెచ్చన్ = మెచ్చుకోగా.

భావము:

అప్పుడు నారాయణుడు తన ఊరు భాగాన్ని గోటితో వేగంగా గీరాడు. అతని తొడలోనుండి అమరాంగనలు అచ్చెరువొందేలా ఊర్వశి మొదలైన అప్సరస స్ర్తీ సమూహం ఉద్భవించింది.

2-132-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రువులందు జనించిన
కాణమున నూర్వశి యన నతకు నెక్కెన్
వాల రూప విలాస వి
హాములకు నోడి రంత మరీజనముల్.

టీకా:

ఊరువులు = తొడలు; అందున్ = అందు; జనించిన = పుట్టిన; కారణమున = కారణము వలన; ఊర్వశి = ఊర్వశి; అనన్ = అని; ఘనతన్ = పేరు; ఎక్కన్ = పొందగ; వారల = వారల; రూప = రూపములు; విలాస = విలాసములు; విహారములన్ = విహారముల; కున్ = కు; ఓడిరి = ఓడిపోయిరి; అంతన్ = అంతట; అమరీ = దేవతా; జనముల్ = జనములు.

భావము:

నారాయణుని ఊరువు నుండి పుట్టడంవల్ల ఆమె ఊర్వశి అని పేరుగాంచింది. ఇంద్రుడు పంపగా వచ్చిన అప్సరసలు ఊర్వశి మొదలైన వాళ్ల అందచందాలు, హావభావాలు, వినోదవిహారాలు చూసి లజ్జతో కుంచించుకు పోయారు.

2-133-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అంతం దాము నరనారాయణుల తపోవిఘ్నంబు గావింపంబూని చేయు విలాసంబులు, మానసికసంకల్ప మాత్రంబున సృష్టి స్థితి సంహారంబు లొనర్పంజాలు నమ్మహాత్ముల దెసం బనికిరాక కృతఘ్నునకుం జేఁయు నుపకృతులుంబోలె నిష్ఫలంబులైన సిగ్గునఁ గుందుచు, నూర్వశిం దమకు ముఖ్యురాలింగాఁ గైకొని తమ వచ్చిన జాడన మరలి చని రంత.

టీకా:

అంతన్ = దానితో; తాము = తాము; నర = నరుని; నారాయణుల = నారాయణుని; తపస్ = తపస్సును; విఘ్నంబున్ = ఆటంకము; కావింపన్ = చేయ; పూని = తలచి; చేయు = చేస్తున్న; విలాసంబులున్ = విలాసాలు; మానసిక = మనసున; సంకల్ప = అనుకొన్నంత; మాత్రంబునన్ = మాత్రము చేతనే; సృష్టిన్ = సృష్టించుట; స్థితిన్ = నడపుట; సంహారంబున్ = లయించుట; ఒనర్పన్ = చేయ; చాలున్ = గలిగిన; ఆ = ఆ; మహాత్ములు = గొప్పవారి {మహాత్ములు - గొప్ప ఆత్మ (స్వభావము) కల వారు}; దెసన్ = వద్ద; పనికి = ఉపయోగము; రాక = లేక; కృతఘ్నున్ = కృతఘ్నున {కృతఘ్నుడు - చేసిన మేలు మరచు వాడు}; కున్ = కు; చేయు = చేసిన; ఉపకృతులున్ = సహాయములు; పోలెన్ = వలె; నిష్పలంబులున్ = ఉపయోగము లేనివి; ఐన = అగుట చేత; సిగ్గునన్ = సిగ్గుతో; కుందుచూ = కుంగిపోతూ; ఊర్వశిన్ = ఊర్వశిని; తమకున్ = తమకు; ముఖ్యురాలుగాన్ = నాయకిగా; కైకొని = స్వీకరించి; తమ = తాము; వచ్చిన = వచ్చిన; జాడఁన్ = దారిని; మరలి = వెనుతిరిగి; చనిరి = వెళ్ళిరి; అంత = అప్పుడు.

భావము:

ఆ నరనారాయణులు తలపు మాత్రంచే సృష్టిస్థితిలయాలు చేయగలరు. అంతటి మహానుభావుల తపస్సుకు భంగం కలిగించడానికి చేసిన తమ శృంగారవిలాసాలు కృతఘ్నుడికి చేసిన ఉపకారాలలా నిరుపయోగ లయ్యా యని దేవరమణులు గ్రహించారు. దానితో వాళ్లు సిగ్గుతో పరితపించారు. ఆ ఊర్వశినే తమకు నాయకురాలుగా చేసుకొని వచ్చనదారినే వెళ్ళిపోయారు.

2-134-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కాముని దహించెఁ గ్రోధమ
హాహిమను రుద్రుఁ; డట్టి తికోపము నా
ధీమంతులు గెలిచి రనం;
గాము గెలుచుటలు సెప్పఁగా నేమిటికిన్.

టీకా:

కాముని = మన్మథుని; దహించెఁన్ = కాల్చివేసెను; క్రోధ = కోపము యొక్క; మహా = గొప్ప; మహిమనున్ = మహిమచే; రుద్రుఁడున్ = శివుడు; అట్టి = అటువంటి; అతి = ఎక్కువ; కోపమున్ = కోపమును; ఆ = ఆ; ధీ = బుద్ధి; మంతులున్ = శాలురు; గెలిచిరి = గెలిచారు; అనన్ = అనగ; కామమున్ = కామమును; గెలుచుటలున్ = గెలుచుట; చెప్పగ = చెప్పుట; ఏమిటి = ఎందుల; కిన్ = కు.

భావము:

కామానికి అధిదేవత యైన మన్మథుని, పూర్వం శివుడు తన కోపపు తీవ్రతచే కాల్చివేసాడు. అంతటి అలవికానిది కోపము. అటువంటి కోపాన్ని కూడ జయించారు ఆ మహా జ్ఞానులు నరనారాయణులు. ఇక కామాన్ని గెలవటం గురించి చెప్పేదేం ఉంది.

2-135-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అట్టి నరనారాయణావతారంబు జగత్పావనంబై విలసిల్లె; వెండియు ధ్రువావతారంబు వివరించెద వినుము.

టీకా:

అట్టి = అటువంటి; నర = నరుడు; నారాయణ = నారాయణుల; అవతారంబున్ = అవతారము; జగత్ = లోకములను; పావనమబున్ = పవిత్రము చేయునది; ఐ = అయి; విలసిల్లెన్ = ప్రసిద్ధికెక్కెను; వెండియున్ = మరియు; ధ్రువ = ధ్రువుని; అవాతారంబున్ = అవతారమును; వివరించెదన్ = వివరముగ చెప్పెదను; వినుము = వినుము.

భావము:

అలాంటి నరనారాయణుల అవతారం భువనత్రయాన్ని పవిత్రం చేసినది. ఇక ధ్రువావతారం వివరిస్తాను, విను.

2-136-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మానిత చరితుఁ డుత్తానపాదుం డను-
భూవరేణ్యునకు సత్పుత్రుఁ డనగ
నుదయించి మహిమఁ బెంపొంది బాల్యంబున-
నకుని కడనుండి వితితల్లి
ను నాడు వాక్యాస్త్రతిఁ గుంది మహిత త-
పంబు గావించి కాయంబుతోడఁ
ని మింట ధ్రువపదస్థాయి యై యటమీఁద-
ర్థి వర్తించు భృగ్వాది మునులుఁ

2-136.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

తురగతి గ్రింద వర్తించు ప్తఋషులుఁ
బెంపు దీపింపఁ దన్ను నుతింప వెలసి
ధ్రువుఁడు నా నొప్పి యవ్విష్ణుతుల్యుఁ డగుచు
నున్న పుణ్యాత్ముఁ డిప్పుడు నున్నవాఁడు.

టీకా:

మానిత = గౌరవిపబడిన; చరితుఁడు = ప్రవర్తన కలవాడు; ఉత్తానపాదుండు = ఉత్తానపాదుడు; అనున్ = అనే; భూవరేణ్యున్ = బ్రాహ్మణుని {భూవరేణ్యుడు - భూమిపైన శ్రేష్ఠుడు, రాజు}; కున్ = కి; సత్ = మంచి; పుత్రుఁడు = కుమారుడు; అనగ = అయ్యి; ఉదయించెన్ = పుట్టెను; మహిమఁన్ = గొప్పతనముతో; పెంపొందిన్ = వృద్ధిని; పొంది = పొంది; బాల్యంబునన్ = బాల్యములో; జనకుని = తండ్రి; కడ = వద్ద; నుండి = నుండి; సవతి = సవతి; తల్లి = తల్లి; తనున్ = తనను; ఆడు = పలుకు; వాక్ = మాటలు అను; అస్త్ర = అస్త్రముల; తతిన్ = సమూహమునకు; కుంది = బాధపడి; మహిత = గొప్ప; తపంబున్ = తపస్సును; కావించి = చేసి; కాయంబున్ = దేహము; తోడన్ = తోసహా; చని = వెళ్ళి; మింటన్ = ఆకాశములో; ధ్రువ = స్థిరమైన; పద = స్థానమున; స్థాయి = స్థిరుడు; ఐ = అయ్యి; అటమీదన్ = ఆపైన; అర్థిన్ = కోరికతో; వర్తించున్ = ప్రవర్తించు; భృగు = భృగువు; ఆది = మొదలగు; మునులుఁన్ = మునులు; చతుర = నేర్పరితనమైన;
గతిన్ = విధముగ; క్రిందన్ = క్రింద; వర్తించున్ = తిరుగుతుండే; సప్తఋషులున్ = సప్తఋషులు; పెంపున్ = గొప్పగ; దీపింపన్ = ప్రకాశించుతు; తన్నున్ = తనను; నుతింపన్ = కీర్తిస్తుండగ; వెలసి = ఏర్పడి; ధ్రువుఁడు = ధ్రువుడు; నాన్ = అనే పేరుతో; ఒప్పి = ప్రసిద్ధుడై; ఆ = ఆ; విష్ణున్ = విష్ణువునకు; తుల్యుఁడు = సమానుడు; అగుచున్ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; పుణ్యాత్ముఁడున్ = పుణ్యస్వరూపుడు; ఇప్పుడున్ = ఇప్పడుకూడ; ఉన్న వాడు = ఉన్నాడు.

భావము:

ఉత్తమచరిత్రుడైన ఉత్తానపాదు డనే రాజుకు సత్పుత్రుడుగా ధ్రువుడు జన్నించాడు, ప్రభావసంపన్నుడై పేరుగాంచాడు. చిన్న తనంలో ఒకనాడు తండ్రివద్ద ఉన్నప్పుడు సవతితల్లి సురుచి అతణ్ణి నిందావచనాలనే అస్ర్తాలతో నొప్పించింది. దుఃఖితుడైన ధ్రువుడు గొప్ప తపస్సు చేసాడు. ఆ తపస్సు ఫలించింది. భగవంతుడు సాక్షాత్కరించి అతణ్ణి అనుగ్రహించాడు. అతడు సశరీరంగా ఆకాశంలో మహోన్నతమైన ధ్రువస్థానంలో స్థిరపడ్డారు. ఆ స్థానానికి పైన వుండే భృగువు మొదలైన మహర్షులూ, క్రింద వుండే సప్తర్షులూ ఆ మహనీయుణ్ణి గొప్పగా ప్రశంసించారు. అతడు ధ్రువు డనే పేరుతో ప్రకాశించి విష్ణువుతో సమానుడైనాడు. ఇప్పుడు కూడా ఆ పుణ్యాత్ముడు ధ్రువస్థానం లోనే వున్నాడు.

2-137-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మఱియుఁ బృథుని యవతారంబు వినుము

టీకా:

మఱియున్ = ఇంక; పృథుని = పృథువు యొక్క; అవతారంరంబున్ = అవతారమును; వినుము = వినుము.

భావము:

మరింక పృథుచక్రవర్తి అవతారం విను.

2-138-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వేనుఁడు విప్రభాషణ పవిప్రహతిచ్యుత భాగ్యపౌరుషుం
డై నిరయంబునం బడిన నాత్మ తనూభవుఁడై పృథుండు నాఁ
బూని జనించి తజ్జనకుఁ బున్నరకంబును బాపె; మేదినిన్
థేనువుఁ జేసి వస్తువితతిం బితికెన్ హరి సత్కళాంశుఁడై."

టీకా:

వేనుఁడు = వేనుడు (పృథు ఛక్రవర్తి తండ్రి); విప్ర = బ్రాహ్మణుల; భాషణ = మాటలు అను, శాపము అను; పవి = వజ్రాయుధపు; ప్రహతి = దెబ్బ వలన; చ్యుత = భ్రష్టుపడిన; భాగ్య = భాగ్యము; పౌరుషుండు = పౌరుషము కలవాడు; ఐ = అయి; నిరయంబునన్ = నరకములో; పడినన్ = పడిపోగా; ఆత్మ = తన; తనున్ = శరీరమున; భవుఁడు = పుట్టినవాడు; ఐ = అయి; పృథుండు = పృథుడు; నాన్ = పేరు; పూని = పొంది; జనించి = పుట్టి; తత్ = ఆ; జనకుఁన్ = తండ్రికి; పున్న = పున్నామ; నరకంబున్ = నరకమును; పాపెన్ = పోగొట్టెను; మేదినిన్ = భూమిని; ధేనువున్ = ఆవును; చేసిన్ = చేసి; వస్తు = వస్తువుల; వితతిన్ = సమూహమును; పితికెన్ = పితికెను; హరి = విష్ణువు యొక్క; సత్ = మంచి; కళా = కళల; అంశుఁడు = అంశలు కలవాడు; ఐ = అయి.

భావము:

వేను డనే భూపాలుడు భూసురుల శాపాలనే వజ్రాయుధం దెబ్బలు తిని, సిరిని పౌరుషాన్ని కోల్పోయాడు. తుదకు నరకం పాలయ్యాడు. అతనికి పృథుడనే కుమారుడు కలిగాడు. అతడు తండ్రిని పున్నామనరకం నుండి రక్షించాడు. శ్రీహరి కళాంశభవుడైన ఆ పృథుచక్రవర్తి భూమిని ధేనువుగా జేసి అమూల్యమైన అనేక వస్తువులను పిదికాడు.”
గమనిక:- వేనుడు పుత్రులులేక మమణించడంతో పున్నామనరకంలో పడ్డాడు, అతని శరీరాన్ని మథించగా జన్మించిన పృథువు గొప్ప చక్రవర్తి అయ్యాడు. తండ్రి పున్నామనరకం నుండి బయటపడ్డాడు

2-139-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అని మఱియు "వృషభావతారంబు నెఱిఁగింతు; వినుము; ఆగ్నీంధ్రుండను వానికి "నాభి" యనువాఁ డుదయించె; నతనికి మేరుదేవి యను నామాంతరంబు గల "సుదేవి" యందు హరి వృషభావతారంబు నొంది జడస్వభావంబైన యోగంబు దాల్చి ప్రశాంతాంతఃకరణుండును, బరిముక్త సంగుండునునై పరమహంసాభిగమ్యం బయిన పదం బిది యని మహర్షులు వలుకుచుండం జరించె; మఱియు హయగ్రీవావతారంబు సెప్పెద వినుము.

టీకా:

అని = అని; మఱియున్ = ఇంక; వృషభ = వృషభ; అవతారంబున్ = అవతారమును; ఎఱింగింతున్ = తెలిపెదను; వినుము = వినుము; అగ్నీంద్రుండు = అగ్నీంద్రుడు; అను = అను; వానికి = వానికి; నాభి = నాభి; అనువాఁడు = అనేవాడు; ఉదయించి = పుట్టి; అతనికిన్ = అతనికి; మేరుదేవి = మేరుదేవి; అను = అను; నామాంతరంబున్ = ఇంకొక పేరు; కల = కల; సుదేవి = సుదేవి; అందున్ = అందు; హరి = విష్ణువు {హరి - దుఃఖములను హరించువాడు, విష్ణువు}; వృషభ = వృషభుడు అను {వృషభము - ఎద్దు, ఋషభము (ప్రకృతి) - వృషభము (వికృతి), ఋషభము - రేఫ}; అవతారంబున్ = అవతారమును; పొంది = పొంది; జడ = జడ, చేతనారాహిత్యుడు {జడము X చైతన్యము}; స్వభావంబున్ = స్వభావము; ఐన = కల; యోగంబున్ = యోగమును; తాల్చి = చేపట్టి; ప్రశాంత = ప్రశాంతమైన; అంతఃకరణుండున్ = మనస్సు కలవాడును; పరి = సమస్తమును; ముక్త = విడిచిన; సంగుండును = బంధనములు కలవాడును; ఐ = అయి; పరమహంసన్ = ఉత్తమపదము నొందిన సన్యాసులచే; అభిగమ్యంబున్ = పొంద దగినది; అయిన = అయిన; పదంబు = స్థితి; ఇది = ఇదే; అని = అని; మహా = గొప్ప; ఋషులు = ఋషులు; పలుకుచుండన్ = అంటూ ఉండగ; చరించెన్ = తిరిగెను, ప్రవర్తించెను; మఱియున్ = ఇంక; హయగ్రీవ = హయగ్రీవుడు అను {హయగ్రీవడు - గుఱ్ఱము మెడ గలవాడు}; అవతారంబున్ = అవతారమును; చెప్పెదన్ = చెప్పుతాను; వినుము = వినుము.

భావము:

ఇలా చెప్పిన బ్రహ్మదేవుడు మళ్లీ నారదునికి ఇలా చెప్పసాగాడు. “ఇప్పుడు వృషభుని అవతారం తెలియపరుస్తాను. ఆలకించు. అగ్నీధ్రు డనే వాడికి నాభి అనే కొడుకు పుట్టాడు. నాభి భార్య సుదేవి. అమెకు మేరుదేవి అని మరో పేరు ఉంది. ఆమెకు హరి వృషభావతారుడై అవతరించాడు. అతడు జడశీలమైన యోగం పూనాడు. ప్రశాంతమైన చిత్తం పొంది ఇతరుల పొత్తు వదిలాడు. ఇది పరమహంసలు పొందదగిన స్థితి అని తన్ను గూర్చి మహర్షులు ప్రశంసించేటట్లు మెలగాడు. మరింక హయగ్రీవుని అవతార విశేషాలు చెప్తాను ఆలకించు.

2-140-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఘచరిత్ర! మన్మఖము నందు జనించె హయాననాఖ్యతన్
వినుత సువర్ణ వర్ణుఁడును వేదమయుం డఖిలాంతరాత్మకుం
నుపమ యజ్ఞపూరుషుఁడునై భగవంతుఁడు దత్సమస్త పా
మగు నాసికాశ్వసనర్గములం దుదయించె వేదముల్.

టీకా:

అనఘ = పాపము లేని; చరిత్ర = చరిత్ర కలవాడ; మత్ = నాయొక్క; మఖమున్ = యఙ్ఞము; అందున్ = లో; జనించెన్ = పుట్టెను; హయానన = హయానన; ఆఖ్యాతన్ = పేరుతో; వినుత = స్తుతింపబడిన; సువర్ణ = బంగారు; వర్ణుండును = రంగు కలవాడును, అక్షర ఙ్ఞానియు; వేద = వేదముల; మయుండు = స్వరూపుండును; అఖిల = సర్వుల; అంతరాత్మకుండు = అంతరాత్మల నుండువాడును; అనుపమ = సాటిలేని; యఙ్ఞ = యఙ్ఞ; పూరుషుండును = స్వరూపుండును; ఐ = అయి; భగవంతుఁడు = భగవంతుడు; తత = అతని; సమస్త = సమస్తమునకు; పావన = పావనము; అగు = అయిన; నాసికా = ముక్కు యొక్క; ఆశ్వాసన = శ్వాసల; వర్గములన్ = సమూహములు వలన; ఉదయించెన్ = పుట్టెను; వేదముల్ = వేదములు.

భావము:

నారద! సచ్చరిత్ర! మేలిమిబంగారు కాంతికలవాడు, వేదస్వరూపుడు, సర్వాంతర్యామి, సాటిలేని యజ్ఞపురుషుడు హయగ్రీవునిగా దేవదేవుడు నేను చేసిన యజ్ఞంలోనుండి అవతరించాడు. సర్వాన్నీ పవిత్రం చేసే ఆ హయగ్రీవుని ముకుపుటాలలోని శ్వాసవాయువులనుండి వేదాలు ప్రాదుర్భవించాయి.